ఈ పేరు తలుచుకుంటేనే ఏదో క్రొత్త ఉత్సాహం. సాధారణంగా నేను వ్రాయబోయే టపాల శీర్షికలు ముందుగా చెప్పను. కానీ దీని గురించి ఇంతకు ముందే చెప్పేశాను. మొదట్లో నేను కాళిదాసు రచనలన్నీ చదివి ఆయన గురించి ఒక ప్రత్యేక టపా వ్రాయాలి అనుకున్నాను. నా పిచ్చి కానీ అంతటి మహానుభావుని గురించీ, ఆయన వ్రాసిన ఒక్కో రచన గురించీ చెప్పడానికి మిడి మిడి జ్ఞానం ఉన్న నాకే ఒక టపా చాలట్లేదు అంటే పూర్తిగా అర్థమయ్యి ఉంటే ఆయన వ్రాసిన ఒక్కో రచనలో ఒక్కో శ్లోకానికీ ఒక్కో టపా వ్రాసేదానినేమో! ఆయన గురించి మామూలు మాటల్లో తెలుసుకోవటం కంటే ఆయన రచనల్లో ఆయనని ముందు తెలుసుకోవడం మంచిదని నా ఉద్దేశ్యం. ప్రస్తుతానికి నా పరిధి మేరకు ఆయన ఒక్కో రచననీ పరిచయం చేస్తూ నా అభిప్రాయాలు, అన్వయాలు, ఆలోచనల మేళవింపుతో కాళిదాసుని మీ ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తాను.
ఈయన రచనల్లో ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పడానికేమీ లేదు (అలా చెప్పడానికి నాకున్న జ్ఞానం సరిపోదు) కానీ ఈ అభిజ్ఞాన శాకుంతలం నన్ను ఎక్కువగా ఆకర్షించింది. ఇది "శృంగార రస" ప్రధానమయిన నాటకం. ఈ కథ అందరికీ బాగా తెలిసినదే కనుక సూక్ష్మంగా చెప్పుకుంటే: హస్తినాపుర రాజయిన దుష్యంతుడు వేటకు వెళ్ళినపుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో శకుంతలని కలిసి, ప్రేమించి, గాంధర్వ వివాహం చేసుకుంటాడు. కొంతకాలం ఆమెతో ఉన్నాక రాజ్యానికి తిరిగివెళుతూ రాజముద్రికను గుర్తుగా ఇస్తాడు. భర్త గురించిన తలపులతో, విరహంలో ఉన్న సమయంలో ఆశ్రమానికి వచ్చిన దూర్వాస మునిని సరిగా ఆదరించక పోవడంతో ఎవరిగురించయితే ఆలోచిస్తూ నన్ను అశ్రద్ధ చేసావో వారు నిన్ను పూర్తిగా మర్చిపోతారనీ, ఏదయినా గుర్తు చూసినప్పుడే గుర్తువస్తావనీ శకుంతలని శపిస్తాడు. నిజానికి ఈ శాప విషయం కూడా ఆమె వినకుండా భర్త గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. ఇవన్నీ కణ్వ మహర్షి ఆశ్రమంలో లేని సమయములో జరిగినందున తిరిగివచ్చిన మహర్షి జరిగినదంతా తెలుసుకుని శకుంతలను అత్తవారింటికి పంపుతాడు. రాజు వద్దకు వెళ్తున్న శకుంతల నదిలో ఈ రాజముద్రికని కోల్పోవడం, రాజు ఈమెను గుర్తించక నిరాకరించడం, మేనక ఆమెను తీసుకెళ్ళిపోవడం, కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో చేరటం, ఇలా చాలా జరిగి ఒక చేపలవాని వలలో చిక్కిన ఈ రాజముద్రికని రాజు వద్దకు తీసుకెళ్లడం, అప్పుడంతా గుర్తువచ్చిన దుష్యంతుడు శకుంతలని తన వద్దకు తీసుకుని వచ్చి వారి కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేయటం జరుగుతాయి.
ఈ నాటకంలో నాకు శృంగారం కన్నా ధార్మిక సూత్రాలు ఎక్కువగా కనిపించాయి (పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు కదా!). ప్రతీ రచనా శ్రీకారానికి ప్రోద్బలం ఉంటుంది అన్నట్టుగా ఒక రోజున భోజమహారాజు కాళిదాసుని శాకుంతలాన్ని రచించమని అడుగగా ఈయన "శాకుంతలంలోని నాయకుడయిన దుష్యంతుడు ధీరోదాత్తుడు కానందున నేను వ్రాయను" అంటారు. ఇక్కడ మనకు కాళిదాసు రచనలో పాత్రలకి కూడా ఎంత చక్కని గుణాలని ఆపాదించాలని చూస్తాడో అనిపిస్తుంది. తన భార్యాబిడ్డల్ని ఎక్కడ లోకం అనుమానిస్తుందో, అవమాన భారం మొయ్యాల్సివస్తుందో అన్న భయంతో (లోకానికి వారు నిజంగా తనవారే అని అశరీరవాణితో చెప్పించడానికి అలా చేశాడు అని కొందరి సమర్ధన) తన వారు కాదని చెప్పిన దుష్యంతుడిని నాటకంలో నాయకుడిని చేయలేను. అయినా రాజు అడిగినందున ఆయన ముచ్చట తీర్చడానికి తను రాజీ పడలేక ఒక శాపం పొందినట్టు, ముద్రిక చూడటం వలన అంతా మళ్ళీ గుర్తుకు వచ్చినట్టు కల్పించి, నాయకుని లక్షణాలను ఆపాదించి, అభిజ్ఞాన శాకుంతలం అని నామకరణం చేశాడు. అభిజ్ఞానం అనగా ఒక గుర్తు (ఇక్కడ కథలో రాజ ముద్రికే గుర్తు). అందువలననే దీనిని కేవలం శాకుంతలం అని కాక అభిజ్ఞాన శాకుంతలం అనాలి.
"కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతలా
తస్యాంచ చతుర్ధ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయం"
తస్యాంచ చతుర్ధ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయం"
అన్నట్టుగా కావ్యాలకంటే నాటకాలు రమ్యంగా ఉంటాయి. నాటకాలలో శాకుంతలం,
అందులో మళ్ళీ నాల్గవ అంకము, అందులో కూడా శ్లోక చతుష్టయం (ఇది వినగానే నాకు దుష్ట
చతుష్టయం గుర్తుకొచ్చింది :)) అద్భుతమయినవి. శ్లోక చతుష్టయం అంటే నాలుగు శ్లోకాలు.
ఈ నాలుగూ కూడా కణ్వ మహర్షి చెప్పిన సందర్భంలోవే. ఏమిటా శ్లోకాలు? ఎందుకవి అంత
గొప్పవి అంటే వాటిని చదవ వలసినదే:
పాతుం న ప్రధమం యవస్యతిజలా యుష్మాస్వపీ తేషుయా
నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం
ఆజ్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః
సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం
నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం
ఆజ్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః
సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం
మనిషికీ ప్రకృతికీ ఉండే బంధాన్ని ఎంత చక్కగా చెప్పాడో కదా కాళిదాసు!
మొక్కలకి నీళ్ళు పోయకుండా తను మంచినీళ్ళు కూడా త్రాగేది కాదు, చిగురుటాకులను
అలంకరించు కోవటం ఎంత ఇష్టమయినా సరే తుంచేది కాదు, తాను పెంచిన మొక్కకి పువ్వు పూస్తే
పిల్లలు పుట్టినంత ఆనందించి ఉత్సవం చేసేది, అటువంటి శకుంతల అత్తవారింటికి
వెళుతోంది కనుక మీరు అనుజ్ఞని ఇవ్వండి అంటాడు కణ్వ మహర్షి. ఈ శ్లోకంలో మొక్కలని
సాటి మనిషిగా, అతిధిగా, సన్నిహితులుగా, బంధువులుగా చూపటం జరిగింది. వృక్షో రక్షతి
రక్షితః అని మనం అనడమే తప్ప ఏనాడయినా ఇంత మమకారం చూపించామా? అనిపిస్తుంది నాకయితే.
యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట
ముత్కంఠయా
కంఠస్థంబిత బాష్పవృత్తి కలుషశ్చింతా జడం దర్శనం
వైక్లవ్యం మమతావదీ దృశ మిదం స్నేహాదరణ్యౌ కసః
పీడ్యంతే గృహిణః కథంనుతనయా విశ్లేష దుఃఖైర్నవైః
కంఠస్థంబిత బాష్పవృత్తి కలుషశ్చింతా జడం దర్శనం
వైక్లవ్యం మమతావదీ దృశ మిదం స్నేహాదరణ్యౌ కసః
పీడ్యంతే గృహిణః కథంనుతనయా విశ్లేష దుఃఖైర్నవైః
నా కూతురయిన శకుంతల అత్తవారింటికి
వెళుతుంటే బాధతో కంఠం పట్టేసి నోట మాట రావటం లేదు, కంటిలో నీరు చేరి చూపు
కనిపించటం లేదు, అంతా జడంగా, నిర్జీవంగా అనిపిస్తోంది. మునివృత్తిలో ఏ బంధాలూ
లేకుండా ఉండే నాకే ఇంత బాధగా, మనసంతా ఏదోలా ఉందే అదే గృహస్థులకి కూతురిని అత్తవారింటికి
పంపేటప్పుడు ఇంకెంత బాధాకరంగా ఉంటుందో కదా! అని ఆలోచిస్తాడు కణ్వ మహర్షి. ఒక
ప్రక్కన తను బాధపడుతూనే వేరే వారి పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కూడా కణ్వ మహర్షిలో
కలిగినట్టు చూపెడతాడు కాళిదాసు. ఒక తండ్రికి అత్యంత బాధ కలిగే సమయం ఇదే అంటారు
అందుకేనేమో!
అస్మాన్ సాధు విచింత్య సంమ్యమధనాన్ ఉచ్ఛైః కులంచాత్మనః
త్వైయస్యాః కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం
సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా
భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వధూబంధుభిః
కూతురితో రాజయిన అల్లుడికి కణ్వ మహర్షి పంపే సందేశమే ఈ శ్లోకం. నేను
సారెలు, కట్నకానుకలు ఇవ్వలేదు. ముని వృత్తిలో ఉన్న మాకు తపస్సు, నీతి నియమాలే ధనం.
రాజువయిన నీకు ఇంతకన్నా గొప్ప ధనాన్ని (నీ తాహతుకు తగ్గట్టు) మేము ఇవ్వలేము. కావున
అవేమీ ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు, డబ్బు,నగలు లేవని తృణీకార భావంతో చూడకు.
మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. స్నేహభావంతో, అనురాగంతో మీరిరువురూ
గాంధర్వ వివాహం చేసుకున్నారు కనుక మా అమ్మాయి నచ్చలేదు అని ఏ నాడూ అనకు. నీకు చాలా
మంది భార్యలున్నా (బహు భార్యత్వం ఆ కాలంలో సహజమే) వారితో సమానంగా చూడు. వారికన్నా
బాగా చూసుకుంటాను అంటే అది శకుంతల భాగ్యం కానీ నేను మాత్రం వారికన్నా బాగా చూడమని చెప్పకూడదు అని ఈ శ్లోక సారాంశం. నన్నెంతగానో కదిల్చింది. ఎంత
ముందుచూపు ఆ తండ్రికి? నీతి నియమాలు, సత్ప్రవర్తనకి మించిన ధనం ఉంటుందా? ఈ విషయం ఈ
కాలం వారు గ్రహించి ఆచరిస్తే ఎంతో మంది స్త్రీలు కట్న పిశాచికి బలి కాకుండా
ఉండేవారేమో కదా! అనిపించింది.
సుశ్రూషస్వ గురూన్ ప్రియసఖీ వృత్తిం సపత్నీజనే
భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతీ పంగమః
భూయిష్ఠం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః
భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతీ పంగమః
భూయిష్ఠం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ
యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః
ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో అల్లుడు కూతురిని
ఎలా చూసుకోవాలో చెప్పిన కణ్వ మహర్షి ఈ శ్లోకంలో ఆడపిల్ల అత్తవారింట ఎలా ఉండాలో
చెప్పాడు. పెద్దలకి (అత్తమామలకీ, మొ..వారికి) సేవ చెయ్యి, సవతులతో స్నేహంగా ఉండు,
భర్త కోపంలో ఒక మాట అన్నా రోషం తెచ్చుకోకుండా అతనితో సామరస్యంగా ఉండు, సేవకుల యందు
దయకలిగి ఉండు వారిని ఏ నాడూ తక్కువగా చూడకు, భోగ భాగ్యాలున్నాయి అన్న ఉద్వేగంతో
గర్వం దరిచేరకుండా చూసుకో. ఇలా ఉన్నప్పుడే యువతులు గృహిణీ స్థానం పొందుతారు లేదా
చెడ్డ పేరు తీసుకువస్తారు అని చెప్తాడు. ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యం. తప్పక ప్రతీ
ఒక్కరూ ఇవన్నీ పాటిస్తూ ఆచరణలో పెట్టగలిగితే (?) ఈ కాలంలో విడాకులు అనేవి ఉండేవి
కావేమో! అనిపిస్తుంది.
ఈ నాలుగు శ్లోకాలూ అమోఘం. కాళిదాసు ఇవన్నీ ఈ కాలంలో పరిస్థితులు ఇలా ఉంటాయన్న ముందుచూపుతో ఇవన్నీ వ్రాశాడో, లేక మామూలుగానే వ్రాశాడో తెలియదు కానీ ప్రపంచం ఎంతగా మారిపోయినా ప్రతీ ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవలసిన మాటలు కదూ! అందుకేనేమో ఇవి శ్లోక చతుష్టయం అంటూ అంతటి గొప్ప స్థానాన్ని పొందాయి.
ఈ నాలుగు శ్లోకాలూ అమోఘం. కాళిదాసు ఇవన్నీ ఈ కాలంలో పరిస్థితులు ఇలా ఉంటాయన్న ముందుచూపుతో ఇవన్నీ వ్రాశాడో, లేక మామూలుగానే వ్రాశాడో తెలియదు కానీ ప్రపంచం ఎంతగా మారిపోయినా ప్రతీ ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవలసిన మాటలు కదూ! అందుకేనేమో ఇవి శ్లోక చతుష్టయం అంటూ అంతటి గొప్ప స్థానాన్ని పొందాయి.
ఈ నాటకమంతటిలో నాకు
కాళిదాసు జనాలకి ఎక్కువ ఉపదేశాలు చేశారనిపిస్తుంది. ఎన్నో ధర్మాలకి అక్షర రూపం ఈ
నాటకం. ప్రతీ శ్లోకంలోనూ ఒక్కో ధర్మాన్ని చూడచ్చు. వాటిల్లో అన్నీ వ్రాయలేను కానీ
కొన్ని ముఖ్యమయినవి, ఆలోచించ తగినవి (నా ఉద్దేశ్యంలో):
ప్రాణానామనిలేన వృత్తి రుచితా సత్కల్ప వృక్షేవనే
తోయే కాంచన పద్మరేణుకపిశే ధర్మాభిషేక క్రియా
ధ్యానం రత్న శిలాతలేషు విభుధస్త్రీ సన్నిధౌ సంమ్యమః
యత్కాంక్షంతి తపోభిరన్య మునయః తస్మిన్ తపస్యంత్యమీ
ఇది దుష్యంతుడు కశ్యప ప్రజాపతి ఆశ్రమానికి
వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితిని వర్ణించిన సందర్భంలోనిది. అక్కడ ఉన్న జనాలు
కల్పవృక్షం క్రింద కూర్చుని ప్రాణాయామం చేస్తున్నారు, ఆకాశగంగలో బంగారు తామరపూల
మధ్యన స్నానం చేస్తున్నారు, రత్నాలతో చేసిన వేదిక పైన కూర్చుని తపస్సు
చేస్తున్నారు, చుట్టూ అప్సరసలు తిరుగుతున్నా పట్టించుకోకుండా ధ్యానంలో నిమగ్నమై
ఉన్నారు. అసలు సాధారణ మానవులు ఏవయితే కోరుకుంటారో వాటికి మించి ఉన్నా కూడా మోక్షం
కోసం ఇవన్నీ చేస్తున్నారు. అంటే దీనిని బట్టీ కాళిదాసు ఈ భోగభాగ్యాలు శాశ్వతం కాదు
ఆత్మసాక్షాత్కారం, మోక్షం మాత్రమే శాశ్వతం అని చెప్తున్నాడా (?) అనిపిస్తుంది.
కానీ వారిలో వేటికీ చలించకుండా ఉన్న చిత్తశుద్ధి, చేస్తున్న పని మీద ఏకాగ్రత మనకు
ఉంటే అబ్బో! ఎన్ని సాధించే వాళ్ళమో!
తన వద్దకు వచ్చిన శకుంతలని నిరాకరించిన దుష్యంతునికి ఒక పాట వినిపిస్తుంది. దాని భావం "తుమ్మెదా! నువ్వు ఒక పువ్వు మీద వాలి మకరందాన్ని స్వీకరించావు, తరువాత దీనిని వదిలేసి ఇంకొక పువ్వు మీద వాలతావు" అని ఉంటుంది. అది వినేసరికి దుష్యంతునికి మనసులో అల్లకల్లోలం. మనసుకి బాగా పట్టేసినది ఏదయినా విన్నా, దాని గురించి ఏం తెలిసినా అదంతా గత జన్మ భావన అనుకోవటమే కాక మనసు చలించిపోయి ఉద్వేగానికి గురవుతారు. అందుకే భావస్థిరాణి జననాంతర సౌహృదాని అంటారు. ఇక్కడ దుష్యంతుని ఆ తుమ్మేదని నేనే ఎవరినో వదిలేసాను అన్న భావన గత జన్మలోదని భావించాడు కానీ ఈ జన్మలోదే అని శాప ప్రభావం చేత తెలుసుకోలేకపోయాడు. మనసుకి బాగా దగ్గరయినవి ఎన్నటికీ మర్చిపోలేము అన్న మాట మనందరికీ అనుభవమే కదా!
