ముందుగా అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు!
మొదటి బాల్యం: అమాయకత్వం, ఏదో తెలుసుకోవాలనే తపన, ప్రతీదీ ఆశ్చర్యంతో కూడిన ఆనందం తలుచుకుంటేనే ఒక గొప్ప అనుభూతి కదూ. అవే పిల్లలకి అందం. అసలు వాళ్ళ బోసినవ్వులే అమృత తుల్యమన్నారు కదా పెద్దలు. పిల్లలున్న ఇల్లు స్వర్గంతో సమానం. తల్లిదండ్రుల ఒడిలో, అమ్మమ్మ లేదా నానమ్మ తాతయ్యల గారాల లాలనలో పాలనలో మంచి విద్యాబుద్ధులతో పాటు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ వారి అమాయకపు చేష్టలతో ముద్దులొలికిస్తూ బాధలన్నిట్టినీ మరపించి మురిపించే చిన్నపిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో బరువు (స్కూల్ బ్యాగ్గులు) బాధ్యతలు (పరీక్షలు) మోస్తూ ఒత్తిడిని (ఫస్ట్ ర్యాంకు రాకపోతే కోప్పడతారన్న టెన్షన్) నెత్తిన వేసుకుని ఈ చదువులెవడు కనిపెట్టాడురా బాబూ అనుకునేలా చేస్తున్న స్కూల్ వాతావరణం ఒక ప్రక్క. చక్కగా ప్రకృతితో ఆడి పాడి స్వేచ్ఛగా ఉండవలసిన వయసులో వాన నీటిలో కనీసం కాగితపు పడవలు కూడా వేయలేని జీవితం మరొక ప్రక్క. ఇది వీళ్ళకి వరమా? శాపమా? కొబ్బరి చెట్టు క్రింద పడుకుని ఉన్న తాతయ్య పొట్ట మీద కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఎన్నో చందమామ కథలను చెప్పించుకోవలసిన వయసులో ఎవరి గదుల్లో వాళ్ళు కృత్రిమ చందమామని చూసి సరిపెట్టుకోవలసి వస్తోంది.
ఎన్నో అనుభూతులను మిగుల్చుకోవలసిన బాల్యంలో ఆయాసంతో కూడిన అలసటని మిగుల్చుకుంటున్నారు. చెమ్మ చెక్కలు, గుడు గుడు గుంజాలు, వాన వాన వల్లప్పలు, కాళ్ళా కజ్జాలు ఏమయ్యాయి? స్కూబీ డూబీ షోలు, పోకీమన్లు, పవర్ రేంజర్లు, మాంస్టర్ వారియర్లు మింగేశాయా? పిప్పరమెంటు బిళ్ళలు, గొట్టాలు (గోల్డ్ ఫింగెర్స్), నిమ్మ తొనలు, మొదలయిన వాటిని పిజ్జాలు, బర్గర్లు, పఫ్ఫులు తొక్కేసాయేమో? కోడి పందెం పువ్వులు, ఏడు పెంకులాటలు, ఉప్పులగుప్పలు ఎక్కడికి వెళ్ళాయో? బాల్యాన్ని ఒక కృత్రిమం అనే రాకాసి మింగేసి ఎన్నో జ్ఞాపకాలని లేకుండా చేస్తోందేమో అనిపిస్తోంది. ఏదేమయినా బాల్యం అనేది ఒక వరం. దానిని వారి నుండి దూరం చేయకండి, హాస్టళ్ళలో పెట్టి పసి మనసులని బాధ పెట్టకండి. ఆప్యాయతల విలువ తెలియనివ్వండి. యాంత్రికంగా మార్చకుండా సహజత్వాన్ని కోల్పోకుండా ఉంచితే దానిని మించిన వరం లేదు. నేటి బాలలే రేపటి పౌరులు.
