Tuesday, March 13, 2012

కస్తూరి


కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరి చందనం చ కలయమ్
కంఠేచ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో
విజయతే గోపాల చూడామణి

అంటూ చిన్నప్పుడు అందరూ నేర్చుకుని శ్రీ కృష్ణుడిని స్తుతించే ఉంటారు కదూ! ఆ సమయంలో మీకేం అనుమానం రాలేదా? ముందు నీకొచ్చిన సందేహం ఏంటి అంటారా? అక్కడికే వస్తున్నా! ఈ కస్తూరి అనేది తిలకం పేరా? లేక తిలకాన్నే కస్తూరి అంటారా? అదొక తిలకం బదులు వాడే ఆభరణమా? కస్తూరి అంటే ఏమిటి? అని. సరే ఇహ ఎక్కువగా సుత్తి కొట్టకుండా నేరుగా విషయంలోకి వచ్చేస్తున్నా.

పూర్వ కాలంలో మరియు పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది. వాటిల్లో దీనిని అలంకారానికి, సుగంధ పరిమళానికి, ఆరోగ్యానికి, హోమాలకి రక రకాలుగా వాడినట్లు చెప్పబడింది. మనకి తెలుసున్నంతవరకు లేదా విన్నంతవరకు దీని ప్రస్తావన ఎక్కువగా కృష్ణుని వద్దనే విన్నాం కాని ఇది చూడండి.

చారు చంపక వర్ణాభం హ్యేక వక్త్రం త్రిలోచనం ఈషద్ధాస్య ప్రసన్నాస్యం రత్న స్వర్ణాది భూషితం
మాలతీ మలయాయుక్తం సద్రత్న ముకుటోజ్జ్వలం సత్కంఠాభరణం చారు వలయాంగద భూషితం
వహ్నిశౌచేనాతులైన త్వతి సూక్షేణ చారుణా అమూల్య వస్త్ర యుగ్మేన విచిత్రేణాతి రాజితం
చందనాగరు కస్తూరి చారు కుంకుమ భూషితం రత్న దర్పణ హస్తం చ కజ్జలోజ్జ్వలలోచనం

అందమయిన సంపెంగల కాంతి వంటి మేని కాంతితో ప్రకాశించేవాడు, ఒక ముఖము కలవాడు, మూడు కన్నులు కలవాడు, చిరునవ్వుతో కూడిన ప్రసన్నమైన ముఖము కలవాడు, బంగారు రత్నాభరణములతో అలంకరింపబడినవాడు, మల్లె మాలలను ధరించినవాడు, గొప్పవైన రత్నములతో పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు, మంచి కంఠహారమును ధరించినవాడు, సుందరమైన కంకణములు, అంగదములతో అలంకరింపబడినవాడు, అగ్నివలే ప్రకాశించే సాటిలేని సన్నని నూలుతో వడకిన రంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు, చందనము, అగరు, కస్తూరి, మంచి కుంకుమలతో అలంకరింపబడినవాడు, రత్నపుటద్దమును చేతియందు కలవాడు, కాటుకతో ఒప్పారు కన్నులు కలవాడు అయినటువంటి ఆ శివుడు కళ్యాణార్థం సర్వావిధ అలంకృతుడై తరలి వెళ్ళాడు అని శివపురాణంలో చెప్పబడింది. ఎంత అద్భుతమయిన వర్ణనో కదా! కేవలం కృష్ణుడి అలంకరణలో వినే కస్తూరిని శివుడు కూడా వాడటం జరిగిందని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది!

కస్తూరి తిలక తిద్దువె కాలిగె గెజ్జె కట్టువె
కాశీ పీతాంబర కొడువె కణ్ణిగె కాడిగె హచ్చువె

అంటూ ఆ విష్ణువుని భజనలో కూడా కస్తూరిదే ప్రథమ స్థానం. కస్తూరిని శని, రాహు గ్రహాలకు; రోహిణి, మూల, భరణి నక్షత్రాలకు హోమద్రవ్యము క్రింద వాడవలెనని శ్రీ విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. అలానే మణిద్వీపంలో కస్తూరి మృగాలు సంచరిస్తూ నిత్యం పరిమళాలను వెదచల్లుతూ ఉంటాయి అని మణిద్వీప వర్ణన (దేవీ భాగవతం) లో కూడా ఉంది.

కస్తూరి జింక
ఇన్నిటిలో ముఖ్య పాత్రను పోషించే కస్తూరి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వాస్తవానికి కస్తూరి అనేది అత్యంత ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి. కస్తూరికిలో వెల దాదాపు రెండున్నర లక్షల రూపాయలు! పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకూ దీనిని సహజసిద్ధంగా తయారు చేసినా దానికున్న ఎన్నో ఉపయోగాల వలన కృత్రిమంగా కూడా దీనిని తయారుచేస్తున్నారు.

