అలా ముఖపుస్తకం (ఫేస్
బుక్) తెరిచానా, చూస్తే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్, ఒక మెస్సేజ్ ఉన్నాయి. సరే మెస్సేజ్
ముందు చూద్దామని చూశానా ఆశ్చర్యం! నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. నిజమా? భ్రమా?
తెలియలేదు. మళ్ళీ ఒకసారి కళ్ళు నులుముకుని చూశాను. నిజమే! ఎంత ఆనందమో! మా సంస్కృతం మాష్టారు
"ఏరా అమ్మడూ బాగున్నావా తల్లీ? గుర్తున్నానా?" అని పంపారు. డిగ్రీ
తరువాత వాళ్ళ ఊరు వెళ్ళి ఆయనని కలిసి రావటమే తప్ప ఎన్నడూ ఫోనులో కాని, మెయిల్ లో
కాని మాట్లాడింది లేదు. ఎప్పుడూ దద్దమ్మ, రాక్షసి, దెయ్యం అని పిలిచే ఆయన ఇలా
నన్ను సంబోధించటం చూసి ఒక్కక్షణం మనసులోని ఆనందమంతా కళ్ళను దాటి చెక్కిలి మీదకి వచ్చేసింది.
ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా ఆయన పంపినదే. వెంటనే కన్ఫర్మ్ నొక్కేసి, ఆలోచనల్లోకి
వెళ్ళిపోయా.
మాష్టారితో పరిచయం డిగ్రీలో జరిగింది. క్లాసుకి వచ్చిన మొదటి రోజే, ఈ క్రింది శ్లోకం (నాకింకా గుర్తు) బోర్డు మీద వ్రాసి ఎవరయినా వివరించగలరా అన్నారు.
మాష్టారితో పరిచయం డిగ్రీలో జరిగింది. క్లాసుకి వచ్చిన మొదటి రోజే, ఈ క్రింది శ్లోకం (నాకింకా గుర్తు) బోర్డు మీద వ్రాసి ఎవరయినా వివరించగలరా అన్నారు.
పార్థః కర్ణవధాయ త చ్ఛరగణం కృద్ధో రణే సందధౌ
త స్యార్ధేన నివార్య త చ్ఛరగణం మూలై శ్చతుర్భిర్హయాన్
శల్యం షడ్భి ర థేషుభి స్త్రిభి రపి చ్ఛత్రం ధ్వజం కార్ముకం
చిచ్ఛే దాస్య శిర శ్శరేణ కతి తే యా వర్జున స్సందధౌ?
వెంటనే నేను వంద సార్
అన్నాను.
మా: ఎవరా బడుద్ధాయ్?
నేను: నేనే సార్ (లేచి నిలబడుతూ)
మా: నేను శ్లోకాన్ని వివరించమంటే ఏకంగా లెక్క చెప్పేశావే? మంచిది. ఆ మాత్రం చురుకుదనం ఉండాలి. ముక్కున పెడుతున్నారో, మనసు పెడుతున్నారో చూద్దామని సిలబస్లో లేనిది అడిగా. సంతోషం. ఒక్కరన్నా భాషకి విలువిస్తున్నారు. ఇంతకీ ఈ శ్లోకాన్ని బట్టీ నీకేం అర్థమయ్యింది?
నేను: ఇప్పటిలా ఆ కాలంలో భాషలు (ఇంగ్లీష్, సంస్కృతం, తెలుగు) పరీక్షల ముందు చదివితే, మెయిన్ సబ్జెక్ట్స్ కూడా పాస్ అవ్వము అని.
మా: (నవ్వుతూ) రాక్షసి. అది సరే. ముందు శ్లోకానికి అర్థం చెప్పు?
నేను: శ్లోకాన్ని బట్టీ ఇది కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని వధకు సంబంధించి అర్జునికీ, కర్ణునికీ మధ్యన నడిచిన ఘట్టం అని తెలుస్తోంది. అర్జునుడు వేసిన మొత్తం బాణాలలో సగం బాణాలు కర్ణుడు వేసే బాణాలని ఎదుర్కోవటానికి పట్టాయి (అంటే ఇక్కడ మొత్తం బాణాలు x అనుకుంటే కర్ణుడి బాణాలను ఎదుర్కోవటానికి x/2 పట్టాయి). అలానే అర్జునుడు మొత్తం వేసిన బాణాల వర్గమూలానికి నాలుగురెట్ల బాణాలు కర్ణుని గుఱ్ఱాలను ఎదుర్కోవటానికి పట్టాయి (అంటే 4√x). కర్ణుని రథసారధి అయినటువంటి శల్యుడిని కొట్టడానికి ఆరు, రథం మీది జెండా, కర్ణుని గొడుగు, విల్లుని కొట్టడానికి ఒక్కోదానికీ ఒక్కోటి (6+1+1+1) చొప్పున బాణాలు పట్టాయి. చివరిగా కర్ణుని తల నరకడానికి ఒక బాణం పడితే మొత్తం అర్జునుడు వాడిన బాణాలు ఎన్ని?
మా: ఎవరా బడుద్ధాయ్?
నేను: నేనే సార్ (లేచి నిలబడుతూ)
మా: నేను శ్లోకాన్ని వివరించమంటే ఏకంగా లెక్క చెప్పేశావే? మంచిది. ఆ మాత్రం చురుకుదనం ఉండాలి. ముక్కున పెడుతున్నారో, మనసు పెడుతున్నారో చూద్దామని సిలబస్లో లేనిది అడిగా. సంతోషం. ఒక్కరన్నా భాషకి విలువిస్తున్నారు. ఇంతకీ ఈ శ్లోకాన్ని బట్టీ నీకేం అర్థమయ్యింది?
నేను: ఇప్పటిలా ఆ కాలంలో భాషలు (ఇంగ్లీష్, సంస్కృతం, తెలుగు) పరీక్షల ముందు చదివితే, మెయిన్ సబ్జెక్ట్స్ కూడా పాస్ అవ్వము అని.
మా: (నవ్వుతూ) రాక్షసి. అది సరే. ముందు శ్లోకానికి అర్థం చెప్పు?
నేను: శ్లోకాన్ని బట్టీ ఇది కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుని వధకు సంబంధించి అర్జునికీ, కర్ణునికీ మధ్యన నడిచిన ఘట్టం అని తెలుస్తోంది. అర్జునుడు వేసిన మొత్తం బాణాలలో సగం బాణాలు కర్ణుడు వేసే బాణాలని ఎదుర్కోవటానికి పట్టాయి (అంటే ఇక్కడ మొత్తం బాణాలు x అనుకుంటే కర్ణుడి బాణాలను ఎదుర్కోవటానికి x/2 పట్టాయి). అలానే అర్జునుడు మొత్తం వేసిన బాణాల వర్గమూలానికి నాలుగురెట్ల బాణాలు కర్ణుని గుఱ్ఱాలను ఎదుర్కోవటానికి పట్టాయి (అంటే 4√x). కర్ణుని రథసారధి అయినటువంటి శల్యుడిని కొట్టడానికి ఆరు, రథం మీది జెండా, కర్ణుని గొడుగు, విల్లుని కొట్టడానికి ఒక్కోదానికీ ఒక్కోటి (6+1+1+1) చొప్పున బాణాలు పట్టాయి. చివరిగా కర్ణుని తల నరకడానికి ఒక బాణం పడితే మొత్తం అర్జునుడు వాడిన బాణాలు ఎన్ని?
