ఈ మధ్యన మా లాబులోనే కాకుండా ప్రతీ దాని మీదా ప్రయోగాలు చేయాలని చేతికి చాలా దురదగా ఉంది. అందుకే దురద తగ్గించు కోవడానికి పిల్స్ కన్నా పెన్ను, బిళ్ళల కన్నా బ్లాగు, ఇంజెక్షను కన్నా ఇంటర్నెట్టు, కషాయం కన్నా కీబోర్డు మంచివని ఈ నా యత్నం! అయినా మనకి పెద్దలు చెప్పనే చెప్పారు కదా! ఏమని అంటారా?
Past is an experience
Present is an experiment
Future is an expectation
So use your experience in your experiment to reach your expectations
అని. కనుక అదే దారిలో సాగిపోతూ.. ఇంతకముందు చదివిన వేమన, సుమతీ, భర్తృహరి శతకాలు experience అయితే, ప్రస్తుతం నేను వ్రాసినవి నా experiment అనమాట. ఇహ expectation ఏమిటి అంటారా? ఏముందండీ ఎప్పటికయినా నేను కూడా గణ విభజనలతో చక్కగా ఛందోబద్ధంగా పద్యాలు వ్రాయడం. ప్రస్తుతానికి నా ఈ మొదటి ప్రయోగం ఎలా ఉందో చెప్పండి!
తల్లిదండ్రులను సుఖపెట్టని తనయుడెందుకు?
తన స్వార్ధమే చూసుకునే మనుజుడెందుకు?
పరులకు కీడు చేసే జీవుడెందుకు?
విరిసిన పూల తోట రసజ్ఞ మాట!
మృగరాజు బలిమి మూషికమునకేమేరుక?
కలను కూడా భీతి జెందు గజరాజుకెరుక!
అయ్యవారి గొప్ప అల్పునకేమేరుక?
విరిసిన పూల తోట రసజ్ఞ మాట!
పాఠకులు లేని బ్లాగులో నీరసముంది
వ్యాఖ్యలు లేని టపాలో నిరాశ ఉంది
బలాన్నిచ్చే ఒక్క స్పందనలో ప్రోత్సాహం ఉంది
విరిసిన పూల తోట రసజ్ఞ మాట!
హహ బేసికల్గా ఇంత poetry చదివాక మీ పరిస్థితిని నేను అర్ధం చేసుకోగలను. నా మీద అసూయగా ఉంది కదూ! (లేదని మాత్రం చెప్పద్దే! ఏదో ఇలా తుత్తి పడనివ్వండి!) చంటబ్బాయి చిత్రంలో శ్రీలక్ష్మి గుర్తొచ్చిందా? వచ్చే ఉంటుంది లెండి! అయితే ఇప్పుడు చెప్తున్నా చదవండి! నేను వ్రాసినవి పద్యాలు కాదన్న వాళ్ళని బ్లాగులో టపాని, టపాల్లో వ్యాఖ్యలని పుచ్చుకుని కొడతా! ఖబడ్దార్!
61 comments:
>>నా మీద అసూయగా ఉంది కదూ!
హ హా..మళ్ళీ అడిగి మరీ మొఖమాట పెట్టేస్తున్నారండి
బేసిక్ గా నాకు ధైర్యం ఎక్కువ అందుకే ఈ ముక్క "ఇవి పద్యాలే కావు" (ఇప్పుడు చూస్తా ఎలా కొడతారో :P) just kidding :))
బావున్నాయండి మీ పద్యాలు !
వినురవేమ... కదరా సుమతీ
కంటే "విరిసిన పూలతోట రసజ్ఞ మాట!"
వినసొంపుగా వుందండీ..
మా యాసలో....
