ఈ రోజున అర్థరాత్రి అంతర్వేది (గోదావరీ నది సముద్రంలో కలిసే చోటు) శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకలు శోభాయమానంగా జరుగుతాయి. కనుక ఆయనని స్మరించుకుంటూ భక్తితో ఆయనకి అర్పించుకుంటున్న అక్షర మాల.
అంతర్మధనమే చేశా స్వామీ
ఆది అంతమూ నువ్వే స్వామీ
అంతర్వేదిలో వెలసిన స్వామీ
శ్రీలక్ష్మీ సమేత నరసింహ స్వామి
ప్రహ్లాదునే బ్రోచిన నరహరివి
సిరిసంపదలిచ్చే శ్రీ హరివి
మాంపాహి పాహి దయకనవా నీ రక్ష మాకు ఉందనవా
వేదాలు కాచగా వేదాద్రిపైన
వెలసిన జ్వాలా నరసింహ
దైత్యుల శిక్షించి ఆ బిలములోన
వెలసిన ఉగ్ర నరసింహ
యోగి పుంగవూ నువ్వే
యోగానందువీ నువ్వే
పతిత పావనా పరమ హంసవు నువ్వు
కాలగమనమే కలిగించే నువ్వు
లోక కళ్యాణ మొనరించె నువ్వు
మాంపాహి పాహి దయకనవా నీ రక్ష మాకు ఉందనవా
పీడలు తీర్చగ యాదగిరి పైన
వెలసిన సుందర నరసింహ
భక్తుల రక్షించ ధర్మపురిలోన
వెలసిన ఆనంద నరసింహ
భోగి మణివీ నువ్వే
భోగానందువీ నువ్వే
ఏడేడు లోకాల ఏలిక నువ్వు
తరతరాల మా ఇలవేలుపు నువ్వు
యుగయుగాలు కల్పించే నువ్వు
మాంపాహి పాహి దయకనవా నీ రక్ష మాకు ఉందనవా
ఉగ్ర నారసింహ, కృద్ధ నారసింహ, వీర నారసింహ, విలంబ నారసింహ, కోప నారసింహ, యోగ నారసింహ, అఘోర నారసింహ, సుదర్శన నారసింహ, లక్ష్మీ నారసింహ, ఈ తొమ్మిది అవతార రూపాల్నీ కలిపి నవనారసింహ రూపాలు అంటారు. అలానే అహోబిలంలో కనిపించే నవనారసింహ మూర్తులు... ఛత్రవత నారసింహ, యోగానంద నారసింహ, కరంజ నారసింహ, ఊహా నారసింహ, ఉగ్ర నారసింహ, క్రోధ నారసింహ, మాలోల నారసింహ, జ్వాలా నారసింహ, పావన నారసింహ.
43 comments:
!! రసజ్ఞ !! గారు చాల బాగా వ్రాశారు
నరసింహ స్వామిని ఇన్ని పేరులతో కొలుస్తారు అని తెలియదు..
మంచి విషయం తెలియపరిచారు ధన్యవాదములు
రసజ్ఞా అంతర్వేది అంటే గుర్తుచ్చింది, మొన్న వేసవిలో ఆ స్వామి దర్శనం చేసుకున్నాము. అన్నా, చెల్లెలు గట్టు కూడా చూసి వచ్చాము. నువ్వు భక్తిగా సమర్పించే ఈ అక్షరమాల ఆ స్వామి సన్నిదికి తప్పకుండా చేరుతుంది.
Chaala baagundi..
చాలా బాగా స్వామిని స్మరించారు .
చాలా బాగుంది రసజ్ఞగారూ...
మొన్ననే మేము యాదగిరి గుట్ట వెళ్ళామండీ..
అంతర్వేది కూడా చూడాలి మరి ఎప్పుడు వస్తుందో అవకాశం.
రసజ్ఞగారూ.. నరసింహస్వామి స్తోత్రం చాలాబాగుంది..
