పూర్వకాలంలో జనాలు మందులకోసం వృక్ష సంపద మీదే ఆధారపడేవారు. ఇలా పసరు, మూలికలు మొదలయిన వాటి మీద ఆధారపడటం ఋగ్వేద కాలం నుండి ఉందని అంటారు. ఇప్పుడున్నన్ని మందులు, జబ్బులు కూడా ఆ కాలంలో ఉండేవికావుట. WHO (World Health Organization) వారి అంచనా ప్రకారం ఇప్పటికీ ఎనభై శాతం జనాలు ప్రకృతి చికిత్సా వైద్య విధానం మీద ఆధారపడుతున్నారుట. గిరిజనులు దాదాపుగా ప్రతీ చికిత్సకీ వీటినే కదా వాడేది. ఆ కాలంలో అంతగా చదువుకొని రోజుల్లోనే వీళ్ళు ఈ చిల్లగింజకి ఉన్న గుణాలను ఎలా గుర్తించారు అన్నదే ఇప్పటికీ నాకు అంతుపట్టని విషయం. వరదలోచ్చినప్పుడో, వానలు బాగా పడినప్పుడో, నీటిలో బురద చేరటం మామూలే. క్రొత్త గోదావరి నీరు చూస్తే బాగా అర్థమవుతుంది బురద నీటిలో కలవటం అంటే ఏమిటో (మిగతా నదుల్లో నీళ్ళు చూసినా తెలుస్తుందేమో కాని నాకు గోదావరి అలవాటు కనుక అలా చెప్పేసాను). ఇప్పుడంటే వాటర్ ఫిల్టర్స్, ఆక్వాగార్డ్స్ వంటివి ఉన్నాయి కాని ఆ కాలంలో నీటిని వడకట్టుకునో, కాచుకునో త్రాగేవారు. అటువంటి సమయంలో ఈ చిల్లగింజలను బాగా నూరి లేదా నలిపి ఆ గింజల పొడిని కుండ అడుగుభాగంలో వేసేసి బురద చేరిన నీటిని పోసి అలా ఉంచేస్తే కాస్సేపటికి బురదంతా (బురదతో పాటు నీటిలో ఉండే సూక్ష్మజీవులు, క్రిములు అన్నీ) క్రిందకీ, మంచి నీరంతా పైకి వచ్చి త్రాగడానికి వీలుగా ఉండేది. మనం గత కొన్నేళ్ళ క్రిందట వాడిన వాటర్ ఫిల్టర్స్‌లో ఉండే కాట్రిడ్జ్ కూడా చిల్లగింజ గంధంతో తయారయినదని పరిశోధకుల విశ్వాసం.
ఈ చిల్లగింజ మొక్కలు భారతదేశంలో పుట్టాయి. శ్రీలంక, జింబాంబ్వే, బోట్స్వానా, మ్యాన్మార్, మొదలగు దేశాల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తాయి. ఈ పండ్లు గుండ్రంగా ఎరుపు రంగులో (ఈ చిత్రంలో చూపిన విధంగా) ఉండి బాగా పండినవి నల్లగా అవుతాయి. గింజలు గుండ్రంగా, ముదురు గోధుమ రంగులో, చిన్న పట్టులాంటి నూగుతో ఉంటాయి. ఈ గింజల పొడి పసుపు రంగులో ఉంటుంది. ఈ జాతి మొక్కలలో ఉండే హానికరమయిన పదార్థం (Strychnine) ఇందులో లేకపోవటం విశేషం. కనుక ఈ గింజల పొడి (దీనినే గంధం అంటారు) నీటిలో కలిసినా మనకి ఎటువంటి హానీ ఉండదు. పైగా ఈ పొడి వలన ఆరోగ్యంగా ఉంటామని శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలలో తేల్చి చెప్పారు. వీటి ప్రయోజనాలేమిటంటే:
౧. గింజలు - తల, ఉదర సంబంధిత బాధలకి, లోజ్వరాలకీ, మధుమేహానికి, డయేరియాకి, అన్ని రకాల కంటి జబ్బులకి, మూత్రపిండాల జబ్బులకీ, లివరు బాగా పని చేయటానికీ మంచి మందుగా పని చేస్తాయి.
౨. వేళ్ళ రసం బొల్లి, శోభి తదితర మచ్చలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
౩. ఫలాలు - మూర్ఛ, విషాలను హరించడానికి, అధిక దాహాన్ని తగ్గించడానికి మందుగా వాడతారు.
ఒక్క మొక్క వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసేసరికి చాలా మంది దృష్టి వీటి మీదకి మళ్ళింది. ఇప్పటిదాకా అందరూ మర్చిపోయి, వాటి పేరు కూడా తెలియకుండా పోయి, ఏదో పిచ్చి మొక్క క్రింద పడి ఉన్న మొక్కకి ఇప్పుడు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పటం వలన ఒక్కసారిగా వ్యాపారస్తులు సైతం వీటి కోసం ఎగబడుతున్నారు. శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోజనాల కోసం శోధిస్తున్నారు. ఇన్ని సద్గుణాలను, ఉపయోగాలను కలిగి ఉన్న చిల్లగింజ మన పద్యాలలో కూడా స్థానం సంపాదించుకుంది.
సరసగుణ ప్రపూర్ణునకు సన్నపుదుర్గుణ మొక్కవేళయం
దొరసిన నిట్లు నీకుఁ దగునో యని చెప్పిన మాననేర్చుఁగా
బురద యొకీంచుకంత తముఁ బొందినవేళలం జిలవిత్తుపై
నొరసిన నిర్మలత్వమున నుండవె నీరములెల్ల భాస్కరా!
దొరసిన నిట్లు నీకుఁ దగునో యని చెప్పిన మాననేర్చుఁగా
బురద యొకీంచుకంత తముఁ బొందినవేళలం జిలవిత్తుపై
నొరసిన నిర్మలత్వమున నుండవె నీరములెల్ల భాస్కరా!