"మీరాట్ని పజ్జాలన్నారు.. సూడబోతే ఛందస్సెక్కడా అగుపడ్లా! సర్లెండి ముందునాటికి రాస్తా అన్నారుగా సూద్దాం. అలాగే చివరి పాదవఁతా మకుటానికే ఇచ్చేత్తే గణాలు యేడిపిచ్చేతాయేమో ముందునాటికి. అయినా నాకెందుకులే అయ్యన్నీ పజ్జాలే"
బాగున్నాయి రసజ్ఞ .. ప్రయోగాల సాటి మా రసజ్ఞ తనకి వేరొకరు లేరు సాటి.
పద్యం కాకపోయినా.. గద్యమైనా హృద్యమే..
బాగున్నయ్!బాగున్నాయ్!! బాగున్నాయ్!!! మూడోస్సారి!!!!అమ్మయ్య ఇప్పుడింక కామెంట్లతో కొట్టదులెండి!!!!!
రసజ్ఞ బలిమి బ్లాగర్లకేమెరుక
కలను కూడ భీతి చెందు పద్యాలకెరుక ;)
అమ్మవారి గొప్ప ఛందస్సుకేమెరుక
ఝుంటి తేనెపట్టు నా ఈ ఆటపట్టు!
రసగుల్లా నా పరిస్థితి మీకర్ధమైందనుకుంటానూ?
మంచి మంచి మాటలతో నిచట
మనసుకే నచ్చే ప్రశంసతో వేరొకచోట
ప్రోత్సహించే వేళ ప్రతిచోట
విరిసిన పూలతోట మా రసజ్ఞ మాట.
@ భాస్కర రామి రెడ్డి గారూ
మీరు మొఖమాట పడ్డారు కానీ విషయం చెప్పలేదు! మరీ ఆది సినిమాలో ఎల్.బి. శ్రీరాం గారు గుర్తు రాలేదు కదా! ధన్యవాదాలు మీ స్పందనకి!
@ శ్రావ్య గారూ
ధైర్యంలో మీకు మీరే సాటి అని బ్లాగుల్లో టాక్! ఇప్పటివరకు అందరూ చెప్పుకుంటుంటే విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను (సరాదకే సుమీ!)
ధన్యవాదాలు మీకు నచ్చినందుకు!
@ రాజి గారూ
నా పేరంటే ఉన్న పిచ్చి ఇష్టంతో ఇలాంటిది ఒకటి ఎప్పటికయినా ఉండాలి అన్న కోరికతో సరదాకి చేసిన ప్రయత్నం. మీరు మెచ్చినందుకు చాలా హాయిగా ఉందండీ కృతజ్ఞతలు!
@ అరుణ్ గారూ
ఓలమ్మోలమ్మోలమ్మో అక్షరాభ్యాసం నాడే ఆముక్తమాల్యద రాయమంటే ఎట్టా? గణాలు ఏడిపించకుండా శాంతి చేయించేసి అదే భావం వచ్చేలా రాసేస్తే పోలా? ఏటంటారు? ఒప్పుకున్నారుగా పద్యాలని చాలు! నెనర్లు!
@ వనజ వనమాలి గారూ
మీ వ్యాఖ్యతో బాగా టచ్ చేసారండీ! ధన్యవాదాలు!
@ తాత గారూ
హహహ! మీరు మరీను మీకయితే కామెంట్లు ఇస్తాను కాని కొట్టను! ధన్యవాదాలు మీ స్పందనకి!
@ సుభా
ఏదో జరిగింది జరిగింది మీకు! చూసారా మీకు కూడా అలా కలం ఆగనూ ఆగనూ ఆగినా ఆపను అంటూ సాగిపోతోంది;) అదిరింది మీ పద్యం!
@ జ్యోతిర్మయి గారూ
మీ పద్యం కూడా అదిరిందండీ! విరిసిన పూలతోట మా రసజ్ఞ మాట ఇది బహు బాగు! ధన్యవాదాలు!
మీకు మా యాస రాలేదోచ్...! పోతే గుంటూరోళ్ళకి కాస్త ధైర్యం ఎక్కువేలెండి!
