నిరాకారమయిన బ్రహ్మ జ్యోతి (అగ్ని) స్వరూపం. అందుకే జ్యోతి స్వరూపుడు, స్వయం ప్రకాశితుడు, అనంతుడు, ధనపతి, చైతన్యమయుడు అయిన అగ్ని ఈ సకల విశ్వానికి ఆరాధ్యుడయ్యాడు. ఈయన లేనిదే నాగరికతే లేదని చెప్పవచ్చు. అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. వేదాలలో అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. పంచభూతాలలో ఒకటయిన ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు. శంకరుని అవతారమే అగ్ని అని శ్రీ శివ పురాణంలో చెప్పబడింది. ఋగ్వేదం ప్రకారం అగ్నిదేవుడు పరమాత్మ నోటి నుండి ఉద్భవించాడు. మన పురాణాలలో ఈయన అంగీరసుని పుత్రునిగా చెప్తారు. ఈయన భార్య స్వాహా దేవి, వాహనము తగరు, ఆయుధం శక్తి, నివాసము తేజోవతి. అగ్నికి స్పర్శ, శబ్ద, రూప అనెడి త్రిగుణాలున్నాయి. అగ్ని- భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, పాతాళము, జలము, సూర్య, ఔషధి, వనస్పతి, శరీరం ఇలా ఎక్కడయినా పరిభ్రమిస్తుంది. అగ్ని భక్తులకు విద్యుత్తు, అగ్ని, అజీర్తి, అకాల మరణముల భయము, మొ. ఏ కాలంలోనూ ఉండవు. అగ్ని భక్షించిన ధూపదీప నైవేద్యాలు, పాలు, పెరుగు, నెయ్యి, చెఱుకు రసం, మొ. వానిని మాత్రమే స్వర్గములోని దేవతలందరూ కూడా స్వీకరిస్తున్నారని శ్రీ శివ పురాణములో చెప్పబడింది. "గుహా హితః గుహాయాం నిహితః" అన్నారు. "అంగీరసుడు" అనబడే మన పూర్వీకుడు మనుషుల అవసరాల కోసం అగ్నిని గుహలో దాచి ఉంచాడుట. అలా దానిని ఉపయోగించుకుని క్రమేణా క్రూర మృగాల నుంచి రక్షణగా కుటీరాన్ని ఏర్పాటు చేసుకునే జ్ఞానాన్ని మనిషి పెంచుకున్నాడుట. అందువలన అగ్ని ముఖ్య పాత్రని పోషిస్తుంది.
పంచభూతాలలో ఒకటయిన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీభూతం అని మన పురాణాలలో వ్యవహరించారు. అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు.
క్రోధాగ్ని: కోపము వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళలో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులూ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువలననే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపము కనుక క్రోధాగ్ని జ్వాలలలో భస్మం అవుట తధ్యం.
బడబాగ్ని: ఇది సముద్రము అడుగుభాగములో ఉండే అగ్ని. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. దీనికి ఆహారం సముద్రోదకం అనగా సముద్రములోని నీరు. దీని జననం వెనుక చాలా కథలున్నాయి.
శ్రీ శివ పురాణం ప్రకారం, మన్మధుని దహనానంతరం కూడా శివుని మూడవ కన్ను నుండి పుట్టిన అగ్ని (క్రోధాగ్ని) అంతా వ్యాపించగా ముల్లోకాలలోని వారంతా భయభీతులై బ్రహ్మని శరణు కోరతారు. అప్పుడు ఆయన ఆ అగ్నిని స్థంబింపచేసి, ముల్లోకాలనూ దహించి వేయగల శక్తి ఉన్న ఆ క్రోధాగ్నిని సౌమ్యమయిన అగ్ని జ్వాలలను వెదజల్లే ముఖము కల బడబా (గుఱ్ఱము) అగ్నిగా మార్చి తానే స్వయముగా సముద్రునికి అప్పగిస్తాడు. అంత భయంకరమయిన అగ్నిని దాచుకున్న ఈ బడబము నోటి నుండి నిప్పులు క్రక్కుతోంది కావున దీనికి సముద్ర జలము మాత్రమే నిత్య భోజనముగా ప్రళయ కాలము దాకా సముద్రములోనే ఉండవలెనని అక్కడ ఉంచటం జరిగింది.
శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, ఒకసారి భృగువులకు, హైహయులకు పెద్ద వైరము వచ్చి హైహయులు వెళ్ళి భృగువులు అందరినీ (గర్భములో ఉన్న పిండాలతో సహా) చంపేస్తారు. అప్పుడు భృగు మహర్షి దుఃఖించి మిక్కిలి తేజస్సు కల "అరుణుడు" అనే శిశువుని ఆయన గర్భమందు ధరిస్తారు. ప్రసవ సమయములో ఆ శిశువు ఆయన తొడను ఛేదించుకుని పుడతాడు. పుట్టిన వెంటనే హైహయులు భృగువులని చంపినప్పుడు దేవతలెవ్వరూ అడ్డుకోనందున దేవతలనందరినీ చంపుతానని కోపముతో బయలుదేరతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బడబా ముఖదారి అయ్యి ఆ శిశువు శరీరము నుండి వెలువడి సముద్రము అంతర్భాగములోనికి వెళ్తాడు. అంటే దీని ప్రకారము కూడా క్రోధాగ్ని బడబా ముఖములోకి మారుట వలన బడబాగ్ని అయ్యింది.
శ్రీ పద్మ పురాణం ప్రకారం, బడబాగ్ని విష్ణువు ప్రతిరూపమయిన జువ్వి చెట్టు నుండి ఉద్భవించింది. ఆ బడబాగ్ని తాపాన్ని భరించలేని దేవతలు ఈ అగ్నిని సముద్రములోనికి తీసుకుని వెళ్ళి దాచమని సరస్వతీ దేవిని వేడుకుంటారు. బ్రహ్మ ఆజ్ఞానుసారం సరస్వతీ దేవి నది రూపములో ఆ చెట్టు వద్దకు వెళ్ళి విష్ణువు ఆశీర్వచనం చేత తను దహనం కాకుండా ఈ అగ్నిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి సముద్రునిలో ఏకం చేస్తుంది. దీనిని బట్టి బడబాగ్ని అనేది ముందుగా భూమి మీద పుట్టి సముద్రములో చేరింది అని తెలుస్తోంది.
జఠరాగ్ని: ఇది ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి ఆహార జీర్ణనకి ఉపయోగపడుతుంది. దీని విలువ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
పంచభూతాలలో ఒకటయిన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీభూతం అని మన పురాణాలలో వ్యవహరించారు. అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు.
"సోమః ప్రధమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః
తృతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్యచౌః"
తృతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్యచౌః"
అని వివాహ సమయములో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ ఏలారు. ఇహ నాల్గవ వానిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం. అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు (చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన. కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు. "లావణ్యవాన్ గంధర్వః" అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనయిపోయింది ఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. "అగ్నిర్వై కామ కారకః" అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని, ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయములో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను "అగ్ని సాక్షిగా" వరుడు స్వీకరిస్తాడు.