ఏ విధముగా అయితే నిజ స్వభావము చేత
నిర్మలమైన నీళ్ళు పొరపాటున బురద కలిస్తే చిల్లగింజ గంధం కలపగానే తేఱి మళ్ళీ మంచిగా
మారిపోతాయో అదే విధముగా ఎల్లప్పుడూ మంచిగుణములు ఉండే యోగ్యునకి ఎప్పుడైనా ఒక
దుర్గుణము కలిగితే ఇది నువ్వు చేసే పనేనా అని ఒక్కసారి చెపితే వెంటనే మారి తన
తప్పు తెలుసుకుని మళ్ళీ ఆ తప్పును చేయడు అని అర్థం.
కలకండ పేరుచెప్ప నోరు తియ్యబడదురా
చిల్లగింజ పేరుజెప్ప జలము శుద్ధిగాదురా
గంజాయి పేరువిన్న నిషా నీకు రాదురా
చిత్రపట జ్యోతులతో చీకటి తొలగిపోదురా
చిల్లగింజ పేరుజెప్ప జలము శుద్ధిగాదురా
గంజాయి పేరువిన్న నిషా నీకు రాదురా
చిత్రపట జ్యోతులతో చీకటి తొలగిపోదురా
ఇది నాగులవంచ వసంతరావు
గారు వ్రాసిన పద్యం. దీని
అర్థం మనకి తెలుస్తూనే ఉంది కనుక వివరించే ప్రయత్నం విరమిస్తున్నాను.
అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం
కృత్వాజ్ఞానం స్వయం నస్యేత్ జలం కతక రేణువత్
కృత్వాజ్ఞానం స్వయం నస్యేత్ జలం కతక రేణువత్
అని ఆది శంకరాచార్యుల వారు ఆత్మబోధలో అంటారు. ఇక్కడ కతక రేణువు అంటే చిల్లగింజ పొడి. ఇది మురికి నీటిని పరిశుభ్రం చేసి నీటిలోనే కలిసిపోతూ ఉన్నట్లుగా అజ్ఞానం చేత కలుషితమయిన జీవుని జ్ఞానాభ్యాసం అనేటువంటిది బాగా పరిశుద్ధునిగా చేసి గురువు ఇచ్చిన జ్ఞానం తనంతట తానుగానే లీనమయిపోతూ ఉంటుంది అని అర్థం. అదే విధంగా వేమన శతకంలో ఈ పద్యం చూడండి:
గురువు చిల్లగింజ కుంభ మీదేహంబు
ఆత్మ కలుషవంక మడుగుఁబట్టఁ
దెలిసి నిలిచెనేని దివ్యామృతంబురా
విశ్వదాభిరామ వినర వేమ!
ఆత్మ కలుషవంక మడుగుఁబట్టఁ
దెలిసి నిలిచెనేని దివ్యామృతంబురా
విశ్వదాభిరామ వినర వేమ!
అలానే ఈ
కీర్తనలో కూడా గురువుని చిల్లగింజ తోనే పోల్చారు చూడండి:
నీ చిత్తము నిశ్చలము - నిర్మలమని నిన్నె నమ్మినాను
నా చిత్తము వంచన చంచలమని - నను విడనాడకుమి;
శ్రీరామ !
గురువు చిల్లగింజ - గురువే భ్రమరము
గురుడే భాస్కరుడు - గురుడే భద్రుడు
గురుడే యుత్తమగతి - గురువునీ వనుకొంటి
ధరను దాసుని బ్రోవ - త్యాగరాజనుత !
ఇలా పద్యాలతో నీతులు వల్లిస్తూ, కీర్తనలతో ఆధ్యాత్మికంగా,
పిత్త, కఫ దోషాలను హరిస్తూ ఆరోగ్యపరంగానే కాక, పరిశ్రమల్లో (నేత, కాగితం) కూడా ఈ చిల్లగింజలు
సుస్థిరమయిన స్థానాన్ని పొందాయి. ఇప్పుడు పరిశోధకులు, ఫార్మసీ వారి దృష్టి కూడా పడింది
కనుక మున్ముందు ఏమవుతుందో వేచి చూడాలి! ఏదేమయినా ఈ సంపదనన్నా మరీ అంతరించిపోయేదాకా
కాకుండా మితంగా వాడితే మంచిది.
52 comments:
Wow, Great Job రసజ్ఞ जी !!
Actually I also Remembered the same Ahma bodha shloka & Vemana padyam while reading the title, I found the same thing later,
Very Good
Keep it Up,
Good Luck
?!
ఆహా ! ఈ సారి అవకాశం చిక్కింది నాకు, నేను aggregators చూడటం చాల తగ్గించాను so ఏ blog లో ఏమి వస్తుందో తెలిసేది కాదు,
ఇవాళ అదృష్టం బాగుంది ....
మీకో సంగతి చెప్పనా నేను కనీసం మీకు more than 10 or 15 comments & replies బాకీ ఉన్నాను,
ఎందుకంటే,, ఎప్పుడు comment చేద్దామన్న ఏదో ఒక issue వచ్చేసి
hyderabad లో ఉన్నపుడైతే sudden గా net disconnect అవ్వటమో suddenly some body రావటం వలనో
నా పని ఆపేసి వెళ్ళటం
ఒక్కో సారి comment మొత్తం mial లో type చేశాక erase అయ్యి పోవటం ఇలా జరిగేది..
అందుకే 1st Comment చేసే chance ఎప్పుడు రాలేదు మీ blog లో ఇవాళ వచ్చిన సరిగ్గా utilize చేసుకోలేదు
Thats why this 2nd comment
మనస్పూర్తిగా అభినందన లతో ఒక విషయం చెప్పదలిచాను ....
మీ గ్రంథాలయం బాగుంది. మా friends కి కూడా links fwd చేసాను.
