నవదుర్గలు అమ్మవారి అవతారాలు |
అమ్మా అమ్మా రావమ్మా
మహలక్ష్మీ దయచెయవమ్మా
తొమ్మిది రోజుల పండుగిదీ
తోయజనేత్రీ రావమ్మా ||అమ్మా||
రాక్షస బాధలు పడలేక
దేవతలంతా మొఱలిడగా
మహిషాసురునీ చంపితివి
మానవ కోటిని కాచితివి ||అమ్మా||
సప్తమి నాడు కాళివిగా
అష్టమి నాడు దుర్గవిగా
నవమి నాడు నళినాక్షివిగా
దశమి నాడు జయమందితివి ||అమ్మా||
కుంకుమ పూజలు చేసెదము
కువలయనేత్రీ రావమ్మా
హారతి గైకొన రావమ్మా
అభయమ్మీయగ రావమ్మా ||అమ్మా||
పాఠకులందరికీ దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు! అమ్మవారి పాటలలో నాకు బాగా నచ్చిన పాట, దేవీ నవరాత్రుల పాట ఇది.
ఈ దేవీ నవరాత్రులలో ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఆసక్తికరమయిన విషయం ఉంటుంది. కొంతమందికి బొమ్మల కొలువులు అయితే, ఇంకొంతమందికి బతుకమ్మ, మరికొంతమందికి పూజలు, మిగతావాళ్ళకి రక రకాల నైవేద్యాలు. ఇలా అనమాట. నా విషయానికొస్తే చాలా ఆసక్తికరమయిన విషయం మాత్రం పూజలు వాటిల్లో కూడా చిన్నపుడు చేసే బాల పూజలంటే చాలా ఇష్టం. ఈ నవరాత్రులలో బాలా త్రిపుర సుందరి దేవి స్వరూపాలుగా చిన్న పిల్లలకి (ఆడ పిల్లలకి) బాల పూజలు చేస్తారు. అలా నాకు మా అమ్మమ్మ పూజ చేసి చక్కగా నా కాళ్ళకి దణ్ణం పెడుతుంటే నేను అమ్మవారిలాగా అక్షింతలేసి ఆశీర్వదించడం భలే నచ్చేసేది నాకు. లేకపోతే ఎప్పుడూ మనమే అందరి కాళ్ళకీ దణ్ణం పెట్టాలి ఛీ నాకు ఎవరూ పెట్టడం లేదు అని బాధపడే సమయంలో ఇలాంటివి చేస్తే ఎంత బాగుంటుంది మీరే చెప్పండి! అలా ఈ దేవీ నవరాత్రులలో చిన్నపిల్లలకి ముద్దు ముద్దుగా చేసే బాల పూజలంటే నాకిష్టం.
రోజుకొక రూపంలో దర్శనమిచ్చే తల్లిని చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఆ దివ్యమంగళ మూర్తిని ఈ అలంకరణలతో చూస్తుంటే ఆనంద పారవశ్యంలో మునిగి తేలడం తప్ప వర్ణించలేని అనుభూతికి లోనవుతాము. అమ్మా అని పిలిచిన వెంటనే తన బిడ్డకేమయిందో అని పరిగెత్తుకుని వచ్చే చల్లని తల్లి. అలానే బిడ్డకి ఆపద కలిగించిన ఎవరినయినా సరే ఊరుకోకుండా ఉగ్రరూపంలో శిక్షించే తల్లి. అమ్మ గురించి అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఇక్కడితో ముగిస్తున్నాను. అమ్మవారి శుభాశీస్సులు అందరికీ ఎల్ల వేళలా ఉండాలని, ఆమె కరుణా వీక్షణాలతో అందరూ హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
శ్రీ లలితా చాలీసా
శ్రీ లలితా చాలీసా
5 comments:
మీకు, మీ కుటుంబసబ్యులందరికీ దసరా శుభాకాంక్షలు
నెనర్లు వంశీ కిషోర్ గారు
ఈ పాట చాలా బాగుందండీ చిన్న చిన్న పదాలతో చక్కగా అర్ధమవుతు ఉంది. మీరు ఇక్కడ ఇచ్చిన లలిత చాలీసా నేనెప్పుడూ వినలేదు అది కూడా సరళమయిన పదాలతో చదివిన వెంటనే అర్ధమయ్యేలా ఉంది. ఇంత మంచి విషయాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
Rasagna garu,
Meeku mariyu mee kutumbaniki Dussera Subhakankshalu
Mee devinavarathrulu baga Jaruguthunnay ani aseesthunnam.....
Mee visleshana bagundi andi
@తెలుగు అజ్ఞాత గారు
చదివి వ్యాఖ్యానించిన మీకు కూడా!
@ఆంగ్ల అనానిమస్ గారు
ధన్యవాదాలండీ! అమ్మవారి దయ వలన అన్నీ సవ్యంగానే సాగుతున్నాయి.
Post a Comment