Thursday, January 12, 2012

పండుగ కబుర్లు ౧


సంక్రాంతిలో "సం" అంటే మంచి లేదా మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చే పండుగ కనుక దీనిని "సంక్రాంతి" అని అంటారని పురాణాలలో ఉంది. ఈ ఒక్క పండుగ మాత్రమే నెలంతా చేసుకుంటాము. ఈ నెల రోజులూ కూడా కోనసీమ పల్లెటూర్లల్లో ఎంతో కోలాహలంగా ఉంటుంది. 


నింగిలోని తారలన్నీ వాకిట్లో చుక్కల పరుపు వేయగా
మెరుపులన్నీ ఆ చుక్కలని కలిపి ముగ్గుల దుప్పటీ కప్పెను
పౌష్యలక్ష్మి ఆ ముగ్గులోని గొబ్బెమ్మగా మారి
గుమ్మడి పూలతో అలంకరించుకుని
 ఆ శ్రీహరి కోసం ఎదురుచూడసాగెను 




తుంబుర నారదులు కరములలో తాళం వేయగా
నటరాజు కాలి అందియలలో ఘల్లు ఘల్లు మనగా
త్యాగయ్య, గోపన్నాదులు గళములో శ్రుతి కలుపగా
ముక్కోటి దేవతలు విరులుగా మెడలో నాట్యములాడగా
సూర్య భగవానుడు పారాణిగా రంగును అద్దగా
భూదేవి అక్షయపాత్రగా మారి సిగను చేరగా
ఊర్ధ్వ పుండ్రాలతో పీతాంబరాలతో భక్తి పారవశ్యంతో
శ్రీమద్రమారమణ గోవిందో హరి అంటూ వచ్చెను శ్రీ హరి


ఈ పండుగలో ముఖ్యమయిన వాటిల్లో ముందుగా ఈ టపాలో ముగ్గులు, హరిదాసు గురించి ముచ్చటించుకుందాం.

సంక్రాంతి ముగ్గులు:

పూర్వం లక్ష్మీదేవి... పేదలకు వరాలిస్తూ అస్పృశ్యుల ఇండ్లలోకి ప్రవేశించిందట. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణతో ఆమెను వెలివేశాడట. దీంతో లక్ష్మీదేవి ఏ విధమైన చింతా లేకుండా ఈ మార్గశిర, పుష్య, ధనుర్మాసాల్లో.. మరింత మంది పేదల ఇళ్ళకు వెళ్లి వరాలు ఇవ్వడం ప్రారంభించిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే ధనుర్మాసంలో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇంటి ముంగిట ప్రతీ ఒక్కరూ పోటీ పడి, వారి నైపుణ్యమంతా జోడించి మరీ ముత్యాల ముగ్గులు, చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు, గీతల ముగ్గులు ఇలా ఎన్నెన్నో కలబోసి రంగు రంగుల ముగ్గులు పెడతారు. ఈ ముగ్గులు కూడా ఏది పడితే అది పెట్టకూడదు.



భోగి రోజున భోగి కుండలతో లేదా చెఱకు గడలతో లేదా గాలిపటాలతో లేదా గంగిరెడ్లతో లేదా హరిదాసులతో నిండిన ముగ్గుని వేయాలి. 



పెద్ద పండుగయిన సంక్రాంతి నాడు దార్ల ముగ్గు వేయాలి. ఈ రోజున అన్ని వైకుంఠ ద్వారాలూ  తెరుచుకుంటాయని, ఈ రోజున మరణించిన వారు సరాసరీ వైకుంఠానికే వెళతారని చెప్తారు. కనుక  దానికి  ప్రతీకగా  ముగ్గు మధ్యనించి అన్ని వైపులా ద్వారాలను తీస్తున్నట్టు ఈ దార్ల (ద్వారాల) ముగ్గు పెడతారు.


ఇహ కనుమ నాడు రథం ముగ్గు వేయాలి. ఈ రోజున సంక్రాంతి పురుషుడిని (అనగా ఈ పండుగని)  చక్కగా ముత్యాల పల్లకీలో పంపడానికి ఏర్పాట్లు చేస్తాము. అందుచేత ఈ రోజున రథం మన ఇంటి వైపు వస్తున్నట్టు వేయాలి.

ముక్కనుమ నాడు కూడా రథం ముగ్గే వేయాలి. ఈ సంక్రాంతి పురుషుడు మనమిచ్చిన ఆతిధ్యాన్ని అంతా స్వీకరించి చక్కగా ఈ పల్లకిలో తిరిగి వెళిపోతాడు కనుక రథం మన ఇంటినుంచి బయలుదేరినట్టు వేయాలి. తరువాత రోజున ఆ రథాన్ని సాగనంపాలి. దీనినే రథం ఈడ్చటం అంటారు. 