ఒక పౌర్ణమి తరువాతి రోజు సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఒకరు (చంద్రుడు) అంతమవుతుంటే ఒకరు (సూర్యుడు) పుడుతున్నాడు అంటారు కాళిదాసు. ఇది మనందరం చూసే విషయమే కదా ఇందులో వింతేముంది అనుకోకండి. ఆలోచిస్తే ఒక మనిషి చనిపోతుంటే వేరొక మనిషి పుడుతున్నాడు అన్న అంతరార్థం ఉంది కదా. అది చెప్పేందుకే ఇలా చూపించాడా అనిపిస్తుంది.
వాస్తవానికి రాజయిన దుష్యంతునికి మునికుమార్తె శకుంతల మీద ప్రేమ భావం కలుగకూడదు. కానీ కలుగుతోంది అంటే ఇది నిజంగా తప్పు కాదు అనుకుంటాడు (నిజానికి ఈమె విశ్వామిత్రుని కుమార్తె కదా). సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః అన్నట్టు సందేహంగా ఉన్నప్పుడు మనసు ఏది చెప్తే అదే చేయమని అంటాడు కాళిదాసు. సత్పురుషులకీ, గొప్పవారికి మనస్సే ప్రమాణం. అందుకే కదా మనస్సాక్షికి మాత్రమే భయపడాలి అంటారు.
అత్తవారింటికి వెళ్తున్న శకుంతల తండ్రయిన కణ్వ మహర్షిని మళ్ళీ పుట్టింటికి ఎప్పుడు రాను? అని అడుగుతుంది పుట్టింటి మీద మమకారంతో. అది విన్న ఆయన వానప్రస్థానికి రమ్మంటాడు. దీనిని బట్టీ పెళ్ళయిన ఆడపిల్ల అస్తమానూ పుట్టింటికి రాకూడదు అన్న విషయం చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే నాటకమంతా చాలా చాలా ఆలోచనలను రేపింది. కాళిదాసు రచనలన్నింటిలోనూ అభిజ్ఞాన శాకుంతలం ఎంతో కీర్తి సంపాదించుకుంది. వేరే భాషలలో కూడా ఎక్కువగా అమ్ముడయిన పుస్తకం ఇదే (ట). ఎన్నో భాషలలోకి తర్జుమా చేసినా సంస్కృతంలో మాత్రమే చదవాలని కేవలం ఈ నాటకం ఆస్వాదించడం కోసమే కొంతమంది సంస్కృతం నేర్చుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. నేనూ అలా నేర్చుకున్నదే :)
తన వద్దకు వచ్చిన శకుంతలని నిరాకరించిన దుష్యంతునికి ఒక పాట వినిపిస్తుంది. దాని భావం "తుమ్మెదా! నువ్వు ఒక పువ్వు మీద వాలి మకరందాన్ని స్వీకరించావు, తరువాత దీనిని వదిలేసి ఇంకొక పువ్వు మీద వాలతావు" అని ఉంటుంది. అది వినేసరికి దుష్యంతునికి మనసులో అల్లకల్లోలం. మనసుకి బాగా పట్టేసినది ఏదయినా విన్నా, దాని గురించి ఏం తెలిసినా అదంతా గత జన్మ భావన అనుకోవటమే కాక మనసు చలించిపోయి ఉద్వేగానికి గురవుతారు. అందుకే భావస్థిరాణి జననాంతర సౌహృదాని అంటారు. ఇక్కడ దుష్యంతుని ఆ తుమ్మేదని నేనే ఎవరినో వదిలేసాను అన్న భావన గత జన్మలోదని భావించాడు కానీ ఈ జన్మలోదే అని శాప ప్రభావం చేత తెలుసుకోలేకపోయాడు. మనసుకి బాగా దగ్గరయినవి ఎన్నటికీ మర్చిపోలేము అన్న మాట మనందరికీ అనుభవమే కదా!
ఒక పౌర్ణమి తరువాతి రోజు సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఒకరు (చంద్రుడు) అంతమవుతుంటే ఒకరు (సూర్యుడు) పుడుతున్నాడు అంటారు కాళిదాసు. ఇది మనందరం చూసే విషయమే కదా ఇందులో వింతేముంది అనుకోకండి. ఆలోచిస్తే ఒక మనిషి చనిపోతుంటే వేరొక మనిషి పుడుతున్నాడు అన్న అంతరార్థం ఉంది కదా. అది చెప్పేందుకే ఇలా చూపించాడా అనిపిస్తుంది.
వాస్తవానికి రాజయిన దుష్యంతునికి మునికుమార్తె శకుంతల మీద ప్రేమ భావం కలుగకూడదు. కానీ కలుగుతోంది అంటే ఇది నిజంగా తప్పు కాదు అనుకుంటాడు (నిజానికి ఈమె విశ్వామిత్రుని కుమార్తె కదా). సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః అన్నట్టు సందేహంగా ఉన్నప్పుడు మనసు ఏది చెప్తే అదే చేయమని అంటాడు కాళిదాసు. సత్పురుషులకీ, గొప్పవారికి మనస్సే ప్రమాణం. అందుకే కదా మనస్సాక్షికి మాత్రమే భయపడాలి అంటారు.
అత్తవారింటికి వెళ్తున్న శకుంతల తండ్రయిన కణ్వ మహర్షిని మళ్ళీ పుట్టింటికి ఎప్పుడు రాను? అని అడుగుతుంది పుట్టింటి మీద మమకారంతో. అది విన్న ఆయన వానప్రస్థానికి రమ్మంటాడు. దీనిని బట్టీ పెళ్ళయిన ఆడపిల్ల అస్తమానూ పుట్టింటికి రాకూడదు అన్న విషయం చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే నాటకమంతా చాలా చాలా ఆలోచనలను రేపింది. కాళిదాసు రచనలన్నింటిలోనూ అభిజ్ఞాన శాకుంతలం ఎంతో కీర్తి సంపాదించుకుంది. వేరే భాషలలో కూడా ఎక్కువగా అమ్ముడయిన పుస్తకం ఇదే (ట). ఎన్నో భాషలలోకి తర్జుమా చేసినా సంస్కృతంలో మాత్రమే చదవాలని కేవలం ఈ నాటకం ఆస్వాదించడం కోసమే కొంతమంది సంస్కృతం నేర్చుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. నేనూ అలా నేర్చుకున్నదే :)
92 comments:
Baagundi Andi Chaalaa Baagaa Vivarinchaaru
chaala bagundi rasagya
మంచి పని చేశారు. మహానుభావుడు కాళిదాసు రచనలన్నింటినీ పరిచయం చేయండి. అభిజ్ఞానశాకుంతలం నేను హిందీలో చదివాను. ఇప్పుడు మేఘసందేశం చదువుతున్నాను. నేనూ వ్రాయాలనుకుంటాను. మీలాగా సమగ్రత తీసుకురాలేను. అందుకే జంకాను. ఈరోజు మీరు నాకెంతో సంతోషం కలిగించారు.
‘శాకుంతలం’లోని ప్రసిద్ధమైన నాలుగు శ్లోకాల గురించి బాగా రాశారు. అభినందనలు! కందుకూరి వీరేశలింగం గారు ఈ నాటకాన్ని తెలుగులోకి అనువదించినపుడు ఈ శ్లోకాలను పద్యాలుగా మలిచారు.
‘కావ్యేషు నాటకం రమ్యం’శ్లోకంలోని చివరి పాదాలు ఇలా ఉంటాయి- ‘తత్రాపి చతుర్ధోంక:
తత్ర శ్లోక చతుష్టయమ్’అని. అలాగే ‘భావస్థిరాణి జననాంతర’ తర్వాత ‘సౌహృదాని’ అని ఉండాలి. ఇలాంటి స్వల్ప అక్షర దోషాలు మినహా మీ టపా పఠనీయంగా ఉంది.
ఆకట్టుకునేలా ఉంది.
పంచ మహా కావ్యాల్లో
మహాకవి కాళిదాసు గారి వే మూడు
కావ్యాలున్నాయంటే అది చాలదా?
ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి...
ఏమంటారు రసజ్ఞ గారూ!
నేను చిన్నప్పుడు చదువుకున్న పాఠం..శాకుంతలం...
