అబ్బాయి అల్లిన కొంటె కవితకి అబ్బురపడిన అమ్మాయి ఇచ్చిన సమాధానానికి అతనిలో క్రొత్త ఉత్సాహం ఉరకలు వేసింది. ఎలా అయినా తన మదిలోని మాటని ఆమెకి ఇలా చెప్పాడు:
ప్రియతమా పలుకుమా
ఈ హృదయ వేదనలు వీడి
ఆ మౌన శోధనలు మాని
ఈ ప్రియుని చెంతనే చేరి
ఆ వలపు వలల తోటి
ప్రియతమా పలుకుమా
నీ కలతే నా కలైతే మరి
నా నిదుర మాయమైపోతే సరి
నీ అలకే నా వ్యధైతే మరి
నా మనసు కరిగితే సరి
నువ్వే కదా నా జాబిలమ్మవి
నీకే కదా ప్రేమించే నా మది
నీకై ఎదురుచూపు నిదురకాపు
మధురమైన తలపు నాకు
నీ పిలుపే నేనైతే మరి
నేను లేను అది నువ్వే చెలి
నీ తలపే నాదైతే మరి
నా దిగులు తీరుతుంది చెలి
నేనే కదా నీ ప్రేమ పూజారి
నువ్వే కదా నా హృదయ దేవేరి
నిన్నే తలుచుకుంటూ పరితపిస్తూ
క్షణమొక యుగముగా గడుపుతున్నాను
41 comments:
ఈ టపా అదిరింది మరి...
ముదుగుమ్మ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం మరి...
తన రిప్లై బాగుంటే సరి ...
తేడాలోస్తే అబ్బాయికి తన్నులే మరి....
కథ సుఖాంతం అయితే సరి...
లేకుంటే అ గ్రంధాలయానికి చెడ్డ పేరు మరి..
చక్కటి భావుకత్వం.
రసజ్ఞగారు,
మీరు సృజించని అంశమంటూ ఏదీ వుండదు.
ఇటు చిత్ర, చరిత్రకారులు - అటు పద్య, కవితాలహరులు,
ఇటు సాహితీ, సాహిత్య, సంఘసంస్కర్తలు - అటు మీదైనా శైలిలో సొగసైన వివరణలు,
ఆహా....... ఒకటని ఏముందిలెండీ, దేనికదే అద్భుతం, అమోఘం.
అభినందనలు అన్నది చిన్నపదం. అంతకుమించి వ్యాఖ్యనించలేని ఆశ్చర్యానందం నాది!
మీరు మరీను రసజ్ఞ గారు...అప్పట్లో ఏదో అలా పాడుకున్నాను ....మీరు ఇలా కాపి కొట్టి ఇక్కడ నా పరువు తీయడం ఎం బాలేదండి బాబు . :):(:):(:):(
బాగుంది
అబ్బా, ఈ వెస్టర్నర్స్ ఎంత చక్కగా తెలుగు పాడుకుంటున్నారో !
చీర్స్
జిలేబి.
బాగుంది రసజ్ఞ గారు సమాధానం కోసం ఎదురుచూస్తూ...
:)
Nice
?!
mee chinni papa Profile photo bagundi madam
?!
:)
Cute Indian Panjabi girl
?!
రసజ్ఞ .. త్వరగా..రిప్లై ఇప్పించండి. లేఖ చాలా బాగుంది.
నేను ఏదైనా బ్లాగు చూస్తున్నప్పుడు , అందులో జిలేబీ గారి కామెంట్ ఉందో లేదో చూస్తాను. కామెంట్ ఉందీ అంటే అప్పుడు ఆ పోష్ట్ చదువుతాను. థాంక్స్ జిలేబీ.
thanks for ur comment
రసజ్ఞ గారూ!
"...నీకై ఎదురుచూపు నిదురకాపు
మధురమైన తలపు నాకు..."
ఇంత మంచి భావయుక్తమైన అబ్బాయి ప్రపోజల్ కి ఏ అమ్మాయి మాత్రం స్పందించదూ!
