Wednesday, October 05, 2011

అప్పుడేమయిందంటే......


నగరం ఆదమరచి నిదురిస్తున్న వేళ
వీధి కుక్కలకి వాక్ స్వాతంత్ర్యం వచ్చిన వేళ
గత జ్ఞాపకాలేవో చల్లని గాలిలా తాకుతున్న వేళ
మనోభావాలు కొమ్మలలా ఊగుతున్న వేళ
బాధలన్నిటినీ నింపుకున్న చీకటి కాటుకగా మారిన వేళ
ఆనందానుభూతులు జాజుల సువాసనలా వ్యాపిస్తున్న వేళ
గాలికి ఊగే కొబ్బరాకులు వింఝామరలు విసురుతున్న వేళ
వెన్నెల గతం తాలూకు ఆలోచనలకి జో కొడుతున్న వేళ
నక్షత్రాల కాంతులు క్రొత్త ఆశలని రేపుతున్న వేళ
కునుకు వచ్చి కనుపాపలను వాల్చి కనురెప్పల దుప్పటీ కప్పింది.

24 comments:

జ్యోతిర్మయి said...

ఏదో మంచి జ్ఞాపకమో, కథో, కమామీషో.... ఏం చెప్పబోతున్నారా అని ఆత్రుతగా మొత్తం చదివేస్తే ....అదే౦డీ అలా నిదరపోయారు?

Anonymous said...

నా వరకూ కవిత్వము మాండలిక యాసలో ఉంటే చాలా నచ్చుతుంది. మాయేపున ఈ 'వేళ' అనే పదం వికృతి రూపములో 'యాల'గా మారుతుంది. ఈసారలా ప్రయత్నించి చూడండి.

వనజ తాతినేని/VanajaTatineni said...

baagundi. yenta manchi Technic to.. yekkadiko teesuku velli Takkuna padeshaatv! good. manchi kavitwam nee sontham.keep it up.

thrill said...

abba super , exlnt , marvls , bhale undandi kavita ( naa antaratma - oree sannasosaa oo pogidestunnav .... aavidagaru oooo deergam teesi edo cheptaru ani aatram ga eduruchustunte pusukkuna kanureppala duppati kappesi , inkacheppedemledu velli nuvvu padukora sannasoda anitittaru,ardham chesko.)

thrill said...

RASAGNA GARU

wish u happy dassara andi

itlu
mee pataka LOKAM lo oka thriLOKAM

రసజ్ఞ said...

@జ్యోతిర్మయి గారు
మనుష్యాణాం నిద్ర బలం అన్నారు (నేనే!). పైగా చదువుకోమంటే మెలకువగా ఉండవు కాని ఇక్కడ కబుర్లు చెప్తూ కూర్చున్నావా అని అడుగుతారేమో అని పడుకుండిపోయాను!

@అచంగ (అరుణ్) గారు
ఇప్పుడు వ్రాసిన దానికి అది సరికాదు కాని ఈ సారి మొత్తం ఆ యాసలో వ్రాయడానికి ప్రయత్నిస్తానండీ! మీ సలహాకి ధన్యవాదాలు!

nanda said...

వీధి కుక్కలకి వాక్ స్వాతంత్ర్యం వచ్చిన వేళ ....................................
unique line andee

రసజ్ఞ said...

@వనజ వనమాలి గారు
హహహ! చాలా చాలా థాంక్స్ అండి!


@Thrill gaaru
thanks for ur wishes and comment! నేను తిట్టలేదండీ! కునుకు వచ్చి పడుకోపెట్టేసింది నేనేం చేయను చెప్పండి!

రసజ్ఞ said...

@నంద గారు
థాంక్స్ అండి!

Anonymous said...