మిగిలినవి పెద్దయ్యాక చదివినవి...
మంచి ప్రయత్నం...
మీకు అభినందనలు..@శ్రీ
చదివే సందర్భం వస్తుందో లేదో కానీ మీ పోస్టు ద్వారా మాకు కాస్త భాగ్యం కలిగించారు.
కాళిదాసు, అభిజ్ఞాన శాకుంతలం అని వినటమే గానీ ఇలా ఎప్పుడూ చదవలేదండీ. మొదటి సారి కాబట్టీ.. పద్యాలు వదిలేసీ(నాకంత బొమ్మ లేదు.. పద్యాలంటే కొంచెం కష్టపడాలి.. ఇప్పుడంత టైం లేదు)మిగిలిన పోస్టంతా చదివాను.
ఎడ్యుకేట్ చేసే అతి తక్కువ తెలుగు బ్లాగుల్లో మీరు చాలా ప్రత్యేకం అండీ..
ధన్యవాదాలు.
కాళిదాసు మహాకవి, అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథం రాసారని తప్పించి మరింకేం తెలీదు నాకు. చాలా విషయాలు తెలియజేసారు. ఎప్పట్లాగే మీ పోస్టులు చదివి బోల్డు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. :)
meeru nijamgane bhangaramandi,
99.999%,
mee postlu anthe,
నాకు ఈ పద్యాలు అవి, పెద్దగా పురాణాల మీద ఎక్కువగా జ్ఞానం,ఆసక్తి లేదు. మొదటి సారిగా కస్టేఫలే గారు పురాణ కథలు చెపుతూ, ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటనలు, మనుషుల మనస్తత్వాలు చక్కగా కంపేర్ చేసి రాసినప్పుడు, మొదటి సారి ఆసక్తి కలిగింది. స్కూల్ లో ఉన్నప్పుడు చదివుకున్నాము కాబట్టి శకుంతలా, దుష్యంతుడు కథ తెలుసు. మళ్ళీ
మీరు రాసినప్పుడు ఇప్పుడు చదవడమే!
Again I would say "Informative".
Baga rasarandi...inko 2 saarlu chadivite inka baga artham aitundi naku. Kani first impression is excellent!
Krishna
nice one
Bagundi Rasagna garu
@ తెలుగు పాటల ప్రిన్సు గారూ
మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ!
@ అనామిక గారూ
మీరిలా నా ప్రతీ టపా చదవటం సంతోషంగా ఉందండీ. మీకు నచ్చినందుకు నెనర్లు!
@ లక్ష్మీ దేవి గారూ
మీకు నా టపా ఇంత సంతోషాన్ని కలిగించింది అంటే అది నా భాగ్యం. మీరు హిందీలో చదివారా? కుదిరితే సంస్కృతంలోనే చదవండి. పడి కట్టు తేడా ఉంటుంది కదా! మీరు కూడా వ్రాసెయ్యండి త్వరగా నేను ఎదురు చూస్తాను. మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలండీ!
@ వేణు గారూ
ముందుగా మీ అభినందనలకి నా అభివాదాలు. నేను తెలుగు అనువాదం చదవలేదు. ఈ సారి వీలున్నప్పుడు చదవాలి. ‘సౌహృదాని’అని సవరించానండీ. అచ్చు తప్పు వ్రాసేటప్పుడు చూడలేదు. సరిదిద్దినందుకు ధన్యవాదాలు. "కావ్యేషు నాటకం రమ్యం" శ్లోకం నేను ఇలానే నేర్చుకున్నాను మా గురువుగారి వద్ద. మీరు చెప్పినదానికి, నేను చెప్పినదానికీ భావం ఒకటే ఉన్నా, మీరు చివరి పాదాలు అవ్యయ రూపంలో చెప్పారు, నేను వ్రాసిన దానిలో శబ్ద రూపం ఉంది. కనుక రెండూ వేరు వేరు కాదనే అనుకుంటున్నాను. నా టపా మిమ్మల్ని ఆకట్టుకున్నందుకు కృతజ్ఞతలు!
@ శ్రీ గారూ
ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది నాకు. అయితే మీరు ఆయన నాటకాలూ, కావ్యాలూ అన్నీ చదివేసారనమాట :) మీ అభినందనలకు నా అభివాదాలు!
@ మురళి గారూ
ధన్యవాదాలండీ! మీకు నిజంగా చదవాలని ఉంటే ఈ టపాలోనే లింక్ జత చేశాను చూడండి. అందులో సంస్కృత రచనతో పాటూ క్రింద ఆంగ్ల అనువాదం కూడా ఉంది. మీ ప్రోత్సాహానికి చాలా థాంక్స్ అండీ!
@ రాజ్ కుమార్ గారూ
హహహ! మీ నిజాయితీకి భలే ముచ్చటేస్తోందండీ :) పోన్లెండి మిగిలిన టపా చదివారు కదా అదే చాలు నాకు. భావం ముఖ్యం. మీ అభిమానానికి అనేకానేక ధన్యవాదాలండీ!
@ మధురవాణి గారూ
అభిజ్ఞాన శాకుంతలం గురించి ఇప్పుడు మీకు కూడా అంతా తెలిసిపోయిందిగా :) చాలా చాలా థాంక్స్ అండీ!
@ భాస్కర్ గారూ
హహహ! మీరు భలే వారే! చాలా థాంక్స్ అండీ! మరీ అంత ప్యూర్ గోల్డ్ అయితే కష్టమేమో ;)
@ జలతారు వెన్నెల గారూ
ఆసక్తి లేకపోయినా ఇంత ఓపికగా నా టపా అంతా చదివినందుకు చాలా థాంక్స్ అండీ! మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!
@ కృష్ణ గారూ
అయితే ఎందుకాలస్యం మరి చదివేయండి ఆ మిగతా రెండు సార్లు కూడా ;) మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ గణేశ్ గారూ
మీకు నచ్చినందుకు థాంక్స్ అండీ!
రసజ్ఞ గారు "కాళిదాసు - అభిజ్ఞాన శాకుంతలం" గురించి చిన్నప్పుడు కొంచం తెలసుకున్నా, ఇప్పుడు మరికొంచెం తెలుసుకోగలిగా. మీ ప్రయత్నానానికి ధన్యవాదాలు. అభిజ్ఞాన శాకుంతలం లో చదవాల్సింది చాలావుంది, తప్పక ప్రయత్నిస్తాను.
ఈసారి హెడింగ్ "కాళిదాసు - అభిజ్ఞాన శాకుంతలం" చూసి...హమ్మయ్య ఇన్నాళ్ళకి రసజ్ఞ గారు రాసిన ఒక్క పోస్ట్ కొంతైనా తెలుసు అనుకుంటూ ఆసక్తి గా చదువుతుంటే...మళ్ళీ తెలియని విషయాలే ;)
ఎప్పటిలా చక్కగా రాశారు. రీసెర్చ్ చేశారా అనబోయి ఆగిపోతున్నాం ;)
ఎప్పటిలానే చక్కగా informative గా ఉంది.
అభి(జ్ఞా)నందనలు!
శకుంతలా దుష్యంతుల బదులు నల దమయంతుల చిత్రం పెట్టారు సరిచూడగలరు.
చక్కగా రాశారు. రీసెర్చ్ చేసి రాసినంత బాగుంది.
చాలా చక్కగా విశదీకరించారు.... puranapandaphani అన్నట్లు ఒకసారి చిత్రాన్ని సరిచూసుకోండి!
@ రామ్ గారూ
తప్పక చదివి ఆస్వాదించవలసిన నాటకం అండీ ఇది! అన్ని భాషలలోనూ అనువదించబడింది. మీకు చదవాలన్న కోరిక నా ఈ టపా ద్వారా కలగడం ఆనందకరం. మీ స్పందనకు ధన్యవాదాలండీ!
@ చిన్ని ఆశ గారూ
అన్నీ తెలియనివే చెప్తున్నా అంటున్నారని మీ ఇద్దరికీ బాగా తెలిసినదే చెప్పాను. హమ్మయ్యా ఆగిపోయి మంచి పని చేశారు ;) కృతజ్ఞతలండీ!
@ ప్రేరణ గారూ
హహహ! నేను చదివిన దానికి నా ఆలోచనలని జోడించి వ్రాసినది మాత్రమే అండీ! మీ స్పందనకు నెనర్లు!
