ముందుగా
అందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు (దొంగలు పడిన ఆరు నెలలకి సామెత కాస్సేపు
మర్చిపోండి). మొన్న ఎంతోమంది గురువులకి నమస్కారాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, వారి
వారి అభిప్రాయాలను పరి పరి విధముగా తెలియచేసుకున్నారు. చూసి చాలా ఆనందం వేసింది,
గురువు అనగానే అందరూ చెప్పే మొట్టమొదటి శ్లోకం
"గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"
అయితే
ఈ శ్లోకం ఎందులోది? ఏ సందర్భంలోది? ఎవరు వ్రాశారు? వంటి సందేహాలు ఎవరికయినా
ఎప్పుడయినా వచ్చాయా? నాకొచ్చాయిగా! అందుకే ఈ టపా. ఈ శ్లోకం వెనుక అత్యంత ఆసక్తికరమయిన కథ
ఉంది. ఈ కథంటే ఎందుకో నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు తెలిసినవారు మళ్ళీ చదివేయండి,
తెలియని వాళ్ళు శ్రద్ధగా చదవండి (ప్రశ్నలేమీ అడగనులెండి).
కొనేళ్ళ క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు (ఆయన పేరు నాకు గుర్తులేదు). ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఈయన ఎందఱో పిల్లలని చేరదీసి, ఆయన వద్దే ఉంచుకుని, భోజనం పెట్టి, ఆశ్రయం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ నిస్వార్ధంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అని ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ, విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు. చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ (మన గ్రాడ్యుయేషన్ వంటిదనుకోండి) ముగించుకుని గురువుని, ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒక సారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళుతూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కౌత్సునికి అప్పగించి వెళతారు. ఆయన తిరిగివచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యధావిధిగా జరుగుతుండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు.
ఇదిలా ఉండగా, స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని చెప్పుకుని, ఆయన వద్ద ఆశీర్వచనాలు తీసుకుని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్ళకు వెళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు, తల్లి దండ్రులు ఎంత బ్రతిమాలినా వాళ్ళతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళిపోతారు. గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్లకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు కౌత్సుడు బోరున విలపిస్తూ "గురువుగారూ! మీరు పొరుగూరు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను, ఈ కార్తీక మాసం (పదిహేను రోజుల్లో) నుండి తమకి దారుణమయిన కుష్ఠురోగం రాబోతోందని మీ గ్రహస్థితి చెబుతోంది. నాకు చదువు నేర్పించి, తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమయిన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తరువాతే వెళతాను, అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను" అంటాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యం, ఆనందం, దుఃఖం అన్నిటినీ కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద భాష్పాలు రాలుస్తారు.
కౌత్సుడు మాత్రం ఈయనకి ఆ వ్యాధి రాకుండా ఏమేం చేయాలో ఆలోచించి గురువు గారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు "ప్రారబ్ధం భోగతో నస్యేత్" అన్నట్టుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడయినా అనుభవించాల్సిందే కనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుడిని అవుతున్నాను అన్న ఆనందముతో ఉన్నాను కనుక నువ్వు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక, కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలం వస్తుంది అంటారు కనుక మనం అక్కడకి వెళ్ళి పుణ్య కార్యాలు చేద్దాం తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడకి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తరువాత అక్కడ విద్యాదానం చేయటం, శివపంచాక్షరీ మంత్ర జపం చేయించటం, చేతనయినంతలో ఇతరులకి సహాయ సహకారాలు చేయటం, ఇలా ఎన్నెన్నో మొదలు పెట్టాడు కౌత్సుడు. మిట్టమధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు లేకుండా జోలె పట్టుకుని (భిక్ష ద్వారా వచ్చినది మాత్రమే తినేవారు అప్పట్లో) తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి, తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక, తినని తిననీయక అన్నాన్ని విసిరేసేవారు. చీటికీ మాటికీ కౌత్సుడిని కొట్టడం, తిట్టడం చేయటం, చీదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధపెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక పందెం వేసుకున్నారు, "మన ముగ్గురిలో ఎవరు కౌత్సుడిని గురువుగారి వద్దనుండి పంపుతారో వారే మనలో గొప్పవారు" అని.
ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, గురువుగారిని ఇబ్బంది పెట్టి ఆనందించడం దేవుళ్ళ లక్ష్యం కాదు, కౌత్సుడు భగవంతుడు పరీక్షలు పెట్టే స్థాయిని చేరుకున్నాడు అని. సరే, అనుకున్నట్టుగా ముందుగా బ్రహ్మ మారు వేషంలో వచ్చి "నువ్వు కాశీ వచ్చినప్పటి నుండీ చూస్తున్నాను, ఎందుకాయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు, పెద్ద వాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకుని వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "గురువుని, అదీ ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనని వదిలేయమని చెప్తున్న మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా?" అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారు వేషంలో వచ్చి "రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కానీ చేసిన మేలు మఱిచే కృతఘ్నునికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది కనుక ఆయనని వదిలి వెళ్ళిపో" అంటాడు. దానికి కౌత్సుడు "కృతఘ్నత అన్నది ఏదయినా ఉంటే ఇటువంటి సమయములో వదిలి వెళిపోతే నాదవుతుంది కానీ నన్ను చేరదీసి, భోజనం పెట్టి, నా నుండీ ఏమీ ఆశించకుండా తన విద్వత్తునంతా ధారపోసిన ఆయనది కాదు" అనేసరికి విష్ణువు వెను తిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారు వేషములో వెళ్ళి "మానవ సేవే మాధవ సేవ అన్న మాట వాస్తవమే కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమయితేనే నీ విలువ తెలిసొస్తుంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు" అంటాడు. దానికి కౌత్సుడు సాష్టాంగ పడి, "తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీలునిచ్చే విలువయిన విద్యని నాకు ధారపోశారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకి కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావా!! వీలయితే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో ఇద్దరు వచ్చారు, మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమయిన నీతులు మరెవరూ చెప్పకుండా చేయండి చాలు" అంటాడు.
అంతే ఆ ముగ్గురూ ఇతని గురుభక్తికి మెచ్చి "కౌత్సా! మేము త్రిమూర్తులం. నీ గురుభక్తికి మెచ్చాం, మేము పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గి నీ అపారమయిన గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాము" అంటారు. దానికి ఆనందించిన కౌత్సుడు "మీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగించినది కూడా ఆ గురువుగారే. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, మీ ముగ్గురినీ సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరయితే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే, నాకు ఇన్ని నేర్పించి, ఇంతలా తీర్చిదిద్దిన మా గురువు గారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే కనుక ఆయనకే ఇవ్వండి" అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుడినీ, అటువంటి గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు గురువునీ ఇద్దరినీ మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికీ మోక్షాన్ని ప్రసాదిస్తారు.

ఇటువంటి
కథలు విన్నప్పుడు, చదివినప్పుడు స్ఫూర్తిదాయకంగా అనిపిస్తాయి. ఏ పనయినా
పూర్తి చేయటానికి అత్యంత ముఖ్యం, అతి ముఖ్యం, ముఖ్యం అని మూడు
కారణాలుంటాయి(ట). ఉదాహరణకి అన్నం వండాలనుకోండి, అత్యంత ముఖ్యమయినది బియ్యం,
అతి ముఖ్యమయినవి నీళ్ళు, మంట, పాత్ర, మొ., ముఖ్యమయినది వండే విధానం
తెలియటం. అదే విధముగా ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవిస్తున్నారు అంటే
గురువులు నేర్పిన విద్య అత్యంత ముఖ్యమయినది, అతి ముఖ్యమయినవి మన
శ్రద్ధ, క్రమశిక్షణ, మొ., గురువులు నేర్పిన చదువులు బుద్ధికి పట్టేలా
చేయగల బుద్ధిని ఇచ్చిన తల్లిదండ్రులు ముఖ్యమయినవారు. అందుకనే మాతృదేవోభవ,
పితృదేవోభవ తరువాత ప్రాముఖ్యతని ఆచార్యదేవోభవ అంటూ గురువుకి ఇచ్చారు.
