Sunday, June 26, 2011

నిరీక్షణ



విరిసే విరజాజినడిగా నీ జాడ తెలుపమని
మెరిసే మెరుపునడిగా నీ రూపం చూపించమని
సాగర తీరాన్ని అడిగా నీ దరికి నన్ను చేర్చమని
నీ కోసం ఎక్కడెక్కడో వెతికాను ఎవరెవరినో అడిగాను
కానీ నీవు నాతోనే, నాలోనే ఉన్నావని ఇప్పుడే తెలుసుకున్నాను.
నాకు మరు జన్మ ఉందో లేదో తెలియదు కనుక నీ కోసం ఎన్ని జన్మలయినా నిరీక్షిస్తానని చెప్పలేను
ఉన్న ఈ జీవితంలో ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు కనుక నీ కోసం నూరేళ్ళు ఎదురుచూస్తానని  చెప్పను
బ్రతికి ఉన్న ఈ క్షణం శాశ్వతం కనుక ఉన్న ఈ క్షణాన్ని నీతో ఆనందంగా పంచుకోవాలని నీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను.


19 comments:

'''నేస్తం... said...

నాకు మరు జన్మ ఉందో లేదో తెలియదు కనుక నీ కోసం ఎన్ని జన్మలయినా నిరీక్షిస్తానని చెప్పలేను
ఉన్న ఈ జీవితంలో ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు కనుక నీ కోసం నూరేళ్ళు ఎదురుచుస్తానని చెప్పను
బ్రతికి ఉన్న ఈ క్షణం శాశ్వతం కనుక ఉన్న ఈ క్షణాన్ని నీతో ఆనందంగా పంచుకోవాలని నీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాను.

Tooo good

nanda said...

as a critic nenu cheppadhi entante emileduu.......bavundhi

రసజ్ఞ said...

@kamal gaaru & @nanda gaaru
thanks andi

KAMAL said...

Excellent one ..inthaki aa " Neevu " evaroo chepthee inka baguntundi :)

రసజ్ఞ said...

@KAMAL
" Neevu " evaro telisaka mundu neeke chepthaa leda nuvve aa " Neevu " ni parichayam chesina sare!!!

BHARATHeeyudu said...

ayya baaboyyy...mooga poyaa mata raaka mee madhilo intha mahaththu dhaagivundhani theliyaka...
hats off andi rasagna gaaru..keep it up...

రసజ్ఞ said...

@BHARATeeyudu gaaru
thanks andi

Sricharan said...

@all
aa nuvvu neene

రసజ్ఞ said...

@ Sunny
chesavle inka chaalu

శాండిల్య said...

భావ వ్యక్తీకరణ బావుందండి.మనసులోని భావాలని అందంగా వ్యక్తపరచటం కూడా ఒక కళ. అది మీలో చాలా ఉంది. అభినందనలు.

రసజ్ఞ said...

@శాండిల్య గారు
మీ అభినందనలకి ధన్యురాల్ని.

నందు said...

హలో అండి మీరన్నది నిజమే..... మీకు నాకు దగ్గరి పోలికలు ఉన్నాయి.... కాని మీరు చాలా బాగా రాస్తున్నారు.....నందు.

రసజ్ఞ said...

@నందు గారు
చాలా ధన్యవాదములండి.

Anonymous said...

ఎక్కడో గుచ్చుకుని గిలిగింతలు పెడుతోంది. చాలా బాగా రాసారు.ఇలానే ఒకబ్బాయికి చెప్తే వెంటనే ఎస్ అంటాడు.

రసజ్ఞ said...

@Anonymous gaaru
hahaha thanq

RajendraVarma said...

చాలా బాగా వ్రాసారు అండి.

రసజ్ఞ said...

@రాజేంద్ర వర్మ గారు
చాలా ధన్యవాదములండి

Unknown said...

నీ కోసం ఎక్కడెక్కడో వెతికాను ఎవరెవరినో అడిగాను
కానీ నీవు నాతోనే, నాలోనే ఉన్నావని ఇప్పుడే తెలుసుకున్నాను.

చాలా అందంగా , మనోహరంగా ఉంది ఈ భావన

రసజ్ఞ said...

@ kallurisailabala గారూ
నా భావన మీకు నచ్చినందుకు నెనర్లు!