Thursday, August 02, 2012

జ్యోతి



నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని ప్రచురించిన మాలిక సంపాదక వర్గానికి కృతజ్ఞతలతో...

36 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

రసజ్ఞ గారు,
మీలాగా ఎవరైనా చెప్పగలరా అనిపించేటట్టు వ్రాస్తారండి. మీతో పరిచయం కలగడమే మా అదృష్టం. అసలు తెలుగు బ్లాగులనే ఈ ప్రపంచంలో కి రాకపోతే మీ పరిచయం అయ్యేదో, కాదో.

Anonymous said...

రసజ్ఞజీ! ఇప్పుడే మీ ఆర్టికల్ "జ్యోతి" మాలిక పత్రికలో చదివాను. బాప్ రే ఇంత చక్కగా ఎలా రాయగాలుగుతున్నారండీ? జోహార్లు..............

ఫోటాన్ said...

Excellent!

రసజ్ఞ said...

@ లక్ష్మీదేవి గారూ
మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారండీ. ఎంత మాట! మీ పరిచయం నా అదృష్టం. ఇండియా వచ్చాక మీ ఇంటికి వచ్చి తెలుగు పద్యాలు వ్రాయటం నేర్చుకోవద్దూ మీ వద్ద? ధన్యవాదాలండీ!

@ సత్యవాణి గారూ
మీకు అంత బాగా నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండీ. మీ అభిమానానికి ధన్యవాదాలు!

@ ఫోటాన్ గారూ
థాంక్యూ సో మచ్!

Anonymous said...

'అగ్ని' గురించి రాశారు, బాగుంది.

టైటిల్ 'జ్యోతి' గురించి ప్రస్తావించనైనా లేదు?! సశేషమా?

Unknown said...

Congratulations రసజ్ఞ గారూ. ఇంకా చదవలేదు, కానీ ఎలా రాసి ఉంటారో ఊహించగలము.

వి రఘు వర్ధన్ రావు said...

రసజ్ఞ గారు,
మీ జ్ఞానాగ్ని తో మా అగ్నానాన్ని దగ్దం చెస్తున్నారు.మీ లాంటి వాల్లతొ పరిచయం కావడం మా అదృష్టం.....
ఙ్ఞాన విఙ్ఞాన రూపాయై ఙ్ఞానమూర్తే నమో నమః |
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః

రాజ్ కుమార్ said...

ఇంత గొప్ప పోస్ట్ చదివాక నాలో "జ్ఞానాగ్ని" రగిలిందండీ...
ఆ జ్ఞానాగ్ని ఏం చెప్పిందంటే... "రసజ్ఞాగ్ని" అని ఇంకో రకమైన అగ్ని ఉన్నదనిన్నూ... అంటే రసజ్ఞ గారు రాసిన పోస్ట్ చదివినప్పుడు ఉద్భవిస్తుందనిన్నూ..

అద్భుతమైన పోస్టు.. కొన్ని డౌట్స్ ఉన్నాయి.. తర్వాత అడుగుతాను..
మీకు రెండు చేతులూ ఎత్తి నమస్కారాలు చేస్తూ...

Anonymous said...

పెద్దవాళ్ళు పొగిడేస్తే ఆయుక్షీణం అంటారు. దీర్ఘాయుష్మాన్భవ!

anrd said...

చక్కటి విషయాలను తెలియజేసారు.

Anonymous said...

అద్భుతం!

సుభ/subha said...

సాహో బాలికా సాహో!! ఒక కన్య వివాహానికి ఎటుల అర్హత పొందునో అన్న విషయము మమ్ములను మిక్కిలి ఆకర్షించినది.ఇటులనే అందరికీ జ్ఞాన జ్యోతివై సర్వదా వెలుగొందుము బాలికా:)

the tree said...

రసజ్ఞ కాదిక మీరు, రసగ్ని....హి....

భాను కిరణాలు said...