వాయుపురాణంలో అగ్ని జనన, అగ్ని వంశ సంబంధిత విషయాల ప్రస్తావన ఉంది. ఆ ప్రకారముగా స్వాయంభువ మన్వంతరంలో అగ్ని బ్రహ్మమానసపుత్రునిగా జన్మించాడు. ఈయన నుండి స్వాహా దేవి పుట్టింది. ఈవిడకి పావకుడు (అపవిత్ర వస్తువులన్నీ అగ్ని సోకితే పవిత్రం అవుతాయి కనుక అగ్నికి పావకుడు అనే పేరు వచ్చింది. ఈయననే పావమానుడు అని కూడా అంటారు), శౌరుడు, శుచి అనే ముగ్గురు పుత్రులు పుట్టారు. వీరిలో పావకునికి పుట్టిన అగ్ని సంరక్షకుడు, శుచికి జన్మించిన అగ్ని హవ్యవాహనుడు (ఇతను అగ్నిదేవతలకు, పితృదేవతలకు హవ్యాన్నీ, రాక్షసులకు హుతమును మోసుకుని వెళ్తాడు). అయితే ఇందులోనే, విద్యుత్తు సంబంధమయిన లౌకికాగ్నిని బ్రహ్మ తొలి పుత్రునిగా చెప్పబడింది. ఈయన పుత్రుని పేరు బ్రహ్మౌదవాగ్ని భరతుడు. నిర్మధుడు అని కవుల చేత వర్ణింప బడిన అగ్నే పావమానుడుగా చెప్పబడిన అగ్ని. ఈయననే గార్హపత్యాగ్ని (త్రేతాగ్నులలో ఒకటి) అని కూడా అంటారు. ఇతనికి హవ్యవాహనుడు అనే ఆహవనీయాగ్నీ, ప్రణీయమానుడు (కుండానికి తీసుకుని వెళ్ళేవాడు) అను ఇద్దరు కుమారులు. వీరిలో ఆహవనీయాగ్నిని శంస్యుడు అనీ, ప్రణీయమానుడుని శుక్రుడు అనీ అంటారు. పదహారు నదులతో (గోదావరీ, కావేరీ, కృష్ణవేణీ, నర్మదా, యమునా, వితస్థ, చంద్రభాగ, ఇరావతి, విపాచ, కౌశిక, శతద్రు, సరయు, సీతా, సరస్వతీ, హ్రాదిని, పావని) ఈ శంస్యునికి పుట్టిన అగ్నులని ధిష్ణులు అంటారు. వీరిలో ముఖ్యమయిన అగ్నులు సమ్రాట్ (ఈ అగ్నిని ఎనిమిది మంది వేద పండితులు ఎల్లప్పుడూ ఉపాసిస్తూ ఉంటారు), పర్హతే (సమ్రాట్ క్రింద ఉంటుంది), అజైకపాద్ (ఉపాసించడానికి అనువయిన అగ్ని) లేదా అహిర్భుద్యగ్ని లేదా గృహపతి, క్రతుప్రహణం మరియు అగ్నీధ్రం. వీటిల్లో మళ్ళీ పర్హతే అనే అగ్ని నాలుగు అగ్నులు క్రింద చీలుతుంది. అవే బ్రహ్మజ్యోతి (బ్రహ్మ స్థానంలో ఉండే అగ్ని), హవ్యమః (యాగములలో కనిపించే అగ్ని), ఋతుధామం (జ్యోతిర్వంతమయిన అగ్ని) మరియు జౌదుంబరి (మేడి చెట్టులో ఉండే అగ్ని). ఈ విధముగా అగ్నులు చేసే ఒక్కో పని ప్రకారం ఒక్కో రూపంలో అవతరించాయని వాయు పురాణంలో ఉంది.
వీటన్నిటినీ ప్రక్కన పెడితే, అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువబడుతుంది. అవి:
వాయుపురాణంలో అగ్ని జనన, అగ్ని వంశ సంబంధిత విషయాల ప్రస్తావన ఉంది. ఆ ప్రకారముగా స్వాయంభువ మన్వంతరంలో అగ్ని బ్రహ్మమానసపుత్రునిగా జన్మించాడు. ఈయన నుండి స్వాహా దేవి పుట్టింది. ఈవిడకి పావకుడు (అపవిత్ర వస్తువులన్నీ అగ్ని సోకితే పవిత్రం అవుతాయి కనుక అగ్నికి పావకుడు అనే పేరు వచ్చింది. ఈయననే పావమానుడు అని కూడా అంటారు), శౌరుడు, శుచి అనే ముగ్గురు పుత్రులు పుట్టారు. వీరిలో పావకునికి పుట్టిన అగ్ని సంరక్షకుడు, శుచికి జన్మించిన అగ్ని హవ్యవాహనుడు (ఇతను అగ్నిదేవతలకు, పితృదేవతలకు హవ్యాన్నీ, రాక్షసులకు హుతమును మోసుకుని వెళ్తాడు). అయితే ఇందులోనే, విద్యుత్తు సంబంధమయిన లౌకికాగ్నిని బ్రహ్మ తొలి పుత్రునిగా చెప్పబడింది. ఈయన పుత్రుని పేరు బ్రహ్మౌదవాగ్ని భరతుడు. నిర్మధుడు అని కవుల చేత వర్ణింప బడిన అగ్నే పావమానుడుగా చెప్పబడిన అగ్ని. ఈయననే గార్హపత్యాగ్ని (త్రేతాగ్నులలో ఒకటి) అని కూడా అంటారు. ఇతనికి హవ్యవాహనుడు అనే ఆహవనీయాగ్నీ, ప్రణీయమానుడు (కుండానికి తీసుకుని వెళ్ళేవాడు) అను ఇద్దరు కుమారులు. వీరిలో ఆహవనీయాగ్నిని శంస్యుడు అనీ, ప్రణీయమానుడుని శుక్రుడు అనీ అంటారు. పదహారు నదులతో (గోదావరీ, కావేరీ, కృష్ణవేణీ, నర్మదా, యమునా, వితస్థ, చంద్రభాగ, ఇరావతి, విపాచ, కౌశిక, శతద్రు, సరయు, సీతా, సరస్వతీ, హ్రాదిని, పావని) ఈ శంస్యునికి పుట్టిన అగ్నులని ధిష్ణులు అంటారు. వీరిలో ముఖ్యమయిన అగ్నులు సమ్రాట్ (ఈ అగ్నిని ఎనిమిది మంది వేద పండితులు ఎల్లప్పుడూ ఉపాసిస్తూ ఉంటారు), పర్హతే (సమ్రాట్ క్రింద ఉంటుంది), అజైకపాద్ (ఉపాసించడానికి అనువయిన అగ్ని) లేదా అహిర్భుద్యగ్ని లేదా గృహపతి, క్రతుప్రహణం మరియు అగ్నీధ్రం. వీటిల్లో మళ్ళీ పర్హతే అనే అగ్ని నాలుగు అగ్నులు క్రింద చీలుతుంది. అవే బ్రహ్మజ్యోతి (బ్రహ్మ స్థానంలో ఉండే అగ్ని), హవ్యమః (యాగములలో కనిపించే అగ్ని), ఋతుధామం (జ్యోతిర్వంతమయిన అగ్ని) మరియు జౌదుంబరి (మేడి చెట్టులో ఉండే అగ్ని). ఈ విధముగా అగ్నులు చేసే ఒక్కో పని ప్రకారం ఒక్కో రూపంలో అవతరించాయని వాయు పురాణంలో ఉంది.
