Wednesday, December 14, 2011

కొంటె కవితకి ముద్దుగుమ్మ స్పందన


నాపై కవితలల్లి కలవరించకు
నాలో కలతరేపి పరవశించకు
ఊరు, పేరు అడిగి మరీ వేధించకు
ఊసులేవో చెప్పి మరీ విసిగించకు

అడిగావని చెప్పనా నా పేరును
అభినందించనా నీ ప్రతిభను
నా పలుకులే నీకు మధురమా
నా నామమే నీకు సుమధురమా

డైలీ పేపర్లలో అడిషనల్ పేరు కాదు
వీక్లీ పుస్తకాల గోలలో నా పేరెందుకు
పక్షపు పత్రికల వలపక్షపు తీరు కాదు
మాస పత్రికలలోలా మూసపు పేరు కాదు

కవులందరి కలం నుండి వెలువడేదే నా పేరు
కవి హృదయపు మదిలోన కొలువుండును నా పేరు
అక్షరాలు పొందుపరుచు నేర్పరులకు తెలుసు నా పేరు
కవులందరూ కోరుకునే కీర్తికి స్ఫూర్తి నా పేరు

నా పేరు తెలియని కవి కానరాడు కొరగాడు
ఇప్పటికయినా తెలిసిందా నా పేరు
ఊరించను ఇంకా నీ మనసుని శోధించను
తెలుపనా నా పేరును ఐతే తెలుసుకో
నా పేరు రచన

35 comments:

Unknown said...

"...కవులందరి కలం నుండి వెలువడేదే నా పేరు
కవి హృదయపు మదిలోన కొలువుండును నా పేరు...."
చదువుతూ పోతూ పేరు 'కవిత' అంటారేమో అనుకున్నాము. కానీ 'రచన' గా 'కవితా రచన' చేశారు ;)
చాలా బాగుంది.

సుభ/subha said...

రసాలన్నీ ఒలికించి
రాగాలన్నీ చిలికించి
రచన చేసావు కొంటెగా
రంజింపచేసావు గమ్మత్తుగా
బాగుంది రసగుల్లా.. కొంటె కవికి ముద్దుగుమ్మ తేనె జవాబు...

Disp Name said...

మీ 'రచన' ని మధ్యలో 'సాయి' గారు కొట్టేసారు !



చీర్స్
జిలేబి.

Unknown said...

చాలా బావుందండి.చివర్లో కవిత అంటారేమో అనుకున్న ...రచన అన్నారు.అదే కరెక్ట్ కదా

Disp Name said...

రచన సాయి కి అంకితం ఐపోయింది !

రాజ్యలక్ష్మి.N said...

కొంటె కవితకి ముద్దుగుమ్మ స్పందన
చాలా బాగుందండి...

జ్యోతిర్మయి said...

చిన్ని ఆశ గారి లాగానే నేనూ 'కవిత' అనుకున్నా రసజ్ఞా..కొంటె కవితకి ముద్దుగుమ్మ స్పందన బావుంది.

శ్రీలలిత said...

గుండె నిండిపోయి గోల చేస్తావుంటె
గుబులేదొ మదిలోన చెలరేగిపోతుంటె
పదము పడక మనసు తబ్బిబ్బు పడుతుంటె
ప్రసవవేదన పడిన పడతి ముదమువోలె
పలికిన నా రచన ముత్యాలసరాలై మెరవగా
పొంగేను నా మనసు పైపైకి పాలలా...

ఆ.సౌమ్య said...

బలే బలే బలే....

కవులందరూ కోరుకునే కీర్తికి నా పేరు స్ఫూర్తి ని "కవులందరూ కోరుకునే కీర్తికి స్ఫూర్తి నా పేరు" అని మార్చేయండి బావుంటుంది. అలాగే

ఊరించను ఇంకా నీ మనసుని శోధించను....ఇక్కడ శోధించను కి సరిగ్గా అర్థం కుదిరినట్టు లేదు. బదులుగా "సాధించను" అని మార్చేస్తే?

Anonymous said...

ఆశ!దోశ! నీ పేరు చెప్పించేసుకుందానా ఎత్తు. బాగుంది

Kalyan said...

@రసజ్ఞ

హహహ చాలా కొంటెగా చెప్పించారు పేరు అమ్మాయి చేత .చాలా బాగుంది అండి. :) అటు పిమ్మట వాళ అమ్మ నానలు ఏమన్నారో నేను చెబుతాను.. మీరు ప్రేమించుకుంటున్నారు ani చెప్పలేదు ఐన నేను అలానే అనుకోని అల్లెసాను ఎడ్జస్ట్ అవ్వండి....

