Saturday, December 17, 2011

కళా "శుచ"రితంఇవాళ మరొక గొప్ప కళాకారిణితో మీ ముందుకి వచ్చాను. ఈవిడ జనాలకి తెలియకపోయినా ఈ చిత్రాలలో కనీసం ఒక్కటయినా అందరూ చూసే ఉంటారు. ఈవిడ పేరు శుచి క్రిషన్

 
ఈవిడ చిత్రకళలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన సర్ల చంద్ర గారి మనవరాలు. చిన్ననాటినుండి చిత్రకళా వాతావరణంలో పెరిగిన ఈవిడ కూడా ఆ కళ మీద మక్కువ పెంచుకున్నారు. ప్రపంచంలోని అందాలకి సున్నితమయిన రంగులతో జీవం పోయాలని నిర్ణయించుకున్నారు. ఈవిడ చిత్రాలకి కుటుంబీకులతో పాటు జర్మన్ చిత్రకారుల స్ఫూర్తి కూడా తోడయ్యింది అని చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది.   
 
తన తొలి అడుగును చుట్టూ ఉన్న పరిసరాలతో వేయాలని నిశ్చయించుకున్న ఈవిడ సొంత ఊరు ఢిల్లీ కావడంతో రాజస్థాన్ వాసులు ఈవిడ దృష్టిని ఆకట్టుకున్నారు. కనుక వారి చిత్రాలతో చిత్రకళను మొదలుపెట్టారు. మరుగున పడిపోతున్న శిల్పకళ, భవనాలు, కట్టడాలు అన్నీ ఈవిడ చిత్రాలలోని అంశాలు. రాజభవనాలు, హవేలీలు, స్తంభాలు, ఆలోచనలలో మునిగి ఉన్న స్త్రీలు,  మొదలయినవన్నీ చిత్రాలుగా రూపొందించటం ఈవిడకి చాలా ఇష్టం.
 
ఢిల్లీ పబ్లిక్ స్కూలులో (1976 - 1983) చదువుతున్నప్పుడు మొదటి సారిగా చిత్రాలు వేయటం ప్రారంభించిన ఈవిడ 1983 లో ఈవిడ +2 (మన పరిభాషలో ఇంటరు) పూర్తయ్యేసరికి ఈవిడ చిత్రాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అకాడమిక్ బోర్డు ద్వారా చిలె, నైజీరియా మొదలయిన చోట్ల ప్రదర్శనలకి ఎంపికయ్యాయి. ఈ ఉత్సాహంతో ఆవిడ Delhi College of Fine Arts లో చేరి 1986 కి ఆ చదువు పూర్తయ్యేసరికే ఇరాక్లో జరిగిన paintings exhibition లో ఈవిడ చిత్రాలు వీక్షకుల మనసు దోచుకున్నాయి. వాటిల్లో ముఖ్యమయినదే ఈ చిత్రం.     

ఆ తరువాత ఎన్నో దేశాలలో చిత్ర ప్రదర్శనల్లో సుస్థిర స్థానాన్ని పొందిన ఈవిడ చిత్రాలు ఎన్నో గొప్ప గొప్ప బహుమతులను తెచ్చిపెట్టాయి. ఆయిల్ మరియు వాష్ painting లో చేయి తిరిగిన ఈవిడ ప్రస్తుతం ఢిల్లీలో శిక్షణా తరగతులను నడుపుతున్నారు. ఆవిడ చిత్రాల గురించి Asian Spirit-Nationality and Tradition [KOREA] మరియు Artists of the Twentieth Century [U.S.A.] అనే పుస్తకాలలో మరింత వివరంగా చదవచ్చు. మరణిస్తున్న ఒక భారతీయ కళని కాపాడాలన్న తపనతో మొదలుపెట్టిన ఈ చిత్రకళ నా జీవితంలో ఒక చోదక శక్తిగా మారింది అని, రాజా రవి వర్మ చిత్తరువులను ఆరాధిస్తాను అని ఆవిడ చాలా సందర్భాల్లో చెప్పారు. అందువలన ఈ కళ మరుగున పడకుండా, మరణించకుండా తన వంతు కృషి ఆవిడ చేసినప్పటికీ తన కుమారుని కూడా ఇదే బాటలో నడుపుతున్నారు. ఇటువంటి కళాకారులెందరో మన భారతదేశంలో.............. 

