Friday, June 24, 2011

గోరింటాకు


గోరింట  పూచింది  కొమ్మ  లేకుండా
మురిపాల  అరచేత  మొగ్గ  తొడిగింది
ఎంచక్కా  పండేనా  ఎర్రన్ని  చుక్క 
చిట్టి  పేరంటాలికి  శ్రీ  రామ  రక్ష
కన్నె  పేరంటాలికి  కలకాలం  రక్ష ll గోరింట ll

మామిడి  చిగురెరుపు
మంకెన  పువ్వెరుపు
మణులన్నింటిలోన మాణిక్యం  ఎరుపు
సందె  వన్నెల్లోన సాగే  మబ్బెరుపు
తానెరుపు  అమ్మాయి  తనవారిలోన  ll గోరింట ll

మందారంలా  పూస్తే  మంచి  మొగుడొస్తాడు
గన్నేరులా పూస్తే  కలవాడొస్తాడు
సింధూరంలా  పూస్తే  చిట్టి  చేయంతా
అందాల  చందమామ  అతనే  దిగి  వస్తాడు ll గోరింట ll

పడకూడదమ్మా  పాపాయి  మీద 
పాపిష్టి  కళ్ళు  కోపిష్టి  కళ్ళు
పాపిష్టి  కళ్ళల్లో  పచ్చ  కామెర్లు
కోపిష్టి  కళ్ళల్లో  కొరివి  మంటల్లు ll గోరింట ll

గోరింటాకు సినిమాలో ఈ పాట వింటూ ఉంటే నా మనసెందుకో అలా మా ఇంటికి పరుగులు తీస్తోంది. ఈ క్షణాన్న ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా వెళ్లి మా అమ్మతో గోరింటాకు పెట్టించుకోవాలనిపిస్తోంది. ఈ పాటతో గోరింటాకుకి నూటికి నూరుపాళ్ళు న్యాయం చేశారు దేవులపల్లి గారు. అసలు గోరింటాకు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు అనడం అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే ఆడవాళ్ళకి అదంటే ఎంత మక్కువో అది పెట్టుకునే ఆడవాళ్లంటే మగవాళ్ళకి కూడా అంతే మక్కువ మరి! ఎర్రగా పండిన గోరింటాకు వలన వచ్చే మంచి సువాసనలతో అమ్మాయి చేయి మీద పడితే ఏ అబ్బాయి ఆస్వాదించకుండా ఉంటాడు చెప్పండి?

వెంటనే అసలు గోరింటాకు అనేది ఎప్పటినుండి పెట్టుకుంటున్నారు అనే సందేహం వచ్చింది నాకు. దానిని నివృత్తి చేసుకోవడం కోసం గూగుల్ లో వెతికితే కాంస్య కాలం (bronze age ) నుండి వాడుతున్నారని ఉంది. మన పురాణాలను పరిశీలిస్తే వాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకున్నారు కనుక వాళ్లకి కూడా ప్రీతి పాత్రమయినదే అని తెలుస్తుంది.