కస్తూరికి ఆంగ్ల నామమయిన మస్క్ సంస్కృత పదమయిన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది. ఇది మగ కస్తూరి జింక (Moschus moschiferus L.) యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే పరిమళము. కస్తూరిని పొందటం కోసం ఈ గ్రంధి మొత్తాన్ని జింక శరీరం నుండి వేరు చేస్తారు. బాగా పెరిగిన, ఆరోగ్యకరమయిన గ్రంధిలో నలభై శాతం కస్తూరి ఉంటుంది. ఈ గ్రంధిని బాగా ఎండపెట్టడం వలన అందులో దాగి ఉన్న ముదురు ఎరుపు రంగులో ఉండే కస్తూరి నలుపు రంగులోకి మారుతుంది. ఇలా మారినప్పుడు అది వాడకానికి సిద్ధమయినదని అర్థం. ఇంతకీ ఈ మగ జింక కస్తూరిని ఆడ జింకను ఆకర్షించుకోవడానికి తయారుచేసుకుంటుందిట. ప్రత్యుత్పత్తి కాలంలో (మే - జూన్) ఎక్కువ శాతం కస్తూరిని తరాయుచేస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు.

కస్తూరిని తయారుచేసే గ్రంధి
దీనిని టిబెట్, చైనా, తదితర ప్రాంతాలలో ఎక్కువగా తయారుచేస్తారు. కృత్రిమంగా వీటిని పెద్ద మోతాదులో తయారుచేస్తున్నారు. ఆ ఇతర సంబంధిత పరిమళాలను కూడా కస్తూరి (ధవళ కస్తూరి) అనే పిలుస్తారు. అయితే ఇలాంటివి చాలా మటుకు అసలైన కస్తూరి కంటే భిన్నమైన రసాయన పదార్ధాలనుండి ఉత్పన్నమై ఉండవచ్చు కూడా. కస్తూరి జింక కాకుండా ఇతర జంతువుల యొక్క గ్రంధి స్రావకాలు, కస్తూరిని పోలిన పరిమళాన్ని వెదజల్లే అనేక మొక్కల యొక్క స్రావకాలు, ఈ వాసన కలిగిన కృత్తిమ పదార్ధాలను కూడా కస్తూరి అనే భావిస్తున్నారు జనాలు. కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు ముస్కోన్. దీనికి ఉన్న ప్రాముఖ్యమయిన పరిమళాన్ని గుర్తించిన యూరోపియన్లు దానిని perfumes తయారీలో వాడుతారుట. అదే కాక దానికున్న పరిమళం వలన అగరుబత్తులు, సాంబ్రాణి అన్నిటికీ కస్తూరి పేరు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అందులో ఎంతవరకు నిజమయిన జింక కస్తూరిని కలుపుతారో తెలియదు! సారంగ నాభి, కురంగ నాభి, జింక పొక్కిలి, ఏణమదము, ఇట్టి గోరోజనము, సహస్ర వేధి, లత, మోదిని, మొదలయినవి కస్తూరి రకములు.



ఆయుర్వేదములో కూడా కస్తూరి ప్రముఖ పాత్రని పోషిస్తోంది. ఎలా అంటే:
౧. చాలా కాలంగా కస్తూరి మాత్రలను తమలపాకు రసంలో నూరి తేనెలో కలిపి జలుబుకి, దగ్గుకి ఔషధంగా వాడుతున్నారు.
౨. గర్భిణీ స్త్రీలకు కస్తూరిని ఎక్కువగా నొప్పులకి వాడతారు. వాతపు నొప్పులయితే తగ్గుతాయి, అదే పురిటి నొప్పులయితే కాన్పు జరుగుతుంది అని కస్తూరి రసం పట్టించేవారు.
౩. వాతానికి అద్భుతమయిన మందు కస్తూరి. అందుకనే దీనిని తాంబూలంలో కలిపి తింటారు.
౪. అజీర్ణం, కఫం, అతిసారం, అధికమయిన చెమట, బాలింత ఒంటి నొప్పులు, వాంతులు మొదలయినవాటికి ఇది పెట్టింది పేరు. తేనెతో కాని అల్లం రసంతో కాని పరగడపున పట్టిస్తారు.
౫. మనిషి చనిపోయే ముందు శరీరం చల్లబడితే సారంగ నాభి కస్తూరిని పట్టిస్తే వేడి పుంజుకుని (మరి వాతాన్ని తగ్గించడానికి వాడతారు అంటేనే తెలుస్తోంది కదా చల్లదనాన్ని తగ్గించి వేడిని పెంచుతుంది అని!) మనిషి బ్రతుకుతాడని నమ్మిక.
౬. గుండె జబ్బులు, ఉబ్బసం, ఆస్తమా, మూర్థ, నరాల బలహీనత, ధనుర్వాతం, పక్షవాతం, మొదలయినవాటికి ఇది చక్కని మందు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ముఖ్యమయినవి మాత్రం ఇక్కడ పెట్టాను. కస్తూరి శ్రేష్టతకి మారు పేరు అంటారు. శ్రేష్టమయిన పసుపుని కస్తూరి పసుపు అనీ శ్రేష్టమయిన కుంకుమని కస్తూరి కుంకుమ అనీ అంటారు.