మా: భేష్! దీనిని బట్టీ నీకర్థమయిన
నీతి ఏమిటి?
నేను: కర్ణుడు ఎంత గొప్పవాడయినా కానీ
అధర్మంతో (కౌరవులతో) చేరటం వలన నాశనమయ్యాడు.
మా: నవ్వి, సంతోషం! కానీ పిల్లలూ
(అందరినీ ఉద్దేశ్యించి) మన పురాణాలన్నీ కూడా చాలా గొప్పవి. అవి చూసే దృష్టిని
బట్టీ ఒకే శ్లోకం ఒక్కో విధంగా అర్థమవుతుంది. తాత్విక దృష్టితో చూస్తే అలా, మీ మీ సబ్జెక్టు పరంగా చూస్తే అలా అర్థమవుతాయి. ఆలోచించి చూడండి ఎప్పుడయినా ఖాళీగా
ఉన్నప్పుడు
అని ముగించేసి వెళిపోయారు. అలా ఆయనతో
నా మొదటి పరిచయం. ఎంత అల్లరి చేసినా పల్లెత్తు మాట అనకపోగా ఎంతో అభిమానంగా మాట్లాడేవారు. ఎందుకో ఆ రోజులన్నీ కళ్ళ ముందు మెదిలాయి. ఆ రోజు నుండీ ఈ
రోజు దాకా ఆయన చెప్పిన ఆలోచన మాత్రం చేయనే లేదు. ఇవాళ వెంటనే ఆలోచిస్తే తప్పేముంది?
అనిపించి అదే శ్లోకంతో మొదలు పెట్టాను.
మొదటగా,
అర్థాన్నే మరింత లోతుగా
ఆలోచించాను. అసలు కర్ణుడు వేసే బాణాలను ఆపడానికి అర్జునుడంతటి
ప్రతిభావంతుడికే
యాభై బాణాలు పట్టాయి అంటే అబ్బో! కర్ణుడు ఎంత గొప్ప విలుకాడో కదా!
అనిపించింది. అలానే గుఱ్ఱాలకి నలభై బాణాలు వాడవలసి వచ్చింది అంటే వాటికి
బాణాలను తప్పించుకునే చాకచక్యమూ, నేర్పరితనమూ తెలుస్తోంది. తరువాత రథ సారధి
అయినటువంటి శల్యుడు కేవలం ఆరే ఆరు బాణాలకి లొంగిపోయాడు అంటే అతని పాండవ
పక్షపాత బుద్ధి తెలుస్తుంది. కేవలం మూడే బాణాల్లో గొడుగు, జెండా, విల్లు
పడిపోవటం కర్ణుని నిస్సహాయతను, అసమర్ధతను తెలియచేస్తోంది. ఒకే ఒక్క బాణంతో
కర్ణుని తల తెగి పడటం భారతంలోని కథకు బలం చేకూరుస్తోంది. ఎందుకంటే భారతం
ప్రకారం కర్ణుడు తల తెగి పడినవాడే, అలానే ఆఖరి నిమిషంలో నిస్సహాయత కూడా
శాపమే కదా!
దీనినే
బాగా పరికించి చూస్తే, రాజనీతి కనిపించింది. యుద్ధంలో ముందుగా అవతలి
వ్యక్తి వేసే బాణాలను ఎదుర్కోవాలనీ, తరువాత గుఱ్ఱాలని ఎదుర్కోవటం వలన అతను
ఎక్కడికీ వెళ్ళలేడనీ, అప్పుడింక పారిపోకుండా రథ సారధిని ఎదుర్కొని ఇతని (మీ
రాజు) పని అయిపోయింది అని చెప్పడానికి సూచికగా గొడుగునీ, జండానీ,
విల్లునీ కొట్టి, ఇహ శాశ్వతంగా రాజు చిక్కినట్టే కనుక అప్పుడు ఒకే దెబ్బతో
కన్నుమూసేలా వధించాలని తెలుస్తుంది. మరి ఇది రాజనీతి రహస్యమే కదా!
ఇంకా
లోతుగా ఆలోచించి, ఆధ్యాత్మిక అన్వయం ప్రయత్నించాను. కర్ణుడు వేసిన బాణాలు
విషయ వాంఛలు అనుకుందాం. వాటిని ఎదుర్కోవటం చాలా కష్టమయిన పని (అందుకే యాభై
బాణాలు పట్టి ఉంటాయి). ఎప్పుడయితే వీటికి దూరంగా ఉంటామో అప్పుడే లక్ష్య
సాధన చేకూరుతుంది. బాహ్య భోగాలకి దూరంగా ఉన్నాక ముఖ్యమయినది ఇంద్రియ
నిగ్రహణ. గుఱ్ఱాలు ఇంద్రియాలకి ప్రతీకలు కదా. ఈ ప్రకారంగానే అర్జునుడు
ముందుగా భోగాలని ఎదుర్కొని ఇంద్రియాలని నియంత్రించాడు (ఇది కూడా కష్టమయిన
పనే). ఎప్పుడయితే ఇంద్రియ నిగ్రహణ జరిగిందో, బుద్ధి వశమవుతుంది. ఇక్కడ
బుద్ధి అంటే రథ సారధి. ఇవన్నీ నియంత్రించగా మిగిలినవి మనస్సు, చిత్తము,
అహంకారము. ఈ మూడూ వరుసగా గొడుగు, జెండా, విల్లు అనమాట. మొత్తం అంతా వశం
అయిన తరువాత మిగిలినది జీవుడు (కర్ణుడు). అర్జునుడు ఆత్మ అనుకుంటే, జీవుడు
ఆత్మలో చేరాడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవే మోక్షానికి అర్హుడు కదా!
తరువాత అందులో అడిగిన ప్రశ్న. అది గణితానికి సంబంధించినది. ఈ శ్లోకం భాస్కరాచార్యుడు రచించిన లీలావతీ గణితం లోనిది. గణితంలో
కాస్తో కూస్తో ప్రవేశం ఉన్న వారెవరికీ కూడా ఈయన గురించి ప్రత్యేకంగా
చెప్పనవసరం లేదు. ఆయన వ్రాసిన ఈ ఒక్క గ్రంధం మీదే ఎన్నో పరిశోధనలు జరిగాయి. శ్లోకంలో
వచ్చిన అర్థాన్ని ఒక ఈక్వేషన్ రూపంలో మార్చుకుని, తద్వారా లెక్కలను ఎలా
చెయ్యాలో తెలిపారు. ప్రస్తుత శ్లోకాన్ని తీసుకుంటే అర్థాన్ని బట్టీ మనకు
వచ్చేది x = x/2 + 4√x +10. దీనిని ఆధారంగా చేసుకుని x విలువ సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం గణిత విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుంది.
ఇలా రక రకాలుగా ఆలోచించిన తరువాత ఈ శ్లోకాన్ని సైన్సు
పరంగా కూడా ఆలోచిద్దాం అనిపించి ఆ దిశగా శోధించా. రోగ నిరోధక శక్తికి
కాస్త అన్వయం కుదిరింది. మన శరీరంలోని కణాలు మొదటగా బయటనుంచి వచ్చే
ప్రత్యర్ధులని (బాక్టీరియా, వైరస్, మొ.) ఎదుర్కొని, తరువాత వాని రాకకు ఆధారమయిన వాటిని నిర్జీవం చేసి అప్పుడు చంపేస్తాయి కదా!
