Friday, November 04, 2011

కుంచె పట్టిన ఇళయరాజా

ఏమిటబ్బా ఈ అమ్మాయి ఇళయరాజా అని ఈయన ఛాయా చిత్రం పెట్టింది అనుకుంటున్నారా? నేను చెప్పదలచుకున్నది అక్షరాలా ఈ ఫోటోలోని వ్యక్తి గురించే! ఈయన పేరు ఎస్. ఇళయరాజా. ఈయన ఒక గొప్ప చిత్రకారుడు అనడం చిన్న మాటవుతుందేమో!
 
ఈయన గురించి చెప్పాలంటే ఈయన గీసిన చిత్రాల ముందు మాటలు చిన్నబోతాయేమో? ఎందుకంటే ఈయన చిత్రాలు ఎంతో చక్కగా, అద్భుతమయిన భావాలని పలికిస్తూ ఉంటాయి. ఆయన కృషి, గీయడం మీద ఆయనకి ఉన్న శ్రద్ధ, ఆసక్తి ఆయన గీసిన ప్రతీ చిత్రంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఈయన చిత్రాలు రవి వర్మ గారి చిత్రాలను గుర్తు చేస్తూ ఉంటాయి. అందువలననేనేమో ఈయనని అందరూ నేటి రవి వర్మ అని పిలుస్తూ ఉంటారు! 

ఆయిల్, వాటర్ కలర్స్, కత్తి, అక్రిలిక్ మొదలయిన వాటితో బొమ్మలు గీయడంలో ఆయన చేయి తిరిగిన వ్యక్తి. ఆనంద వికటన్ అనే తమిళ వారపత్రిక ద్వారా జనాలకి పరిచయం అయ్యి ఒక సుస్థిరమయిన స్థానాన్ని సంపాదించుకున్నారు.  

ఈయన ఏప్రిల్ 19 , 1979 లో తమిళనాడులో జన్మించారు. ఈయన BFA (Bachelor of Fine Arts, 1996-2001)ని కుంబకోణం ప్రభుత్వ కళాశాలలో, MFA (Master of Fine Arts, 2001-2003)ని చెన్నై fine arts కళాశాలలో చేశారు. 

ఈ వృత్తిలోనే స్థిరపడ్డారు. అప్పటినుండి ఊపిరినే కుంచెగా మలచి చిత్రాలకి ప్రాణం పోశారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడే ఈయన చిత్రాలు వీక్షకుల హృదయాలని దోచుకున్నాయి. సహజత్వంతో పాటు, పల్లె పడుచుల అమాయకత్వాన్ని కూడా ఈయన చిత్రాలు ప్రతిబింబిస్తాయి. తుమ్మెద రెక్కలంత మృదువయిన కుంచెని వాడతారో ఏమో? అసలు అవి ఛాయాచిత్రాలా లేక గీసిన చిత్రాలా అనే సందేహం తప్పక కలుగుతుంది! రోజువారీ ఒక మహిళ చేసే పనులన్నీ ఈయనకి స్ఫూర్తే. ద్రావిడ మహిళ అనే పేరుతో ఆయన గీసిన చిత్రాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఆయన గీసిన వాటిల్లో నాకు నచ్చిన కొన్ని చిత్రాలను ఇక్కడ చూడవచ్చును.














































43 comments:

Sravya V said...

భలే ఉన్నాయి రసజ్ఞ గారు ! ఇంతకు ముందు మధురవాణి గారు ఒకసారి ఈ పైంటింగ్స్ గురించి రాసారు , కాకపొతే నాకు చిత్రకారుడి గురించి చదివిన గుర్తు లేదు !

Unknown said...

రసజ్ఞ గారూ! గొప్ప చిత్రకారిడిని మాకిలా పరిచయం చేశారు. నిజంగా రవి వర్మ చిత్రాలను తలపిస్తున్నాయి, గ్రామీణ నేపధ్యంలో పల్లెపడచుల అందమైన జీవితాల్ని మరింత అందంగా చిత్రించారు. ప్రతి చిత్రమూ అద్భుతంగా ఉంది.