కస్తూరిని మన కవులు మాత్రం వదులుతారా? ముఖ్యంగా వేమన శతకంలో మనకి ఈ క్రింది పద్యాలలో తారసపడుతుంది.
మృగ మదంబు చూడ మీ(ద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!
కస్తూరి చూడటానికి నల్లగా ఉన్నా ఏ విధముగా ఐతే మంచి వాసన వెదజల్లుతుందో అదే విధముగా గొప్పవారు బయటకి ఆడంబరము లేకపోయినా గొప్ప శక్తి కలవారై ఉండును. దేనినీ రంగు లేదా హంగు చూసి మోసపోకూడదు అన్నది దీని నీతి.

కన్నె దాని మేను కస్తూరి వాసన
ముసలిదాని మేను ముఱికి కంపు
వయసుదాని మేను వర్ణింప శక్యమా
విశ్వదాభిరామ వినురవేమ!

గార్ధబంబెరుగునా కస్తూరి వాసన
మిక్కుటంగ చెడుగు మేసుగాక
నుత్తమోత్తములకు వత్తురా వేశ్యలు
విశ్వదాభిరామ వినురవేమ!

వీటిని నేను ప్రత్యేకంగా వివరించ వలసిన అవసరము లేదనుకుంటాను. అంత సరళమయిన భాష వాడారు. అందులోని అంతరార్థం మీ ఊహకే వదిలేస్తున్నాను!


అవండీ నాకు తెలిసిన కస్తూరి కబుర్లు! ఇంత చదివీ చదివీ మీ కళ్ళు అలసిపోయయా? ఐతే వాటికి కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా శ్రీ రంగ రంగా నినుబాసి ఎట్లనే మరచుందురా అని పాడుతూ అలసిన కళ్ళకి విశ్రాంతి ఇవ్వండి.

51 comments:

Anonymous said...

చాలా బాగా రాశారు. నేను నిరంతరం ఎన్నో కొత్త విషయలు చదువుతూంటాను , కాని కస్తూరి గురించి ఎవ్వరు, ఇంత విపులంగా ఎక్కడా రాసినట్టు గురులేదు. మీరు రాసినది చదువుతూ, కొత్త విషయాలు తెలుసుకొంట్టూ చాలా ఆశ్చర్యపోయాను. చాలా థాంక్స్.

Nagesh G said...

ఎప్పటిలాగే కస్తూరి గురుంచి కూడా చాల వివరాలు తెలియజేసారు.. కస్తూరి మీద ఇన్ని పద్యాలు ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసింది.. ధన్యవాదములు రసజ్ఞ గారు..

Anonymous said...

రసజ్ఞ గారూ,
మీరు రాసినదానికి మరికాస్త జోడింపు. కన్నడ భాషను కస్తూరితో పోల్చుతారు. అలాగే గిరిజనులు పవిత్రంగా భావించే ఇప్పపూలు కస్తూరిని పోలిన వాసనను కలిగి ఉంటాయి.

వెంకట రాజారావు . లక్కాకుల said...

పాఠకుల మీద కస్తూరి పరిమళించె
సార్థకము మీప్రయత్నమ్ము సా రసఙ్ఞ !
వరలు మీబ్లాగు నామ మన్వర్థ మగుచు
“ నవరసఙ్ఞభరిత” మయి నందు వలన

బ్లాగు: సుజన-సృజన

Tejaswi said...

చ‌క్కటి వ్యాసం రాశారు. శుభాభినంద‌న‌లు.

వి రఘు వర్ధన్ రావు said...

రసజ్ఞ గారు. మొత్తానికి మా నిరిక్షణ పలించి,............ కస్తురి సౌరబం వెదజల్లింది...... మమ్మల్ని సువసన లొ ముంచేసింధి

జ్యోతిర్మయి said...

రసజ్ఞా కస్తూరి పేరు వినడమే..ఇవాళే తెలుకున్నాను దాని పుట్టుపూర్వోత్తరాలు..ధన్యవాదాలు.

వనజ తాతినేని/VanajaTatineni said...

కస్తూరి మృగం తెలుసు. కానీ పధ్యాలు.వివరణ చాలా బాగున్నాయి. యే విషయం పై వ్రాసినా సూపరో సూపర్! అభినందనలు.

Subramanya Shastry said...

బహు చక్కని టపా! పెద్దగా పట్టించుకోని విషయాన్ని - పరిశోధించి వివరాలు, ముఖ్యంగా చిత్రాలతో కూర్చి పంచుకున్నందుకు ధన్యవాదాలు.

సమయమూ, ఆసక్తీ ఉంటే, పునుగును కూడా ఒక పట్టు పడుదురు.

సీత said...

రసజ్ఞ గారు...
బాగ చేప్పారు కస్తురి విలువ.
ఇంట్లో పెంచుకునే వారు ఇవన్నీ పాత రొజుల్లొ.
అందుకే అప్పట్లొ ఏ వ్యాధులు ఉండేవి కావు.