వీటన్నిటినీ ప్రక్కన పెడితే, అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువబడుతుంది. అవి:
క్రోధాగ్ని: కోపము వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళలో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులూ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువలననే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపము కనుక క్రోధాగ్ని జ్వాలలలో భస్మం అవుట తధ్యం.
బడబాగ్ని: ఇది సముద్రము అడుగుభాగములో ఉండే అగ్ని. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. దీనికి ఆహారం సముద్రోదకం అనగా సముద్రములోని నీరు. దీని జననం వెనుక చాలా కథలున్నాయి.
శ్రీ శివ పురాణం ప్రకారం, మన్మధుని దహనానంతరం కూడా శివుని మూడవ కన్ను నుండి పుట్టిన అగ్ని (క్రోధాగ్ని) అంతా వ్యాపించగా ముల్లోకాలలోని వారంతా భయభీతులై బ్రహ్మని శరణు కోరతారు. అప్పుడు ఆయన ఆ అగ్నిని స్థంబింపచేసి, ముల్లోకాలనూ దహించి వేయగల శక్తి ఉన్న ఆ క్రోధాగ్నిని సౌమ్యమయిన అగ్ని జ్వాలలను వెదజల్లే ముఖము కల బడబా (గుఱ్ఱము) అగ్నిగా మార్చి తానే స్వయముగా సముద్రునికి అప్పగిస్తాడు. అంత భయంకరమయిన అగ్నిని దాచుకున్న ఈ బడబము నోటి నుండి నిప్పులు క్రక్కుతోంది కావున దీనికి సముద్ర జలము మాత్రమే నిత్య భోజనముగా ప్రళయ కాలము దాకా సముద్రములోనే ఉండవలెనని అక్కడ ఉంచటం జరిగింది.
శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, ఒకసారి భృగువులకు, హైహయులకు పెద్ద వైరము వచ్చి హైహయులు వెళ్ళి భృగువులు అందరినీ (గర్భములో ఉన్న పిండాలతో సహా) చంపేస్తారు. అప్పుడు భృగు మహర్షి దుఃఖించి మిక్కిలి తేజస్సు కల "అరుణుడు" అనే శిశువుని ఆయన గర్భమందు ధరిస్తారు. ప్రసవ సమయములో ఆ శిశువు ఆయన తొడను ఛేదించుకుని పుడతాడు. పుట్టిన వెంటనే హైహయులు భృగువులని చంపినప్పుడు దేవతలెవ్వరూ అడ్డుకోనందున దేవతలనందరినీ చంపుతానని కోపముతో బయలుదేరతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బడబా ముఖదారి అయ్యి ఆ శిశువు శరీరము నుండి వెలువడి సముద్రము అంతర్భాగములోనికి వెళ్తాడు. అంటే దీని ప్రకారము కూడా క్రోధాగ్ని బడబా ముఖములోకి మారుట వలన బడబాగ్ని అయ్యింది.
శ్రీ పద్మ పురాణం ప్రకారం, బడబాగ్ని విష్ణువు ప్రతిరూపమయిన జువ్వి చెట్టు నుండి ఉద్భవించింది. ఆ బడబాగ్ని తాపాన్ని భరించలేని దేవతలు ఈ అగ్నిని సముద్రములోనికి తీసుకుని వెళ్ళి దాచమని సరస్వతీ దేవిని వేడుకుంటారు. బ్రహ్మ ఆజ్ఞానుసారం సరస్వతీ దేవి నది రూపములో ఆ చెట్టు వద్దకు వెళ్ళి విష్ణువు ఆశీర్వచనం చేత తను దహనం కాకుండా ఈ అగ్నిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి సముద్రునిలో ఏకం చేస్తుంది. దీనిని బట్టి బడబాగ్ని అనేది ముందుగా భూమి మీద పుట్టి సముద్రములో చేరింది అని తెలుస్తోంది.
జఠరాగ్ని: ఇది ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి ఆహార జీర్ణనకి ఉపయోగపడుతుంది. దీని విలువ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
"అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధం"
ప్రాణాపాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధం"
అని భగవద్గీతలో చెప్పారు. ఈ శ్లోకం నిత్యం భోజనం చేసేముందు చదువుకుని తినటం ఒక అలవాటు. ఇక్కడ అహం అంటే పరమాత్మ, వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణుల (ఇవి నాలుగు రకాలు - జరాయుజాలు అనగా తల్లి గర్భం నుండి ఉద్భవించేవి, అండజాలు అనగా గ్రుడ్డు నుండి పుట్టేవి, స్వేదజాలు అనగా చెమట నుండి పుట్టేవి మరియు ఉద్భిజ్జములు అనగా భూమిని చీల్చుకుని పుట్టేవి) దేహములో (శరీరములో) ఉన్నాడు. అన్నం చతుర్విధం అన్నారు అంటే నాలుగు విధములయిన పదార్థాలు [అవేమనగా భక్ష్యం (కొరికి తినేవి), భోజ్యం (నమిలి తినేవి), లేహ్యం (నాకి తినేవి), చోష్యం (పులుసు, మొదలయినవి)] మన భోజనములో ఉంటూ ఉంటాయి. మనం తినే భోజనం జీర్ణమయ్యి మన ప్రాణాన్ని నిలపెడుతుంది. అంటే అగ్నిలో ఆహుతయ్యి ఆ అగ్ని (హవ్యా వాహనుడు) శరీరమంతా ప్రాణ వాయువు రూపములో వ్యాపిస్తుంది. తిన్న ఆహారమును జీర్ణము చేసి మలమూత్ర శుక్ర రూపములో క్రిందకి తోసేది అపాన వాయువు. త్రాగిన వాటినీ, తిన్న వాటినీ రక్తముగా, పిత్తముగా, శ్లేష్మముగా మార్చి శరీరానికి సమానముగా అందించేది సమాన వాయువు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇటువంటి భోజనాన్ని మనలో ఉన్న వైశ్వానరుడు అనే అగ్నికి ఇచ్చే హవిస్సు క్రింద భావించాలి. అప్పుడే మనకి యజ్ఞం చేసినంత పుణ్య ఫలము లభించును. కనుక భోజనం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ హోమం చేస్తున్నంత శ్రద్ధగా తినాలి.
"బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా"
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా"
అన్నారు. అంటే హవిస్సు బ్రహ్మే, అగ్నీ బ్రహ్మే, హోత అనగా హోమం చేసేవాడూ బ్రహ్మే అన్నీ ఆయనే కనుక మనం చేసిన యజ్ఞం కాని, అన్నం కాని ఏదయినా సరే ఆ బ్రహ్మకే అర్పిస్తున్నాం అన్న భావనతో ఉండాలి. "సర్వం కల్విదం బ్రహ్మ" అన్నారు కదా! అందుకే "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అంటారు.
జ్ఞానాగ్ని: ఆత్మలో నిత్యం రగిలే అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. "జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్ కురుతేర్జునా" అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని పుడితే సర్వ కర్మలూ (ఆగామి, సంచితం, ప్రారబ్ధం) భస్మమయిపోతాయి అని అర్థం. ఈ అగ్ని మనకి ముఖ్యముగా రామాయణములో తారసపడుతుంది. సీతాదేవి అగ్ని ప్రవేశం వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహిస్తే ఈ జ్ఞానాగ్ని మనకి బోధపడుతుంది.