ఇక ఈ post కి వచ్చేసి
లోకం లో సవా లక్షా అంశాలు ఉన్నాయి
అయితే వాటిని దేని పరిథి లోనే వాటిని గమనించటం చేస్తూ ఉండటం వల్ల దాని యథార్థ ప్రయోజనం తెలియటం లేదు
ఇప్పుడు మీరు ఇక్కడ mention చేసిన చిల్ల గింజ ( clearing nut free ) గురించి మూడు నాలుగు విధాలుగా తెలిపే ప్రయత్నం చేసారు అభినందనీయం
ఎందుకంటే,,,,
అందరు భౌతిక దృష్టి తో చూడటమే తమ పిల్లలకు నేర్పుతారు అలాకాక
తాత్విక దృష్టి తో చూడటం అలవరచు కోవటం వల్ల double benfits పొందుతాము
అందుకే
ఇలా different angle లో project చేసిన చిటికిన వ్రేలు post కుడా ఐ యాం impressed very well
so please keep going on on the same type of analysis path
which will provide us such a valuable info in a attractive presentation format
blog post అనేది పది కాలాలపాటు ఎప్పుడు చూసిన fresh గా ఉండేలా తీర్చి దిద్దిన నేర్పు ఏదైతే ఉందొ మీలో అద్దానిని మెచ్చుకుంటున్నాను.
"ఏదేమయినా ఈ సంపదనన్నా మరీ అంతరించిపోయేదాకా కాకుండా మితంగా వాడితే మంచిది"
Conclusion చాలా బాగుంది !!
Good POST
?!
Assalu supper andi..Abdutham,Abhinanda dayakam, emi matalu vasthalevu..
Chilli ginja(Clearing Nut) gurinchi ma lanti taliyani vallaku vipulanga cheppinanduku dhanyavadamulu..
Very informative రసజ్ఞ as usual!
మంచి సమాచారం ఇచ్చారు. మార్కెట్ కన్నుపడింది అంటున్నారు మరి ఎక్కడ దొరుకుతాయి, కడియం నర్సరీల్లో అమ్ముతున్నారా, చెట్టు ఎంత ఎత్తు పెరుగుతుంది, ఎలాంటి వాతావరణంలో లాంటి సమాచారం ఇవ్వండి.
ఎందుకో! ఏమో? గారికి తాత్విక చింత(న)లు కొద్దిగా మనందరికన్నా ఎక్కువే. :P :))
రసజ్ఞ ..చాలా వివరణాత్మకం గా వ్రాశావు. "పద్యాల " పరిచయం చాలా బాగుంది.
చిల్ల గింజలు నేను చూసాను. కాయలు కూడా చూసాను. " ఏ సంపదైనా మితంగా వాడుకుంటే మంచిదేమో! " అవును కదా! భావి తరాలకి వాటి ఆనవాలు,ప్రయోజనాలు చూపాలి కదా!
చాలా బాగా బ్రాశారు. థాంక్ యు!
/తాత్విక దృష్టి తో చూడటం అలవరచు కోవటం వల్ల double benfits పొందుతాము /
ఒకటికొంటే రెండోది వుచితం , దీపావళి డబల్ ఢమాకా లాగా అన్నమాట! బాగా చెప్పారండి ?! గారు. :)
మీ టపాలు చాల బాగుంటాయి.
ఈ టపా కుడా చాలా బాగుంది. ఏన్నొ విషయాలను చక్కగ చెప్పారు.
చిల్ల గింజల గురించి ఉన్న పద్యాలను కుడా సంధర్భోచితంగా లింక్ చేయటం బాగుంది.
ఈ గింజలు నాకు నిర్మలి గానే తెలుసు. చిల్ల గింజలు అంటారని తెలియదు. నీళ్ళలో వేస్తే, మట్టి, మకిల అంత పైకి తెరుకుంటుంది. మల్లు వంటి పలుచని వస్త్రం ద్వారా వడపొసుకుంటే స్వఛ్చమైన నీరు లభ్యం.
కాని నా దగ్గెర ఉన్న గింజలు తెల్లగా పారదర్శకంగా ఉన్నట్లు గుర్తు. ఇప్పుడు ఫిల్టరు వచ్చిన తరువాత వాటిని వాడటం లేదు.
Keep posting I always enjoy your blog Rasagya
Anamika
http://sakhiyaavivarinchave.blogspot.in
నీరు శుభ్రం చేయడానికి ఇండుపగింజలు వాడతారని తెలుసు గానీ
ఇంట చరిత్ర వీటి వెనుక ఉందని ఇప్పుడే తెలిసిందందోయ్..
మంచి సమాచారం...
@శ్రీ
పింకి గారు కాదేది కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ గారు ...కాని మీరు కాదేది టపా కనర్హం అంటున్నారు.....
చిల్ల గింజ శుద్ద జలన్ని తీసినట్టు మీరు మా ఙానాన్ని వెలికి తీస్తున్నారు....
జగన్నాత పండిత రాయల పొస్ట్ కు వ్యాక్య రాదమనుకున్న వీలు కాలేదు.......
"న రత్న మన్విష్యతి మృగ్యతే హి తత్"మేమె రత్నాన్ని అన్వెషించాం......దొరికింది.పింకి రూపం లో.......
chilla ginjala katha baagundi, padyaalu bhale dorikayandi meeku.
రసజ్ఞ గారు, చిల్లగింజల గురించి బాగా చెప్పిన్రు... మీము చిన్నప్పుడు ఇసుక చెలిమి లో తెచ్చిన నీళ్ళు చిల్లగింజల పొడి కలిపి సుద్ధి చేసి తాగేవోల్లం, అస్సలు ఆ నీటి రుచే వేరు. గిప్పుడు మా అమ్మా నాయన ఇంటికాడ డబ్బా నీళ్ళ కోసం రోజు ఎదురు చూపులు. రోజుకు పది రూకలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి.....
వార్నాయనోయ్! ఇన్నిన్ని విశేషాలు ఎక్కడ దొరుకుతుంటాయండి బాబు!
రసజ్ఞ గారూ..
మళ్ళీ ఒక కొత్త విషయం పట్టుకొచ్చేశారన్నమాట..
ఈ చిల్లగింజలు చూడటానికి చిన్నగానే వుంటాయి కానీ మహా కఠినం..
