Wednesday, December 07, 2011

కొంటె కవి(త)


నిశ్శబ్దంగా ఉన్న గ్రంధాలయంలో ఒక పుస్తకాభిమాని పుస్తకాలు చదువుకుంటున్నాడు. అక్కడికి వచ్చింది ఒక మెరుపు తీగ లాంటి అందమయిన ముద్దుగుమ్మ. తనతో మాటకలపాలని ఇతని మనసు ఉర్రూతలూగుతోంది. ఛా నేను కవినయితే ఎంత బాగుండును అనుకున్నాడు? ఆమెని ఎలా అయినా పలకరించాలని తనకున్న పుస్తక జ్ఞానంతోనే ఒక తుంటరి కవితని అల్లేసాడు. ఆమె రాక ఇతనిలోని కొంటె కవిని మేల్కొలిపింది.

ఈనాడులో వసుంధరవా
ఆంధ్రజ్యోతిలో నవీనవా
ఆంధ్రభూమిలో వనితవా
అందాల వార్తలో చెలివా
నీ పేరు ఏమిటే జాబిలమ్మా
నీ ఊరు చెప్పవే కూనలమ్మా
నీ రాకతో నా లోకమే అందాల
అంబరాన ఊయలూగుచున్నది తూగుచున్నది

బొమ్మరిల్లు పొదల్లో పున్నాగ పువ్వువా
సన్నజాజి తీగవా సినీస్టారు దూతవా
బాలమిత్ర కథల్లో అందాల రాణివా
అందని గగనంలో సూర్య కిరణ మాలవా
సుస్వరాల మాలికల్లో యెండమూరి హారికవా
సుప్రభాత వెలుగువా చిత్రాంజలి జిలుగువా
బాలజ్యోతి సాధనవా ఆంధ్రప్రభకు హారతివా
చతురవా విపులవా అందమయిన కవితవా
తెలుపుమా ఓ మౌనమా పలుకుమా అంత బిడియమా

చల్లగాలి పిలుపులో స్వాతి వాన చినుకువా
సంతోషపు ధారవా ఆనందపు తీరువా
రవివర్మ చిత్రాలకు సాక్షివా
రవిచూడని కవి హృదయపు భావానివా
శివరంజని రాగమా రవళించే భావమా
రాగాల రాణివయిన కళ్యాణి రాగమా
స్వప్నలోక సుందరివా దివ్యలోక మంజరివా
చందమామ చెంతనుండు తారవా సితారవా
తెలుపుమా ఓ మౌనమా పలుకుమా అంత బిడియమా 

40 comments:

జ్యోతిర్మయి said...

"ఏమని తెలుపను నేనెవారినో తెలుపనా
నీవు అనుకున్నవేవీ కాదు
అంతర్జాలంలో వెలుగులు పూయిస్తున్న కౌముదిని" అన్నదట ఆ అమ్మాయి.

మధురవాణి said...

హహ్హహ్హా.. భలే రాసారండీ.. :)

ఎందుకో ? ఏమో ! said...

objection your honor

ఇంకో line miss అయ్యింది

"బ్లాగుల్లో నవ రసజ్ఞ భరితానివా" ?

?!

రసజ్ఞ said...

@ జ్యోతిర్మయి గారూ
రాబోయే హారం లో మల్లె మొగ్గ అంటే బాగుండేదేమో! ధన్యవాదాలు!

@ మధురవాణి గారూ
మీకు నచ్చి హాయిగా నవ్వుకున్నారు కదా! థాంక్స్ అండీ!

@ ఎందుకో? ఏమో! శివ గారూ
హహహ మీరు మరీనండీ! ధన్యవాదాలు మీ ప్రశంసాత్మక స్పందనకి!

Anonymous said...

మధుమాసంలో పిల్ల తెమ్మెర!

ఎందుకో ? ఏమో ! said...

:)

కొంటె కవితకు తుంటరి comment ఉండాలి కదండీ మరీ !!
నైస్ expecting more
?!

gksraja said...

అమ్మమ్మమ్మా!!! ఎంత గడుసుతనం కాపోతే- లైబ్రరీలో అబ్బాయిని అడ్డం పెట్టుకొని, సొంత కవిత్వం ఇక్కడ ఒలకబోసేస్తారా!!! అయినా 'రసభరితం'గా ఉంది కాబట్టి, భరించేస్తున్నాం ఫోండి.
రాజా.

kalyan said...

