పంచభూతాలలో రెండవది, మానవ మనుగడకి అత్యంత ఆవశ్యకమయినది వాయువు. దీనినే వ్యవహారికంగా గాలి అంటాము. దీనికి శబ్ద, స్పర్శ అనెడి ద్విగుణాలున్నాయి. భాగవతం ప్రకారం ఆకాశం నుండీ వాయువు ఉద్భవించినది. వాయువుకి అధిదేవత వాయుదేవుడు. ఈయన వాయువ్యానికి దిక్పాలకుడు. ఈయన భార్య అంజన, వాహనం దుప్పి, ఆయుధం ధ్వజం, నివాసము గంధవతి. తైత్తరీయోపనిషత్తులో వాయువుని "త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి" (నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవి) అని సంబోధించారు. సర్వదా చరిస్తూ ప్రతీచోటా నిండి ఉన్నా, వాయు ప్రవర్తన అన్ని వేళలా ఒకే విధముగా ఉండదు. ప్రాణవాయువై ప్రాణులకి జీవాన్ని పోస్తుంది, ఎన్నో వ్యాధుల నుండీ రక్షణనిస్తూ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, పిల్ల తెమ్మెరలతో మానసికోల్లాసాన్నీ, ఆహ్లాదాన్నీ కలిగిస్తుంది, బరువెక్కిన మేఘాలను ఆత్మీయంగా తాకి వర్షాలను కురిపిస్తుంది, ఎన్నో కబుర్లను, రుచులను చేరవేస్తుంది, వెదురులో చేరి సంగీతాన్ని పలికిస్తుంది, అప్పుడప్పుడు భయంకరంగా మారి భీభత్సాలను, ఉత్పాతాలను సృష్టిస్తుంది. అందువలననే పర్వతాలను, భూమిని సైతం పెకిలిస్తూ (టెక్టోనిక్ ప్లేట్ లో కదలికలు రావటం వలన భూకంపాలు వస్తాయి) ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయగల వాయు శక్తిని ఒక దేవతగా అభివర్ణించారని ఋగ్వేదంలో చెప్పబడింది. ఈ వాయువు యొక్క గుణాలను ఆధారంగా చేసుకుంటే ఇవి దేవయానాలు (రాజస గుణ వాయువులు), పితృయానాలు (తామస గుణ వాయువులు) అని రెండు రకాలుగా ఉంటాయి.
వాయువులని మరుత్తులు అని కూడా అంటారు. వీరి జనన, నామకరణ వృత్తాంతం అంతా రామాయణంలో బాలకాండలో విశాలనగరంలో దితి తపస్సు చేసిన చోటుని చూసిన రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు చెప్తునట్టు వస్తుంది. ఆ ప్రకారముగా, దేవ దానవ యుద్ధములో దానవులంతా ఇంద్రుడి చేత సంహరింపబడితే, ఆ బాధతో, పగతో, దితి తన భర్తయిన కశ్యప ప్రజాపతిని శక్ర హంతారం (ఇంద్రుడిని చంపే కొడుకు) కావాలంటుంది. దానికాయన వెయ్యి సంవత్సరాలు నియమ నిష్టలతో, శుచిగా తపోనిష్టలో ఉంటే అటువంటి పుత్రుడు పుడతాడు అని వరమిస్తూ దితిని స్పృశించి తపస్సుకి వెళిపోతాడు. ఇంద్రుని మీద పగ తీర్చుకోవాలని శుక్లప్లవనమునకు వెళ్ళి తపస్సు మొదలుపెడుతుంది దితి. ఆమెకు ఎన్నో సపరియలు చేస్తూ ఆమె తపస్సు చేస్తున్న ఆశ్రమంలోనే ఇంద్రుడు ఆమెను కనిపెట్టుకుని ఉంటాడు. ఇహ తపస్సు పూర్తవ్వడానికి సరిగ్గా పది సంవత్సరాలు ఉందనగా (అనగా ౯౯౦ సంవత్సరాలు గడిచాక) దితి కాళ్ళు పెట్టుకునే వైపు తల పెట్టుకుని నిద్రపోతుంది. అది చేయకూడని పని కనుక ఆమె అశుచి అవుతుంది. