క్రితం వారం టపాకి లభించిన ఆదరణని బట్టి చూస్తే నా లాగా చిత్రకారుల్ని ఇష్టపడే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారనిపించింది. అందుకనే మరొక చిత్రకారునితో మీ ముందుకి వచ్చాను! ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గోపాల్ స్వామి ఖేతంచి. ఈయన శైలిలో కాల్పనికత, లోతయిన వాస్తవికత ఆకట్టుకునే అంశాలు.
ఆయన నగిషీలు పెట్టడములో నేర్పరి అనిపిస్తుంది నాకు. పురాతన ఫ్రెంచు, స్పానిష్, మొదలయిన చిత్రాలని తీసుకుని మన భారతీయతను ఎంతో అందముగా తొడిగి మన ముందుకి తీసుకువచ్చిన వ్యక్తి ఈయన. ఏంటి నమ్మరా? కావాలంటే ఈ బొమ్మను చూడండి పేరు ప్రఖ్యాతలు, వివదాస్పదమయిన చర్చలు రేపిన మోనాలిసా చిత్రాన్ని తనదయిన శైలిలో కుంచెకు, మెదడుకు పదును పెట్టి భారతీయ దుస్తులలో ముద్దుగుమ్మగా మలచిన ఈయనని అభినందించకుండా ఉండలేమేమో!
ఈయన ఉత్తర రాజస్థాన్‌లో సంస్కృతికి మారుపేరుగా నిలిచే ఒక కుగ్రామములో 1968 లో జన్మించారు. జైపూర్‌లో ఉన్న రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి డ్రాయింగ్ మరియు పెయింటింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక చలన చిత్రాలలో మజూర్ ఉల్ హక్ కు ఒక సహాయక కళా దర్శకునిగా (Assistant Art Director) పనిచేశారు. ఆ తరువాత ఒక పత్రిక కోసం పని చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన దృష్టిని సంపూర్ణంగా కేవలం చిత్రాల మీదే లగ్నం చేసి లెక్కలేనన్ని బహుమానాలను అందుకున్నారు. ఈయన కుంచె వాస్తవికత, సర్రియలిజం మరియు సంగ్రహణ మీదుగా ప్రయాణం చేసి సంప్రదాయం, ఆధునీకరణలను సమీకరించుకుని వీక్షకుల హృదయాలలో నిలిచిపోయింది.
ఆయన గీసిన చిత్రాలలో నాకు నచ్చినవి కొన్ని! ఒకసారి కళ్ళని అలా విహారానికి పంపండి మరి!
34 comments:
ఈయనెవరో మరీ 'గో ' పాలుడే సుమండీ !
ఇంకో సమగ్ర చిత్ర సహిత చిత్రకారుని పరిచయం. బాగుంది రసగుల్లా మీ ప్రయత్నం. చక్కని చిత్రకారులందరినీ పరిచయం చేస్తున్నారు..చిత్రాలన్నీ చాలా బాగున్నాయ్.
super
thanq sir
@రసజ్ఞ గారు ధన్యవాదాలు ఎంతో మంచి కళాకారుడిని పరిచయం చేసారు
ఆరిన రంగులలో
ఆరని అందాలు
చాలా అద్బుతంగా ఉన్నాయి
కాని ఒక్కటి బాధ వేస్తోంది అ చిత్రాలతో పాటు వాటి చిరునామాలు ( గోపాల్ గారిది కాదు అ పడుచులవి ) కూడా పెట్టుంటే బాగుండేదేమో అని ;)
ఎంతందంగా ఉన్నాయో!ఆ ముగ్గురమ్మాయిల చిత్రంలో ఆ జలతారు వస్త్రాల సోయగం భలే చిత్రించారు. మంచి చిత్రకారుణ్ణి పరిచయం చేశారు రసజ్ఞా..
Adbhutam!!!
chaalaa chakkani parichayam.. aa "kunchelo.. adbhutamaina andaalu ...
@ జిలేబీ గారూ
హహహ మీరు మాత్రం చతురులే సుమండీ!
@ సుభా
మీ ఆదరణకి ధన్యవాదాలు! ఎంతో మంది చిత్రకారులలో నాకు తెలిసిన, నచ్చిన క్రొద్ది మందిని ఇలా అందరి దృష్టికి తీసుకుని వస్తున్నాను!
@ కళాసాగర్ గారు
ఆయనకి అందించాను మీ థాంక్స్ ని!
@ శర్మ గారూ
ధన్యవాదాలు మెచ్చినందుకు!
@ కళ్యాణ్ గారూ
ఆయన చిత్రాలకి మీ కవనం ఇంకా బాగుంది! ఆరిన రంగులలో ఆరని అందాలు ఎంత అద్భుతమయిన భావన!