మీ పరిచయాలు మాకు తంటాలు
మీ ప్రేమానురాగాలు మాకు తలనొప్పి సమాచారాలు
మీరు కలిసినట్టు మేము కలవలేకున్నామే
మా మధ్య ప్రేమ లేనట్ట లేక చాదస్తం పెరిగినట్ట

మీ నవ్వులు చూస్తుంటే ముచ్చటగా వుంది
మీ వేగం చూస్తుంటే తన్నాలని వుంది
ఏమి చేయమంటారు మిమ్మల్ని ఏమి చేయమంటారు
వీక్లీ పేపర్ లో జోక్స్ కాదు లైఫ్ అంటే
మంత్లీ ఎడిషన్ లో కథలు కాదు ప్రేమంటే
ఎప్పటికి వాటిని పదిల పరిచే గ్రంధాలయం లాంటిది
అలాంటి గ్రందాలయంలోనే ప్రేమించుకున్నారే
మీ ప్రేమ కూడా పదిలమౌతుందని ఆశిస్తున్నాము !!!

మౌనముగా మనసుపాడినా said...

!! రసజ్ఞ !! గారు బాగుంది అండి

ఎందుకో ? ఏమో ! said...

Actually I thought her name as "bhavana" & also as "కవిత" but in the last moment I found the twist
in a small, simple & smart sentence "నా పేరు రచన "

:) :) :)

?!

రసజ్ఞ said...

@ చిన్ని ఆశ గారూ
కవిత కాదు అని మిమ్మల్ని నిరాశ పరిచానా? అయినా కవిత అనేది ఒక పక్షపు పత్రిక ఈ అమ్మాయి ముందు చెప్పనే చెప్పింది కదా! పక్షపు పత్రికల వలపక్షపు తీరు కాదు అని కనుక రచన అని నామకరణం చేశాను! నా ఈ కవితా రచన మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ సుభా
ఎన్నాళ్టికి మళ్ళీ బ్లాగు ప్రవేశం! హమ్మయ్యా వచ్చేసారా? ఇప్పుడు నాకు ఆ రసగుల్లా తిన్నంత హాయిగా ఉంది ;) ఆ ముద్దుగుమ్మ తేనె జవాబు నచ్చినందుకు ఈ ముద్దుగుమ్మ చెప్పే బెల్లంతో కూడిన ధన్యవాదాలు అందుకోండి :D

@ జిలేబీ గారూ
మధ్యలో ఈ సాయిగారెవరు చెప్మా????

రసజ్ఞ said...

@ kallurisailabala గారూ
ఒకసారి చిన్ని ఆశ గారికి సమాధానంగా ఇచ్చిన వ్యాఖ్యని చూడరూ! పైగా ఎవరయినా కవిత లేదా ఏ ఇతరత్రా అయినా రాస్తే రచనే కదా అయ్యేది? అందుకని అలా పెట్టాను! మీ స్పందనకి ధన్యవాదాలు!

@ రాజి గారూ
మా ముద్దుగుమ స్పందన నచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు!

@ జ్యోతిర్మయి గారూ
ఒకసారి చిన్ని ఆశ గారికీ, శైలాబాల గారికీ సమాధానంగా ఇచ్చిన వ్యాఖ్యని చూడరూ! మీకు నచ్చినందుకు నెనర్లు!

రసజ్ఞ said...

@ శ్రీలలిత గారూ
ఎంత బాగా వ్రాసేసారో! ప్రతీ పదమూ చక్కని భావాన్ని వ్యక్తం చేస్తోంది. పాలలా పొంగిన మీ మనసుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు!

@ సౌమ్య గారూ
నిజమేనండీ అలానే రాసాను కాని అచ్చుతప్పు ఇక్కడ ఇప్పుడు సరిదిద్దాను. ఊరించను ఇంకా నీ మనసుని శోధించను ఇక్కడ నీ మనసు నా పేరు కోసం ఇంకా వెతికేలా చేయనులే ఇప్పటికే వెతికి వెతికి అలసిపొయావు నా పేరు కోసం అన్న ఉద్దేశ్యంతో అలా వ్రాసాను! సాధించాను అంటే ఏదో అత్తగారి సాధింపులా ఉంటుంది నా ఉద్దేశ్యం ఇక్కడ ఏడిపించటం కాదు కేవలం అతను పేరు కోసం వెతికేలా చేయటం కనుక అందువలన చేత శోధించనుకే నా ఓటు! అన్నీ బలేలకి ధన్యవాదాలు!