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించి గర్భంలోని పిండాన్ని ఏడు ముక్కలు క్రింద కోసేస్తాడు. ఆ నొప్పికి తట్టుకోలేని పిండాలు ఏడుస్తుంటే ఇంద్రుడు "మా రుద" (ఏడవద్దు) అని అంటాడు. ఇదంతా తన గర్భంలో జరిగేసరికి దితికి మెలకువ వచ్చి ఇంద్రుడిని బయటకి రమ్మంటుంది. బయటకి వచ్చిన ఇంద్రుడు తన తప్పేమీ లేదనీ, ఆమె అశుచి అవ్వటం వలనే ఇలా చెయ్యవలసి వచ్చిందనీ చెప్తాడు. అది విన్న దితి తన తప్పుని ఒప్పుకుని, తన గర్భస్థ పిండాన్ని చంపినందుకు గాను ఇంద్రుడిని వరం కోరుకుంటుంది.
" బ్రహ్మలోకం చరత్వేకః ఇంద్రలోకే తధాపరః
దివి వాయురితి ఖ్యాతః త్రితయోపి మహాశయాః
చత్వారస్తు సురశ్రేష్ఠ దిశోవై తవశాసనాత్
సంచరిష్యతి భద్రంతే దేవభూతాః మమాత్మజాః
స్వత్కృతేనైవ నామ్నా మారుతాయితి విశృతాః "
విష్ణు పురాణం ప్రకారం ఈ ఏడుగురి పేర్లూ అవహము, ప్రవహము, సంవహము, ఉద్వహము, వివహము, పరివహము, పరావహము.
అవహము: మేఘ మండలానికీ, భూమండలానికీ మధ్యన ధ్వనిస్తూ, అంతటా సంచరిస్తూ ఉంటుంది. ఈ వాయువు వలననే సూర్యచంద్రులు, నక్షత్రాల గమనాలు (ఉదయించటం, అస్తమించటం) జరుగుతాయి.
ప్రవహము: సూర్య మండలానికీ, మేఘ మండలానికీ మధ్యన ఉంటుంది. మెరుపు మెరిసినప్పుడు ఆ మెరుపుకి వచ్చే కాంతి ఏదయితే ఉందో అది ఈ వాయువు వలననే కలుగుతుంది.
సంవహము: నక్షత్ర మండలానికీ, చంద్ర మండలానికీ మధ్యన ఉంటుంది. అసామాన్యమయిన వేగాన్ని కలిగి పర్వతాలను సైతం నుజ్జు నుజ్జు చేసే శక్తి కలిగి ఉంటుంది. వృక్షాలలో, చెట్లలో జీవరసం ఏర్పడటానికి ప్రధానమయినది కూడా ఇదే అవటం విశేషం.
ఉద్వహము: చంద్ర మండలానికీ, సూర్య మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువు చాలా బలమయినది. మేఘాలు వర్షించేలా చేయటమే కాక దేవ విమానాలను (పుష్పక విమానం, మొ) నడిపేది కూడా ఈ వాయువే.
వివహము: గ్రహ మండలానికీ, నక్షత్ర మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువు దివ్యజలాలకు (ఆకాశగంగ, మొ) నిలయం. అమృత నిధి అయిన చంద్రుడు చల్లగా ఉండటానికీ, సూర్య రశ్మి భూమిని చేరటానికి కూడా ఈయనే కారణం.
పరివహము: ధృవ మండలానికీ, సప్తర్షి మండలానికీ మధ్యన ఉంటుంది. ప్రాణాధారుల (ప్రాణము కలిగి ఉన్న ప్రతీదీ) ప్రాణాలను చివరి దశలో తొలగించేది ఇదే. ఈ (పరివహ) వాయు ధర్మం ప్రకారమే మృత్యువు, యముడు నడుచుకుంటారు.