ఇవే కాక, ఇచ్చినది ఒక శ్లోకం కనుక అందులో ఎన్నో వైవిధ్యమయిన సంధులు, సమాసాలు, వ్యాకరణ విశేషాలు కూడా ఉండి ఉండవచ్చు. నాకు అంత బాగా తెలియదు. నా
పీత బుఱ్ఱకి ఇతర అన్వయాలేమీ తోచటం లేదు. మీరు మీ సంబంధిత విభాగాలలో
ఆలోచించి, మీకు తోచిన అన్వయాలను కూడా అందిస్తే ఇది సంపూర్ణమవుతుంది.
64 comments:
మొత్తానికి పీత బుర్రని ఒప్పేసుకున్నారు :)
It could also be 4 apart from 100. ;)
Awesome poem! Thanks for sharing.
chaalaa kaalaaniki malli o manchi post tho, kanipinchaaru, thank you.
రసజ్ఞ ..గణితం,పద్యం నాకు అర్ధం కాలేదు కాని ఒకటి మాత్రం అర్ధం అయింది. భాషతో(సంస్కృత) గణితం తో, తర్కంతో, పరిశోధనా శక్తి తో.. ఆడుకుంటున్నావు..అమ్మాయి.
అభినందనలు.
నీలాంటి అమ్మాయి ఉంటే బాగుండును అనుకుంటున్నాను. సాధ్యం కాదు కాబట్టి..
నీలాంటి కోడలు వస్తే! అయ్యబాబోయ్ .. !!?
:))))
ఇప్పుడు గనుక NTR ఉండి ఉంటే నిన్ను కూతురిగా దత్తత తీసుకుని ఉండును అనుకున్నాను .
దీన్ని బట్టి నాకర్థమయ్యిందేమిటంటే ... సింపుల్ ఆల్జీబ్రాని కాంప్లికేట్ చేసుకోవాలంటే సంస్కృతంలో చెప్పుకోవాలని! :P
చాతకం గారు, ఒక ధనాత్మక సంఖ్య వర్గమూలం కూడా ధనాత్మకమే అవ్వాలనే నిభంధన సంస్కృతంలో కాక తెలుగులో/ఇంగ్లీషులో విధించుకోండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది.
కొద్దిగా జడిపించినా, మంచి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారండి, రసజ్ఞ గారు. బాగుంది.
బాగుందండీ మీ జ్ఞాపకం....:)
@"సింపుల్ ఆల్జీబ్రాని కాంప్లికేట్ చేసుకోవాలంటే సంస్కృతంలో చెప్పుకోవాలని"
సంస్కృతం భాష మనకి దూరం అవుతొంది,సంస్కృతం మనకి రాదు కాబట్టి కష్టం అనిపిస్తొంది భాష బాగ వస్తే అదే తేలిక అవుతుంది.
A big salute to Rasagna..dats it ...:)
సకల కళా వల్లభురాలు అనొచ్చేమో మిమ్ముల్ని. మిమ్ముల్ను చూస్తుంటే అసూయగా ఉంది.
nice post! very interesting!
Very interesting!
మీ ప్రతి పోస్టుతో మమ్మల్ని మరింత ఆశ్చర్యంలో పడేస్తూ ఉంటారు. ఇలా ఒక్కో పోస్టులా కాకుండా ఒకసారెప్పుడన్నా అవధానంలాంటి ప్రక్రియ ఏదైనా చెయ్యండి. లైవ్లో మీ విషయ పరిజ్ఞానం చూసి ఆనందపడతాం.
Chaalaa baagundi mee visleshana Rasagna gaaru!!
Naa subject ki anvayinche prayatnam modalu peduthunnaa :))
--
Photon
As per your analysis of karna being good archer, I disagree. The poem in fact enhances arjuna's abilities as a better archer. Say, the fight lasted for 4 hours. In that time, karna sent 50 arrows, but arjuna sent 100 within the same duration. That only means arjuna is twice better and faster in sending arrows.
The number of arrows are used for horses depends on number of horses, more the number, more arrows would be needed. It could be that Karna has a chariot with many horses but not just one or two. As Arjuna took 40 arrows, it would in fact enhance ability of salya to move the horses randomly so as to save his horses from arjuna's arrows, most of them would be wasted. If there are 6 horses on karna's chariot, rest of 34 of arjuna's arrows are wasted as they did not hit the horses as salya is superb in his horsemanship in moving the horses. As karna is killed for just one arrow, but salya took 6 arrows to succumb, it further enhances the ability of salya being mighty warrior that did not go down easy just because he is a pandava sympathizer. If I were you, I would have a little more respect for salya. ;)
The order of killing is purely a standard one as per rules dictated by bhishma before start of war on who can fight with who & on what order. Arjuna is merely following the rules. He even gave an option of running way on foot for karna by hitting the mast of chariot first as a sign of surrender. Dhuryodhana and Dussasana took advantage of such offers earlier in war to run away. Karma being the proud man, persisted hence got killed. Arjuna showed that he is a true warrior by being magnanimous.
-- 2 cents ;)
very good post రసజ్ఞ gaaru. As normal, you always post something special. I like to read your post at the, I wonder, how you can do this?
చిన్నప్పుడు నేనూ నాలుగు సంస్కృతమ్ముక్కలు నేర్చుకున్నందుకు కించిత్ గర్వంగా ఉంది! కాకపోతే మన మూలాలను మనమే తుడిచేసుకోవటానికి మనవాళ్ళ ఉత్సుకత చూస్తుంటే మిక్కిలి బాధగానూ ఉంది.
మరోసారి రసజ్ఞ స్థాయికి తగిన టపా చూశాను.
చాల బాగుందండి.
మీ పోస్ట్స్ అన్ని చాలా బాగుంటాయి.
మీరు ఇలాగె రాస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
:venkat
వనజ గారి కామెంటే నాది కూడా.. అసలు నిన్ను చూస్తే ఆశ్చర్యం గా ఉంటుందమ్మాయి...కొంచెం అప్పుడప్పుడు మాకు అర్ధం అయ్యే భాషలో కూడా టపా పెడుదూ...
jokes apart, you amaze me all the time rasajna gaaru!
రసజ్ఞ గారూ!
మీ శ్లోకం...గణితం...అన్నీ చాలా బాగున్నాయండీ!
వేద గణితం పై మొన్ననే మా కేంద్రంలో ఓ ప్రోగ్రాం చేసాం...:-)
కానీ,
మీ లెక్క ప్రకారం ఆరు బాణాలతో శల్యుడిని చంపాడనే కదా...
కర్ణుడు రెండు రోజులు సేనాధిపత్యం వహించిన తర్వాత సేనాధిపతిగా
అభిషిక్తుడు అయినది శల్యుడే కదా!..
బైట కథలలో చూస్తే కర్ణుడిని అర్జునుని కంటే వీరునిగా చెప్తారు కానీ,
చాతక గారు చెప్పినట్లు...దివ్యాస్త్రబలసంపన్నుడైన పార్థుని తక్కువగా చెప్పలేము..
