చాలా కాలం తరువాత మళ్ళీ నాకు ఇష్టమయిన మరొక చిత్రకారునితో
మీ ముందుకి వచ్చాను. ఆయనే "అనూప్ గోమే". ఈయన ఇప్పుడిప్పుడే ఈ కళలో
స్థిరపడుతున్న వ్యక్తి కాని కుంచె పట్టింది మాత్రం తన అయిదవ ఏట.
తనకి తండ్రీ, గురువు
అయినటువంటి మదన్ గోమే గారికి చేదోడు వాదోడుగా ఉంటుందని పట్టిన కుంచె ఇప్పుడు ఎన్నో
అద్భుతాలను చిత్రిస్తోంది అనటంలో అతిశయోక్తి లేదు. వీళ్ళ నాన్నగారికి ఢిల్లిలో కళార్తి
అనే స్టూడియో ఉండేది. వారి నాన్నగారు ఎన్నో సినిమాలకి బేన్నర్లు వేస్తుంటే చూసి నేర్చుకున్న
విద్య. వీరి నాన్నగారు వద్దని చెప్పినా ఈయన మాత్రం అక్కడ చెక్కలను కోసి, కుంచెలు సర్ది
ఇలా ఏదో ఒక వంకతో అక్కడక్కడే ఉండి మరీ నేర్చుకున్నారుట. అది ఆయనకి కళ మీద ఉన్న శ్రద్ధ!
అలా తన పదమూడవ ఏట మొట్టమొదటి బేనరుని వేయటం జరిగింది.
అప్పటిదాకా శ్రద్ధ మాత్రమే ఉన్న
ఈయనకి మెల్లిగా కళ మీద మక్కువ పెరిగింది. ఏదో వెయ్యాలన్న తపన కానీ ఏం వేయాలో, ఎలా వేయాలో
తెలియని రోజుల్లో రవివర్మ గారి చిత్రాలు ఈయనని ఎంతగానో ఆకర్షించాయి. అప్పటినుండీ ప్రముఖులు
వేసిన చిత్రాలను ఎన్నో ఈయన వేసేవారు. అలా గోపాల్ గారి పెయింటింగ్స్ కూడా ఈయన వేశారు.
ఈయన చిత్రాలలో సహజత్వం, అలంకరణ ప్రధానాంశాలు. ఊహాత్మకత, సమాజాన్ని
అంటిపెట్టుకుని ఉన్న ఎన్నో దురాచారాల వలన కలిగే నష్టం, మానసిక బాధ కూడా అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటాయి అని
నాకనిపిస్తుంది.
ఇలా ఎంతో మంది వేసిన బొమ్మలనే వేయటం కన్నా సొంతంగా ఏదయినా వెయ్యాలి అన్న తపనతో తైల
చిత్రానికి శ్రీకారం చుట్టారు. అదే ఇది. మొట్టమొదట కుడిపక్కన ఉన్న బొమ్మ వేశారుట. కాని
తృప్తి చెందక ఎడమ పక్కన ఉన్న బొమ్మ వేశారుట. కొంచెం పరికించి చూస్తే కేవలం రంగులే కాదు,
ఆభరణాల తీరుబాటు,తీగల సర్దుబాటు ఎన్నో చేసి సంతృప్తి చెందాక అప్పుడు విడుదల చేసారుట.
ఈ చిత్రం ఎంతో మంది మదిని దోచుకుంది.
అప్పుడు ఈయన చిత్రాలకు ఎంతో ముచ్చటపడిన మీనా ఠాగూర్
గారు ఈయనకి శిక్షణ ఉంటే ఇంకా రాణించగలరని గుర్తించి ఈయనని 'Delhi College of Art' లో
బాచిలర్సు లో చేరమని సలహా ఇచ్చారుట. ఆవిడ మాటని కాదనలేక, ఇంకా గొప్ప గొప్ప చిత్రాలను
మలచాలన్న తపనతో 1999-2003 వరకు అక్కడ బాచిలర్సు డిగ్రీలో పట్టా పొందారు. తరువాత
మెల్లిగా ఢిల్లిలో మంచి పేరు ప్రఖ్యాతలు గడించుకున్నా ప్రపంచ వ్యాప్తంగా తన చిత్రాలను
అందరకీ పరిచయం చేయాలన్న కోరిక అయితే ఉందని చెప్పారు.
