అమ్మల్లారా!
అయ్యల్లారా!
మంగిడీలు. నా పేరేటో నాకెరుకలేదుగానీ అంతా నన్ను పిట్టలదొర
అంటారయ్యా. మా గూడెం పెజలకి నేనంటే మా సెడ్డ పిచ్చి మా రాజా. నేనేటి
సెప్పినా
ఎమ్మటే సేసేత్తారు. నేను కయిత్తం రాత్తానని, కూసింత సదుకున్నానని (నేను
రెండు దాకా
సదివా, ఇంగిలీసు కూడా తెలుసు. నేను మనుసుల్ని సదివా) తెగ మదింపయ్యా. నా
కయిత్తం మీరూ ఓ పాలి సూత్తారేటి? (ఇట్టాంటియ్యి నా కాడ సాలా ఉంటి) :):)
యేసవి ఎండలకు డెర్మి కూల్ లాలి..
టైం పాస్ సేయటాకి లాలిపాప్ లాలి..
ఫైటింగు సేయటాకి రాఖి ఇస్టైల్ లాలి...
మాటలు తెల్వటాకి డిక్సనరీ లాలి..
వాకింగు సేయటాకి వాల్ సపోర్టంత లాలి...
తెలుగమ్మను బుజ్జగించటాకి అచ్చుల అల్లుల లాలి...
గూడెం దాటిపోని నేను ఇపుడిట్టా
ఈడకి ఎందుకొస్సినా అంటే నాకో పేద్ద సిక్కొచ్చి పడిపోయినాది మా రాజా!
పెద్దోల్లు, పెద్ద సదువులు సదివినోల్లు మీరే నాయం సెప్పాల. మొన్న
ఎన్నికలపుడు పెచారానికని రాజకీయనాయకులంట మా గూడేనికి
వొచ్చారు. వొచ్చినోల్లు సక్కగా నాకాడకొచ్చి "సూడు దొరా నువ్ మాకో సాయం
సెయ్యాల. మీ గూడెంలో అందరికీ మేము కొన్ని బవుమతులు ఇయ్యాల జనమంతా పోగెయ్యి"
అన్నారు. ఓస్ అదెంత పని, మన పెజలకి సల్ల అగుతాదని మన్నెం పెజలందరినీ
పిలిసినా. ఆల్లు మా అందరికీ గుడ్డలు, మా ఇంటాల్లకి బిందెలు, ఇట్టా సాలా
ఇచ్చారు. ఇచ్చినాక మీరు ఈ పాలి ఎన్నికల్లో మాకే ఓటెయ్యాల అని సెప్పి
ఎలిపోయినారు. ఆల్లు ఎల్లినాక మా మన్నెం పెజలంతా ఈ రాజకీయనాయకులంటే ఎవురు
అని కొచ్చిను! నాకేటి తెలుసనీ? ఆల్లు గొప్పోల్లు మనని పాలించే పెబువులు అని
ఆల్ల పుటక గూర్చి సెప్పినా. మీరూ ఓ పాలి సూసి రండి.
ఈల్లు
ఎల్లినాక ఇంకోల్లు అట్టా శానా మంది ఏవేవో ఇచ్చేసి పొయ్యారు. పెతీ యాల్లూ
ఓట్లు మాకు ఎయ్యాల అంటే మాకు ఎయ్యాల అని సేప్పినోల్లే. ఇట్టా బవుమతుల
పేరుతో ఆసె సూపి మమ్మల్ని కోనేసినారు. సరీగా రేపు ఎలేక్సన్లనగా ఇయ్యాల్టి రేత్తిరిన ఎరుకలసానికి పెద్ద అనుమానమొస్సినాది. అది అందరినీ కూడేసి నా కాడికి
ఒచ్చి పెంచాయితీ పెట్టేసినాది. "ఇపుడు అందరి కాడా బవుమతులు తీసేసుకున్నాం
గందా! అందరూ ఓటు ఎయ్యమనే కోర్తిరి. మరి పొద్దుటేల ఓటు ఓరికి ఎయ్యాలా???"
అని.
