ఉన్నట్టుండి దొంగల మీద ఈ దండయాత్ర దేనికి అనుకోకుండా కాస్త ఓపికగా చదవండి! దొంగతనం అనేది మనకున్న 64 కళలలో ఒకటి. దీనినే చోర విద్య అంటారు. దీనికి అసలు గుర్తింపే లేదు. నా టపా చదివాకన్నా గుర్తిస్తారేమో చూద్దాం.
కాసేపు నిజమయిన దొంగల (పని దొంగ, గజ దొంగ, ఇంటి దొంగ,మొ.) గురించి కాకుండా ప్రతీ మనిషిలోను ఉండే సాధారణ దొంగ లక్షణాల గురించి మాత్రమే సరదాగా మాట్లాడుకుందాము. సరే ముందు ఈ విషయం చెప్పండి మీలో ఎంతమందిని ఇప్పటిదాకా కనీసం ఒక్కరయినా అమ్మ దొంగా! అని అన్నారు? గారంగా ముద్దుగా అవనీయండి కోపంగా కానివ్వండి అనే ఉంటారు కదా! నన్ను మాత్రం చాలా మంది అన్నారు లెండి. ఇవాళ ప్రొద్దున్న మా అమ్మ కూడా నన్ను దొంగ మొఖం అనేసింది అందుకే ఈ టపా. నాలాంటి దొంగ మొఖాలు ఇంకా ఇక్కడ ఎవరయినా ఉన్నారా లేదా అనే ఆలోచనతో మా అమ్మకి నేను ఇచ్చిన క్లాసుని ఇక్కడ వ్రాస్తున్నా.
కాసేపు నిజమయిన దొంగల (పని దొంగ, గజ దొంగ, ఇంటి దొంగ,మొ.) గురించి కాకుండా ప్రతీ మనిషిలోను ఉండే సాధారణ దొంగ లక్షణాల గురించి మాత్రమే సరదాగా మాట్లాడుకుందాము. సరే ముందు ఈ విషయం చెప్పండి మీలో ఎంతమందిని ఇప్పటిదాకా కనీసం ఒక్కరయినా అమ్మ దొంగా! అని అన్నారు? గారంగా ముద్దుగా అవనీయండి కోపంగా కానివ్వండి అనే ఉంటారు కదా! నన్ను మాత్రం చాలా మంది అన్నారు లెండి. ఇవాళ ప్రొద్దున్న మా అమ్మ కూడా నన్ను దొంగ మొఖం అనేసింది అందుకే ఈ టపా. నాలాంటి దొంగ మొఖాలు ఇంకా ఇక్కడ ఎవరయినా ఉన్నారా లేదా అనే ఆలోచనతో మా అమ్మకి నేను ఇచ్చిన క్లాసుని ఇక్కడ వ్రాస్తున్నా.
ప్రపంచమంతా దొంగల మయమే! ప్రకృతంతా కూడా ఒక పెద్ద దొంగల ముఠానే లేకపోతే
కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం
తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం
ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం
అనే పాట పుట్టేదే కాదు. (ఈ పాటని చూసి మీరే చెప్పండి! నా మాట ఒప్పుకుని తీరతారు)
ఇదే కాక మనం దొంగతనాలు సరదాకి చేస్తాం, ఆటపట్టించడం కోసం, ఆత్మసంతృప్తి కోసం చేస్తాం అలానే ఒక్కోసారి తెలియకుండా కూడా చేసేస్తాం. ఎలా అంటారా చెప్తాను చూడండి!
సరదా దొంగతనం: ఇది చిన్నప్పుడు అందరూ చేసే ఉంటారు. చిత్రంలో చూపించినట్టు మనింట్లో అన్నీ ఉన్నా సరే వేరే వాళ్ళ తోటలోకెళ్ళి మామిడికాయలో, జామకాయలో, నేరేడు పండ్లో, పువ్వులో ఏదో ఒకటి ఎవరికీ తెలియకుండా కోసేస్తాం ఇదే సరదా దొంగతనం అన్నమాట! ఇటువంటివి నేను మొదటిసారి నా ఇంటర్లో చేసాను. దొంగిలించిన కాయ రుచి నీకేం తెలుసని ఏడిపిస్తే పంతం కోసం చేశాను కానీ తిన్నాక నిజమే అనిపించిందండోయ్.