Unknown said...

హ హా ... హెండింగ్ చూడగనే గుర్తుకొచిన "కస్తూరి రంగ రంగా..." ప్రస్థావన లేదేంటా అనుకున్నాం. చివరన గుర్తుచేస్తూ హాయిగా ముగించారు...
చాలా శోధించి "కస్తూరి" మీద ఎన్నో విషయాలు విపులంగా రాశారు.
బాగుంది, మీరు సంస్కృతం నేర్చుకుంటున్నారా/నేర్చేసుకున్నారా? ఇంత విపులంగా అర్ధం రాయగలుగుతున్నారు...

Murthy said...

Very informative and enlightening. Thank you for the post.
With Regards.
DSR Murthy.

Kalyan said...

@రసజ్ఞ గారు
అబ్భురపరిచారు కదండి ...

వదులు కస్తూరి పరిమళంబు
కలదు రసజ్ఞ టపాలో నవరసంబు
వాటి అర్థము వేరైనా భావమొక్కటే
బాగు బాగు బ్లాగు బంగారు బ్లాగు !!

అయినా వింతగా చూడకండి ఇంతవరకు ఆ కస్తూరి వాసన కూడా చూడలేదు :( ... ఇప్పుడైతే మెండుగా వస్తోంది ముక్కుకైతే తగల్లేదు కాని ఊహకైతే బాగా అందుతోంది. అంతటి శ్రేష్టమైన కస్తూరిని మాకు అందించినందుకు ధన్యవాదాలు :) నాకో సందేహం అది జంతువునుండి తీసి వాడుట తప్పు కాదా ? ( ఏదో నేను ధర్మాత్ముడ్ని అనుకునేరు ఏదో సందేహం అంతే )

జలతారు వెన్నెల said...

very informative. నాకు తెలియని విషయాలు తెలుసుకున్నాను

శ్యామలీయం said...

కస్తూరి అనగానే నాకు గుర్తుకు వచ్చే పద్యాలలో కొన్నిః
కం. మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపు తెలుపు నొక్క మారుత మెలసెన్
................. (మను చరిత్రెం ౨-౨౪)

శా. అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షాదానము చేయరా సుకవిరాట్ బృందారకశ్రేణికిన్
దక్షారామపురీవిహారవరగంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయకుంభి కుంభములపై వాసించు తద్వాసనల్
.................... (శ్రీనాధుని చాటువు)

శ్రీనాధుడే మరో చాటు సీసపద్యంలో
కాశికావిశ్వేశు గలిసె వీరారెడ్డి హేమపాత్రాన్న మెవ్వాని పంక్తి గలదు
అంటూ
కస్తూరి కేరాజు ప్రస్తుతింతు
అని కూడా అంటాడు.

అన్నట్లు మీరు వ్యాసం చివరలో 'కస్తూరి రంగ రంగా ...' పాటను స్మరించారు. అది వ్రాసిన కవిపేరు 'కస్తూరి రంగకవి'. టిప్పుసుల్తానుకు అతడు దుబాసీగా ఉండేవాడని గుర్తు.

Anonymous said...

బాగా వ్రాశారు. చాలా informative గా వుంది.
ఇక్కడ ఒక మాట. గోపాలుని స్తుతిలో 'నాసాగ్రే నవ మౌక్తికం' అనే సంగతి ప్రసిధ్ధమై వున్నా, చిత్రకారుల చిత్రాలలోగానీ, శిల్పాలలోగానీ గోపాలుడు ముక్కుకు బేసరితో కనుపించడం నేనయితే చూడలేదు ఇంతవరకూ! ఒకవేళ వున్నా చాలా అరుదు అని చెప్పుకోవాలి. ఈ అలంకరణ ఎందుకు వదిలివేయ బడిందో తెలీదు. గోపాలుర వేషం ఒకటి రెండు సినిమాలలో మాత్రం ముక్కుకు బేసరి (రింగు) తో వుండడం చూశాను.

ఈ పోస్టులో వేమనవిగా చూపిన పద్యాలు, 'కన్నె దాని మేను' అన్నదీ, ఆ తరువాతిదీ, వేమన వ్రాసినవిగా నేను అనుకోలేను! ఇవి తరువాతి కాలంలో ప్రక్షిప్తాలనిపిస్తాయి. ఇలాంటి message ఇవ్వడానికి (ఇలాంటి సంగతులు చెప్పడానికి) వేమన పద్యాలు చెప్పలేదన్నది ఇందుకు నేను అనుకునే కారణం! నా ఈ అభిప్రాయం తప్పుగూడా కావచ్చును!

ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ శ్రీనివాస్ గారూ
నేను కూడా అక్కడా ఇక్కడా విని, చదివి తెలుసుకున్నవే అండీ! చదివి ఆశ్చర్యపోయినందుకు ధన్యవాదాలు!

