Monday, February 20, 2012

భజన పాట




ఓం కొండదేవరా ..... కోటి వందనాలురా
ఓం జంగమదేవరా ..... నీ భక్తుల బ్రోవరా

చల్లని హిమగిరి పైన కూర్చుని ఉన్నావా
చెల్లని మా బ్రతుకులను చూస్తూ ఉన్నావా
 మాపై ఇంత నిర్దయ ఏలనయ్యా
ఇకనైనా మము కావగ రావయ్యా
మా హృదయాలకు ఇంత వేదనెందుకయ్యా 
ఈ లోకంలో నీకన్నా మాకెవరయ్యా 
మనసా వాచా కర్మణా నిను నమ్మితి కదయ్యా

అందని శిఖరాలపై నిండుగ ఉన్నావా
నీ భక్తుల కాచుట దండుగ అనుకున్నావా
చల్లనయ్యా మా పైన జాలి చూపవయ్యా
చల్లని నీ చూపులతో మమ్ము సాకవయ్యా
నీ చరణాలను కలనైనా విడువనంటిని కదయ్యా
కరుణించి మా కలతలన్నిటినీ బాపవయ్యా
కర్త కర్మ క్రియ నీవేనని నమ్మితి కదయ్యా  

13 comments:

రాజ్యలక్ష్మి.N said...

రసజ్ఞ గారూ..
"భజన పాట" బాగుందండీ!
ఇంత చక్కగా ప్రార్ధించాక ఆ పరమేశ్వరుడు
మిమ్మల్ని కరుణించకుండా ఉంటాడా..

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా బాగుంది. భక్తుల కోసం సులభంగా కరుణించే.. ఆ మహా దేవుని కృపా కరుణా కటాక్షాలు తప్పక లభ్యమవుతాయి.

Kalyan said...

@రసజ్ఞ గారు
కచ్చితంగా ఆ శివుడు మీ చక్కని ఆలాపనను వింటాడు దానికి తగ్గ ఫలితం చేకూరుస్తాడు... మొదట మీకు శివరాత్రి శుభాకాంక్షలు ... :) మీ భజన తో పాటు నా అలాపనను వినమని కాస్త చెప్పండి శివుడికి

మూడు కనులవాడ మా మంచి శివుడా
వింటివా ఆ భక్తురాలి ఆలాపన
మన్నించి అందుకోరా అ చక్కని స్మరణ
తన బాటలోనే మేము మా మొరను ఆలకించుము

నిన్నే మా దేవుడని అనుకున్నాము
మంచు మనసునీదని మా విన్నపాలు విన్నవించుకుంటున్నాము
ముల్లోకాలను మమతలతో ముడివేసావు
ఆ బంధాలను అనుబంధాలుగా అల్లెసావు
వాటిని అర్థం చేసుకునే మార్గము చూపు
ఓ లయ కారకా మా హృదయాలయంలో కొలువుండ రావా

నీవొక నమ్మకమే కావచ్చు
నీకొక రూపం లేకపోవచ్చు
కాని శంకరుడంటే మంచివాడంటారు
కరిగిపోయే మనసు కలవాడంటారు
కోపమేమాత్రం వలదయ్య మాపై చూపు నీ దయ

నమ్మకం లేక కాదు కాని నరుడనయ్యాను
సందేహం కాదు కాని సామాన్యుడనయ్యాను
మన్నించి మా విన్నపాలు పంచుకో
మా మనసును ఓ జ్యోతివై మా హృదయాన్నే నీ ఆలయముగా చేసుకో

Anonymous said...

మా హృదయాలకు ఇంత వేదనెందుకయ్యా, మా కలతలన్నిటినీ బాపవయ్యా
మీకు ఏ వేదనలు, కలతలు ఉన్నాయండి? మంచి చదువులు చదివారు, ఉద్యోగం చేసుకొంట్టున్నారు. మీకు ఇంకా ఏమీ కావాలి? ఎప్పుడు వినలేదు ఈ పాటని, మీరే రాశారా?

సుభ /Subha said...

Nice one...

Anonymous said...

పరమానందం

thanooj said...

its unfortunate to see wasting u r talent and energy on god's.i'm sorry

Anonymous said...

Chaala bagundi andi !

siva said...

మీ భజన పాట కి చక్కని సంగీతం మిళితమై తె వినలనిపిస్తుదండి ...అప్పుడు అది సంగీతరసజ్ఞమయం అవుతుంది
చక్కని సాహిత్యం...ప్రసా...అన్నిబాగున్నాయి
రాంస్ క్రిష్ణ

Rams said...

మీ భజన పాట కి చక్కని సంగీతం మిళితమై తె వినలనిపిస్తుదండి ...అప్పుడు అది సంగీతరసజ్ఞమయం అవుతుంది
చక్కని సాహిత్యం...ప్రసా...అన్నిబాగున్నాయి
రాంస్ క్రిష్ణ

హనుమంత రావు said...

హృదయమారా పిలిస్తే మనలోపల్నించి ఓయ్ అంటూ పలుకుతాడు...
గుండె రాయయితే... రాళ్ళల్లో ఉండే కొండదేవరకు
మన రాతి గుండెలకన్నా చక్కటి బస యెక్కడ ?
ప్రేమారా పిలిస్తే ఆ మంచుకొండ దేమునికి
శీతల పవనాలను వీచే మంచుకొండకోసం ఎక్కడో వెతుకుతాడా ?

మీ కవితలో చక్కటి ఆర్తి ఉంది..
ఆర్తికి పలికే బోలా శంకరుడు మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తాడు

రసజ్ఞ said...

@రాజి గారూ

ధన్యవాదాలండీ! మీకు నచ్చినందుకు సంతోషం!


@వనజ గారూ

ధన్యవాదాలండీ! వాటి కన్నా విలువయినవి ఏమున్నాయి చెప్పండి!


@కళ్యాణ్ గారూ

ధన్యవాదాలు! చెప్పానండీ చాలా బాగుందిట మీ భక్తి పాట!


@ శ్రీనివాస్ గారూ

ఈ పాటని నేనే వ్రాసానండీ! నేను ఇంకా చదువుకుంటున్నాను తప్ప నాకింకా ఉద్యోగం లేదు కనుక వేదనలు, కలతలు ఉన్నాయనే చెప్పాలి! ధన్యవాదాలు!

@సుభా

థాంక్యూ

రసజ్ఞ said...

@ తాతగారూ

అదే కావలసినది! ధన్యవాదాలు!


@ తనూజ్ గారూ

మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!


@ శ్రేయ గారూ

చాలా థాంక్స్ అండీ!


@ శివ, రామ్స్ గారూ

మీకు ఇంతగా నచ్చినందుకు ధన్యవాదాలండీ! పరీక్షలు ఉండుట వలన ప్రస్తుతానికి సంగీతం అంటే కుదరదు అండీ! వీలున్నప్పుడు మీ కోరిక మేరకు తప్పక ప్రయత్నిస్తాను! ధన్యవాదాలు!


@ హనుమంత రావు గారూ

మీ మాటల్లో చక్కగా చెప్పారు! ధన్యవాదాలు మీ స్పందనకి, ఆశీస్సులకీ!