ఇటువంటి జ్ఞానం మనకి అలవడిన నాడు నా కృషి వల్లనే నాకు ఉద్యోగం వచ్చింది
అన్న అహంకారం ఉండదు. మరీ కౌత్సుడంత లేకపోయినా అసలంటూ గురుభక్తి పెంచుకుని,
గురువులని గౌరవించాలని ఆశిస్తూ
గురువులందరికీ ఈ టపా అంకితం....
గమనిక: గొర్తి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కథ "గురు చరిత్ర"లోని రెండవ అధ్యాయంలోనిదనీ, గురు శిష్యుల పేర్లు వేదధర్ముడు, దీపకుడు అని స్పష్టమవుతున్నది. నేను నేర్చుకున్నది ఇలానే కనుక ఈ టపాలో వివరాలు, పేర్లు మార్చటం లేదు.

43 comments:
చాలా బాగా రాసారు.. మీ శైలిలో స్లోకం అర్ధం వివరించి గురువు యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ చేసిన మీ చిరు ప్రయత్నానికి అభినందనలు..
శ్రద్ధగా చదవండి ప్రశ్నలేమీ అడగనులెండి అంటే మమ్మల్ని ప్రశ్నలేమీ అడగొద్దనా మీ ఉద్దేశ్యం?;)నావైతే ప్రశ్నలేం లేవు లెండి.కథ చాలా బాగుంది..మొత్తానికి ముందరి కాళ్ళకు బంధమేసారు ఆ సామెత చెప్పి.
Chala baga rasarandi, I liked it very much.
నా చిన్నప్పుడు, గురుపూజోత్సవానికి ఎవరో మాష్టారు మాకు దాదాపుగా ఇటువంటి కథే ఒకటి చెప్పారు. మీరు రాసింది వారి గొంతులో విన్నట్టుంది నాకైతే.
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డ మిత్రులొకరిని ఇటీవల కలిసినప్పుడు, "అట్లాంటి మంచి మంచి కథలు అసెంబ్లీలో చెప్తున్నావా మరి?" అని సరదాగా గుర్తు చేస్తే, "మా గొప్పలు మేమే చెప్పుకుంటున్నాం అని చిన్నబుచ్చే వారికి ఏమీ చెప్పాలనిపించదులే" అని నిర్లిప్తంగా వెళ్ళిపోవడం గుర్తొచ్చి మనసంతా చేదుగా అయిపోయింది.
కొద్దిగా ఆలస్యమైనా, దాచుకోవాలనిపించే కథను అందించారు. Thank you.
nice post
ఎప్పటి లాగే ఎప్పుడూ వినని కధని చెప్పారు..
కధ బాగుందండీ.
మీకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు..
మంచి విషయాన్ని తెలియపరిచారు. Thanks for sharing.
లేటుగా లేటెస్ట్ గా ఉపయుక్తకరమైన పోస్ట్:-)
మంచి కథ చెప్పావు రసజ్ఞా. నీ వివరణ చాలా చాలా బావుంది. థాంక్ యు.
నాకు తెలిసి ఈ కథ గురువు యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతని తెల్పే గురుచరిత్రలో ఉంటుంది.
శ్రీవాసుకి
అయ్యా!చాలా బాగుంది మీ కధ.ఇది గురు పూజోత్సవం అయ్యాక విడుదల చేశారు.ఆ రోజున అందరికీ తెలిసేది.ఇది ఇంచుమించు ఉపమన్యుని కధలాగానే ఉంది.
చాలా బాగుంది.ఉపమన్యుని కూడా చాలా కష్ట పెడతాడు
గురువు.ధన్యవాదాలు.
Nice Post,
Thank You Guruvu garu.
(మీ నుంచి మాకు తెలియని ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాము)
తల్లినీ, తండ్రినీ, గురువునీ ఎగతాళి చేసి, హాస్యపాత్రధారులుగా చూపించే ఈ కాలంలో మీరు చెప్పిన కథ ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంది.
