Sunday, July 03, 2011

ఆకు-కంచం



అయిన వాళ్లకి ఆకుల్లోను కన్న వాళ్లకి కంచాల్లోను అనే సామెత మీరు వినే ఉంటారు. ఇదే వాడుక భాషలో అయిన వాళ్లకి ఆకుల్లోను కాని వాళ్లకి కంచాల్లోను అని రూపాంతరం చెందింది. ఇది విన్నప్పుడల్లా రకరకాల సందేహాలు నన్ను వెంటాడేవి.  ఇక్కడ నాకు వచ్చిన చిక్కల్లా అయిన వాళ్లకి ఆకుల్లో పెట్టడం, కన్న వాళ్లకి కంచాల్లో పెట్టడం ఏమిటా? అని.  అయిన వాళ్లకి చక్కగా కంచంలో పెట్టాలి కన్న వాళ్ళలాగా కాని చవకగా దొరికే ఆకులో పెట్టడం ఏమిటా అని ఎన్నో సార్లు అనిపించింది నాకు. అసలు ఈ పెద్దవాళ్ళు ఏది పెట్టినా మన మంచి కోసమే కదా అని ఎంతో లోతుగా ఆలోచించి చూస్తే, అరటి ఆకులో భోజనం పెట్టడం వెనుక ఉన్న కారణాలను గమనిస్తే అప్పుడర్ధమయ్యింది అసలు విషయం.

అరటి ఆకులో భోజనం చేయడం అనేది మనకి అనాదిగా ఉన్నఆచారం. మనం అన్ని ఆకులుండగా అరటి ఆకుని మాత్రమే ఎంచుకోడానికి తగిన కారణాలు చాలా ఉన్నాయి. ముందు ఆ కారణాలేమిటో మీ ముందుంచుతాను. 
  1. శత్రువయినా సరే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే గొప్ప సాంప్రదాయం మనది. అలా శత్రువుకి  భోజనం  పెట్టేటప్పుడు, ఆ  అన్నంలో  విషం  కలిపారేమో అన్న  భయం  ఉంటుంది. అదే  అరటి  ఆకులో  భోజనం  పెడితే, ఒక  వేళ విషం  కలిపితే  ఆ  ఆకు  నల్లగా  మారి  అన్నంలో  విషం  ఉంది అని  తెలుస్తుంది. కనుక అరటి  ఆకులో  అన్నం  పెట్టినప్పుడు, మన  శత్రువులు  కూడా  ప్రశాంతంగా  భయం  లేకుండా  తింటారు.  
  2.  వేడి వేడి పదార్ధాలను అరటి ఆకు మీద వడ్డించడం వలన ఆకు మీద ఉండే పొర ఈ వేడి ద్వారా కరిగి అన్నంలో కలుస్తుంది. దీని వలన భోజనానికి అద్భుతమయిన రుచితో పాటు జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.
  3. ఈ ఆకులో అన్ని రకములయిన విటమిన్లు ఉండటం వలన మనం వేడి పదార్ధాలను దాని మీద పెట్టుకుని తినేటప్పుడు ఆ విటమిన్లన్నీ మనం తినే ఆహారంలో కలిసి మంచి పోషకాలను అందచేస్తాయి.
  4. ఎన్నో రకములయిన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. ఇది కాన్సరు (మెదడు, ప్రోస్టేటు, సెర్వైకల్ మరియు బ్లాడర్), హెచ్.ఐ.వి ,  సిక్కా, పార్కిన్సన్ మొదలయిన వాటిని నిరోధించగలదు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచగలదు.
  5. వాడి పారవేసిన ఆకులు మట్టిలో సులభముగా కలిసిపోయి నేలను సారవంతముగా మారుస్తాయి కాబట్టి పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. 
  6. అరటి ఆకులో భోజనం పెట్టడం అనేది మనకి ఎదుటి వాళ్ళ మీద ఉన్న గౌరవానికి ప్రతీక కూడాను.
ఇన్ని రకములయిన ప్రయోజనాలు ఉండటం వలన అరటి ఆకు భోజనం అనేది ఘనమయిన భోజనాన్ని ప్రతిబింబిస్తుంది అంటారు. అంత మంచి, మన అనుకున్న వాళ్ళకి జరగాలి అని అనుకోవడం సహజం కనుక అయినవాళ్ళకి ఆకుల్లో అని వాడడం జరిగినదని నా అభిప్రాయం. ఇహ కన్న వాళ్ళకి కంచాలు అంటే ఇది వరకు అందరూ ఇంట్లో వాళ్ళు వెండి కంచం మధ్యలో బంగారు పువ్వు ఉన్న కంచాలలో భోజనం చేసేవారు. ఇది కూడా విషాన్ని హరిస్తుంది. అటువంటి పనిని చేసేది కేవలం మన అరటి ఆకు కనుక దానిని మనం అయిన వాళ్లకి పెడతాము. బహుశా పూర్వ కాలంలో కేవలం అరటి ఆకులలో భోజనాలు చేయుట వలెనే ఆ కాలం వాళ్ళు అంత ధృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారేమో!