మీకేదో అర్ధమవుతుందనుకుంటే ఇదామ్మా మీకర్ధమయ్యింది??
అక్కటా రసగుల్లా! విధి వైపరీత్యము.ఇటులనే కానిమ్ము.
@రసజ్ఞ గారు
పాడే కోయిల తిరిగి చూసే పాటల పయనం
వెలుగు దివ్వెలు చిన్నబోయే కవి కిరణాల సోయగం
దాగిన సంస్కృతిని మాకు దోచిపెట్టే టపాల హారం
రసజ్ఞ గారి సొంతం అవి నవరసభరితం
ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది.. రెండో మాటలో చెప్పాలంటే అద్బుతం... మూడో మాటలో చెప్పాలంటే అమోహం... నాలుగో మాటలో చెప్పాలంటే రసజ్ఞ గారి మాటతో చెప్పినంత అందం..
@ అరుణ్ గారూ
నాకు మీ యాస రాదుగా! కాస్త నేర్పచ్చుగా! నేర్చుకుంటాం మీ లాంటి పెద్దవాళ్ళ దగ్గర! ఇప్పుడేనా అక్షరాభ్యాసం అయ్యింది అని చెప్పాను. ఇహ మీరు నేర్పిస్తే నేర్చుకుంటా!
ఇక్కడ గుంటూరు వాళ్ళల్లో శ్రావ్య గారు కూడా ఉన్నారా? లేక మీరొక్కరేనా? అర్ధం కాలేదు!
@ సుభా
హహహ అవునండి మరి అర్ధమే (సగమే) అయ్యింది! హేవిటో బాగా వ్రాసారని మెచ్చుకున్నా నన్ను అసలు అర్ధం (సగం కూడా) చేసుకోరూ............
దానిదేముంది నేర్పిచ్చేద్దాం (£100/క్లాస్)... నేను మీకన్నా చిన్నవాడినని నా గట్టి నమ్మకం. శ్రావ్యగారిని కూడా కలిపే (నిజం మాట్లాడితే శ్రావ్యగారి గురించే) చెప్పింది!
రసజ్ఞ గారూ,
రాజకీయాల్లో రౌడీయిజం చెల్లుతుంది గాని, సాహిత్యంలో కూడానా? బహుశా మీరే కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇవాళా రేపూ ఇలా ఊదరగొట్టకపోతే గుర్తించేట్టు లేరు. కానీ, నా మనసు ఒప్పుకోవడం లేదే, ఇవి పద్యాలనడానికి. అయ్యా ఏదో పెద్దవాణ్ణి. కొడితే కొట్టేరు గాని కాస్త నెమ్మదిగా కొట్టండి బాబూ.
అక్కడ కాకి కూడా అరుస్తోందే, మరి దాని సంగతేమిటి?
అభినందనలతో,
@ కళ్యాణ్ గారూ
ఆనందంతో మాటలు రావడం లేదు! ఇన్ని అందాలతో నిండిన నా టపాకి మీ స్పందన మరింత అందాన్నిచ్చింది. ధన్యవాదాలు!
@ అరుణ్ గారూ
హహహ మీరు మరీను! సరే మీ ఫీజు నాకు సమ్మతమే కాని క్లాసు మాత్రం 72 గంటలు తీసుకోవాలి సరేనా! ;) మన్నించాలి మీ నమ్మకం వమ్ము అయ్యిందండీ! ఓహ్ శ్రావ్య గారి గురించా అయితే సరే!
@ మూర్తి గారూ
హయ్యయ్యో ఎంత మాట? నేనేదో సరదాకి వ్రాశాను అంతే! పెద్దవారన్నారు కనుక ఇంకేమంటాం సరే మీ మనసు ఒప్పుకోకపోతే నిప్పించలేను కదా! అసలే చిన్నదానిని కనుక కొట్టనులెండి! ధన్యవాదాలు మీ స్పందనకి!
రసజ్ఞ గారూ
బాగుందండి.....
విరిసిన పూల తోట రసజ్ఞ మాట!....