ఈవిడ గీసిన మగువల చిత్రాలను చూడండి.....
ఈవిడ గీసిన రాజస్థానీ మగవారి చిత్రాలు......
ఈవిడ కళాపోషణకి మచ్చుతునకలు....ఈవిడకి అత్యంత ఇష్టమయిన కళలను కుంచెతో రూపొందించిన తీరు..........

The Last Door of Notre Dame, Paris

37 comments:

subbarao said...

ఈ కళామతల్లికి నా జోహార్లు.

వనజ వనమాలి said...

abba..yentha baagunnaayi. adbhutam. Great Art.

సుభ said...

రసగుల్లా ఇంత మంచి మంచి కళాకారుల్ని పరిచయం చేస్తున్నందుకు మీకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..ఆ స్త్రీల చిత్రాలన్నీ మన పక్కింటివాళ్ళవో,ఎదురింటివాళ్ళవో అన్న అనుభూతి కలుగుతోంది. మీ వ్యాఖ్యానం చాలా బాగుంది ఆవిడ కళకి. ఈ చిత్రాలలో కనీసం ఒక్కటయినా చూసే ఉంటారు అని అన్నారు కదా నిజమే, ఎక్కడో చూసినట్టే అనిపిస్తోంది. మన బ్లాగర్ల బ్లాగులోనే చూసినట్టు జ్ఞాపకం. గుర్తొస్తే మళ్ళీ తప్పకుండా కామెంటాల్సిందే. ఏదేమైనా మీ చిత్రకారుల పరిచయ ధారావాహిక అద్భుతంగా ఉంది.నాకెంతో ఉపయోగకరం కూడా.ఎందుకంటే ఎందరినో చిత్రకారులనీ,చిత్రాలనీ మీ వల్ల తెలుసుకుంటున్నాను కాబట్టి. ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ..

రాజి said...

రసజ్ఞ గారు "శుచి క్రిషన్" గారి పరిచయం బాగుంది
ఆవిడంత అందంగా వున్నాయి ఆవిడ గీసిన చిత్రాలు కూడా..
మంచి చిత్రాలను,చిత్రకారిణిని పరిచయం చేసినందుకు ధన్యవాదములు..

ఎందుకో ? ఏమో ! said...

Nice

?!

Rao S Lakkaraju said...

మగువల చిత్రాలు సున్నితంగా బాగా ఉన్నాయి. పరిచయానికి థాంక్స్.

Anonymous said...

అమ్మాయ్! రసఙ్ఞా
భారతదేశంలో గుర్తింపు పొందని గొప్ప కళాకారులున్నారు. వారిని పేరుపేరునా పరిచయం చేస్తున్నందుకు చాలా అనందంగా వుంది.

మాలా కుమార్ said...

తెలియని కళాకారిణి ని పరిచయం చేసారు . బాగుంది .

మౌనముగా మనసుపాడినా said...

nice

chinni said...

assalu emanna unnayaaandi..aachitraalu....superosuper..:))

జయ said...

ఇంత చక్కటి చిత్రాలు చూస్తూ ఉంటే మనసెటో తేలిపోతుంది. చిత్రకళని తన గుప్పిటిలో కప్పేయగలిగిన శుచి కృష్ణన్ ఎంత అదృష్టవంతురాలో.

voleti said...

మీరు నిజంగా "రసజ్ఞులే".. ఇంత మంచి కళాకారిణిని కి , ఆవిడను పరిచయం చేసిన మీకు జోహార్లు..

రసజ్ఞ said...

@ సుబ్బారావు గారూ
మీ స్పందనకి ధన్యవాదాలు!

@ వనజ వనమాలి గారూ
కళని మెచ్చుకునే మీ మనసుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు!

@ సుభా
కదా! అదే ఆవిడ టాలెంటు మరి! మన బ్లాగర్ల బ్లాగులోనే చూసినట్టు జ్ఞాపకం.నిజమే! ఇదిగో ఆ లింకు http://padma4245.blogspot.com/2011/11/blog-post_30.html మీకు ఉపయోగకరంగా ఉందంటే అంత కన్నా కావలసినది ఏముంది? సరే! నా ప్రయత్నం నేను చేస్తాను. దానిని ఆదరిస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ రాజి గారూ
మీకు నచ్చినందుకు నెనర్లు!