ఆయన కోరిక నెరవేరి ఆయన చిత్రాలు ఎంతో మంది ఆదరణని పొందాలని
కోరుకుంటూ... ఆయన వేసిన చిత్రాలలో నాకు నచ్చిన కొన్నిటిని మీ ముందుకు తెస్తున్నాను.
ఇంకెందుకాలస్యం చూసి ఎలా ఉన్నాయో చెప్పండి మరి!
48 comments:
Nice pictures. No doubt, he is a great artist! Thanks for sharing .
చిత్రకారుల్ని బలే పట్టుకొని వస్తావు కదా పిక్స్ చాలా చాలా బాగున్నాయి... అనుప్ గారు మంచి చిత్రాలను చిత్రించారు... ధన్యవాదములు...
బొమ్మలు చాలా బావున్నాయి. మంచి చిత్రకారుణ్ణి పరిచయం చేశావు రసజ్ఞా...
Mee kalaabhiruchiki abhivandanam Rasagnaa.
chitraalu chaalaa baagunnaayi. Thank you!
"అనుప"మాన చిత్రాలని అందించిన మీకు ధన్యవాదాలు ! ఈ మధ్య బొత్తిగా నల్లపూసయిపోయారు. మీ టపాలకోసం చకోర పక్షుల్లా వేచిచూస్తున్నాం.. బహుకాల దర్శనానికి నెనర్లు !!
wow.. mind blowing arts.. love it... thanks for sharing Rasagna garu !!
రసజ్ఞ గారూ,
మరో అద్భుత చిత్రకారుడిని ఇలా పరిచయం చేసినందుకు చాలా సంతోషం. ఏదైనా ఎవరినైనా పరిచయం చెయ్యాలంటే మీరే సుమండీ! బొమ్మలు చూడగనే "రవివర్మ" చిత్రాల్లా ఉన్నాయే అనుకున్నాం. చదివాక తెలిసింది రవివర్మ చిత్రాలని ఆకర్షించి మక్కువతో వేశారని...
ఇలా తెలియని గొప్ప ఆర్టిస్ట్ లని అప్పుడప్పుడూ పరిచయం చేస్తూ వారి గొప్ప గొప్ప చిత్రాలని చూసే భాగ్యం కలిగేలా చేస్తున్నారు...ఇందుకైనా మీకు ఫైన్ ఆర్ట్స్ లో పట్టా ఇచ్చి తీరవలసిందే... ;)
Wonderful Job అండీ! Keep it up!
Thanks for sharing Great Artist info and his pics.
రసజ్ఞ గారూ.. మంచి చిత్రకారుడిని,
అందమైన పైంటింగ్స్ ని పరిచయం చేశారు..
చాలా బాగున్నాయి.. ThankYou!
రసజ్ఞ గారూ, చక్కటి చిత్రాలను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
సహజంగా జీవం ఉట్టిపడే చిత్రాలను వేసిన చిత్రకారునికి అభినందనలు.
రసజ్ఞ గారు
చాలా రోజులతర్వాత బ్లాగ్ లో వచ్చారు
మంచి చిత్రాలని చూపించారు
ధన్యవాదాలు
చిత్రాలు చాలా బాగున్నాయి....
మీ బ్లాగ్ పేరులాగే రసజ్ఞమైన సేకరణ.
మీకు అభినందనలు....
@శ్రీ.
చాలా బావున్నాయి. కొంచం రవి వర్మ చిత్రాలకి దగ్గరగా ఉన్నాయి. thyanks for introducing Mr. Anup!
nice pictures....& good collection
మంచి వర్ణచిత్రాలు. చిన్న అనుమానం, సిమ్హాసనంపై కూచున్న యువతి మొఖంలో ఏదో తేడా... అదేదో మార్ఫింగ్ చేసిన చిత్రంలా ఉంది. నిజమైతే సరిచేయగలరు, తప్పైతే మన్నించగలరు.
అద్భుతం! చాలా మంచి చిత్రాలను సేకరించి మా ముందుంచారు.
@ జలతారు వెన్నెల గారూ
మీకు కూడా ధన్యవాదాలు ఆయన శ్రమని గుర్తించారు!
@ ప్రిన్స్ గారూ
ఏదో ఆ కళ మీద ఉన్న మక్కువతో కొంతమందిని ఇలా పరిచయం చేస్తున్నా! కొందరయినా క్రొత్త కళాకారుల్ని గుర్తిస్తే అదే చాలు! ధన్యవాదాలు!
@ జ్యోతిర్మయి గారూ
ధన్యవాదాలండీ! మీ అందరి ప్రోత్సాహంతో మరికొంత మందిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.