పరిచిన పూల బాట రసజ్ఞ మాట!
హ హ రసజ్ఞ గారు, అరుణ్ గారు మీరిద్దరూ ఇలా ఫిక్స్ అయ్యారా :)))
ఇలాగె కొనసాగించండి...
శతకం పూర్తి చెయండి....
చందోబద్దంగా
ఫీజు వద్దు ఏమి వద్దుగానీ 72 గం. క్లాసంటే ముందు నా పీకలమీదకొస్తుంది. ఫ్రీగానే నేర్పిచ్చేద్దాం. అయితే నాకు మాత్రం మీ ఊరి యాస నేర్పాలి.
శ్రావ్యగారూ,
ధైర్యం కాకపోతే ఈ అఘాయిత్యం ఏమిటి? అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చాక కూడా సరదాకైనా వాటిని పద్యాలు కావని ఎలా అనగలిగారు?
బాగుందా ? ఏమోనమ్మా, మా కాలం లో ఇలాంటివి ఎరగం.
@ రఘు గారూ
పరిచిన పూల బాట రసజ్ఞ మాట! బాగుందండీ! మీ ప్రోత్సాహానికి చాలా చాలా ధన్యవాదాలు! ఇలా వెన్ను తట్టే వాళ్ళు ఉండాలే కాని చెలరేగిపోనూ.....
@ శ్రావ్య గారూ
అంతే కదండీ మరి? ;)
@ అరుణ్ గారూ
హహహ అదీ అలా రండి దారిలోకి! ఆయ్ అదెంత సేపండీ? ఇట్టే నేర్పించేస్తా!
@ పంతుల విజయలక్ష్మి గారూ
హహహ :) ధన్యవాదాలు మీ స్పందనకి! ఏదో కుర్రతనం మన్నించి వదిలేయండి ఈ సారికి!
wow
Superbbbbbbbbbbbbb
simple & straight
nice
?!
@ ఎందుకో? ఏమో! శివ గారూ
మెచ్చినందుకు ధన్యవాదాలు!
చాలా బాగున్నాయండీ..
పర్లేదు ....దాడి నుండి మినహాఇవ్వండి ...
నాకంటే పర్వాలేదు .....అభినందనలు అందాయి..
నాకు ఏదో గుర్తుకు వస్తుంది ఈ టపా చదువుతుంటే ..
ఆ ఆ అదే కాళిదాసు కవిత్వం కొంత నా ఒంట్లో .............
మర్చిపోయాను ..రసజ్ఞ గారు మీరు పూరించండి ఖాళి..
చప్పట్లతో
మీ
RAAFSUN
@ రాజ్ కుమార్ గారూ
మీ పేరు సరిగ్గానే వ్రాశానా? :) ధన్యవాదాలు మీకు నచ్చినందుకు!
@ raafsun గారూ
ధన్యవాదాలు! హా గుర్తొచ్చిందా? లలిత సుగుణ జాల తెలుగు బాల అనే మకుటంతో కొన్ని పద్యాలు వచ్చేవి. వాటిని బట్టే నేను ఇలా వ్రాయటం జరిగింది.
ఇహ మీ పద్య పూరణ చేయక తప్పదంటారు! సరే ప్రయత్నిస్తున్నా మళ్ళీ నన్ను తిట్టుకోకూడదు సరేనా?
కాళిదాసు కవిత్వం కొంత నా ఒంట్లో
కళాత్మక దృష్టి అంతా మీ కంట్లో
కృతజ్ఞతలతో..........