రసజ్ఞ గారు మీ బ్లాగ్ ని ఈ మధ్యనే చూసాను ..... అసలు మీ ప్రతిభ గురించి చెప్పటానికి నాకు తెలిసిన మాటలు చాలవేమో ...... ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతం.....మీకు తెలుగు భాష మీద ఉన్న ప్రేమ , అభిమానం మీ ప్రతీ పదం లో కనిపిస్తోందండి ....... మీరు ఒక విషయం గురించి రాయాలి అనుకున్నపుడు మీరు దాని మీద ఎంత రిసెర్చ్ చేస్తారో ఆలోచిస్తే నా బుర్ర వేడెక్కిపోతోంది ......

thanooj said...

http://www.youtube.com/watch?list=AL94UKMTqg-9BCzX6YY-lC_nggkgj6nFRy&v=nkKxGzm98AU&feature=player_detailpage

Krishna said...

మీ జ్ఞానాన్ని మరో సారి మాతో పంచుకునందుకు కృతఙ్ఞతలు
ఎపతిలాగే అద్భుతం గా రాసారు!

అది సర్వం ఖల్విదం బ్రహ్మం అనుకుంటానండి...నేను ఇంటర్నెట్ లో చదివిందే..ఒక సారి సరి చూడగలరు...

కృష్ణ

వనజ తాతినేని/VanajaTatineni said...

అభినందనలు రసజ్ఞ ..
చాలా బాగా వ్రాశారు. మీ పోస్ట్ చదవటానికి ప్రశాంతంగా,తీరికగా ఉండాలి కదా!
ఎప్పటిలాగే నా మట్టి బుర్రకి.. కొంచెం ఆలస్యంగా.. ఎక్కింది.

satya said...

ఇన్ని రకాల అగ్నులు ఉంటాయా? నాకు మా క్రిష్ణ సినిమాలో సెప్పినట్లు అగ్ని అంటే జమదగ్ని ఒక్కడే అనుకునే వాళ్ళిమి..

వివాహ సమయంలో అగ్నిసాక్షి గురించి మీరు వివరించిన తీరు అద్భుతం. నా పిడకలవేట లో కలిగిన ఒక ధర్మ(దిక్కుమాలిన) సందేహం.. పూర్వకాలంలో బాల్య వివాహాలు చేసుకునేవారు కదా.. అంటే బాలికకు యుక్త వయస్సు రాకముందే పెళ్ళి చేస్తారు కదా.. మరి అలాంటి సంధర్భం లో మీరు తెలిపిన మంత్రం సహేతుకమేనా?

Satya said...

1st time reading your blog and mighty impressed.. after reading all posts.. the only thing that came to my mind is.. "You are EXCEPTIONAL".. Keep surprising :)

Kalyan said...

అగ్ని గుణము గూర్చి ఎంతో ప్రస్పుటంగా వివరించారు రసజ్ఞ గారు. అనుసరణకు చాలా బాగుంది ఇదివరకు నాలో ఉన్న చీకటి ఇంకాస్త తొలగించారు జ్యోతిర్మయం చేసారు. ఎప్పటిలాగే మీరు రాసే విధానం కన్నా దానికున్న కారణం మాత్రం అభినందనీయం. మీలో ఉన్న ఈ అగ్నికి ఏమి పేరో తెలియదు కాని అది ధహించదు భస్మం చేయదు అందుకునే కొలది జ్ఞానం పెంపొందిస్తు ఎల్ల వేళలా వెలుగిస్తుంది. నా ఈ ఆదివారమును వెలుగుమయం చేసారు చాలా సంతోషం.

" విడిది లేదు రసాగ్నికి
అంతం లేదు దాని సాహిత్యాగ్నికి
జ్వలించే కొలది వెలుగు మయం
స్నేహం చేసే కొలది వెన్నల తాపం... "

హృదయ పూర్వక స్నేహితులరోజు శుభాకాంక్షలు :)

రసజ్ఞ said...

@ SNKR గారూ
కాదండీ. సమాప్తమే. వ్యాసం మొదటిలోనే చెప్పాను కదండీ. జ్యోతికి ఒక రూపం ఇస్తే ఆయనే అగ్ని. అందుకే జ్యోతిస్వరూపుడు అని మొదలుపెట్టి ఆయన గురించి వ్రాశాను. ధన్యవాదాలు!