నేను ఓరికీ అన్నాయం కాకుండా అంతా నాయం సెయ్యాలని, అందరి కాడా అన్నీ
తీసుకుంటిమి. మాటిస్సినట్టు అందరికీ గుద్దెయ్యండి ఓట్లు
అని సెప్పినా. ఇందులో నా తప్పిదమేమన్నా ఉందా?మా పెజలు నా మాట ఎమ్మడి
అట్టానే సేసారు. వెనకమాల తెల్సిన ఇసయం అట్టా అందరికీ గుద్దిన ఓట్లు
సెల్లవంట. మాకెట్టా తెలుస్తాది? ఇప్పుడా రాజకీయనాయుకులు మేమిచ్చినయన్నీ
మాకు తిప్పిచ్చేయమంటిరి. అస్తువులు అంటే ఇచ్చేత్తం గానీ సారాయి నీల్లు, బిరియానీ
పొట్లాలు ఎట్టా ఇచ్చేది? నాయం సెయ్యాలని నేను ఇంతా సేత్తే ఇప్పుడంతా నన్ను
తన్ననీకి లగెత్తుతున్రు. నేనేటి సేసేది? పెపంచకం సూడనోడిని. నేను సేసింది తప్పా? ఒప్పా? మీరే సెప్పాలి మా రాజా!!!
18 comments:
:))
Time to appreciate the writer !!
Nice narration Rasagna garu :)
:) :) ;))
రసజ్ఞ గారూ,
తప్పూ కాదు, ఒప్పూ కాదు ;)
పిట్టలదొర యాస బాగా రాశారు. మ్యాటర్ కన్నా కొన్నిటిలో రైటర్ ప్రతిభే మిన్న.
అయితే ఈ పోస్ట్ కి పెద్దగా రీసెర్చ్ అవసరం లేదు కదూ! బహుశా యాసమీద గాని క్విక్ రీసెర్చ్ చేశారేవిటీ ?
బాగుంది..వాస్తవాలని పిట్టలదొర రూపంలో చెప్తూ ;)
:) :)
టపా బాగుంది కానీ కామెంట్ల గురించి మరోమారు ఆలోచించుకోండి. కొన్ని ప్రచురించక పోవడమే మేలు.
:)))
@ జలతారు వెన్నెల గారూ
మీరు నవ్వుకున్నందుకు ధన్యవాదాలు! ఈ టపా ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే!
@ Truth Seeker గారూ
మీకు నా బ్లాగు మీద ఉన్న అభిమానానికి ధన్యవాదాలు. నేను ఇది సరదాగా వ్రాసినదే తప్ప ఎవ్వరినీ వేలెత్తి చూపించలేదు. తెలియక చాలా మంది ఒకరికి పైగా ఓటు వేయటం జరుగుతుండటం చూసి ఇలా సరదాగా చేసిన ప్రయత్నం మాత్రమే. దయచేసి దీనిని ఒకరిని ఎత్తి చూపే విధంగా తీసుకోవద్దని మనవి. మీ స్పందనకి ధన్యవాదాలు!
@ రాంకి గారూ
నా ప్రతిభను గుర్తించింది మీరొక్కరే! మీకు నచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండీ!
@ తాతగారూ
ఏందయ్యా మీరు కూడా గిట్టా నవ్వేసి పోతే ఎట్టా? నాది తప్పో ఒప్పో సెప్పకపోతే ఎట్టా తెలిసేది? :):) ధన్యవాదాలు!
@ నా అభిప్రాయం గారూ
ఈ టపా ముఖ్య ఉద్దేశ్యాన్ని గ్రహించారు. ధన్యవాదాలు.
@ చిన్ని ఆశ గారూ
హహహ! ఇట్టా ఎటూ తెల్సకపోతే ఎట్టా? మరో పెద్ద సిక్కొస్సి పడిపోయినాదే! అంటే నేను రిసెర్చ్ చేయకపోతే ఏమీ వ్రాయనంటారా? :) అదేం లేదండీ రంపచోడవరం దగ్గర కొన్ని ప్రాంతాలలో ఇలానే మాట్లాడతారు. అలా విని ఇక్కడ వ్రాసా అంతే. మా పిట్టలదొర మీకు మంగిడీలు చెప్తున్నాడు. ధన్యవాదాలండీ!