@ వనజ గారూ
ఈ అభిరుచి కళను గుర్తించ గలగడంలో కూడా ఉంది కనుక మీకు కృతజ్ఞతలు!
@ నందు గారూ
మీ అభిమానానికి ధన్యవాదాలు! ఈ మధ్య పని వత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఇటు వైపు పెద్దగా రాలేకపోతున్నాను.
@ ఫోటాన్ గారూ
ఆయన కళకు ఒక గుర్తింపు లభించింది. మనలాంటి ప్రేక్షకుల ప్రోత్సాహమే వారి కళకి ఆజ్యం. మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ చిన్ని ఆశ గారూ
మీ లాంటి వారికి మరింత ఉత్సాహం కదూ ఇలాంటివి చదువుతుంటే... మరి మా చిట్టి పండు మరింత చక్కని బొమ్మలు వెయ్యాలంటే ఇలాంటివి చూపించి బూస్ట్ అప్ చెయ్యద్దూ :) ఇలా నాకు పట్టాలు ఇచ్చేస్తానంటే బోలెడంత మందిని చేసేస్తాను ;) ధన్యవాదాలండీ!
@ రామ్ గారూ
మీకు నచ్చినందుకు సంతోషం! ధన్యవాదాలండీ!
@ రాజి గారూ
మీకు నచ్చి, మీరు మెచ్చినందుకు నెనర్లు!
@ anrd గారూ
మీ అభినందనలు ఆయనకి తప్పక తెలియచేస్తాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ శ్రీను గారూ
కొంచెం పని వత్తిడి వలన సరిగా రాలేకపోతున్నా అండీ! ధన్యవాదాలు!
@ శ్రీ గారూ
చిత్రాలు నచ్చినందుకు, మీ అభినందనలకు నా అభివాదములు!
@ ఆ.సౌమ్య గారూ
అవునండీ మరి ఆయనకి ఈయన ఏకలవ్య శిష్యుడు కదా! అందుకని మీకు అలా అనిపించి ఉండవచ్చు. ధన్యవాదాలు!
@ నిప్పు గారూ
థాంక్స్
@ ramki గారూ
ఈ ఖ్యాతి అంతా అనూప్ గారికే చెందుతుంది. ధన్యవాదాలు!
@ puranapandaphani గారూ
చిత్రం అలానే ఉందండీ. అది మార్ఫింగ్ కాదండీ తప్పక, పేలవంగా నవ్వుతున్నట్టు ఉంది ఆవిడ మోము (నా దృష్టిలో). ఆమె కళ్ళల్లో ఏదో నిరాశ, ఆవిడ పెదవులు పూర్తిగా విడతీయకుండా నవ్వటం చూసి అలా అనిపించింది నాకు. ధన్యవాదాలు!
@ బాలు గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ నందు గారూ
మీ అభిమానానికి ధన్యవాదాలు! ఈ మధ్య పని వత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఇటు వైపు పెద్దగా రాలేకపోతున్నాను.
veelu choosukoni oka saari call cheyyi rasagna yahoo lo ledaa skype lo
good taste
రంగులతో నాట్యమాడించే కళాకారులను పరిచయం చేయించడంలో మీరు ఎన్నో రంగులు వాడుతున్నారు చాలా బాగుంది మీ పరిచయాలు వారి కళా నైపుణ్యం... ప్రాణం ఒక్కటే తక్కువ అన్నట్టు ఉన్నాయండి... భేష్
7,14,15&40 చాలా బాగున్నాయి.
సరస్వతి తరవాతి దేవత లక్ష్మీదేవా?! ముద్దుగా వుందండి. :)
wow.... చాలా చాలా బాగున్నాయండీ.సూపర్ కలెక్షన్..
కుర్చీ లో బ్లూ సారీ లో కూచుని ఉన్న లేడీ పిక్చర్... ఐశ్వర్యా రాయ్ స్టిల్ కదండీ??ఈ పెయింట్ ఆధారంగా ఐశ్వర్యారాయ్ ని సేం స్టిల్ లో తీశారా?
లేకా పోస్టర్ ని ఎడిట్ చేసుంటారా?
అమ్మవారు వరాహావతారం లో ఉన్న పిక్ ఇదే ఫస్ట్ టైం చూడటం. దాని గురించి వివరాలు తెలిస్తే చెప్పండీ.