@రసజ్ఞ

గ్రందాలయమును ప్రేమాలయముగా మర్చేసినారే అక్కట్టా ఏమి మీ ప్రతిభ . ఆ అబ్బాయి అమ్మాయి కోసం రాసాడో లేదో తెలియదు కాని. మీరైతే ఏదో కారణంగానే రాసారు :-P

karthik said...

అన్ని వార్తా పత్రికలను బాగా కవర్ చేశారు :))

చిన్ని ఆశ said...

కొంటె కవి(త) లో...కొంటె బొమ్మల "బాపు తెలుగు బొమ్మ" నీ చేర్చవలసింది ;)
చాలా బాగుందండీ రసజ్ఞ గారూ!

Anonymous said...

baagundi konte kavita..kaakapote finishing touch gaa aa muddu gumma kooda oka counter laanti kavita veste baagundedi..ihanem idea ichchaa gaa..kummandi..

ఆ.సౌమ్య said...

మీరు వార్తపత్రికలు, వీక్లీలు బాగా చదువుతారని మాకర్థమయ్యింది. :))

ఆ.సౌమ్య said...

ఒక చిన్న సలహా:
మీరు comments moderation పెట్టుకోండి. అది లేకుండా ఉండడం అంత మంచిది కాదు.

Zilebi said...

బోణీ,
pony,
నీవే నా అలివేణీ !
నేనే నీకు బాగు వాణీ
అయితే నీ వాణ్ణీ
కాకుంటే బ్లాగు వాణ్ణీ!

చీర్స్
జిలేబి

శిశిర said...

రసజ్ఞా! నీవు ఈనాడులో "ప్రతిభవా"!!!
:) బాగా రాశారు.

తెలుగు పాటలు said...

!!రసజ్ఞ!! గారు మీ కొంటె కవిత బాగుంది

RAAFSUN said...

మీరు మరీ అండి..రసజ్ఞ గారు,

నన్ను కొంటె కవి అని తెగ పొగిడేస్తారు .... ఐనా అదెప్పుడో కదా నేను అలా పాడింది..!!! మీరు గుర్తుపెట్టుకుని నా పరువు ఇలా బ్లాగుపాలు చేయాలా???

ఛ!!! నా గురించి అందరికి తెలిసిపోయింది..ఇప్పుడు నా బ్లాగ్లో ఉరికే కామెంట్లు పెట్టేస్తారు అందరు ...కవిత రాయి కవిత రాయి అని....ఈ కవితే మో బందరు వెళ్లి ఇంకా రాలేదు ...ఎం చేయాలో ఈ రసజ్ఞ గారితో పెద్ద చిక్కొచ్చి పడిందే...:):)

శ్రేయోభిలాషి
RAAFSUN

రసజ్ఞ said...

@ తాతగారూ
అంత బాగుందనమాట! ధన్యవాదాలు!

@ ఎందుకో? ఏమో! శివగారూ
హహహ అంతే కదండీ మరి! బాగుంది బాగుంది! అయ్యో మీరలా expectations పెట్టేసుకోకండి ఎక్కువగా నా ప్రయత్నం నేను చేస్తాను! మరొకసారి ధన్యవాదాలు!

@ రాజా గారూ
ఏవండోయ్ మీరీ మధ్య నన్ను మరీ పొగిడేస్తున్నారనుకోండి! మొన్న గడుగ్గాయి, ఇప్పుడు గడుసుతనం అన్నారు బాగున్నాయి. హహహ మీరు పట్టేశారు! అన్నీ అలా ఇక్కడ చెప్పేస్తారా ఏంటి? భరించినందుకు నెనర్లు!

రసజ్ఞ said...

@ కళ్యాణ్ గారూ
హహహ ప్రేమ కలుగుటకు పార్కులు పబ్బులు ఏల? గ్రంధాలయములు చాలవా పవిత్ర ప్రేమికులకు? ఆ కారణం ఏమిటంటే..... ఏమి లేదు నాకు అలా ఒక ఆలోచన వచ్చింది రాసేసా అంతే! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!

@ కార్తీక్ గారూ
హహహ ఇంక కొన్ని మిగిలిపోయాయండీ ఎలా కలపాలో తెలియక వీటితో రాసేసా! మీ స్పందనకి ధన్యవాదాలు!