@ చిన్ని ఆశ గారూ
ముందుగా మీకు ధన్యవాదాలు! ఇలా ఊహించకుండా చదివి ఎలా ఉందో చెప్దురూ :)

@ రఘు గారూ
మీరు మరీనండీ! మీ అందరి ఆదరాభిమానాలు పొందటం నా అదృష్టం. కృతజ్ఞతలు!

@ రాజ్ కుమార్ గారూ
హహహ! రసజ్ఞాగ్ని నా? నేనెప్పుడూ వినలేదు సుమీ :) వివరణ ఇచ్చినందుకు థాంక్యూ :):)
మీ సందేహాలు ఎప్పుడయినా సరే నిరభ్యంతరంగా అడగండి. మీ సందేహాల కోసం ఎదురు చూస్తూ......
అయ్యయ్యో! ఎందుకండీ చేతులని అంత కష్టపెడతారు? ఇంతక ముందే చెప్పాను కదా ఎంచక్కా షేక్ హాండ్ ఇమ్మని. నెనర్లు!

రసజ్ఞ said...

@ తాతగారూ
మీ ఆశీర్వాదాలు ఇలానే ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ.. ధన్యవాదాలు!

@ అనూరాధ గారూ
ధన్యవాదాలండీ!

@ అజ్ఞాత గారూ
చాలా థాంక్స్ అండీ!

@ సుభా
హహహ! మిమ్మల్ని ఆకర్షించినందుకు చాలా ఆనందంగా ఉందండీ! మీ ఆశని నెరవేర్చడానికి సర్వదా ప్రయత్నిస్తాను. మిక్కిలి ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ భాస్కర్ గారూ
మీరు అంతగా లీనమయిపోయారనమాట :):) నా పేరు మార్చేస్తే నేనొప్పుకోను :(:( ధన్యవాదాలండీ!

@ భాను గారూ
మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలండీ! మాటలు చాలవు అంటూనే చాలా బాగా చెప్పారు. మీ అభిమానానికి ధన్యవాదాలండీ!

@ తనూజ్ గారూ
మీరిచ్చిన పాటని మూడు, నాలుగు సార్లు వినుంటాను పూర్తిగా అర్థం చేసుకోవడానికి. నిజంగా అది నా కోసమేనా!! చాలా చాలా థాంక్స్ అండీ!

@ కృష్ణ గారూ
అవునండీ అది ఖల్విదం నే, కాకపోతే అంత పెద్ద వ్యాసం వ్రాసి పంపేటప్పుడు ఓవర్ లుక్ లో (చాలా సరిచేసాను కానీ అది) అలా తప్పించేసుకుంది. మీరు పట్టేసుకున్నారు :) మన్నించాలి, ఇప్పుడు మార్చలేమండీ! సరిదిద్దినందుకు, మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

Anonymous said...

రసజ్ఞ, అగ్ని లేకుండా జ్యోతి వుండదా? నాకెందుకో జ్యోతి, అగ్ని రెండు వేరే అనిపిస్తోంది. :)
అగ్ని వున్న ప్రతిచోట జ్యోతి వుండాల్సిన అవసరం లేదు మీరుదహరించిన జఠరాగ్ని అలాంటిదే. మిణుగురు పురుగులనుంచి జ్యోతి వస్తుంది కాని అగ్ని(వేడి) వుండదు.
కాదు, అదంతే అంటే నే చేసేదేమీ లేదనుకోండి. :)

రసజ్ఞ said...

@ వనజ గారూ
ముందుగా మీ అభినందనలకు నా అభివాదాలండీ! మీరు భలే వారే! మీది మట్టి బుర్రేమిటి? మరీ చోద్యం కాకపోతేను? తీరుబడిగా కూర్చుని, మొత్తం చదివి, మెచ్చినందుకు ధన్యవాదాలు!

@ సత్య గారూ
హహహ! సినిమా నాలెడ్జ్ అనమాట :) దిక్కుమాలిన సందేహమేమిటి? అంత చక్కని ప్రశ్నను అడిగితేను. నిజానికి ఈ ప్రశ్న ఎవరో ఒకరు అడుగుతారనుకున్నాను, మీరు అడిగారు. నాకు తెలిసినంతవరకు మీ సందేహ నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను.