@ పురాణపండ ఫణి గారూ, @ పద్మార్పిత గారూ,
నేను కూడా ముందు మీలానే అనుకున్నా అండీ. ఎప్పుడూ శకుంతలని పువ్వుల మాలలతో చూసిన చిత్రమే కాకుండా ఇది కొంచెం వైవిధ్యంగా అనిపించి ఇది పెట్టాను. దీనిని దుష్యంత, శకుంతల అనే పేరుతోనే చాలా చోట్ల చూశాను. గూగుల్ నుండి సేకరించినదే! ఇవి కొన్ని లంకెలు:
http://www.dollsofindia.com/product/hindu-posters/shakuntala-dushyanta-reprint-on-paper-QD78.html
http://www.godandguru.com/amar-chitra/shakuntala-dushyanta.html
http://www.funonthenet.in/forums/index.php?topic=89135.0
http://theatrand.blog.hu/2011/05/26/az_elok_vagyai_kalidasa_shakuntala_pinceszinhaz
https://fcserver.nvnet.org/~hanson-harding/FOV1-0005D4A1/FOV1-0005DF0F/?OpenItemURL=S0486AD9A
http://sobreleyendas.com/2008/04/06/el-anillo-de-sakuntala/
http://www.thethaovanhoa.vn/326N20111025152737736T133/xua-nhu-kich-tho-bai-2.htm
http://www.liveinternet.ru/users/charming_leona/post177176995/
లేదు, శకుంతల పూల మాలతో ఉన్నదే కావాలి అంటే తప్పక మారుస్తాను చిత్రాన్ని. అందులో నాకెటువంటి అభ్యంతరమూ లేదు.
మీ స్పందనకు ధన్యవాదాలు!
చాలా బావుంది. బొమ్మ - జంట ఉన్న బొమ్మ ఎందుకో నాకు నలదమయంతిని గుర్తుకు తెచ్చింది, శకుంతలా దుష్యంతులను గాక.
శాకుంతలాన్ని గురించీ, కాళిదాసుని గురించీ జరుక్ శాస్త్రి ఒక చక్కటి వ్యాసం రాశారు. ఎక్కడ చదివానో ఇప్పుడు గుర్తుకి రావట్లేదు. అడివిబాపిరాజు నారాయణరావు నవల్లో నాయకుడు నారాయణరావు తన భార్య శరదకి సాహిత్యం పాఠం చెబుతూ శాంకుతలం ద్వారా షేక్స్పియరుకంటే నాటకకర్తగా కాళిదాసు ఎందుకు అధికుడో చక్కటి ఉపన్యాసం చేస్తాడు.
శాకున్తలం చాలా అందమైన ’కావ్యం’. ’గ్రీవాభంగాభిరామం’,’అలక్ష్యదన్తముకుళాన్’ వంటి పద్యాలు అచ్చెరువు గొలిపేట్టు వ్రాశాడాయన.
శాకున్తలం గొప్ప ’కావ్యం’. అయితే ఇది గొప్ప ’నాటకం’ అన్న విషయంతో కొంతమంది విభేదించారు. నాటకానికి కావలసిన డ్రమటిక్ ఎలిమెంట్స్ పరంగా ’మృచ్ఛకటికం’ చాలా గొప్పదని కొందరు. నాదీ అదే అభిప్రాయం.
నలుడు దమయంతిని అడవిలో వదిలేసి వెళ్ళినపుడు ఆమె చీరను సగం చించుకుని పొతాడట. అందువల్ల మీరు పెట్టిన చిత్రం ఆ ఘట్టానికి చెందినదిగా స్ఫురిస్తోంది. అంతే తప్ప శకుంతల పూలదండ చిత్రం కావాలని కాదు. ఆయా వెబ్సైట్ల సాధికారత నాకు తెలీదు కానీ శాకుంతలంలో ఏ ఘట్టానికి చెందినదో నాకు గుర్తురావడం లేదు. వీలయితే వివరించగలరు.
భరత చక్రవర్తి పాలించుటను జేసి
భరత ఖండ మనుచు బరగె ననగ
ఇందు మూలమైన ఇతి వృత్తమును దెల్పి
మదికి హాయి గూర్చె మా రసఙ్ఞ .
-----సుజన-సృజన
@ కొత్త పాళీ గారూ
ఈ శాకుంతలం గురించి నేను ఎవరి అభిప్రాయాలనూ చదవకుండా కేవలం నా ఆలోచనలను వ్రాయటం జరిగింది. ఎందుకంటే వేరెవరు వ్రాసినది చదివినా వారి ఆలోచనల ప్రభావం నా మీద కొంత ఉంటుంది. కనుక నా అభిప్రాయాలను పంచుకున్న తరువాత మిగతావారు ఎలా వ్రాశారు అన్నది చదవాలని అనుకున్నాను. అందువలన ఈ కాళిదాసు అన్ని రచనలనీ పరిచయం చేశాక మీరు చెప్పిన రెండూ తప్పక చదువుతాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ రవి గారూ
చాలా చక్కగా చెప్పారండీ. అందులో ముఖ్యంగా గ్రీవాభంగాభిరామం శ్లోకం చదువుతుంటే శకుంతల కళ్ళ ముందు ఉన్నట్టు అనిపిస్తుంది అంత అత్యద్భుతమయిన వర్ణన. శాకుంతలం నాటకాలన్నిటిలోనూ కూడా గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. ఎవరెవరు ఎలా నటించాలి అన్నది కూడా చక్కగా వ్రాయటం జరిగింది. నేనెందుకో ఈ విషయంలో మాత్రం మీతో ఏకీభవించలేకపోతున్నాను. మీ స్పందనకు ధన్యవాదాలండీ!
@ వెంకట రాజారావు. లక్కాకుల గారూ
మీ పద్య రూప స్పందన నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నేను భరతుని పట్టాభిషేకంతో ఆపేసాను. మీరు భరత ఖండం గురించి కూడా చేర్చి దీనికి సంపూర్ణతను తెచ్చారు. ధన్యవాదాలు!
@ పురాణపండ ఫణి గారూ
అలా లేని శకుంతల శకుంతలే కాదు అనుకోవటం పరిపాటి. అందువలన అలా చెప్పాను. ఇహ మీరడిగినట్టు వెబ్సైట్లను ప్రక్కన పెట్టి ఈ పైంటింగ్ లోని విషయాలను బట్టీ ఘట్టాన్ని చెప్పుకుందాం.
"నలుడు దమయంతిని అడవిలో వదిలేసి వెళ్ళినపుడు ఆమె చీరను సగం చించుకుని పొతాడట" నిజమే కానీ ఎటువంటి పరిస్థితుల్లో, ఎలా తీసుకుని వెళతాడు అన్నది మనం ఒకసారి పరిశీలించాలి. నలుడు శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రం కూడా లేకుండా అన్నిటినీ కోల్పోతాడు.అటువంటి సమయంలో భర్తకు తను కట్టుకున్న వస్త్రాన్నే (పవిట కొంగుని పెద్దది చేసి) అతనికి కూడా పంచుతుంది. అంటే ఒకే బట్టని ఇద్దరూ కట్టుకుంటారు. అటువంటి సందర్భంలో వనములో కలిసి నడుస్తుండగా, నలుడు వెళిపోతూ (కలి ప్రేరణ చేత) ఒకే బట్టలో ఇద్దరు ఉన్నందున మధ్యకి చించి ఆ సగం బట్టతో అతను వెళిపోతాడు. అక్కడ పరిస్థితి చాలా దీనమయినది, బాధాకరమయినదీను.
ఈ చిత్రాన్ని చూస్తుంటే నాకు అంతటి బాధ కనిపించుటలేదు. పైపెచ్చు ఒకే బట్టని ఇద్దరు కట్టుకుని లేరు. ఈమె బట్ట ఈమెకి ఉంది, అతను ఒక వస్త్రాన్ని తీసుకుంటున్నాడు. అలానే ఇక్కడి చిత్రంలో ఈవిడ మోములో బాధకన్నా నాకు పారవశ్యం కనిపిస్తోంది. అలానే ఈ చిత్రంలో నాకు విషాదం కన్నా శృంగారం పాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వనములో నలదమయంతులకి శృంగార సన్నివేశం లేదు అక్కడంతా కష్టాలు మాత్రమే నిండి ఉన్నాయి. ఇహ శాకుంతలాన్ని తీసుకుంటే మూడవ అంకములో వీరిరువురూ వనములో కలిసినట్లు, ఆమె విరహ వేదనకి ఇతని విరహం తోడయ్యి ఇద్దరూ ఒకటయినట్టు ఉంటుంది. కనుక వీటన్నిటి బట్టీ చూస్తే వీరిరువురూ నాకు నలదమయంతుల కన్నా దుష్యంతుడు, శకుంతల అనే అనిపిస్తోంది.
రసజ్ఞ గారూ!
ఫణి గారి సందేహానికి మీ సమాధానం కోసం రోజూ నేను మీ బ్లాగ్ చూస్తున్నాను...
http://www.google.co.in/imgres?hl=en&biw=1024&bih=643&gbv=2&tbm=isch&tbnid=63NYkfFmraPuJM:&imgrefurl=http://smpanditji.blogspot.com/&docid=ahbyL4K_RNVfUM&imgurl=http://1.bp.blogspot.com/_9J6W9tNKqg4/S2MqpNq3T1I/AAAAAAAAACk/NA4-qrecgVk/s320/nal-damayanti.jpg&w=320&h=189&ei=2J7eT6HiC8bYrQfPm4WsDQ&zoom=1&iact=rc&dur=823&sig=101318968484893725616&page=3&tbnh=106&tbnw=180&start=38&ndsp=23&ved=1t:429,r:4,s:38,i:208&tx=56&ty=౩౫
ఈ లింక్ చూడండి...అది నలదమయంతుల చిత్రం...