రావణ సంహారం తరువాత తన వద్దకు వస్తున్న సీతాదేవిని చూసిన రాముడు "దీపో నేత్రా తురస్యేవ ప్రతికూలాతి భామిని" అంటాడు. అంటే కళ్ళ జబ్బున్న వాళ్ళు ఏ విధముగా అయితే దీపాన్ని చూడలేరో అదే విధముగా నువ్వు నాకు ప్రతికూలముగా కనిపిస్తున్నావు కనుక నేను నిన్ను చూడలేకున్నాను అంటాడు. అప్పుడే చాలా స్పష్టముగా "బాలిశో పత కామాత్మా రామో దశరధాత్మజః చిర కాలాధ్యుషితాం సీతాం" (అంటే చాలా కాలం రావణుని వద్ద ఉన్న సీతని బాలిశుడై అనగా నీచుడై, కామాత్ముడైన రాముడు ఏలుకున్నాడు) అని లోకం అనుకుంటుందేమో అన్న కంటి జబ్బు నాది కానీ నీలో దోషం లేదు. కనుక లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఈ అయిదుగురిలో ఎవరి వద్దకు వెళతావో నువ్వే నిర్ణయించుకో అంటాడు. ఇది మన అందరికీ తెలిసిన బాహ్యార్థం. అంతరార్ధంలోకి వెళితే, సీతాదేవి జీవుడికీ, శ్రీరామచంద్రమూర్తి పరమాత్మకీ ప్రతీకలు. సీతాదేవి బంగారు లేడిని కోరటం వలన రాముడికి దూరమయ్యింది. అంటే జీవుడికి కోరికలు కలుగుట వలన పరమాత్మ నుండీ దూరమవుతాడు. ఇక్కడ ఉపనిషత్తులలో చెప్పబడిన ఒక చిన్న కథను చెప్పుకోవాలి. శరీరము అనే మామిడి చెట్టు మీద జీవ పక్షి, ఈశ్వర పక్షి ఉన్నాయిట. చెట్టు నిండా ఉన్న మామిడి పండ్లను చూసిన జీవ పక్షి తింటాను అంటే ఈశ్వర పక్షి వద్దని వారిస్తుందిట. అయినా వినకుండా జీవ పక్షి ఆ చెట్టుకి ఉన్న పండ్లన్నీ తినేస్తుందిట. తిన్నాక ఆ వనంలో ఉన్న మరొక చెట్టు, మరొక చెట్టు అలా తినాలి అన్న కోరిక వలన ఎన్నో చెట్లు మారుతూ ఈశ్వర పక్షికి దూరమవుతుంది. అదే విధముగా జీవుడు కూడా కోరికలని పెంచుకుంటూ ఎన్నో జన్మలెత్తుతూ పరమాత్మకి దూరమవుతున్నాడు. ఇలా దూరమయిన జీవుడు పంచాభూతాలకి మాత్రమే వశమవుతాడు అది వివరించేందుకే అయిదుగురిలో ఎవరివద్దకన్నా వెళ్ళమంటాడు రాముడు. "బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే" అని భగవద్గీతలో చెప్పినట్టు అసలు నేను ఎవరిని? ఎక్కడ నుండి వచ్చాను అన్న జ్ఞానాన్ని తెచ్చుకున్నప్పుడు కైవల్యం పొంది పరమాత్మ వద్దకు తిరిగి చేరగలడు. ఈ జ్ఞానం సన్యాసాశ్రమంలో తురీయావస్థలో పొందగలరు. సన్యాసాశ్రమం లోకి ప్రవేశించే ముందు వీరి సర్వ కర్మలు, కోరికలు అన్నీ భస్మం చేయటం కోసం విరజా హోమం చేస్తారు. అదే విధముగా సీతాదేవి రూపములో ఉన్న జీవుడు, రాముని రూపములో ఉన్న పరమాత్మను చేరటానికి విరజా హోమమనే జ్ఞానాగ్నిలో అగ్ని ప్రవేశం చేసి, సర్వ కర్మలూ, కోరికలనూ భస్మం చేసి పరమాత్మ అయిన రాముని వద్దకు వచ్చింది అని అంతరార్థం. దీనిని స్వయముగా చేసి జనానికి చూపించటమే సీతమ్మ వారి అగ్ని ప్రవేశ ఘట్టంలోని ఆంతర్యం.

"మర్త్యావతారం త్విః మర్త్య శిక్షణం
రక్షోవధాయై న చ కేవలం విభోః"
రక్షోవధాయై న చ కేవలం విభోః"
అన్నారు. మర్త్యులు (మరణం కలిగిన వారు) అనగా మానవులు. శ్రీహరి మానవావతారం అయిన రామావతారంలో కేవలం రాక్షస సంహారం కోసమే కాక, మానవులు ఎలా క్రమశిక్షణలో ఉండాలి అని ఆయన నడిచి చూపించాడు. అందుకనే రాముడు నడిచినట్టు నడవాలి, కృష్ణుడు చెప్పినట్టు చెయ్యాలి అంటారు.
దావాగ్ని: ఇది ఎండు పుల్లల రాపిడి, ఘర్షణ వలన పుడుతుంది. ఎక్కువగా అడవులలో పుట్టడం వలన ఇది కలుగ చేసే నష్టం కూడా తీవ్రమయినది. యజ్ఞ యాగాదులకి ఉపయోగించేది కూడా దావాగ్నే. గుంటలు త్రవ్వి, అందులో కర్రలను పేర్చి, నిప్పును రగల్చి ఉంచేవారు. వీటినే గుండాలు అని అంటారు. మెల్లిగా వీటి నుంచే వాడుకని బట్టీ అగ్ని గుండాలు, హోమ గుండాలు వచ్చాయి.
ఎండు పుల్లల రాపిడితో పాటూ, కవ్వంతో మజ్జిగ చిలికినట్టు అరణిలో మధించి అగ్నిని పుట్టించేవారు. ఈ రకముగా తయారయినటువంటి, యజ్ఞ యాగాదులకి ఉపయోగించే అగ్ని మూడు రకాలు. అవి దక్షిణాగ్ని, ఆహవనీయం (ఆహుతులిచ్చేది), గారహపత్యం (గృహస్థాశ్రమంలో ఉన్నవారు చేసేది). ఈ మూడిటినీ కలిపి త్రేతాగ్నులు అంటారు. ఇది వరకు నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. అటువంటివారు ఈ త్రేతాగ్నులనీ ఖచ్చితముగా వెలిగించేవారు. యజ్ఞము వలన ఉద్భవించిన అగ్ని పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. సప్త జిహ్వాయనుడు (ఏడు నాలుకలు కలవాడు) అని ఈయన పేరుకి తగ్గట్టుగా హోమం చేసిన ఆహుతులని ఏడు నాలుకలతో ఈయన స్వీకరిస్తాడుట.