మన మంత్రాలన్నీ కూడా వేదకాలంలో వ్రాసినవి. యుగాలు, కాలాలు మారినా వాటిల్లో మాత్రం ఏ రకమయిన మార్పులూ లేకుండా అన్ని కాలాలకీ తగ్గట్టు వ్రాశారు. ఉదాహరణకి అప్పగింతలప్పుడు వాడే మంత్రం :

" అష్టవర్షా భవేత్కన్యా పుత్రవత్ పాలితామయా
ఇదానీం తవ దాస్యామి దత్తా స్నేహేన పాల్యతాం"

అంటే ఎనిమిది వర్షాలు (సంవత్సరాలు) నాతో ఉన్న నా కూతురిని కొడుకుతో సమానంగా చూసుకున్నాం. ఇకనుంచి తనని నీ చేతుల్లో పెడుతున్నాం కనుక తనని స్నేహంతో పాలించే బాధ్యత నీదే అని అర్థం. మామూలుగా ఏ వస్తువు (గోవు, బంగారం, ఇలా) దానమిచ్చినా "తుభ్యమహం సంప్రదదే నమమ" అని ఇస్తారు. నమమ అంటే నాకు సంబంధం లేదు అని. అన్ని దానాలకీ "తుభ్యం" అని చతుర్ధీ విభక్తి వాడిన పెద్దలు ఈ కన్యాదానానికి వచ్చేసరికి "తవ" అని షష్ఠీ విభక్తి వాడారు. అందుకనే మిగతా దానాలు ఇచ్చేస్తే దానమిచ్చినవాడికి దానితో సంబంధం తెగిపోయినా కానీ కన్యను దానమిచ్చినా కూడా దాతకి తనతో అనుబంధం, సంబంధం తెగదు. అందుకే కన్యాదాన సమయంలో నమమ అని వాడరు. ఇంత లోతుగా ప్రతీదీ ఆలోచించి మరీ మన మంత్రాలను వ్రాయటం జరిగింది. ఇంతకీ నేను ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే "ఎనిమిది వర్షములు" అన్న పదం గురించి. ఈ మంత్రాన్ని బట్టీ ఎనిమిది సంవత్సరాలు కల పిల్ల వివాహానికి యోగ్యురాలు అని తెలుస్తోంది. కానీ ఈ కాలంలో కూడా మీరు గమనిస్తే ముప్పై ఏళ్ళ యువతిని అప్పగిస్తున్నా కానీ అప్పగింతల సమయంలో ఇదే మంత్రం ఉంటుంది. అయితే ఇది మనం ఆ కాల పరిస్థితులకి అన్వయించుకోవాలి. అప్పటివారు చిన్న వయసులోనే ఎంతో జ్ఞానం, పరిపక్వత కలిగి ఉండేవారు. దానికి ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చును. దీనికి మంచి ఉదాహరణ సీతమ్మవారు. కళ్యాణ సమయానికి ఆవిడ వయసు ఆరు సంవత్సరాలు(ట). వారికీ, ఇప్పటివారికీ పోలిక లేదు. ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఎనిమిది సంవత్సరాలు అంటే ఇంకా చాలా చిన్న పిల్ల.

వీటన్నిటినీ పరికిస్తే వారి వారి పరిపక్వతను బట్టీ ఇక్కడ నేను చెప్పిన చంద్ర, గంధర్వ, అగ్నుల పాలనలు ఎన్ని సంవత్సరాలు అన్నది ఆధారపడి ఉంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే నాకు తెలిసున్నంతవరకూ ప్రతీ కన్యకీ ఇన్ని సంవత్సరాలు చంద్రుని పాలన, ఇన్ని సంవత్సరాలు గంధర్వుని పాలన అన్న ఖచ్చితమయిన సమయం లేదు. అమ్మాయిని బట్టీ, తన పరిపక్వతను బట్టీ మారుతూ ఉంటాయి. అగ్ని అనుమతి లేనిదే, అగ్ని నరునికి ఇవ్వడానికి ఇష్టపడనిదే, ఆడ పిల్ల వివాహం జరగదు అని, అలానే అగ్ని నరునికి ఆ కన్యను ఇచ్చేసి వెళిపోదామని నిర్ణయించుకున్నాక కూడా ఒకసారి చంద్రుని, గంధర్వుని అనుమతులు కూడా తీసుకున్నాకనే ముగ్గురూ కలిసి ఆమె వివాహాన్ని నిర్ణయిస్తారు అని ఋగ్వేదంలో చెప్పబడింది.