అరటి ఆకులో, అడ్డాకు (విస్తరాకు) లో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది. తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిసివచ్చి సాక్షాత్తు లక్ష్మి దేవి ఇంట్లో ఉంటుంది. బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు. టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్త్, వర్తమానాలు తెలుసుకునే జ్ఞానం వస్తుంది. జమ్మి విస్తర్లో భోజనం చేయడం వలన లోకాన్ని జయించే శక్తిని సంపాదించవచ్చు అని మన పురాణాలలో చెప్పబడింది. ఇది నిజమో లేక కల్పనో తెలియదు కాని మన అరటి ఆకుని మించిన ఆకు లేదు.

అన్నట్టు అరటి ఆకులని భోజనాలకి వాడటం అనేది కేవలం మన భారత దేశంలో మాత్రమే కాదండోయ్, ఫిలిప్పిన్లు,  మలేషియన్లు, మెక్సికన్లు, సింగపూర్ వాసులు ఇలా చాలా మందే వాడతారు. ఇకనించి ఎప్పుడూ ఒక కవిరి (అరటి ఆకు కొలమానికం) అరటి ఆకులని ఇంట్లో ఉండేలా చూసుకుని వచ్చిన వాళ్లకి ఎంచక్కగా అందులో వడ్డించేయండి. గౌరవ మర్యాదలతో కూడిన ఆరోగ్యవంతమయిన భోజనం తినే వారి సొంతం అవుతుంది!


    11 comments:

    నందు said...

    ఎన్నో వివరాలు పొందుపరిచి సామెత అంతరార్ధాన్ని చక్కగా వివరించారు ధన్యవాదాలు !

    రసజ్ఞ said...

    @నందు గారు
    మీరు చాలా ఓపికగా చదివినందుకు నాకు అరటి ఆకులో భోజనం చేసినంత తృప్తిగా ఉంది. మీకు కూడా ధన్యవాదములు.

    Padmarpita said...

    చక్కగా వివరించారు....Nice blog!

    రసజ్ఞ said...

    @పద్మర్పిత గారు
    చాలా చాలా ధన్యవాదములండి.

    murali said...

    chala baaga varniNchav ariti aaku gurunchi i didnt know these these things thankyou very much and ne varnana ki joharulu

    రసజ్ఞ said...

    @murali
    thanks

    Nayonika said...

    ఎవరో ఫ్రెండ్ చూపిస్తే మీ బ్లాగ్ చూసాను. ఎంత అందమైన భాష! బంగారు కంచానికైనా గోడచేర్పు కావాలంటారు కదా. అందంగా చాలా మంది ఆలోచిస్తారు. ఎంత అందమైన భావాలైనా భాషాజ్ఞానం లేకుండా వ్యక్తీకరిస్తే గోడచేర్పు లేని కంచంలో పోసిన పాయసంలా ఒలికిపోయే ప్రమాదం ఉంది. మనసుకి హత్తుకుపోయేలా మంచి మాటలని చక్కని పదాలతో ఆవిష్కరించిన మీ బ్లాగ్ చదవటం తప్పకుండా ఒక ప్రియ రసోస్వాదనం.

    రసజ్ఞ said...

    @నయొనిక గారు
    ఎలాగయితేనేమి? నా బ్లాగ్ చూసి, చదివి మీ అభిప్రాయాన్ని అందముగా పొందుపరిచారు. నా బ్లాగ్ని మీకు పరిచయం చేసిన మీ నేస్తానికి,చదివిన మీకు నా ధన్యవాదములు.

    కృష్ణప్రియ said...

    చాలా సంతోషం! బహు చక్కగా ఉన్నాయి మీ ఆకు కంచం విశేషాలు.

    రసజ్ఞ said...

    @కృష్ణ ప్రియ గారు
    మీరు అన్నీ తీరికగా, ఓపికగా చదివినందుకు నాకు మహదానందంగా ఉంది!

    Anonymous said...

    Thanks for sharing your info. I truly appreciate your efforts and I will be waiting for your
    next write ups thank you once again.

    Stop by my blog post - dating sites (bestdatingsitesnow.com)