బాగుంది, fine presentation! ఇక్కడ ఒక మాట... ఇలాంటి భక్తి ప్రధాన రచనలలో 'నువ్వు' 'నువ్వే' అనడం కంటే,'నీవు' 'నీవే' అంటే బాగుంటుందనుకుంటాను!ఈ పోస్టును మార్చాల్సిన పనిలేదు! ఇక ముందు ఇలాంటి రచనలలో, మీకు నచ్చితే పాటించడానికి ప్రయత్నించమని!
ధన్యవాదాలు!
@రసజ్ఞ గారు
వేకువ జామున నరసింహ స్వామీ దర్శనం ఎంతో ఆనంద దాయకం. ఎంత ఉగ్రరూపుడో అంత శాంతి స్వభావుడు అ స్వామీ. భక్తి నిండిన భావనతో చక్కని పాటను అందించారు . ఆ స్వామీ మీ మొరను ఆలకించి కరునిస్తాడని ఆశిస్తున్నాను.
నీవెలసిన దివ్య క్షేత్రాలెన్నో
నీ రూపానికి ప్రతిరూపాలెన్నో
భక్తులపై నీ కరుణ మాత్రం ఒక్కటే
ఓ ఉగ్ర నారసింహ లక్ష్మి నారసింహ
నీ దీవెనలు మాపై కురిపించవా!
ఏ క్షేత్రము నందు ఏ రూపమునీదో
ఏ శాస్త్రము నందు ఏ నామము నీదో
నేనురుగను నరసింహుని తప్ప
ఆ దయాగుణ రూపము తప్ప
అ నర నారాయణుని తప్ప
నీ దీవెనలు మాపై కురిపించవా!
రౌద్రముతో క్షుద్రమును భలికొని
శాంతముతో నీ బక్తులను రక్షిస్తూ
మా మదిలో సౌమ్యుడై వెలిసావయ్య
నీ రూపమునకు వ్యతిరేకమై నిలిచావయ్య
ఓ దేవ దేవా మమ్మేల రావా
నీ దీవెనలు మాపై కురిపించవా!
అంతర్వేది ఏ జిల్లాలో ఉంది? వీలున్నపుడు కొన్ని వివరాలు రాయండి?
చాలా బాగా రాశారండీ.. నరసింహ స్వామికి ఇన్ని పేర్లు ఉన్నట్టు తెలియదు నాకు.;( ఆరేళ్ళ కిమ్దట అంతర్వేది దగ్గరవరకూ వెళ్ళి , తర్వాత చూద్దాం అని వచ్చేశాను. ఎప్పటికి వెళతానో ఏమో.. ;( ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ లో మాత్రమే నరసింహస్వామిని చూశాను. సింహాచలం శ్రీ వరాహనారసింహుని చూశాను కానీ నిజరూప దర్శనం కాలేదు ;(
రసజ్ఞ గారూ,
విలంబ నారసింహ, మాలోల నారసింహ అంటే అర్థం ఏమిటి?? నేనెప్పుడూ ఈ పేర్లు వినలేదు అందుకే అడుగుతున్నా..
మొత్తం కోస్తా ఆంధ్ర ప్రాంతం లో నేను చూసిన ఏకైక గుడి అంతర్వేది మాత్రమే.. అందరికీ ఆ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను..
-కార్తీక్
@ రసజ్ఞ గారూ,
చాలా బాగుందండీ పోస్టు..
మీ బ్లాగులో రాసే చాలా విషయాలు చూస్తే భలే ముచ్చటేస్తుందండీ.. ఇంత చిన్న వయసుకి తెలుగు సంస్కృతీ సంప్రదాయం, సాహిత్యం.. వీటికి సంబంధించిన విషయాలపై మీకున్న ఆసక్తి, పరిజ్ఞానం చూసి చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. అభినందనలు.. ఇలాగే రాస్తూ ఉండండి. :)
Excellent.