రెండవ బాల్యం: వార్ధక్యం రెండవ బాల్యం అన్నారు. ఆలోచించి చూస్తే నిజమే అనిపిస్తుంది నాకు. జీవితమనే బండిని ఎద్దులాగా లాగి లాగి అలసిపోయి ఒక ఆదరించే, స్వాంతన పొందే చేతి కోసం ఎదురు చూసే వాళ్ళు బాలలే. వీళ్ళ బోసి నవ్వులలో పిల్లల బోసినవ్వులంత స్వచ్ఛతా ఉంది. వీళ్ళకున్నది అపూర్వమయిన జ్ఞాన సంపద, ఎంతో అనుభవంతో కూడిన ఆలోచన. కానీ వారి మాటలను మనమే పెడచెవిన పెడతాం. వృద్ధాప్యంలో ఎంత డబ్బు ఉన్నా నేనున్నాను అని అక్కున చేర్చుకోవలసిన కన్నపిల్లలే భారమని తల్లిదండ్రులని వదిలేసిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. రాజమండ్రి గౌతమీ జీవ కారుణ్య సంఘంలో నాకెదురయిన కొంతమంది ద్వారా నేర్చుకున్న పాఠం ఇది. వాళ్లకి చాలా మంది సహాయం చేసి చేతులు దులిపేసుకుంటారు. వాళ్ళు కోరేది సహాయం కాదు అని నాకు అక్కడకి వెళ్ళిన మొదటి రోజు తెలిసింది. ఒక పెద్దావిడ దగ్గర కుర్చుని క్షేమ సమాచారాలు అడుగుతుండగా ఆవిడ చెప్పింది మాకు చాలా ఆస్థి పాస్థులు ఉన్నాయి కానీ ప్రేమగా చూసే చేయి లేక ఒక తియ్యని పలకరింపుకి నోచుకోలేక ఇక్కడ ఉన్నాను అని. ఆ సంఘటన నన్ను కదిలించింది. అప్పటినుండి ఎప్పుడు సమయం చిక్కినా వాళ్ళ దగ్గరకి వెళ్లి కాసేపు కబుర్లు చెప్పి ఆప్యాయంగా పలకరించి వచ్చేదానిని. కనుక నా అనుభవంతో నేను అందరికీ చేసుకునే విన్నపం ఒకటే. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న వారిని రెండవ బాల్యంలో వదిలేయకుండా వారి ఋణం తీర్చుకునే అవకాశాన్ని జార విడువకండి. మనల్ని చేయి పట్టుకుని నడిపించిన వాళ్లకి అవసర సమయంలో చేయూతనివ్వండి. ప్రేమగా ఒక స్పర్శ, ఆప్యాయంగా ఒక కమ్మని పలకరింపు చాలు వీళ్ళకి. నిండు మనసుతో చేసే వాళ్ళ ఆశీర్వాదాలే మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి అని మర్చిపోకండి. దయచేసి వాళ్ళని వృద్ధాశ్రమాలలో వదిలేయకండి!
రెండవ బాల్యం: వార్ధక్యం రెండవ బాల్యం అన్నారు. ఆలోచించి చూస్తే నిజమే అనిపిస్తుంది నాకు. జీవితమనే బండిని ఎద్దులాగా లాగి లాగి అలసిపోయి ఒక ఆదరించే, స్వాంతన పొందే చేతి కోసం ఎదురు చూసే వాళ్ళు బాలలే. వీళ్ళ బోసి నవ్వులలో పిల్లల బోసినవ్వులంత స్వచ్ఛతా ఉంది. వీళ్ళకున్నది అపూర్వమయిన జ్ఞాన సంపద, ఎంతో అనుభవంతో కూడిన ఆలోచన. కానీ వారి మాటలను మనమే పెడచెవిన పెడతాం. వృద్ధాప్యంలో ఎంత డబ్బు ఉన్నా నేనున్నాను అని అక్కున చేర్చుకోవలసిన కన్నపిల్లలే భారమని తల్లిదండ్రులని వదిలేసిన వాళ్ళు ఎంతో మంది నాకు తెలుసు. రాజమండ్రి గౌతమీ జీవ కారుణ్య సంఘంలో నాకెదురయిన కొంతమంది ద్వారా నేర్చుకున్న పాఠం ఇది. వాళ్లకి చాలా మంది సహాయం చేసి చేతులు దులిపేసుకుంటారు. వాళ్ళు కోరేది సహాయం కాదు అని నాకు అక్కడకి వెళ్ళిన మొదటి రోజు తెలిసింది. ఒక పెద్దావిడ దగ్గర కుర్చుని క్షేమ సమాచారాలు అడుగుతుండగా ఆవిడ చెప్పింది మాకు చాలా ఆస్థి పాస్థులు ఉన్నాయి కానీ ప్రేమగా చూసే చేయి లేక ఒక తియ్యని పలకరింపుకి నోచుకోలేక ఇక్కడ ఉన్నాను అని. ఆ సంఘటన నన్ను కదిలించింది. అప్పటినుండి ఎప్పుడు సమయం చిక్కినా వాళ్ళ దగ్గరకి వెళ్లి కాసేపు కబుర్లు చెప్పి ఆప్యాయంగా పలకరించి వచ్చేదానిని. కనుక నా అనుభవంతో నేను అందరికీ చేసుకునే విన్నపం ఒకటే. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న వారిని రెండవ బాల్యంలో వదిలేయకుండా వారి ఋణం తీర్చుకునే అవకాశాన్ని జార విడువకండి. మనల్ని చేయి పట్టుకుని నడిపించిన వాళ్లకి అవసర సమయంలో చేయూతనివ్వండి. ప్రేమగా ఒక స్పర్శ, ఆప్యాయంగా ఒక కమ్మని పలకరింపు చాలు వీళ్ళకి. నిండు మనసుతో చేసే వాళ్ళ ఆశీర్వాదాలే మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి అని మర్చిపోకండి. దయచేసి వాళ్ళని వృద్ధాశ్రమాలలో వదిలేయకండి!
23 comments:
మీరు చెప్పిన రెండు బాల్యాలు తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసేవేనండీ..
బాలలదినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన పాప చాలా బాగుంది..
పిల్లలు ఆడుతున్న చిత్రం ఎంత బావుందో..చలి లేని రోజుల్లో సాయంత్రమైతే చాలు వీధికి ఆ చివర ఈ చివర children at play బోర్డులు పెట్టి మా విధిలో పిల్లలు బోలెడు ఆటలు ఆడేస్తుంటారు. ముచ్చటైన దృశ్యం.
పెద్ద వాళ్లకు కావాల్సింది డబ్బు కాదు ఆప్యాయత, ప్రేమ అని వాళ్ళ మాటగా చెప్పిన నీకు ధన్యవాదాలు.
రసజ్ఞ గారూ,
పిల్లల్ని చిన్నప్పుడు చదువుల పేరిట హాస్టళ్ళలో పెడుతున్నాం.. రేపు వాళ్ళే ఉద్యోగాల పేరిట మనని వృద్ధాశ్రమాల్లో పెడుతారు. రెండు చోట్లా రాజ్యం చేసేది, చేస్తున్నదీ డబ్బే!
Cheera kattukkuna papa cute ga undi
ivaala morning nuchi TV chusthe ive chupisthunnaru
http://endukoemo.blogspot.com/2011/11/blog-post_7579.html
but I feel the difference in your expression
nice
?!
@ రాజి గారూ
ఎందుకో వాళ్ళని చూసి ఆనందపడాలో లేక వారి ప్రస్తుత స్థితిని చూసి బాధపడాలో కూడా అర్ధం కాని పరిస్థితి నాది! ధన్యవాదాలు!
@ జ్యోతిర్మయి గారూ
నిజమే అండి పిల్లల ఆటలని చూడటం వలన కూడా ఎంతో ఆనందం కలుగుతుంది మనసుకు! వాళ్ళ బాధని దగ్గరుండి ఎన్నో సంవత్సరాలు చూసిన దానిని అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను. నెనర్లు!
@ అరుణ్ గారూ
పిల్లలని చదువుల పేరుతో హాస్టళ్ళలో పెట్టడ్డం వలన వాళ్ళని ఆప్యాయతలకి దూరం చేసినా కాస్తో కూస్తో మంచే జరుగుతుంది వాళ్లకి. కాని పెద్ద వాళ్ళని అలా వృద్దాశ్రమాలలో పెట్టడం వలన ఆశ్రమ యజమానులకి తప్ప వేరే ఎవరికీ ప్రయోజనం కనిపించడం లేదు నాకు. మనిషి తన అవసరం కోసం సృష్టించుకున్న డబ్బుకి మనుషులకన్నా విలువెక్కువా???