@ వనజ గారూ, @ మాలా కుమార్ గారూ
మీరే సెప్పాలి మా రాజా అన్నాడని ఏమీ చెప్పకుండా నవ్వి వెళిపోతారా? ఇలా అయితే ఒప్పుకోం :):) ధన్యవాదాలండీ!
@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
టపా నచ్చినందుకు ధన్యవాదాలు. ఇహ కామెంట్ల విషయానికి వస్తే మారుస్తా అండీ చూస్తుంటే ఇహ తాళం వేయటమే మంచిదనిపిస్తోంది. ధన్యవాదాలు.
పాలిటిక్స్ అర్థంకాకపోయినా, ఆ యాస నాకు కొత్తగా అనిపించింది. ఎవరైనా ఆ యాసలో మాట్లాడితే వినాలనుంది.
good!
కొత్తగా ఉందండీ ;) ;) ;)
బాగుందండీ..
@ అవినేని భాస్కర్ గారూ
మా పిట్టలదోరకి కూడా ఇవేమీ అర్థం కావండీ ఓట్టి అమాయకుడు. మీకు యాస వినాలనున్తే మా జిల్లా వచ్చేయండి చక్కగా వినిపిస్తాను. మీ స్పందనకి ధన్యవాదాలండీ!
@ నా అభిప్రాయం గారూ
థాంక్స్
@ రాజ్ కుమార్ గారూ
హమ్మయ్యా బాగుంది అన్న పదం చేర్చారు లేకపోతే అసలే సందేహాల పుట్టనేమో, కొత్తగా ఉందన్నారు సరే చెత్తగా ఉందో లేదో చెప్పలేదు అన్న అనుమానం వచ్చేసేది ;) ఆ పదం చేర్చి బ్రతికించారు :):) ధన్యవాదాలండీ!
శ్రే రసజ్న గారికి,నమస్కారములు.
ప్రస్తుతం ఎన్నికల్లో నిలబడే అభ్యర్ధులలో ఎక్కువమంది అవినీతిపరులే. మీరు చెప్పిన చిట్కానుపయోగించి, అవినీతిపరులను ఎన్నుకునేబదులు, అందరు అభ్యర్ధులకు వోట్లు వేసేస్తే, గొడవ తీరిపోతుంది.
మీ స్నేహశీలి,
మాధవరావు.
@ మాధవరావు గారూ
నమస్కారమండీ! హహహ భలేవారే! నేను చెప్పటం కాదు పాపం మా అమాయక దొర చెప్పాడు :):) ధన్యవాదాలు!
శ్రీ రసజ్నగారికి, నమస్కారములు.
మీరు బ్లాగ్ లో వ్రాసేటప్పుడు, లేదా సమాధానాలు వ్రాసేటప్పుడు, ముఖ్యంగా తెలుగులో వ్రాసేటప్పుడు ఏ సాఫ్ట్ వేర్ ని వాడతారు? నేను Microsoft Indic language input tool (Beta) వాడుతున్నాను. అయితే, ఉదాహరణకి, మీ పేరునే తీసుకుంటే, `రసజ్ఞ' కు బదులుగా `రసజ్న' అని మాత్రమే వస్తుంది. జ క్రింద ఇణి వత్తు రాదు. ఇటువంటి ఇబ్బందుల్ని అధిగమించటానికి మీరు ఏది వాడుతున్నారో తెలియచేయగలరు. Offline లో నేను baraha వాడుతున్నాను. అక్కడ ఈ ఇబ్బంది వుండదు కానీ, అక్కడ టైప్ చేసి, కాపీ చేసి, online లో paste చేయాల్సి వస్తుంది.
మీ స్నేహశీలి,
మాధవరావు.
@ మాధవరావు గారూ
నమస్కారమండీ! నేను కేవలం జి మెయిల్ లో transliteration వాడతాను అంతే! ఎక్కువగా ఇదే నా పోస్టులకీ, వ్యాఖ్యలకీ అన్నిటికీ వాడేది. అప్పుడప్పుడు ఇందులో రానివి లేఖినిలో టైపు చేస్తాను.
Superrr narration versatile gaaruu ur really great atu science itu Telugu superrrrrrrr
Post a Comment