@ నాగేశ్వరరావు గారూ
ఉన్నవాటిల్లో నాకు తెలిసినవి కొన్ని ఇక్కడ పెట్టాను. శ్యామలీయం గారు ఇంకా చక్కని పద్యాలని అందించారు ఈ టపాకి స్పందనగా చూడండి! చదివి స్పందించినందుకు మీకు కూడా ధన్యవాదాలండీ!

@ అరుణ్ గారూ
అవును కదా! కన్నడ భాషతో పోలుస్తారని తెలుసు కాని ఇక్కడ పెట్టడం మరిచా థాంక్యూ! చాలా వృక్ష సంబంధిత భాగాలు, రసాయనాలు, స్రావకాలు, కస్తూరిని పోలి ఉంటాయి వాటి నుండే ధవళ కస్తూరిని తయారు చేస్తారు. వాటిల్లో ఈ ఇప్పపూలు ఒకటని తెలుసు కాని గిరిజనులు వాటిని పవిత్రంగా భావిస్తారని తెలియదు నాకు. ఎందుకో మీకు తెలిస్తే చెప్పగలరా? ధన్యవాదాలు!

@ వెంకట రాజారావు. లక్కాకుల గారూ
హృద్యమయిన పద్య రూపంలో మీ అభినందనలకి అభివాదములు!

రసజ్ఞ said...

@ తేజస్వి గారూ
మీ అభినందనలకి కృతజ్ఞతలు!

@ రఘు గారూ
హహహ బాగుందండీ మీ వ్యాఖ్య! సువాసనని ఆస్వాదించినందుకు ధన్యవాదాలు!

@ జ్యోతిర్మయి గారూ
చదివి స్పందించిన మీకు కూడా నెనర్లు!

@ వనజ గారూ
మీ అభినందనల్లో తడిసిపోయా! ధన్యవాదాలండీ!

రసజ్ఞ said...

@ తెలుగుభావాలు గారూ
చదివి ఇంత ప్రోత్సహకరమయిన స్పందనకు కృతజ్ఞతలు! ఆసక్తి ఉంది కానీ సమయాన్ని బట్టీ తప్పకుండా పెడతాను ధన్యవాదాలండీ!

@ సీత గారూ
ధన్యవాదాలండీ! "ఇంట్లో పెంచుకునే వారు ఇవన్నీ పాత రొజుల్లొ" అన్నారు అంటే కస్తూరి మృగాన్ని పెంచేవారా? లేదా కస్తూరి పోలిన వాసనను వెదజల్లే మొక్కలని పెంచేవారా? కొంచెం వివరణ ఇస్తారా? ఎందుకంటే కస్తూరి మృగం హిమాలయాల్లో ఎక్కువగా పెరుగుతుందని విన్నాను.

@ చిన్ని ఆశ గారూ
హమ్మయ్యా మీ expectation చేరుకోగలిగాను! అది జోల పాట కదా ముందే పాడేస్తే టపా పూర్తిగా చదవకుండానే పడుకుంటారేమో అని ఆఖరికి పెట్టాను ధన్యవాదాలు! నేను సంస్కృతమా నేర్చుకున్నా అండి కొంత కాలం!

@ మూర్తి గారూ
చదివినందుకు మీకు కూడా ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ కళ్యాణ్ గారూ
హహహ బాగుంది మీ పద్యం! నాకో సందేహం అది జంతువునుండి తీసి వాడుట తప్పు కాదా? అన్నారు అలా చూసుకుంటే మనం చాలా వాడుతున్నాం కదండీ! పైగా ఇలా కస్తూరిని తీయాలంటే ఆ గ్రంధిని వేరు చెయ్యాలి అంటే దానిని చంపెయ్యాలి ఇలా చేసి చేసి వాటి జాతి అంతరించిపోతోంది. అందువలననే వాటిని కాపాడుకోవటానికి కృత్రిమంగా తయారు చేయటం మొదలుపెట్టారు! ఏదయినా పుత్తడి పుత్తడే ఇత్తడి ఇత్తడే! ధన్యవాదాలు!

@ జలతారు వెన్నెల గారూ
ధన్యవాదాలండీ చదివి స్పందించినందుకు!

@ కంద పద్యాల కోవిదా, జిలేబీ శతక కర్త శ్యామలీయం గారూ
మనుచరిత్రలో ఈ పద్యం నాకు మొదటి రెండు పాదాలే గుర్తున్నాయి తరువాత ఎంత గింజుకున్నా గుర్తురాక సగం సగం పెట్టడం ఎందుకు అని పెట్టలేదు! ధన్యవాదాలండీ దానిని ఇక్కడ పెట్టినందుకు! ఇహ ఈ శ్రీనాధుని చాటువులు నాకు తెలియవు. కస్తూరితో ముడిపడిన మరిన్ని విషయాలు పంచినందుకు కృతజ్ఞతలు!