ఈ మాసంలో ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళని పెట్టి పూజించడం  మన ఆచారం.

హరిదాసు:

సంక్రాంతి శోభ ఈయనతోనే వస్తుంది. హరి దాసు అంటే హరికి దాసుడు అని కనుక ఈ పేరు వినగానే నాకు నారద మునీంద్రులే కళ్ళ ముందు మెదులుతారు. హరిదాసులు మూడు రకాలుట. మొదటి రకం వారు హరికధ అనే ప్రక్రియ ద్వారా శ్రీహరి గాధలని వ్యాప్తి చేస్తూ ఉంటారు. రెండవ రకం వారు హరిదీక్షను తీసుకుని భజన, గానం, నృత్యాలు చేస్తూ హరి నామాన్ని వ్యాప్తి చేస్తారు. మూడవ రకం వారు హరినామ సంకీర్తన చేయుచూ కార్తీకమాసము మరియు సంక్రాంతి సమయాల్లో గ్రామములలో భిక్షాటన చేసేవారు. మనకి పండుగ సమయములో కనిపించేది ఈ మూడవ రకం వారు.  హరిదాసు వాయించే సంగీత వాయిద్యాన్ని బట్టి వీరు తుంబుర హరిదాసు, గంట హరిదాసు, చిడతల హరిదాసు, కొమ్మ హరిదాసు అని పిలుస్తారు. మనకి ఎక్కువగా కనిపించే హరిదాసుల చేతుల్లో తుంబుర, చిడతలు తప్పనిసరిగా కనిపిస్తాయి. ఏక భుక్తం (ఒంటి పూట భోజనం చేయటం), అథః శయనం (క్రింద లేదా నేల మీద పడుకోవటం), శీతల స్నానం (చన్నీటితో స్నానం చేయటం), బ్రహ్మచర్యం (మనసా, వాచా కర్మణా) పాటిస్తూ సర్వావస్థలలోనూ ఆ భగవంతునికే దాఖలు పడుతూ భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో అకుంఠిత దీక్షతో ఉండే హరిదాసుని తలుచుకోగానే నాకు అన్నమాచార్య కీర్తన గుర్తుకువస్తుంది.

ప|| అన్నిటాను హరిదాసు లధికులు |
కన్నులవంటివారు కమలజాదులకు ||

చ|| అందరును సమమైతే నరుహానరుహము లేదా |
అందరిలో హరియైతే నౌగాక |
బొందితో విప్రునిదెచ్చి పూజించినట్టు వేరే |
పొందుగాని శునకము బూజింపదగునా ||

చ|| అన్నిమతములు సరియైతేను వాసిలేదా |
చెన్నగుబురాణాలు చెప్పుగాక |
యెన్నగ సొర్ణాటంక మింతటాను జెల్లినట్లు |
సన్నపుదోలుబిళ్ళలు సరిగా జెల్లునా ||

చ|| గక్కున బైరు విత్తగా గాదము మొరచినట్లు |
చిక్కినకర్మములెల్లా జెలగెగాక |
తక్కక శ్రీవేంకటేశు దాస్యమెక్కుడైనట్టు |
యెక్కడా మోక్షోపాయమిక జెప్పనున్నదా ||

అందమయిన రంగవల్లుల మధ్యలో గొబ్బిళ్ళను పెట్టి భక్తితో హరిని కీర్తిస్తే సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడనీ, ఆయన తల మీద గుమ్మడికాయ ఆకారములో ఉండే అక్షయపాత్ర మన భూమికి సంకేతమని జనుల విశ్వాసం.