పరావహము: సప్తర్షి మండలానికీ, గ్రహ మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువును ఎవరూ అతిక్రమించలేరు అంటూ వీరు నిత్యం నెరవేరుస్తున్న కార్యాలను నారద పురాణము వివరిస్తోంది.
దితి పుత్రులు మరుత్తులు అయ్యారు అని తెలిసింది కదా! మరి దితికి (వైవస్వత మన్వంతరానికి) ముందు ఉన్న మన్వంతరాలలో మరుత్తులు ఎవరు? అన్న సందేహం ఒకసారి నారద మహామునికి కలిగి, పులస్త్యుని వద్ద వ్యక్తం చేస్తాడు. దానికి సమాధానంగా పులస్త్యుడు ప్రతీ మన్వంతరంలో వారి జన్మ వృత్తాంతాలను వివరిస్తాడు.
స్వాయంభువ మన్వంతరం: స్వాయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడు, అతని కుమారుడు సవనుడు. ఈ సవనుడు పిల్లలు లేకుండానే మరణిస్తాడు. దానితో అతని భార్య సుదేవ (సునాభ కుమార్తె) పిల్లలు లేకుండానే చనిపోయాడే అని బాధపడుతుంది. అప్పుడు అశరీరవాణి చెప్పినట్టుగా భర్త చితి మీద ఈమె కూడా కూర్చుని దగ్ధమవుతుంది (సతీ సహగమనం అనమాట). అప్పుడు ఈ దంపతులిరువురూ ఆకాశానికి ఎగిరి వెళ్ళి, అక్కడ సంభోగం చెందగా వచ్చిన శుక్రం ఆకాశం నుండి జారి భూమి మీద పడిపోతుంది. అలా జరగగానే వీరిరువురూ బ్రహ్మ లోకానికి వెళిపోతారు. అయితే ఆకాశం నుండి జారి పద్మంలో పడిన ఆ శుక్రాన్ని సమాన, నళిని, వపుష్మతి, చిత్ర, విశాల, హరిత, అళిని అనే సప్తర్షుల భార్యలు అమృతమని భ్రమపడి, దానిని త్రాగవలెను అన్న కోరికను వారి భర్తలతో చెప్పి, భర్తలను పూజించి త్రాగేస్తారు. త్రాగిన వెంటనే వారంతా బ్రహ్మ తేజాన్ని కోల్పోతారు. అలా దూషిత శీలలు అయిన ఈ ఏడుగురినీ తమ భర్తలు వదిలేస్తారు. ఆ ఏడుగురికీ పుట్టిన పిల్లలు భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. వారిని "మా రుద" (ఏడవద్దు) అనటం వలన వారు మరుత్తులుగా స్థిరపడ్డారు. ఆ విధముగా స్వయంభువ మన్వంతరంలో వెలసిన వారు ఆది మరుత్తులు.