@ వెంకట్ గారూ
ధన్యవాదాలండీ! మీరు ప్రతీ విషయాన్నీ చాలా నిశితంగా పరిశీలిస్తారు కదూ! నిజమే చాలా తక్కువగా చూస్తాం కృష్ణుని ముక్కుకి బేసరిని. ఇవి వేమన గారి పద్యాలే అని నేను రెండు చోట్ల చదివాను అది గుర్తుండే ఇక్కడ పెట్టాను. ఐతే మనకి బాహ్యంగా కనిపించేది కాక అందులో ఏమయినా అంతరార్థాలు ఉంది ఉండవచ్చునేమో మహానుభావులు ఏదీ వ్రాసినా ఏదో ఒక అంతరార్థం ఉంటుంది అని నా నమ్మకం. ఈ రెండిట్లో కూడా ఆలోచిస్తే రెండవ దానిలో కాస్త అంతరార్థం తోస్తోంది నాకు కానీ మొదటిది నా బుర్రకి అంతు చిక్కటం లేదు!

శ్యామలీయం said...

రసజ్ఞగారూ, శ్రీనాధుని చాటువును క్లుప్తంగా చెప్పాను నిన్న. పూర్తిగా ఇస్తే బాగుండెదేమో!
సీ. కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి
.....రత్నాంబరంబు లే రాయడిచ్చు
కైలాసగిరి బండె మైలారువిభుడేగె
.....దినవెచ్చ మేరాజు దీర్పగలడు
రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు
.....కస్తూరి కేరాజు ప్రస్తుతింతు,
స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
.....పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు
తే.గీ. భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె
కలియుగంబున నిక నుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.

Anonymous said...

"ఇంటి పేరు కస్తూరి వారు , ఇంట్లో గబ్బిలాల కంపు " మాటేమిటి?!

మయూఖ said...

very informative post.

రాజ్యలక్ష్మి.N said...

"కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం"

ఈ స్తోత్రం నాకు చాలా ఇష్టం..
రసజ్ఞ గారూ కస్తూరి అంటే తెలుసు గానీ ఇన్ని విషయాలు మాత్రం ఇప్పుడే తెలుసుకున్నాను.

Kalyan said...

@రసజ్ఞ గారు ఇత్తడి ఇత్తడే పుత్తడి పుత్తడే బాగా చెప్పారు !

భారతి said...

రసజ్ఞ!
అందరినీ అలరిస్తూ, జ్ఞానవికాసంను కల్గిస్తూ, అద్భుతంగ అత్యంత వివరంగా అందరూ తెలుసుకోదగిన అంశములను అవిష్కరిస్తున్నందుకు ధన్యవాదములు.
ఇక, కొద్ది సంవత్సరాలు క్రితం ఓ పుస్తకంలో - కన్నె దాని మేను కస్తురివాసన....... మొదలగు పద్యంలు చదివినప్పుడు స్త్రీని నిరసిస్తూ యోగివేమన చెప్పడమా? బహుశ ఇవి వేమన పద్యాలు కాకపోవచ్చని భావించాను. కానీ, ఆ తర్వాత వేమనపద్యరత్నాలు ఓ గ్రంధాలయంలో చదివాను. అందులో ఈ పద్యాలున్నాయి. కొన్ని వేమన పద్యాలు ఆనాటి సామాజిక పరిస్థితులను తెలియజెప్పుతాయి. స్త్రీపై వ్యామోహంతో సమాజపతనం జరుగుతుందని గ్రహించి వ్యామోహం విడిచిపెట్టాలని మోహావేశంతో ఉన్న పురుషులను సరైనదారిలో పెట్టడానికి ఇటువంటిపద్యాలు చెప్పారనిపిస్తుంది. ఆ పద్యంకు అర్ధం - కన్నెవయస్సులో ఉన్న స్త్రీ శరీరం కస్తూరివాసన వేస్తుందని, ముసలిదాని శరీరం మురికివాసన వేస్తుందని, వయస్సులో ఉన్న స్త్రీ శరీరం వర్ణింపశక్యంకాదని భాహ్యభావం కాగా, కాలగమనంలో మారిపోయే ఇటువంటి మోహమాయలోపడక మేల్కొమనే హెచ్చరిక అంతరార్ధమై ఉన్నదని నా భావన. స్త్రీలను నిరసిస్తూ కొన్ని పద్యాలు చెప్పినను, అవి దారిమళ్ళిన స్త్రీల గురించే గానీ ఉత్తమ స్త్రీలను వేమన ఎంతగానో గౌరవించేవారు.
గుణవతిగల గృహము గోమునొందించును
చీకటింటదివ్వె చెలరునట్లు
దేబెయున్న కొంప దివ్వెమల్చినయట్టు
విశ్వదాభిరామ వినురవేమ !
భావం: చీకటింట్లో దీపం వెలిగినట్లుగా "గుణవతి" ఉన్న ఇల్లు ఆనందాన్ని కల్గిస్తుంది. చెడు స్త్రీ ఉన్నట్లయితే ఆ ఇల్లు దీపాలు లేని కొంపగా ఉంటుంది.
ఏది ఏమైనా ఈరోజు ఇలా మహాయోగి వేమన పద్యాలు ఇలా స్మరించుకునే భాగ్యం కల్పించిన నీకు కృతజ్ఞతలు రసజ్ఞ.