అక్షయపాత్ర విశిష్టత:
అక్షయము అనగా ఎప్పుడూ నిండుగా ఉండేదని అర్ధం. ఈ పాత్రను శ్రీమహావిష్ణువు సూర్యభగవానుడికి ఇచ్చాడనీ దానినే పాండవుల వనవాస సమయంలో ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇచ్చాడనీ తదుపరి ధర్మరాజు పట్టాభిషేక సమయంలో ఈ పాత్రను ఎవరికి అందించాలన్న ప్రశ్నకు కృష్ణుడు బదులుగా వేయిగంటల మండపాన్ని కట్టించి బ్రాహ్మణులకు భోజనం పెట్టమని ఆ సమయంలో గంటలు మ్రోగినప్పుడు వారికే ఇవ్వమని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆ ప్రకారం ధర్మరాజు బ్రాహ్మణులకు భోజనం పెట్టినా గంటలు మ్రోగకపోవడంతో ధర్మరాజు శ్రీకృష్ణున్ని ప్రార్ధించగా చాత్తాది శ్రీవైష్ణవునకు భోజనం పెట్టమని సూచిస్తాడు. చాత్తాది శ్రీవైష్ణవుడు తాను భోజనం చేయనని స్వయంపాకం ఇమ్మని కోరగా ఆ ప్రకారం అతడు స్వయంపాకాన్ని తీసుకువెళ్ళి వండి గోదాదేవీ సహిత శ్రీకృష్ణమూర్తిని అర్చించి నివేదన చేసి అప్పుడు అతను భుజించగా గంటలు మ్రోగుతాయి. అప్పుడు ధర్మరాజు అక్షయపాత్రను చాత్తాది శ్రీవైష్ణవునకు ఇచ్చినట్లు నాటి నుండి వారే హరిదాసులుగా వంశపారంపర్యంగా కులవృత్తిగా ఈ అక్షయపాత్రను ధరించి గ్రామసంచారం చేస్తున్నట్లు పురాణ కథనం. ధనుర్మాసం నెలరోజులూ సూర్యోదయానికి మునుపే శ్రీకృష్ణ గోదాదేవీలను అర్చించి తిరుప్పావై పఠించి అక్షయపాత్రను ధరించి గ్రామ సంచారం ప్రారంభిస్తారు. గ్రామ సంచార ప్రారంభం నుంచి తిరిగి వచ్చేవరకు హరినామ సంకీర్తన తప్ప ఇతరులతో సంభాషణ చేయడంకానీ, అక్షయపాత్ర దింపుట కానీ చేయరు. ఇంటికి చేరిన పిదప ఇల్లాలు పాదాలు కడిగి అక్షయపాత్ర ఆమె దింపి అందులోని పదార్ధములతోనే వండి నైవేద్యం పెడుతుంది.
ఈ టపా వ్రాసినది రసజ్ఞ. చదువుతూనే ఉండండి మరికొన్ని సంక్రాంతి విశేషాల కోసం.  

21 comments:

జ్యోతిర్మయి said...

రసజ్ఞ పండుగ గురించి చక్కగా వివరించావు..ముగ్గులు బావున్నాయి.

బులుసు సుబ్రహ్మణ్యం said...

సంక్రాతి శోభ మీ టపాతో వచ్చేసింది.

రాజ్యలక్ష్మి.N said...

రసజ్ఞ గారూ.. సంక్రాంతి ఆచారాల గురించి,
ముగ్గులు,గొబ్బెమ్మల గురించి చక్కగా చెప్పారండీ..
మీరు సంక్రాంతి నాడు దార్ల ముగ్గు అనే దాన్ని మేము పీటల ముగ్గు అంటాము.
మీ కోనసీమ సంక్రాంతి కళ అంతా ఇక్కడికి తీసుకు వస్తున్నారన్నమాట..

Lasya Ramakrishna said...

సంక్రాంతి గురించి చాలా చక్కగా వివరించారు.

♛ ప్రిన్స్ ♛ said...

balee chepparee

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా బాగా చెప్పావు తల్లీ! మరచిన సంక్రాంతి మళ్ళీ ముంగిళ్ళ లోకి వచ్చినట్లు.. ఉంది.

సుభ/subha said...

టింగ్..టింగ్.. బ్రేక్ తర్వాత... మళ్ళీ ఎప్పుడు?

భారతి said...

మా చిన్నప్పటి సంక్రాతి సంబరాలను గుర్తుకుతెచ్చావు రసజ్ఞ. ఈ సంక్రాంతి నీకు సం'క్రాంతి'ని తీసుకురావాలని కోరుకుంటూ..... శుభాభినందనలు!

Anonymous said...

రసఙ్ఞ గారూ....
మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నాకైతే రంగురంగుల గుడ్డలు వేసుకుని వచ్చే హరిదాసును చూడటమంటే మహా ఇష్టం. సినిమాల్లో నారదుణ్ణి చూసి చూసీ ఇతనే నారదుడు కాబోలు అనుకునేవాడిని.

Unknown said...

పండుగ అంతా కళ్ళముందు నిలిపారు. ఇవన్నీ ఇప్పుడు కనుమరుగయిపోవటం మనమే కలిపంచుకున్న దురదృష్టం, ముగ్గుల వీదుల్లో తిరిగే హరిదాసులూ, కొత్త బట్టలతో కేరింతలు కొడుతూ ఆడుతు పాడుతు చిన్నిపిల్లలు...అంతా ఇప్పుడు గతం, పుస్తకాల పరిమితం.
చాలా చక్కగా పండుగ విశేషం, మంచి ముగ్గులతో సహా చూపించారు.
సంక్రాంతి శుభాకాంక్షలు....

Kranthi M said...

రసజ్ఞగారూ మీకూ సంక్రాంతి శుభాకాంక్షలండీ. పండుగ గురించి చాలా చక్కగా వివరించారు.

వంశీ కిషోర్ said...

చాలా బా రాసారు :)

రసజ్ఞ said...