మీ అభిమాన, ఆశ్చర్యాలతో కూడిన స్పందనకు మిక్కిలి ధన్యవాదాలు!

శ్రీ said...

అగ్ని పై ‘రసజ్ఞ’మైన వివరణ…
చాలా బాగుంది మీ ఆర్టికల్…
అభినందనలు మీకు…
మీ నుంచి మరిన్ని మంచి పరిశోధనా వ్యాసాలను ఆశిస్తూ…
@శ్రీ

రసజ్ఞ said...

@ కళ్యాణ్ గారూ
హహహ! నేను అగ్నిని కాదు బాబోయ్! నా పేరు మార్చేయకండి :) మరింకేం? వెలిగిపోండి :):) మీకు కూడా స్నేహితులరోజు శుభాకాంక్షలు! ధన్యవాదాలండీ!

@ SNKR గారూ
కాదు, అది అంతే అని నేను మొండిగా వాదించటం లేదు కానీ, నా ఆలోచనా పరిధి మేరకు కాస్త వివరణ ఇచ్చుకుంటాను.
జ్యోతి అనేది అగ్ని యొక్క రూపాంతరం. జ్యోతిలో ఎప్పుడూ అగ్ని అంతర్ముఖంగా ఉంటూనే ఉంటుంది. అగ్ని లేకుండా జ్యోతి వెలగదు. అగ్ని అనేది నిప్పు కణం. అది దీప శిఖగా మారితే దానినే జ్యోతి అంటారు. మీరన్నట్టు జఠరాగ్నినే తీసుకుందాం. ఈ అగ్ని నిరంతరం మనలో ఉంటూనే ఉంటుంది. అది జ్యోతిగా ప్రజ్వరిల్లినప్పుడు మాత్రమే మనకి ఆకలి వేస్తుంది తప్ప అగ్ని ఎల్లప్పుడూ ఉంది కదా అని ఎల్లప్పుడూ ఆకలి వేయదుగా. అలానే మీరు చెప్పిన మిణుగురు పురుగుల్ని తీసుకుంటే, అవి జ్యోతినిస్తాయి అనటం కన్నా వెలుగునిస్తాయి అనటం సమంజసం అని నా అభిప్రాయం. ఎందుకంటే వాటి నుంచీ వచ్చే వెలుగుని bioluminescence (living light) అంటాము. అదొక enzyme-protein reaction వలన పుడుతుంది. పోనీ మీరన్నట్టు అదే జ్యోతి అని తీసుకున్నా, వాటి నుండి వెలువడేదాన్ని cold fire (శీతలాగ్ని) అంటారు. Bioluminescence is literally a 'cold fire' అని చిన్నప్పుడు చదువుకున్న గుర్తు. ఇలా చూసుకున్నా అగ్ని ఉంది కదండీ బహుశా దీనిని నివురు గప్పిన నిప్పు అనచ్చేమో!!

@ శ్రీ గారూ
మీ అభినందనలకు అభివాదాలండీ! వీలున్నప్పుడల్లా వ్రాస్తూ ఉంటాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

Anonymous said...

మీరు చెప్పింది బాగానే (కన్విన్సింగ్‌గా) వుంది, ధన్యవాదాలు. :)

Anonymous said...

రసజ్ఞ గారూ..
రాసినంతవరకూ మాటల్లేవు, చాలా బావుంది.