సుభ/subha said...

అస్సలు తెలియని విషయం రసగుల్లా.. ధన్యవాదాలు మీకు తెలియజెప్పినందుకు.

రాజ్ కుమార్ said...

కన్నడ కస్తూరీ,కర్ణాటక కల్ప్రవృక్ష అని వాడెయ్యటమే గానీ, అదేమిటో తెలీదండీ ఇప్పటివరకూ..
సెంట్ లాంటిదేమో అనుకున్న్నా ఇప్పటివరకూ..ః)

మీరు ఏ విషయం మీద రాసినా, విత్తనానికి ముందు స్టేజ్ నుండీ మహావృక్షం స్టేజ్ వరకూ ఏ ఒక్కటీ వదల కుండా రాసేస్తారండీ.
చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది పోస్ట్. రియల్లీ గ్రేట్.

అన్నట్టూ..మీరు ఇన్ని పురాణాలు చదివేశారా?? సూపరండీ అసలూ.. ;) ;)

శ్యామలీయం said...

"విజ్ఞానాన్ని అందించిన స్వామీ ప్రణవానంద" అని వనం జ్వాలా నరసింహారావు గారు తమ Jwala's Musings బ్లాగ్ లో వ్రాసారు. (http://jwalasmusings.blogspot.in/2012/03/blog-post_15.html) అందులో శ్రీప్రణవానందగారు కస్తూరి మృగంపై చేసిన పరిశోధన చెప్పుకోదగింది అని వ్రాసారు. ఈ వ్యాసం చాలా బాగుంది. శ్రీప్రణవానందగారిగురించి మన తెలుగువాళ్ళం తప్పక తెలుసుకోవాలి - ప్రాతఃస్మరణీయుడాయన.

Anonymous said...

రసజ్ఞ గారు... గిరిజనులు ఎందుకు పవిత్రంగా భావిస్తారంటే కచ్చింతంగా చెప్పలేను కానీ దానివల్ల ఉపయోగాలు అనేకం. గిరిజనులు ఇప్పసారా, కలప, సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు ఇలా అనేక ప్రయోజనాలు ఇప్పచెట్టు నుండి పొందుతారు. బహుశా దానివల్ల పొందిన మేలుకు కృతజ్ఞతగా అలా భావిస్తుండవచ్చని అనుకుంటున్నాను.

రసజ్ఞ said...

@ శ్యామలీయం గారూ
పూర్తి పద్యం ఇచ్చినందుకు, కస్తూరి గురించి మరి కొంత సమాచారాన్ని తెలియపరచినందుకు కృతజ్ఞతలు! అసలీ ప్రణవానంద గారి గురించి ఎప్పుడూ వినలేదు ఎన్నో ఆసక్తికరమయిన విషయాలు తెలిసాయి మీరిచ్చిన లంకె ద్వారా! ధన్యవాదాలండీ!

@ dr గారూ
పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పడానికి మీరు చెప్పిన సామెతని కూడా వాడతారు! ఐతే ఈ టపాలో చెప్పినట్టు కస్తూరి శ్రేష్టతకి మారు పేరే కాక ఆ ఇంటి పేరు కలవారు కూడా అంత సంప్రదాయ బద్ధంగా ఉంటారు అని అంటారు! మీరు చెప్పిన సామెత వలన వేరొకరిని వేలెత్తి చూపటం ఇష్టం లేక దానిని ప్రస్తావించలేదు! ధన్యవాదాలు!

@ రమణారెడ్డి గారూ
మీ స్పందనకి ధన్యవాదాలండీ!

@ రాజి గారూ
కదా! నాకు కూడా ఎందుకంటే మొట్టమొదట నేర్చుకున్న పద్యం! మీకు సేం పించ్ ;) ధన్యవాదాలండీ!

రసజ్ఞ said...

@ భారతి గారూ
చదివి ప్రోత్సహిస్తూ మున్ముందుకి నడిపే మీకు కూడా ధన్యవాదాలు! ఈ పద్యం అంతరార్థం ఏమయ్యుంటుందా అని ఎంతో ఆలోచించాను! తేలికయిన మాటల్లో జీవిత సారం నింపగలగడమే ఆయన ప్రత్యేకత! మీరు చెప్పినది చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది! మరొక చక్కని వేమన పద్యం ఇచ్చారు కృతజ్ఞతలు!

@ సుభా
పోనిలెండి ఇప్పుడు తెలిసిందిగా! చదివి కామెంటినందుకు మీకు కూడా!

@ రాజ్ కుమార్ గారూ
హహహ! మీ వ్యాఖ్యలు కూడా మీ టపా అంత బాగుంటాయెందుకో? మీరు ఇంచుమించు సరిగ్గానే అనుకున్నారుగా! ఫరవాలేదులెండి ;)
హమ్మో అవన్నీ చదివి తెలుసుకుంటే ఇహ నేను పాఠాలు చదువుకోవక్కర్లేదు! ఎక్కువ శాతం శ్రుత పాండిత్యమే కొంత చదివాను! ధన్యవాదాలండీ!