బావుందండి. మా ఇలవేల్పు మీద చక్కటి స్తుతి రాసేశారు.
మేము మట్టపల్లి లక్ష్మినరసింహ స్వామి వారి (నల్గొండ జిల్లాలోనిది) దర్శనం ప్రతీ సంవత్సరం చేసుకుంటాం. ఎంతో ప్రశాంతమైన అందమైన ప్రదేశం అది.
అక్కడ ఉన్నంత సేపు వేరే ప్రపంచం గుర్తుకు రాదు.
కొద్ది రోజుల్లో దర్శనానికి వెళ్లాలని మొన్నే అనుకున్నాం. ఈ నేపధ్యంలో మీరు రాసిన ఈ టపా మమ్మల్ని ఇంకా త్వరగా దర్శించుకోమని హెచ్చరిస్తోందేమో.
Chala bagundi... Kanula mundhu darshincha.. mee paata tho :)
భక్తి'రసజ్ఞ' భరితమైన పాటను రాసారు
నవ రసజ్ఞ గారు!
http://akhilavanitha.blogspot.in/
చాలా బాగుంది, సంధర్భోచితంగా, ఆసువుగా రాయాలనుకొని రాయడం చాలా కష్టం... చాలా బాగా చెప్పారు
@రసజ్ఞ గారు.. చాలా బాగా రాసారు.. మీరు ఆ దేవునికి అర్పించుకున్న అక్షరమాల అద్బుతం..
రసగుల్లా లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం దివ్యంగా జరిగిందిట.. బహుశా ఆ దివ్యోత్సవానికి మీ రచనా వెలుగు కూడా తోడై ఉంటుంది.. అందుకే అంత ఘనంగా జరిగుంటాయి ఉత్సవాలు.
ఎప్పుడూ వినని నవ నవ విధము లైన నృసింహ స్వామి నామములను తెలిపి చదివిన వారికి స్వామి నామ స్మరణ ఎక్కువ సార్లు చేసే అదృష్టం కలిగించారు. ధన్యవాదములు.
'నవరస భరితం' బ్లాగున
నవవిధ మైనట్టి నృసింహ నామములన్ మా
నవులెవరైనను జదువగ
భవ బంధములన్ని తొలగు భద్రము గలుగున్.
@ తెలుగు పాటలు గారూ
ధన్యవాదాలండీ! ఇప్పుడు తెలిసింది కనుక ఈ సారి నృసింహ క్షేత్రాలను సందర్శించినప్పుడు గమనించండి!
@ తాతగారూ
థాంక్యూ!
@ జ్యోతిర్మయి గారూ
అవునండీ అంతర్వేదికి అదే ప్రధాన ఆకర్షణ! గోదావరి మంచి నీరు, సముద్రుని ఉప్పు నీరు, మధ్యలో రెండూ కలగలిసిన నీరూ ఆ ప్రదేశం వర్ణనాతీతం! మీరు కోరుకున్నట్టు చేరితే అంతకన్నా ఇంకేం కావాలి నాకు మాత్రం? మీ మంచి మనసుకి నా నెనర్లు!
@ వంశీ కమల్ గారూ
చాలా థాంక్స్ అండీ!
@ మాలా కుమార్ గారూ
నా స్మరణ విని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు!
@ శోభ గారూ
మీకు నచ్చినందుకు థాంక్స్ అండీ!
@ రాజి గారూ
నేను వ్రాసిన స్తోత్రం మీకు నచ్చినందుకు నెనర్లు! రండి మరి ఎలాగో కోనసీమ వైపు వస్తానన్నారుగా వచ్చేయండి ఏకంగా కోరుకొండలో నారసింహుని కూడా దర్శించుకుందురుగాని!
@ వెంకట్ గారూ
మీకు నచ్చినందుకు,మీ సూచనకు కృతజ్ఞతలండీ! ఈ సారి నుంచీ తప్పక దృష్టిలో ఉంచుకుంటాను!