రసజ్ఞ గారు,
ఈ టపాలో ఏంటో మీకు కామెంటితే కవిత్వం లేదా ప్రశ్నిస్తే పద్యాలూ రాలుతున్నాయి....నేను ఇచ్హిన ఖాళి పూరించండి అంటే మళ్ళి ఇంకో పద్యం తాయారు చేసుకుంటారా? అదీను పోగుడుకుంటూ ? ( కాకా పట్టడానికి )..మీకు తెలిట్లేదు గాని రసజ్ఞ గారు మీలో ఒక వేమన ఉన్నాడండి...హ హ హ ( సెన్సు అఫ్ హుమార్ ఉన్నవాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కామెంట్ )
ఈలలతో,
RAAFSUN
@ raafsun గారూ
హయ్యో రామ! పోగుడుకోలేదు పోగిడాను మిమల్నే! అయినా మీరు సూపరండీ! ముందర కాళ్ళకు బంధం భలే వేసేసారు! ఇంక నేనేమంటాను! ధన్యవాదాలు చెప్పడం తప్ప!
పద్యములో ఛందస్సేదని అడిగిన
సరికొత్త కాళాత్మకత అనునట రసజ్ఞ
వినువాడు నోరెళ్లబెట్టునట చూసి ఆ ప్రజ్ఞ
వార్చిన చద్దిమూట ఈ బ్లాగరు మాట
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్ మీ పద్యావేశంలో తడిచిపోయి నేను కూడా రాసి పడేశాను :)
>>విరిసిన పూల తోట రసజ్ఞ మాట
మకుటం బావుంది :)
అంటే పద్యాలు బాగాలేవ న్నాననుకొని కొట్టేస్తారా? ఆ పనిచేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. టపాలు, తిరుగు వ్యాఖ్యలు రాయలేక బ్లాగెండిపోతుంది :D
"తల్లిదండ్రులను సుఖపెట్టని తనయుడెందుకు?... ఈ వాక్యం ఆడపిల్లలకి కూడా వర్తిస్తుందా....లేక మొగపిల్లలకే ప్రత్యేకమా?
@ నాగార్జున గారూ
తడిసినా పులకరించిపోయారు, మమ్మల్ని కూడా మీ పద్యంతో తడిపారు! హహహ ఇంత చక్కని పద్యంతో వచ్చారు కనుక కొట్టనులెండి! వార్చిన చద్దిమూట ఈ బ్లాగరు మాట హహహ బాగుందండీ మీ భావుకత! ధన్యవాదాలు!
@ harephala గారూ
ఆ వాక్యం ఎవ్వరికయినా వర్తిస్తుంది. తల్లిదండ్రులను ఆనందపరచడం పిల్లల బాధ్యత. కానీ ఇక్కడ తనయుడు అని వ్రాయడానికి తగ్గ కారణం ఏమిటంటే., కొడుకే కదా పున్నామ నరకం నించి తప్పించేవాడు అంటారు. అటువంటి తను నరకం నించి తప్పిస్తాడో ఏమో కాని కనీసం ఈ భూమిమీద నరకాన్ని సృష్టించకుండా సుఖ శాంతులతో ఉంచాలి లేకపోతే ఆ జీవితానికి అర్ధం లేదు అని నా భావన!ధన్యవాదాలు మీ స్పందనకి!
రసజ్ఞ గారూ! మీరు మరి గడుగ్గాయి కాపోతే ఇంకా మొగ్గ తొడగలేదు (పద్యాలలో) అప్పుడే 'విరిసిన పూల' అనేస్తున్నారు. హన్నా! బ్లాగే కదా అని వాగేస్తే పైన పెద్దాళ్ళు ఉన్నారు. అయినా మీ ధైర్యానికి మెచ్చుకోవాలండి.
