Tuesday, January 03, 2012

సుస్వరాల అక్షర మాల



నా అక్షరాల తొలి పూజ వేటూరికే
ఈ సుస్వరాల మల్లెమాల సినారెకే
సమర్పించుకుంటాను సగర్వంగ నేను
పాట పాడుకుంటాను సిరివెన్నెల లోనూ

చంద్రబోసు జాలాది చైతన్యం నింపగా
భువనచంద్ర విశ్వ సౌఖ్యాలే పంచగా
ఆత్రేయుడు ఆరుద్రుడు నా మనసే దోచగా
జొన్నవిత్తుల కందికొండ వెన్నెలకంటి కొసరాజు
సాహితీ సౌరభాలు ఆలకించరా
నే కీరవాణి రాగంలో ఆలపించగా

రాజశ్రీ శ్రీశ్రీలు యదార్ధాన్ని తెలుపగా
సుద్దాల గద్దరు సుద్దులెన్నో పలుకగా
దాశరధీ ఆ దాసరి నా మదిలో నిలువగా
దేవులపల్లి గురుచరణు భాస్కరభట్ల పైడిశెట్టి
ఓ సామవేద భావాన్ని పండించరా
ఆ సాహిత్యం అనంతంగా వర్ణించగా

సముద్రాల పింగళ హై హై నాయకులు కాగా
జోగయ్య దానయ్య పద జిగిబిగిలే తెలుపగా
రసరాజు ఘంటసాల నా హృదయ వీణ మీటగా
భానుమతి రామకృష్ణ మల్లేపల్లి మైలవరపు
మన కేశవులే కవులకు ఆదర్శం అవ్వరా
గంధర్వ గానంలో మన బాలు విహరించగా

44 comments:

భాస్కర రామిరెడ్డి said...

How did u miss many great writers :)

♛ ప్రిన్స్ ♛ said...

mi paatalu blog-ke ankitama???

జ్యోతిర్మయి said...

సూత్రధారులే పాత్రధారులైన సుమదురగీతం...

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఇక్కడ సుస్వరాల కన్నా స్వర్ణాక్షరాలు, సువర్ణ వర్ణాలు అంటేనే సరిగా ఉంటుందేమో!
అందర్నీ చక్కగా స్మరింపజేశారు. బాగున్నది.

ఎందుకో ? ఏమో ! said...

@ భాస్కర రామి రెడ్డి

Sir, I think she may updated, (try to help her by informing the remaining people's names)

@ Rasagna gaaru

kindly try to put "Chaithanya Prasad"

(written some songs on aa naluguru & andari bandhuvaya & some serials)

gurthonchina ventane malli konthamandi perlu chepthanu

Nice Idea

(try to put a note that "to be continued...")


?!

రాజ్యలక్ష్మి.N said...

సుస్వరాల రచయితలందరినీ ఒక్కచోట చేర్చారన్నమాట
బాగుంది రసజ్ఞ గారు..

Unknown said...

హ హా....బాగుందండీ! అందరూ అన్నట్టు ఇంకా పొడిగించండి మిగిలిన రచయితల పేర్లూ జతచేసి మరిన్ని అక్షర మాలలు అల్లండి...అక్షర మాల ఎంత పొడవున్నా విన సొంపుగానే ఉంటుంది. ;)

బులుసు సుబ్రహ్మణ్యం said...

బాగుందండీ. సముద్రాల, పింగళి లను కూడా చేర్చండి.

PALERU said...

If i am not wrong all the people ( who said missed great names) may b talking about my name!!!:):):)

doworry rasgna mam, i never mind if you add my name as well it might give a beauty to poetry but of course it is also no bad...:~:~

వనజ తాతినేని/VanajaTatineni said...

మొదటి పాట కర్త చందాల కేశవదాసు, మల్లె మాల, మైలవరపు గోపి..మరచారు. వన్నెలకే వన్నెలద్దిన రసజ్ఞ బ్లాగీతం చాలా బాగుంది.

రాజ్ కుమార్ said...

బాగుందండీ...
అనంత్ శ్రీ రాం ని మరిచిపోయారేం? ;)

సుభ/subha said...

హోయ్ హోయ్ చప్పట్లు చప్పట్లు!!

రసజ్ఞ said...