మహాభారతం మూలంలో చూస్తే పాండవ వనవాసం సమయంలో...ఉత్తర గోగ్రహణం సమయంలో ఈ విషయం .
ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది...
గమనిక: యుద్ధంలో ప్రతి రథానికీ చక్ర రక్షకులుంటారు...కర్ణుడు తన కుమారులనే చక్ర రక్షకులుగా పెట్టుకున్నట్లు గుర్తు..
. ముందు చక్రరక్షకుల్ని వధించాక రథాన్ని కూల్చడం సాధ్య పడుతుంది...
యుద్ధాన్ని మనసును నియంత్రించే యుద్ధంగా చూపడం...అభినందనలు మీకు...
@శ్రీ
"రాజనీతి,ఆధ్యాత్మిక అన్వయం,గణితానికి సంబంధించినది,సైన్సు పరంగా"
ఒక పద్యాన్ని గురించి ఇన్ని రకాలుగా ఆలోచించిన
మీరు కూడా అర్జునుడిలా సవ్యసాచి అన్నమాట ..!!
@ చాతకం గారూ
అంటే మీరు లెక్క చేశారనమాట :) కాని నాలుగుకీ అక్కడ ఇచ్చిన వివరణకీ మ్యాచ్ కాదు కదండీ. అందువలన వందే సరయినది అని నిర్ణయించా. మీ విశ్లేషణ నచ్చిందండీ. బాగుంది. బాగా ఆలోచించారు. మీ విశ్లేషణ చదివాక మరొకసారి నేను కూడా ఆలోచించాను. మీ రెండవ వ్యాఖ్య చూశాక ఈ టపాలో నేను క్లారిటీ మిస్ చేశానేమో అనిపించింది . ఎందుకంటే నేను అక్కడ అర్జునిడి కన్నా కర్ణుడు గొప్పవాడు అనలేదు. వారిద్దరినీ పోల్చే ఉద్దేశ్యమే లేదు నాకు. కేవలం అతను వేసే బాణాలను ఆపటానికి ఇతనికి యాభై పట్టాయి అంటే కర్ణుడు గొప్ప విలుకాడే అనిపించింది. మమూలువారికయితే అర్జునుడికి అంత సమయం అవసరం లేదు అని నా అభిప్రాయం. గుఱ్ఱాల గురించి మీరు చెప్పినది వాస్తవమే. అక్కడ ఎన్ని ఉన్నాయి అన్నది ఈ శ్లోకం ద్వారా మనకి తెలియటం లేదు. ఇహ శల్యుని సంగతి తీసుకుంటే శల్యుడు ఇష్టపడి కౌరవులతో లేడు కదా బలవంతంగా కర్ణుని రథ సారధిని చేశారు. మీరు చెప్పినట్టు కర్ణుడు ఒకే ఒక్క బాణానికి తల తెగి పడటం, శల్యుడు ఆరు బాణాలకి లొంగిపోవటం చూసి శల్యుడు గొప్ప వాడు అనలేం. ఎందుకంటే రాజు ఎలాంటి (వీరుడు కాకపోయినా అని) వాడయినా అతని పరిరక్షకులు, సైన్యం మొదలయిన వారు బలంగా ఉండాలి. వీరంతా కోట గోడ లాంటి వారు. అది గట్టిగా ఉండాలే కానీ బలహీనంగా ఉండకూడదు. ఉన్నారు అంటే అది వారున్న రాజు వైపు విముఖత, అవతలి రాజు వైపు సముఖత చూపించినట్టే. ఇక్కడ శల్యుడు లొంగాడు కానీ ప్రాణాలను తెగించి మరీ తన రాజుని కాపాడుకోలేదు. అలానే ఒక్క బాణానికే కర్ణుని మరణాన్ని బట్టీ కూడా కర్ణుడు వీరుడు కాదు అనలేం. సాధారణంగానే అన్ని దారులూ మూసుకుపోయి ఓటమికి దగ్గరవుతున్నప్పుడు మెదడు మొద్దు బారుతుంది. పైగా ఈయనకి శాపం కూడా ఉంది కదా ఆఖరి నిమిషంలో ఏమీ సహకరించవు అని. అలా అన్ని పరిస్థితులూ కలిపి పగపట్టేసాయి పాపం. నేను రథ చక్రం ఎత్తే దాకా ఆగు అంటాడు కర్ణుడు. పాపం భూదేవి కూడా సహకరించదు. భూదేవి శాపం కూడా ఉంది కదా మరి. అటువంటి సమయంలో అర్జునుడు నిరాస్త్రుడైన కర్ణుడిని చంపడానికి ఇష్టపడడు కానీ కృష్ణుడే ఇదే సరయిన సమయం, తప్పులేదులే చంపేయమంటాడు. ఇవన్నీ కేవలం నా ఆలోచనలు మాత్రమే. పైగా ఈ లెక్క ఇచ్చినది భాస్కరుడు. అదీ నోటి లెక్కగా ఇచ్చాడు. అటువంటి నోటి లెక్కని బట్టీ భారత కథకీ ఉన్న సమన్వయము చేసే ప్రయత్నమే తప్ప ఈ శ్లోకం భారతంలోనిది కాదు. మీ విశ్లేషణకు, ఈ శ్లోకం మిమ్మల్ని ఇంతగా ఆలోచింప చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కృతజ్ఞతలు.
@ అజ్ఞాత గారూ
వాస్తవాన్ని ఎప్పుడో అప్పుడు ఒప్పుకోక తప్పదు కదండీ!
@ భాస్కర్ గారూ
సమయం చిక్కటం లేదండీ. తీరిక దొరికినప్పుడల్లా ఇటు వైపే వస్తుంటాను. ధన్యవాదాలు!
@ వనజ గారూ
మీ అభినందనలకి నా అభివాదాలు. బాబోయ్ మీరలా అనేస్తే ఎలా? నాలాంటి అమ్మాయి లేకపోతే నన్నే మీ అమ్మాయి అనేసుకోండి. నేను రెడీ! మీ ముచ్చట తీరేలా అచ్చు గుద్దినట్టు నాలాంటి అమ్మాయే మీకు కోడలిగా రావాలని కోరుకుంటున్నాను :) నెనర్లండీ!
@ SNKR గారూ
హహహ! భలే వారే! అసలు ఆల్జీబ్రానే కష్టం కదా! చిన్నప్పుడు ఆల్జీబ్రా గుండె గాబరా అనేవాళ్ళం :) మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ సీత గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ అజ్ఞాత గారూ
బాగా చెప్పారండీ! ఇప్పుడు మనకి నోటి లెక్కలు ఎలాగో అప్పట్లో ఇవి అలా ఉండేవేమో అని నా అభిప్రాయం. అప్పట్లో సంస్కృతం వ్యవహారిక భాష కావటం వలన సంస్కృత శ్లోకాల రూపంలో ఉండి ఉండవచ్చును. కొన్నేళ్ళ తరువాత తెలుగు పరిస్థితి ఇలా కాకుండా ఉంటే అదే సంతోషం. ధన్యవాదాలండీ!
@ రాజ్ కుమార్ గారూ
అయ్యయ్యో! భలేవారే! ఈ సెల్యూట్ ఎందుకండీ చక్కగా షేక్ హ్యాండ్ ఇవ్వండి. థాంక్యూ!
