Sunday, December 04, 2011

కత్తి పట్టిన రాముడు

రాముడేమిటి కత్తి పట్టడమేమిటి?అని భ్రుకుటిని బిగించి అలా కోరికేసేలా చూడకండి మరీను! పరశురాముడు అనుకుంటున్నారేమో కాదు ఈయన కత్తిరాముడు.

ఈయన పేరు ఎమ్. రామ సురేశ్. ఈయన కత్తితో చిత్రాలను గీయడంలో నేర్పరి. అంతరించిపోతున్న మన సంస్కృతి, సాంప్రదాయాలను తన చిత్రాలలో బంధించి, మరుగున పడకుండా కాపాడుకోవడానికి ఈ కళాకారుడు వాడిన ఆయుధం కత్తి. ఈయన కళ అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలకూ చేరాలనే ఉద్దేశ్యంతో యావత్ భారతదేశం అంతటా ప్రయాణం చేసి ప్రజల దైనందిక జీవన విధానానికి ఒక చిత్ర రూపం ఇచ్చారు. ఈయన చిత్రాలను గమనిస్తే, వ్యక్తుల ముఖ కవళికల కన్నా వారి శరీర భాష (body language) మరియు భంగిమలకి ప్రాధాన్యతని ఇచ్చినట్టు అనిపిస్తుంది. 

ఈయన మే 27, 1979 లో చెన్నై, తమిళనాడులో జన్మించారు. ఈయన BFA (Bachelor of Fine Arts, Painting, 1997)ని, MFA (Master of Fine Arts,Painting, 2000)ని చెన్నై ప్రభుత్వ fine arts కళాశాలలో పూర్తి చేశారు. NDTV  ఈయనతో జరిపిన ముఖా ముఖీ చూడండి. 

The Color of Nature అనే పేరుతో ఆయన చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఎంతో ప్రజాదరణ పొందింది. దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలు మీ కోసం 

Postcards from India అనే పేరుతో ఆయన తరువాత ప్రయత్నం ఎనలేని కీర్తిని గడించింది. గ్రామీణ, జానపద జీవన విధానాలను ఎంతో అద్భుతంగా ఇందులో చూపించారు. దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలు


జీవాన్ని చూపించే ప్రయత్నంలో ఆయన గీసిన మరికొన్ని చిత్రాలు. కుంచెతో అందముగా చిత్రాలను మలిస్తేనే అబ్బురపోయే నేను ఈయన ఇవన్నీ కత్తితో ఇంత అందంగా ఎలా వేయగాలిగారా అని ఆశ్చర్యచకితురాలినయ్యాను. ఈయన వేసిన వాటిల్లో నాకు నచ్చిన మరికొన్ని చిత్రాలు 


33 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

చాలా బాగున్నాయి రసజ్ఞ గారు,
వీటిలో ఎక్కువభాగం హిందీ/గుజరాతీవారి వస్త్రధారణ లాగా ఉంది.

తెలుగు పాటలు said...

అబ్బో మీ సేకరణలు సూపర్

జ్యోతిర్మయి said...

కాదేదీ కళ కనర్హం అనాలేమో..కత్తితో ఏదో కూరగాయలు కోసుకుంటాం, పండ్లు కోసుకుంటాం..అప్పుడప్పుడూ పీకలు కోసేస్తుంటాం. ఇలా బొమ్మలు...
భలేగా ఉందే..ఆ కోనేటిగట్టు చిత్రం అయితే మరీనూ. ఈ బొమ్మలకి కొంచెం సిగ్గు ఎక్కువనుకుంటాను. ఇంకో మంచి చిత్రకారుణ్ణి పరిచయం చేసావు రసజ్ఞా, ధన్యవాదాలు.

Disp Name said...

మంచి రసజ్ఞుడే, కత్తి పట్టిన రాముడు. విశేషం బెట్టిదన, 'నీ మున్నాలే పోనా నా పినాలే వారెన్' అన్నట్టు మెజారిటీ చిత్రాల సొగసు వెనుకనుంచి అలంకరించడం!