ఆటపట్టింపు దొంగతనం: ఇది ప్రియమయిన వాళ్ళతో చేస్తూ ఉంటాం. ఇది తాత్కాలిక దొంగతనమే ఎందుకంటే మళ్ళీ వాళ్లకి తిరిగిచ్చేస్తాం. ఎదుటి వాళ్లకి బాగా ఇష్టమయిన లేదా అవసరమయిన దానిని ఏదో ఒకటి దాచేసి లేదా కాసేపు ఊరించి ఊరించి బ్రతిమాలించుకుని ఇచ్చేస్తాం. దీనిలో మా చెడ్డ ఆనందం ఉంటుంది.
ఆత్మసంతృప్తి దొంగతనం: ఇది కూడా అందరం చేస్తూ ఉంటాం. మనకిష్టమయిన వాళ్ళ వస్తువేదో దాచేసుకుంటాం వాళ్ళ గుర్తుగా. అడిగి తీసుకోవచ్చుగా? కాని అడగం ఎందుకంటే సొంతమనే భావన పైగా అడిగితే వాళ్ళు నవ్వేస్తే మళ్ళీ సిగ్గు కూడాను మనకి. అందుకని ఇలా చేస్తూ ఉంటాం.
తెలియని దొంగతనం: నిజమే మనకి తెలియకుండానే మనం చాలా దోచేసుకుంటాం ఎదుటి వాళ్ళ దగ్గరనించి. అవే మనసు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత మొదలయినవన్నీనూ. అసలు కళాకారులు, మన బ్లాగర్లందరూ కూడా ఈ కోవకి చెందిన పేరుమోసిన దొంగలే. ఈ హారంలో పెద్ద దొంగల గుంపు ఉందండి బాబు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎవరు మీ అభిమానాన్ని దోచేసుకుంటారో?
ఇప్పుడు ఒప్పుకుంటారా? అందరం దొంగలమని! మీలో ఎంతమంది దొంగలో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండే?
35 comments:
:) Totally agreed!
నేను మాత్రం "ఆత్మసంతృప్తి దొంగతనం"లు చాలానే చేశాను. అలాదోచుకున్న వస్తువులను సువినీర్లు(సావనీర్లు)గా దాచుకోవడం ప్యాక్ చేసిమరీ నాకిష్టం.అలా దొంగిలించినవాటిలో కొన్నైతే మరీ సిల్లీగా వుండేవి. :D
అవునండోయ్ ఇలాంటి దొంగతనాలు చాలానే చేశాను ఇవి కాకుండా నిజం దొంగతనాలు కూడా చాలా నే చేశాను. వంటింటి డబ్బాలో మినప సున్నుండలు, మైసూర్ పాకాలు మొదలైనవి గుట్టు చప్పుడు కాకుండా గుటకాయ స్వాహా మొదలైనవి అన్నమాట.
avunane anukuntaaaa
nijamanandi baabu... nijamaina donga meerae ... eppudoo evaro okari manasu meeru dochukuntoonae vunnaru... andukae meeku inthamandi abhimaaaanulu ..!
హమ్మ...మికు చోర కలలో బాగ ప్రావిన్యం వున్నట్టుంది...........
అందుకె కొల్ల గొట్టారు మా సమయాన్ని మనసును....ఈ పొస్ట్ మత్రమెకాదు బ్లాగ్ మొతం చదివాను .....చాల ....చాల బాగుంది........... చాల రోజుల తర్వాత మంచి బ్లాగ్ దొరికింది... nice one
Raghu
అమ్మ దొంగా! ఓయ్ పిల్లా..ఏంటి అలా అడక్కుండా కోసేస్తున్నావ్? ఆ చెట్టు మాది..ఎంత ధైర్యం? చెప్తా ఉండు నీ పని..హ హ బాగుందండీ ఈ రోజు టపా..నిజంగానే మనసు దోచేసారు.ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అలా చిన్నతనంలోకి.
అనువైన చోట మనసు దోచుకుంటున్నారు.సింప్లీ సూపర్బ్..మనసే వెళ్ళే నే ..మమతే పెంచెనే ...గారాలు కురియ .. అనురాగాలు విరియ..మరి మరి .. దోచెనే..
రసజ్ఞకు కళల్లో గొప్ప ప్రావీణ్యం ఉంది. అందంగా టపాలు వ్రాసేస్తుంది. తెలియకుండా ఇలా మనసులు దోచేస్తుంది. తన బ్లాగంతా వెతికా ఎందరి మనసులున్నాయని. హన్నా! ఈ దొంగకు శిక్ష పడాల్సిందే. శిక్ష వేసేస్తున్నా మరి. కలకాలం ఇలా కళకళలాడుతూ ఉండు.