@ తేజస్వి గారూ
ఏంటండీ మీరు? నా మీద అసూయ దేనికండీ? అంత పెద్ద పెద్ద మాటలు వద్దండీ. ఏదో తెలిసినది కాస్తా ఇక్కడ పెట్టేస్తున్నా అంతే. ధన్యవాదాలు!
@ ఆ. సౌమ్య గారూ
మీకు నచ్చినందుకు థాంక్స్ అండీ! మరి economics పరంగా అన్వయం ఆశిస్తున్నా :):) ఏమంటారు :)
@ శారద గారూ
మీకు ఆసక్తికరంగా అనిపించిందా సంతోషం అండీ. ధన్యవాదాలు!
@ మురళి గారూ
మీ ఆశ్చర్యానికి థాంక్స్ అండీ :) అమ్మో! అవధానం లాంటివి చెయ్యాలంటే ఎన్నో, ఎంతో తెలిసుండాలి. నేను చెప్పిన వాటిల్లో ఎంతో ఎంతో లోతుగా ఆలోచించాలి. నాకు అంత లేదండీ. మీ అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు!
@ ఫోటాన్ గారూ
ఇంకెంతసేపండీ? నేను మీ అన్వయం కోసం ఈగర్ గా వెయిటింగ్ ఇక్కడ. పంపండి త్వరగా :) మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ రామ్ గారూ
మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ! తెలిసున్నవీ, తెలుసుకున్నవీ, ఆలోచించినవీ అన్నీ కలగలిపి ఇలా మీ ముందుకి తెస్తుంటాను అంతే. మీ అభిమానానికి ధన్యవాదాలు.
@ అరుణ్ గారూ
హమ్మయ్యా! మళ్ళీ మీకు నచ్చేలా ఒక టపా వ్రాశాననమాట :) నిజమే! కానీ ఏం చేస్తాం? మన అదృష్టం కొద్దీ సంస్కృతం మరీ అంతరించిపోకుండా మనం నేర్చుకున్నందుకు సంతోషించటం, మీరు చెప్పినట్టు గర్వించటం తప్ప? ధన్యవాదాలండీ.
@ వెంకట్ గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ! మీ అందరి ఆదరాభిమానాలతో వీలున్నప్పుడల్లా తప్పక వ్రాస్తూ ఉంటాను.
@ జలతారువెన్నెల గారూ
భలే వారే మీరు. వనజ గారి కామెంటే అంటే మరి..... మీరు కూడా నన్ను మీ అమ్మాయి అనేసుకోండి (ఎలాగూ మీ అమ్మాయికి కూడా నాకు లాగా ఉప్మా అంటే ఇష్టం లేదు కదా!) నేను రెడీ. హహహ! తప్పకుండా వ్రాస్తాను మళ్ళీ బాలేదు అని అనకూడదు (ముందరి కాళ్ళకి బంధం అనమాట) :) నెనర్లండీ!
@ శ్రీ గారూ
ఓహ్ వేద గణితం అంటే మా చుట్టాల్లో ఒక తాతగారు ఉన్నారు. ఆయన గురించి మీరు వినే ఉంటారు. సుబ్బావధానులు గారని. వీలుంటే ఒకసారి ఈ లంకె చూడండి.
http://shrivedabharathi.org/avdhanlu.html
"మీ లెక్క ప్రకారం ఆరు బాణాలతో శల్యుడిని చంపాడనే కదా" అన్నారు... మన్నించాలి, ఆ మాట నేను అనలేదండీ. శల్యుడిని కొట్టాడు, శల్యుడు లొంగాడు అన్న పదాలు వాడాను తప్ప శల్యుడిని చంపాడు అని నాకు తెలిసి నేను వాడలేదు. కర్ణుని తరువాతనే శల్యుడు. అదసలు ఈ పర్వంలో రానే రాదు. "కర్ణుడిని అర్జునుని కంటే వీరునిగా చెప్తారు" అన్నారు. నేను అసలు ఇద్దరినీ పోల్చలేదు. ఒకసారి చాతకం గారికి ఇచ్చిన సమాధానం చూడ ప్రార్ధన. నేను ఈ టపాలో ఈ ఒక్క శ్లోకాన్నీ పరి పరి విధాలుగా ఎలా అన్వయించుకోవచ్చో చేసిన ఆలోచన మాత్రమే కనుక ఈ శ్లోకంలో అభివర్ణించి ఉన్న వాటిని తప్ప మిగతా వేటినీ పరిగణ లోనికి తీసుకోలేదు. "గమనిక: యుద్ధంలో ప్రతి రథానికీ చక్ర రక్షకులుంటారు...కర్ణుడు తన కుమారులనే చక్ర రక్షకులుగా పెట్టుకున్నట్లు గుర్తు... ముందు చక్రరక్షకుల్ని వధించాక రథాన్ని కూల్చడం సాధ్య పడుతుంది..." ఈ చక్ర రక్షకుల గురించి నేను వినలేదండీ. భారతంలో ఉందా? వీరి గురించి కాస్త వివరించ ప్రార్థన.
"యుద్ధాన్ని మనసును నియంత్రించే యుద్ధంగా చూపడం...అభినందనలు మీకు..." మీ అభినందనలకి నా అభివాదాలండీ. మానవునిలో ఎన్నో అంతర్యుద్ధాలు జరుగుతాయి కదా. పైగా మన హృదయ స్థానం కురుక్షేత్ర యుద్ధ రంగమనీ, హృదయం పై భాగం పాండవులనీ, హృదయం క్రింది భాగం కౌరవులనీ ఒక అన్వయం ఉంది. దానిని ఆధారంగా చేసుకుని ఇలా ఆలోచించాను. మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు.
@ రాజి గారూ
హహహ! మీరు మరీను! ఇలా ఆలోచించగలగటం నా గొప్ప కాదండీ. అంతా మా మాష్టారి ప్రేరణ అంతే! ధన్యవాదాలు!
@ పురాణ పండ ఫణి గారూ
ధన్యవాదాలండీ!
రసజ్ఞ గారూ!
చాలా రోజుల తరువాత సంస్కృతం మాష్టారి పలకరింపుతో కలిగిన ఆనందంలో గుర్తుచేసుకున్న మొదటి క్లాసు శ్లోకం...అప్పుడు లెక్క తప్పక చెప్పినా...ఇప్పటికీ గుర్తుపెట్టుకున్న మీ అతీ(పీ)త బుర్రకి వందనాలు!
అంతే కాదు ఆనాటి శ్లోకాన్ని ఈ నాడు గణిత, ఆధ్యాత్మిక, శాస్త్రీయ కోణాలలో విశ్లేషణ గావించిన మీ ప్రతిభ నిజంగా "నరస(జ్ఞ) భరితం".
అభినందనలు!