రాజా. (gksraja.blogspot.com)
@ రాజా గారూ
హహహ ధన్యవాదాలు మీ ప్రశంసకి (ఏమిటా అనుకుంటున్నారా? అదే గడుగ్గాయి అన్నారుగా?) బ్లాగే కదా అని వాగేస్తే పైన పెద్దాళ్ళు ఉన్నారు నేను కూడా సరిగ్గా ఇలానే అనుకున్నా అండీ! కానీ
బల్బుని కనిపెట్టిన ఎడిసన్ మరి చదువుకి కనిపెట్టాడా మెడిసిన్
టెలిఫోన్తో స్టాప్ అనుకునుంటే స్టార్ట్ అయ్యి ఉండేదా సెల్ ఫోన్
ఇంతే చాలు అనుకుంటూ ఉంటే ఎవ్వరూ అవ్వరు హీరో
నిన్నటితో సరిపెట్టుకునుంటే నేటికి లేదు టుమారో
అని ఒక పాట పాడేసుకుని ధైర్యం చేసి ఇలా వ్రాసేసా అండీ! మీ స్పందనకి ధన్యవాదాలు!
చాలా బాగుంది.. రసజ్ఞ గారు
తల్లిదండ్రులను సుఖపెట్టని తనయుడెందుకు?
తన స్వార్ధమే చూసుకునే మనుజుడెందుకు?
పరులకు కీడు చేసే జీవుడెందుకు?
మన చుట్టూ ఇలా చాలామంది ఉన్నారు,వాళ్ళు మారాలి అని కోరుకుంటూ @ మీ...
@ తెలుగు పాటలు గారూ
ధన్యవాదాలు! మీ కోరిక నిజమవ్వాలని నేను కూడా ఆశిస్తున్నాను!
Wah wah wah wah!!
Bhale bhalega undi me post...:)
చాలా చాలా చాలా థాంక్స్ వల్లి గారూ!
ఎట్టా ఎట్టా ఎట్టా...పద్యాలు రాసేస్తున్నారా...ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో రసజ్ఞ అంటే ఏమో అనుకున్నా ఇలా పద్యాలు డిసైడ్ చేస్తున్నారా! ఏమాటకామాటేచెప్పుకోవాలి మకుటం మాత్రం అదుర్స్.....బెమ్మాండం బెమ్మాండం!
చివరి పద్యం ఇంకా ఇంకా కేక...ఇవి పద్యాలే పద్యాలే ముమ్మాటికీ పద్యాలే, కాదన్నదెవరో చెప్పండి నేనూ వ్యాఖ్యలిచ్చుకు కొడతా! :)
సౌమ్య గారూ మీకేమన్నా బెల్లం ముక్క పెడతానందా ఈ అమ్మాయి? మీరు కూడా వ్యాఖ్య ఇచ్చుకు కొడతా అంటున్నారు? వామ్మో ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఒక్కర్తే అనుకున్నా ఇప్పుడు మీరు కూడా తోడయ్యారన్నమాట ;)..ఇంకేం మరి ఇప్పుడు రసజ్ఞ గారిని అస్సలు పట్టుకోలేం.. ఐనా విధి రాతని ఎవరు తప్పించగలరు చెప్పండి???
సూపర్.. చాలా బాగున్నాయండీ మీ పద్యాలు.. "విరిసిన పూల తోట రసజ్ఞ మాట" అని ఒప్పేసుకుంటున్నాం.. :)
@ సౌమ్య గారూ
హమ్మయ్యా మీరున్నారనమాట నాకు తోడు! అభయం దొరికింది! ఇకనించి నన్నెవరయినా ఏమయినా అంటే ముందు మీకే చెప్తాను మనిద్దరం కలిసి తేలుద్దాం వాళ్ళ పని. ధన్యవాదాలు మీకు నచ్చినందుకు! చాలా సంతోషం!
@ సుభా
హహహ బెల్లం లేదు అల్లం లేదు గొల్లుం లేదు. where there is a will, there is a lawyer; where is wound, there is housefly ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మంచికి మారుపేరయిన రసజ్ఞకి అలా చేయూత దొరుకుతూనే ఉంటుంది! విధి కాదు విధాత కాదు ఇక్కడ (ఈ బ్లాగులో అంతా) విధేయతతో కూడిన రసజ్ఞ రాత!
@ మధురవాణి గారూ
మీరు కూడా చేయూతనిచ్చారనమాట నాకు! ధన్యవాదాలు!