వనజ తాతినేని/VanajaTatineni said...

అబ్బ ఎంత బాగున్నాయి.!!!!! నిజంగా ఎంత గొప్ప చిత్ర కారుడు.ప్రతి చిత్రం చాలా అద్భుతంగా ఉంది. రసజ్నా మంచి చిత్ర కారుని పరిచయం చేసారు.మీలు ధన్యవాదములు. ఇళయ రాజా గారికి.. అభినందనలు అందం చాలా తక్కువేమో!

భారతీయ వాఙ్మయం said...

rasagya gaaru see this link please
http://yashodakrishnaallari.blogspot.com/2011/09/blog-post_19.html

రసజ్ఞ said...

@ శ్రావ్య గారూ
స్వాగతం! ఈ బొమ్మలు చాలా మంది ఈ పాటికే చూసినవే కాని ఎందుకో వాటిని గీసిన ఆయనని పరిచయం చేయాలనిపించి వ్రాసాను. ధన్యవాదాలు!

@ చిన్ని ఆశ గారూ
ధన్యవాదాలు మీకు నచ్చినందుకు! ఈ టపాలో నా భాగం కేవలం పరిచయం చేయడం మాత్రమే! క్రెడిట్ అంతా ఇళయరాజా గారిదే!

రసజ్ఞ said...

@ వనజ వనమాలి గారూ
ధన్యవాదాలు మీ అందరికీ ఇళయరాజా గారిని పరిచయం చేయగలిగాను అది నా అదృష్టం అంత గొప్ప వ్యక్తిని మీ ముందుకు తీసుకుని రావడం!

@ గీత _ యశస్వి గారూ
చూసానండి చక్కని సేకరణ! ఇళయరాజా గారు అనగానే అందరికీ ఆయన వేసిన ద్రావిడ మహిళా చిత్రాల సంపుటి ధనలక్ష్మీ ఫోర్దీస్ గారి ద్వారా పరిచయమయ్యాయి! కాని ఆయన ఇంకా ఎన్నో గీసారు నేను కేవలం నాకు నచ్చిన కొన్నిటినే ఇక్కడ పెట్టాను! మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు!

Anonymous said...

రసఙ్ఞ గారూ,
అన్ని చిత్రాలూ ఒకెత్తు. పొయ్యిలో పుల్లలు పెడుతున్న రెండు చిత్రాలూ, వంటచేస్తున్న చిత్రమూ నా వరకూ ఒకెత్తు. నాక్కొంచెం పచ్చరంగు అంటే ఇష్టం పాళ్ళెక్కువలెండి! ఈ చిత్రకారుడి పేరేమిటా అని చానాళ్ళుగా వెదుకుతున్నా. నాకన్నా ముందే కనిపెట్టేశారు (జెలసీ).

జ్యోతిర్మయి said...

రసజ్ఞా ఎవరైనా చిత్రాలు అని చెప్పేవరకూ నమ్మలేం. పరీక్షగా చూస్తే కొన్ని తెలుస్తున్నాయి. ప్రతి చిన్న అంశం ఎంతో శ్రద్దగా గీసారు. మంచి సేకరణ. ముఖ్యంగా వంటచేస్తున్న చిత్రం ఎంత బావుందో!

సుభ/subha said...

రసగుల్లా భలె టపా పెట్టారు. చాలా బాగుంది. ఒక మంచి చిత్రకారుడిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే చిత్ర సేకరణ కూడా చాలా బాగుంది.GOOD WORK.

చిలమకూరు విజయమోహన్ said...

అద్భుతం.

pydinaidu said...

చాలా బాగున్నాయ్

రసజ్ఞ said...