@ భారారె గారూ
అవునండీ ఇంకా భానుమతి గారూ, సముద్రాల గారూ, పింగళి గారూ, ఎస్. పి. బాలు గారూ, రామజోగయ్య శాస్త్రి గారూ ఇలా చాలా మందే ఉండిపోయారు మళ్ళీ రావచ్చేమో? ప్రస్తుతానికి ఇవే వ్రాసాను. ఎందుకో ఏమో శివ గారు చెప్పినట్టు ఇంకా ఉన్న వారి గురించి చెప్తే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను వేరొక పాటలో. ధన్యవాదాలు!

@ తెలుగు పాటలు గారూ
ప్రస్తుతానికి అంతే అండి! మొన్ననే ఒక మిత్రులు ఈ పాటలన్నిటికీ సంగీతం చేకూరుస్తా అని మాట ఇచ్చారు చూడాలి ఆయనేం చేస్తారో? ధన్యవాదాలు!

@ జ్యోతిర్మయిగారూ
సూత్రధారులే పాత్రధారులు అవునండీ బాగా చెప్పారు! ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ మందాకిని గారూ
చాలా కాలానికి కనిపించారే! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ ఎందుకో? ఏమో! శివ గారూ
హా తప్పకుండా చెప్పండి మరో పాటలో ప్రయత్నిద్దాం మళ్ళీ అంత మంది పేర్లు చేరాక వ్రాస్తాను ఇంకొకటి. ప్రస్తుతానికి నాకు వెంటనే గుర్తోచిన వాళ్ళతో వ్రాసిన ప్రయత్నం ఇది. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

@ రాజి గారూ
మీకు నచ్చినందుకు నెనర్లు!

రసజ్ఞ said...

@ చిన్ని ఆశ గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు! తప్పకుండా మళ్ళీ వ్రాస్తాను అంతమంది గేయ రచయితల పేర్లు తెలిసాక!

@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
చాలా రోజులకి కనిపించారే! తప్పకుండా అండీ మరొక పాటలో చేరుస్తాను. ధన్యవాదాలు!

@ Raafsun గారూ
హహహ అవునా? మీరు భవానీతో బిజీగా ఉన్నారు కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని వ్రాయలేదు ;) మీరు దాదాగిరీ నవల డిసైడ్ చేస్తున్నారు కదా! పాటలు కూడా డిసైడ్ చేస్తారా?

రసజ్ఞ said...

@ వనజ వనమాలి గారూ
మైలవరపు గోపి గారి పేరు విన్నాను కాని మిగతా వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియవు నిజానికి. చెప్పినందుకు థాంక్స్ తప్పకుండ మరొక దానిలో చేరుస్తాను. మీకు నచ్చినందుకు నా ధన్యవాదాలండీ!

@ రాజ్ కుమార్ గారూ
మీరు కూడా చాలా రోజులకి వచ్చారే! అనంత శ్రీరాంని మరువలేదండోయ్! ఆఖరి వాక్యంలో ఆయన గురించే వ్రాసాను అనంతంగా వర్ణించగా అని. ధన్యవాదాలు!

@ సుభ
హాయ్ హాయ్ గెంతులు గెంతులు :):):):) ధన్యవాదాలు!

Kalyan said...

@రసజ్ఞ గారు నాకు ఈ శ్రుతి లయల పరిచయం మాత్రం తక్కువ వినడం వచ్చు ఆస్వాదించడం వచ్చు కాని ఎవరు రాసారు అని ఎప్పుడు ప్రశ్నించుకోలేదు .. ఇది చదివిన వెంటనే వారి పరిచయం ఇంత సులువుగా జెరిగిందే అనిపిస్తోంది. ధన్యవాదాలు . బెష్ చాలా బాగుందండి.

గలము విప్పి స్వరము పలుక నేర్పుంటే చాలు
అ స్వరము తోటి మైమరపించ కొంత భాగ్యము చాలు
అ భాగ్యముతోటి పుణ్యము మూటగట్ట కొంత పేరుంటే చాలు
అ పేరుతో రాగమల్లుతారు తమవంటి వారు
అందుకే అయ్యారు మీరు నవరసజ్ఞులు...

Advaitha Aanandam said...