@ ఎందుకో? ఏమో! గారూ
చూశానండి మీ టపా వలన దూరదర్శని చూడలేదన్న లోటు తీరింది! నచ్చినందుకు ధన్యవాదాలు!
మీరు హ్రుదయ కొనాన్ని అవిష్కరించారు....
డబ్బె కాక ఇంక మానవత విలువలు వున్నాయ అనిపిస్తుంది.మీరు ప్రతి టపా లొ హ్రుదయని స్ప్రుషిస్తున్నారు.
చాల బాగుందండి.
మీ లొని మానవతా కొనానికి దన్యవాదాలు .
చాల బాగుందండి ...
రసగుల్లా...ఆ అమ్మాయి మీరేనా? చక్కగా అభివాదం చేస్తున్నారు. నిన్ననే కదా బాలల దినోత్సవం. కానీ నేను ఆలస్యంగా వచ్చాను.ఇనా సరే మీక్కూడా శుభాకాంక్షలు.ఇంకా ఈ రోజు వ్రాసిన విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.మొదటి బాల్యం అని చిన్నతనాన్ని,రెండో బాల్యం అని వృద్ధాప్యాన్ని వివరించి ఒక సామాజిక అంశాన్ని గురించి చర్చించడం బాగుంది. ఆచంగ గారు అన్నట్టు డబ్బు మనల్ని రాజ్యం చేస్తోందేమో.సంపాదన అనే చట్రంలో ఇరుక్కొని మనం మన ఉనికిని కోల్పోతున్నాం నిజంగానే.ఇక భావి పెద్దలుగా మన పిల్లలకి మనమేం చెప్పగలం,చూపగలం?మమతలు,ఆప్యాయతలు అన్న మాటలకి నిలువ నీడ లేకుండా చేస్కుంటున్నాం.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే అవుతుంది.మొత్తమ్మీద మీ టపా బాగుంది ఆలోచనాత్మకంగా.
ఈ రోజున వాడి బాల్యాన్ని కొల్లగొట్టిన మనం , రేపు మన రెండవ బాల్యంలో వాడి దగ్గరనుంచి ఏదో ఆశించడం తప్పు కాదా ?
రసజ్ఞ గారు,
మీ వ్రాతలు ప్రొఫెషనల్ గా ఉన్నాయి. ఇవే భావాల్ని నేనూ దాదాపు మూడేళ్ళక్రితం వ్రాసుకున్నాను. మీకు సమయముంటే చూడండి.
http://paarijatam.blogspot.com/2009/01/blog-post_9603.html
రెండు బాల్యాల గురించి కూడా చాల చక్కగా వర్ణించారు రసజ్ఞ గారు ..
కాని నేటి సమాజం లో ఆ రెండు బాల్యాలు కూడా నిరాదరణ కు గురి అవుతున్నాయి
సమయం చాలడం లేదు అన్న ఒకే ఒక కారణం తో ఈ రెండు బాల్యలను నిరాదరణ కు గురి చేస్తున్నారు కొందరు మనుష్యులు
బాల్యం ని, వృద్దాప్యంని అనుసంధానం చేయగలమనసు నేటి తరం తల్లిదండ్రులకు ఉంటె.. ఈ సమస్యే..రాదు. అది తెలియక, తెలిసినా.. విలువ ఇవ్వక పోవడం వల్ల బాల్యం బండబారిపోతుంది. అపార జ్ఞ్ఞానం ఆశ్రమాల పాలవుతుంది. సమస్యని మనమే సృష్టించుకుని..ఆ అగ్ని కీలల్లో. మానవత్వాన్ని కాలరాస్తున్న ఆధునిక పోకడలు ఇవి..ఎక్కడ మునుగుతామో,ఎక్కడ తేలతామో!భయం గా అనిపిస్తుంది. మంచిగా చెప్పారు..రసజ్ఞ .
@ వాన నీటిలో కనీసం కాగితపు పడవలు కూడా వేయలేని జీవితం..