వజ్రాగ్ని: ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉండే అగ్ని. దధీచి మహర్షి వెన్నుముక వజ్రాయుధం అని మనందరికీ తెలిసినదే. మన పురాణాల ప్రకారం ప్రప్రధమంగా నిప్పును కనుగొన్నది దధీచి మహర్షి. అందుకనే ఆయన గౌరవార్థం మన భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును కూడా విడుదల చేసింది. మెరుపులు, పిడుగులు అగ్ని స్వరూపాలే కదా! మన పురాణాల ప్రకారం మెరుపు ఇంద్రుని వజ్రాయుధమనీ, పిడుగు వజ్రాయుధా ఘాతమనీ ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం వెన్నుముకకీ అగ్నికీ ఉన్న సంబంధం. మనిషి వెన్నెముక ఒక గొట్టంలా ఉంటుందనీ అందులో కొన్ని నాడులు ఉంటాయనీ మనకి తెలిసినదే. అయితే ఈ వెన్నెముక అనే గొట్టములో ఉండే ప్రధానమయిన నాడి సుషుమ్న నాడి. ఆ సుషుమ్న లోపల వజ్ర నాడి (దీనినే సూర్య నాడి అంటారు), ఈ వజ్ర నాడి లోపల చిత్ర నాడి (దీనినే చంద్ర నాడి అంటారు) ఉంటాయి. ఈ మూడు (సుషుమ్న, వజ్ర, చిత్ర) నాడులనీ కలిపి spinal cord అంటారు. వీటిలో సుషుమ్న నాడి ఎఱ్ఱగా అగ్ని లాగా ఉంటే, అందులో ఉండే వజ్ర నాడి వజ్రము వలే ప్రకాశముతో ఉంటుంది. ఆ ప్రకారముగా ఈ రెంటినీ కలిపి వజ్రాగ్ని అన్న వాడుక వచ్చింది. అలా వెన్నెముకలో వజ్రాగ్ని ఉంటుంది.
సూర్యాగ్ని: సూర్యుని రూపములో కనిపించే అగ్నిని సూర్యాగ్ని అంటారు. దీనినే ఆదిత్యాగ్ని అని కూడా అంటారు. "అగ్ని సోమాత్మకం జగత్" అని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఈ ప్రపంచం మొత్తం అగ్నీ, చంద్రుల రూపములో ఉందనీ, ఈ అగ్నే సూర్యుని రూపములో ప్రకాశిస్తోందనీ అర్థం. శివ-శక్తులు, ప్రకృతి-పురుషులు, వెలుగు-నీడలు లాగానే సూర్య-చంద్రుల ప్రమేయం సృష్టి వికాసానికి మూలమన్నది వాస్తవం. ప్రశ్నోపనిషత్తులో "కర్మ సాక్షి"గా సూర్యుడిని ఎన్నుకున్నారు అని చెప్పబడింది. అందువలననే అగ్నిసాక్షిగా అని వాడినా సూర్యుని సాక్షి అన్న అర్థం అంతర్లీనంగా ఉంటుంది. ఆ విధముగా రక్షకునిగా, సృష్టి వికాస ప్రక్రియా ప్రేరకునిగా అగ్నిని సాక్షిగా నియమించారని తెలుస్తున్నది.
యోగాగ్ని: అంటే కేవలం యోగము లేదా ఆలోచన వలన పుట్టేది. ఈ యోగాగ్నిని సతీదేవి, దధీచి మహర్షి పుట్టించారు. దక్షయజ్ఞ సమయములో తనకి పరాభవం ఎదురయ్యిందని సతీదేవి బాధతో కన్నీటి చుక్కను వదిలి దానిని కాలి బ్రొటన వేలితో రాసినప్పుడు అగ్ని పుట్టి అందులో ఆవిడ దగ్ధమయ్యింది. అలానే దేవతల ఆయుధాలన్నీ కావాలన్నప్పుడు దధీచి మహర్షి యోగాగ్నిని పుట్టించి దగ్ధమయ్యి తన అవయవాలను ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే గొప్ప వాళ్ళు, మహా యోగులు వారి యోగా శక్తితో తలుచుకున్న వెంటనే అగ్నిని పుట్టించి వారి శరీరాన్ని వారే దగ్ధం చేసుకునేవారని తెలుస్తుంది.
ప్రేతాగ్ని: దీనినే స్మశానాగ్ని అని కూడా అంటారు. దీనిని తలుచుకోగానే నాకు రామాయణములోని ఒక ఉపమానం జ్ఞప్తికొస్తుంది. అదేమిటంటే స్మశానాగ్ని కూడా అగ్నే అయినా మంచి పనులకి ఎలా పనికి రాదో అదే విధముగా రావణుడు ఎంత తేజోసంపన్నుడైనా రాముని ముందు పనికి రాలేదు అని. మానవ దేహం పంచభూతాలతో చేసినదే కనుక మనిషిని దహనం చేసి మళ్ళీ ఆ పంచభూతాలలో ఐక్యం చేస్తారు. ఇలా శరీర దహనానికి ఉపయోగపడే అగ్నినే ప్రేతాగ్ని అంటారు.
మన మంత్రపుష్పంలో ఈ అగ్ని గురించిన ప్రస్తావన ఉంది. ప్రతీ మనిషిలోనూ భగవంతుడున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక అగ్నిశిఖ రూపములో, నల్లని మబ్బులో విద్యుల్లత (మెరుపు) వెలిగినట్టు, సూక్ష్మంగా, పచ్చగా ఉన్నాడుట. ఆ అగ్నిశిఖ మధ్యలో ఉన్న ఈయనే శివుడు, ఈయనే బ్రహ్మ, ఈయనే విష్ణువు అని చెప్పబడింది. dee మనది పవిత్రమయిన భారత దేశం. భా అంటే వెలుగు లేదా కాంతి. "భాయాం రతః" భారతః అన్నారు. ఎవరయితే ఈ అగ్ని రూపములో ఉన్న పరమాత్మ వెలుగుని ఉపాసన చేసి మనోవాక్కాయ ("భా" అంటే భావం అనగా మనసు, "ర" అంటే రవం అనగా వాక్కు, "త" అంటే తనువు అనగా కాయం) కర్మలలో ఏకత్వాన్ని పొందుతారో వారే భారతీయులు అని చెప్పబడింది. అంతటి గొప్ప ప్రఖ్యాతలు ఉన్న మనం వీటన్నిటినీ ఆచరించి, ఆలంబించినప్పుడే ఈ జన్మకి, మన పుట్టుకకి ఒక సార్థకత.

36 comments:
రసజ్ఞ గారు,
మీలాగా ఎవరైనా చెప్పగలరా అనిపించేటట్టు వ్రాస్తారండి. మీతో పరిచయం కలగడమే మా అదృష్టం. అసలు తెలుగు బ్లాగులనే ఈ ప్రపంచంలో కి రాకపోతే మీ పరిచయం అయ్యేదో, కాదో.
రసజ్ఞజీ! ఇప్పుడే మీ ఆర్టికల్ "జ్యోతి" మాలిక పత్రికలో చదివాను. బాప్ రే ఇంత చక్కగా ఎలా రాయగాలుగుతున్నారండీ? జోహార్లు..............
Excellent!
@ లక్ష్మీదేవి గారూ
మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారండీ. ఎంత మాట! మీ పరిచయం నా అదృష్టం. ఇండియా వచ్చాక మీ ఇంటికి వచ్చి తెలుగు పద్యాలు వ్రాయటం నేర్చుకోవద్దూ మీ వద్ద? ధన్యవాదాలండీ!
@ సత్యవాణి గారూ
మీకు అంత బాగా నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండీ. మీ అభిమానానికి ధన్యవాదాలు!
@ ఫోటాన్ గారూ
థాంక్యూ సో మచ్!
'అగ్ని' గురించి రాశారు, బాగుంది.