కొత్త పోస్టులు ఏమి పెట్టడం లేదు,,, ఎందుకు
Shabbu, KNR
ఎవరు టపా పెడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఐపోద్దో వారే రసజ్ఞ గారు అనుకుందాంలెండి పోని. ఈ గొడవంతా ఎందుకు గానీ :):) ఇంక గొళ్ళెం వేసేసుకోండి..
సౌమ్య గారు , సుభ గారు, రసజ్ఞ గారు... ఏమి జరిగింది...? ఏమి జరగుతుంది...? ఏమి జరగబోతుంది నాకు ఇప్పుడే తెలియాలి ( పరవాలేదు తరువాత అయిన చెప్పండి పుణ్యం ఉంటది ) మీ కామెంట్స్ బాగున్నాయి సరదాగా..
@ Shabbu గారూ
ఈ మధ్యన సమయం చిక్కక పెట్టడం లేదు. ఇదిగో వచ్చేస్తుందండి ఇహనో ఇప్పుడో ఎప్పుడో ........
@ సుభా
హహహ అలాగే గొళ్ళెం వేసి తాళం వేసి తాళం చెవి ఎక్కడో పడేశానోచ్చ్! అచ్చికచ్చికా!
@ తెలుగు పాటలు గారూ
జరిగినది - నేను టపా వ్రాయటం
జరుగుతున్నది - వ్యాఖ్యానించుకోవటం అదీ సరదాగా
జరగబోతున్నది - ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవింద! ఆయనకే తెలియాలి!
మా వ్యాఖ్యలు మిమ్మల్ని సరదా పరిచినందుకు చాలా సంతోషం!
పద్యాలు చాలా బావున్నాయి. ఆల్ ది బెస్ట్.
మరిన్ని పద్యాలకోసం ఎదురుచూస్తుంటాను...
పాఠకులు లేని బ్లాగులో నీరసముంది
వ్యాఖ్యలు లేని టపాలో నిరాశ ఉంది
బలాన్నిచ్చే ఒక్క స్పందనలో ప్రోత్సాహం ఉంది
విరిసిన పూల తోట రసజ్ఞ మాట!
నిజ్జంగా బావున్నాయి మీ పద్యాలు.
@ గీతిక బి గారూ
చాలా థాంక్స్ అండి మిగతావి మెల్లిగా వస్తాయి!
@ kallurisailabala గారూ
మీరు కూడా ఒప్పేసుకున్నారు నావి పద్యాలే అని! ధన్యవాదాలు మీకు నచ్చినందుకు!
Rasagna garu,
chala bagundi andi...
తల్లిదండ్రులను సుఖపెట్టని తనయుడెందుకు?
తన స్వార్ధమే చూసుకునే మనుజుడెందుకు?
పరులకు కీడు చేసే జీవుడెందుకు?
విరిసిన పూల తోట రసజ్ఞ మాట!
ee padyam chala nachindi.. its true..... :)
mee mata eppudu bagane untundi kada :P
maree pesal ga sepallantaraaa ;)
@ అజ్ఞాత గారూ
హేహేహే చాలా చాలా ధన్యవాదాలు మీ ప్రశంసతో కూడిన స్పందనకి!
తల్లిదండ్రులను సుఖపెట్టని తనయుడెందుకు?
తన స్వార్ధమే చూసుకునే మనుజుడెందుకు?
పరులకు కీడు చేసే జీవుడెందుకు?
విరిసిన పూల తోట రసజ్ఞ మాట! wow super ga chepparandi..
Super Good. ..
@ చిన్ని గారూ
మీకు నా పద్యాలు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ రాజేశ్ మారం గారూ
హహ ధన్యవాదాలండీ మీ స్పందనకి!
I will right away grab your rss as I can't in finding your email subscription hyperlink or e-newsletter
service. Do you've any? Kindly permit me recognise
so that I could subscribe. Thanks.
Also visit my web page - dating sites (http://bestdatingsitesnow.com/)
Post a Comment