@ ఎందుకో? ఏమో! శివ గారూ
మెచ్చినందుకు థాంక్స్!

@ Rao S లక్కరాజు గారూ
నచ్చి స్పందించినందుకు మీకు కూడా!

రసజ్ఞ said...

@ తాతగారూ
మీ ఆనందం ఇలానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ......నా ప్రయత్నాన్ని కొనసాగిస్తా!

@ మాలా కుమార్ గారూ
నాదేముందండీ! ఆవిడని పరిచయం చేశాను అంతే! ధన్యవాదాలు!

@ తెలుగు పాటలు గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ చిన్ని గారూ
కదా! అందుకే మీ అందరి దృష్టికి తీసుకొచ్చాను! ధన్యవాదాలు!

@ జయ గారూ
చాలా రోజులకి కనిపించారే! అలాంటి వాళ్ళ కళను చూసిన మన కళ్ళు కూడా అంతే అదృష్టం చేసుకున్నాయండీ! ధన్యవాదాలు!

@ voleti గారూ
హమ్మయ్యా! నా పేరుని నమ్మారు ;) మీ స్పందనకి ధన్యవాదాలండీ!

మౌనముగా మనసుపాడినా said...

అయ్యబాబోయి అంత గుర్తుపటేస్తునారు

Nivas said...

Hi Rasagna garu ..
Excellent post ..

Keep introducing the talent like this ..

జ్యోతిర్మయి said...

మన పక్కింటిలోనో ఎదురింటిలోనో చూస్తున్న౦త సహజంగా ఉన్నాయి పైన ఉన్న అమ్మాయిల చిత్రాలు. మరో మంచి చిత్రకారిణిని పరిచయం చేశావు రసజ్ఞా..

రసజ్ఞ said...

@ తెలుగు పాటలు గారూ
మౌనముగా ఉన్నంతమాత్రాన తెలియదు అనుకున్నారా?

@ నివాస్ గారూ
నా రాక్షస ప్రయత్నం నేను చేస్తానండీ! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ జ్యోతిర్మయి గారూ
అదే మరి ఆవిడ గొప్పదనం! ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నా దానిని ఎంతగానో ఆదరిస్తున్నారు మీరందరూ! నెనర్లు!

శోభ said...

రసఙ్ఞగారూ...

మనదేశంలో ఎంతోమంది అత్యద్భుతమైన కళాకారులున్నారు. అయితే గుర్తింపు అనేది కొంతమందికి మాత్రమే వస్తోంది. కళామతల్లి ముద్దుబిడ్డలైన ఇలాంటి అద్భుతమైన కళాకారులు మరుగున పడిపోకుండా మీదైన శైలిలో అందరికీ పరిచయం చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

శుచి క్రిషన్ గారు గీసిన ప్రతి బొమ్మలోనూ కళపట్ల ఆమెకున్న అంకిత భావాన్ని తెలియజేస్తోంది. ప్రతి పెయింటింగ్ ఒక ఆణిముత్యమే. శుచి క్రిషన్ గారికి హ్యాట్సాఫ్.....!!

raf raafsun said...

మనం లేట్ గా వస్తాం గాని లేటెస్టుగా వస్తాం కదా....

మీ పరిచయ టెస్టు -- ఆవిడ బొమ్మలు రెండు బాగున్నాయి....రసజ్ఞ గారు మీకు ఆవిడ కంటే మంచి పేరు వచ్చేట్టు చెయ్యనా? ???? నా నవల పాత్ర భవాని బొమ్మని గీయండి..తన అంత అందంగా ఇంకా ఎవరు పుట్టలేదు..కాబట్టి అందమైన బొమ్మ గీశారని మీకు పేరే... పేరు....ఏమంటారు ? ఆ ?

శ్రేయోభిలాషి
RAAFSUN

Nivas said...

@ రసజ్ఞ గారు ..
మీ సమయానికి ధన్యవాదాలు!-
" నా " ప్రయత్నం చేస్తున్నాను అంటే చాలు కదా అండి

రాక్షస ప్రయత్నం అని వేరే చెప్పాలా

gksraja said...

