Wednesday, June 15, 2011

అతి సర్వత్రా వర్జయేత్


నమస్కారమండీ అంటూ దారిన పోయే ఒకాయన నన్ను పలకరించారు. బహుశా తెలిసున్న వాళ్లేనేమో నేను మర్చిపోయాను కాబోసు అనుకుంటూ నేను కూడా ప్రతి నమస్కారం చేసాను. కుశల ప్రశ్నలు అయ్యిన  తరువాత వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తూనే బలవంతం చేయడంతో ఆయన వెంట వెళ్ళక తప్పలేదు. దారి పొడుగునా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు నేను మాత్రం ఈయనని ఎక్కడ చూసానా అన్న ఆలోచనతోనే అయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపాను. ఇంత సంభాషణ జరిగి వాళ్ళింటికి వచ్చినా కూడా నాకు ఆయనెవరో గుర్తు రానే లేదు సుమీ! ఇహ వాళ్ళ కుటుంబ సభ్యులని చూస్తే అన్నా గుర్తుకు వస్తుందనుకుంటే అది కూడా కుదరలేదు ఎందుకంటే ఒంటరిగా ఉంటున్నాడు. అతిధి మర్యాదలన్నీ చేసి బట్టలు మార్చుకుని వచ్చి కూర్చున్నాడు. నేనేమీ అడగకుండానే మొదలుపెట్టాడు ఆయన పుట్టుపూర్వోత్తరాల దగ్గర నుంచీ ఆయన గడ్డం గీసుకునేందుకు వాడే అలుగు వరకు అన్నిటిని చెప్పుకొచ్చేసాడు. అసలు ఎదుటివాడికి వినే ఆసక్తి, తగిన సమయం ఉన్నాయో లేదో కూడా తెలుసుకోకుండా ఇలాంటి అధికప్రసంగాలు, అనవసర ప్రసంగాలు చేసేవాళ్ళంటే నాకస్సలు నచ్చదు కానీ ఏమి చేస్తాం పోనిలే పెద్ద వాడు కదా అని ఓపిక పట్టి మొత్తం వింటున్నాను. 

ఇంతకీ  ఆయన బాధని వెలిబుచ్చుకోవడానికి  ఎవరూ దొరకక దొరికిన నన్ను వదలలేక ఎంతో దప్పిక ఉన్న వాడికి ఒక మాంచి నిమ్మ సోడా ఇస్తే ఎలా ఉంటుందో అలానే అయనకి నేను దొరికాను. ఇంక మొదలుపెట్టాడు అసలు విషయమేమిటంటే అయనకి ఒక రకమయిన వింత జబ్బు ఉంది అదేమిటంటే ఏదయినా విషయం తెలిస్తే బట్టబయలు చేసే దాక ప్రశాంతత లేకపోవడం. ఇటువంటి వాళ్ళని మనం చాలా మందినే చూస్తూ ఉంటాం కాని ఇలాంటి వాళ్లకి కొన్ని విషయాలను చెప్పడం వలన మనం అనవసరంగా తీవ్రమయిన పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుంది.