ఇటువంటి మంచి విలువలు తెలిపే కథలు ఇప్పుడు చాలా అవసరం. కథ చాలా బాగుంది. అభినందనలు..
As always informative!
Chala bavundi Rasagna..doubt eppudu raledu,doubt theppinch maree clarify chesinanduku chala thanks..nice story..
శ్రీ రసజ్ఞ గారికి
నమస్కారం!
వక్తవ్యాన్ని ఒక ఉత్తమ ఉపాధ్యాయిగా పూర్వోత్తరాన్వయంతో ఆసక్తికరంగా చెప్పటంలో మీ ప్రతిభ ప్రశంసనీయం. భారతీయధర్మాన్ని యథాశక్తి ప్రపంచింపజేయటానికి దీక్షతో, దక్షతతో కృషిచేస్తున్నారు.
జనమేజయుడు సర్పయాగాన్ని చేసినప్పుడు "చండభార్గవుండు హోతగాఁ, బింగళుం డధ్వర్యుండుగా, శార్ఙ్గరవుండు బ్రహ్మగాఁ, గౌత్సుం డుద్గాతగా" (ఆది. 2-208) కౌత్సుడు ఉన్నాడని నన్నయ్య గారు వ్రాశారు. ఆ కౌత్సుని కథ వేఱు.
కాళిదాసీయ రఘువంశంలోనూ వరతంతు మహర్షి శిష్యుడు కౌత్సుని ఉదంతం ప్రసిద్ధం.
మీరు చెప్పిన కథకు ఆధారం ఎక్కడిదో నాకు తెలియరాలేదు. ఇది కౌత్సునిది గాక వేఱొకరి కథో?
"గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురు స్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" అన్న శ్లోకం నిజానికి స్కాంద పురాణంలోని పార్వతీ పరమేశ్వర సంవాదాత్మకమైన గురుగీతాధ్యాయం లోనిది. అక్కడ "గురుర్బ్రహ్మా గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః, గురురేవ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" (శ్లో. 32) అని ఉన్నది. ఆ తర్వాత ఆ శ్లోకం వివిధరూపాలను పొందింది.
ప్రగాఢమైన మీ గురుభక్తికి, ప్రసన్నమైన మీ అర్థయుక్తికి అభినందనలు!
సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు
very interesting as usual...Thanks for sharing with us Rasagya
Anamika
http://sakhiyaavivarinchave.blogspot.in/
Informative - check
Entertaining - check
shara mamoole!
Krishna
Rasagna gaaru ee katha ney nenu guricharithralo chadivaanu... andhulo kathaa naayakuni peru Deepakudani vunnattu gurthu... edhaithe emi lendi... maaku labhimchina endharo manchi guruvulalo meeru okarai maaku jnaana bhiksha peduthunnandhuku sumaanjalilu... Gurupoojosthava shubhaa kaamkshalu.
కడు ప్రసిధ్ధ మైన ఘనమైన శ్లోకమ్ము
కథ ప్రసిధ్ధ మైన కల్పితమ్ము
కథన మద్భుతమ్ము కథిత రసఙ్ఞమ్ము
చదివి నంత వట్టు సంతసమ్ము .
----- సుజన-సృజన
@ నాగేశ్వరరావు గారూ
ఈ శ్లోకానికి చాలా అర్థాలు, చాలా కథలు ఉన్నాయండీ, అప్పుడప్పుడు కొన్ని కొన్ని పరిచయం చేస్తూ ఉంటాను. మీ అభినందనలకు నా అభివాదాలు.
@ సుభా
మీరు మరీను!!! కొన్ని చెప్పలేం, అర్థం చేసుకోవాలి ;) ధన్యవాదాలండీ!
@ వెంకట్ గారూ
మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నా ప్రతిభ ఏమీ లేదండీ, విన్న కథని ఇలా ఇక్కడ పెట్టాను అంతే. ధన్యవాదాలు!