మీరు చేసిన ఈ చిన్న ప్రయత్నానికి ఇంత చక్కటి స్పందన వచ్చినందుకు నాకే చాలా ఆనందంగా ఉంది .........
నాకు అన్ని గొప్ప పేర్లు తెలియకపోయినా ముందు ముందు మీ బ్లాగులోని ఈ పోస్టులో చూస్తానని ఆశిస్తున్నాను .............

శాండిల్య said...

దాశరధీ గురుచరణములకు మే మ్రొక్కగా
చంద్ర బోసులు ఆ-రుద్రులవ్వగా త్రేయ
ముద్దుబిడ్డలు రాసే-సినారే
మల్లె మాలయ్యెనే వారి కవిత్వముల్ గానముల్...!
ఆ మాల అనంత విశ్వ సాహితీ కంఠమునలంకరించగా
పొంగుతున్న మా సామ రసముద్రాల చెంత
పింగళి వేటూరి కూనలు భాషావిత్తుల నాటగా
సిరివెన్నెలలో దేవులపల్లి భావుకత మేమాస్వాదించెనేని...
మా అభినందనల విశ్వ వాణి మీకు వినిపించగా..
మీ తొలి పూజను సాక్షరమ్ము సేసినారే..!

రసజ్ఞ said...

@ ఎందుకో? ఏమో! శివ గారూ, వనజ వనమాలి గారూ
మీరిరువురూ చెప్పిన చైతన్య గారూ, మల్లె మాల గారూ నాకు తెలియకుండానే ఈ పాటలో వచ్చేసారు కనుక వాళ్ళని కూడా బోల్డ్ చేశాను. ధన్యవాదాలు ఇరువురికీ!

@ కళ్యాణ్ గారూ
హహహ చాలా ధన్యవాదాలండీ! రోజు వారీ మాటలతో కూడా కవితలల్లే మీ ముందు ఇలా గేయ రచయితల గురించి నా ఈ ప్రయత్నం అంతే! మీకు ఇంతలా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది! కవిత బాగా వ్రాశారు!

రసజ్ఞ said...

@ మాధవి గారూ
మీ ఆనందానికి చాలా ధన్యవాదాలు! తప్పకుండా మీ ఆశని నేరవర్చగలనని ఆశిస్తున్నాను అండీ!

@ Sandilya గారూ
అరె వహ్ మీలో భావావేశం పొంగిందండోయ్! ధన్యవాదాలు!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

శాండిల్య గారు,
చప్పట్లు.

రసజ్ఞ said...

@ మందాకిని గారూ
అన్యాయం! అక్రమం! ఇంత పెద్ద పాట వ్రాసిన నాకేమో బాగుందా? శాండిల్య గారికేమో చప్పట్లా? (సరదాకే) ఖండిస్తున్నా అండీ!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

రసజ్ఞ గారు,
ఖండిస్తే ఇంకా ముక్క మాత్రమే మిగులుతుందే మరి. చాలా!!

ఎలా అయినా మీకు రాసిన వ్యాఖ్యే పెద్దది కదండీ, అందర్నీ స్మరింపజేశారు అని నాకు సంతోషం కలిగింది. ఇలాంటి టపా రాసిన మీకే అన్ని క్రెడిట్స్ చెందుతాయి, ఇంకా ఎవర్ని మెచ్చుకున్నా. కాదేంటి!

రసజ్ఞ said...

@ మందాకిని గారూ
హహహ మీరు మరీ అండీ నేను సరదాకే అన్నాను! ఇదేదో అడిగి మరీ పొగిడించుకున్నట్టు ఉంది. ఆయన కూడా బాగా వ్రాశారు!

మాలా కుమార్ said...

అందరి గురించి బాగా చెప్పారు .

Lasya Ramakrishna said...

baga rasaru rasagna garu..

రసజ్ఞ said...

@ మాలా కుమార్ గారూ
ధన్యవాదాలండీ!

@ లాస్య గారూ
నెనర్లు!

రసజ్ఞ said...

అందరి కోరిక మేరకు ఈ టపాలో మరికొంతమంది సినీ గేయ రచయితలను చేర్చడమయినది! ఒకసారి చూడగలరు!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

రసజ్ఞ గారు,
పోస్ట్ పేరు మీద అప్డేటెడ్ అనిగాని, కొత్తపేర్లు అని చేర్చి మళ్ళీ ప్రచురిస్తేనే తెలుస్తుంది.
పాటల రచయిత ల పేర్లలో ఘంటసాల, బాలు, కీరవాణిని చేర్చారేం?