ఈ ఒక్క వర్ణన చాలు నేటి బాలలు ఎంతటి అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారో చెప్పటానికి..బాగుందండి.
@ రఘు గారూ
మీకు నచ్చినందుకు చాలా ధన్యవాదాలు! మానవత్వం అంటే ఏ theaterlo ఆడుతోంది అని అడిగే రోజులు వస్తాయేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. అటువంటి పరిస్థితి రాకుండా దేశాన్ని ఉద్ధరించలేకపోయినా కనీసం మన కుటుంబీకులనన్నా సరిగా చూసుకోవాలన్నదే నా ఆలోచన. అదే ఇక్కడ పంచుకున్నాను.
@ సుభా
ఆ అమ్మాయి నేను కాదు. ఆలస్యమేమి లేదు ఎప్పుడయినా ఫరవాలేదు. మీకు నా ఆలోచనలు నచ్చినందుకు ధన్యవాదాలు. నిజమే డబ్బు సంపాదనలో పడి అన్నీ మర్చిపోతున్నాము కానీ ఆ డబ్బు వలన మనకి అన్నం దొరుకుతుందేమో కాని ప్రేమగా వడ్డించి ఆప్యాయంగా కలిపి పెట్టే చేయి దొరకదు.
@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
మీ స్పందనకి ధన్యవాదాలు! రెంటికి రెండూ అపురూపమే అందుకే రెండింటినీ కాపాడమనే నా విన్నపం. కాని మీరన్నట్టు బాల్యాన్ని కొల్లగొట్టి రెండవ బాల్యంలో ఆశించడం తప్పా కాదా అన్న దాని కన్నా తల్లిదండ్రులు మనకి ఎంతో ఉత్తమమయిన మానవ జన్మని ఇచ్చారు దానికన్నా ఋణపడి ఉండాలి కదా! మన చేయి పట్టుకు నడిపించిన చేతిని, గోరుముద్దలు తినిపించిన చేతిని ఆదరించాలి కదా!
@ మందాకిని గారూ
నా వ్రాతలు నచ్చినందుకు నెనర్లు! చూసానండి మీరు వ్రాసినది కూడా! చాలా చక్కగా చెప్పారు. మనమిక్కడ ఎంత మొత్తుకున్నా లాభం లేదు కనీసం కొంచెం పాటించినా చాలు.
@ చైతన్య దీపిక గారూ
ధన్యవాదాలు మీకు! సమయం చాలడం లేదు అన్నది కేవలం ఒక కుంటి సాకు మాత్రమే నా దృష్టిలో. ఏదో ఒక సమయంలో రోజు మొత్తం మీద ఒక్క గంట మన వాళ్ళ కోసం కూడా కేటాయించలేమా? అంత కన్నా విలివయిన పనులున్నాయా?
@ వనజ వనమాలి గారూ
నా మనసులోని భావాన్ని మీ మాటలతో చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు!
@ బాలు గారూ
మీకు నచ్చినందుకు చాలా సంతోషం!
రెండు బాల్యాల గురించి చాలా బాగా చెప్పారు రసఙ్ఞ గారు. ఈ తరం పిల్లల బాల్యాన్ని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది, వీళ్లెంతగా కోల్పోతున్నారో తలుచుకుంటూ ఉంటే..
@ అపర్ణ గారూ
కదా! నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీ స్పందనకి ధన్యవాదాలు!
chala bavundi me post :)
acham na bhavalani chukunnatte!
@ వల్లి గారూ
నా రాతలలో మీ భావాలను చూసుకున్నారన్నారు! చాలా సంతోషం!
Interesting. It is true that, most of the time, what elders need is that human touch - not just material comfort or luxury. OTOH, looking at the urban society in India, senior living facilities are probably a better solution for both the seniors and their families - nothing inhuman about it.
@ కొత్తపాళీ గారు
చాలా చక్కగా చెప్పారు! నెనర్లు!
You can certainly see your skills within the work you
write. The arena hopes for even more passionate
writers like you who are not afraid to mention how they believe.
All the time follow your heart.
Have a look at my webpage - Dating sites (http://bestdatingsitesnow.com)
Post a Comment