Sunday, December 11, 2011

కర్మజీవి కందుకూరి

ఈ రోజు అనగా డిసెంబరు పదకొండవ తేదీన కందుకూరి వీరేశలింగం పంతులు గారు మొదటిసారిగా వితంతు వివాహాన్ని చేయించిన రోజు. కనుక ఆ మహనీయునికి వందనములతో........ ఈ టపా ఆయనకి అంకితం.

దురాచార అనాచార దుష్కర్మలనెదిరించగా
తన దేహము తన గేహము
తన కాలము తన ధనము
తన విద్యావిజ్ఞానము
జనుల కొఱకు వెచ్చించిన
మహనీయుడు కందుకూరి
యుగ పురుషుడు కందుకూరి
పుణ్యజీవి ధన్యజీవి కందుకూరి కర్మజీవి

సంఘ దురాచారం మూఢ అనాచారం
పెక్కు పెరిగి ప్రభవిల్లిన దేశాన్ని చూడలేక
కుల పెద్దలనెదిరించి మత మత్తును సవరించి
దుష్కర్మలు అడుగంటే సంస్కరణలు చేపట్టి
సంగ్రామం సాగించిన మహనీయుడు కందుకూరి

స్త్రీ విద్యావ్యాప్తికై స్త్రీ జనోద్ధారణకై
వివేక వర్ధనిని స్థాపించెను కందుకూరి
ఆ పత్రికకు అనుబంధము హాస్యసంజీవని
సంఘంలో లోపాలను లోకానికి చూపేందుకు
ఆ ప్రతులను ప్రచురించిన మహనీయుడు కందుకూరి

అనాధ సమిధలై అనన్య గతికలై
పుట్టినిల్లు చేరినట్టి వితంతువులను చేరదీసి
 ఊరడించి ఆదరించి పునర్వివాహాలను జరిపి
ఆ వితంతువుల జీవితంలో సరికొత్త వెలుగు నింపి
సంఘాన్ని ఎదిరించిన మహనీయుడు కందుకూరి

తెలుగు భాష పరిరక్షణ భరత జాతి సంరక్షణ
తన బాధ్యతగా తలచి తగు చర్యలు చేబూని
పురాణాలనెన్నిటినో తెలుగులోకి అనువదించి
దక్షిణ భారత విద్యాసాగరుడను బిరుదునొంది
దేశభక్తి చాటుకున్న మహనీయుడు కందుకూరి 

32 comments:

Anonymous said...

అమ్మాయ్! రసఙ్ఞా!
నీ పోస్ట్ చూసి ముగ్ధుడనయ్యానంటే అతిశయోక్తి కాదు. గొప్పవారయిన శ్రీ కందుకూరి అడుగు జాడలలో కొంత ప్రయాణం చేసిన నాకు చాలా ఆనందంగా వుంది.

రాజ్యలక్ష్మి.N said...

"రసఙ్ఞా"గారు చాలా మంచి విషయాన్ని గుర్తు చేసి
ఆ మహనీయునికి అంకితం చేసిన మీ టపా చాలాబాగుంది..

PALERU said...

SUPERU....

అసలు మీలాంటి వాళ్ళు ఉండాలి అండి బ్లాగుల్లో .......

nsmurty said...

అమ్మా రసజ్ఞా
ఇవాళ మంచి పోస్ట్ వేశావు, 12.11.1881 నాటి మొదటి వితంతు పునర్వివాహ 130వ వార్షికోత్సవ సందర్భంగా. అప్పుడప్పుడు చరిత్రపుటలు తిరగేస్తుండాలి. "Lives of Great men enliven our spirits to make our lives sublime..." అన్న కవి వాక్కులు మననం చేసుకోవాలి. కందుకూరివారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే, ఇంత విశాల భావాలున్నాయని చెప్పుకుంటున్న ఈ రోజుల్లోకూడా, విడో మేరేజ్ అంటే ముందుకు వచ్చే యువకులు తక్కువ. అలాంటిది, పరమ ఛాందసము గూడుకట్టుకుని, శారీరక, మానసిక హింసతోబాటు, సంఘబహిష్కరణ చెయ్యడానికి వెనుకాడని సమాజములో బ్రతుకుతూ, వేటికీ వెరవకుండా, ఈ కార్యం సాధించేడు. అతను ఎదుర్కొన్నది ఎంత Monumental Opposition అన్నది మన ఊహకికూడా అందని విషయం. "క్రియాసిధ్ధిః సత్త్వే భవతి మహతాం నోపకరణే" అని అటువంటి వారికి నమోవాకములు అర్పించవలసిందే.
నీకు అభినందనలు.