@ కృష్ణ ప్రియ గారూ
అయితే మీరు కూడా దొంగే అనమాట! ఒప్పుకునందుకు థాంక్స్!(lol)
@ ఇండియన్ మినర్వా గారూ
నేను కూడా ఇలా దాచుకున్నాను కాని మీలా పాకింగ్ చేయలేదు బాగుంది మీ అవిడియా! ఈ సారి చేసి చూస్తాను! నెనర్లు!
@ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
మీరూ చోరులే అనమాట! హహహ బాగున్నాయ్ మీ దొంగతనాలు! నేనెప్పుడూ ఇలాంటివి చేయలేదు సుమీ! ధన్యవాదాలు!
@ ckant గారూ
అంటే ఒప్పుకున్నట్టే అనుకుంటున్నా!
అమ్మమ్మమ్మ! ఎంత మాట! అందరూ దొంగలే! ఆడ సరే గానీ, ఆ పైన ఉన్న కాయల దొంగ బొమ్మను ఎక్కడనుండి దొంగిలించారు చెప్పండి. నిజం చెప్పకపోతే మొత్తంగా మీ బ్లాగు మమ్మల్నందరినీ దోచుకోనంత ఒట్టు.
@ అజ్ఞాత గారూ
ధన్యవాదాలు! మీరు చెప్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది ఇంతమంది అభిమానాన్ని దోచుకున్నానుగా!
@ రఘు గారూ
మీ వ్యాఖ్యకి ఎలా స్పందించాలో తెలియడం లేదు అంత అనుభూతినిచ్చారు ధన్యవాదాలు!
@ సుభా
అసలే దొంగిలించిన కాయలకి రుచి ఎక్కువట! అదీ మీ చెట్టయితే ఇంకా రుచి ఎక్కువ ఏమో అని అలా కోసాను! ధన్యవాదాలు!
@ వనజ వనమాలి గారూ
మంచి పాటతో స్పందించిన మీకు నా ధన్యవాదాలు! ఏమిటో అండీ ఇక్కడ మీలో ఎంత మంది దొంగలున్నారో తెలుసుకుందామంటే అందరూ కలిపి నన్నే దొంగని చేసేసారు!
@ జ్యోతిర్మయి గారూ
మీరిలా అభిమానంతో వేసిన శిక్షకి నేను దాసురాలిని! తప్పక అనుభవిస్తాను మీ శిక్షని! నిజంగా మీ అందరి అభిమానాన్ని దోచుకున్నానన్న ఆనందం చాలా బాగుంది నాకు! ధన్యవాదాలు!
@ రాజా గారూ
హహహ! అదీ అజీజ్ గారు గీసిన పెయింటింగ్స్‌లో నాకెంతో ఇష్టమయినది! అందరితో పంచుకుందామని ఇక్కడ పెట్టాను! ధన్యవాదాలు మీ స్పందనకి!
మీరు పేర్కొన్న అన్నీ దొంగతనాలూ చేసానుగానీండీ నాకైతే ఇంకో రకం కూడా ఉంది. అదే "కక్ష సాధింపు దొంగతనం" ఇది ఆటపట్టింపుకి దగరగా ఉన్నా బోలెడు కక్ష తో చేసే పని. దాని బాణీ ఇలా ఉంటుంది
నా చిన్నప్పుడు మా అన్నయ్య నన్ను కొట్టాడనుకోండి వెంఠనే నేను " రేపు నీ సోషల్ వర్క్ బుక్ కనిపించకపోతే నా పూచీ కాదు" చెప్పేవాడిని. అది నా నైతిక బాధ్యతగా ఫీల్ అయ్యేవాడిని. (ఆ తర్వాత బుక్ కిడ్నాప్ అవుతుంది ఓ యేడాదయ్యాకా ఏ అటకమీదో, బూజు పట్టేసిన స్టోర్ రూం మూలనో తేల్తుంది ) ఇందులో తిరిగిచ్చెయ్యడం అన్న సవాలే లేదు. ఉన్నా ఆ ఫలానా వస్తువు యొక్క అవసరం తీరిపోయాకే అది వెలుగు చూస్తుంది. ఇలా ఎన్ని చేసాననీ ? కంపాస్ బాక్సులు , టెక్స్ట్ పుస్తకాలు , నాన్న తిట్టినా కొట్టినా నాన్న యూనిఫార్మ్ బెల్టు , అమ్మైతే - అమ్మ కళ్ళజోడు కేసూ, హ హ హ ఒకటేమిటి...కాదేదీ చోరీకనర్హం అనీ..ఎన్నిజేశానో
- దొంగకోళ్ళు
ఇన్ని దొంగబుద్ధు లున్నాయని ఇప్పటి వరకు గమనించలేదు సుమండి:)
@ అజ్ఞాత దొంగ కోళ్ళు గారూ
హహహ బాగుంది మీ దొంగతనం! నేను మాత్రం ఇలాంటివేపుడూ చేయలేదు ఎందుకనో మన వాళ్ళు కొంచెం బాధపడుతుంటే చూడలేను అందుకనే నేను ఆటపట్టిమ్పుతోనే ఆపేస్తాను! ధన్యవాదాలు కొత్త రకం దొంగ గారూ!