శాండిల్య said...

నమస్కారం మందాకిని గారు.

ఘంటసాల మాష్టారు కూడా రచయితేనండి. ఆయన రాసిన ఎన్నో అద్భుత గేయాలు చాలా ప్రాచుర్యం పొందాయి కూడా.
బాలు కూడా ఏవో చిన్న రచనలు చేశారని వినికిడి. కానీ ఎంతవరకూ నిజమో తెలీదు.
కీరవాణిని పేరు చేర్చేప్పుడు మాత్రం... రసజ్ఞ గారు కీర దోసకాయ తింటున్నారేమో.. అందుకనే చల్లగా చేర్చేసి ఉంటారు. ;-)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బాలు గారు ఒకే పాట రాశానని స్వరాలు సమకూర్చానని చెప్పి పాట పాడి వినిపించారు ఒక కార్యక్రమంలో . నేను విన్నాను.
కానీ ఇక్కడ సినిమా కు పాటలు రాసిన వారి పేర్లు కదా ఉండాలి. అలా కాదంటే నా పేరు, రసజ్ఞ గారి పేరు కూడా చేర్చవచ్చు. (సరదాకు.)

ఘంటసాల గారి పాటల గురించి కొంచెం చెపుతారా?

రసజ్ఞ said...

@ మందాకిని గారూ
ఒకే టపాని అన్ని సార్లు ప్రచురించడం ఇష్టం లేక ఇలా అప్డేట్ చేశాను. బాలు గారు ఎన్నో పాటలు వ్రాశారు వాటిల్లో పడమటి సంధ్యారాగంలో ఆంగ్ల పాట నాకిష్టమయినది. ఇహ కీరవాణి గారు అల్లరి ప్రియుడు, ఘరానా మొగుడు సినిమాలల్లో పాటలు వ్రాశారు. ఘంటసాల మాష్టారు పుష్పవిలాపం, సతి తులసి, శోభ, లక్ష్మమ్మ, ఇలా కొన్ని సినిమాలకి ఇంకా తెనాలి రామకృష్ణ, కాళహస్తి మహత్యం లాంటి ఎన్నో సినిమాలకి పద్యాలను వ్రాశారండీ. అందుకనే వారి పేర్లు జతచేశాను.

@ Sandilya గారూ
నాకు కీరా దోస ఇష్టమని మీకెలా తెలిసిందబ్బా? ఏం పిల్లది ఎంత మాటన్నది అనే పాట, కప్పుకో దుప్పటీ చలేస్తే అన్న పాట వ్రాసినది కీరవాణిగారే!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

రసజ్ఞ గారు,
పుష్ప విలాపం పాడినది మాత్రమే ఘంటసాల గారు. రాసినది జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు కదా!
ఇక పడమటి సంధ్యారాగంలో ఈ తూరుపు ఆ పశ్చిమం అనే పాటలో కొంత భాగం ఆంగ్లం లో వస్తుంది. కానీ పాట రాసింది మన వేటూరిగారు. ఆంగ్లభాగంగురించి నాకు తెలియదు మరి.
ఇంకా పాత సినిమాల పాటలు, పద్యాల గురించి నాకు తెలీదు. ఏం పిల్లది అనే పాట కూడా వేటూరిగారిదే.

రసజ్ఞ said...

@ మందాకిని గారూ
ఒక్కసారి ఈ క్రింది లింక్స్లో లిరిసిస్ట్ పేరు చూడండి
1) http://www.raaga.com/play/?id=155806
2) Life is shabby without you baby (Lyrics: S. P. Balasubramanyam; Singer: S. P. Balasubramanyam) (source: http://en.wikipedia.org/wiki/Padamati_Sandhya_Ragam)
3) ఘంటసాల గారి లింక్స్ దొరికిన వెంటనే ప్రూఫుతో పోస్ట్ చేస్తాను.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

రసజ్ఞ గారు,
మీరు ఇది చూడండి.
http://www.hummaa.com/music/artist/veturi-sundararama-murthy/24377/songs/

ప్రూఫ్ అదీ అంటున్నారేం? ఇలా వెబ్సైట్ లో ఉండే సమాచారమే నాకు తెలిసింది. వేరే ప్రూఫ్ లు నా దగ్గర లేవు. పోనివ్వండి. ఎవరో ఒకరు రాశారు. ఒప్పుకుంటున్నాను.