Praveen Mandangi said...

వీరేశలింగం గారు వితంతు వివాహాలు జరిపించడానికి ఒక ప్రత్యేక పురోహితుణ్ణి పెట్టుకున్నారు. ఆ పురోహితుడు కొంత కాలం పని చేసి ఆ తరువాత పాప ప్రక్షాలన ప్రార్ధన చేసుకుని పారిపోయాడు. మూఢ నమ్మకాలు అంత ఘోరంగా ఉండేవి అప్పట్లో.

పల్లా కొండల రావు said...

నీ ధర్మం ! నీ సంఘం !! నువు మరువద్దు !!!
జతిని నడిపి , నీతిని నిలిపిన మహనీయులనే మరువద్దు !!
ఆ బాటలో నదుస్తున్న రసజ్ఞా ! సమయోచితమైన పోస్టు రాసావు ! అభినందనలు !!

phani said...

హబ్బ! ఎంత ఆనందంగా ఉందీ! వీరేశలింగం గారి గురించి తల్చుకోవడం. ఎక్కడవున్నా మన రాజమహేంద్రి గొప్పదనాన్ని చాటుతున్న మీకు సర్వదా కృతజ్ఞతలు.

జ్యోతిర్మయి said...

రసజ్ఞా..నీ ప్రతి పోస్ట్ ఏదో ఒక్క గొప్ప సంగతిని తెలుపుతూ వుంటుంది. ఇంత చిన్న వయసులో నీకున్న విజ్ఞానానికి, పరిణితికి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది....నువ్వీ రోజు వీరేశలింగం గారిని ఇలా గుర్తుచేసినందుకు చాలా ఆనందంగా ఉంది.

Shabbu said...

చాలా రోజుల తర్వాత కందుకూరి వీరేశలింగం గారిని గుర్తుచేసుకున్నట్లయింది, అప్పుడెప్పుడో బడిలో చదువుకున్నామంటే మళ్లీ ఈ రోజు మీ బ్లాగులో దర్శనం ఆయన ఫోటో తో సహా మాతో షేర్ చేసుకునందుకు థ్యాంక్స్, నిజంగా అప్పటి దురాచారాల గురించి ఆలోచిస్తే మాత్రం ఇంత ఘోరమా అన్సిస్తుంది.
Anyway Hope for the Good. ThnQ

Shabbu, KNR

గీతిక బి said...

nice post...

kalyan said...

@రసజ్ఞ గారు
కందుకూరి వీరేశలింగం ఈ మాట విన్న వెంటానే బుర్ర మీసాల తాతయ్య నిష్టూరంగా చూస్తూ వెధవల్లారా ఈ నవ్య సమాజాన్ని బ్రస్టు పట్టిస్తున్నారు కదరా నేను కనుక పుస్తకంలోనుంచి రాగలిగితే మిమ్మల్ని ఓ పట్టు పట్టేవాడిని అన్నటు తోస్తుంది నాకు ఎప్పుడు. అందరు ఆదర్శంగా భావించాల్సిన వ్యక్తి. వారి గురించి నాకు అంతగా తెలియదు కాని క్లుప్తంగా వారు చేసిన పోరాటాలను సమాజానికి చేసిన సేవలను చదువుకున్నాం ఎప్పుడో. అంతటి మహానుభావుని గురించి తెలుసుకోవడం అంటే ఆత్మ పరిశీలన చేసుకున్నట్టే . వారి గురించి గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు మాములుగా కాదు ఇకపై నా సమయాన్ని వారిలా కార్యాచరణ చేయడానికి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఎంతో చేస్తుంటాము అవసరమైనవి అనవసరమైనవి ఇంకా కాలాన్ని ఇలాంటి వాటికి కేటాయిస్తే సార్ధకం అవుతుంది మన ఆలోచన శైలి మారుతుంది. అప్పుడప్పుడు అనుకుంటా సమయాన్ని ఎలా నింపుకోవాలి అని సమయాన్ని నింపుకోవడం కాదు మొదట నువ్వు కదలాలి ఏదైనా చేయడానికి అని గుర్తొస్తుంది ఇలాంటివి చదివినప్పుడు. ఇక మీ రచన కొస్తే ఎంతో బాగా తీర్చి దిద్దారు ఒక్కో అంశాన్ని . సమయానికి సందర్భానికి, సాంప్రదాయానికి సంస్కృతికి, ఆలోచనకు ఆరంభానికి పెట్టినవి పేర్లు మీ టపాలు . అంతే చెప్పగలను మళ్ళి మళ్ళి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు.