/అసలు కర్ణుడు వేసే బాణాలను ఆపడానికి అర్జునుడంతటి ప్రతిభావంతుడికే యాభై బాణాలు పట్టాయి. అంటే అబ్బో! కర్ణుడు ఎంత గొప్ప విలుకాడో కదా! /
1) ఇక్కడ మీ కన్క్లూజన్ బయాస్డ్ అండి, సరికాదేమోనండి. రాళ్ళేసే వాడి ఒక్కో రాయిని intercept చేసి పడగొట్టాలంటే కనీసం అన్ని రాళ్ళూ వేయాలి. అమెరికా వాడి పేట్రియాట్ అనే మిస్సైల్ కయినా ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెప్ట్ అనేదే 40-70% వున్నా అది గొప్పే అంటున్నారు. గుడ్డిగా ఎన్ని రాళ్ళేశారన్నది ముఖ్యమైనా, ఎన్ని లక్ష్యాన్ని తాకాయన్నది చాలా, చాలా ముఖ్యమైనది.
2) ఇంద్రియాలను అదుపు చేయడం అంటే ఎదుటివాడివి కాదేమో నండి... మనవి (స్వ.. స్వ) అండి, మన ఇంద్రియాలను మనం అదుపుచేసుకోవాలని భగవద్గీతలో భగవానుడు వేదాంత క్లాసులో అర్జునిడికి చెప్పాడంతే, అదీ స్థితప్రజ్ఞత సాధకులకు. పక్కోడి ఇంద్రియాలను మన భాణాలతో తొక్కేయడం ఇంద్రియాలను కంట్రోల్ చేయమని(చేతబడి/బాణామతి టైపు) కాదేమోనండి, ఆయ్ :)
3) అన్ని భాణాలతో అమాయకులైన గుర్రాలను, జండాను, బంగారం లాంటి రథాలను కూలగొట్టి ఆనందం పొందేకన్నా, ఆ ఒకే భాణమేదో ముందే లక్ష్యం చేసుకుని ప్రత్యర్థిని పడగొట్టి వుంటే, యుద్ధం త్వరగా ముగిసేది, అనవసర జన/సైన్య నష్టం తప్పేది,మరింత గొప్ప వీరుడిగా పేరు వచ్చేది.అఫ్కోర్స్ కనువిందు చేసే ఆయుధవిన్యాసాల యుద్ధ సీను చూసే అవకాశమూ కోల్పోయేవాళ్ళం(సినిమాల్లో)
మరో విషయం, సిస్సహాయుడైన గాయపడిన కుర్రాడు అభిమన్యుణిడికి పెదనాన్న(కర్ణుడికి తెలుసు) కర్ణుడిచ్చిన 'చివరిపోటు', వీరత్వం తెలిసిందేగా! కాబట్టి మీ యుద్ధ,రాజనైతిక,తాత్విక విశ్లేషణలు ఎలావున్నా, సంస్కృత ప్రతిభను అభినందిస్తున్నాను. :) ఒకటి మాత్రం నిజం గణిత సమాసాన్ని +, -,^, =, x,y,z లలో సరళంగా క్రోడీకరించడం గ్రీకు/ఈజిప్ట్/పాశ్చాత్యుల ప్రతిభ అనే భావించాలి.
ఇంతమందిని ఆలోచింపజేసిందంటేనే మీ రచన గొప్పతనం తెలుస్తున్నది.. విషయాన్ని చాలా చక్కగా సమన్వయించారు. అర్జునిడికి తగ్గ వీరుడు కనకనే వారిద్దరూ తలపడ్డారు.. కథలో ఆ విషయం తరచు ప్రస్తావన వస్తూనే ఉంటుందేమోకదా... కర్ణుని ఏకాకిని చేసాక అర్జునిని వంటి వీరునికి ఒక్క బాణం చాలు..వ్యాఖ్యలకు మీరిచ్చిన సమాధానములతో విషయం పట్ల స్పష్టత వచ్చింది. ఆలోచనాత్మకమైన రచన చేసిన మీకు అభినందనలు.
3) అన్ని భాణాలతో అమాయకులైన గుర్రాలను, జండాను, బంగారం లాంటి రథాలను కూలగొట్టి ఆనందం పొందేకన్నా, ఆ ఒకే భాణమేదో ముందే లక్ష్యం చేసుకుని ప్రత్యర్థిని పడగొట్టి వుంటే, యుద్ధం త్వరగా ముగిసేది
----------
SNKR నాకూ ఇలానే అనిపిస్తుంది.
లక్కరాజు గారు, SNKR గారు,
యుద్ధం లక్ష్యం శత్రువును ఓడించటం, చంపటం కాదు. శత్రువును చంపటం అనేది యుద్ధములో చిట్టచివరి చర్య (సమస్తమూ కోల్పోయినా బుసకొట్టే శత్రువు విషయములో). శత్రువు స్థాయినిబట్టి అక్కడిదాకా వెళ్ళాలా వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. ఇది మన పెద్దవాళ్ళు చెప్పిన యుద్ధనీతి.
Epatilage alochinpajesindi mi tapa.
Abhinandanalu...ilantive marinni rayalani asistu....
కష్టే ఫలే...శర్మగారి పోస్ట్ ఇపుడే చూసాను...
మీకు జన్మదిన శుభాభినందనలు...
మీరు వయసులో మాకంటే చిన్నవారు కనుక శుభాశీస్సులు....
@
happy birthday andi,
(oka vela ee roju mee puttina roju ithe)
అందులోని సమస్య కంటే మీరు దాని కిచ్చిన భాష్యం చాలా గొప్పగా ఉంది .నైస్ పోస్ట్.ఇటువంటి పోస్ట్ మీకే చెల్లు.
రసజ్ఞ జీ!
ఒక భాష
ఏబైయారు అక్షరములు
లక్షలాది పదములు
ఇవేవీ చాలవు మిమ్మల్ని అభినందించడానికి...........!
enti mee hadavudi enti?blog modalu pettinnappati nundi choostunna.aaye.maaku ee sanskrit raadenagaa mee istha vachchina padyalu maa meedaku vadulutunnaru.ipoyaarandee meeru ipoyaru.thirty days manipuri konnanu.inka manipuri slokalatho kodatha mimmalni.(fun intended)
మహాభారతాన్ని ఒకసారి మీరు మళ్ళీ చూస్తే..
కనపడుతుంది చక్రరక్షకుల ప్రస్తావన...
యుద్ధంలో రథానికి చక్రాలు ముఖ్యం కనుక
వాటిని రక్షిస్తూ...రెండు వైపులా ఉండేవారిని చక్ర రక్షకులంటారు..(రథ రక్షకులన్నమాట)
అర్జునుడు సైంధవ వధకి వెళ్ళే సమయంలోనే అనుకుంటాను..నకుల సహదేవులను చక్ర రక్షకులుగా ఉంటారు...
చక్ర రక్షకులని చంపి గాని రథాన్ని కూల్చడం సాధ్యపడదన్నమాట..
వారి మీద వేసిన బాణాలు లెక్కలో లేవెక్కడా!..
శల్యుడిని కొట్టడానికి అన్నారు కదా! ఆ వాక్యం కొంచెం వేరేదారి పట్టించింది...
మీరిచ్చిన లింక్ చూస్తాను...
ధన్యవాదాలు...చక్కని మీ ప్రతిస్పందనకి...
@శ్రీ
అద్భుతమైన రచనా శైలి. అంతకంటే అద్భుతమైన విశ్లేషణ. మీరు చెప్పిన విషయం ఆసక్తికరంగా ఉంది.