రసజ్ఞ గారూ! మీరెక్కడ ఎక్కడ నుండి పడతారండి ఇంత మంచివన్ని! అది సరే -- 'శుచి' గారు కళాకారిణి కదా! కళా పోషణ కూడా ఆవిడ మీదే పెట్టేసారేంటండి?
"ఈవిడ కళాపోషణకి మచ్చుతునకలు...."???
ఏమైనప్పటికీ ధన్యవాదాలే ధన్యవాదాలు. రాజా.
gksraja.blogspot.com

చిన్ని ఆశ said...

రసజ్ఞ గారూ!
ఇలా తెలియని ఆర్టిస్ట్ లని చాలా బాగా పరిచయం చేస్తున్నారు. మీకు చిత్రలేఖనంపైన ఉన్న మక్కువకి మా అభినందనలు.

మధురవాణి said...

వావ్.. భలే ఉన్నాయండీ చిత్రాలు. ఎర్రంచు నల్ల చీర కట్టుకున్న అమ్మాయి బొమ్మ నాకు చాలా చాలా నచ్చేసింది. అలాగే, రాజమహల్లో అమ్మాయిలూ కూడా భలే బావున్నారు.
ఇంత చక్కటి చిత్రకారిణి గురించి మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. :)

సుజాత said...

ఈ చిత్రాల లోంచి ఒక చిత్రాన్ని క్రెడిట్ శుచి గారికి ఇస్తూ వాడుకోవచ్చా రసజ్ఞ గారూ?

రసజ్ఞ said...

@ raafsun గారూ
నాకు తెలుసు కదా ఈ విషయం! మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ! మీ అభిమానానికి ధన్యురాలిని నాకు అంత అత్యాస లేదండీ! కనుక మీ భవానీ బొమ్మని నేను వేయలేను!

@ నివాస్ గారూ
హహహ!

@ రాజా గారూ
చాలా కాలానికి కనిపించారే! హహహ మీరు మరీ ట్రూ translation చేయకూడదు సుమండీ! అంటే అక్కడ నా ఈ కవయిత్రి భావం ఏమిటంటే .... ఆ చిత్రాలని పరిశీలనగా చూడండి విభిన్నంగా ఉంటాయి అందుకని అలా వ్రాసా! మీకు నా కృతజ్ఞతలు!

రసజ్ఞ said...

@ చిన్ని ఆశ గారూ
మీ అభినందనలకి ధన్యురాలిని!

@ మధురవాణి గారూ
మీకు నచ్చినందుకు నా నెనర్లు!

@ సుజాత గారూ
పర్మిషన్ ఇవ్వడానికి నేనెవరిని చెప్పండి? వేసింది ఆవిడ నేను కేవలం పరిచయం చేశాను! అసలు మీరెంత మంచి వారండి ఇలా అడిగి మరీ తీసుకుంటున్నారు తప్పకుండాను! మీ స్పందనకి ధన్యవాదాలు!

Anonymous said...

ఓహ్! అద్భుత సేకరణ!!!!!
రసజ్ఞ గారూ!

రుక్మిణిదేవి said...

రసజ్న గారు , అభినందనీయులు ... మంచి ప్రయత్నం .........
సజీవ చిత్రాలు మాకు అందించారు ...

రసజ్ఞ said...

@ అఖిల వనిత గారూ
మేకు నా సేకరణ నచ్చినందుకు ధన్యవాదాలు!

@ రుక్మిణిదేవి గారూ
మీ వ్యాఖ్యకు ధన్యురాలిని!

కెక్యూబ్ వర్మ said...

ఇంత గొప్ప చిత్ర కళాకారిణిని పరిచయం చేస్తూ ఆమె చిత్ర రాజాలను కళ్ళముందుంచిన మీ ప్రయత్నం అపురూపం...ధన్యవాదాలు అన్న మాట చాలా చిన్నది రసజ్న గారు...

రసజ్ఞ said...

@ కేక్యూబ్ వర్మ గారూ
మీ ఈ ప్రోత్సాహకరమయిన వ్యాఖ్యకి కృతజ్ఞతలు!

Deepika Reddy said...

soooooooooo nice vch r here

all d bst

Deepika Reddy said...

9c 2 c ur Blog n u 2 alsooooooooo

Anonymous said...

Hi to every single one, it's genuinely a fastidious for me
to visit this website, it contains priceless Information.

my web site: dating online; bestdatingsitesnow.com,