వనజ తాతినేని/VanajaTatineni said...

సంఘంలో ఉన్న దురాచారాలని పారద్రోలడానికి.. ఆ మహనీయుడు చేసిన అవిశ్రాంత కృషి అందరికి ఆదర్శప్రాయం. ఎవరేమనుకున్నా వెన్నుచూపక ఇతరులని చైతన్యవంత దిశగా నడిపిన వారి సేవలని జాతి ఎన్నటికి మరువరాదు. గొప్ప సంఘ సంస్కర్తని గుర్తుకు చేసిన తీరుకి.. ముచ్చటవేసింది. అభినందనలు. "నిత్య చైతన్య శీలి" అందుకో..అభినందన మందారమాల.

ఎందుకో ? ఏమో ! said...

hello అండీ !!
చిన్నప్పుడు చదువుకునేప్పుడు వీరి గాధ అంత రుచించేది కాదు
ఎప్పుడో జరిగినవి ఇప్పుడు చదవదమేంటి అనిపించేది
but మొన్న ఈ మధ్యన
విశ్వనాథ సత్య నారాయణుల వారి "చెలియలి కట్ట" అనే novel చూశాక అభిప్రాయం తక్షణం మారిపోయింది
50 - 60 ఏళ్ల క్రితం మన సమాజం లో
" స్త్రీ " మనుగడ ఎలా ఉండేదో కళ్ళకు కట్టి నట్లు అందులో కనిపిస్తుంది
కానీ శతాబ్ది క్రితం ఇలాంటి మహాను భవుడు జన్మించి ఉండక పోతే
ఈ సమాజం ఎలా ఉండేది?
తలుచుకుంటే గగుర్పాటు కలుగుతున్నది !!
పాపం వారు చిన్ననాటి నుండీ తీవ్ర అస్వస్థతో ఉండే వారని lesson లో చదివినట్టు గుర్తు
ఎంతైనా కష్టం తెలిసిన మనిషి కదా...!
నిజమే,
ఆనాడు స్త్రీ జనోద్దరణ లేకుంటే ఈనాడు ఈ బ్లాగోతం వచ్చేది కాదు
వారు అవతార పురుషుని వలె
విప్లవాత్మక చర్యకు పూనుకుని
పెను మార్పుకు నాంది పలికారు
nice
very nice
మనషి మరణం తర్వాత
మంచితనం రూపేణా మిగిలి ఎల్లకాలం ఉంటాడని
మీ post రుజువు పరిచింది
ధన్యుడను

?!

ఎందుకో ? ఏమో ! said...

Vijaya banner's ""క్రియాసిధ్ధిః సత్త్వే భవతి"
inka
Kalyan Garu
pratyekam ga
mee vyakhya naku nacchindi

naku alaanti bhavane kalugu thunnadi

nice

?!

రసజ్ఞ said...

@ తాతగారూ
నా ఈ టపా మిమ్మల్ని ముగ్ధుల్ని చేసిందంటే అంత కన్నా అదృష్టమా! నేను ప్రయాణం చేయకపోయినా అదే ఊరిదానినయినందుకు గర్విస్తున్నాను. ధన్యవాదాలు!

@ రాజి గారూ
ఇలాంటి వాళ్ళని మనం ఎన్నటికీ మర్చిపోకూదదండీ! సహాయం చేసిన వాడు మర్చిపోవాలి పొందిన వాడు గుర్తుంచుకోవాలి అంటారు పెద్దలు. ఆయన నుండి అన్నీ ప్రయోజనాలు పొందిన మనం ఇటువంటి సందర్భాలలో అయినా ఒకసారి స్మరించుకోవాలి కదా! అందుకే నా ఈ ప్రయత్నం మీకు నచ్చినందుకు నెనర్లు!

@ RAAFSUN గారూ
మీకు నచ్చినందుకు మరియు మీ అభిమానానికీ నా కృతజ్ఞతలు!

రసజ్ఞ said...

@ మూర్తి గారూ
చాలా చక్కని వ్యాఖ్యానం చేశారు. నిజమే! ఈ రోజుల్లో వితంతు వివాహాలకి ముందుకి వస్తారా రారా అన్నది పక్కన పెడితే కనీసం కట్నం లేకుండా పెళ్లి చేసుకుని భార్యని ప్రేమగా చూసుకునేవారెందరు? ధన్యవాదాలు మీ స్పందనకి!