రసజ్ఞ said...

@ మందాకిని గారూ
నాకూ తెలియదు కదండీ నేనూ నెట్లో చూసినదే కదా నాకంత జ్ఞానం కూడా లేదు. నేను చూసినవి మీకు పంపాను. మీరు వేటూరి గారని చూసారు మరి నేను చూసిన దానిలో ఇలా ఉంది. మిమ్మల్ని ఒప్పించాలని కాదు నేను చూసినది మీకు పంపాను. ఎవరు రాసారు అన్నది కచ్చితంగా చెప్పలేము కదా నెట్లో చూసినదే కదా మీరయినా, నేనయినా? నేను చూసిన చాలా వాటిల్లో ఆ పాట బాలు గారు వ్రాసినట్టే ఉంది. వారు పాటలు వ్రాశారు అని చెప్పడానికి ప్రూఫ్ చూపించవలసి వచ్చింది. అత్త లేని కోడలుత్తమురాలు అన్న పాట వ్రాసినది ఘంటసాల గారు. అలానే పుష్పవిలాపం జంధ్యాల గారు వ్రాసినా ఘంటసాలు గారు వ్రాసినది కూడా ఉంది. బహుదూరపు బాటసారి, పాపాయి కూడా ఘంటసాల గారివే. ఏదో కొంతమందిని ఒక చోట చేరుద్దామనే భావనతో చేసిన ఈ చిన్న ప్రయత్నంలో మిమ్మల్ని నొప్పిస్తే సహృదయముతో మన్నించండి.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

భలే వారే రసజ్ఞ గారు, ఇందులో మీరు నొప్పించిందేమీ లేదు. ఒక్కో వెబ్సైట్ లో ఒక్కోలా ఉంటే ఎవరేం చేస్తారు.
అందరూ సంగీత దర్శకుల గురించే ప్రస్తావిస్తారని నేను ఎప్పుడూ బాధపడుతుంటే మీరు గీత రచయిత ల గురించి వ్రాసి నాకెంతో సంతోషం కలిగించారు. అదే ఆసక్తితోనే ఈ సంభాషణలో పాల్గొన్నాను.
(మనలో మనకు ఈ మన్నింపులొద్దు. సరేనా) నేను గానీ, మీరు గానీ హార్ష్ గా మాట్లాడలేదుగా. సరే ఉండనా మరి.

రసజ్ఞ said...

@ మందాకిని గారూ
పాటకి సంగీతం అవసరమే అయినా ఆ పాటకి సాహిత్యమే ఎంతో ముఖ్యం. నిన్న మీతో మాట్లాడుతూనే పడుకుండిపోయాను. కనుక మళ్ళీ వెంటనే స్పందించటం కుదరలేదు. మీ సంతోషానికి నేను కారణమయినందుకు నాకు కూడా ఆనందంగా ఉంది! ధన్యవాదాలు!

సి.ఉమాదేవి said...

సాహితీపూదోటలో విరిసిన మధుర గీతకారులను మీ మాటలలో పేని అమర్చిన తీరు అభినందనీయం.

రసజ్ఞ said...

@ ఉమాదేవి గారూ
మీ అభినందనలకు ధన్యవాదాలు!

Unknown said...

చాలా బావుందండి.
మీ బ్లాగ్ మొత్తం చదవాలి ...పోస్ట్లు అన్ని బావున్నాయి.

రసజ్ఞ said...

@ శైలబాల గారూ
మీకు నా బ్లాగులోని టపాలన్నీ నచ్చినందుకు ధన్యవాదాలు! అన్నీ చదవండి మరి తీరిక ఉన్నప్పుడు!

Anonymous said...

Pretty nice post. I just stumbled upon your blog and wished to say that I've
truly enjoyed surfing around your blog posts.
After all I will be subscribing to your rss feed and I hope you write again soon!

My web page ... dating online; bestdatingsitesnow.com,