స్వారోచిష మన్వంతరం: స్వారోచిష మనువు కుమారుడు క్రతుధ్వజుడు. అతని ఏడుగురు కుమారులూ (అగ్ని సమానులు) ఇంద్రపదవి కోసం బ్రహ్మను గూర్చి తపస్సు చేయటానికి మహా మేరు గిరికి వెళతారు. ఈ విషయం తెలిసి భయపడిన ఇంద్రుడు తపోభంగం కలిగించడానికి అప్సరసలలో శ్రేష్ఠురాలయిన పూతనను పంపిస్తాడు. క్రతుధ్వజుని ఏడుగురు కుమారులూ నదిలో స్నానమాచరిస్తున్న సమయములో పూతన కూడా అదే నదిలో స్నానమాచరించడంతో వీరి మనసు అదుపు తప్పి వారి వీర్యం ఆ నదిలో పడిపోతుంది. ఈ విధముగా తపోభ్రష్టులయిన ఆ ఏడుగురూ తమ రాజ్యానికి వెళిపోతారు. నదిలో పడిన వీరి వీర్యం మహాశంఖుడు అనే మొసలి భార్య శంఖిని మ్రింగేస్తుంది. కొన్ని రోజులకి జాలరి వాళ్లకి ఈ మొసలి (శంఖిని) దొరకడంతో క్రతుధ్వజునికి ఆజ్ఞ ప్రకారంగా ఆ మొసలిని తీసుకెళ్ళి వారి ఇంటి వద్దన ఉన్న బావిలో వేస్తారు. కొంత కాలానికి ఆ శంఖినికి ఏడుగురు పిల్లలు పుడతారు. వారు గట్టిగా, భయంకరంగా ఏడుస్తూ ఉండగా "మా రుద" (ఏడవద్దు) అనటం వలన వారు మరుత్తులుగా స్థిరపడ్డారు.
ఉత్తమ మన్వంతరం: నిషధ దేశాధిపతి వపుష్మానుని పుత్రుడైన జ్యోతిష్మంతుడు పిల్లల కోసం మందాకినీ నదీ తీరంలో తపస్సు చేస్తుండగా అతని భార్య సుందరి (దేవ గురువు పుత్రిక) కూడా భర్తకు పరిచర్యలు చేస్తూ, సమిధలు, పుష్ప ఫలాలు సమకూరుస్తూ ఆమె కూడా అరణ్యవాసం చేస్తుంది. దీని వలన ఆమె బాగా కృశించి, శల్యమై పోతుంది. తపస్తేజముతో వనములో తిరుగుతున్న ఈమెను చూసిన సప్తర్షులు "మీ సద్గుణాలకు మా అనుగ్రహం తోడై మీ కోరిక నెరవేరి, పుత్ర సంతానం కలుగుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి" అని వరమిస్తారు. వారివురూ వారి ఇంటికి వెళ్ళిన కొద్ది రోజులకి ఆవిడ గర్భం ధరించడం, భర్త మరణించడం, అది సహించలేని ఆవిడ కూడా సహగమనానికి సిద్ధపడి, తన భర్త చితాగ్నిలో దూకేయటం జరుగుతాయి. అలా దూకటం వలన ఆమె గర్భములో నుండీ ఒక మాంస ఖండం ఎగిరి బయట నీళ్ళల్లో పడి, శైతల్యానికి ఏడు భాగాలుగా విడిపోతుంది. దాని నుండీ ఉద్భవించిన వారే మరుత్తులు.
తామన మన్వంతరం: ఋతుధ్వజుడు అనే రాజు కుమారుల కోసం యజ్ఞం మొదలు పెట్టి, అగ్నిలో తన రక్త, మాంస, అస్థి, రోమ, కేశ, స్నాయువు, మజ్జ, శుక్రం, అన్నిటినీ హోమం చేస్తాడు. సరిగ్గా శుక్రం అగ్నిలో వేసే సమయములో "వద్దు వద్దు వేయద్దు" అనే మాటలు వినపడతాయి. వెంటనే ఆ రాజు చనిపోతాడు. దానితో ఆ అగ్ని (హవ్య వాహనుడు) నుండీ ఎంతో తేజస్సుతో ఏడుగురు శిశువులు ఏడుస్తూ బయట పడతారు. వారే మరుత్తులు.