అపుడే అయిపోలేదు...
ఈ లింక్ చూడండి.....
http://www.google.co.in/imgres?hl=en&sa=X&gbv=2&biw=1024&bih=643&tbm=isch&tbnid=5MWk3v9GaQrXVM:&imgrefurl=http://www.godandguru.com/amar-chitra/shakuntala-dushyanta.html&docid=5E5n0OjIkfH7pM&imgurl=http://www.godandguru.com/amar-chitra/images/dushyanta.jpg&w=500&h=303&ei=aKDeT874PMqmrAezxsy3DQ&zoom=1&iact=hc&vpx=275&vpy=232&dur=391&hovh=130&hovw=215&tx=148&ty=81&sig=101318968484893725616&page=1&tbnh=106&tbnw=175&start=0&ndsp=17&ved=1t:429,r:6,s:0,i:౧౦౩
ఇది దుష్యంతుని చిత్రం....
రెండు చిత్రాలు ఒకే లింక్ తో ఇవ్వడం గూగల్ తప్పు అండీ...:-))
సరదాగా సందేహ నివృత్తి చేస్సనండీ!
అన్యధా భావించకపోతేనే పబ్లిష్ చేయండి ఈ వ్యాఖ్యని...
@శ్రీ
"upamaa kaalidaasasya" ani kada annaru.kaalidaasu oka originaality unna kavi.bharata desam videsha baanisa kaaka mundu vachina prati sangati oka simham vanti aatma kaligi untundi. You are doing a great job m'aam.
మీ వర్ణన కావ్యాలను చదవాలనిపించేలా వుంది.కాళిదాసు మహాకవుల్లో అగ్రగణ్యుడు అనవచ్చేమో!మొత్తం బ్లాగు లోకాన్ని కావ్యాల వైపు మళ్ళించారు.
@ శ్రీ గారూ
మీ ఆతృతని గమనించనందుకు మన్నించాలి :) పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఇటువైపు సరిగ్గా రాలేకపోతున్నాను. నేను చాలా లంకెలలో కూడా చూసానండీ. సరే ఫణి గారన్నట్లు ఎవరు ఏ పేరు పెట్టుకున్నా మనం సన్నివేశాన్ని బట్టీ తీసుకుందామండీ! ధన్యవాదాలు!
@ మూర్తి గారూ
అవునండీ! బాగా చెప్పారు! ఆయన గురించి మరికొన్ని టపాలలో నా అభిప్రాయాలను తెలియచేస్తాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!
@ రవి శేఖర్ గారూ
ధన్యవాదాలండీ! ఇవి మాత్రం ప్రతీ ఒక్కరూ చదవవలసినదే అండీ. మొత్తం చదవకపోయినా కనీసం వాటి సారాన్ని గ్రహించవలసిన అవసరం ఎంతయినా ఉండి. అందుకనే నా ఈ చిన్న ప్రయత్నం.
rasagna garoo chaalaaa baaga raasaaru, andamgaa raasaru
@రసజ్ఞ గారు చదవకుండానే విమర్శ పెడుతునందుకు క్షమించాలి . సముద్రాన్ని చూస్తే వెంటనే ఆడుకోవాలని అనిపిస్తుంది . ప్రస్తుతానికి అందులోకి దూకలేకున్న తీరం వరకే వచ్చి ఆస్వాదిస్తున్న.. చాలా చక్కగా అమర్చారు . దాని గురించి మా సార్లు ఎప్పుడో చిన్నపుడు చెప్పింది ఇపుడు చూస్తుంటే ఆనందం కలుగుతోంది... ఇంకా ఇలాంటి రచనల ఉనికిని బైటపెట్టాలని కోరుకుంటున్నాను... సమయముంటే మీరు ఒకటి చేపట్టండి ఏదైనా రాయడానికి మేము సంతోషిస్తాము... మీరు కుసలమేనని భావిస్తూ మరి కొన్ని రోజులకు సెలవు ... :)
రసజ్ఞ గారికి
నమస్కారం!
మీ పరిచాయకవ్యాసం చాలా బాగున్నది. లక్షణసమన్వయ – పాఠ పాఠాంతరవిమర్శదృష్టితో గాక మనస్సుతో చదివి స్పందించినందువల్ల – హాయిగా సాగిపోయింది. సుమారు ముప్ఫైమంది మహావిద్వాంసుల ప్రామాణికవ్యాఖ్యలు, డెబ్భైకి పైగా తెలుగు అనువాదాలు (కందుకూరి వారిది సరళమే కాని మఱీ పేలవమైన అనుసరణ కాగా, వేదం వారిది అతిప్రౌఢమై మూలానికి మెఱుగులు దిద్దగోరిన మహనీయరచన. రాయప్రోలు వారిది అచ్చపు పుట్టతేనె తెనుగుసేత), ఏడెనిమిది పద్యానువాదాలు, నూటికి పైచిలుకు ప్రత్యేక సమీక్షాగ్రంథాలు, ఆంధ్రదేశమంతటా రంగస్థలప్రదర్శనలు, బహుభాషలలో వేలకొద్దీ పర్యాలోకనలు వెలసిన కృతిని అధికరించి ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉండటం సహజం.
మీరు కేవలం ఆత్మీయంగా మలచుకోవటం వల్ల వ్యాసం మఱీ మనస్కరించింది.
మీరుదాహరించిన శ్లోకం భావశుద్ధి నిమిత్తం -
కావ్యేషు నాటకం రమ్యం, తత్ర రమ్యా శకుంతలా
తత్రాపి చతుర్థోంక, స్తత్ర శ్లోకచతుష్టయమ్.
అని ఉండాలి. పూర్వలాక్షణికులు ఉదాహరించిన సుష్ఠురూపం ఇది. తక్కినవన్నీ ఏదో ఒక విధంగా అపపాఠాలే.
నామౌచిత్యాన్ని గుఱించి మీరు వ్రాసిన వాక్యాలూ భావ్యంగా ఉన్నాయి. అర్థద్యోతనికా వ్యాఖ్యలో రాఘవభట్టు – ఇదే మాట చెప్పి, సప్తమాంకంలో శాకుంతలుని (సత్త్వదమనుని) గుర్తుపట్టడం జరిగింది కాబట్టి, తద్ద్వారా శకుంతలా దర్శనం సిద్ధించి నాటకం సుఖాంతం అయింది కాబట్టి ‘శాకుంతలుని అభిజ్ఞానం’ అని కూడా నామకరణాన్ని సమర్థించాడు.
మీ మనస్వితకు అభినందనపురస్సరంగా ఈ నాలుగు మాటలు వ్రాశాను. కాళిదాసాన్యకృతుల మీ పఠనపాఠనవ్యాసంగం రచితరోచితమై ఇతోధికసంతోషదాయకం కావాలి!
సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు
అప్రస్తుతం అనుకోకపోతే, ఒక కాళిదాసీయశ్లోకం పూర్వాపరాలను గుఱించి నేనేదో వ్రాసినది, మీకు వీలైనప్పుడు http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan12/vanmayacharitralo.html లో చదువగలరని అభ్యర్థన.
kalidas gurinchi meelanti peddalu chepina vishayaala valla aayana pustaakalu teesukunna kaani inthavaraku chadavadam kudaraledu.meeru naa aasakthini pencharu.ee rojununde modalu pettali.mee visleshana saamardhyam marintha paripakvathanu santharinchukundhi.all the best
@ ఫాతిమా గారూ
మీకు నచ్చినందుకు చాలా ధన్యవాదాలండీ!
@ కళ్యాణ్ గారూ
ఉభయకుశలోపరి. మీరు నా బ్లాగుని ఏదో హడావిడిలో చూసారని తెలుస్తున్నది, సముద్రంతో పోల్చడం ఆనందంగా ఉన్నా నమ్మటానికి కాస్త సమయం పట్టేలా ఉంది :) తప్పకుండా కాళిదాసు రచనలన్నీ నాకు అర్థమయిన మేరకు మీ ముందుకి తెస్తాను. వీలు చూసుకుని మొత్తం చదవండి మరి :) ధన్యవాదాలండీ!