ఏదేమయితేనేమి? నాకు మాత్రం గోరింటాకు అనేది మనకున్న అపురూపమయిన సంపదలలో ఒకటి. ఆడపిల్లకి పుట్టింటి వారు సారె పెట్టి పంపించేటప్పుడు ఇది కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతీ ఆడపిల్లకి ఎన్నో మధురమయిన  జ్ఞాపకాలు గోరింటాకు చుట్టూ అల్లుకుని ఉంటాయి. చంటి పిల్లలకి గోరింటాకు ముద్ద పెట్టేసి చిన్న చిన్న సంచులు తెచ్చి వాటిల్లో వీళ్ళ బుల్లి చేతులని దూర్చి అలా కట్టేసి ఉంచుతారు. పండిన ఎర్రని చేతులని పిల్లలు చూసుకుని బోసి నవ్వులు నవ్వుకుంటూ ఎన్ని కేరింతలు కొడతారో! అబ్భా!  ఆ దృశ్యం చూసి తీరవలసిందే! ఇంక కన్నె పిల్లల మాటకి వస్తే అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది, ఆషాఢ మాసం ఇలా ఏదో ఒక వంక వెతుక్కుని మరీ పెట్టుకుంటారు గోరింటాకు. పైగా ఎవరి చేయి బాగా పండింది అని పోటీలు పెట్టుకుని, ఎలాంటి మొగుడు వస్తాడా అని విశ్లేషించుకుని, అతనిని  ఊహించుకుని మురిసిపోతూ తెగ ముసి ముసి నవ్వులు నవ్వేస్తారు. ఆడవాళ్ళకి ఆభరణాలు అంటే మక్కువ ఎక్కువే కాని ఎదురుగా గోరింటాకు ఉంటే అసలు చేతికున్న వజ్రాల ఉంగరాలు కూడా తీసేసి పక్కన పెట్టేస్తారు కాబట్టి ఆడవాళ్ళకి గోరింటాకు అంటే అంత మక్కువ. గోరింటాకు పండిన వెంటనే ఎర్ర రంగుని ఎంతగా ఇష్టపడతారో అలానే కాలం గడిచిన కొద్దీ పసుపు  రంగులోకి మారడం కూడా ఒక అందమే అంటాను నేను. నాకు మాత్రం గోరింటాకు లేత పసుపు రంగులోకి వచ్చేస్తే ఎంత ఇష్టమో ఎందుకంటే మళ్లీ కొత్తగా పెట్టేసుకోవచ్చు కదా!

ఇహపోతే గోరింటాకు పెట్టుకోవడం వలన ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి. అవేమిటంటే, ఈ ఒక్క రోజు మాత్రం మనం మకుటం లేని మహారాణులం (మకుటం లేని మహారాజు అంటారు కదా అలానే ఇది కూడా) అయిపోవచ్చు. పెళ్ళి కాక ముందు అమ్మ చేతితో, పెళ్ళయ్యాక శ్రీ వారి చేతితో గోరు ముద్దలు తినే అదృష్టం వరిస్తుంది.ఇదే కాక మన శరీరంలో ఉన్న ఉష్ణాన్ని నియంత్రిస్తుంది, పిప్పి గోళ్ళు రాకుండా చేస్తుంది, సుక్ష్మ జీవ వినాసిని ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయి. అందుకనే ఆధునికతకి తగ్గట్టుగా రసాయనాలతో తయారుచేసిన గోరింటాకు (cone mehendi ) వచ్చినా నాకు మాత్రం ఆకు రుబ్బి పెట్టుకున్నదే చాలా ఇష్టం. ఇంత చదివాక మీకు కూడా వెళ్లి వెంటనే గోరింటాకు పెట్టుకోవాలని ఉందా? అయితే అదే చేత్తో నాకు కుడా గుప్పెడు ఆకు పంపించరూ!
 





12 comments:

nanda said...

emi gorintakoo.....emo ento ha ha ha(saradaki).....

నందు said...

రసఙ్ఞ గారూ, పండేవన్నీ నాకిష్టం ఒక్క తలవెంటుకలు తప్ప :) గోరింటాకు ఆడిపిల్లల చేతుల్లోనే కాక మీ టపాలోనూ అంతే ఇంపుగా సొంపుగా పండింది. చిన్నప్పుడు "ఏం నువ్వు ఆడపిల్లవా ఎమన్నా ? గోరింటకెంటీ ఆడపిల్లలా " అని స్నేహితులు గేలి చేసినా గోరింటాకు నాకెంతో ఇష్టం. ఆ ఎరుపు చేతులకి కాక శిరోకేశాలకి అవసరమయ్యే వరకూ కాలం ప్రయాణం చేసింది..మొత్తానికి మీ టపాలో గోరింట చిగురుతొడిగి నే నెమరెసుకొన్న ఙ్ఞాపకల్లో మొగ్గవేసి నా పెదాలపై మనదస్మితంగా పూసింది. బాగా వర్ణించారు పాతరోజులు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు !

శిశిర said...

బాగా రాసారు. నాకు కూడా ఈ పాట చాలా ఇష్టం.

రసజ్ఞ said...

thanks to all

శాండిల్య said...