@ కళ్యాణ్ గారూ
నేను వ్రాసినది మీకు నచ్చినందుకు ధన్యవాదాలు! మీరు వ్రాసిన పాట కూడా చాలా బాగుంది! చక్కగా స్తుతించేసారే!
@ రమ / రామ గారూ
ముందుగా మీరు నన్ను మన్నించాలి మీ పేరు సరిగ్గా తెలియలేదు నాకు! అంతర్వేది తూర్పు గోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉంది. ఇక్కడ గోదావరీ నది పాయ (శాఖ) అయిన వశిష్ట బంగాళాఖాతంలో కలుస్తుంది. తప్పకుండా వ్రాస్తానండీ! ధన్యవాదాలు మీ స్పందనకి!
@ రాజ్ కుమార్ గారూ
తప్పకుండా మళ్ళీ రండి! మీ కెమేరాకు మంచి పని పడుతుంది. అక్కడ అద్భుతమయిన ఎన్నో సహజ అందాలు ఉన్నాయి. అదే కాక ఒడ్డున ఇసుకలో జనాలు లేనప్పుడు ఎఱ్ఱని సముద్ర పీతలు బయట వీర విహారం చేస్తూ ఉంటాయి. మన అడుగుల అలికిడికి అవి ఇసుకలోనికి వెళిపోతాయి ఎంత బాగుంటుందో! చందనం తొడుగు ఏడాదికి ఒక్కసారే తీస్తారండీ అప్పుడు మాత్రమే కుదురుతుంది. మా ఊరిలో కూడా వరాహ నరసింహ స్వామి గుడి కట్టారు అచ్చు గుద్దినట్టు సింహాచలం గుడిలానే ఉంటుంది. మీ స్పందనకి ధన్యవాదాలు!
@ కార్తీక్ గారూ
చాలా రోజులకి కనిపించారే! బాగున్నారా? మాలోల నారసింహుడు అంటే లక్ష్మీ దేవిని తన ఒడిలో తొడపైన (చిత్రంలో చూపినట్టుగా) కూర్చోపెట్టుకున్న స్వామి అని అర్థం. లక్ష్మీ నారసింహునికి అమ్మవారు పక్కన ఉంటే మాలోల నారసింహునికి ఒడిలో ఉంటుందన్నమాట! విలంబ నారసింహుడు అన్న దానికి చెప్పాలంటే.....విలంబము అంటే ఆలస్యం, నెమ్మది అన్న అర్థాలు ఉన్నాయి. ఇందులో నెమ్మది అన్నది ప్రశాంతతని చూపిస్తుంది కనుక ప్రశాంతంగా ఉండే స్వామి అనుకోవచ్చును. అలానే విలంబము అంటే విశేషమయిన లంబము (పొడుగు) అని అర్థం ఉంది. అంటే స్వామి ఆజానుబాహుడిలా పొడవుగా ఉన్నాడు అని అనుకోవచ్చును. అలానే విలంబము అంటే విగత(కానటువంటిది) లంబము (పొడుగు) అని అర్థం ఉంది. అంటే స్వామి నారసింహుడు (నరుడు + సింహము) కనుక పొట్టిగా ఉన్నాడు అనుకోవచ్చును. ఇక్కడ దేనిని అన్వయించుకోవాలి అన్నది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఆ దేవునికి ఉన్న నామాలకి అర్థం తెలిసే అంత వయసు, అనుభవం రెండూ నాకు లేవు కనుక నాకు తెలిసిన అర్థాలు చెప్పాను. నా ఉద్దేశ్యం ప్రకారం ఇక్కడ ప్రశాంతంగా ఉన్న స్వామి అని పెట్టుకోవాలి అనుకుంటున్నాను.