@ తనూజ్ గారూ
కాస్త ఆలస్యమయినా ఖంగారుగా కాకుండా తీరుబడిగా ఆస్వాదిస్తూ చదవవలసినవండీ. శీఘ్రమేవ కాళిదాసు రచనా పఠనా ప్రాప్తిరస్తు ;) (ఏదో నోటికొచ్చింది అనేసా, అర్థం త్వరగా చదవాలని కోరుకుంటున్నాను అని). నా ఈ టపా మీలో ఆసక్తిని రేపగలిగింది అంటే చాలా ఆనందంగా ఉంది. మీ ప్రశంసతో కూడిన స్పందనకి నెనర్లు.
@ ఏల్చూరి మురళీధరరావు గారూ
నమస్సుమాంజలి.
నిజమే నాటకమంతా వివరించేసినా ఇంకా ఏదో మిగిలున్నట్టే అనిపిస్తుంది. వ్యాఖ్యలలో ఇంతకు ముందుగా చెప్పినట్టుగా నేను కేవలం కాళిదాసు రచన మాత్రమే చదివి నా మదిలోకోచ్చిన తలపులతో ఈ వ్యాసం వ్రాయటం జరిగింది. తద్వారా వేరే రచయితల విశ్లేషణా ప్రభావం నా మీద పడకుండా కేవలం నా అభిప్రాయాలను మాత్రమే వ్యక్త పరచగలను. మీరు చెప్పిన ఆ లెక్క చూసి మతి పోయింది. వామ్మో! అంతమంది దీని గురించి స్పందించి వ్రాశారు అంటే ఏమి వ్రాసారో చదవాలని మనసు లాగుతున్నా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ మహా యజ్ఞం (కాళిదాసు రచనలన్నీ పరిచయం చేయటం నా లాంటి వారికి సాహసమే) పూర్తయ్యే దాకా చదవను.
శ్లోకం గురించి మీరు చెప్పినది అయ్యుండవచ్చును. పాఠాంతరాలు ఉండటం సహజమే కదా! భావం ఒకటే అయినందువలన నేను నేర్చుకున్నదే ఉంచుతాను టపాలో మార్చను. సత్త్వదమనుని గురించి మీరు చెప్పినది నేను వినలేదు కానీ ఆలోచిస్తే అవును కదా! అనిపించింది. క్రొత్త విషయం తెలిపారు.
మీ వ్యాసం చదివాను. ఎంతగానో నచ్చింది. శృంగార ఘట్టాలను కూడా ఎంత సున్నితంగా చూపించారో కదా అనిపించింది. నాకు ప్రాకృతం చదువుతుంటే క్రొత్తగా ఉన్నా మీ విశ్లేషణ వలన బాగా అర్థమయ్యింది. ఇహ మీరు చెప్పిన నాట్య భంగిమలు చూపించటం నాటకంలో సహజం కదా. అన్నిటికీ చక్కని సమన్వయాన్ని తీసుకొచ్చారు. అంతటి గొప్ప రచనలు మనకి అందించిన వారందరికీ పాదాభివందనం. ఇంతమంచి వ్యాసాన్ని నాకు చదివే అదృష్టం కలిగించినందుకు కృతజ్ఞతాభివందనాలు.
మీరు నన్ను మెచ్చుకుంటూ వ్రాసిన వాక్యాలకు చాలా ఆనందమేసింది. అన్ని చదివిన మీకు నా ఈ పరిచయ వ్యాసం నచ్చటం సంతోషదాయకం. "కాళిదాసాన్యకృతుల మీ పఠనపాఠనవ్యాసంగం రచితరోచితమై ఇతోధికసంతోషదాయకం కావాలి" తప్పక నా వంతు కృషి చేస్తాను. మీ ఆశీర్వాద బలంతో మీ కోరికను నేరవేర్చగలనని ఆశిస్తూ.....
నన్ను మీరు అనవద్దని, 'నువ్వు' అని పిలవమని వేడుకుంటూ మరొక్కసారి కృతజ్ఞతలు.
చదవాలనే కుతూహలం కలిగిస్తూ వ్రాసిన మీ రచన చాలా బాగుంది.. సంస్కృతము పూర్తిగా అంటే అస్సలు నాకు తెలియదు.. శ్లోకం పట్టుకుని, అర్థం పెట్టుకుని తెలుసుకొనే ప్రయత్నం మాత్రం చేయగలను. అలా చూసా.. సంస్కృత శ్లోకం(తెలుగులిపిలో ఉందికనుక) ప్రక్కన వ్రాయడం చాలా బాగుంది.. మీ అవగాహన కూడా వ్రాసి ఒక వ్యాఖ్యానంలా వ్రాసే ప్రయత్నం చేయడం అభినందనీయం... మీ ద్వారా మంచి మంచి కావ్యాల గురించి తెలుసుకోవాలని మీ మిగతా అభిమానులలాగానే నేను కూడా లైనులో నుంచున్నాను... అభినందనలతో శలవు.
good work!!
రసఙ్ఞగారికి అభివాదములు, తమరు ఈ మధ్యన బ్లాగు మీద సీత కన్నేసారు. అట్టే టపాలు రాయనూట్లేదు. తమరు కుశలమని తలుస్తాను. ఇక పోతే తొలేకాదశి పూర్తయింది కదా మీరు చాతుర్మాస్య వ్రతం చేస్తున్నారా ఈ యేడు? మీ ఆరోగ్యం అవీ బాగున్నాయా? వివరించగలరు. మీరు వీలు చూసుకొని ఉత్తరం రాయండి.
Urs Anonymously
పేరు కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యమా? అడిగేది కుశలమా?
@ హనుమంత రావు గారూ
నా ఈ రచన మీకు చదవాలన్న కుతూహలం కలిగించినందుకు సంతోషం. ఎంతమాట! తప్పకుండా ఆయన అన్ని రచనలనూ పరిచయం చేయాలన్న సంకల్పం ఉంది. చూడాలి ఎంతవరకు న్యాయం చేయగలనో! మీ అభినందనలకి నా అభివాదాలు!
@ Raja Prathigadapa గారూ
మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ!
@ మొదటి అజ్ఞాత గారూ
రెండవ అజ్ఞాత గారు చెప్పినట్టు మీ పేరు ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాలేదు కానీ మీరు కిట్టమూర్తి కబుర్లు చెప్పే ఆనంద్ గారు అనిపిస్తోంది. ఇహపోతే మీ అభిమానానికి ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. పని వత్తిడి వలన ఇటు వైపు పెద్దగా రాలేకపోతున్నాను. చాతుర్మాస్య వ్రతం చేస్తున్నానండీ! మీ స్పందనకు ధన్యవాదాలు!
@ రెండవ అజ్ఞాత గారూ
మీరన్నా పేరు చెప్పచ్చు కదండీ :)
మొదటి అజ్ఞాతని బాగానే గుర్తుపట్టేరు కాని రెండవ అజ్ఞాతని గుర్తుపట్టలేదేమి? మీరు రాసి 24 రోజులయింది, ఎప్పుడూ పనేనా?
ఇహపోతే antoountaru iha emi potheno ardam kaledu naa amaayaka sandehaanni nivruththi cheyagalaru
@ అజ్ఞాత గారూ
:) వ్రాస్తానండీ!
@ తనూజ్ గారూ
నన్ను పరీక్షిస్తున్నారు కదూ! నిజంగా మీకు తెలియకే అడిగారంటారా? ఇహపోతే అంటే అప్పటిదాకా మాట్లాడుతున్న లేదా మాట్లాడిన విషయాలు ప్రక్కకి పోతే మరో విషయం గురించి ప్రస్తావిస్తున్నా అని :)
మీ టపాలు చదువుతుంటే, సంస్కృతం పూర్తిగా (నాకు కొంచం కొంచం వచ్చు) నేర్చుకోలేకపోయానే అని బాదగా ఉంది. ఇకనైనా నేర్చుకోగలనో లేదో??
@ అద్దంకి అనంతరామయ్య గారూ
ఆ మాత్రం బాధ మొదలయ్యింది కనుక నేర్చుకోవాలన్న తపన పెరిగితే తప్పకుండా నేర్చుకోగలరు. నా మాట విని మొదలెట్టేయ్యండి :) ధన్యవాదాలండీ!
మొదలెట్టడం సమస్య కాదండి, ఎలా మొదలు పెట్టాలి? అనేదే సమస్య. సంస్కృతం కించితపి న అస్తి (కొంచం కూడా రాదు అనే కదా?)
@ అద్దంకి అనంతరామయ్య గారూ
శబ్దాలు, ధాతువులతో మొదలెట్టండి ;) సంస్కృతం కించితపి న అస్తి అంటే కొంచెం కూడా లేదు అని అర్థం. మమ సంస్కృతం కించితపి నవిద్యతే లేదా అహం సంస్కృతం న వేద్మి అనాలండీ.
@రసఙగారు: మీరు ఏదైనా సులభమైన పుస్తకం పేరు కూడా చెప్పి పుణ్యం కట్టుకుంటే, నేనింక ఆ పని మీద ఉంటాను.