గోరింటాకంటే ఇష్టపడేవాళ్ళలో నేనొకణ్ణి. నిర్మొహమాటంగా అమ్మ దగ్గర కూర్చుని పెట్టించేసుకుంటాను ఇప్పటికీ కూడా. దాని వెనక ఉన్న అద్భుత సంప్రదాయ సంపద.. ఆరోగ్య రహస్యాలు, ఇంకా దాని వల్ల వచ్చే అందం..ఇవే నేను గోరింటాకుని ఇష్టపడటానికి ముఖ్య కారణాలు. ఇక్కడ మీరు దీని గురించి వర్ణించిన తీరు కూడా చాలా బావుంది - ఎర్రగా, అందంగా..!
అన్నట్టూ, ఇది మరి ఆషాఢ మాసం కదా. పెట్టుకున్నారా? అహా.. ఏం లేదులెండి.. ఈ మాసంలో మా అమ్మ వాళ్ళు పెట్టుకోవటం గమనించాను.

ఓ చిన్న మనవి. మీ టపాలకి నేను చెయ్యాలనుకున్న వ్యాఖ్యలకి మీరిలా word verification పెట్టి ఇచ్చిన ఈ bumper offer ఎంటో నాకైతే అర్ధం కావట్లేదు. దీన్ని ఓ సారి పరిశీలిస్తారని ఆశిస్తున్నాను.

రసజ్ఞ said...

@శాండిల్య గారు
మీ స్పందనకి ధన్యవాదములు. అవునండి ఆషాఢ మాసం వచ్చేసినా నేనిక్కడ ఇంకా పెట్టుకోలేదు నాకిక్కడ దొరకక, నా ఈ టపా చదివిన వాళ్లెవరయినా పంపిస్తారేమో అని చూసా కానీ ఎవ్వరూ పంపలేదు. మీ ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటున్నప్పుడన్నా నాకు కొంచెం పంపిచచ్చు కదండీ!!!!!

అయ్యో అలా వస్తోందని నాకు తెలియదండీ తప్పక చూస్తాను.

Anonymous said...

naaku Suseela gaaru paaDina ee paaTanTe mahaa ishTam. ippaTiki gurtu chinnappudu ammamma gaarinTlo rOTilO vEsi gOrinTaaku ni noori (migitaa process gurtu lEdu) maa attalu, maradallu oka dozen mandi peTTukOgaa migilitE maa chEtukali peTTEvaaru..oka rakamainaa pOTee naDichEdi 'evaridee ekkuvagaa panDutundaa ani"..mottaaniki manchi paaTa ni alaanE maa flash back ni gurtu chEsina meeku dhanyavaadaalu rasagna gaaru..inkaa manchi manchi paaTalu vunnaayi..vaaTi meeda meeru manasu paDi (peTTi) raaaseyyanDi.

రసజ్ఞ said...

@Anonymous gaaru
చదివిన మీకు కూడా ధన్యవాదాలండి. తప్పక రాస్తానండి త్వరలో. మీ లాంటి వాళ్ళ సహకారం కూడా కావాలి మరి!!!

Anonymous said...

naa laanTi vaaLLa sahakaaraM anTe mEmu paaDi vinipinchaalaa? vinE vaaru vunTe ee gaana kOkila kooyadaa (kompadeesi 'tondara paDi oka kOyila mundE koosindi' anaru kada?)..

రసజ్ఞ said...

@Anonymous (Srinivas Chennuri) gaaru
మీరే పాడతానంటే అంత కంటే అదృష్టమా??? సహకారం అంటే ఏ రకమయిన (సహ) కారమయినా ఫరవాలేదండీ. నేను వినని పాత పాటలెన్నో మీకు తెలుసు పరిచయం చేయచ్చు మాకు.

Unknown said...

నిజ్జం అండీ అమ్మ చేతి ముద్దలు, శ్రీవారి చేతి గోరు ముద్దలు...పోస్ట్ చాలా బావుంది.

రసజ్ఞ said...

@ kallurisailabala గారూ
హహహ అమ్మ చేతి గోరుముద్దలు శ్రీవారి చేతి గోముముద్దలు (గోముగా పెట్టే గోరుముద్దలు అని) బాగుంటాయి కదూ! రెండూ అందమే! మీ స్పందనకి ధన్యవాదాలు!