@ అరుణ్ గారూ
హహహ మీ జెలసీకి ధన్యవాదాలు! నేనసలు ఈయన చిత్రాలు మొదటిసారి ఒక పైంటింగ్ exhibitionlo చూసాను చెన్నైలో. అప్పుడు ఆయన కూడా అక్కడ ఉన్నారు. ఆ తరువాత onlinelo చూడటం జరిగింది! అలా ఆయన చిత్రాలతో పాటు ఆయన దర్శనభాగ్యం కూడా ఒకేసారి జరిగింది నాకు!

@ జ్యోతిర్మయి గారూ
నిజమే చాలా చక్కగా చెప్పారు! ఆయనకి బొమ్మలు గీయడం మీద ఉన్న ఆసక్తి అంతా వాటిల్లో కనిపిస్తుంది!

రసజ్ఞ said...

@ సుభా
ధన్యవాదాలు! ఈ ప్రశంసలన్నీ ఆయనకి చెందాల్సినవే!

@ చిలమకూరు విజయమోహన్ గారూ, పైడి నాయుడు గవిడి గారూ
స్వాగతం! మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!

Anonymous said...

"ఆయన చిత్రాలతో పాటు ఆయన దర్శనభాగ్యం కూడా ఒకేసారి జరిగింది నాకు!"

దీనికి జెలసీన్నర మరి!

Mauli said...

హ్మ్.. అన్ని అమ్మాయిల బొమ్మలే!!! జ్యోతి గారు చూస్తె కోప్పడేస్తారు . ఆ తర్వాత మీ ఇష్టం (సరదాగా :) )

sarma said...

ఒక క్షణం మీరు ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాను. అవి అన్నీ ఫోటోలలా వున్నాయి. చాలా ముందుకెళ్ళిన తరవాత ఒక నాలుగు మాత్రం గీసిన చిత్రాలంటే నమ్మకంకలిగింది. చాలా గొప్ప చిత్ర కారుడిని పరిచయం చేసారు. ధన్యవాదాలు. భరతదేశంలో సకల కళలు ఎల్లపుడూ సజీవంగా ఉన్నాయి. అయితే పోషణలేక మరుగుపడిపోతున్నాయి. వ్యాఖ్య పెద్దదయిందనుకుంటా.

రసజ్ఞ said...

@ అరుణ్ గారూ
:D

@ మౌళి గారూ
మరీ అలా భయపెట్టకండి! ఏదో అర్భకురాలిని కాస్త దయుంచండి! (lol)

రసజ్ఞ said...

@ శర్మ గారూ
అయ్యయ్యో అటువంటిదేమీ లేదు ఎంతయినా వ్రాయవచ్చు! నేను ఆటపట్టిస్తే కింద గమనిక ఇస్తానండీ! ఇవ్వలేదంటే నిజమనే అనుకోవాలి మరి! మొదటిసారి ఈయన చిత్రాలని exhibitionlo చూసినప్పుడు నాకు కూడా ఇలానే అనిపించింది ఇది paintinga లేక ఫోటోనా అని! మీరు చెప్పినదానితో ఏకీభవిస్తున్నానండీ! ధనలక్ష్మీ ఫోర్దీస్ గారి పుణ్యమా అని ఈయన ప్రతిభా పాటవాలు లోకానికి పరిచయమయ్యాయి! ధన్యవాదాలు మీ స్పందనకి!

Disp Name said...

బావున్నాయండీ. ఆ వినాయకుని గుడి దగ్గరున్న అమ్మాయిలో డీ కే పట్టామ్మాల్ మనవరాలు సంగీత కళా కారిణి పోలికలు కొంత కనిపిస్తున్నాయి అక్కడా కొన్ని ముఖాలు పరిచయమైన సినీ తారల లా ఉండడం యాదృచ్చికం ఏమో ?

Anonymous said...