జయహో.. అనూప్ గారు ;)
పరిచయం చేసిన రసజ్ఞ గారికీ జేజేలు
బావున్నాయి. ఆయనకు మరింత కీర్తి దక్కాలని కోరుకుంటున్నా.
అబ్బ..చాలా మంచి కలెక్షన్...వరాహావతారం లో అమ్మవారు?
చిత్రంగా ఉంది...మంచి కల్లక్షన్ చూపించారు...అభినందనలు
రసజ్ఞ గారు
పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. మంచి పెయింట్స్ సేకరించారు. సరస్వతి దేవి తర్వాత ఉన్న అమ్మవారు " వారాహి " అమ్మవారు. లలిత దేవి అంగరక్షకురాలు. ప్రత్యంగిరా అమ్మవారు కూడా ఇలాగే సింహ ముఖంతో ఉంటుంది. వీరంతా శ్రీచక్ర పరివార దేవతలు.
శ్రీవాసుకి
@ తాతగారూ
ధన్యవాదాలు!
@ కళ్యాణ్ గారూ
కళాకారులను పరిచయం చేసే నా రంగులు నచ్చినందుకు ధన్యవాదాలు! ప్రాణం లేకపోయినా జీవం ఉట్టిపడుతున్నాయి కదండీ :)
@ SNKR గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ! సరస్వతీ దేవి తరువాతది లక్ష్మీ దేవి అవతార రూపమయిన వారాహి దేవి.
@ రాజ్ కుమార్ గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు! పెయింటింగ్ ఆధారంగానే తీసుంటారు లేకుంటే ఆయన ఐశ్వర్యా రాయ్ మోఖమే వేసేవారు (ఈ ఆలోచన నా సొంత పైత్యం లెండి!) :)
స్వామి అవతరించిన ప్రతీ అవతారంలోనూ అమ్మవారి అవతారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన భార్య అనగా ఆయన శక్తి కదా! శక్తి లేనిదే ఆయన దుష్ట శిక్షణ చేయలేదు కదా! ఈవిడ పేరు వారాహి దేవి. క్రింద కామెంటులో శ్రీ వాసుకి గారు చెప్పినట్టు ఈవిడ లలితా దేవి అంగరక్షకురాలు. ఈవిడ గుడి కాశీలో ఉంటుంది. ఈవిడ కాశీకి రక్షకురాలనీ, రాత్రిపూట గ్రామ సంచారానికి వస్తుందనీ నమ్మిక.
మీ జేజేలకి మరొక్కసారి ధన్యవాదాలు!
@ మురళి గారూ
మీ కోరిక నెరవేరాలని ఆశిస్తూ... ధన్యవాదాలు!
@ శశికళ గారూ
అవునండీ ఆవిడ వారాహి దేవి. మీ అభినందనలకు అభివాదాలు!
@ శ్రీ వాసుకి గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు! అవునండీ నేనూ చూసాను. మా ఇంట్లో పూజ చేస్తారు ప్రత్యంగిరా అమ్మవారికి. మీరు చెప్పిన వారాహి దేవి గుడి కాశీలో ఉంది కదా! కాశీపురమంతా ఈవిడ పరిరక్షణలోనే ఉంటుంది అంటారు. మీ స్పందనకి కృతజ్ఞతలు!
అన్ని చిత్రాలు అద్భుతం గా ఉన్నాయి రసజ్ఞ గారు..:-) ఒక దానిని మించి మరొకటి ఉన్నాయి..రవి వర్మ చిత్రాలు గుర్తుకు తెస్తున్నాయి..చాలా మంచి పోస్టు చేసారు..ధన్యవాదాలు ..:-)
Hello రసజ్ఞ gaaru,
Please this link,
http://youtu.be/gzNb8ay9uWg
may be you like it!
thanks
?!
పరిచయం బాగుంది! పెయింటింగ్సూ బాగున్నాయి...అన్ని 'details' తో, too expressive గా! చిత్రలేఖనంలో ఇది ఇప్పటి (ఆధునిక) విధానం కాదనుకుంటాను!
రవి వర్మ మాట ఇప్పటికే వ్యాఖ్యలలో వచ్చింది. ఒక బలమైన ప్రభావాన్నుంచి బయటపడాల్సిన అవసరాన్ని, తనదైన శైలిని లేదా ముద్రను ఈ చిత్రకారుడు ఇంకా వృధ్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుంది అనుకుంటాను. అన్ని కళారూపాలకులానే చిత్రలేఖనం అన్నది కూడ ఒక పెద్ద ప్రపంచం, సంక్లిష్ట ప్రపంచం! తనదైన ఒక విశిష్టమైన ముద్ర ఉంటేనే ఏ చిత్రకారునికైనా ఆ ప్రపంచంలో స్థానం దక్కుతుంది. ఈ చిత్రకారుడూ ఆ దిశగా కృషి చేస్తాడని అనుకుందాం, ఆశిద్దాం!