రైవత మన్వంతరం: రైవతుని వంశంలో రిపుజిత్తనే రాజు, పుత్రులు లేనందున భాస్కరుని ఉపాసించి సురతి అనే పుత్రికను పొందుతాడు. వారివురూ ఒకరి పట్ల మరొకరు ఎంతో వాత్సల్యంతో ఉండేవారు. కొన్నాళ్ళకి రిపుజిత్తు మరణించగా, పితృ వియోగాన్ని భరించలేని ఆమె, సప్తర్షులు వద్దని వారిస్తున్నా వినకుండా చితిని పేర్చుకుని అందులో దగ్ధమవుతుంది. తగలబడుతున్న ఆమె శరీరం నుండీ ఏడుగురు బాలకులు ఉద్భవించగా, వారికి మరుత్తులు అని నామకరణం చేసి దేవతా గణాలలో చేరుస్తాడు బ్రహ్మ. అలా రైవత మన్వంతరంలో మరుద్గణాలు వెలిశారు.
చాక్షుష మన్వంతరం: సప్త సారస్వత తీర్థంలో శుచి వ్రతుడు, సత్యవాది అయిన మంకి అనే తపోధనుడు ఘోరతపస్సులో ఉండగా విఘ్నం కలిగించడానికి తుషితదేవతలు వపు అనే సుందరిని పంపిస్తారు. వపు ఆయన మనస్సును లోబరచుకోగా, ఆయన వశం తప్పడం వలన శుక్రం జారి ఆ సప్త సారస్వత జలాలలో పడుతుంది. వెంటనే తెలివి తెచ్చుకున్న ఆయన ఆగ్రహించి వపును శపించి, తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆ జలములో నుండీ ఏడుగురు పుత్రులు ఏడుస్తూ జన్మిస్తారు. వారే ఆ మన్వంతరంలో మరుత్తులు.
ఈ విధముగా ఒక్కో మన్వంతరంలో ఒక్కో విధముగా మరుత్తులు ఉద్భవించారు. అయితే ప్రతీ సారీ కూడా మా రుద (ఏడవకు) అనటం వలనే మరుత్తులు అయ్యారని తెలుస్తోంది. మరుత్తుల జన్మ వృత్తాంతాన్ని విన్నా, చదివినా పాప పరిహారం కలుగుతుందని వామన పురాణములో వివరించబడింది.
అగ్ని పురాణం ప్రకారం మన శరీరంలో ఉండే మూలాధార చక్రం నుండీ నాడులు బయలుదేరతాయి. వీటిలో ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వా, పృథా, యశా, ఆలంబుషా, కుహూ, శంఖిని అనేవి ప్రాణ వాయువులని ప్రసారం చేస్తాయి కావున ప్రముఖమయినవి. ఆ పది రకాల ప్రాణ వాయువులూ ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయాలు. వీటి స్థాన చలనాలు:
" హృది ప్రాణం గుదేపానం ఉదానో నాభి దేశకః
సమానో కంఠ దేశస్థః వ్యాన సర్వ శరీరగః
వాగ్ద్వారే నాగ ఆఖ్యాతః కూర్మాదున్మీలనం స్మృతం
కృకరాత్ క్షుధాజ్ఞేయః దేవదత్తాత్ విజృంభణం
మృతస్యాపి న జహాతి సర్వవ్యాపి ధనంజయః "
ప్రాణ వాయువు: హృదయంలో ఉంటూ జీవాత్మను వృద్ధి చేస్తుంది. ఇది శరీరంలో ఉండే శూన్యత్వాన్ని పూర్తి చేస్తూ మిగతా ప్రాణ వాయువులన్నిటినీ ప్రేరేపిస్తూ ఉంటుంది కావున ఇది మిగతా వాయువులన్నిటికీ అధిపతి. మన శ్వాస రూపములో ఉండేది ఈ వాయువే. ప్రాణి ఆయుర్దాయం తను తీసుకునే ఉచ్ఛ్వాశ, నిశ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని ప్రాణాయామం ద్వారా అదుపు చేయగలిగితే మనిషి ఆయుర్దాయం పొడిగించవచ్చును.
అపాన వాయువు: ఇది శరీరములో పశ్చిమ భాగములో (గుదము వద్ద) ఉంటుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి, మల, మూత్ర, శుక్ర రూపములో క్రిందకి తోసేది అపాన వాయువు. అపానయానం (తొలగించటం) చేస్తుంది కనుక అపాన వాయువు అయ్యింది.