Rasagna garu,

chala bagunnay andi..
oka manchi chitra kaarudi ni parichayam chesaru

really hats off to him :)
parichayam chesina meeku ma dhanyavadamulu

రసజ్ఞ said...

@ జిలేబీ గారూ
మీ స్పందనకి ధన్యవాదాలు! వాళ్ళు కూడా ఒక వ్యక్తిని ఊహించుకునే కదండీ గీసేది? అందువలన బహుశా మీరన్నట్టు పరిచయం ఉన్న ముఖాలలా అనిపిస్తాయేమో?

@ అజ్ఞాత గారూ
చదివి స్పందించిన మీకు కూడా కృతజ్ఞతలు!

G K S Raja said...

కాకతాళీయమో ఏమో గాని ఈ రోజే రవివర్మ గారి గురించి ఆవకాయ డాట్ కాం లో చదివాను. ఇదిగో! ఇక్కడ మీరు అభినవ రవివర్మ గారిని, వారి అద్భుత చిత్రాల్ని చూశాను. మూడు గంటలయింది అంతర్జాలం లోని ఈ మాయాజాలం నుంచీ బయటపడడానికి. స్నేహితులందరికీ మీ బ్లాగు లింకు పంపాను. అంతకంటే మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియక. ధన్యవాదాలు.

kalyan said...

ఒక పక్క కాగితం నిర్జీవంగా పడుంది
మరో పక్క కుంచె నన్నెవరైనా వాడకపోతారా అని దీర్గాలోచనలో ఉంది
రంగులు సైతం రంగుల లోకం కోసం వేచి చూస్తున్నాయి
ఇంతలో ఒక చేయి అన్నింటిని చేరదీసింది
వాటి వాటి కలలను నిజం చేసింది
వాటి నుంచి వచ్చిన బొమ్మ తనను తాను చూసుకుంటూ మురిసిపోతోంది ....

pydinaidu said...

కళ్యాణ్ గారు అదరహో..........

రసజ్ఞ said...

@ gksraja గారూ
కృతజ్ఞతతో మీరు అంతమందికి పంపటం నాకు మహదానందంగా ఉంది! నేను వ్రాసేవి నలుగురు చదివి మరో నలుగురికి పంచడం వలన పదిమంది చదువుతున్నారనే తృప్తి చాలండి నాకు! మీకే నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను!

@ కళ్యాణ్ గారూ
కేవ్వ్వ్వవ్ కేక పుట్టించారు! సూపరండీ!

Kalyan said...

@పైడి నాయుడు గవిడి @రసజ్ఞ గారు చాలా చాలా సంతోషం :)

మాలా కుమార్ said...

చిత్రాలు చాలా బాగున్నాయండి . మంచి ఇంఫర్మెషన్ ఇచ్చారు .
ఓ రెండు చిత్రాలు సేవ్ చేసుకున్నాను . అవి మనం వుపయోగించుకోవచ్చు కదండి ?

రసజ్ఞ said...

@ మాలా కుమార్ గారూ
మెచ్చినందుకు నెనర్లు! మీకెన్ని నచ్చితే అన్నీ తీసుకోండి మొహమాట పడకుండా!

శశిధర్ పింగళి said...

అవి వేసినవో, గీసినవో తెలీనంతగా అద్భుతంగా వున్నాయి. మంచి చిత్రాలను, కళాకారుణ్ణి పరిచయంచేసినందుకు ధన్యవాదాలు.

రసజ్ఞ said...

@ పింగళి శశిధర్ గారూ
వచ్చి వాటి అందాలని ఆస్వాదించిన మీకు నెనర్లు!

Anonymous said...

OMG! How badly I missed this post. It's just unbelievable. Some of them, particularly first set, are more like photographs. Thanks for sharing and introducing a fine artist.

రసజ్ఞ said...

@ మూర్తి గారూ
మీకు నచ్చి ఆయన చిత్రాలని మెచ్చినందుకు ధన్యవాదాలు!