చిల్లగింజ గంధం తీయటం చాలా కష్టమండీ...
కొత్త కొత్త విషయాలను తీసుకుని వాటిని నీ జ్ఞానసంపదకు జోడించి మరీ అందిస్తావు...చాలా బావుంది రసజ్ఞా. మా చిన్నప్పుడు నీళ్ళను శుభ్రపరచడానికి పటిక వాడేవాళ్ళం.
రసజ్ఞా(ని) గారు,
ఈ గింజలు తెలుసా?
నిజంగా నాకైతే తెలియదు.
చదివిన తరువాత vటి ఉపయోగాలు
మరియు ఇంత చరిత్ర ఉందని మీ విశదీకరణ ద్వారా
తెలిసింది.మీ చిటికినవేలు పోస్టింగ్ కూడా చదివాను. అదికూడా
బాగా ఎలాబ్రటివ్ గా ఉండి ఇన్ఫర్మేటివ్ గా ఉంటూ ఎన్నో విషయాలను తెలిపింది.
ఇంత పెద్ద పోస్టింగ్స్ రాస్తున్న మీ సహనానికి, బ్లాగ్ పై మీకున్న మక్కువకు జోహార్లు.
మా చిన్నప్పుడు పటిక వాడేవాళ్ళం. చిల్ల గింజల గురించి వినలేదు. ఈ వేళ తెలుసు కున్నాను. థాంక్స్.
పద్యాలు బాగున్నాయి.
ఈ గింజల గురించి చిన్నప్పుడు విన్నాను. వర్షాకాలంలో ట్యాప్ వాటర్ బురదగా వచ్చినప్పుడు దీన్ని వాడేవాళ్ళం. కానీ మీకు ఇన్నేసి విషయాలు ఎలా తెలుస్తాయండీ బాబూ. మీరొక నడీచే ఎన్సైక్లోపీడియాలా ఉన్నారు.
@ ఎందుకో ఏమో శివ గారూ
మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండీ! మరి నా బాకీ వడ్డీతో సహా తీర్చాలి ;) మీకు నా రాతలు, ఈ గ్రంధాలయం లాంటి నా బ్లాగు అంతగా నచ్చుతున్నందుకు,మీ మిత్రులకి కూడా పంపినందుకు చాలా ధన్యవాదాలు!
@ వజ్ర గారూ
చాలా థాంక్స్ అండీ! ఇప్పుడు మీకు కూడా తెలిసిందిగా ఇహ అప్పుడప్పుడన్నా వాటిని కాస్త పట్టించుకోండి :)
@ జలతారు వెన్నెల గారూ
ఓపికగా అంతా చదివినందుకు, మీ స్పందనకీ చాలా థాంక్స్ అండీ!
@ SNKR గారూ
బెంగాల్, మధ్య, దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఉంటాయి. ఈ మొక్క కడియంలో దొరుకుతుందో లేదో చెప్పలేను కానీ ఉంటే శ్రీ సత్యనారాయణ నర్సరీలో ఉండచ్చు. అక్కడ అబ్బాయికి బొటానికల్ నేమ్ చెప్తే ఉంటే ఇస్తాడు. ఇది సాధారణంగా 1000-1200m ఎత్తు పెరుగుతుంది, 1100-2500mm వర్షపాతం ఉండి, 5-10, 35-40, 25-30°C వద్ద పెరుగుతుంది. ఒండ్రు మట్టి, నల్ల మట్టి, ఎర్ర మట్టి, కంకర మట్టిలో బాగా పెరుగుతుంది. ఋతు పవనాలప్పుడు విస్తరించి బాగా వ్యాప్తి చెందుతుంది. మీ స్పందనకి ధన్యవాదాలు!
@ వనజ గారూ
నిజమేనండీ జనాలకి వేలం వెఱ్ఱి పట్టినట్టు ఏది దొరికినా పూర్తిగా అయిపోయేదాకా వాడేస్తున్నారు. తద్వారా వాటి ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతోంది! ఇవి మీరు చూసాను అంటున్నారు కనుక వాడే ఉంటారు. ఆ రుచి మీకు తెలిసే ఉంటుంది కదూ! ధన్యవాదాలండీ!
@ అనామిక గారూ
నా టపాలన్నీ మీకు ఇంతగా నచ్చుతున్నాందుకు చాలా థాంక్స్! ఈ గింజలు చాలా సంవత్సరాలు నీడలో ఉంటే తెల్లగా అవుతాయండీ. మీరు చాలా రోజులు వాడకుండా ఉంచేయడం వలన మీ వద్ద ఉన్నవి అలా తెల్లగా ఉండి ఉండవచ్చు. మీ అందరి ఆదరాభిమానాలతో నా ప్రయత్నం నేను చేస్తా అండీ! తప్పక వీలున్నప్పుడల్లా పోస్ట్ చేస్తూ ఉంటా! నెనర్లు!
@ శ్రీ గారూ
అయితే మీకు ముందే పరిచయం ఉందనమాట వీటితో :) మీ స్పందనకి ధన్యవాదాలండీ!
@ రఘు గారూ
హహహ! నా పేరు పింకీ అని ఫిక్స్ అయిపోరాయా ఇక మీరు! లేదా ఆ పింకీ టపా నుండీ ఇంకా బయటకి రాలేదా ;) మీ వ్యాఖ్యకు చాలా థాంక్స్ అండీ!
@ the tree గారూ
హహహ! ఏదో తెలిసినవీ, తెలుసుకున్నవీ అన్నీ అలా కలిపేసి ఇలా మీ ముందుకి తెచ్చానండీ! నచ్చినందుకు థాంక్స్!
@ రామ్ గారూ
అయితే మీకు కూడా తెలుసనమాట! నాకన్నా ఎక్కువే తెలిసుండాలి ఆ రుచి మీకు! నిజమే అండీ బాగా చెప్పారు! ఈ కాలంలో ఇలానే ఉంది పరిస్థితి! ధన్యవాదాలు!