ఉదాన వాయువు: ఇది నాభి (బొడ్డు) వద్ద ఉంటూ దేహములో సగ భాగాన్ని పెంచుతుంది. స్పందన (ముఖ, పెదాల, కళ్ళ కదలికలు, మొ.,) కలిగించే వాయువు ఉదానము.
సమాన వాయువు: ఇది కంఠము వద్ద ఉంటూ సర్వ నాడుల పని తీరుని చూసుకుంటుంది. తిన్న ఆహారాన్నీ, త్రాగిన ద్రవాలనీ, వాసన చూసిన వాటినీ రక్త, పిత్త, వాత, కఫములుగా మార్చి సర్వాంగాలకూ సమానముగా పంచుతుంది కనుక సమాన వాయువు అయ్యింది.
పంచభూతాలు ఒకదాని నుంచి మరొకటి ఏర్పడతాయి, ఒక దానితో మరొకటి హరింపబడతాయి, అలానే అదే క్రమములో పునరావృతం అవుతాయి. ఈ మార్పులన్నీ జరగడానికి ముఖ్య కారణం ప్రాణశక్తి. మానవ శరీరం కూడా పంచ భూతాలతో చేసినదే కనుక మనలో ఉండే పంచభూతాలను నడిపేది కూడా ప్రాణశక్తే. మన దేహం అస్వస్థతకు లోనవడానికి ఈ ప్రాణశక్తిలో వచ్చే మార్పులే కారణం. శరీరంలో ఏ భాగానికయినా తగినంత ప్రాణశక్తి అందనప్పుడు (క్రమేణా ఆ భాగం నిర్వీర్యమవుతుంది) లేదా అవసరానికి మించి ప్రాణశక్తి లభించినప్పుడు (అధిక శ్రమకు లోనై) అనారోగ్యం వస్తుంది. ఈ అసమతుల్యాన్ని నివారించాలంటే మనలోని వాయువులన్నీ సక్రమంగా పని చేస్తూ సమతుల్యతతో ఉండాలి. అప్పుడే మన శరీర భాగాల పనితీరు సవ్యంగా ఉండి, సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము. అదే విధముగా మన పర్యావరణం కూడా సక్రమంగా పని చేస్తూ, ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా వాయువులన్నీ సమతుల్యతతోనే ఉండాలి. అప్పుడే సుభిక్షతతో వర్ధిల్లుతాము.
"ధ్వజ హస్తాయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్"

25 comments:
రసజ్ఞ గారు
ఎన్నో విషయాలని ఒకేచోట చేర్చి, వాటిని అందరికీ అర్దమయ్యే రీతిలో రాసే మీ ప్రఙ్ఞా పాటవాలకి నా అభినందనలు..
***AS USUAL YOUR POST IS SOME THING SPECIAL***
Once again, very informative and enlightening.
Keep up the great work!
Sorry for not typing in Telugu...in a hurry...
Krishna!
రసజ్ఞ గారూ!
విషయాన్ని
సేకరించి మీ మేధస్సుని జత పరిచి సమర్పించే విధానం అద్భుతం...
చాలా బాగుంది మీ వివరణ...
"ॐ पवनपुरुषाय विद्महे सहस्त्रमूर्तये च धीमहि !
तन्नो वायु: प्रचोदयात !"
అభినందనలు మీకు.
అభినందనలు రసజ్ఞ గారూ!
మాలికలో చదివి మా అభిప్రాయం పెట్టాము.
మీ వ్యాసం ప్రచురితమయినందుకు ఇక్కడ మీకిప్పుడు మా అభినందన మాలలు.
@ నాగేశ్వర రావు గారూ
:):) చాలా థాంక్స్ అండీ!
@ కృష్ణ గారూ
అయ్యో! ఫరవాలేదండీ! అసలంత హడావిడిలో కూడా చదివి, స్పందించారు, అందుకు మీకు కృతజ్ఞతలు!