రెండు మీరు పరిచయం చేసే ఆర్టిస్టులు మెజారిటీ గా మద్రాసు నించే రావడం. మద్రాసు నగరం ఈ ఆర్టిస్టులకు మదరసా లాగున్నది !

చీర్స్
జిలేబి.

కృష్ణప్రియ said...

అన్ని బొమ్మలూ చాలా బాగున్నాయి. మొదట కత్తి తో అని కాన్షియస్ గా చూసి, తర్వాత, కిందకి వస్తున్న కొద్దీ, మర్చిపోయేలా ఉన్నాయి.. సూపర్బ్.

రాజ్యలక్ష్మి.N said...

అరుదైన చిత్రాలను సేకరిస్తారండీ మీరు..
మంచి చిత్రకారుడి పరిచయం చేశారు.
చాలా బాగున్నాయి.

KumarN said...

WOW!. Unbelivably beautiful!
As you said rightly, he captured a "moment" versus capturing the beauty!

వనజ తాతినేని/VanajaTatineni said...

Great Artist.. chitraalu chaalaa baagunnaayi. Thank you RasaGnaa ..

Rao S Lakkaraju said...

Great Artistry. Thanks for posting.

రసజ్ఞ said...

@ మందాకిని గారూ
ధన్యవాదాలు! ఆయన ప్రపంచమంతా తిరగడంలో ఆయన మనసుని అవి ఎక్కువ శాతం దోచుకున్నాయేమో మరి!

@ తెలుగు పాటలు గారూ
నా సేకరణ నచ్చినందుకు ధన్యవాదాలు!


@ జ్యోతిర్మయి గారూ
అవునండి సిగ్గు కాస్త ఎక్కువనే చెప్పాలి మరి! నాకు తెలిసిన వాళ్ళని ఇలా పరిచయం చేయడం వల్ల, మీ అందరి ఆదరణ వల్ల, వాళ్ళ కళ వెలుగులోకొస్తుంది అని చిన్న ఆశ! నెనర్లు!

రసజ్ఞ said...

@ జిలేబీ గారూ
రసజ్ఞ కంటికి అందరూ రసజ్ఞులే! మన రాముని కంటికి వెనకనించి అందం కనిపించిందేమో! మద్రాసు నగరం ఈ ఆర్టిస్టులకు మదరసా లాగున్నది ! హహహ కాదులెండి! నాకు తెలిసిన వాళ్ళని పరిచయం చేస్తున్నాను. నేను అక్కడ కొంతకాలం ఉండటం వల్లనూ, paintings మీద ఉన్న ఆసక్తి వల్లనూ ఇలా వీళ్ళు తెలిసారు అంతే! మిగతా వాళ్ళు కూడా వస్తారు!

@ కృష్ణప్రియ గారూ
కదా! ఎంత బాగా వేసేసారో! మీ స్పందనకి ధన్యవాదాలు!

@ రాజి గారూ
నాకదో ఆసక్తి అండి! మీ అందరికీ ఇలా నచ్చడం నాకు చాలా సంతోషంగా ఉంది!

@ తాతగారూ
:):):) మీ ఆశ్చర్యానికి, స్పందనకి ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ Kumar N గారూ
ధన్యవాదాలు మీకు నచ్చినందుకు, నా భావంతో ఏకీభవించినందుకు!

@ వనజ వనమాలి గారూ
నచ్చినందుకు మీకు కూడా నెనర్లు!

@ Rao S లక్కరాజు గారూ
మీకు నచ్చినందుకు, మెచ్చినందుకు ధన్యవాదాలు!

PALERU said...

కత్తి తో పెయింటింగ్ వేసే ఆయన టాలెంట్ ...అవి మాకు అందుబాటులో ఉంచినా మీ అభిరుచి .....వెరసి టపా అందమైన హైదరాబాది బిర్యాని లా ఉంది..ధన్యవాదాలు......

ఒక ప్రశ్న : ఈయన మీకు ఏమి అవుతారు ? దహ ( దరహాసం), పక పక ( నవ్వు ), కిచ కిచ ( చిలిపి నవ్వు ), హ హ హ ( వికట్ట హాసం) :):):)

శ్రేయోభిలాషి
RAAFSUN

శోభ said...