@ తెలుగుభావాలు గారూ
హహహ! మీరు మరీనండీ! వీటి గురించి మా అమ్మమ్మ ఇప్పటికీ చెప్తూ ఉంటుంది! గోదావరి వరదలప్పుడు, క్రొత్త గోదావరి నీరు వచ్చినప్పుడూ తొండవరం (తొండారం), పాశర్లపూడి, అమలాపురం, రాజోలులో మా వాళ్ళు వాడుతూ ఉంటారు. అలా తెలిసింది. మీ స్పందనకి ధన్యవాదాలు!
@ రాజి గారూ
హహహ! నేను క్రొత్తది అనుకున్నా మీకు ముందే తెలుసుగా :( అవునండీ మరి అపూర్వమయినవి ఊరికే దొరికేస్తే విలువేముంది చెప్పండి ;) నెనర్లు!
@ జ్యోతిర్మయి గారూ
నేను వ్రాసేది మీకు అంతగా నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ! నిజమే మీరు చెప్పినట్టు చిల్లగింజలే కాక పటిక, కరక్కాయ, మునగ గింజలు (ములక్కాడలో గింజలను ఎండపెట్టి) కూడా నీటిని శుద్ధి చేయడానికి వాడేవారు. ధన్యవాదాలు!
@ Hari Podili గారూ
హహహ! మీ సంబోధన వినడానికి భలే ఉందండీ! కాని నాకు ఇంకా అంత జ్ఞానం లేదనే అనుకుంటాను. ఒక సాధారణ విద్యార్థినిని. ఈ టపాతో పాటూ నా పింకీ టపా కూడా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు! ఏదో నాకు తెలిసినవీ, తెలుసుకున్నవీ ఇలా ఇక్కడ పెడుతున్నాను. కొంతమందికన్నా ఉపయోగపడినా, ఆచరించినా, గుర్తుంచుకుని మరికొంతమందికి చెప్పినా నా ప్రయత్నం ఫలించినట్లే! మీ స్పందనకు ధన్యవాదాలు!
@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
మీ వ్యాఖ్యలో దహా లేకపోవడం కొంత నిరుత్సాహపరిచింది. ఏలూరులో మా తాతమ్మా వాళ్ళు ఉండేవారు. వాళ్ళు కూడా వాడేవారు ఈ చిల్లగింజలని. మీ స్పందనకి ధన్యవాదాలండీ!
@ మురళి గారూ
చూశారా? మీకు కూడా తెలిసాయి ఈ గింజలు! :) హహహ! మీరు మరీనండీ! ఎన్సైక్లోపీడియా అన్న పదం నా స్థాయికి చాలా ఎక్కువ! ఏదో తెలిసిన, తెలుసుకున్న కాస్తా ఇక్కడ పెట్టేస్తున్నా అంతే! మీ స్పందనకి ధన్యవాదాలండీ!
@రసజ్ఞ గారు మీరు చాల మంచి టపా రాసారండి ... తెలియని విషయాలు ఎన్నో చెప్పారు మీకు ధన్యవాదాలు .. ఇలాంటి పోస్ట్ లు చాల రాయాలని కోరోకున్ట్టున్నాను
రసజ్ఞ గారు మీకు అవార్డ్స్ నచ్చావు కావచ్చు .కానీ తప్పడం లేదు అండి.. మీ బ్లాగ్ కి మరియు మీరు క్లుప్తంగ చాల విషయాలు మాకు తెలుపుతునందుకు ధన్యవాదములు.Anduke meeku oka award waiting lo undi. Kshaminchandi andariki telvalani nenu naa post lo English ro rasina...Indulo Chudandi
http://www.maverickvajra.blogspot.com/2012/04/heart-melted-gratitude-for-award.html
బాగుంది, చాలా బాగుంది.... చిల్ల గింజ గురించి చెప్పినా, చింతగింజ, చిల్లపెంకు,తొక్కుడు బిళ్ళ దేనిగురించి చెప్పినా, నీకే చెల్లింది. శోధన, పరి...పరిశోధన....
@ సత్య గారూ
మీ అందరి ప్రోత్సాహం ఉండాలే కానీ తప్పక వ్రాస్తానండీ! ధన్యవాదాలు!
@ వజ్ర గారూ
మీ అభిమానానికి చాలా థాంక్స్ అండీ! "versatile బ్లాగర్ అవార్డు" తీసుకునే అంత పరిణితి నాకింకా రాలేదనే అనుకుంటున్నాను. మన్నించాలి. ఆ స్థానాన్ని కల్పించారు అదే నాకు పెద్ద అవార్డు. కృతజ్ఞతలు!
@ తాతగారూ
అంటే మరి ఇప్పుడు నేను చింతగింజ, చిల్లపెంకు,తొక్కుడు బిళ్ళ గురించి కూడా టపాలు వ్రాయాలంటారా :):) నెనర్లు తాతగారూ!
@రసజ్ఞ గారు....
Kishore.. comments ని లైట్ గా తీసుకోండి...
ఇక్కడ చాలా మంది..
మీ సరికొత్త పోస్ట్ ఎదురుచూస్తూ వుంటారు.. నాలా... :)
ఇందుగు గింజ లేదా చిల్లగింజ గురించి రాసిన ఈ టపా కి ప్రాచీన నమ్మకాలకీ సంభందం ఏంటో నాకేమి అర్ధం కావటం లేదు . ఒకవేళ కి ఆ గింజలకి రసజ్న గారు చెప్పిన ఔషద లక్షణాలు లేకపోతె దాన్ని వివరించాల్సిన reasercher కిషోర్ గారు క్రాప్ అని క్రాప్ ఏదో క్రాప్ మాట్లాడటం కూడా అర్ధం కావటం లేదు .
కిషోర్ గారు ఇంటర్నెట్ లేకముందు నుంచి జనాలు బ్రతుకుతున్నారు , అలాగే సైన్సు అంటే ఏంటో తెలియకముందు నుంచి కూడా . కాకపొతే సైన్సు మన జీవితాలని ప్రభావితం చేసింది , ఈ రోజు మనం చూస్తున్న అభివృద్దికి అదే కారణం అన్న దాన్ని ఎవరూ కాదనలేరు . మీరు నమ్మకాలకి , సైన్సు కి ముడి పెట్టి చేసే వాదన భలే విచిత్రం గా ఉంది ఇక్కడ.