మిగతావి కూడా చాలా ఉన్నాయండీ చూడతగ్గ దేవాలయాలు. మీ కోరిక తప్పక నెరవేరి ఆయన అనుగ్రహం అందరికీ కలుగుతుంది! మీ స్పందనకి ధన్యవాదాలు!
@ మధురవాణి గారూ
మీ వ్యాఖ్యకు చాలా ఆనందమేసింది. మీరంతా ఇలా ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంది. తప్పకుండా వ్రాస్తానండీ! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ లాస్య గారూ
చాలా చాలా థాంక్స్ అండీ!
@ శాండిల్య గారూ
నా స్తుతి మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు! ఆయన నా ద్వారా మరొక్క సారి మీ దర్శనాన్ని గుర్తుచేసారేమో! వీలయినంత త్వరగా వెళ్లి దర్శనానంతరం నాకు ప్రసాదం పంపడం మర్చిపోకండి ;)
@ సర్వ గారూ
నేను రచించిన పాట వలన మీకు దర్శన భాగ్యం కలిగిందంటే అంతకన్నా నాకేం కావాలి! చాలా చాలా ధన్యవాదాలండీ!
@ అనిల్ గారూ
మెచ్చుకోవటం కూడా నా పేరుతోనే మేచ్చుకున్నారే! బహు బాగుంది! థాంక్యూ!
@ ఉదయ్ కుమార్ గారూ
నా శ్రమ(భక్తి)ని గుర్తించారు! మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ ఒంటరి గారూ
నేను దేవునికి వేసిన అక్షరమాల వెదజల్లిన సువాసనలో సేద తీరినందుకు, మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ సుభా
బాగా జరిగిందని నేనూ అంతర్జాల వార్తాపత్రికలో చూశాను! కాని ఈ సారి కనీసం కల్యాణం దూరదర్శినిలో కూడా చూసే భాగ్యం దక్కలేదు! ప్చ్! అందుకే ఆ బాధతో, భక్తితో ఈ పాట వ్రాశాను! ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తోంది అంత బాగుంది మీ వ్యాఖ్య! చంద్రునికో నూలిపోగులాగా నాది ఉడతా భక్తి! ధన్యవాదాలు!
@ గోలి హనుమచ్చాస్త్రి గారూ
ఇంతటి మాధుర్యమయిన పద్యాన్ని రచించిన మీకు నమోవాకములు! ఈ టపాపై మీరు రచించిన పద్యపు చిరుజల్లులలో తడిసి ముద్దయ్యాను! మీ అమూల్య పద్యంతో కూడిన స్పందనకి కృతజ్ఞతలు!
అంతర్వేది ఆలయం చాలా బాగుంటుందండీ! దగ్గరిలోని అన్నా చెల్లెలి గట్టు ఒక పక్క భయంగా అనిపిస్తూనే మరో పక్క వింత అందాలతో శోభిస్తుంది.ఇసుకలో నడుస్తుంటే ఎర్రెర్రని పీతలు బయటికి వచ్చి లైన్లో వెళ్తూ, ఒక్కోసారి పాదాల మీదకు కూడా ఎక్కేస్తుంటాయి.
వేదాద్రి(కృష్ణా జిల్లా)లో యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆయలం, మంగళగిరిలో పానకల స్వామి ఆలయం కూడా బాగుంటాయి. మానసిక రోగాలకు గురైన వారెందరికో వేదాద్రిలో స్వస్థత చిక్కుతుందని అంటారు.
నా చిన్నప్పుడు ప్రతీ ఏడాదీ అంతర్వేది తీర్థానికి వెళ్ళేవాళ్ళం.
అంతర్వేదికి తీర్థం వస్తే మా నరసాపురానికి పండుగ వచ్చినట్టు ఉండేది.
!! రసజ్ఞ !! గారు సాంగ్ చూశారా?