@ చిన్ని ఆశ గారూ
కొన్ని అలా మనసు పొరల్లో బలంగా నాటుకుని ఉండిపోతాయండీ. కొందరు పాఠం చెప్తుంటే అలా వినాలనిపిస్తుంది, కొందరు చెప్తుంటే ఎప్పుడు ఆపేస్తారు రా బాబు పారిపోదాం అనిపిస్తుంది. కనుక అదంతా మా మాష్టారి గొప్పదనం అండీ. మీకు నా విశ్లేషణ నచ్చినందుకు ధన్యవాదాలు. మీ అభినందనలకి అభివాదాలండీ!
@ SNKR గారూ
౧. అది కేవలం నా అభిప్రాయం మాత్రమే! అర్జునుడు అంత లక్ష్యం లేకుండా బాణాలు వేశాడు అని నేను అనుకోలేను. అలానే బాణాలు వేయటం అంటే ఎన్నో అస్త్రాలు ప్రయోగించాలి. ఒక్కో అస్త్రం ఎన్నో బాణాలని ఒకేసారి అడ్డుకోగలదు. ఒక్క అస్త్రంతో ఎన్నో జయించిన అర్జునుడికి మంచి పోటీ ఇచ్చాడు కదా కర్ణుడు అని నా ఉద్దేశ్యం. అయితే ఎవరెవరు ఎన్నెన్ని వేశారు అన్నది మాత్రమే ఉండి కానీ వాటిల్లో ఎన్ని వేరొక బాణాలని తాకాయి అన్న విషయం ఈ శ్లోకంలో లేదు.
౨. హహహ! పక్కోడు అన్న కాన్సెప్ట్ కాదండీ జీవుడు, ఆత్మ వేరు కాదు. ఒకరే. అదే ఇక్కడ ముఖ్యమయిన విషయం. అర్జునుడు, కర్ణుడు కూడా ఒక తల్లి బిడ్డలే కదా?
౩. పోరాటంలో ఎదురు నిలిచిన ప్రతీ వాడినీ చంపేయమని భారతమే చెప్పి ఉంటే మనకి అది ఆదర్శం అయ్యేది కాదు. ఎదురు నిలిచిన వాడికి చివ్వరి దాకా ప్రాణ రక్షణకి మనం ఛాన్స్ ఇవ్వాలి. అరుణ్ గారు చెప్పినట్టు ఓడించటమే కానీ చంపటం అనేది యుద్ధం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కానే కాదు.
మనం గణితంలో మనకి తెలియని దానిని let it be x అని ఎలా అనుకుంటామో అప్పట్లో భాస్కరుని లీలావతీ గణితం ప్రకారం దానినే "క" అనుకునేవారు (ట). మీ అభినందనలకి అభివాదాలు!
@ హనుమంత రావు గారూ
బాగా చెప్పారండీ! ఎంత తగ్గవాడు అని నిర్ణయించినా ఆచరణలో కూడా నిరూపించుకోగలిగాడు కర్ణుడు. ఇంతమంది ఆలోచిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అభినందనకు ధన్యవాదాలండీ!
@ లక్కరాజు గారూ
మీకు తెలియదని కాదు కానీ యుద్ధం అంటే చంపటం కాదు కదండీ. శత్రువుకి లేదా ప్రత్యర్ధికి చివరి దాకా ఛాన్స్ ఇస్తారు. ఈ విషయం మనకి రామాయణంలో కూడా ఉంది కదా. దేన్నయినా జయించాలి లేదా లక్ష్యాన్ని చేరాలి అంటే కొన్ని అడ్డంకులను దాటాలి. యుద్ధంలో అవే గుఱ్ఱాలు, జండాలు, రథాలు, మొ. అని నా అభిప్రాయం. మీ స్పందనకు ధన్యవాదాలు!
నాకు సంస్కృతం అంతగా రాదు. తెలుగు మాత్రం బాగా వచ్చనుకుంటాను. పైగా నేను సైన్స్, గణితం బాగా తెలుసు. కానీ..ఇంత శ్రద్ధగా ఇన్ని రకాల విశ్లేషణ చేయడం. చాలా బాగుందండి. మన వాళ్లు లెక్క కట్టిన తర్వాత.. ప్రపంచానికి లెక్కల
గురించి తెలిసింది. మీ ఆలోచనా విధానానికి నా జోహార్లు.
@ అరుణ్ గారూ
హాయ్ సేం నా ఫీలింగే (గోదావరిలో సీతలాగా) :)
@ కృష్ణ గారూ
ఆలోచింపచేసినందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా వీలున్నప్పుడు వ్రాస్తానండీ! మీ అభినందనలకు అభివాదాలు!
@ శ్రీ గారూ, @ భాస్కర్ గారూ
మీ ఆసీస్సులకు హృదయపూర్వక ధన్యవాదాలండీ!
@ రవి శేఖర్ గారూ
మీ ప్రశంసల జల్లులో తడిసిపోయాను. మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ!
@ సత్యవాణి గారూ
ఎంత మాట! మీరు నన్ను మరీ చెట్టు ఎక్కించేస్తున్నారు :) కృతజ్ఞతలండీ!
@ తనూజ్ గారూ
:):):) 30 days మణిపూరీ బదులు 30 days సంస్కృతం కొనుంటే నాది హడావిడి అనిపించేది కాదు కదండీ :) మీ మణిపూరీ శ్లోకాల కోసం వెయిటింగ్. కొడితే కొట్టారు కానీ కాస్త సున్నితంగా కొట్టండి దెబ్బ తగలకుండా :):) ధన్యవాదాలండీ!
@ శ్రీ గారూ
నేను మహాభారతం విన్నదే కానీ చదవలేదు, అలా శ్రుత పాండిత్యం లెండి. ఓహో! బాగుందండీ! ఇంత పకడ్బందీగా ఏర్పాటు చేసారనమాట ఒక యుద్ధానికి. "వారి మీద వేసిన బాణాలు లెక్కలో లేవేక్కడా" అన్నారు. నిజమే లేవు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఈ శ్లోకం భారతం లోనిది కాదు. కేవలం ఒక నోటి లెక్కగా ఇచ్చిన శ్లోకం నుండే ఇన్ని అన్వయాలు ఉంటే (భారతానికి కూడా అన్వయం కుదిరితే), అసలు మన పురాణేతిహాసాలలో ఒక్కో శ్లోకానికీ ఎన్ని అన్వయాలు ఉండి ఉంటాయో కదా! అని చెప్పే ఆంతర్యమే ఈ టపా. ఏవయినా ఇవన్నీ మహా సముద్రాలు. ఒక్క నీటి బొట్టు తెలుసుకోవడానికే, అన్వయించుకుని ఆచరించడానికే జీవిత కాలం సరిపోదు అనిపిస్తుంది. మీ ద్వారా ఒక క్రొత్త విషయం తెలిసింది. కృతజ్ఞతలండీ!
@ సంప్రదాయం గారూ
మీకు కూడా ఆసక్తి కలిగించిందనమాట. సంతోషమండీ! నా శైలి, విశ్లేషణా నచ్చినందుకు ధన్యవాదాలు!
@ సతీష్ గారూ
తెలుగు బాగా రావటమేమిటి అంత చక్కగా విశ్లేషిస్తుంటేను. నిజమేనండీ. ముందుగా మనవాళ్ళు లెక్క కట్టాక ప్రపంచానికి లెక్కలూ, అలానే లీలావతీ గణితం వ్రాసిన ఈ భాస్కరాచార్యుడే న్యూటన్ కన్నా ముందుగానే భూమికి ఉండే ఆకర్షణ శక్తి గురించి కూడా చెప్పారు (ట). పెరటి చెట్టు మందుకి పనికి రాదు అన్నట్టు మనం ప్రక్కన పెట్టేశాం. మిక్కిలి ధన్యవాదాలండీ!