కత్తితో బొమ్మలు గీస్తారా.. అని ఆశ్చర్యపోతూ ఈ పోస్టు చదవటం ప్రారంభించా. తరువాత పోస్టును చదవటంకంటే, ఫొటోలనే చూస్తూ చాలాసేపు గడిపేశాను. ఎంత చక్కగా గీశారాయన. ముఖ్యంగా గ్రామీణ, జానపద జీవనాలను కళ్లకు కట్టినట్లుగా ఎంతో సహజంగా గీసిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంత మంచి కళాకారుడి గురించి తెలియజేసినందుకు రసజ్ఞగారికి ధన్యవాదాలు..

ఇవ్వాళే మీ బ్లాగు చదవటం ప్రారంభించాను.. టైం చూసుకుని అన్ని పోస్టులూ తప్పకుండా చదువుతాను.

Anonymous said...

Rasagna,

The paintings are exquisite. Thanks for introducing another good artist.

రసజ్ఞ said...

@ raafsun గారూ
హైదరాబాది బిర్యాని కెవ్ ఇంకేం తృప్తిగా హాయిగా ఆస్వాదిస్తూ కానిచ్చేయండి. మీ స్పందనకి నా ధన్యవాదాలు!
ఈయన మీకు ఏమి అవుతారు ? తెలియదు కాని నేను ఆయనకున్న వేల అభిమానులలో ఒకదానిని అంతే. మనలాంటి సామాన్యమయిన జనం మధ్యన ఉండే ఒక అసామాన్యమయిన కళాకారుడు ఆయన.

@ శోభ గారూ
తప్పకుండా! నా ఈ ప్రయత్నం నచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు!

@ మూర్తి గారూ
ఆదరించే వాళ్ళు ఉండాలే కాని నాకు తెలిసిన కొద్ది మందిని మీ అందరికీ ఇలా పరిచయం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది! నెనర్లు మీ స్పందనకి!

ఆ.సౌమ్య said...

ఏంటి, నిజమే! ఇవన్నీ కత్తితో గీసారా.... unbelievable...fantastic!

ఇంత మంచి కళాకారుడిని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు రసజ్ఞగారూ!

పూర్ణప్రజ్ఞాభారతి said...

ఈ చిత్రకారుడు అడ్రస్సో ఈమెయిల్ అడ్రస్సో ఇస్తే ఇంకా బాగుండేది. గతించిన నా కుమార్తె బొమ్మ గీయించుకుందామనుకుంటున్నా. మీకెవరికైనా అడ్రస్సో, ఈమెయిలో తెలిస్తే mahamaya@india.com కో csrkraju@gmail.com కో పంపండి ప్లీజ్.

Anonymous said...

Rasagna garu,

chala baga vivarana icharu...

Maaku mee valla teliyani vishyalu.... telisina gamaninchani vishyalu..
kontha mandi pramukhula vishyalu.... ila chaala telusthunnay andi..

meeku kruthagnathalu andi :)
keep going on :)

Rao S Lakkaraju said...

ఈ చిత్రాలలో చొక్కా పరికిణీ వేసుకుని ధ్యానముద్రలో కూర్చుని ఉన్న అమ్మాయి పైన్టింగ్ మా వాళ్ళ డ్రాయింగ్ రూం లో ఉంది. మద్రాస్ లో కొన్నారు. చిత్రాలు డ్రాయింగ్ రూం లోకి లివింగ్ రూం లోకి అలంకరించటానికి చాలా బాగుంటాయి.

శశి కళ said...

యెంత చక్కని పోస్ట్....ఏంత చక్కని బొమ్మలు....
మీ ప్రయత్నం చాలా బాగుంది.

జయ said...

చిత్రకళ ఒక అద్భుతం. దాన్ని ఎంతో అపురూపంగా ఘనతతో సాధించిన ఈ కత్తిరాముడు తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఇంత చక్కని బొమ్మలు చూపిన మీకు కృతజ్ఞతలు.

రసజ్ఞ said...