బోనగిరిగారు,
అసలు తీర్ధమంతా నరసాపురం దే కదండీ! వలందర రేవు నుంచి లాంచీ ఎక్కింది మొదలు ఇసక తిప్పలో దిగే దాకా ప్రయాణం, నీటి మీద, ఓహ్!! మాటలకి అందనిది కదా!!!
@ సుజాత గారూ
నిజమే అండీ! మీరు చెప్పినట్టు నేను ఆ పీతలు కాళ్ళ మీదకి ఎక్కడం చూడలేదు! అవునండీ అవన్నీ చూశాను. మా ఇంటికి కోరుకొండ బాగా దగ్గర! ధన్యవాదాలు మీ స్పందనకి!
@ బోనగిరి గారూ
మరి సందడి అంతా నరసాపురానిదే కదండీ! కన్నుల పండుగ కదూ! ధన్యవాదాలండీ!
@ తెలుగు పాటలు గారూ
మీరు చెప్పాకే చూశానండీ! ధన్యవాదాలు నా కోసం శ్రమ తీసుకుని మరీ పాటని పెట్టినందుకు!
నమస్తే,
మీ ఆధ్యాత్మిక తృష్ణ బాగుందండి. నామటుకు ఈరకంగా వ్రాయటం చేతకాదు. మీలాంటి వాళ్ళు మన అధ్యాత్మిక, సాంస్కృతి పరంపరను తరువాత తరాలకు అందేవిధంగా తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం. నేను అంతర్వేది, సిమ్హాచలము రెండూ దేవాలాయములను దరించుకున్నాను. కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ గ్రామం దగ్గర "అహోబిలం" అనే పుణ్య క్షేత్రం ఉంది. చాలా మంది చూసే ఉంటారు. అక్కడ కొండ మీద "నరసిమ్హ" స్వామి దేవాలయం ఉన్నది. కొద్దిగ కొండ పైకి పోతే శ్రీ కృష్ణదేవరాయులు కట్టిన మండపం ఉన్నది. పూర్తిగా కొండ పైకెక్కితే అక్కడ "ప్రహ్లాద గుట్ట" అంటారు. అక్కడే కొండ అంచుగ ఒక స్థంభం ఉంది. హిరణ్యకశిపుడు తన గదతో కొట్టిన స్థంభం, నరసిమ్హ స్వామి ప్రత్యక్షము ఇక్కడే. వాతావరణము చాలా ఆహ్లాదముగ ఉంటుంది.
chaalaa baagundandee oka manchi tune lo pedithey bhakti geethamavuthundi. Keep writing more.
Yours Fan
Shreyaa
@ మూర్తి గారూ
అయ్యో ఎంతమాట! మీరు వ్రాసినవన్నీ చదివాను బాగా వ్రాస్తున్నారు ఆధ్యాత్మిక విషయాల మీద! అవునండీ నేనూ వెళ్లాను. చక్కని ప్రదేశము! ధన్యవాదాలు!
@ శ్రేయ గారూ
మీ అభిమానానికీ, ప్రోత్సహానికీ ధన్యవాదాలు! తప్పకుండా వ్రాస్తూ ఉంటాను వీలున్నప్పుడల్లా! ధన్యవాదాలు!
'రసజ్ఞ' విరచిత నారసిమ్హ స్తుతి బాగుందండి....
నరసిమ్హ స్వామి మా యింటి యిలవేల్పు
సింగోటం నరసిమ్హ స్వామిని తరచు దర్షిస్తుంటాం.
మీకు బాష పై,విషయాలపై మంచి పట్టుందండి...యిలాగె రాస్తూండండి....
చాలా బాగుంది రసజ్ఞగారూ.........
రసజ్న గారూ! నవరసభరితం గా చెప్పారు
Rasagna garu....Bhakthi tho nindipoyindi me kavitha...chala baga rasaru :)
Antharvedi na chinnappudu 2004 krishna puskaralappudu vellanu
avanni me valla gurthochae...
chala baaga raasaaru
ilantivi inkaa raayalani na yokka manavi...