@ అద్దంకి అనంతరామయ్య గారూ
కాశీ కృష్ణమాచార్యులు గారు వ్రాసిన "బాల బోధిని" అని ఒక పుస్తకం ఉంటుందండీ. మూడు భాగాలు ఉంటాయి. ఆ మూడు భాగాలూ బాగా వస్తే సంస్కృతం మాట్లాడటం, చదివినది అర్థం చేసుకోవటం వరకూ బాగా వస్తాయి. చిన్న చిన్న పదాల నుంచీ పెద్ద పెద్ద వాక్యాల దాకా బాగా అర్థమయ్యేలా చెప్తారు అందులో. ప్రయత్నించండి.
ధన్యవాదాలు రసఙగారు, రేపు కోఠి వెళ్ళి ఈ పుస్తకాల కోసం ప్రయత్నిస్తాను.
@ అద్దంకి అనంతరామయ్య గారూ
అలాగే! పుస్తకం దొరికిందా లేదా? దొరికితే త్వరగా కొని చదివేయండి మరి :) ఇకనించి మీతో సంస్కృతంలో మాట్లాడచ్చని ఆశ :)
@రసఙగారు: అంతర్జాలంలో దొరుకుతుందేమే అని చూశాను, కనిపించలేదు. ఈ వారం తీరిక చేసుకుని కోఠీ మీద పడి వెతకాలి.
@రసఙగారు: ఆదివారం కదా అని తీరిక చేసుకుని కోఠి వెళ్ళి మీరు చెప్పిన పుస్తకం గురించి చాలా సేపు వెతికాను. ఎక్కడా దొరకలేదండి. నిజంగా ఆ పేరు గల పుస్తకం అస్సలు ఉందంటారా?
@ అద్దంకి అనంతరామయ్య గారూ
అయ్యో భలే వారే! బహుశా ఈ మధ్యన అవి చదివేవారు తగ్గిపోవడంతో ప్రచురించటం లేదేమోనండీ! ఏదయినా మంచి గ్రంధాలయంలో ప్రయత్నించండి లేకపోతే! మా ఇంట్లో ఉండేవండీ ఆ పుస్తకాలు, ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, నేను ఇండియా వచ్చాక వెతికి దొరికితే స్కాన్ చేసి పంపిస్తా అండీ!
@రసఙ గారు: నా ప్రయత్నం నేను చేస్తాను.అంతా ఆ పై వాడి దయ
మీరు సామాన్యులు కారండి అద్బుతం గా రాసారు
@ నాని గారూ
అది చదివినప్పుడు నా మనసు స్పందించిన విధంగా వ్రాసుకుపోయాను అంతే అండీ! చాలా ధన్యవాదాలండీ!
సంస్కృతం లో చదివారని తెలిసి చాలా ఆనందం తో కూడిన అసూయ కలిగిందండి
@ ఆనందమే బ్రహ్మప్పా గారూ
:):):) మీ అసూయకి ధన్యవాదాలు!
naku ee madhya already telisina vishayalani evaru cheppina interessting undatladandi....ndukantaru
meru adbhutham ga rasaru
@ BHALLAM SRI KRISHNA VENKATESWARA ANIL RAJU గారూ
ఎందుకంటే నేను మాత్రం ఏమి చెప్తాను చెప్పండి? ఎవరు చెప్పినా నచ్చని మీకు నేను వ్రాసినది నచ్చినందుకు కృతజ్ఞతలు!
Good day! I could have sworn I've visited this site before but after going through many of the posts I
realized it's new to me. Anyhow, I'm certainly delighted I came across it and I'll be bookmarking it and checking
back often!
Also visit my web site: home renovations before and after (http://www.homeimprovementdaily.com)
It's actually a great and helpful piece of info.
I'm glad that you just shared this useful information with us.
Please keep us up to date like this. Thanks for sharing.
My weblog; quest bars
Hi, just wanted to mention, I enjoyed this blog post.
It was helpful. Keep on posting!
Here is my blog :: paid surveys (paidsurveysb.tripod.com)
I am extremely inspired along with your writing talents and also with the
format on your weblog. Is this a paid theme or did you modify it yourself?
Anyway stay up the excellent high quality writing,
it is rare to see a great weblog like this one today..
my page - free music downloads [twitter.com]
With havin so much content and articles do you ever run into any problems of plagorism or copyright infringement?
My site has a lot of exclusive content I've
either authored myself or outsourced but it appears a
lot of it is popping it up all over the internet without my permission. Do you know any techniques
to help prevent content from being stolen? I'd really appreciate it.
Here is my homepage Minecraft Download
Quality articles is the crucial to interest the users diet plans for women to lose weight pay a quick visit
the web page, that's what this site is providing.
I need to to thank you free music downloads for computer this excellent read!!
I certainly enjoyed every little bit of it. I have got you book marked to check out
new stuff you post…
I constantly spent my half an hour to read this web site's articles or reviews all the time along with a cup of coffee.
Check out my weblog - minecraft games
Normally I don't learn article on blogs, however I wish to say that this write-up very forced me to check out and
do so! Your writing style has been amazed me. Thanks, quite great post.
Feel free to visit my web blog - dating online (bestdatingsitesnow.com)
This post will assist the internet viewers for building up new web
site or even a blog from start to end.
Here is my homepage - minecraft games
Greate article. Keep writing such kind of info on your blog.
Im really impressed by it.
Hi there, You have performed a fantastic job. I will definitely digg it and individually suggest to my friends.
I'm sure they'll be benefited from this site.
Also visit my web site: minecraft.exe
Awesome! Its actually remarkable piece of writing, I have
got much clear idea about from this piece of writing.
my page ... match.com free trial
What's up colleagues, nice paragraph and fastidious urging commented here, I am
really enjoying by these.
Also visit my blog post - minecraft.exe
First of all I would like to say fantastic blog! I had a quick question which
I'd like to ask if you do not mind. I was curious to know how you center yourself and clear your head before writing.
I have had trouble clearing my thoughts in getting my ideas out
there. I do take pleasure in writing however it just seems like the first 10 to 15 minutes tend to
be lost just trying to figure out how to begin. Any recommendations or tips?
Appreciate it!
Feel free to visit my blog ... match.com free trial
Excellent site you have here but I was wanting to know if you knew
of any forums that cover the same topics talked about here?
I'd really love to be a part of community where I can get advice from other knowledgeable individuals that
share the same interest. If you have any suggestions,
please let me know. Appreciate it!
Feel free to surf to my site: gamefly 3 month free trial
Pretty section of content. I just stumbled upon your
weblog and in accession capital to assert that I get actually enjoyed account your blog posts.
Any way I will be subscribing to your feeds and even I achievement you access consistently rapidly.
Here is my blog post ... quest bars
whoah this weblog is magnificent i like reading your articles.
Stay up the great work! You understand, lots of people are searching around for this info, you could help them greatly.
Feel free to visit my blog post ... quest bars
Incredible! This blog looks exactly like my old one!
It's on a completely different topic but it has pretty much the same page layout and design.
Great choice of colors!
Also visit my blog post; discounted quest bars
My family always say that I am wasting my time here at web,
but I know I am getting know-how every day by reading such good posts.
My blog post diet plans for women to lose weight
What i do not understood is in reality how you're not really a lot more neatly-preferred than you may be right now.
You are so intelligent. You understand therefore considerably
with regards to this topic, produced me for my part believe it from so
many varied angles. Its like women and men aren't fascinated
until it is one thing to do with Woman gaga!
Your personal stuffs great. Always care for it up!
my web site :: match.com free trial
Thanks for your marvelous posting! I quite enjoyed reading it,
you may be a great author. I will remember to bookmark
your blog and will come back down the road. I want to encourage yourself to continue your great work, have a nice day!
My website: quest bars
Very shortly this site will be famous amid all blogging people,
due to it's pleasant articles or reviews
Feel free to surf to my site: limewire free music downloads
Have you ever thought about publishing an e-book or guest authoring on other sites?
I have a blog based on the same ideas you discuss and would really
like to have you share some stories/information. I know my readers would value your
work. If you're even remotely interested, feel match.com free trial to send me an e-mail.
I just could not go away your web site prior to suggesting that
I really enjoyed the standard info a person supply to your visitors?
Is gonna be again steadily to check out new posts
Look into my page :: cialis belgique pharmacie
రసజ్ఞ గారు ,
అనంత రామయ్య గారు అడిగిన బలబోధిని పుస్తకం అంతర్జాలం లో దొరికిందండి
http://www.teluguthesis.com/2019/09/3-balabodhini-3-parts.html
నాటికీ ఈ నాటికి ..ప్రకృతి ధర్మము బాధ్యత ప్రేమ నమ్మకము ..మానవసమాజంలో మార్పులు ఏమీ లేవు.
చక్కని కావ్యాన్ని హృద్యంగా ప్రచురించి అలరించారు
Very nice, thank you for sharing with us..
Post a Comment