@ సౌమ్య గారూ
నిజ్జంగా నిజమండీ! ధన్యవాదాలు మీకు నచ్చినందుకు!

@ పూర్ణప్రజ్ఞాభారతి గారూ
మీకు మెయిలు చేసానండీ!

@ అజ్ఞాత గారూ
మీకు నా నెనర్లు!

రసజ్ఞ said...

@ Rao S లక్కరాజు గారూ
అవునండీ! కళ అన్నది ఏదయినా మనసుని ఆకట్టుకున్తునే ఉంటుంది! చూసే దృష్టి ఉండాలే కాని! నిజమే ఇలాంటి వాటిని పెడితే చాలా అందం వస్తుంది! ధన్యవాదాలు మీ స్పందనకి!

@ శశికళ గారూ
చాలా కాలానికి కనిపించారు! ధన్యవాదాలు మీ ప్రోత్సాహానికి!

@ జయ గారూ
మీరు కనిపించి కూడా చాలా రోజులయింది! ఆయన గురించి చక్కని వ్యాఖ్యానం చేశారు! ధన్యవాదాలు!

పూర్ణప్రజ్ఞాభారతి said...

రసజ్ఞ గారు, మీ మెయిల్ అందింది. ధన్యవాదాలు. కత్తి రాముని అడ్రస్సుతో పాటు మరో చిత్రకారుడు ఇళయరాజాగారి చిరునామా కూడా పంపారు. ఇది ఒకటిక ఒకటి బోనస్ లాగా భావిస్తున్నా. మళ్లీ మరోసారి ధన్యవాదాలు

రసజ్ఞ said...

@ పూర్ణప్రజ్ఞాభారతి గారూ
అయ్యో పర్లేదండీ! దానిదేముందీ!

Kalyan said...

అద్భుతం ! ఇక మాటల్లేవు !!

Uma Jiji said...

రసజ్ఞ గారు,
ఒక సారి నాకు మీ ఈ-టపా ఇస్తారా?
ఉమ

శాండిల్య said...

ఈ టపాని ప్రచురించి చాలా మంచిపని చేశారు రసజ్ఞగారు. అద్భుతమైన కళా ఖండాలను చూడగలిగాము.

ఈ టపాకి మీరు... "కత్తి రాందాస్" అని పేరు పెట్టి ఉంటే ఇంకా బావుండేదేమో అనిపించింది నాకు. ఈ పేరు వినటానికి ఒకింత మోటుగా ఉన్నా... అది చదివాక "ఈ కళా రామదాసు యొక్క ప్రతిభ కత్తిలాగుంది" అని అనటానికి దోహద పడేలా ఉంటుందనిపించింది.

రసజ్ఞ said...

@ కళ్యాణ్ గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ ఉమా గారూ
నాకు మీ ప్రశ్న సరిగ్గా అర్ధం కాలేదు ఈ-టపా అంటే e-mail అనా?

@ Sandilya గారూ
అర్జెంటుగా ముందు మీరు గిల్లుకోండి! నేను సరిగ్గా అదే పెడదామనుకున్నాను కాని ఎందుకనో పెట్టలేదు! చాలా కాలానికి ఇటు వైపు వచ్చారే! రాముడు తీసుకొచ్చాడా? ధన్యవాదాలు!

శాండిల్య said...

హా.. రాముడే తీసుకెళ్తుంటే నేను ఎక్కడికైనా వెళ్లిపోతానేమో.
ప్రస్తుతానికి మాత్రం... కత్తుల రామదాసు తీసుకొచ్చాడు...కుత్తుక మీద తన 'కళా కత్తి' పెట్టి మరీ...!

రసజ్ఞ said...

@ Sandilya గారూ
పోనిలెండి! ఎదయితేనేమి? ఇలా అయినా మీ దర్శన భాగ్యం కలిగింది.

Anonymous said...

Write more, thats all I have to say. Literally, it seems as
though you relied on the video to make your point. You clearly know what youre talking about, why waste your intelligence
on just posting videos to your blog when you could be giving us
something enlightening to read?

Here is my homepage :: dating online (http://bestdatingsitesnow.com/)