Rasagna garu,

నగరం ఆదమరచి నిదురిస్తున్న వేళ
వీధి కుక్కలకి వాక్ స్వాతంత్ర్యం వచ్చిన వేళ
గత జ్ఞాపకాలేవో చల్లని గాలిలా తాకుతున్న వేళ
మనోభావాలు కొమ్మలలా ఊగుతున్న వేళ
బాధలన్నిటినీ నింపుకున్న చీకటి కాటుకగా మారిన వేళ
ఆనందానుభూతులు జాజుల సువాసనలా వ్యాపిస్తున్న వేళ
గాలికి ఊగే కొబ్బరాకులు వింఝామరలు విసురుతున్న వేళ
వెన్నెల గతం తాలూకు ఆలోచనలకి జో కొడుతున్న వేళ
నక్షత్రాల కాంతులు క్రొత్త ఆశలని రేపుతున్న వేళ
కునుకు వచ్చి కనుపాపలను వాల్చి కనురెప్పల దుప్పటీ కప్పింది.

bagundandandi.....
deenini meeke ankitham isthunnam:)
pandaga chesukondi..
memu deenini publish chesukovacha :)
mee nundi permission kaavali.. wvratha poorvakanga istara mari.. mee khyathi ni prapanchaniki cheptham
Keep going
Wish u all the best

శశి కళ said...

బాగుంది...అన్నిటి కంటె చివరలొ నిద్ర పొవటం...))))))))

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
ఏంటీ!!!! నేను వ్రాసిన దానిని నాకే పైగా అందులోను అంకితం అంత లేదులెండి! అతిశయోక్తి కాకపోతే పబ్లిష్,పండగ, ఖ్యాతి అంత అవసరమా! anyways thanks for your wishes!!!

@శశికళ గారు
హహహ నెనర్లండి! మరంతే కదా ఏం చేసినా చేయకపోయినా నిద్రే కదా ముఖ్యం!

Anonymous said...

u welcome Rasagna garu...
antha mee meedunna abhimanam lendi :P

David said...

nice bagundi....

Kalyan said...

అ పై కదా నేను పూరిస్తాను చమత్కారానికే తప్ప మరోల అనుకోకండి.. వేగంగా రాసినది కాస్త అచ్చు దోషాలు వుంటై మనించుకోండి.. సరదాగా చదవండి :)

కప్పిన రెప్పల దుపట్టి మాటున కళల రాకుమారుడు రధముపై వొస్తున వేల..
నగరమంతా తారలలా మేలుకొన్న వేల...
కుక్కలు అ చప్పుడుకి బయపడి మౌనమైన వేల..
గత జ్ఞ్యాపకాలకు రూపమోచిన వేల...
మనోభావాల కొమ్మలకు పూలు పూచినా వేల..
కాటుక పూసిన కనులు తేరకుండా అడమరచిన వేల..
సువాసనలే కాక జాజులే మీ చెంత చేరిన వేల..
కొబ్బరాకులు వింఝామరవాలే వినిపించని వేల..
వెన్నల జోల పాటకు మించిన హాయిగా వున్నా వేల..
నక్షత్రాల కాంతులకు అర్థం తెలుసుకుంటున వేల..
మీకు ఎందుకో మెలుకవ వోచి అంత కల అని తెలుసుకున్న వేల..
మళ్ళి కునుకు వచ్చి కనుపాపలను వాల్చి కనురెప్పల దుప్పటీ కప్పింది.

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
మీకు నా మీద ఉన్నా అభిమానానింకి ధన్యురాల్ని!

@డేవిడ్ గారు
నెనర్లు!

రసజ్ఞ said...

@Kalyan gaaru
ఇందులో అనుకోడానికేమీ లేదండీ బాగా రాసారు! అసలు నేను రాసిన అదే పదజాలంతో ఎంత చక్కగా రాసేసారో! ఇంత మంచి కవితని రాసినందుకు అభినందనలు అది ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు!

Kalyan said...

rasagnya garu :) thank you

Anonymous said...

Rasagna garu,
mee next post gurinchi wait chesthunnam andi

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
వస్తుందండీ ఇప్పుడో అప్పుడో ఎప్పుడో ఒకప్పుడు తప్పక వస్తుంది

Sri Valli said...

Rasagna gaaru..chala bavundi me kavitha :)

రసజ్ఞ said...

థాంక్స్ వల్లి గారు!

kiran said...

:)..bagundi :)

రసజ్ఞ said...

నెనర్లు కిరణ్ గారూ!