@ మానస గారూ
ఈ కథను నాకూ మా మాష్టారు చెప్పినదే, అలా గుర్తుండిపోయింది. ఇప్పుడిలా మీ అందరితో పంచుకున్నా అనమాట! వావ్ మీకు వారిని మరొకసారి ఈ కథ గుర్తు చేయగలిగింది అంటే ఆనందంగా ఉంది. ఈ కాలంలో గురువంటే ఆట వస్తువుగా తయారయ్యారండీ సినిమాల పుణ్యమా అని, గురువంటే గుండ్రాయి కాదు అన్న పాట గుర్తుకు వస్తుంది నాకు. మీరు ఈ కథను దాచుకున్నందుకు ధన్యవాదాలు!
@ లాస్య గారూ
థాంక్యూ
@ రాజ్ కుమార్ గారూ
ఇవన్నీ చిన్నప్పుడు మాష్టార్లు చెప్పినవేనండీ! వీలును బట్టీ ఒక్కో కథనీ పరిచయం చేస్తాను. ధన్యవాదాలండీ, మీకు కూడా గురుపూజోత్సవ శుభాకాంక్షలు!
@ నాగార్జున గారూ
ఇలాంటి ఎందఱో శిష్యుల కథలు చెప్పేవారండీ చిన్నప్పుడు. బాగా గుర్తుండిపోయిన వాటిల్లో ఇదొకటి. చదివి స్పందించిన మీకు కూడా ధన్యవాదాలండీ!
@ పద్మార్పిత గారూ
:) లేటుగా వచ్చినా లేటెస్టు గా వచ్చాను అంటారు అంతేనా ;) థాంక్యూ థాంక్యూ!
@ జ్యోతిర్మయి గారూ
ఈ కథను మీలాంటి వారు చదవటం వలన మీ విద్యార్థులకు కూడా చేరుతుంది కదూ! మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ! ధన్యవాదాలు!
@ శ్రీ వాసుకి గారూ
ఈ శ్లోకం చాలా చోట్ల వస్తుందండీ. ఏల్చూరి గారు చెప్పినట్టు స్కాంద పురాణంలోనే కాక, ఆది శంకరాచార్యుల వారు రచించిన "గురుస్తోత్రం"లో ప్రారంభ శ్లోకం కూడా ఇదే. ఆ తరువాత ప్రార్ధనా గీతంగా చాలా ప్రసిద్ది చెందింది. ఇహ ఈ కథను నాకు మా మాష్టారు చెప్పగా విన్నదే తప్ప ఎందులోది అన్నది నాకూ తెలియదు. ఇక్కడ పెట్టడం వలన ఏమయినా సమాచారం తెలుస్తుంది అని పెట్టాను. బహుశా గురు చరిత్రలో ఉండవచ్చును. మీ స్పందనకి ధన్యవాదాలు!
@ సోమార్క గారూ
ఆ రోజునే పెడదామనుకున్నానండీ కానీ టైపు చేసేందుకు సమయం చిక్కలేదు. సరే, గురువుని నిత్యం పూజించాలి కదా అనుకుంటూ ఇహ ఇప్పుడు పెట్టాను. అవునండీ, ఉపమన్యుడు కథ కూడా చిన్నప్పుడు మాష్టారు చెప్పారు. ఇలా గురుభక్తిని చాటే కథలు ఎన్నెన్నో!!! ధన్యవాదాలండీ!
@ అజ్ఞాత గారూ
మీకు నచ్చినందుకు సంతోషమండీ! కాకపోతే నేను గురువుని ఏమిటండీ??? మీరు మరీను, ఏదో నాకు తెలిసినవి పంచుకుంటున్నాను అంతే! నాకు అంత అర్హత లేదండీ! మీ అభిమానానికి ధన్యవాదాలు!
@ శ్రీలలిత గారూ
మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం. చిన్నప్పుడు ఇలాంటి కథలన్నీ నూరి పోసేయటం వలన ఒక గురువు దారుణంగా ఇబ్బంది పెట్టినా కూడా గురుభావంతో, ఒక్క పరుష పదం కూడా వాడలేని పరిస్థితికి చేరానేమో అని కూడా అనిపిస్తుంది. కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ జలతారు వెన్నెల గారూ
థాంక్యూ సో మచ్ అండీ!