Anonymous said...

రసజ్ఞగారూ,
మనం మెచ్చుకోవడం అంటే ఏదో Favour చేసినట్టు. కానేకాదు. అంత అందమైన చిత్రాలను చూసి మనసు స్పందించకపోతే అది ఖచ్చితంగా జడపదార్థమే. అటువంటి వ్యక్తి మనమధ్య ఉన్నందుకు, మన సమకాలీనుడైనందుకు మనం గర్వపడాలి. ఈ రోజుల్లో కవిత్వం ఎవడైనా వ్రాయగలడు. ఎంతమాత్రం ఆదరణకీ, గుర్తింపుకీ నోచుకోదని తెలిసినా అటువంటికళకి తన జీవితాన్ని వెచ్చించేవ్యక్తి చిన్నవాడైనా పాదాభివందనం చెయ్యాలి. అసలు ఆ పట్టుపరికిణీలు, ఆ రంగుల కాంబినేషన్సు చూస్తుంటే, అవి paintings అంటే నమ్మశక్యం కావడం లేదు. అతని ప్రకృతి చిత్రాలు బాగున్నా, ద్రవిడ మహిళ శీర్షికతో వేసినవి అపూర్వమూ, అనుపమానమూ అనడం లో సందేహం లేదు. ఆయనగురించి చిరునామా తదితర వివరాలు తెలిస్తే తెలుపగలరు. ఆయనకి వ్యక్తిగతంగా కూడ ఒక ఉత్తరం వ్రాయదలుచుకున్నాను. మరొక్కసారి ఇంత మంచి కళాకారుడిని పరిచయం చేసినందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను.

రసజ్ఞ said...

@ మూర్తి గారూ
చాలా బాగా చెప్పారండీ! నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ మమకారంతో ఒకసారి చెన్నైలో జరిగిన paintings exhibition కి వెళ్ళినప్పుడు ఈయన చిత్రాలని మొదటి సారి చూడటం జరిగింది. ఆయన మెయిల్ artistilayaraja@gmail.com

Pradeep said...

It's lovely...want to see it for real ! Let me know if the exhibition is going to be held in Bangalore.

రసజ్ఞ said...

@ ప్రదీప్ గారూ
ధన్యవాదాలు మీ స్పందనకి! నాకు తెలియదండీ! మీకు ఆయన చిరునామా మాత్రం ఇవ్వగలను!
House Address :

S.Elayaraja
36/1A block, chandra flats,
bhajanakoil street,
thathan kuppam,
villivakkam, chennai-600049.
mobile no: +91 98411 70866

studio address :

S.Elayaraja
Cauvery fine art studio,
290,2nd floor,
kilpauk garden road,
police quarteres [opp ]
chennai-600010 .

chaitanya said...

chaala bagunnayi....thank u.. best wishes 4 u too

రసజ్ఞ said...

@ చైతన్య గారూ
మీకు నా ధన్యవాదాలు!

Sisiravasanthamblogspot.com said...

Rasagna garu,
oka manchi goppa, chitrakaarudini parichayam chesaru mana deshamulo entha goppa chitrakaarulunnaro vaarandarini oka vedika meedaku teesukocheprayatna mu cheyyali .chala manchi prayatnam chestunnaru . Ilayaraja gariki manaspoortigaa abhinandanali
vasantha mukthavaram
website 'mvkgreenart.com

రసజ్ఞ said...

@ వసంత గారూ
నా ప్రయత్నం నచ్చినందుకు ధన్యవాదాలండీ! అందుకే వీలున్నప్పుడల్లా నాకు తెలిసిన కొంతమందిని పరిచయం చేస్తున్నాను!

Ravi said...

Wow... excellent... Amazing picture... beautiful....

రసజ్ఞ said...

@ రవి గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

Priya said...

Wowww!! No words. Thanks for sharing andi.