మొన్నామధ్యన ఈయనకి రమణ గారని ఒకాయన పరిచయం అయ్యాడుట.  అసలు మీకొక విషయం తెలుసా? ఎప్పుడూ ముసలి వాళ్ళు, ఏమీ తోచని వాళ్ళు, పదవిని చాలించేసిన వాళ్ళు, ఏ రకమయిన వ్యాపకాలూ లేనివాళ్ళు  ఎక్కువగా జనసంచారం ఉన్న చోటికి వెళతారు ఎందుకో తెలుసా? అటువంటి చోట్ల మాత్రమే వాళ్ళు చెప్పే సోదిని ఒకడు వినకపోయినా ఇంకొకళ్ళు అన్నా  వింటారు అన్న ఆశతో. రమణ గారిది కూడా అదే పరిస్థితి. వయసు మీద పడటం వలన, పదవిని చాలించి ఇంట్లో ఉండటం వలన, ఆయన మాట పెడ చెవిన పెట్టేవాళ్ళు ఇంట్లో ఎక్కువ ఉండటం వలన ఇదిగో ఇలా ఈ సదరు పెద్దమనిషికి బానిసయిపోయారు. ఇద్దరికీ పొత్తు బాగానే కుదిరింది. కొత్త పిచ్చోడు పొద్దు ఎరగడని ఊరికనే అన్నారా? ఇంక ఆ ఇద్దరూ పిచ్చా పాటి చాలా మాట్లాడేసుకున్నారుట. రమణ గారికి చెప్పడానికి ఇంక మాటలు ఏమీ లేని సమయంలో ఆయన తన ఇంటికి ఉన్న రహస్య మార్గాల గురించి, బీరువాలో దాచుకున్న డబ్బుల గురించీ, నగల గురించి, వాటి తాళాలు ఎక్కడెక్కడ ఉంటాయి, వాళ్ళ బ్యాంకు ఎకౌంటు, దాని వివరాలు, ATM  passwords  అన్ని చెప్పేశారు. పైగా వాళ్ళు ఏ రోజు ఊరు వెళ్తున్నది, ఏ రైలు లో ప్రయాణం చేస్తున్నది, మళ్ళీ తిరుగు ప్రయాణం ఎప్పుడు, మొదలయినవన్నీ చెప్పేశారు. ఇంక ఈ సదరు పెద్దమనిషికి నోరు తిన్నంగా ఉండక కనిపించిన ప్రతీ మనిషికి టంకు వేసేసాడు. అలా ఆ ఊరి గజ దొంగల చెవిన పడింది విషయం. అసలే చోర విద్యలో ప్రావీణ్యత ఉన్న వాళ్ళేమో ప్రతీ విషయం ఇంత బాగా తెలిసిపోయిన తరువాత వాళ్ళు మాత్రం ఎందుకని ఊరుకుంటారు చెప్పండి? అంతే రెచ్చిపోయి వాళ్ళ ప్రతాపాన్ని మొత్తం చూపించి ఆ ఇంటిని అప్పుడే  గుమ్మడికాయ కొట్టి ప్రవేశం చేసిన ఇంటిలా ఖాళీగా ఉంచి వదిలిపెట్టారు. కనుక దొరికారు కదా అని పిచ్చాపాటి ఎవరితో పడితే వాళ్ళతో హద్దు మీరి మాట్లాడితే ఇలానే ఉంటుంది అని రమణ గారి అనుభవం మనకి తెలియచేస్తుంది. ఇంత జరిగినా ఈ పెద్దమనిషి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు హాయిగా ఉన్నాడు.నిజమే మరి! ఇందులో ఆయన తప్పేముంది? అలాంటి వాళ్ళకి చెప్పడం మన తప్పు కానీ.