@ ప్రవీణ్ శర్మ గారూ
అవునా! మరీ అంత దారుణమా! నాకు తెలియని ఒక క్రొత్త విషయం తెలియచేసారు! ధన్యవాదాలు!

@ పల్లా కొండల రావు గారూ
మీ ప్రోత్సాహకరమయిన స్పందనకి నా కృతజ్ఞతలు!

రసజ్ఞ said...

@ గోదారి ఫణి గారూ
అటువంటి మహనీయుడు మన ఊరి వారుకావడం నిజంగా మన అదృష్టం! నా ప్రయత్నాన్ని అభినందించి ప్రోత్సహించే మీకు కూడా నా కృతజ్ఞతలు!

@ జ్యోతిర్మయి గారూ
మీ వ్యాఖ్యకి ఎలా స్పందించాలో తెలియటం లేదు. నాకు తెలిసిన విషయాన్ని నలుగురితో పంచుకుంటున్నాను ఈ బ్లాగు ద్వారా అంతే! సర్వదా వెన్ను తట్టి ప్రోత్సహించే మీ లాంటి వారి వల్ల అది అలా అలుపెరుగక ప్రయాణం సాగిస్తున్నది! ధన్యవాదాలు!

@ Shabbu గారూ
కదా! చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో చదవాలనిపించలేదు కాని కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల గురించి తెలుసుకున్నాక ఆసక్తి పెరిగి ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. మీకు ఆసక్తి ఉంటే వీలున్నప్పుడు ఈ బ్లాగులో గ్రంధాలయం క్రింద ఉన్న లింక్ నొక్కండి కందుకూరి వారి జీవిత చరిత్రని అక్కడ పుస్తకాలలో చేర్చాను. ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ గీతిక గారూ
ధన్యవాదాలు!

@ కళ్యాణ్ గారూ
హహహ బాగా చెప్పారండీ! నిజమే! ఈ టపా మీలో ఇంత ఆదర్శమయిన భావాలను పెంపొందించటం చాలా ఆనందంగా ఉంది నాకు! ఈ ఆలోచనని తప్పక ఆచరణలో పెట్టండి మిక్కిలి సంతోషిస్తాను! నా రచనలకి ప్రతిరూపాలయిన టపాల గురించి మీరు చేసిన వ్యాఖ్యకి, మీ స్పందనకి, క్రొత్త ఆలోచనకి అన్నిటికీ నా నెనర్లు!

@ వనజ వనమాలి గారూ
మనం ఆయనని ఎన్నటికీ మరువకూడదు నిజమే! మీకు ముచ్చట కలిగినందుకు నాకు ఒక అనిర్వచనీయమయిన అనుభూతి! "నిత్య చైతన్య శీలి" హబ్బా గుండెని ఒకసారిగా సుతారంగా తాకారండీ మీ ఈ ఒక్క పదంతో! మీ అభినందన మందార మాలకి నా వినయపూర్వక కృతజ్ఞతలు!

రసజ్ఞ said...

@ తెలుగు పాటలు గారూ
ధన్యవాదాలు!

@ ఎందుకో? ఏమో! శివ గారూ
చెలియలి కట్ట ఎంత అద్భుతమయిన నవల! కదా! ఆ రోజుల్లో నేను పుట్టనందుకు కొంచెం ఆనందం వేసింది! ఇప్పుడు తల్లిదంద్రులతోనే కాదు ఎవరితోనయినా నిస్సంకోచంగా మాట్లాడగలిగే వాక్ స్వాతంత్ర్యం మనకి ఉంది! కందుకూరి వారి స్వీయ చరిత్రమును నా బ్లాగులో గ్రంధాలయం కింద ఉన్న లింక్లో చదవచ్చు. మనషి మరణం తర్వాత
మంచితనం రూపేణా ఎల్లకాలం మిగిలి ఉంటాడు అంతే కదండీ మరి! ధన్యవాదాలు!

subbarao said...

"కందుకూరికి సాటిల కాన డెవరు."

Balu said...

కొంతమంది డబ్బుకోసం పుడతారు, కొంతమంది పేరు ప్రఖ్యాతలకోసం పుడతారు, కొంతమంది కుటుంబంకోసం పుడతారు, కందుకూరి వీరేశలింగం లాంటి మహనీయులు మాత్రమే సమాజంకోసం పుడతారు..అంతటి గొప్ప వ్యక్తి ని మీ టపా ద్వారా గుర్తుచేసారు.. అందుకోండి మా అభినందనలు.