అయ్యో మీరలా బాధపడకండి పడుచులయితే మీ కోసమన్నా పెట్టేదానిని కాని వాళ్ళు పడతులు (ఇక్కడ పెళ్ళయిన వాళ్ళు అని నా ఉద్దేశ్యం) అందుకనే పెట్టలేదు :)
@ జ్యోతిర్మయి గారూ
కదా! ఆయన వేసిన వాటిల్లో నాకు బాగా నచ్చే అంశం మేలి ముసుగు ఎంత కోమలంగా ఉంటాయో! చూస్తే అటువంటివి వేసుకోవాలనిపిస్తుంది! ధన్యవాదాలు!
@ సునీత గారూ
ధన్యవాదాలు!
@ వనజ వనమాలి గారూ
నెనర్లు! ఆదరించే వాళ్ళు ఉండాలే కాని ఏ కళకీ లిమిట్ లేదు అనిపిస్తుంది! అందుకనే నా ఈ చిన్ని ప్రయత్నం.
ఆదరిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు!
మోనాలిసా చిత్రాన్ని ఒకేలా కాకుండా వివిధ కోణాలలో చూసే అవకాశం ఈవిధంగా దొరికింది.రసజ్ఞగారు మీ ప్రయత్నం చాలా బాగుంది.
@రసజ్ఞ hahaha baga sadhesaaru parledhu eesaari kastha daya choopandi :) dhanyavadhaalu mee prasamsaku
@ ఊసుల తీరం బాలు గారూ
నా ప్రయత్నాన్ని మెచ్చినందుకు, ఆయన చిత్రాలు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ కళ్యాణ్ గారూ
:) :D
loved the books that you added in your account. thanks for sharing them here.
Superb,,, mam
?!
@ అజ్ఞాత గారూ
పుస్తకాలు నచ్చినందుకు ధన్యవాదాలు!
@ ఎందుకో? ఏమో! గారూ
నచ్చినందుకు సంతోషం!
అందానికి మరో రూపం స్త్రీ , చిత్రాలు చాలా బాగున్నాయి చూస్తూ ఉంటె మరల చూడాలి అనిపిస్తున్నాయి గోపాల్ స్వామి గారు , దన్యవాదములు రసజ్ఞ గారు..
@ తెలుగు పాటలు గారూ
గోపాల్ గారు మీకు కృతజ్ఞతలు చెప్పమంటున్నారండీ!
Nice. thanks for sharing
@ కొత్తపాళీ గారు
వచ్చి మా టపాని మెచ్చినందుకు ధన్యవాదాలు!
రసజ్ఞ గారూ!
అద్భుతమైన చాలామందికి తెలియని చిత్రకారుల్ని చక్కగా పరిచయం చేస్తున్నారు. అభినందనలు!
నిజంగా కళ్ళకే కాదు, కళని ప్రేమించే మనసులనీ హాయిగా విహరింపజేస్తున్నారు...
@ చిన్ని ఆశ గారూ
నాకు కూడా మీ చిట్టిలాగా బొమ్మలు గీసే వాళ్ళంటే ఇష్టమండి. మీ లాంటి వాళ్ళందరూ ఆదరించడంతో ఇలా నాకు తెలిసిన కొంతమందిని పరిచయం చేస్తున్నాను. ధన్యవాదాలు!
Nice,,, Super Collection..... Really its beautiful...... in my screen..... this is first visit of ur Blog... Nice Colection... Vanaja aunty said abt ur Blog yesterday.... Now i am here in ur Blog.... Thank You...
Shabbu, KNR
@ Shabbu గారూ
welcome అండి! ముందుగా మీకు ఈ బ్లాగుని పరిచయం చేసిన వనజ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు! ఈ బ్లాగుకి వచ్చి టపాను మెచ్చినందుకు ధన్యవాదాలు!
Marvellous.Thanks for the workdone.
చాలా అపురూపమైన చిత్రాలను చూపించారు. చాలా ఆనందం గా వుంది. మీకు నా కృతఙ్ఞతలు
@ తొలకరి గారూ
చాలా రోజులకి కనిపించారు! మీకు నచ్చినందుకు ఆనందంతో మెచ్చినందుకు ధన్యవాదాలు!
మీరు కళాకారులనీ, వారి కళలనీ పరిచయం చేస్తున్న తీరు అద్భుతం...
అంత అందమైన కళాఖండాలను మా అందరితో పంచుకుంటున్నందుకు కృతఙ్నతలు.
@ యామిని గారూ
నేను పరిచయం చేస్తున్న కళాకారులని ఆదరించి, నన్ను ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదాలు!
సూఊఊఊఊఊపర్... ఈ పోస్ట్ నేను మిస్సయ్యానండీ.. ;(
@ రాజ్ కుమార్ గారూ
పోన్లెండి ఇప్పుడు చూసేసారుగా ;) అమ్మాయిలు (అదేలే చిత్రాలు) నచ్చినందుకు ధన్యవాదాలు :):)
These are truly wonderful ideas in regarding blogging.
You have touched some nice factors here. Any way keep up wrinting.
Look at my web site ... dating online (bestdatingsitesnow.com)
అన్ని చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అద్భుతంగా ఉన్నాయి.
Post a Comment