@ శ్రీ గారూ
నా వివరణ మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ చిన్ని ఆశ గారూ
:) మీ అభినందన మాలలకి హృదయపూర్వక ధన్యవాదాలండీ!
beautiful
pancha bhootaala meeda paDDaaraa
- vasu
హ హ వాసు గారి కామెంట్ కి వంద లైకులు :-) నా నోట్లో మాట ఆయన చెప్పేశారు :-))
రసజ్ఞ గారూ ..
మీ వ్యాసం చాలా బాగుంది.
కొత్త కొత్త విషయాలను చాలా వివరంగా చెప్పేస్తుంటారు..
ఈ హృది ప్రాణం అంటూ చెప్పిన పది వాయువులూ తెలుసు, రామాయణంలో మరుత్తుల జన్మ వృత్తాంతమూ తెలుసు కానీ ఇన్ని మన్వంతరాలలో వారి జననం కూడా చెప్పారు చూడండి అసలు వినను కూడా లేదు. ఇంత అపురూపమయిన, విలువయిన సమాచారంతో ఉండే మీ బ్లాగంటే నాకు ప్రత్యేకమయిన ఆసక్తి. ఇటువంటివి మరెన్నో వ్రాయాలని కోరుకుంటున్నాను.
శుభాభినందనలతో
శాస్త్రి.
Hats off to you madam!
దశవాయువుల గురించే తెలుసు. మీ పోస్ట్స్ ద్వారా చాలా తెలియని విషయాలను తెలుసుకుంటున్నాను. ''నవరస(జ్ఞ)భరితం" ఓ (వి)జ్ఞాన భాండాగారం".
@ వాసు గారూ
హహహ! ఈ మాట ఎవరో ఒకరు అంటారేమో అని జంకుతూనే వ్రాశాను, అన్నారా? ఏదో వీటి గురించి అంతగా తెలియదులే అనిపించి వ్రాసేశాను. అగ్నికి వాయువుని జోడించా అంతే :) మిగతావి వ్రాయనండీ! ధన్యవాదాలు!
@ శ్రావ్య గారూ
హహహ! మీరు కూడా అనుకున్నారా? హయ్యో రామ! వెంట వెంటనే వ్రాయకుండా కాస్త గాప్ ఇచ్చి వ్రాయవలసినది కదూ! మీరు నిర్భయంగా ఉండచ్చు మిగతా మూడూ రావు :) ఆ హామీ ఇస్తున్నా. ధన్యవాదాలండీ!
@ రాజి గారూ
మీకు ఈ వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ శాస్త్రి గారూ
నా బ్లాగు మీద మీకున్న ప్రత్యేకమయిన ఆసక్తికి కృతజ్ఞతలు. తప్పకుండా, వీలున్నప్పుడల్లా వ్రాస్తుంటాను. ధన్యవాదాలండీ!
@ హర్ష గారూ
అంత పెద్ద పెద్ద మాటలెందుకండీ, చదివి, మెచ్చి స్పందించారు, అదే చాలు. ధన్యవాదాలు!
@ భారతి గారూ
మరీ పోగిడేస్తున్నారు, ఏదో నాకు తెలలిసినవి, తెలుసుకున్నవి ఇలా వ్రాస్తున్నాను అంతే! ధన్యవాదాలండీ!
వాయువు గురించి మా లాంటి గాలి మనుషాలకి చెప్పి మా కళ్ళు తెర్పించారు. మీరు ఏది చెప్పిన అది ఒక మంచి విషయమే అవుతుంది. ధన్యవాదములు.