ఆ స్పందన ఎలా ఉంటుందో అని ఉత్కంఠ రేపేలా ఉందండీ ఈ ప్రపోజల్...
:)
I like her views
@ bhaskar sir
me too
?!
nice
కలల రాకుమారుడెవరో......
@ కళ్యాణ్ గారూ
హహహ మీ వ్యాఖ్య కూడా బాగుంది మరి
ఏమి జరుగుతుందో వేచి చూడాలి తప్పదు!
ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి!
@ భారతి గారూ
మీ ఈ స్పందనకి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది! మీ ఈ ఆశ్చర్యానందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు!
@ raafsun గారూ
హమ్మయ్యా సిగ్గునించి బయటికొచ్చారా? మళ్ళీ ఈ సిగ్గు దేనికి? ధన్యవాదాలు మీ స్పందనకి!
@ భాస్కర్ గారూ
థాంక్యూ!
@ జిలేబీ గారూ
మరే! వీరు కూడా మన శంకర విజయంలో సభ్యులే! ఎలాగంటారా? వారి ఏకలవ్య శిష్యులు బుజ్జి పండుకి నేర్పిస్తుంటే వీళ్ళు కూడా నేర్చేసుకున్నారు! ధన్యవాదాలు!
@ రాజి గారూ
మీ ఎదురు చూపులకు నా నెనర్లు!
@ ఎందుకో? ఏమో! శివ గారూ
ఈ టపా, నా ఫోటో (నేను పెట్టిన ఫోటో) నచ్చినందుకు ధన్యవాదాలు!
@ వనజ వనమాలి గారూ
తప్పకుండా వస్తుంది కాని ఎప్పుడో తెలియదు! మీకు నచ్చినందుకు నెనర్లు!
@ శ్రీ అరుణం గారూ
మీకు కూడా!
@ చిన్ని ఆశ గారూ
మీ ఉత్కంకి ఆనందంగా ఉన్నా తప్పదు మరి కాస్త వేచి చూడాల్సిందే! ధన్యవాదాలు మీకు నచ్చినందుకు! చిట్టి వచ్చిందా ఇంకా లేదా?
@ తెలుగు పాటలు గారూ
థాంక్స్!
@ తాతగారూ
రాకుమారుడే తన రాకుమారిని సొంతం చేసుకుందామని పడే వేదన ఇది! ధన్యవాదాలు!
లేదండీ, ఇంకా రాలేదు, ఒంటరి మనసుతో పోరాటం చేస్తూనే ఉన్నాను...
@ చిన్ని ఆశ గారూ
అయ్యో! అలా అనుకోవద్దని చెప్పమందండీ చిట్టి! శ్రుతిలయల్లా మీరు-చిట్టి కలిసే ఉంటారు బాహ్యంగా దూరంగా ఉన్నా!
:):):)
Good one...... :)
రసజ్ఞ గారికి అభినందన సుమాంజలిలు.
మీ కొంటే గాడి మునిపంటి నుంచి వెలువడింపజేసిన ఆ హృదయవ్యదమధురభావకవితోరసరమ్యరాగమాలిక బాగుంది అండీ. అతని మదిలోని ఆ ప్రేమ భావనలను అలానే పదిలంగా ఉంచుకోవాలంటే , తన ప్రేమ విఫలం అవ్వాలండి.అప్పుడే అతని మదినిలో నుండి వెలువడే విరహపరితపనలు పుటములోనుంచి తీసిన పసిడి చాయల్లా కడు మెరుపుల తలుకులతో మెరుస్తాయి... దయ చేసి ఆ ప్రేమని భగ్నం చేసెయ్యండి.... మీ నుంచి ఆ కోణాన్ని కూడా అభిలషిస్తున్న ఒక అభిమాని.
@ సుభా
మీరు కూడా మొదలెట్టారా ఈ రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ఆట?
@ శోభ గారూ
థాంక్స్ అండీ!