@ అజ్ఞాత గారూ
మీరెవరో తెలియలేదు, పేరు చెపితే బాగుండేది. కథ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ ఏల్చూరి మురళీధరరావు గారూ
నేనింకా విద్యార్థినినేనండీ, ఉపాధ్యాయిగా ప్రస్తుతానికి ఇంకా మారలేదు. మీరిలా అంటుంటే చాలా ఆనందంగా ఉంది. మిక్కిలి ధన్యవాదాలు!
ఈ శ్లోకం మీరు చెప్పినట్టుగా స్కాంద పురాణంలో ఉంది నిజమే, అలానే ఆది శంకరాచార్యుల వారు రచించిన "గురుస్తోత్రం"లో ప్రారంభ శ్లోకం కూడా ఇదే. ఆ తరువాత ప్రార్ధనా గీతంగా చాలా ప్రసిద్ది చెందింది. ఈ కథను మా మాష్టారు చెప్పేవారు చిన్నప్పుడు. మీరు చెప్పినట్టుగా ఆ శిష్యుడిది వేరే పేరేమో కూడా నాకు తెలియదు, ఇక్కడ కొన్ని వ్యాఖ్యల ద్వారా ఈ కథ గురుచరిత్రలోది అని, అతని పేరు కౌత్సుడు కాదు దీపకుడనీ తెలుస్తోంది. నేనయితే గురు చరిత్ర చదవలేదు. రఘువంశం కౌత్సుని గురించి చదువుతూ ఉన్నాను. గురుదక్షిణ కోసం వెళ్ళిన కౌత్సుడు అబ్బుర పరుస్తున్నాడు. నేను విన్న కథను విన్నట్టుగా చిన్న చిన్న విషయాలను జోడిస్తూ ఇక్కడ పెట్టాను. అందువలననే ఆ గురువుగారి పేరు కూడా గుర్తులేక వ్రాయలేదు.
మీ ప్రోత్సాహానికీ, అభినందనలకూ శతకోటి అభివందనాలు.
@ అనామిక గారూ
మీకు నచ్చి స్పందించినందుకు నేనే చెప్పాలండీ ధన్యవాదాలు!
@ కృష్ణ గారూ
:):) మీరు భలే వారే! షరా మామూలే అని ఊరుకోకుండా స్పందించి ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు!
@ భారతీయుడు గారూ
మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు! ఈ కథను నాకు మా మాష్టారు ఇలానే చెప్పారు చిన్నప్పుడు. ఆ గుర్తుతో అలా వ్రాసేశాను. మరి శిష్యుని పేరు దీపకుడని చెప్పారు కదా, అలానే ఆ గురువుగారి పేరు కూడా చెప్తే బాగుంటుంది, గురు చరిత్రలో ఎక్కడ వచ్చిందో కూడా చెప్తే ఇంకా బాగుంటుంది. అంతంత పెద్ద మాటలు వద్దండీ, నేను ఇంకా శిష్యురాలినే. మీకు కూడా గురుపూజోత్సవ శుభాకాంక్షలు!
@ వెంకట రాజారావు గారూ
చదివిన మీకు కలిగిన సంతసానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మీలాంటి ఉపాధ్యాయులకే ఈ టపా. నచ్చి, ఎప్పటిలానే చక్కని పద్య రచనతో ఆనందంలో ముంచెత్తిన మీకు ధన్యవాదాలు!
చాలా వివరంగా చెప్పారు.చివరగ మీరు చెప్పిన conclusion కూడా అర్థవంతంగా ఉంది.
very nice.i am speechless. conclusion is so nice
Thanks for this nice blog Rasagna garu. As per "Sri Guru Charitra," the name of the Guru in this story is a sage called: Vedadharma, and the disciple is: Deepaka. The story is in the 2nd chapter of this book. There are indeed many other such inspiring stories in this classic book, and here is the link to this book in English.