టైటిల్ 'జ్యోతి' గురించి ప్రస్తావించనైనా లేదు?! సశేషమా?
Congratulations రసజ్ఞ గారూ. ఇంకా చదవలేదు, కానీ ఎలా రాసి ఉంటారో ఊహించగలము.
రసజ్ఞ గారు,
మీ జ్ఞానాగ్ని తో మా అగ్నానాన్ని దగ్దం చెస్తున్నారు.మీ లాంటి వాల్లతొ పరిచయం కావడం మా అదృష్టం.....
ఙ్ఞాన విఙ్ఞాన రూపాయై ఙ్ఞానమూర్తే నమో నమః |
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః
ఇంత గొప్ప పోస్ట్ చదివాక నాలో "జ్ఞానాగ్ని" రగిలిందండీ...
ఆ జ్ఞానాగ్ని ఏం చెప్పిందంటే... "రసజ్ఞాగ్ని" అని ఇంకో రకమైన అగ్ని ఉన్నదనిన్నూ... అంటే రసజ్ఞ గారు రాసిన పోస్ట్ చదివినప్పుడు ఉద్భవిస్తుందనిన్నూ..
అద్భుతమైన పోస్టు.. కొన్ని డౌట్స్ ఉన్నాయి.. తర్వాత అడుగుతాను..
మీకు రెండు చేతులూ ఎత్తి నమస్కారాలు చేస్తూ...
పెద్దవాళ్ళు పొగిడేస్తే ఆయుక్షీణం అంటారు. దీర్ఘాయుష్మాన్భవ!
చక్కటి విషయాలను తెలియజేసారు.
అద్భుతం!
సాహో బాలికా సాహో!! ఒక కన్య వివాహానికి ఎటుల అర్హత పొందునో అన్న విషయము మమ్ములను మిక్కిలి ఆకర్షించినది.ఇటులనే అందరికీ జ్ఞాన జ్యోతివై సర్వదా వెలుగొందుము బాలికా:)
రసజ్ఞ కాదిక మీరు, రసగ్ని....హి....
రసజ్ఞ గారు మీ బ్లాగ్ ని ఈ మధ్యనే చూసాను ..... అసలు మీ ప్రతిభ గురించి చెప్పటానికి నాకు తెలిసిన మాటలు చాలవేమో ...... ఒక్కమాటలో చెప్పాలంటే అద్భుతం.....మీకు తెలుగు భాష మీద ఉన్న ప్రేమ , అభిమానం మీ ప్రతీ పదం లో కనిపిస్తోందండి ....... మీరు ఒక విషయం గురించి రాయాలి అనుకున్నపుడు మీరు దాని మీద ఎంత రిసెర్చ్ చేస్తారో ఆలోచిస్తే నా బుర్ర వేడెక్కిపోతోంది ......
http://www.youtube.com/watch?list=AL94UKMTqg-9BCzX6YY-lC_nggkgj6nFRy&v=nkKxGzm98AU&feature=player_detailpage
మీ జ్ఞానాన్ని మరో సారి మాతో పంచుకునందుకు కృతఙ్ఞతలు
ఎపతిలాగే అద్భుతం గా రాసారు!
అది సర్వం ఖల్విదం బ్రహ్మం అనుకుంటానండి...నేను ఇంటర్నెట్ లో చదివిందే..ఒక సారి సరి చూడగలరు...
కృష్ణ
అభినందనలు రసజ్ఞ ..
చాలా బాగా వ్రాశారు. మీ పోస్ట్ చదవటానికి ప్రశాంతంగా,తీరికగా ఉండాలి కదా!
ఎప్పటిలాగే నా మట్టి బుర్రకి.. కొంచెం ఆలస్యంగా.. ఎక్కింది.
ఇన్ని రకాల అగ్నులు ఉంటాయా? నాకు మా క్రిష్ణ సినిమాలో సెప్పినట్లు అగ్ని అంటే జమదగ్ని ఒక్కడే అనుకునే వాళ్ళిమి..
వివాహ సమయంలో అగ్నిసాక్షి గురించి మీరు వివరించిన తీరు అద్భుతం. నా పిడకలవేట లో కలిగిన ఒక ధర్మ(దిక్కుమాలిన) సందేహం.. పూర్వకాలంలో బాల్య వివాహాలు చేసుకునేవారు కదా.. అంటే బాలికకు యుక్త వయస్సు రాకముందే పెళ్ళి చేస్తారు కదా.. మరి అలాంటి సంధర్భం లో మీరు తెలిపిన మంత్రం సహేతుకమేనా?
1st time reading your blog and mighty impressed.. after reading all posts.. the only thing that came to my mind is.. "You are EXCEPTIONAL".. Keep surprising :)
అగ్ని గుణము గూర్చి ఎంతో ప్రస్పుటంగా వివరించారు రసజ్ఞ గారు. అనుసరణకు చాలా బాగుంది ఇదివరకు నాలో ఉన్న చీకటి ఇంకాస్త తొలగించారు జ్యోతిర్మయం చేసారు. ఎప్పటిలాగే మీరు రాసే విధానం కన్నా దానికున్న కారణం మాత్రం అభినందనీయం. మీలో ఉన్న ఈ అగ్నికి ఏమి పేరో తెలియదు కాని అది ధహించదు భస్మం చేయదు అందుకునే కొలది జ్ఞానం పెంపొందిస్తు ఎల్ల వేళలా వెలుగిస్తుంది. నా ఈ ఆదివారమును వెలుగుమయం చేసారు చాలా సంతోషం.
" విడిది లేదు రసాగ్నికి
అంతం లేదు దాని సాహిత్యాగ్నికి
జ్వలించే కొలది వెలుగు మయం
స్నేహం చేసే కొలది వెన్నల తాపం... "
హృదయ పూర్వక స్నేహితులరోజు శుభాకాంక్షలు :)
@ SNKR గారూ
కాదండీ. సమాప్తమే. వ్యాసం మొదటిలోనే చెప్పాను కదండీ. జ్యోతికి ఒక రూపం ఇస్తే ఆయనే అగ్ని. అందుకే జ్యోతిస్వరూపుడు అని మొదలుపెట్టి ఆయన గురించి వ్రాశాను. ధన్యవాదాలు!
@ చిన్ని ఆశ గారూ
ముందుగా మీకు ధన్యవాదాలు! ఇలా ఊహించకుండా చదివి ఎలా ఉందో చెప్దురూ :)
@ రఘు గారూ
మీరు మరీనండీ! మీ అందరి ఆదరాభిమానాలు పొందటం నా అదృష్టం. కృతజ్ఞతలు!
@ రాజ్ కుమార్ గారూ
హహహ! రసజ్ఞాగ్ని నా? నేనెప్పుడూ వినలేదు సుమీ :) వివరణ ఇచ్చినందుకు థాంక్యూ :):)
మీ సందేహాలు ఎప్పుడయినా సరే నిరభ్యంతరంగా అడగండి. మీ సందేహాల కోసం ఎదురు చూస్తూ......
అయ్యయ్యో! ఎందుకండీ చేతులని అంత కష్టపెడతారు? ఇంతక ముందే చెప్పాను కదా ఎంచక్కా షేక్ హాండ్ ఇమ్మని. నెనర్లు!
@ తాతగారూ
మీ ఆశీర్వాదాలు ఇలానే ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ.. ధన్యవాదాలు!
@ అనూరాధ గారూ
ధన్యవాదాలండీ!