@ జ్యోతిర్మయి గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు! ఇందులో దార్ల ముగ్గు మన సఖియా వివరించవే బ్లాగర్ అనామిక గారిది. మిగతా రెండూ నేను వేసినవే. ఇక్కడ మాకు ముగ్గు దొరకదు కనుక బియ్యపుపిండితో వేసాను.

@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
ఇంకా ఉందండీ మొత్తం క్రాంతి రావాలి కదా! ధన్యవాదాలు

@ రాజి గారూ
అవునా? పీటల ముగ్గు అంటే ఇదేనా? పేరు విన్నా కాని ఎలా ఉంటుందో తెలియదు. అవునండీ మీరు కోనసీమ చూడలేదు అన్నారు కదా! వచ్చినప్పుడు పండగ ఉంటుందో ఉండదో అని నేనే మీ ముంగిట్లోకి తీసుకుని వచ్చాను. ధన్యవాదాలు!

@ లాస్య గారూ
మీకు నచ్చిందుకు ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ తెలుగు పాటలు గారూ
భలే భలే మీకు నచ్చిందా? ధన్యవాదాలు!

@వనజ వనమాలి గారూ
మీ ముంగిట్లోకి తీసుకురాగాలిగాను అనమాట! నా ప్రయత్నం ఫలించినట్టే! నెనర్లు మీ స్పందనకి!

@ సుభ
వస్తుంది వస్తుంది ఇంత తొందరయితే ఎలా?

@ భారతి గారూ
అయితే ఒకసారి చిన్నతనంలోకి వెళ్ళి వచ్చారనమాట! ధన్యవాదాలు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!

రసజ్ఞ said...

@ అరుణ్ గారూ
హహహ అవునా? అయితే సేం పించ్. నేను కూడా చిన్నప్పుడు ఇలానే అనుకునేదానిని నారదుడు ఇక్కడకి వచ్చాడే అని? సినిమాల ప్రభావమండీ! ధన్యవాదాలు!

@ చిన్ని ఆశ గారూ
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. చక్కగా చెప్పారు ఇంకా మిగతా పండుగ కబుర్లతో మీ ముందుకు వస్తాను! ధన్యవాదాలు!

@ క్రాంతి కుమార్ మలినేని గారూ
మీకు నచ్చినందుకు మరియు శుభాకాంక్షలకు ధన్యవాదాలండీ!

@ వంశీ కిషోర్ గారూ
మీకు నచ్చినందుకు నెనర్లు!

Anonymous said...

మీకూ సమ్యక్+క్రాంతి శుభకామనలు

Kalyan said...

@రసజ్ఞ గారు సంక్రాంతి గురించి చక్కగా వివరించారు. నాకు చిన్నపటినుంచి నచ్చేది అ బుజ్జి గొబ్బెమ్మ గారు :) . ఇప్పటికి తెలుసుకున్న దాని కథ కమా మిషు . సంక్రాంతి గురించి చక్కగా దానిపై ఆసక్తి పుట్టించేలా చెప్పారు ఇలానే కొనసాగించాలని కోరుకుంటూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు .

తెలుగు సంక్రాంతి చూడండి చూడండి
హరిదాసు కాలక్షేపము వినరండి వినరండి
ముంగిట ముగ్గులు వేయండి వేయండి
రంగులు బాగా అద్దండి అద్దండి
పండగ నాడు హరికధలు వినండి
మర్చిపోకుండా రసజ్ఞ బ్లాగును చూడండి
వింతలు కావండి విశేషాలు కావండి
మరచిన సంస్కృతికి సరికొత్త సాక్ష్యమండి
సంప్రదాయాలకు చక్కని స్నేహమండి...

మాలా కుమార్ said...

సంక్రాంతి శుభాకాంక్షలు .

BlueCloud said...

చాలా బాగుంది అండీ మీ వివరణ. మీరు ఈ knowledge ఎక్కడ gain చేసారు? నాకు ఇలాంటివి తెలుకోవాలి అని చాలా interest.

రసజ్ఞ said...

@ తాతగారూ
ధన్యవాదాలు!

@ కళ్యాణ్ గారూ
పోనిలెండి ఇప్పటికన్నా తెలుసుకున్నారుగా! సంతోషం! అరే చక్కని కవిత అల్లేసారే! బాగుంది బాగుంది మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు!

@ మాలా కుమార్ గారూ
ధన్యవాదాలండీ!

@ Blue Cloud గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు! ఇవన్నీ నేను చిన్నప్పటినుండి విని, చదివి తెలుసుకున్నవే!

Anonymous said...

each time i used to read smaller articles that also
clear their motive, and that is also happening with this piece of writing which I am reading at this time.


Take a look at my web site; dating online (bestdatingsitesnow.com)