@ తాతగారూ
హహహ ఆశ చాకిలెట్లు దొరకట్లేదు కాని దోశ మాత్రం ప్రొద్దున్నే తిన్నాను! అసలు మనిషికి రసజ్ఞత్వం లేకపోతే వృధానేగా (చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు) ! మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ కళ్యాణ్ గారూ
హహహ అబ్బాయి చచ్చీచెడీ కష్టపడి ఇప్పటికి అమ్మాయి బదులిచ్చిందన్న ఆనందంలో గంతులేస్తున్నాడు ఇంకాను! మీరేమో ప్రేమ, పెళ్లి దాకా వెళిపోయారు చాలా ఫాస్టుగా ఉన్నారే! మీ స్వీయ అనుభవమేమయినా గుర్తొచ్చిందా ఏంటి? ;) పర్లేదులే చెప్పండి!
వీక్లీ పేపర్ లో జోక్స్ కాదు లైఫ్ అంటే
మంత్లీ ఎడిషన్ లో కథలు కాదు ప్రేమంటే
ఎప్పటికి వాటిని పదిల పరిచే గ్రంధాలయం లాంటిది చాలా బాగుంది! ధన్యవాదాలు మీ ముందుచూపుతో కూడిన స్పందనకి!

@ మౌనముగా మనసుపాడినా గారూ
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!

@ ఎందుకో? ఏమో! శివ గారూ
మీరు కూడా ఒకసారి చిన్ని ఆశ గారికీ, శైలాబాల గారికీ సమాధానంగా ఇచ్చిన వ్యాఖ్యని చూడరూ! అయితే మా ముద్దుగుమ్మ మీ మనసుని కూడా శోధింపచేసిందనమాట! ఇలా రెండు పేర్లు ఆలోచించింది మీరే! ధన్యవాదాలు!

Balu said...

వారంరోజులు సమయం తీసుకున్నా ఓరేంజ్ లో రిప్లై ఇచ్చిందండీ అమ్మాయి. చాలా బాగుంది.దీనికి అబ్బాయి కౌంటర్ కొనసాగుతుందా?
కళ్యాణ్ గారు చెప్పిన పేరెంట్స్ వెర్షన్ కూడా బాగుంది. వీలుంటే వాళ్ళ స్పందనని కూడా ఓ పట్టుపట్టండి.

Kalyan said...

@రసజ్ఞ

స్వీయ అనుభవమా అయో రామ పాయసం ఎం కాదు !! ఎందుకు చెప్తారులెండి నేను డిగ్రీ చదివేటపుడు పబ్లిక్ లైబ్రరీ కి వెళ్ళేవాడిని . నేను చదువుతుంటే నా పక్కనే ఓ రూపం నన్ను వెంటాడేది ప్రతి రోజు. సరే ఎమిట ఇది అని ప్రతి రోజు చూసేవాడిని. అది నా ప్రాణ మిత్రుడు కిషోర్ గాడు . ఎప్పుడు చూసిన ఏ దిశలో చూసినా వాడే . పోనీ పుస్తాకాలు ఏమి చదువుతాము అంటే ఇదో ఈ కంప్యూటర్ పుస్తకాలే అలా చించి చించి వేస్తుంటాం. సరే అలాగైనా మీరు చెప్పినట్టు అనుభవం రాలేదు కదా అని ఊహలోనైనా ఊహించుకుందాం అనే ప్రయత్నం లో ఈ విమర్శ చేసాను :( ;) :-P

రాజేష్ మారం... said...

ఓహ్. , కవితల్లో కూడా sequels ఉంటాయనమాట. .. !!! బాగుంది . .. :)

మాలా కుమార్ said...

రసజ్ఞ గారు ,
ముద్దుగుమ్మ స్పందన బాగుందండి :)

రసజ్ఞ said...

@ బాలు గారూ
అమ్మాయి రిప్లై నచ్చినందుకు ధన్యవాదాలు! తరువాత ఏమిటి అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే!

@ కళ్యాణ్ గారూ
హహహ మొత్తానికి కిషోర్ గారి కథ వెలుగులోకొచ్చింది. సో మీ ఊహా ప్రేయసి గురించి అంటారు! సరే అలానే అనేసుకుందాం ఈ సారికి!

@ రాజేష్ గారూ
హహహ ఎందులో కావాలంటే అందులో పెట్టేస్తాం అంతే! ధన్యవాదాలండీ!

@ మాలా కుమార్ గారూ
చాలా రోజులకి కనిపించారే! మా ముద్దుగుమ్మ స్పందన నచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు!

వనజ తాతినేని/VanajaTatineni said...

very nice.. Rasagnaa..
inkaa.. ilaage manchi chaturata tho..marinni kavithala kosam yeduru choosthaanu.