@ చిన్ని ఆశ గారూ
బాపు బొమ్మ ఒక్కటీ అయితే పెట్టేదానిని కాని ఈ అంశానికి తగ్గట్టుగా అబ్బాయి, గ్రంధాలయము అన్నీ ఉండాలనుకున్నాను. నాకు దొరకలేదు. అదే చిట్టి, పండు అయితే చక్కగా కలిసి గీసేసేవారు. అందుకని ఇది పెట్టాల్సి వచ్చింది. ధన్యవాదాలు మీ ఇరువురికీ!

రసజ్ఞ said...

@ అజ్ఞాత గారూ
మీ ఆలోచన బాగుంది! కాని ప్రస్తుతం ఆ ముద్దుగుమ్మ ఆలోచనలో ఉంది. తన సమాధానం మరొక టపాలో వస్తుంది! ధన్యవాదాలు!

@ సౌమ్య గారూ
హహహ మీరు మరీ అలా రహస్యాలన్నీ బయట పెట్టేయకండి! మీ సలహాకి ధన్యవాదాలు తప్పకుండా మారుస్తాను!

@ జిలేబీ గారూ
హహహ బాగుంది! ఎంతయినా జిలేబీనా మజాకానా? ఆ రుచే వేరు! ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ శిశిర గారూ
కాదండీ 'బుజ్జాయి' ని. ధన్యవాదాలు!

@ తెలుగు పాటలు గారూ
మీకు నచ్చినందుకు అందుకోండి నా ధన్యవాదాలు!

@ RAAFSUN గారూ
అదంతా సరే కాని మీకు నచ్చిన అమ్మాయిని వర్ణించిన తీరు అందరికీ నచ్చేసిందట! ఆ అమ్మాయి సమాధానం ఏంటో తెలిస్తే ఆ అమ్మాయిని ట్రై చేసుకుంటారట! చూసుకోండి మరి! బందరెల్లింది కదా అని మీరిక్కడ బందరులడ్డు తింటూ కూర్చుంటే ఏ కాకో వెళ్ళి తన్నుకుపోతుంది!

తెలుగు పాటలు said...

నాకు చిన్న అనుమానము... చాలావరకు అబ్బాయిలకే ఇలా అవుతుంది కానీ ఎక్కడ ఇలా ఏ అమ్మాయి చెప్పగా వినలేదు ఎందుకు అంటారు రసజ్ఞ గారు...

రసజ్ఞ said...

@ తెలుగు పాటలు గారూ
హమ్మా! చిన్న ప్రశ్న వేసి దానితో మొత్తం గుట్టు రట్టు చేయించేద్దామనే! ఆశ దోశ పులిహోర దద్ధోజనం!

భాస్కర రామి రెడ్డి said...

:-)

తెలుగు పాటలు said...

తొలిప్రేమ సినిమాలో పవన్ వా
జేమ్స్ బాండ్ సినిమాలో హీరో వా
అంటూ నాకోసం ఏ అమ్మాయి అయినా
పాడుతుందో అని వెయిటింగ్
అందుకే అలా అడిగాను :) కాని
మీరు గుట్టు చెప్పటం లేదుగా :(

Balu said...

వీటన్నిటికీ నా సమధానం ఒక్కటే 'ఈటీవీ లో స్టార్ మహిళను'. భలే ఆలోచనండి.

రసజ్ఞ said...

@ భాస్కర రామి రెడ్డి గారూ
ధన్యవాదాలు మీ నవ్వుకి!

@ తెలుగు పాటలు గారూ
బాహ్య సౌందర్యాన్ని చూసి ప్రేమిస్తే తప్పకుండా అలానే చెప్తుంది! కాకపోతే కొంచెం మాధవన్ నవ్వు, సోను సూద్ కండలు (atleast biceps) ఉండాలి మరి!

@ బాలు గారూ
చాలా రోజులకి కనిపించారు! హహహ స్టార్ మహిళా బాగుంది! నా ఆలోచన నచ్చినందుకు ధన్యవాదాలు!

గోదారి said...

రసజ్ఞ గారూ! మీ బ్లాగ్ మొదటిసారి చూసాను. మీ కళా పిపాస నచ్చింది. పోస్ట్ లన్నీ చాలా బావున్నాయి.మీ కవితలు కూడా. నాకు ఒక విషయం తెలిసిందోచ్! ఏమిటంటే మీది కూడా మా వూరేనని. ఇంతకీ అది గౌతమీ గ్రంధాలయం కాదు కదా?