ఒక వేళ మీకు ఈ టపా లో విషయాలు తప్పు అని తెలిస్తే అది వివరించే ప్రయత్నం చేయండి మేము కూడా తెలుసుకుంటాం, అంతే కనీ ఈ బెదిరింపులు , వెక్కిరింతలు దేనికి ? పైగా మీరో reasercher అని చెప్పుకుంటున్నారు ఇదేనా విషయాన్ని వివరించే పద్దతి ?
@Rasgna garu
No doubt.. it's an excellent work.. Keep writing
In your blog of "Navarasa"s, after it's "Bhibhatsa"rasam..!
@Kishore garu
I would like to know what do you mean by "give an inch respect for the science"..?
If you describe that in your blog I will give miles (not inches) of respect.. provided your intentions must be genuine.
A researcher, cannot leave any of the available documentary, which is related to his/her work, whether is correct or wrong. I am surprised to know how you being a researcher missed/ignored this logic. This kind of ignorance made us for several severe loss., ex. Famous turmeric patent case, 1995. Although, India succeeded challenging this case, the losses occurred to people's believe cannot be restored. Hence, Traditional Knowledge Digital Library was established during the last decade.
If you have "respect" to science., O.K..! respect it..!
If you didn't have "respect" to traditions & believes, O.K..! don't respect it..
But if you talk with some person who has respect to both science as well as traditions & believes, please..! don't insult..
BTW, In my dissertation work I have described about "Rigveda", which is the earliest recording, related to my work on "Fire".
చిల్లగింజలనే ఇండుపకాయలు అని కూడా అంటారని ఇప్పుడే తెలిసిందండీ. అవి రెండూ వేర్వేరు అనుకునేవాడిని. చిన్నప్పుడు కొత్తగోదారి నీళ్ళ టైం లో నీళ్ళలో పటిక వాడటం గుర్తుంది నాకు. ఈ గింజల ప్రయోజనాలను వివరిస్తూ పద్యాల టచ్ ఇవ్వడం బాగా నచ్చింది నాకు. అన్నట్టు ఈ గింజలకి కూడా ఏ ఫారిన్ వాడో పేటెంట్ తీసేసుకున్నా తీసేసుకుంటాడు. :)
రసజ్ఞ గారూ...
మేము పటిక ఇప్పటికీ వాడుతున్నాం... ఇండుప గింజలు మా తాతగారు వైద్యంలో వాడే వారట, అమ్మ చెబుతుండేది. మంచి విషయాలు సాధికారంగా చెప్పారు.
చిత్రమేమంటే కళ్ళ ముందు ప్రాక్టికల్‌గా కనబడే చిల్ల గింజల గురించి మీరు చెప్పిన విషయాల మీద కిషోరుడు పూనకం వచ్చినట్టు చెలరేగిపోతుంటే మీరు మౌనంగా ఉన్నారు... అవతల పక్క శాస్త్ర విజ్ఞానం బ్లాగులో విశ్వాసాలను ప్రశ్నించడం అనే వంకన భారతీయ సంస్కృతికి ప్రశ్నించే లక్షణమే లేదని విమర్శల దాడి చేస్తున్న రెండేళ్ళ నాటి పోస్ట్ మీద వ్యాఖ్యాతల స్పందనలకు చక్రవర్తిగారు తప్పించుకు తిరుగువాడి లెక్కన మిన్నకున్నారు. :)
మనకు ప్రాణము పోసి , యేమరక , మన శ
రీరమందు జీవమును ధరించి యుండు
పంచ భూతములకు లేద ప్రాణము ? యిది
సైన్స ? మిడి మిడి ఙ్ఞానమ్ము లేల ? చాలు !
నేలా నీరూ గాలీ
భూలోకపు ప్రాణదములు , పుట్టుక నిచ్చే
లీలకు ప్రాణము లేదా ?
యీ లాజిక్ సైన్స ? వీళ్ల కింగితముందా ?
పెన్న వరద నీళ్ళు ప్రియముగా గొనితెచ్చి
చిల్ల గింజ చాదు చేర్చినంత
తేరు యనుభవాల తీరు సైన్సేగదా !
మంచి మాట చెప్పె మా 'రసఙ్ఞ'
-----సుజన-సృజన
ఎన్నో తెలియని పాత కాలపు విషయాలు ఇంతగా పరి"శోధించి" పద్య గద్యాలతో, శాస్త్రీయ చరిత్రలతో క్షుణ్ణంగా, వివరంగా, సరళంగా రాస్తున్న మీ ప్రజ్ఞ పాటవాలు నవ"రసజ్ఞ" భరితం!
రసజ్ఞ గారూ అందుకోండి అభిననదన మందార మాల! :)
@ SHANKAR.S గారూ
అయితే మీకు రెండూ విడివిడిగా తెలుసనమాట :) మీది కూడా మన గోదావరేనా అండీ సంతోషం! మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ! ఆయ్ అవునండీ అలా జరగకూడదనే మన వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు!
@ మానస గారూ
మీరు నా క్రొత్త పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారా? వావ్ చాలా థాంక్స్ అండీ! మొత్తానికి ఇలా బయటపడ్డారనమాట ;) మీ స్పందనకు ధన్యవాదాలండీ!
@ శ్రావ్య గారూ
చాలా కాలానికి కనిపించారు బాగున్నారా?
@ సాలగ్రామ సుబ్రహ్మణ్యం (వామన గీత) గారూ
హహహ! అవునండీ అది కూడా ఒక రసమే కదా :) మీ ప్రోత్సాహానికి చాలా థాంక్స్ అండీ!