Praveen Mandangi said...

పాప ప్రక్షాలన ప్రార్ధన చేసుకుని పారిపోయిన పురోహితుని గురించి వీరేశలింగం గారే తన జీవిత చరిత్రలో వ్రాసారు.

శ్రీ said...

కందుకూరి గారు నాకు ఆదర్శం. మంచి టపా రాసారు.

రసజ్ఞ said...

@ సుబ్బారావు గారూ
లెస్స బలికితిరి! ధన్యవాదాలు!

@ బాలు గారూ
కందుకూరి వీరేశలింగం లాంటి మహనీయులు మాత్రమే సమాజంకోసం పుడతారు..నిజమే! మీ అభినందనలకు ధన్యురాలిని!

@ ప్రవీణ్ శర్మ గారూ
అయ్యో నేను ఇంకా పూర్తిగా చదవనే లేదు! మరొక్కసారి ధన్యవాదాలు!

@ శ్రీ గారూ
చాలా రోజులకి కనిపించారే! మీకు ఆదర్శమయిన మహనీయుని గురించి నేను వ్రాసిన టపా మీకు నచ్చినందుకు చాలా సంతోషం! ధన్యవాదాలు!

శిశిర said...

"కొట్టుకొని పోయె కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు"
అని కవి రాసిన మాటలు అతిశయమనిపించవు వీరిని గురించి తెలుసుకుంటుంటే. మీరు చాలా బాగా రాశారు వారి గురించి.

ఆ.సౌమ్య said...

Excellent రసజ్ఞ!
పైన రాసిన కవిత మీరు రాసినదా? కాకపోతే ఎవరు రాసారు?

రసజ్ఞ said...

@ శిశిర గారూ
నిజమే! చక్కని మాటలని గుర్తుచేశారు! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ సౌమ్య గారూ
ధన్యవాదాలు! అయ్యో రామ! నేనే వ్రాసానండీ! నా మీద మరీ ఇంత నమ్మకమా మీకు;) హతవిధీ!

తెలుగు పాటలు said...

తెలుగు పాటలు బ్లాగ్ కనిపించటం లేదు సంకలిని లో కనపడుట లేదు? మాలిక లో కనపడటం లేదు? మీకు ఎవరికీ అయిన కనిపించినను నాకు తెలియపరచండి
ఇట్లు
మీ తెలుగు పాటలు బ్లాగ్
అడ్రస్: తెలుగువారి వీది,
ఉరు : ఆంద్రప్రదేశ్
ఇగా నేను వెళ్లి వెతుకుతా ధన్యవాదములు

రసజ్ఞ said...

@ తెలుగు పాటలు గారూ
అయ్యయ్యో అలాగా తప్పకుడా చుస్తానండీ! కనిపిస్తే వెంటనే తెలియచేస్తాను! నేను కూడా తీవ్రంగా గాలిస్తాను!

శ్రీలలిత said...

రసఙ్ఞగారూ,
నేను కూడా వీరేశలింగంగారి స్కూల్ లో చదువుకున్నదానినేనండీ. ఆయనను సరైన సమయానికి గుర్తు చేసారు. ధన్యవాదాలు..

రసజ్ఞ said...

@ శ్రీలలిత గారూ
అవునా! చాలా ఆనందంగా ఉంది! అటువంటి స్కూల్స్లో చదువుకోవడం వలన మంచి విద్యాబుద్ధులతో పాటు గొప్ప ఆలోచనలు కూడా చేస్తాము. మీ స్పందనకి ధన్యవాదాలు!

Anonymous said...

రసజ్ఞ గారు ...

చాల చాల బాగా రాసారు ..

నాకు కందుకూరి గారికి పెద్ద పరిచయం లేదు .. ఏదో మీతో ఉన్న అతి చిన్న పరిచయం తో చెప్తున్నా ...
ఆ కాలం లో స్త్రీ ల అదృష్టం కొద్ది మీరు ఆయనకు స్నేహితులు కాలేదు లేకపోతే... వామ్మో..... అయన ఇంత సంఘ సంస్కరణ చేసేవరేనా అని నా అనుమానం .. ఏదో తెలిసిన తెలియన మిడి మిడి జ్ఞానం తో అంటున్నాను అనుకోండి ..