@ అజ్ఞాత గారూ
చాలా థాంక్స్ అండీ!
@ సుభా
హహహ! మిమ్మల్ని ఆకర్షించినందుకు చాలా ఆనందంగా ఉందండీ! మీ ఆశని నెరవేర్చడానికి సర్వదా ప్రయత్నిస్తాను. మిక్కిలి ధన్యవాదాలు!
@ భాస్కర్ గారూ
మీరు అంతగా లీనమయిపోయారనమాట :):) నా పేరు మార్చేస్తే నేనొప్పుకోను :(:( ధన్యవాదాలండీ!
@ భాను గారూ
మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలండీ! మాటలు చాలవు అంటూనే చాలా బాగా చెప్పారు. మీ అభిమానానికి ధన్యవాదాలండీ!
@ తనూజ్ గారూ
మీరిచ్చిన పాటని మూడు, నాలుగు సార్లు వినుంటాను పూర్తిగా అర్థం చేసుకోవడానికి. నిజంగా అది నా కోసమేనా!! చాలా చాలా థాంక్స్ అండీ!
@ కృష్ణ గారూ
అవునండీ అది ఖల్విదం నే, కాకపోతే అంత పెద్ద వ్యాసం వ్రాసి పంపేటప్పుడు ఓవర్ లుక్ లో (చాలా సరిచేసాను కానీ అది) అలా తప్పించేసుకుంది. మీరు పట్టేసుకున్నారు :) మన్నించాలి, ఇప్పుడు మార్చలేమండీ! సరిదిద్దినందుకు, మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
రసజ్ఞ, అగ్ని లేకుండా జ్యోతి వుండదా? నాకెందుకో జ్యోతి, అగ్ని రెండు వేరే అనిపిస్తోంది. :)
అగ్ని వున్న ప్రతిచోట జ్యోతి వుండాల్సిన అవసరం లేదు మీరుదహరించిన జఠరాగ్ని అలాంటిదే. మిణుగురు పురుగులనుంచి జ్యోతి వస్తుంది కాని అగ్ని(వేడి) వుండదు.
కాదు, అదంతే అంటే నే చేసేదేమీ లేదనుకోండి. :)
@ వనజ గారూ
ముందుగా మీ అభినందనలకు నా అభివాదాలండీ! మీరు భలే వారే! మీది మట్టి బుర్రేమిటి? మరీ చోద్యం కాకపోతేను? తీరుబడిగా కూర్చుని, మొత్తం చదివి, మెచ్చినందుకు ధన్యవాదాలు!
@ సత్య గారూ
హహహ! సినిమా నాలెడ్జ్ అనమాట :) దిక్కుమాలిన సందేహమేమిటి? అంత చక్కని ప్రశ్నను అడిగితేను. నిజానికి ఈ ప్రశ్న ఎవరో ఒకరు అడుగుతారనుకున్నాను, మీరు అడిగారు. నాకు తెలిసినంతవరకు మీ సందేహ నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను.
మన మంత్రాలన్నీ కూడా వేదకాలంలో వ్రాసినవి. యుగాలు, కాలాలు మారినా వాటిల్లో మాత్రం ఏ రకమయిన మార్పులూ లేకుండా అన్ని కాలాలకీ తగ్గట్టు వ్రాశారు. ఉదాహరణకి అప్పగింతలప్పుడు వాడే మంత్రం :
" అష్టవర్షా భవేత్కన్యా పుత్రవత్ పాలితామయా
ఇదానీం తవ దాస్యామి దత్తా స్నేహేన పాల్యతాం"
అంటే ఎనిమిది వర్షాలు (సంవత్సరాలు) నాతో ఉన్న నా కూతురిని కొడుకుతో సమానంగా చూసుకున్నాం. ఇకనుంచి తనని నీ చేతుల్లో పెడుతున్నాం కనుక తనని స్నేహంతో పాలించే బాధ్యత నీదే అని అర్థం. మామూలుగా ఏ వస్తువు (గోవు, బంగారం, ఇలా) దానమిచ్చినా "తుభ్యమహం సంప్రదదే నమమ" అని ఇస్తారు. నమమ అంటే నాకు సంబంధం లేదు అని. అన్ని దానాలకీ "తుభ్యం" అని చతుర్ధీ విభక్తి వాడిన పెద్దలు ఈ కన్యాదానానికి వచ్చేసరికి "తవ" అని షష్ఠీ విభక్తి వాడారు. అందుకనే మిగతా దానాలు ఇచ్చేస్తే దానమిచ్చినవాడికి దానితో సంబంధం తెగిపోయినా కానీ కన్యను దానమిచ్చినా కూడా దాతకి తనతో అనుబంధం, సంబంధం తెగదు. అందుకే కన్యాదాన సమయంలో నమమ అని వాడరు. ఇంత లోతుగా ప్రతీదీ ఆలోచించి మరీ మన మంత్రాలను వ్రాయటం జరిగింది. ఇంతకీ నేను ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే "ఎనిమిది వర్షములు" అన్న పదం గురించి. ఈ మంత్రాన్ని బట్టీ ఎనిమిది సంవత్సరాలు కల పిల్ల వివాహానికి యోగ్యురాలు అని తెలుస్తోంది. కానీ ఈ కాలంలో కూడా మీరు గమనిస్తే ముప్పై ఏళ్ళ యువతిని అప్పగిస్తున్నా కానీ అప్పగింతల సమయంలో ఇదే మంత్రం ఉంటుంది. అయితే ఇది మనం ఆ కాల పరిస్థితులకి అన్వయించుకోవాలి. అప్పటివారు చిన్న వయసులోనే ఎంతో జ్ఞానం, పరిపక్వత కలిగి ఉండేవారు. దానికి ఎన్నో రకాల కారణాలు ఉండవచ్చును. దీనికి మంచి ఉదాహరణ సీతమ్మవారు. కళ్యాణ సమయానికి ఆవిడ వయసు ఆరు సంవత్సరాలు(ట). వారికీ, ఇప్పటివారికీ పోలిక లేదు. ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఎనిమిది సంవత్సరాలు అంటే ఇంకా చాలా చిన్న పిల్ల.
వీటన్నిటినీ పరికిస్తే వారి వారి పరిపక్వతను బట్టీ ఇక్కడ నేను చెప్పిన చంద్ర, గంధర్వ, అగ్నుల పాలనలు ఎన్ని సంవత్సరాలు అన్నది ఆధారపడి ఉంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే నాకు తెలిసున్నంతవరకూ ప్రతీ కన్యకీ ఇన్ని సంవత్సరాలు చంద్రుని పాలన, ఇన్ని సంవత్సరాలు గంధర్వుని పాలన అన్న ఖచ్చితమయిన సమయం లేదు. అమ్మాయిని బట్టీ, తన పరిపక్వతను బట్టీ మారుతూ ఉంటాయి. అగ్ని అనుమతి లేనిదే, అగ్ని నరునికి ఇవ్వడానికి ఇష్టపడనిదే, ఆడ పిల్ల వివాహం జరగదు అని, అలానే అగ్ని నరునికి ఆ కన్యను ఇచ్చేసి వెళిపోదామని నిర్ణయించుకున్నాక కూడా ఒకసారి చంద్రుని, గంధర్వుని అనుమతులు కూడా తీసుకున్నాకనే ముగ్గురూ కలిసి ఆమె వివాహాన్ని నిర్ణయిస్తారు అని ఋగ్వేదంలో చెప్పబడింది.