One of the age-old safe methods followed by earnest seekers who are trying to find out their Guru is: rather than choosing the Guru based on their limited intellect, they do a devout study (Parayana) of this great book.
rasagna gaaru, manchi post. baagaa raasaaru goppagaaa
మీరు చెప్పిన గురువు కథ చాలా నచ్చిందండి..మీ సేకరణ చాలా ఉపయోగకరం.మా విద్యార్థులకు చెబుతాను.
చక్కని కథ, చక్కగా చెప్పారు, అభినందనలు.
మీకు ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు.
చాలా మంచి విషయం చెప్పారు. బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర రావు గారి శ్రీగురు చరిత ప్రవచనంలో ఇదే విన్నాను. తొలిగా ఈ కధ విన్నప్పుడు నాకు కళ్ళవెంట నీళ్ళొచ్చాయి. మళ్ళీ ఆరోజులు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు
రసజ్ఞ గారూ,
నేర్చుకున్నది గుర్తుపెట్టుకోవటం, గుర్తుపెట్టుకున్నది ఆసక్తికరంగా ఇతరులకి చెప్పగలగటం చాలా పెద్ద కళ. ఈ కళలో మీ ప్రజ్ఞా పాటవాలు మీరు రాసే ప్రతి పోస్ట్ చదివినప్పుడూ ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
ఎప్పటిలానే బాగా తెలిసిన శ్లోకం వెనుక అస్సలు తెలీని కథ ని తెలియజేశారు.
అభినందనలు!
మీరు చెప్పినట్టే ఆ దొంగల సామెత మర్చిపోయాం ;)
ఇప్పుడు అందుకోండి మా "గురుపూజోత్సవ శుభాకాంక్షలు!"
వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు.
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
లాస్య రామకృష్ణ
బ్లాగ్ లోకం
శ్రీ రసజ్న గారికి, నమస్కారములు.
కథ కంటే, చక్కటి విషయాలను చర్చించారు. ఈ కథలో నేను గమనించింది ఏమిటంటే: శిష్యుడు, తన గురువుద్వారా జ్నానాన్ని పొంది, అటుపిమ్మట తనలో మేల్కొనబడిన గురువును, తనకు విద్యను, జ్నానాన్ని ఇచ్చిన గురువుకంటే భిన్నంగా చూడలేకపోవటంవల్లనే అతడు గురువుగారిని విడిచి వెళ్లలేకపోయాడని. అంటే, భౌతికంగా వెరైనా, మానసికంగా వారిద్దరూ ఒక్కరే. నిజంగా, విద్యాద్వారా సాధించాల్సినది ఇదే.
మీ స్నేహశీలి,
మాధవరావు.
@ చిన్ని గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ శ్రీ గారూ
చాలా చాలా థాంక్స్ అండీ!
@ గొర్తి సుబ్రహ్మణ్యం గారూ
మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరిచ్చిన సమాచారాన్ని మీ అనుమతి లేకుండానే ఈ టపాలో అప్డేట్ చేశాను, కానీ నేనిలానే నేర్చుకున్నందువలన అందులో పేర్లు మార్చలేదు. మీరిచ్చిన లంకె వలన నాకు గురు చరిత్ర చదివే అవకాశం దొరికింది. మా ఇంట్లో వాళ్ళు చదువుతారు కానీ, నేనేనాడూ చదవలేదు ఇప్పటిదాకా. ఇప్పుడన్నా ఒక్కొక్కటీ చదవాలి. తీరిక చిక్కినప్పుడు తప్పక మొదలెడతాను. ధన్యవాదాలతో..
@ ఫాతిమా గారూ
ఇది మీ లాంటి గురువులకేనండీ! నచ్చినందుకు ధన్యవాదాలు!
@ రవి శేఖర్ గారూ
తప్పక చెప్పండి. ఇటువంటివి నేర్చుకోవటం ఎంతో ఉపయోగకరం. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ భాస్కర్ గారూ
మీలాంటి గురువులకే కదా ఈ టపా! మీరు చదివి మెచ్చినందుకు, మీ విషెస్ కి ధన్యవాదాలు!