-Yours New Fan
@ రఘు గారూ!
బాగున్నారా? చాలా రోజులకి కనిపించారు! మీరిలా ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ ఉండాలే కాని తప్పకుండా వ్రాస్తానండీ! మీ అభినందనల వర్షంలో తడిసాను! ధన్యవాదాలు!
@ bhavaraju గారూ
మీ స్పందనకి, మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ వల్లి గారూ
నా భక్తిని ఆస్వాదించిన మీకు కృతజ్ఞతలండీ!
@ వెంకట్ గారూ
మీ అభిమానానికి ధన్యవాదాలండీ! ఈ టపా వల్ల మీరు పాట రోజుల్లోకి వెళ్ళారనమాట! సంతోషంగా ఉందండీ!
ఆహా.. చాలా అద్భుతం గా చెప్పారండీ!
మీ బ్లాగ్ లో చాలా ఆలస్యంగా కామెంట్ పెడుతున్నందుకు :(
నాకు బాగా ఇష్టమైన కీర్తన్
ప్రతివారం ఒక్కసారైనా వింటాను ఇది.
నమస్తే నరసింహయా
ప్రహ్లాదహ్లాద దాయినే
హిరణ్యాకసిపోర్ వక్షః
శిలటంకా నఖాలయే
ఇతో నరసింహా పరతో నరసింహా
యతో యతో యామి తతో నరసింహా
బాహిర్ నరసింహా హ్రిదయే నరసింహా
నరసింహమదిం శరణం ప్రపద్యే
తవ కర కమల వారె నఖం అధ్బుత శ్రింగం
దళితా హిరణ్యకసిపో తను భ్రింగం
కేశవ ధ్రితా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశా హరే జయ జగదీశా హరే
తప్పులుంటే క్షమించాలి
ఇది విన్న ప్రతిసారి చాలా ఆహ్లాదం గా అనిపిస్తుంది
తన్మయత్వం తో కూడిన భావం... ఇంకేం కావాలి జీవితానికి అని అనిపిస్తూ ఉంటుంది
మెట్టినింట నరసింహ స్వామి ఇలవేల్పు కావడంతో, పెళ్ళయ్యాక చాలా నరసింహ క్షేత్రాలు చూడగల భాగ్యం దక్కింది నాకు.
అహోబిలంలో ఊహా నరసింహ స్వామి ఎవరు ? అలా ఏమీ ఉన్న గుర్తు రావడం లేదు, మీకు మరిన్ని వివరాలు తెలిస్తే పంచుకోగలరా? అలాగే మీరు భార్గవ నరసింహ స్వామిని మరచిపోయారు :)
నా అహోబిల యాత్రా విశేషాలు జ్ఞాపకాలుగా ఇక్కడ దాచుకున్నా : మీరు చదివారు కూడా :) - గుర్తున్నాయా ?
http://www.madhumanasam.in/2011/09/blog-post_13.html
excellent
'రసజ్ఞ' గారు
keep it up
?!
@ హరే కృష్ణ గారూ
ఫరవాలేదండీ! చదివి స్పందించినందుకు ధన్యవాదాలు! నిజమే చాలా బాగా చెప్పారు మీరు కూడా నాతో గొంతు కలిపినందుకు కృతజ్ఞతలు!
@ మానస గారూ
అయ్యో! మరచిపోలేదండీ గుర్తుంది!
¨జ్వాలా అహోబిల మాలోల క్రోద కారంజ భార్గవ యోగానంద క్షాత్రవత పావన నవ మోర్థ్యః¨ అన్నట్టుగా అహోబిల, భార్గవ నారసింహుల బదులుగా నేను వాడినవి ఊహా, ఉగ్ర నారసింహులు. ధన్యవాదాలు మీ స్పందనకి!
@ శివ గారూ
బాగున్నారా? చాలా కాలానికి కనిపించారు! మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
Post a Comment