ఇవాళ మరొక గొప్ప కళాకారిణితో మీ ముందుకి వచ్చాను. ఈవిడ జనాలకి తెలియకపోయినా ఈ చిత్రాలలో కనీసం ఒక్కటయినా అందరూ చూసే ఉంటారు. ఈవిడ పేరు శుచి క్రిషన్.
ఈవిడ చిత్రకళలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన సర్ల చంద్ర గారి మనవరాలు. చిన్ననాటినుండి చిత్రకళా వాతావరణంలో పెరిగిన ఈవిడ కూడా ఆ కళ మీద మక్కువ పెంచుకున్నారు. ప్రపంచంలోని అందాలకి సున్నితమయిన రంగులతో జీవం పోయాలని నిర్ణయించుకున్నారు. ఈవిడ చిత్రాలకి కుటుంబీకులతో పాటు జర్మన్ చిత్రకారుల స్ఫూర్తి కూడా తోడయ్యింది అని చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది.
తన తొలి అడుగును చుట్టూ ఉన్న పరిసరాలతో వేయాలని నిశ్చయించుకున్న ఈవిడ సొంత ఊరు ఢిల్లీ కావడంతో రాజస్థాన్ వాసులు ఈవిడ దృష్టిని ఆకట్టుకున్నారు. కనుక వారి చిత్రాలతో చిత్రకళను మొదలుపెట్టారు. మరుగున పడిపోతున్న శిల్పకళ, భవనాలు, కట్టడాలు అన్నీ ఈవిడ చిత్రాలలోని అంశాలు. రాజభవనాలు, హవేలీలు, స్తంభాలు, ఆలోచనలలో మునిగి ఉన్న స్త్రీలు, మొదలయినవన్నీ చిత్రాలుగా రూపొందించటం ఈవిడకి చాలా ఇష్టం.
ఢిల్లీ పబ్లిక్ స్కూలులో (1976 - 1983) చదువుతున్నప్పుడు మొదటి సారిగా చిత్రాలు వేయటం ప్రారంభించిన ఈవిడ 1983 లో ఈవిడ +2 (మన పరిభాషలో ఇంటరు) పూర్తయ్యేసరికి ఈవిడ చిత్రాలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అకాడమిక్ బోర్డు ద్వారా చిలె, నైజీరియా మొదలయిన చోట్ల ప్రదర్శనలకి ఎంపికయ్యాయి. ఈ ఉత్సాహంతో ఆవిడ Delhi College of Fine Arts లో చేరి 1986 కి ఆ చదువు పూర్తయ్యేసరికే ఇరాక్లో జరిగిన paintings exhibition లో ఈవిడ చిత్రాలు వీక్షకుల మనసు దోచుకున్నాయి. వాటిల్లో ముఖ్యమయినదే ఈ చిత్రం.
ఆ తరువాత ఎన్నో దేశాలలో చిత్ర ప్రదర్శనల్లో సుస్థిర స్థానాన్ని పొందిన ఈవిడ చిత్రాలు ఎన్నో గొప్ప గొప్ప బహుమతులను తెచ్చిపెట్టాయి. ఆయిల్ మరియు వాష్ painting లో చేయి తిరిగిన ఈవిడ ప్రస్తుతం ఢిల్లీలో శిక్షణా తరగతులను నడుపుతున్నారు. ఆవిడ చిత్రాల గురించి Asian Spirit-Nationality and Tradition [KOREA] మరియు Artists of the Twentieth Century [U.S.A.] అనే పుస్తకాలలో మరింత వివరంగా చదవచ్చు. మరణిస్తున్న ఒక భారతీయ కళని కాపాడాలన్న తపనతో మొదలుపెట్టిన ఈ చిత్రకళ నా జీవితంలో ఒక చోదక శక్తిగా మారింది అని, రాజా రవి వర్మ చిత్తరువులను ఆరాధిస్తాను అని ఆవిడ చాలా సందర్భాల్లో చెప్పారు. అందువలన ఈ కళ మరుగున పడకుండా, మరణించకుండా తన వంతు కృషి ఆవిడ చేసినప్పటికీ తన కుమారుని కూడా ఇదే బాటలో నడుపుతున్నారు. ఇటువంటి కళాకారులెందరో మన భారతదేశంలో..............
ఈవిడ గీసిన మగువల చిత్రాలను చూడండి.....
ఈవిడ గీసిన రాజస్థానీ మగవారి చిత్రాలు......
ఈవిడ కళాపోషణకి మచ్చుతునకలు....
ఈవిడకి అత్యంత ఇష్టమయిన కళలను కుంచెతో రూపొందించిన తీరు..........
|
The Last Door of Notre Dame, Paris |