@ జయ గారూ
మీకు మరీ అంత మంచితనం పనికిరాదండీ! అన్నీ జాగ్రత్తగా గమనించాలి! ఇప్పుడయినా కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ దొంగలతో!!!!!!
నేను ఆలస్యం దొంగనండి.
నేను పని దొంగని.:)
శారద
@ శర్మ గారూ
ఈ దొంగల గురించి నేను విననే లేదు సుమీ!
@ శారద గారూ
మీ స్పందనకి ధన్యవాదాలు! కాని ఇక్కడ నేను టపా మొదటిలోనే చెప్పాను పని దొంగలు, ఇంటిదొంగలు, గజ దొంగల గురించి కాకుండా అని!
మీరు చెప్పాక ఒప్పుకోకుండా వుంటామా ? మీ మాటను తప్పకుండా ఒప్పుకుంటున్నాను :)
@ మాలా కుమార్ గారూ
ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు! అయితే మీరు కూడా చోరులే అనమాట!
ఇలా అన్నీ బయట పెట్టేస్తే ఎలా!!!
Ennela
అరవైనాలుగు కళలలో "చౌర్యం" కూడా ఉంది కదా!
@ ఎన్నెల గారూ
అవును కదా! ఇకనించి మనం మాటలని దొంగతనం చేద్దాం! ఏమంటారు?
@ తెలుగు భావాలు గారూ
అవునండి! టపా మొదటిలోనే వ్రాసాను! మీరు గమనించలేదనుకుంట!
I to agree with you...
చిన్న సందేహం. 64 కళల్లో అవధానం కూడా ఉంది. అవధానం అనేది మన తెలుగు భాషకే సొంతమని చదివాను. మరి కళల్లో ఉందంటే మన భారతీయ భాషలన్నింటిలోనూ అవధానం ఉందా... చెప్పండి.
@ సవ్వడి గారూ
నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు! మీ సందేహం విషయానికి వస్తే, నాకు తెలిసున్నంతవరకు అవధానాలు తెలుగు, హిందీ, సంస్కృతంలో చేస్తారు నేను ఈ మూడు రకాలు అవధానాలు చాలానే విన్నాను. మిగతా భాషలలో కూడా బహుశా చేస్తారేమో నాకు తెలియదు నేను వినలేదు కూడా!
nice
?!
thanks siva gaaru!
రసజ్ఞ గారు ఒక సారి ఇలానే దొంగతనం గురించి చర్చలో జామకాయ కొనలేక కాదు దొంగతనం చేసి తింటే ఆ రుచే వేరు అందుకే అని చెప్పాను . మరీ ప్రమాదకరం కానీ దొంగతనాలు మంచివే
@ బుద్దా మురళి గారూ
చాలా రోజులకి దర్శనం! అయితే మీరు సరదా దొంగ అనమాట! నా భావాన్ని అర్ధం చేసుకున్నారు ధన్యవాదాలు!
రసజ్ఞ గారూ,
మీరు దొంగతనం మీద థీసిస్ రాయొచ్చు నిక్షేపంగా. కాకపోతే మన రాజకీయనాయకులని అనుబంధంలో చేరుస్తారో, లేకా Post-doctoral work కి వదిలేస్తారో మీ ఇష్టం.
అభినందనలతో,
@ మూర్తి గారూ
హహహ మీ నమ్మకానికి ధన్యవాదాలు! ముందు నేను పరిశోధిస్తున్న దాని గురించి థీసిస్ వ్రాయకపోతే మా ప్రొఫెసరు గారు కోప్పడతారు కనుక అది అయ్యాక ఇది వ్రాస్తాను! ప్రపంచంలో దేని జోలికయినా వెళ్తాను కాని ఈ రాజకీయ నాయకుల జోలికి మాత్రం పోనండీ! కనుక పోస్ట్ డాక్ కి వేరేది చూసుకుంటాను, మన్నించాలి!
I could not resist commenting. Exceptionally well written!
My web-site - dating online, http://bestdatingsitesnow.com/,
Post a Comment