ఇంతకీ మీకు ఆ సదరు పెద్దమనిషి ఎవరో చెప్పలేదు కదూ! అదేనండి ఈ మధ్యకాలంలో దూరంగా ఉన్న మనుషులని ఎంతో దగ్గర చేసి దగ్గరగా ఉన్న మనుషులకి మధ్యన ఒక సూక్ష్మమయిన అడ్డుగోడని కట్టే FACEBOOK. అంతే కదా మరి చిన్నపిల్లవాడి దగ్గరనించి ముదుసలి వాళ్ళ దాకా అందరూ దీనికి దాసోహం అంటున్నారు. పిల్లలకి ఏది మంచో ఏది చెడో తెలియని వయసులో, వాళ్ళకి సామాజిక జీవితం అంటే ఏమిటి? ఎలా ఉంటుంది? ఎటువంటి వ్యక్తులున్నారు ఈ కాలంలో అన్న అవగాహన కూడా లేని వాళ్ళందరూ ఈ facebook  బానిసలే. ఇంక యువతరం మాటకొస్తే, మత్తు పదార్ధాలకి బానిసయినవాడికి ఆ మందు ఇవ్వకపోతే ఎలా నరాలు పీకుతాయో అంత కన్నా ఘోరంగా, దారుణంగా తయారవుతోంది వీళ్ళ పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాలలో అయితే ఈ విష పదార్ధపు దాహం విద్యార్ధుల నర నరాలలో ప్రసరిస్తోంది. తరగతి గదులలో మాష్టారు పాఠాలు చెప్తుంటే శ్రద్ధగా వినవలసిన విద్యార్ధులు వినకుండా ఆయన ముందే కూర్చుని  facebook లో ఉప్పర సోది. గురువు మీద గౌరవం, చదువు మీద శ్రద్ధ ఏమయ్యాయి?  ఎప్పటికప్పుడు నేను తుమ్మాను, నేను దగ్గాను అనుకుంటూ స్టేటస్ updates ఇస్తున్నారు. ఆఖరికి సినిమా చూస్తూ కూడా దానిని సరిగ్గా చూసి ఆనందించి ఛావక మధ్యలో నేను సినిమా చూస్తున్నాను అని facebook  updates పెట్టడం లాంటి వికృతమయిన చేష్టలను ఎంతవరకు సమర్ధించుకుంటారో సదరు వ్యక్తులు. దాని కోరలు మన మీద పడి మనం కూడా అదే పరిస్థితికి దిగజారుతున్నామేమో అనిపిస్తోంది. ఇంక ముదుసలి వాళ్లకి ఊసుపోక ఇదేదో బాగుంది కొత్త వాళ్ళతో బోలెడన్ని కబుర్లు చెప్పచ్చు ఎలాగో మన ఇంట్లో మన మాట వినేవాడు లేడు అని అన్నీ తెలిసి వాళ్ళు కూడా తెలివయిన మూర్ఖులుగా, విచక్షణా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అని అన్నట్టు ఏదయినా మితంగా బాగుంటుంది కాని అతికి వెళ్ళి అనవసరపు విషయాలను చర్చించడం లేదా updates  పెట్టడం వలన రమణ గారిలానే దారుణమయిన పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇకనయినా మేల్కొందాం. ఈ బానిసత్వాన్ని తరిమి కొట్టి  మితంగా వాడుకుని ఆనందిద్దాం.






25 comments:

nanda said...

u hurted my ego very badly...what can i say.....

రసజ్ఞ said...

@nanda gaaru
i am extremely sorry for that kani na uddesyam adi kaane kaadu edo ala janaalalo samaajika spruha teesukuni ravaalanna aalochana maatrame.

nanda said...

@rasagna.....no it's not like that .....i am just giving you a compliment that's it

Anonymous said...

rasagnaa....mottaniki mottaniki facebook meeda,adi vaade valla meeda akkasantaa vellagakkesaav..chusanu monna 8th class adapillalandaruu oka group tayaru chesukuni valla listlo unna friends andarikee teliselaga publicga kottukuntunnaru...aa matalu bharinchaleni signout ayipoyanu adi vere vishayam...

ikkada inkoo vishayam...nuvvenduku orkutni vadilesav....?? nenu cheppanaa adante nekistam...mari manalaga OLD IS GOLD ane vallu lerammaa eerojullo....ippudantaa kotta oka vinta pata oka rota....twaralo TWITTER meeda rayadaniki readyga undu...

శరత్ కాలమ్ said...

మీ పేరు, బ్లాగ్ పేరు బావున్నాయి.

రసజ్ఞ said...

@sarath gaaru
dhanyavaadamulu

murali said...

bagundi amma rasagna atlagithe facebook meda samajaniki danivalla upayogalu anni neee eee sambhashana lo arthavuthundi

రసజ్ఞ said...

@Mohan
nuvvu cheppinattu naku orkut ante ishtame enduko telusaa? adi inka deenantha kalushitham kaaledu kanuka paiga fb lo pettinantha sodi andulo pettaru paiga privacy levels kuda comparitivega better ani na opinion.

రసజ్ఞ said...