Balu said...

@ రసజ్ఞగారూ! పని ఒత్తిడి వల్ల కొంచెం విరామం వచ్చిందండి. మీ టపా చదివిన తర్వాత టీవీ కార్యక్రమాల టైటిల్స్ తో కూడా ఇలాంటిది రాస్తే బాగుంటుందనిపించిందండి.కుదిరితే ఆ ప్రయత్నం కూడా చేస్తారని ఆశిస్తాను.

రాజి said...

రసజ్ఞగారూ! మొత్తానికి ఆ ముద్దుగుమ్మని చూసిన ఆ కవి
ప్రపంచం ఒక "వండర్ వరల్డ్" గా మారిపోయిందన్నమాట..
ధాలా బాగుంది..

kadambari said...

రసజ్ఞ గారూ!

@)కొంటె కవిత పత్రికా ప్రపంచాన్ని
చుట్టి వచ్చేసిందన్న మాట!
ఆ కలం ఘనత మీదేనా?

@)ఎమ్. రామ సురేశ్ పైంటింగులు అత్యద్భుతం!
ముఖ్యంగా వనితల జడలలోని పూల చెండులు,
పుష్పాలలోని చిన్నిరేకును కూడా మిస్ అవకుండా
చిత్రించిన తీరు హాట్సాఫ్!

@) గౌతమీ గ్రంధాలయం గురించి
మంచి కాఫీలాంటి వ్యాసాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాను.

(కాదంబరి)
;

రసజ్ఞ said...

@ గోదారి గారూ
ముందుగా మీకు కళా పిపాసతో కూడిన ఈ బ్లాగులోని టపాలు నచ్చినందుకు నా ధన్యవాదాలు! మీది కూడా రాజమహేంద్రవరమేనా? హహహ గౌతమీ గ్రంధాలయమో కాదో! తెలియదు మరి:)

@ బాలు గారూ
ప్రయత్నించి చూస్తానండీ! నేను అసలు టీవీ చూసే రెండేళ్లవుతోంది! కనుక ఏమేమి కార్యక్రమాలోస్తున్నాయో కూడా తెలియదు! మీ సలహాకి ధన్యవాదాలు!

@ రాజీ గారూ
నిజమేనండోయ్! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ కాదంబరి గారూ
కొంటె కవిత పత్రికాలోకాన్ని చుట్టి బ్లాగ్లోకానికి కనిపించి ఇలా వ్యాఖ్యాలోకంలో ఉందండీ ప్రస్తుతం! కలం ఘనత నాదే కానీ ప్చ్ అక్కడ నాకెవ్వరూ ఇలా పాడలేదు!
రామ సురేశ్ గారి ప్రతిభను గుర్తించిన మీకు నా ధన్యవాదాలు!
గౌతమీ గ్రంధాలయం గురించి.... తప్పకుండా ప్రయత్నిస్తాను. నెనర్లు!

రాజేష్ మారం... said...

:)

మీరు, పుస్తకాలు - పేపర్లు ఎక్కువగా చదువుతారా!! లేక, R&D చేసి రాసారా!!

Anyway, It's very Nice .. .

రసజ్ఞ said...

@ రాజేష్ గారూ
హహహ మంచి సందేహమే కలిగింది! పుస్తక ప్రేమికురాలినండీ! దీనికి అంత పరిశోధన అవసరం లేదు! అవగాహన ఉన్నా చాలు! ధన్యవాదాలు మీకు నచ్చినందుకు!

Ravi said...

sakshi family missed..... :(

రసజ్ఞ said...

@రవి గారూ
హహహ! సాక్షి వచ్చింది అండీ! ధన్యవాదాలు!

MURALI said...

హాహా బాగుంది

రసజ్ఞ said...

@ మురళి గారూ
మా కొంటె కవి గారు మిమ్మల్ని నవ్వించారనమాట! సంతోషం! నచ్చి, స్పందించినందుకు ధన్యవాదాలు!

Anonymous said...

This is the perfect blog for anybody who wishes to find out about this topic.
You realize so much its almost hard to argue with you (not that I personally would want to…HaHa).
You certainly put a fresh spin on a subject that has been discussed for years.
Great stuff, just wonderful!

Review my website :: dating online (bestdatingsitesnow.com)