@ మోహన్
హమ్మయ్యా!!! మొత్తానికి ఒక్కటన్నా వ్రాయగలిగాననమాట, సంతోషం! ఏంటి, అప్పుడే అన్నేళ్ల experience వచ్చిందా? ఇంకా మన పరిచయమే నిన్న, మొన్న అయినట్టుంది నాకయితే. ప్రస్తుతం విద్యార్థులే కాదు మాస్టర్లు కూడా అలానే ఉంటున్నారులే మోహన్, ఏం చెప్తాం? వాళ్ళని చూసి మిగతా మాస్టర్లకి కూడా విలువ లేకుండా పోతోంది, పైగా సినిమాల ప్రభావం కొంత. ఈ సినిమాలన్నిటిలోనూ లెక్చరర్ మీద సెటైర్లు ఉంది తీరాలి కదా :( థాంక్యూ థాంక్యూ!
@ తనూజ్ గారూ
మీరు వ్యాఖ్యలు ఎందుకు తొలగించారో తెలియలేదు. ఉంచాల్సింది. మీరన్న దానిలో కూడా వాస్తవం లేకపోలేదు. అలాంటి గురువులు ఉన్నారు. ఎక్కడో ఎందుకు, నాకే ఎదురయ్యారు, నన్ను కావాలని ఫెయిల్ చేశారు కూడా. కానీ నా అదృష్టం బాగుండి, డీన్ చూసి నా పేపరు దిద్ది, ఆయన ఉద్యోగం తీసేశారు. మీ అభిప్రాయం ఏదయినా సరే నిర్మొహమాటంగా చెప్పచ్చు, నేనేమీ అనుకోను. ధన్యవాదాలండీ!
@ నందు గారూ
ఓహ్ అవునా? నా చిన్నప్పుడు స్కూల్లో మాస్తారు చెప్పారు ఈ కథ నాకు. అయితే ఒకసారి గతంలోనికి వెళ్లారనమాట! సంతోషం అండీ! ధన్యవాదాలు!
@ చిన్ని ఆశ గారూ
హహ! భలే వారండీ! కొన్నలా గుర్తుండిపోతాయి, వద్దనుకున్నా మర్చిపోలేం, పైగా ఆచరించ దగినవి ఎలా మర్చిపోతాం చెప్పండి? ధన్యవాదాలు, మీకు కూడా (మీరు కూడా గురువే కదా) శుభాకాంక్షలు :)
@ భాస్కర్ గారూ, @ లాస్య గారూ
ధన్యవాదాలండీ, మీకు కూడా వినాయక చవితి (ఈ ఏడాదికి ఆలస్యంగా, మళ్ళీ సంవత్సరానికి ముందస్తుగా) శుభాకాంక్షలు!
@ మాధవరావు గారూ
నమస్కారమండీ! చక్కగా విశ్లేషించారు, పరికించి చూస్తే ఎన్నో సూక్ష్మాలు దొరుకుతాయండీ! ధన్యవాదాలు!
ఆఖరున మీ వ్యాఖ్య చదివేంత వరకు ఇది 'గురు చరిత్ర ' లోని దీపకుడి కథ పోలి ఉందే అనుకున్నాను . నేను ఆలస్యంగా చదివినా చాల మంచి విషయాలు చెప్పారు ఈ టపా ద్వారా ! అభినందనలు
చక్కటి కథను వివరించినందు సాంజలి బంధకమైన ధన్యవాదాలు!
@ కళ్యాణ్ గారూ
నేను గురు చరిత్ర చదవలేదు, అందుకే నేను నేర్చుకున్నది నేర్చుకున్నట్టు పెట్టాను. తరువాత, ఈ కథ మూలం ఇచ్చాక చివరున దానిని చేర్చాననమాట. ధన్యవాదాలండీ!
@ ప్రణవ్ గారూ
భలే వారే! కృతజ్ఞతలండీ!
I am not sure where you're getting your information, but good topic.
I needs to spend some time learning more or understanding more.
Thanks for wonderful information I was looking for this information for my mission.
Feel free to surf to my web-site - dating online (http://bestdatingsitesnow.com)
Post a Comment