మీ అభిమాన, ఆశ్చర్యాలతో కూడిన స్పందనకు మిక్కిలి ధన్యవాదాలు!
అగ్ని పై ‘రసజ్ఞ’మైన వివరణ…
చాలా బాగుంది మీ ఆర్టికల్…
అభినందనలు మీకు…
మీ నుంచి మరిన్ని మంచి పరిశోధనా వ్యాసాలను ఆశిస్తూ…
@శ్రీ
@ కళ్యాణ్ గారూ
హహహ! నేను అగ్నిని కాదు బాబోయ్! నా పేరు మార్చేయకండి :) మరింకేం? వెలిగిపోండి :):) మీకు కూడా స్నేహితులరోజు శుభాకాంక్షలు! ధన్యవాదాలండీ!
@ SNKR గారూ
కాదు, అది అంతే అని నేను మొండిగా వాదించటం లేదు కానీ, నా ఆలోచనా పరిధి మేరకు కాస్త వివరణ ఇచ్చుకుంటాను.
జ్యోతి అనేది అగ్ని యొక్క రూపాంతరం. జ్యోతిలో ఎప్పుడూ అగ్ని అంతర్ముఖంగా ఉంటూనే ఉంటుంది. అగ్ని లేకుండా జ్యోతి వెలగదు. అగ్ని అనేది నిప్పు కణం. అది దీప శిఖగా మారితే దానినే జ్యోతి అంటారు. మీరన్నట్టు జఠరాగ్నినే తీసుకుందాం. ఈ అగ్ని నిరంతరం మనలో ఉంటూనే ఉంటుంది. అది జ్యోతిగా ప్రజ్వరిల్లినప్పుడు మాత్రమే మనకి ఆకలి వేస్తుంది తప్ప అగ్ని ఎల్లప్పుడూ ఉంది కదా అని ఎల్లప్పుడూ ఆకలి వేయదుగా. అలానే మీరు చెప్పిన మిణుగురు పురుగుల్ని తీసుకుంటే, అవి జ్యోతినిస్తాయి అనటం కన్నా వెలుగునిస్తాయి అనటం సమంజసం అని నా అభిప్రాయం. ఎందుకంటే వాటి నుంచీ వచ్చే వెలుగుని bioluminescence (living light) అంటాము. అదొక enzyme-protein reaction వలన పుడుతుంది. పోనీ మీరన్నట్టు అదే జ్యోతి అని తీసుకున్నా, వాటి నుండి వెలువడేదాన్ని cold fire (శీతలాగ్ని) అంటారు. Bioluminescence is literally a 'cold fire' అని చిన్నప్పుడు చదువుకున్న గుర్తు. ఇలా చూసుకున్నా అగ్ని ఉంది కదండీ బహుశా దీనిని నివురు గప్పిన నిప్పు అనచ్చేమో!!
@ శ్రీ గారూ
మీ అభినందనలకు అభివాదాలండీ! వీలున్నప్పుడల్లా వ్రాస్తూ ఉంటాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
మీరు చెప్పింది బాగానే (కన్విన్సింగ్గా) వుంది, ధన్యవాదాలు. :)
రసజ్ఞ గారూ..
రాసినంతవరకూ మాటల్లేవు, చాలా బావుంది.
శీర్షిక విషయములో మీ వివరణ తర్వాత కూడా SNKR గారి అభిప్రాయమే (వారు కన్విన్స్ అయినప్పటికీ) నాదీనూ. జనకము నుండే జన్యము వచ్చినప్పటికీ జనక-జన్యముల మధ్య గుణ, రూప, భావ భేదాలు ఉండొచ్చని ఆర్యోక్తి.
ఇక్కడ జ్యోతికి జన్మనిచ్చేది అగ్నియే అయినప్పటికీ జ్యోతినీ అగ్నినీ వేరుగా చూడాలని నా అభిప్రాయం.
:)
@ SNKR గారూ
మీరు కన్విన్స్ అయినందుకు ధన్యవాదాలండీ!
@ అరుణ్ గారూ
ముందుగా మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు!
వాటి మధ్యన ఉన్న సారూప్యతని అంతకన్నా ఎలా వివరించాలో తెలియటం లేదు. ఆ రెండూ రూపాంతరాలు తప్ప గుణ, భావాల్లో వేరు కాదు. మీరెంత చెప్పినా అగ్ని లేని జ్యోతినీ, జ్యోతిలేని అగ్నినీ ఊహించుకోలేకపోతున్నాను.
@ రెహ్మాన్ గారూ
ధన్యవాదాలు!
ఈ పోస్ట్ ఇంతకు ముందు చూసి తీరిగ్గా చదవాలనుకున్నాను.ఇప్పటికి కుదిరింది.కామెంట్స్ అన్నీ కూడా చదివాను.వ్రాసే విషయం లో మీ పట్టుదల,తీవ్రత ,అన్ని విధాలుగా సమగ్రంగా వ్రాయాలనే మీ తపన ఇలా చాలా లక్షణాలు మీలో కనిపిస్తుంటాయి.మీరు ఇలాంటి వాటితో పాటు ఇంకా వర్తమానం లోని విషయాలపై దృష్టి పెట్టి వ్రాస్తే ఇంకా అద్భుతం గా ఉంటుందేమో పరిశీలించండి.పురానాలన్నీ అవపోషణ పట్టినట్టున్నారు.మీ passionate reading కు చప్పట్లు.
ఇక పోతే మీలాగే నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది కానీ మీ విభాగం లో కాదు.కానీ అవన్నీ తెలుసుకోవటమంటే ఆసక్తి.నా కెందుకో ఈ వ్యాసంలోని వివరాలేలా వున్నా మన పూర్వీకుల ఊహా శక్తి,సృజనాత్మకతకు,వారి మేధాశక్తికి ఎంతో ఆనందం ఆశ్చర్యం వేస్తుంటుంది.అగ్ని లోని రకాల గురించి అద్బుతం గా వివరించారు.మీరు ఇండియాలో ఉండటం లేదా!మీకు అభినందనలు.
@ రవి శేఖర్ గారూ
ముందుగా తీరిక చేసుకుని మరీ ఈ వ్యాసాన్ని చదివినందుకు, మీకు ఇది నచ్చినందుకు ధన్యవాదాలండీ! మీరు సూచించినట్టు వర్తమానం గురించి కూడా తప్పక వ్రాస్తానండీ, కాకపోతే కాస్త సమయం పడుతుంది. వారి ఊహా శక్తుల ముందు ఇవన్నీ అద్దంలో ఆవ గింజంత! అని నా అభిప్రాయం. ప్రస్తుతానికి ఇండియాలో లేనండీ, మీ అభినందనలకు మరొక్కసారి అభివాదాలు.
I enjoy, result in I found exactly what I was taking a look for.
You have ended my four day long hunt! God Bless you man. Have a nice day.
Bye
My webpage; dating online (http://bestdatingsitesnow.com)
Truly no matter if someone doesn't be aware
of then its up to other visitors that they will assist, so here
it takes place.
Also visit my web-site: dating sites (bestdatingsitesnow.com)
అధ్బుతం! మేడం మీ రచన తీరుకి, ఆ వివరణకి కూడా నేను ఫిదా ఐపోయానండి.
Post a Comment