@ పురాణపండ ఫణి గారూ
మా ఇంట్లో ఈ మధ్య వాడుక తగ్గిందిలెండి. అవునండీ ఎక్కువగా చిల్లగింజ పట్టీ వాడే వారు కదా ఏ నొప్పులకయినా! కొంతమందితో మౌనంగా ఉండటమే ఉత్తమం. చెప్పినా ప్రయోజనం లేనప్పుడు చెప్పడం వృధా కదా! మీ స్పందనకు ధన్యవాదాలు!
@ వెంకట రాజారావు . లక్కాకుల గారూ
చాలా బాగా చెప్పారండీ! నాకెప్పుడూ మీ పద్యాలు బాగా నచ్చుతాయి. నా మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండీ!
@ చిన్ని ఆశ గారూ
అంటే మీరు వినలేదనమాట ;) తెలివిగా తప్పించుకున్నారే :) మీ అభినందన మందార మాలకు నా అభివాదాలు!
Ee roje mi blog chusanu...oka encyclopedia laga undi....very informative posts...
@ Kishore..... గారు....
నాకు మీకు చెప్పగలిలే....అర్హతా...అనుభవమూ.. జ్ఞానము.... లేకపోవచ్చు.... కానీ...
నాకు తెలిసినది ఒకటి చెప్తాను... అర్థం చేసుకోగలరని ఆశిస్తూ....
కళ్ళకు కనిపించిందే.. ప్రపంచము... అదే నిజము అని నమ్మినంతకాలము... మనిషి మనిషిగానే మిగిలిపోతాడు.
అలా అని.. తెలియనివి, చూడనివి అన్నీ అబద్దము అని చెప్పగలరా?
ఒకవేళ... చెప్పగలిగారు అంటే... అది మీ "అభిప్రాయం" మాత్రమె అని గమనించగలరు... నిజం అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు...
మొండిగా వాదిస్తే.... మీ అభిప్రాయాన్ని మరొకరి మీద రుద్దటానికి ప్రయత్నిచినట్టే కదా!
"we can not bear to see that a talent is running away chasing dollars or chasing spirituality! can we? particularity, the second one!" - ఇది మీరు అనుకుంటున్నది, మీ అభిప్రాయం మాత్రమె...అని గమనించండి.
spirituality..GOD అనే పదాల అర్థాలు.. మన జీవితంలో.. వేరొకరి వాళ్ళ ద్వారా ప్రభావితం చేయబడినవి మాత్రమే మనకు తెలుసు.
కానీ.. అందులో నిక్షిప్తమైన నిజాలను.. స్వయంగా అనుభవిస్తే తప్ప తెలియదు... తెలుసుకోలేరు.. (ఇది నా అనుభవం).
మీతో.. GOD గురించి వాదనో.. లేక.. అన్వేషనో... చెయ్యాలి అంటే.. మీతో.. సమర్దించే వాళ్ళో లేక వ్యతిరేకించే వాళ్ళో మాత్రమే వుంటారు.... మీకు నిజంగా.. దేవుని గురించి తెలుసుకోవాలి అంటే.. మొదట.. మిమ్మల్ల్ని మీరు తెలుసుకోండి... చాలు..
GOOD LUCK.
@Kishore Hello Sir, there is nothing to excuse !
Btw why should I discuss about the existence of God here ? Is this blog post is related to that ? I didn't see anything . If you want to do so, please write on your own let us discuss there. Of course to open a blog and write some stuff there is no need not chase behind dollars. So it may be quite okay for you, isn't it ?
we can not bear to see that a talent is running away chasing dollars or chasing spirituality
------------------------------
Wow great ! So you are living a good life with a bunch of like minds around you at work place . Good to know that , but just let me tell you one simple thing. Don't except every where you can find same like minded people .
After all people have right to live their own lives,
right to have their own beliefs to believe .
You and I should respect them as we are expecting from others . Anyway you are working for the last 10 years in Indian Research Org, that is more interesting for me. If you have some time, can you write something about this to enlighten us in this area? Btw I have an idea how research organizations are operating now a days, so just want to know more about it from you.
Finally it is not good to spoil our fellow bloggers space for our discussion that too when it is not related to post, open you own blog and write your ideas there. What say ?
Rasajna gaaru doing good as usual and hm bit busy now a days :-)) .
మద గజమ్ము మార్గమందు జను చుండ కుక్కలెన్ని మొరుగు..................
ఒక సారి గాంది గారిని తిడుతు ఒకతను పది పేజిల వుత్తరం రాసాడట......
అదంత ఒపిక గా చదివిన గాంది గారు...
దానికున్న గుండుపిన్ను మాత్రం పక్కకు తీసుకున్నారట .....
యిదంత చూసిన ఒకతను గుండు పిన్ను మాత్రం యెందుకు తీసారన్నారట అప్పుడాయన....
యి మొత్తం లొ పనికివచ్చే ది యిది మాత్రమే అన్నారట.....
"IN A DAY WHEN YOU DON'T COME ACROSS ANY PROBLEMS, YOU CAN BE SURE THAT YOU ARE TRAVELING IN A WRONG PATH" BY VIVEKANANDA..........
మొదటినుంచి గొప్పవాల్లను ,గొప్ప విషయాలను పిచ్చివిగా,పిచ్చొల్లలా చుస్తూనే వున్నారు ....చాలా మంది జనాలు
మనకు ప్రతి విషయం వెరె యెవరొ చెప్పాలి(వేరె దేశాల వాల్లు ) అంతె ...మన వాల్లు చెబితె మనం వినం ...
యెదెమైన కాని యివెవి పట్టించుకొకండి......తర్వాతి పొస్ట్ యెప్పుడండి ......యెన్ని రొజులు నిరిక్షించాలి........
మీ తో నడిచెవాల్లం 99 మందిమి వున్నాం కదండి.....ఒక్కరి మాటలు పత్తించుకొవడం యెందుకు ....