శీర్షిక విషయములో మీ వివరణ తర్వాత కూడా SNKR గారి అభిప్రాయమే (వారు కన్విన్స్ అయినప్పటికీ) నాదీనూ. జనకము నుండే జన్యము వచ్చినప్పటికీ జనక-జన్యముల మధ్య గుణ, రూప, భావ భేదాలు ఉండొచ్చని ఆర్యోక్తి.

ఇక్కడ జ్యోతికి జన్మనిచ్చేది అగ్నియే అయినప్పటికీ జ్యోతినీ అగ్నినీ వేరుగా చూడాలని నా అభిప్రాయం.

రహ్మానుద్దీన్ షేక్ said...

:)

రసజ్ఞ said...

@ SNKR గారూ
మీరు కన్విన్స్ అయినందుకు ధన్యవాదాలండీ!

@ అరుణ్ గారూ
ముందుగా మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు!
వాటి మధ్యన ఉన్న సారూప్యతని అంతకన్నా ఎలా వివరించాలో తెలియటం లేదు. ఆ రెండూ రూపాంతరాలు తప్ప గుణ, భావాల్లో వేరు కాదు. మీరెంత చెప్పినా అగ్ని లేని జ్యోతినీ, జ్యోతిలేని అగ్నినీ ఊహించుకోలేకపోతున్నాను.

@ రెహ్మాన్ గారూ
ధన్యవాదాలు!

oddula ravisekhar said...

ఈ పోస్ట్ ఇంతకు ముందు చూసి తీరిగ్గా చదవాలనుకున్నాను.ఇప్పటికి కుదిరింది.కామెంట్స్ అన్నీ కూడా చదివాను.వ్రాసే విషయం లో మీ పట్టుదల,తీవ్రత ,అన్ని విధాలుగా సమగ్రంగా వ్రాయాలనే మీ తపన ఇలా చాలా లక్షణాలు మీలో కనిపిస్తుంటాయి.మీరు ఇలాంటి వాటితో పాటు ఇంకా వర్తమానం లోని విషయాలపై దృష్టి పెట్టి వ్రాస్తే ఇంకా అద్భుతం గా ఉంటుందేమో పరిశీలించండి.పురానాలన్నీ అవపోషణ పట్టినట్టున్నారు.మీ passionate reading కు చప్పట్లు.
ఇక పోతే మీలాగే నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది కానీ మీ విభాగం లో కాదు.కానీ అవన్నీ తెలుసుకోవటమంటే ఆసక్తి.నా కెందుకో ఈ వ్యాసంలోని వివరాలేలా వున్నా మన పూర్వీకుల ఊహా శక్తి,సృజనాత్మకతకు,వారి మేధాశక్తికి ఎంతో ఆనందం ఆశ్చర్యం వేస్తుంటుంది.అగ్ని లోని రకాల గురించి అద్బుతం గా వివరించారు.మీరు ఇండియాలో ఉండటం లేదా!మీకు అభినందనలు.

రసజ్ఞ said...

@ రవి శేఖర్ గారూ
ముందుగా తీరిక చేసుకుని మరీ ఈ వ్యాసాన్ని చదివినందుకు, మీకు ఇది నచ్చినందుకు ధన్యవాదాలండీ! మీరు సూచించినట్టు వర్తమానం గురించి కూడా తప్పక వ్రాస్తానండీ, కాకపోతే కాస్త సమయం పడుతుంది. వారి ఊహా శక్తుల ముందు ఇవన్నీ అద్దంలో ఆవ గింజంత! అని నా అభిప్రాయం. ప్రస్తుతానికి ఇండియాలో లేనండీ, మీ అభినందనలకు మరొక్కసారి అభివాదాలు.

Anonymous said...

I enjoy, result in I found exactly what I was taking a look for.
You have ended my four day long hunt! God Bless you man. Have a nice day.
Bye

My webpage; dating online (http://bestdatingsitesnow.com)

Anonymous said...

Truly no matter if someone doesn't be aware
of then its up to other visitors that they will assist, so here
it takes place.

Also visit my web-site: dating sites (bestdatingsitesnow.com)

KOLLURI VEERAPUSHKAR said...

అధ్బుతం! మేడం మీ రచన తీరుకి, ఆ వివరణకి కూడా నేను ఫిదా ఐపోయానండి.