@ BHARATHeeyudu గారూ
ప్రేమని ఒప్పుకుంటుందా లేదా తిరస్కరిస్తుందా అన్నది ఆ అమ్మాయి ఇష్టం అండీ! వేచి చూడాల్సిందే! ధన్యవాదాలు మీ అభినందలతో కూడిన స్పందనకి!
గ్రంధాలయంలో మొదలైన వలపు ఇలా తలుపులు తెరుకొని జనహృదయాలలయాల్లోకి పాకి పందిళ్ళేసాకా, బెట్టుచేసిన ఆ చిన్నదాన్నీ గట్టిపట్టే పడుతున్న ఈ కుర్రవాడినీ త్వరలోనే కలపాలని కోరుకొంటున్నాం. వారపత్రికలతో మొదలైన వారి ప్రేమకి త్వరలోనే లగ్నపత్రిక రాయండి. విరహం వీక్షకులకి వినోదమే అయినా దాని తీక్షణత భరింపరానిది. చివరగా భారతి గారి మెచ్చుకోలుని అరువు తెచ్చుకొని మరొక్కసారి నీరాజనం పడుతున్నాం.
మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రసజ్ఞగారూ! ఈ టపాకు అందరికంటే ఆలస్యంగా స్పందించింది నేనే కావచ్చు. మీ సాహిత్యానికి మంచి ట్యూన్ కడితే అద్భుతమైన లవ్ సాంగ్ అవుతుంది.
రసజ్ఞ గారూ,
మీకు మా నూతన సంవత్సర శుభాకాంక్షలు !
రసజ్ఞగారూ! చెప్పడం మరిచాను. వీలుంటే ఈ కొత్త సంవత్సరంలో ఈ జంట ఏమనుకుంటున్నారో మరో పాట రూపంలో మాకు అందించండి.
మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రసజ్ఞగారూ!మీకు నా హృదయపూర్వక నూతన
సంవత్సర శుభాకాంక్షలు.
Wish You A Very Happy New Year 2012
!! రసజ్ఞ !! గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు
@ నందు గారూ
చాలా రోజులకి కనిపించారే! ఏమో అండి అమ్మాయి ఒప్పుకుంటుందో లేక వద్దంటుందో అంతా ఆ అమ్మాయి ఇష్టం నాదేం లేదు! తనెలా చెప్తే అలానే వ్రాస్తాను! ధన్యవాదాలు మీ మెచ్చుకోలుకి!
@ బాలు గారూ
ఎప్పుడూ వస్తే ఏముందండీ చదివి మీ అభిప్రాయాన్ని తెలియ పరచారు అదే చాలు! అయితే ఎందుకాలస్యం కట్టేయండి మంచి ట్యూన్! మేము కూడా విని ఆనందిస్తాం. తప్పకుండా వస్తుందండీ! కొంచెం ఓపిక వహించాలి మరి అమ్మాయి ఆలోచనలో పడిందిట!
@ జయ గారూ, చిన్ని ఆశ గారూ, సుభా, రాజి గారూ, తెలుగు పాటలు గారూ
అందరికీ పేరు పేరునా నూతన సంవత్సర శుభాకాంక్షలు! అందరికీ ధన్యవాదాలు!
aa ammayi emani itchindi Samadanam .... ?
@ హరి
తొందరపెట్టకు! ఆ అమ్మాయి ఆలోచించుకుంటోందిట ఇంకా! కంగారు పెట్టకు చెప్పిన వెంటనే ఇక్కడ పోస్ట్ చేస్తాలే!
Avunaaaaaaa em papam.... alochinchadaniki aa ammayiki time dorakadum leda enti.....?
"నీకై ఎదురుచూపు నిదురకాపు" వావ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ ఎక్స్‌ప్రెషన్.
@ మురళి గారూ
నాకు కూడా ఆ లైన్ బాగా నచ్చేసింది రాసేటప్పుడు!మీకు నచ్చినందుకు థాంక్స్ అండీ!
After I initially commented I seem to have clicked the -Notify me when new comments are added- checkbox and now
whenever a comment is added I get 4 emails with the exact
same comment. There has to be a way you can remove me from that
service? Appreciate it!
My website Dating Sites
Post a Comment