ధన్యవాదాలు!
మీరు నిజమైన కళాపోషకులు.మంచి కళాకారున్ని పరిచయం చేసారు.నవరసభరితమైన చిత్రాలు.
@ A Homemaker's Utopia గారూ
చిత్రాలు నచ్చినందుకు ధన్యవాదాలు! ఆయన రవివర్మగారి చిత్రాల నుండే ప్రేరణ పొందటం వలన అలా వచ్చేసి ఉండవచ్చు.
@ ఎందుకో? ఏమో! శివ గారూ
నేను చిత్రకారుల్ని పరిచయం చేయటం మొదలు పెట్టినదే ఆయనతో.. http://navarasabharitham.blogspot.mx/2011/11/blog-post_04.html ఒకసారి దీనిని చూడండి! నా కోసం నాకు నచ్చే పెయింటింగ్స్ మరొకసారి చూపించినందుకు ధన్యవాదాలు!
@ వెంకట్ గారూ
పరిచయం నచ్చినందుకు ధన్యవాదాలు! చాలా చక్కని అంశాలను ప్రస్తావించారు. మీరు చెప్పినది నిజమే! కానీ ఆయన మొదట్లో బేనర్లు ఎక్కువగా వేయటం, రవివర్మ గారి ప్రతీ చిత్రాన్నీ ఈయన వేసి అది రావివర్మగారు వేసినదా లేక ఈయన వేసినదా అన్న తేడా లేకుండా వేయటం వలన అలా ఉండిపోవచ్చును కూడా! మీ స్పందనకి ధన్యవాదాలు!
@ రవి శేఖర్ గారూ
చిత్రాలని ఈ బ్లాగు పేరుతోనే పోల్చేసారే!!! ధన్యవాదాలండీ!
Rasagna garu :)
mee punyama ani manchi chitralanu choosthunnam..
mee blog manchi posts tho update chesthunnaru :)
meeku ma kruthagnathalu :)
Good work. Good collection.
@ గణేష్ గారూ
ఈ చిత్రాలు, నా బ్లాగులోని పోస్ట్లు నచ్చినందుకు ధన్యవాదాలండీ!
@ పింగళి శశిధర్ గారూ
ఆయన చిత్రాలు నచ్చి, మెచ్చినందుకు ధన్యవాదాలు!
మీరు మామూలోళ్లు కాదుగా
మంచి ప్రెండ్ దొరికారు
@ శ్రీగార్గేయ గారూ
హహహ! ధన్యవాదాలండీ!
Good Art...
Thanks for writing about him and sharing his pictures :)
ఎలా పడతారండి మీరు ఇలాంటి ఆర్టిస్టులనూ, వారి బొమ్మలనూ. ఆర్ట్ గ్యాలరీస్ లో ఉంటారేమిటి !?
షేర్ చేసిన పిక్స్, జగన్నాథ పండితులవారి గురించిన కొత్త టపా బాగున్నాయి.
@ శేఖర్ గారూ
ఆయన చిత్రాలు మీకు నచ్చి ఆయనను మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు!
@ నాగార్జున గారూ
హహహ! భలే వారే! ఆర్ట్ గ్యాలరీస్ లో నివాసం ఉండనిస్తారని ఇప్పుడు మీరు అనేదాకా తెలియని అమాయకురాలిని ;)
ఈయన చిత్రాలు, మా (మన) పండితులవారి కథనం నచ్చినందుకు ధన్యవాదాలండీ!
Rasagna garu,
meeru varninchna theeru adbhuthanga undi andi..
keep going
@ Ganesh garu
thanq
Really nice pictures,no doubt he is a great artist. and thanks to u madam about u r good collection.
@ సుబ్బారెడ్డి గారూ
ఆయన చిత్రాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ! నాదేమీ లేదండీ అంతా అనూప్ గారిదే!
Hi there! This blog post could not be written much better!
Reading through this article reminds me of my previous roommate!
He continually kept talking about this. I'll send this article to him.
Fairly certain he'll have a great read. I appreciate you for sharing!
Feel free to visit my page ... dating online (http://bestdatingsitesnow.com)
Post a Comment