ఏమీ పట్టనట్టు నన్ను వదిలి వెళ్ళిపోయావుగా! మళ్ళీ నీ జ్ఞాపకాల ఊబిలోకి నన్నెందుకు లాగుతున్నావ్?
ఏ సంబంధం లేదని మన బంధాన్ని తెంచేశావుగా! మరి నీ ఆలోచనల సంకెళ్ళతో నన్నెందుకు బంధిస్తున్నావ్?
మనమిద్దరం కలిసుండడం కుదరదన్నావుగా! మళ్ళీ నా కలల ప్రపంచంలో రోజూ ఎందుకు కలుస్తున్నావ్?నీ కళ్ళలోని నా రూపానికి రెప్పల ముసుగు వేశావుగా! మరి నీ కన్నీళ్ళని నన్ను వెతకమని ఎందుకు పంపావ్?
ఈ విరహ వేదనని నేను తాళలేను వెంటనే వచ్చి నా అధరామృతంలో కరిగిపో
బెట్టు మాని నా చేతులలో ఒదిగి తియ్యగా నా మునుపంటి కింద నలిగిపో
రా Cadbury ఎందుకాలస్యం ఇంక ఒక్క క్షణం కూడా ఆగలేను!!!!!