Gali ningi neeru
bhoomi nippu meeru
denni vadalaru meeru
rasajna vaddanalera evaro okaru
Raare munulu rushulu
emairi vedaantulu
Sage ee mounam
sarenaaaaa
Konda kona adavi
selayeru sarayu nadi
Adagandi nyayam
idenaaaaaa hahahahahahahahahahahahahahahaha
ఏమో రసజ్ఞ గారు వాయువు అని చూసిన వెంటనే ఇలా తోచేసింది లోపలికి వెళ్ళకుండానే ... ఇప్పటికి ఇది నా విమర్శ.....
ప్రాణాన్ని నిలిపేది గాలితో(వాయువు) స్నేహం
మానాన్ని నిలిపేది మన వ్యక్తిత్వంతో స్నేహం
లోకాన్ని నేర్పేది పరులతో స్నేహం
స్నేహాన్ని నేర్పేది మీవంటివారితో స్నేహం ....
As usually more informative. Nice, why don't you put ''subscribe your blog'' gadget on your blog, which is really useful for the real followers of your writings, aggregators చూడటం అలవాటు లేని వాళ్లకు మానేసినవాల్లకు మీ post mail రూపంలో వస్తుంది కదా! pls try to add this thanks
?!
hey rasagna maam wat happened to you?meeru raayadm enduku apesaaru naaku bloglanni boree koduthunnai konchem vinodam panchandee
మీరు భలే వ్రాస్తారు.మాలిక లో చదివాను
rasajna hahahahahaha immissing u. .mimmalane nammukunnanu .veray blogs kooda follow avvadam ledu.bhakthi cinima climax lo devudni tiduthoo song untundi ala naaku paadalani undi. wat evr hw r u adina cheppandi
రసజ్ఞ గారు వాయువుల్లో ఇన్ని రకాలు ఉన్నాయని తెలుసుకుని ఒకింత ఆశ్చర్య పోయాను .... పైన వాసు గారు చెప్పినట్టూ ఎలాగూ ఆభూనీగాని ల ని వర్ణిస్తున్నారు కాబట్టి జలం గురించి మాకేమైన కొన్ని విషయాలు చెప్పాలని మా (నా ) కోరిక ......
@ వజ్ర గారూ
భలేవారే! మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!
@ తనూజ్ గారూ
:):):) మీ వ్యాఖ్యలన్నిటికీ కలిపి ముందుగా చాలా చాలా థాంక్స్! హహహ! పాడెయ్యండి మరి త్వరగా, మీ పాట కోసం వెయిటింగ్ ఇక్కడ ;)
నేను బాగున్నానండీ! కొన్ని అనివార్య కారణాల వలన ఇటు వైపు రాలేకపోయాను. నెనర్లు :)
@ కళ్యాణ్ గారూ
హహహ! మరి స్నేహాన్ని నేర్చుకున్నారా ;) ధన్యవాదాలు!
@ శివ గారూ
మీరు అడిగాక అది చేర్చడానికి ప్రయత్నించానండీ, కానీ ఆడ్ అవ్వ్వటం లేదు. బహుశా వర్డ్ ప్రెస్ లోనే కుదురుతుందేమో! మీకు తెలిస్తే కాస్త చెప్పరా? ధన్యవాదాలండీ!
@ శశికళ గారూ
ధన్యవాదాలండీ!
@ భాను కిరణాలు గారూ
మీ కోసం తప్పకుండా బ్లాగులో వ్రాయడానికి ప్రయత్నిస్తానండీ, ధన్యవాదాలు!
hi రసజ్ఞ how you????
this is the first time am seeing ur blog
nd IT's fantastic, Awesome
->Spannu<-
Great information. Lucky me I found your site by chance (stumbleupon).
I have saved it for later!
Feel free to visit my weblog ... dating online (bestdatingsitesnow.com)
I do not know if it's just me or if everyone else encountering problems with your blog.
It appears as if some of the written text on your posts are running off the screen. Can someone else please provide feedback and let
me know if this is happening to them as well? This could be a
issue with my internet browser because I've had this happen previously.
Many thanks
Here is my web-site: dating online - http://bestdatingsitesnow.com -
Post a Comment