@Murali
neekalaa ardhamayyindaa?

Sricharan said...

@R super raasav.....

రసజ్ఞ said...

@S thanq

murali said...

naku bagane artham ayyindi but ninnu emina ante noccgukuntavani analedu but well writing good improvement @rasajna

రసజ్ఞ said...

@Murali
thanks nochchukovadaniki emi ledu nenu na flngs cheppa nv nee flngs cheppachu.

శాండిల్య said...

నిజమే.. మనకు తెలీకుండానే కొన్ని విషయాలని ఎవరితో పడితే వాళ్ళతో చెప్పేసుకుంటూ వుంటాం. మరీ ముఖ్యంగా కొంతమంది పెద్దవాళ్ళు, చాదస్తంగా. ఏవండోయ్..మీరు రాసిన ఫేస్ బుక్ ఉంది చూసారూ...దాని గురించి నేను కూడా రాయటం జరిగింది. ఏ రకంగా చుసినా.. దీనికంటే నాకు కూడా ఆర్కుట్ నయం అనిపించింది.

రసజ్ఞ said...

@శాండిల్య గారు
హమ్మయ్య నాతో ఏకీభవించారండోయ్!! చదివా మీ డిజిటల్ ముఖపుస్తక చెత్తని.

Anonymous said...

చదువుతున్నంత సేపూ నిజంగానే ఒక వ్యక్తి గురించి చెప్తున్నారనుకున్నా కానీ చివరిలో ట్విస్ట్ అదిరింది.అద్భుతః

రసజ్ఞ said...

@ nenarlu anonymous gaaru

శ్రీ said...

మితంగా ఉంటేనే మంచిది, బాగా చెప్పారు.

రసజ్ఞ said...

@ శ్రీ గారు
ధన్యవాదములు.

కృష్ణప్రియ said...

లెస్స బలికితిరి

జ్యోతిర్మయి said...

బావుంది రసజ్ఞా ఉబుసుపోని కబుర్ల మీద ఫస్ బుక్ మీద కూడా ఒకేసారి దండయాత్ర. "తరగతి గదులలో మాష్టారు పాఠాలు చెప్తుంటే శ్రద్ధగా వినవలసిన విద్యార్ధులు వినకుండా ఆయన ముందే కూర్చుని facebook లో ఉప్పర సోది." దీనికి నివారణోపాయం మాత్రం తెలియడం లేదు.

Mauli said...

హ హ , ఇవ్వాళ ట్రైన్ లో ఒక పెద్దామే ఫోన్ లో తన ఫేస్ బుక్ అప్డేట్స్ గురి౦చి భలే హాప్పీ గా చెబుతున్నారు. అయినా పక్క వారికి ఇబ్బ౦ది లేన౦త వరకు వాల్లె౦త చెడిపోయినా పర్లేదు కదా :)

రసజ్ఞ said...

@ కృష్ణ ప్రియ గారూ
ధన్యవాదాలు!

@ జ్యోతిర్మయి గారూ
ధన్యవాదాలు! కడుపులో ఉన్న ఆవేశం మాటలలో కక్కలేక ఇలా అక్షరాలతో కక్కించాను. ఏముందండీ అసలు ఫోన్లని అనుమతి చ్యకుండా ఉండటమే! పుస్తకాలు చాలవా కనీసం పాఠం వినేటప్పుడన్నా?

రసజ్ఞ said...

@ మౌళి గారూ
అదేమిటండీ అలా అంటారు? మనకెందుకులే అని ఊరుకుని కూర్చోలేకే కదా బాధ! పైగా కొంతమంది ఇలాంటి updates పెట్టడం వలన వాళ్లకి కూడా నష్టమే!

Anonymous said...

I am extremely inspired along with your writing abilities as neatly as with
the structure for your weblog. Is that this a paid topic or did
you modify it your self? Either way stay up the excellent high quality writing, it's
rare to see a nice weblog like this one today..

Feel free to visit my web-site - dating online (bestdatingsitesnow.com)