@rasagna
theesukunna vasthuvuni gurinchi visthruthamga cheppalsi vachchinnapudu meeru puranalapina , saahityam pina ekkuvaga aadharapaduthunnaru.aina adhi saamanyamina vishayam kaadu , entho assakthini marentho oorpuni kalagalipi meeru raase tapallo ekkuva nijayithee kanipisthundhi.vasthuvu patla meeru kaliginche avagaahana inkevaru kaliginchalaeru.neneppudina mee patla durusuga comment petti untlyithey mannichagalaru.mee tharuvathi tapa kosam eduru choosthunnani abaddam cheppaka poina mee nundi adbhuthamina rachanalu vasthayani namme -mee abhimani
@kishore
mee padaalu inkochem soumyam gaa unte bavundedhi. mee nirasananu tapa patla vyktham cheyandi kaani neruga raasina rachaitha/rachayithri patla kaadu.ekkada rachayithri kevalam veray chota ponduparichina vishayalatho vasthuvu visthruthini penchay prayathnam chesaaru thappa aavida sahethukamina nirupanala joliki vellaledani gamanichagalaru.
Science without Religion is Lame and Religion without Science is Blind" -ALBERT EINSTEIN.
einstein gaari patla kooda meeru chakkani nirasana vyaktham chesi antharjatheeyamga peru pondagalaru.
@rasagna
meeru naa post delete chesina naa full support meekay.
GOOD .USEFUL POST.
@ కృష్ణ గారూ
మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు!
@ రఘు గారూ
మీ అభిమానానికి ధన్యవాదాలు! వచ్చేసిందండీ తరువాతి టపా చదివెయ్యండి మరి:)
@ తనూజ్ గారూ
మన్నించడం లాంటి పెద్ద మాటలు వద్దండీ. నా టపాల్లో మీరు చూసిన నిజాయితీకీ, మీకు నా మీద ఉన్న నమ్మకానికి చాలా చాలా థాంక్స్. నేను మీ వ్యాఖ్య తీసెయ్యలేదు అది స్పాం లోకి వెళ్ళింది. నేను చూసి అప్పుడు పబ్లిష్ చేశా. మీ ఫుల్ సప్పోర్ట్ నాకున్నందుకు నెనర్లు.
@ రవి శేఖర్ గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
8వ తరగతి, నాలుగో పీరియడ్ లెక్కలు, తిక్క,ఆకలి కూడా రెచ్చిపోతున్నాయి. హమ్మయ్య! గంట కొట్టేశాడు అటెండర్ గంగాచలం. ఒకర్నొకరు తోసుకుంటూ, గెంతుకుంటూ పరుగులు. తెచ్చుకున్న కారియర్లు అన్నీ స్కూలు మెట్ల కింద గుర్తుగా పెట్టుకున్నవి ఎవరివి వాళ్ళు తీసుకొని, దొరికిన మంచి చోటులో -- చెట్లకింద, మెట్ల కింద కారియర్లు విప్పి అందులోంచి ఒక్కో గిన్నె ఖాళీ చేసి, పరుగున గేటు, ఆ పై రోడ్డు దాటి కాలువ రేవు మెట్లు దిగి ఎర్రగా ఉన్న మట్టి నీళ్ళను గిన్నెలోకి తీసుకొని మెట్టు గరుకుగా ఉన్నదగ్గర శుభ్రం చేసుకొని ఆ 'గింజ' అరగదీసి ఆ గంధం వేలితో డబ్బా(స్టీలు కారియర్ లోని ఒక గిన్నె)లో నీళ్ళ పైన అలా సుతారంగా కలిపేవాళ్ళం. అధ్బుతం--కొన్ని సెకన్ల లోనే తేట నీరు పైకి వచ్చి ఎర్ర మట్టి అంతా కిందికి చేరిపోయేది. ఆ గింజను అప్పట్లో(1967) ' ఇండుపు' కాయ అనేవాళ్ళం. ప్రతీ కిరాణా కొట్లోను దొరికేది. ఇదిగో ఇప్పటికి మీ పుణ్యమా అని ఆ గింజ గురించిన శాస్త్రీయ, ధార్మిక విషయాలు ఇంత విపులంగా తెలిశాయి. అంతేనా 45 ఏళ్లు వెనక్కి తీసుకుపోయి, ఈ మండే కాలంలో తొలకరి జల్లు కురిపించేశారు రసజ్ఞ గారూ! ధన్యవాదాలు.
రాజా.
gksraja.blogspot.com
@ రాజా గారూ
మా తొలకరి జల్లులో తడుస్తూ మమ్మల్ని కూడా మీ చిన్ననాటి అనుభూతుల జల్లులో ముంచేశారు. అయితే మీరు బాగా అరగతీసేసారనమాట :) అప్పట్లో ప్రతీ కిరాణా కొట్లో అమ్మేవారా? నాకు తెలియదండీ. నేను ఎనిమిది చదివేసరికి కనీసం మా ఊరిలో ఎక్కడా అమ్మటం చూసి ఎరుగను. కావాలంటే ఎక్కడెక్కడినుంచో తెప్పించి మరీ దాచి పెట్టించేవారు మా ముత్తాతగారూ, తాతమ్మగారూ. ఎంత మారిపోయిందో చూశారా? మీ స్పందనకి ధన్యవాదాలండీ!
Your way of telling everything in this paragraph
is genuinely fastidious, every one be capable of
simply be aware of it, Thanks a lot.
Feel free to surf to my page; dating online, bestdatingsitesnow.com,
You are so cool! I do not think I've read something like this before.
So great to find another person with genuine thoughts on this
issue. Really.. thank you for starting this up.
This website is one thing that is needed on the web, someone with some originality!
Also visit my weblog - dating online (http://bestdatingsitesnow.com/)
Great post. I used to be checking continuously this
weblog and I'm inspired! Extremely helpful info specifically the closing section :
) I care for such info much. I used to be looking for this particular information for a very lengthy time.
Thank you and good luck.
Also visit my site :: chinese restaurants near me
Hello రసజ్ఞ గారు,
Nice information about చిల్ల గింజలు.
I brought some Nirmali today in the market.
Ee ginjalni kallaki ela vadalo telaa andi
Nice information, thanks.
Post a Comment