చాలా బావుంది
happy birthday.
janma dhina shubhaakaamkshalu
రసజ్ఞ మీ విశ్లేషణ చాలాబాగుంది సంస్కృతంలో రాస్తే చదువుతారా అనుకునేదాన్ని .కాని మీరు చాలా మంది చేత చదివించారు .
@ కొత్తపాళీ గారూ
మీకు నచ్చినందుకు సంతోషం అండీ! ధన్యవాదాలు!
@ భాస్కర్ గారూ, @ భారతీయుడు గారూ
థాంక్స్ అండీ!
@ పద్మావతి శర్మ గారూ
మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. ఏదో అలా కుదిరేసిందండీ. మీ స్పందనకి ధన్యవాదాలు!
maa vanti maamarulanu kudaa chadivelaa chesthundi mee post, nijamgaa baagaa raasaaru.
paamarulu ani cheppatam kuda raledu chusaaraa, mottaaniki chadivistaaru meeku aa power undi
మీ బ్లాగ్ ని ఈరోజు తోలి సారిగా చూసినా. చూసిన వెంటనే ఈ బ్లాగ్ కి మీరు పెట్టినా పేరు చాలా కరెక్ట్ అనిపించింది.
మీ బ్లాగ్ లోని టపాలన్నీ చాలా బాగున్నాయి.
-- భరత్
@ ఫాతిమా గారూ
భలే వారే! అక్కడ అక్షరం అచ్చు తప్పయినా నాకు మీ కవితా హృదయం అర్థమయ్యిందండీ! మీకు నచ్చినందుకు, మీ ప్రోత్సాహానికీ మిక్కిలి ధన్యవాదాలు!
@ భరత్ గారూ
ఈ బ్లాగూ, దాని పేరు, టపాలు అన్నీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు!
జ్ఞానానికి మరో పేరు మీరు రాసే టపాలు,మీరున్ను.....చాల చక్కగా వివరించారు.
ధన్యవాదాలు.
@ శేఖర్ గారూ
మీ ప్రోత్సాహానికీ, మెచ్చుకోలుకీ నేనే మీకు మిక్కిలి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
కృష్ణాష్టమి శుభాకాంక్షలు ...
శ్రీ రసజ్న గారికి,నమస్కారములు.
మీ పరిచయం, లక్కరాజు గారు ప్రోటీన్స్ పై వ్రాసిన ఒక వ్యాసం పై మీరు వ్రాసిన వ్యాఖ్య ద్వారా. ఈ వ్యాసం చాలా చక్కగా వున్నది. మీరు చెప్పిన విషయాలు; దానిపై శ్రీ చాతకం గారి స్పందన, మీ ప్రతిస్పందన ముఖ్యంగా నచ్చినాయి. ఇది భారతంలోని శ్లోకం కాదు కాబట్టి ఎక్కువగా దానిపై వాధించలేము. అయితే, భారతం లాంటి పురాణాల ద్వారా మనం తెలుసుకోవలసినది ఏమిటియంటే `తప్పు చేసిన తోటి మనిషిని హెచ్చరించి, ఆ తరువాతనే అతనికి శిక్ష విధించాలి అన్నది'. లేకపోతే, సమాజం పాడైపోతుంది. శ్రీకృష్ణుడు, కంసుడి విషయంలో నూరు తప్పులను కాశీ, ఆ తరువాతనే శిక్ష వేశాడు.
మీ స్నేహశీలి,
మాధవరావు.
@ పరుచూరి వంశీ కృష్ణ గారూ
చాలా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి. ధన్యవాదాలు, మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు!
@ మాధవరావు గారూ
నమస్కారమండీ! పరిచయం అయిన వెంటనే వచ్చి అన్నిటినీ వరుసగా చదువుతూ మీరందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు!
బుజ్జగించి, నచ్చచెప్పి, హెచ్చరించి, ఆఖరిదాకా కూడా మారటానికి తగు సమయమిచ్చినప్పటికీ శ్రుతి మించితే శిక్ష అని తెలుస్తుంది. బాగా చెప్పారండీ! ధన్యవాదాలు!
ఆల్కేమిస్టు బంగారం చేయగలిగినట్లు, మీకు వ్రాయడం బాగా వచ్చు అనుకొంటాను. ఈ రోజే మీ బ్లాగ్ చూశాను. బంగారంలాంటి పోస్టులు చాలా ఉన్నాయి. వీలు చూసుకొని అన్నీ చదువుతాను. హేపీ టు హేవ్ ఫౌండ్ యువర్ బ్లాగ్! కీప్ పోస్టింగ్ నైస్ థింగ్స్.
@ కిశోర్ వర్మ గారూ
నాకు అంత అనుభవం ఏమీ లేదండీ, ఈ మధ్యనే ఇలా వ్రాస్తూ నా చేతికి కాస్త పని కల్పిస్తున్నాను :) మీ ప్రశంసల జల్లులో తడిసి పోయాను. తప్పకుండా చదివి మీ అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తూ.. నా ప్రయత్నం నేను చేస్తానండీ వీలున్నప్పుడల్లా తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను. కృతజ్ఞతలు!
నాకు సంస్కృతం బొత్తిగా తెలీదు కాని, maths problems ఇలా కూడా అడుగుతారా అని ఆశ్చర్యం, అంతలోనే ఆనందం... మాకు ఇలా తిప్పి తిప్పి అడగలేదు అని,
చాలా చాలా బాగుందండి,
ఒక్క ప్రశ్నని ఇన్ని కోణాల్లో చూడొచ్చని మీ ఈ పోస్ట్ చదివాకే తెల్సింది...
maths, సైన్సు మరియు చరిత్రలోకి కుడా వెళ్లి వచ్చింది, ఇంకేమైనా మిస్ అయ్యాయేమో చుడండి....
anyway hats-off to యువర్ పోస్ట్.....
@ సంతు గారూ
అప్పట్లో భాషాభిమానం అలా ఉండేది అనిపిస్తుందండీ నాకు. "ఇంకేమైనా మిస్ అయ్యాయేమో చుడండి" అదే కదండీ నేనూ అడిగాను. నా ఆలోచనా పరిధిలో నా అన్వయాలన్నీ పెట్టాను. ఇక మిగతా వాటికి అన్వయించటం మీ వంతు ;)
మీకు ఇంతగా నచ్చినందుకు కృతజ్ఞతలండీ!
nijamga chala bagundhi samskrutham lo intha ardham vuntundhani ippudey thelisindhi thank you
chandrasekhar.K
@ చంద్ర శేఖర్ గారూ
అంతే కదండీ మరి! అర్థం చేసుకున్నవారికి చేసుకున్నంత, అదొక నిధి అంతే! ధన్యవాదాలు!
It's really a great and helpful piece of information. I'm happy that you just
shared this helpful information with us. Please stay us up to date like
this. Thanks for sharing.
my site; dating sites (bestdatingsitesnow.com)
Post a Comment