Wednesday, December 21, 2011

కేళీ విలాసముపలికెను మోహన మురళి
రవళించెను అందెల రవళి

మురళీలోలుని మోహన రాగం
రాధిక హృదిలో రసమయ గానం
రాగ రంజితం రాధిక హృదయం
సంగీత నాట్యాల సంగమం

వెదురు వేణువై పలికిన వేళ
రాధిక మది కదలాడిన వేళ
పరవశించెను యమునా తీరం
ప్రకృతి పురుషుల సంగమ వేళ

అందెల రవళి ఘల్లు ఘల్లున
మురళీ గానం మెల్లగా సాగగా
వేడుక చేసెను బృందావనమున
ఏమని తెలిపెద కేళీ విలాసము 

28 comments:

Anonymous said...

రస హృదయం స్పందిస్తే....

చిన్ని ఆశ said...

రసజ్ఞ గారూ!
వెదురు వేణువై పలికిన వేళ
రాధిక మది కదలాడిన వేళ...
కవిత బాగుందండోయ్. బొమ్మా కూడా మీ కవితకోసమే అన్నట్టుగా....

kalyan said...

ఆహా ...
వదిలినా వదులును అ మోహన రూపుడు మురళిని ....
కాని మీరు కట్టిన విలాస రాగాలను మాత్రము వదలలేడు మైమరచిపోతాడు..

Balu said...

వేణువు పలికినట్టుగా వుందండి పదాల పొందిక..!

వనజ వనమాలి said...

ఇంతకన్నా ప్రేమ విలాసంని... ఎవరు చెప్పగలరు!? సో..స్వీట్ !!!!!

రాజి said...

రసజ్ఞ గారూ! రాధా మాధవ గాధల రంజిలు బృందావనం
మీ శైలిలో బాగుంది..

sandeep said...

మీ బ్లాగ్ బాగుంది.
మీ కవితలు,మీ ఆలోచనా విధానం వైవిధ్యంగా వుంది..

Nice.. :):):)

భాస్కర రామి రెడ్డి said...

కవిత మీరే రాసుంటారు కానీ, ఆ బొమ్మ ఎక్కడ కొట్టేసారండీ :P

జ్యోతిర్మయి said...

అంతా కృష్ణ మాయ...

సుభ said...

పల్లవించినదో ప్రభాతం
రసమయం ఈ మోహన రాగం
మనోజ్ఞ భరితం ఈ మురళీ గానం!!
చాలా బాగుంది రసగుల్లా కేళీ విలాసం....
@ హ హ హ భాస్కర రామి రెడ్డి గారూ భలే అడిగారు. ఐనా మీకు కొట్టుకొచ్చిన బొమ్మలంటే ఇష్టమే కదండీ :) :) :)

తెలుగు పాటలు said...

nice

రసజ్ఞ said...

@ తాతగారూ
హహహ స్పందిస్తే ఇటువంటి ఆలోచనలే వస్తాయి మరి! మీ స్పందనకి ధన్యవాదాలు!

@ చిన్ని ఆశ గారూ
మీకు నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలు. బొమ్మ నిజమేనండీ కావాలని వెతికి వెతికి గాలించి మరీ పెట్టాను.

@ కళ్యాణ్ గారూ
అరె వహ్ ఏం చెప్పారండీ! ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ బాలు గారూ
అంత మనోహరంగా ఉందా? అయితే ఇంకేం శ్రవణానందమే! ధన్యవాదాలు మీ స్పందనకి.

@ వనజ వనమాలి గారూ
మీ వ్యాఖ్యలు కూడా మీ టపాలంత బాగుంటాయి! ధన్యవాదాలు

@ రాజి గారూ
మీకు నా శైలిలో వ్రాసిన ఈ కేళి నచ్చినందుకు కేరింతలు!

రసజ్ఞ said...

@ సందీప్ గారూ
మీకు నా కవితలూ, ఆలోచనా వైవిధ్యం నచ్చినందుకు నెనర్లు!

@ భాస్కర రామి రెడ్డి గారూ
నేనే గీసాను అని అబద్ధం చెప్తే మీకు నచ్చుతుందంటారా? :P అయినా సరే నిజమే చెప్తాను గూగులయ్య ఇచ్చాడు. ధన్యవాదాలు మీ స్పందనకి!

@ జ్యోతిర్మయి గారూ
అంతే కదండీ మరి! ఆ మాయలో పడని వారున్నారంటారా? ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ సుభా
రసజ్ఞ భరితంలో మనోజ్ఞ భరితమైన మురళీ గానం బాగుందండీ! మీకు నచ్చినందుకు నెనర్లు!

@ తెలుగు పాటలు గారూ
థాంక్స్ థాంక్స్!

Zilebi said...

రసమయ రసజ్ఞ 'నారీ' కేళీ విలాసం!
రాధికా కృష్ణ మురళీ లోల మనోజ్ఞం!

చీర్స్
జిలేబి.

శోభ said...

మీదైన శైలిలో బృందావనాన్ని మా ముందుకు తెచ్చారు.... కవిత చాలా బాగుంది రసజ్ఞగారూ.....

Nivas said...

Very nice composition ..
nice post ..
keep it up ..

రసజ్ఞ said...

@ జిలేబీ గారూ
మీ వ్యాఖ్యలోని మాధుర్యాన్ని వర్ణించ తరమా? ధన్యవాదాలు!

@ శోభ గారూ
మీకు నచ్చినందుకు నెనర్లు!

@ నివాస్ గారూ
మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు!

మధురవాణి said...

రాధాకృష్ణ కేళీ విలాసం బాగుందండీ.. :)

రుక్మిణిదేవి said...

nice .............

అనామిక... said...

మీ కవిత చాల బాగుంది. ఆ కవితకి తగ్గట్లుగా ఉంది రాధా కృష్ణుల చిత్రం


అనామిక
http://sakhiyaavivarinchave.blogspot.com/

Sandilya said...

రాధా మాధవుల కేళీ విలాసం ఎంతో బావుందండి. దీన్ని ఎక్కడినుండి గ్రహించారు మీరు. ఏదో పుస్తకంలో చదివినట్టుగా అనిపిస్తోంది. ఆ పుస్తకం ఏదో గుర్తు రావట్లేదు.

జయ said...

ఎంత బాగుందో కవిత. ఈ రాధామాధవులంత అందంగా ఉంది.

రసజ్ఞ said...

@ మధురవాణి గారూ
మీకు నచ్చిందంటే ఆ కృష్ణుడి పలుకే అని భావిస్తాను! ధన్యవాదాలు!

@ రుక్మిణిదేవి గారూ
నచ్చినందుకు నెనర్లు!

@ అనామిక గారూ
మీకు చాలా థాంక్స్ అండీ! కావాలనే వెతికి మరీ పెట్టాను. మీకు కూడా నచ్చినందుకు ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ Sandilya గారూ
ఇది సేకరణ కాదు! నా స్వీయ రచన! రాధ పంచాధ్యాయీ అని భాగవతంలో దశమస్కంధంలో రాసక్రీడల గురించి వివరించారు. అది చదివినప్పుడు నాకు ఇలా రాయాలన్న ఆలోచన కలిగి ఇలా వ్రాశాను.

@ జయ గారూ
మీకు నచ్చినందుకు నా ధన్యవాదాలు!

Ganesh said...

:)

రసజ్ఞ said...

@ Ganesh గారూ
థాంక్స్!