Disp Name said...

>>>@ జిలేబీ గారూ
మధ్యలో ఈ సాయిగారెవరు చెప్మా????

రసజ్ఞులకు రచన సాయి తెలియక పోవడమా ! ఎంత విడ్డూరం ! ఎంత విడ్డూరం !

చీర్స్
జిలేబి.

మౌనముగా మనసుపాడినా said...

ఇందు మూలముగా అందరికి తెలియజేయునది ఏమి అనగ? మేము పేరు మార్చుకొని వచ్చాము మా పేరు మీ అందరికి నచ్చుతుంది అని ఆశతో మీ మౌనముగా మనసుపాడినా బ్లాగ్

రసజ్ఞ said...

@ వనజ వనమాలి గారూ
తప్పకుండా వ్రాయడానికి ప్రయత్నిస్తాను! ధన్యవాదాలు!

@ జిలేబీ గారూ
హు హు హు కాస్త చెప్పరూ!

@ మౌనముగా మనసుపాడినా గారూ
మీ మనసు మౌనముగా పాడకపోయినా మీరు మాత్రం తెలుగు పాటలు గారని నాకు తెలుసు ముందే సందేహం కలిగింది ( పేరుని !! రసజ్ఞ !! ఈ స్టైల్లో వ్రాసేది మీరే) ఇప్పుడు నిజమయ్యింది! మంచిది ఎక్కు తొలి మెట్టు కొండని కొట్టు దీకొట్టు అంటూ ముందుకి సాగిపొండి!

శాండిల్య said...

కవిత్వపు జాడయైన రసజ్ఞతే తమ పేరు...
కవి హృదిలో మెరియు రసజ్ఞతే తమ పేరు...
పాఠకుని మనస్సులో విరియు రసజ్ఞతే తమ పేరు...
తెనుగు భాషా మధు రసజ్ఞతే తమ పేరు...!!!
-----------------------------------------
మీ కవితలోని చిన్న మాట గురించిన నా సందేహం...
ఇందులో అయిదవ వరుసలో మీరు రాసిన "అడిగానని చెప్పనా నా పేరును.." లో...
"అడిగానని" అని రాయాలనే రాశారా.. లేక.. "అడిగావని" అని రాయాలనుకుని పొరపాటున ఇలా రాశారా...
"అడిగావని చెప్పనా నా పేరును.." అని రాస్తే బావుండేదేమో అనిపించింది.

రసజ్ఞ said...

@ Sandilya గారూ
అబ్బో! నా మీదే కవితలల్లేసి మంచి రచన చేసేసారే! అచ్చు తప్పండి సరి చేశాను! ధన్యవాదాలు!

శాండిల్య said...

ఏవండోయ్.... నేను చెప్పింది కవితా కాదు... అది మీ మీదా కాదు...! కేవలం రసజ్ఞత మీద మాత్రమే నాకు తోచినట్టు మాట్లాడాను. అందులో మీ పేరు ఉండటం కేవలం కాకతాళీయం...! అంతే.. ;-)

SHANKAR.S said...

"మీ 'రచన' ని మధ్యలో 'సాయి' గారు కొట్టేసారు !"

జిలేబీ గారూ ఈ మాట వింటే "రచన శాయి" గారు ఫీలవుతారు? తేడా గమనించారా?

Disp Name said...

శంకర్ ఎస్, గారు,

రచన శాయి గారు ఫీలవరండీ. వారు 'సాయిన్సు' కథలని మా మాష్టారు రాయగా ప్రచురించ ధైర్యం చేసిన వారు !

మీదు మిక్కిలి రచన శాయి కి అంకితం ఐపోయింది కూడాను !

మీకూ, అందరికీ నూతన వత్సర శుభాకాంక్షలతో

చీర్స్
జిలేబి.

SHANKAR.S said...

హమ్మయ్య "సాయి". "శాయి" తేడా గుర్తించారు.మీరు "రచన సాయి" అంటే ఈ మాట అన్నానంతే :))

రసజ్ఞ said...

@ Sandilya గారూ
అవునా? సరేలెండి!

@ SHANKAR.S గారూ, జిలేబీ గారూ
ఈ సాయి ఎవరో? శాయి ఎవరో? ఏమిటో? నాకేమీ అర్ధం కాలేదు!

Anonymous said...

Excellent beat ! I would like to apprentice while
you amend your site, how can i subscribe for a blog web site?

The account helped me a applicable deal. I had been a
little bit acquainted of this your broadcast provided brilliant clear idea

Feel free to visit my blog :: dating online (bestdatingsitesnow.com)

ask me IIITn's said...

Superr