@ అరుణ్ గారూ
చూస్తే మీరు చెప్పినది కూడా ఒక పాయింటే అనిపిస్తోంది! ఇవి కాకుండా వేరే ఏమయినా కూడా ఉండి ఉండవచ్చునేమో! విషయం తెలిపినందుకు థాంక్స్!

Anonymous said...

కస్తూరి సువాసనల వెనుక ఇంత విషాదమైన కంపు వుందా! కస్తూరి తిలకం లలాట ఫలకే వింటే "ఏటీ జన్మంబిదిరా ఓ కృష్ణా .." అనిపిస్తుంది.

రసజ్ఞ said...

@ SNKR గారూ
హహహ! ఇంత కంపుని దాటింది కనుకనే సువాసనని వెదజల్లుతోందేమో!!! మీ స్పందనకి ధన్యవాదాలండీ!

రవిశేఖర్ హృ(మ)ది లో said...

ఇంతకు ముందు మీ బ్లాగు చూశాను .అప్పుడు సమయం లేదు .తీరిగ్గా చూడాల్సిన బ్లాగు మీది.అసలు అంత అన్వేషణ,అంత సాధికారత ఒక విషయం మీద రావాలంటే దానికి మీరెంత సమయం కేటాయిస్తారో కదా!నాకయితే ఇవన్నీ కొత్తవిషయాలు .మంచి బ్లాగు

రసజ్ఞ said...

@ రవిశేఖర్ గారూ
అవునండీ! హడావిడి లేకుండా తీరికగా ఉన్నప్పుడే చూడండి. నా బ్లాగ్ గురించి మీరిచ్చిన కాంప్లిమెంట్ కి చాలా చాలా థాంక్స్!

Rams said...

NICE POST రసజ్ఞ garu...alane pungu pilli goorchi telupa galaru

రసజ్ఞ said...

@ Rams గారూ
తప్పకుండా చెప్తానండీ! ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ chicha.ఇన్ గారూ
చాలా థాంక్స్ అండీ!

ramki said...

నైస్ ఆర్టికల్.

రసజ్ఞ said...

@ ramki గారూ
ఓపికగా కూర్చుని అన్నీ చదివారా?? మీకు నచ్చినందుకు చాలా థాంక్స్ అండీ!

Vajra said...

Nijam cheppalante maa inti peru Kasturi ..Naku kasturi ante Sugandha dravyam jinka nundi velavadutundi ani telsu.Kani maaku telvanivi...meeku telsinavi..kasturi gurinchi vipulam ga chepinnanduku meeku dhanyavadhamulu. Edi emina eey tapa rasina andulo maaku kottha kottha vishayalu telustayi ante dhaniki sati,meti meere....I feel privileged of having kasturi as last name thank you Rasgna garu inkosari...:) :)

రసజ్ఞ said...

@ వజ్ర గారూ
ఈ టపా వ్రాసినప్పుడు కస్తూరి వారు ఒకళ్లన్నా చదివితే బాగుండును అనుకున్నా! మొత్తానికి మీరు చదివి నా ముచ్చట తీర్చారు :) మీ మెచ్చుకోలుతో కూడిన స్పందనకు ధన్యవాదాలు!

Nuvve said...

@rasagna garu...English udruthi lo kottukupothunna bhashallo (naa tenelolikey)telugu kuda kalisipothundani balanga nammi dani chuttu kota kattanu..mee blog ..vatiki vasthunna spandananu chusthuntey..mellaga aa kotaku beetalu varuthunnattu anipisthundi..(nenu telugu blogs ki koncehm kotha..)..spandinchina varilo 30 paibadi varey ekkuvaga unattu gamanincha..prasthutha yuvatharam(nenu okadini) telugu nu marachipothunnanduku chinthisthunna

రసజ్ఞ said...

@ Raja Prathigadapa గారూ
ఎన్ని నేర్చుకున్నా మాతృభాష సాటి ఏది వస్తుంది చెప్పండి? అయినా వయసుకీ, భాషకీ సంబంధం లేదనే నా అభిప్రాయం. చింత వలదు ప్రయత్నించండి తప్పకుండా అనర్గళంగా మాట్లాడేస్తారు. మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదాలు!

Anonymous said...

Hmm is anyone else having problems with the pictures on this blog loading?
I'm trying to find out if its a problem on my end or if it's the blog.
Any suggestions would be greatly appreciated.

Also visit my blog: buy viagra online

Anonymous said...

Yes! Finally someone writes about a.

My web site :: cialis 5mg prescription

jhansi said...

very useful mam. thanks for posting mam.

Unknown said...

Chala baga rasaru chala Tnq sir

Mohan said...

My long waited doubt clarified. However if it is collected from male kasthuri జింకలు continuously what about their future. How can they attract female జింకలు. 🙏😊

Mohan said...

రసజ్ఞత భరితం మీ వివరణ 😊