Tuesday, September 20, 2011

సోడా సందేహంఏంటండీ అలా చూస్తున్నారు? మనుషులకి వచ్చే సందేహాలనే తీర్చలేక పోతుంటే మళ్ళీ ఈ సోడాలకి కూడా సందేహాలు రావాలా అనుకుంటున్నారా? సోడా సందేహం అంటే సోడాకి కలిగిన సందేహం కాదు సోడా గురించి నాకు కలిగిన సందేహం అనమాట!

నేను ఆరవ తరగతి చదువుకునే రోజుల్లో ఒక రోజు మా మాష్టారు మన వంటికి ఆక్సిజను మంచిదనీ కార్బన్‌డయాక్సైడ్ మంచిది కాదనీ, అనారోగ్యం కలుగుతుందనీ అందుకే మనం ఊపిరి తీసుకునేటప్పుడు దానిని వదిలేస్తామని చెప్పారు. సరే బాగుంది అనుకుని కార్బన్‌డయాక్సైడ్ మంచిది కాదు అని గట్టిగా ఫిక్స్ అయిపోయా. సరిగ్గా అదే రోజున ఇంకో మాష్టారు వచ్చి ఈ కార్బన్‌డయాక్సైడ్ని నీళ్ళల్లో కలపగా వచ్చే ద్రవమే  మనం తాగే సోడా అని చెప్పారు. అందుకే నేను అసలు స్కూల్కి వెళ్ళను మొఱ్ఱో ఆ మాష్టార్లకి ఏమీ రాదు అని  మొఱపెట్టి మరీ మొత్తుకునేదానిని! కానీ మా ఇంట్లో వాళ్ళు వింటేగా! ఏమిటో నా లాంటి వాళ్ళని అయోమయంలో పడేయడానికే ఇలాంటి విషయాలు చెప్తారు కాబోసు! ఒకాయన వచ్చి మంచిది కాదు అంటాడు ఇంకో ఆయన వచ్చి అది మంచిది తాగండి అంటాడు. అసలు నాకు తెలియక అడుగుతాను అంత మంచిదయితే మన శరీరంలో తయారయిన ఈ కార్బన్‌డయాక్సైడ్ మన శరీరంలోని నీటితో కలిసినపుడు తయారయిన సోడా ఎంచక్కగా మన ఒంటిలోనే ఉంటుంది కదా  మళ్ళీ కొత్తగా కొనుక్కుని మరీ తాగడం ఎందుకు? అసలు ఉన్న ఈ కార్బన్‌డయాక్సైడ్ని బయటకి పంపేసుకోవడమెందుకు? అన్నది నా సందేహం. అది వెంటనే మా మాష్టారు గారిని అడిగితే ఒక్క నవ్వు నవ్వి జారుకున్నారు కాని సమాధానం మాత్రం చెప్పలేదు. ఈ పెద్ద వాళ్ళు ఉన్నారే ఏమడిగినా ఒక నవ్వు నవ్వేసి  వెళ్ళిపోతారు కానీ మనం అడిగినది ఏదీ చెప్పరు. 

ఇహ వీళ్ళతో కాదులే అని ఇంటికెళ్ళి అమ్మని అడిగా ఆలోచించి అప్పుడు చెప్పింది అలా అవి ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కలవవు వాటిని మనం కష్టపడి కలపాలి అప్పుడే దానికి (కార్బన్‌డయాక్సైడ్) ఉన్న చెడ్డ గుణాలు పోయి మంచిగా మారి మనకి జీర్ణ వ్యవస్థపై చక్కని ప్రభావం చూపిస్తుంది అని చెప్పింది. రోజూ తాగే సోడా వెనకాల ఇంక తెరవెనుక కథ (flashback story ) ఉందని తెలిసి నా ఆలోచనలకి తెర తెరుచుకుంది. అప్పుడే దాని గురించి ఆసక్తికరమయిన ఎన్నో విషయాలు తెలుసుకున్నా!

జర్మనీలో పుట్టి, లండన్‌లో పెరిగి, భారతదేశంలో 70 ఏళ్ల క్రితం అడుగుపెట్టిన గోలీసోడాకు 120 ఏళ్ల చరిత్ర ఉందంటే నమ్మశక్యం కాదు. తొలినాళ్లలో (కాణి) పైసాన్నర ధర ఉండే గోలీసోడా నేడు అయిదు నుండి పది రూపాయలు పలుకుతోంది. ఇప్పటికీ కొందరు కడుపు ఉబ్బరంగా ఉంటే ముందుగా సోడా తాగుతారు. అప్పట్లో జర్మనీలో తయారైన సోడా సీసాలు  మన దేశానికి దిగుమతయ్యేవి. ఇప్పుడు మన దేశంలోనే సీసాలను తయారు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని కంపెనీలు ఈ గోలిసోడా ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. సోడాగ్యాస్‌లో ఉండే కార్బన్‌డయాక్సైడ్‌  గ్యాస్‌ సిలిండర్లను ఉయ్యూరు చక్కెర కర్మాగారం, విశాఖపట్నంలోని ఎరువుల కర్మాగారాలు ఉత్పత్తి చేసేవి. వాటర్‌ ప్యాకెట్లు వచ్చిన తరువాత పట్టణాల్లో కనుమరుగవుతున్నా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో వేసవి సీజన్‌లో సోడా వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రతీ కిళ్లీ దుకాణాల్లోనూ ఇవి లభించేవి.  అలాగే వీధుల్లో సోడాలను బళ్లపై వేసుకుని సాయంత్రం పూట అమ్ముకుని జీవనోపాధి పొందేవారు.

పట్నం నించి మా బంధువులు ఎవరొచ్చినా సోడా కోసం తపించిపోయేవారు. రోజూ తాగే నాకు కొంచెం విచిత్రంగా అనిపించేది. ఇప్పటికీ మా ఊరిలో ఐసు సోడా, నిమ్మకాయ సోడా, నిమ్మఉప్పు సోడా, రస్నా సోడా, ఆరంజి సోడా, పన్నీరు సోడా, సుగంధి సోడా అమ్ముతారు. కాని మునుపటిలా బండ్ల మీద వేసుకుని రావడం లేదు. గోలీ సోడాతో చేసే నిమ్మసోడా రుచి మరే పానియానికి లభించందంటే అతిశయోక్తి లేదు. వయసుతో పని లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తాగే పానీయం సోడానే. ఎంత  ఆభివృద్ధి చెంది ఎన్ని కొత్తరకాల పానీయాలు వచ్చినా సోడాలు మాత్రం జనాల హృదయాల్లో సుస్థిరమయిన స్థానాన్ని పొందాయి. ఒక్క సారి సోడా రుచి మరిగిన వాడు దానికి దాసోహం అనక తప్పదు. 

వేసవి తాపాన్ని తీర్చే ఐస్ సోడా
నోరూరించే నిమ్మ సోడా
సువాసనల సుగంధి సోడా
ఆనందించే ఆరంజి సోడా
పులకింపచేసే పన్నీరు సోడా
రసభరితమయిన రస్నా సోడా
రోజూ తాగితే ఏదో ఒక సోడా
మనసవుతుంది ఠండా ఠండా
కోరుతూనే ఉంటారు థోడా థోడా 

సోడా గురించి అద్భుతముగా ఈ పాట లో చెప్పారు. అది విన్నాక నేను సోడా మీద చాలా పేరడీ పాటలు పాడటం మొదలుపెట్టాను. మచ్చుకకి రెండు:

౧. నీళ్ళంటే నీళ్ళూ కాదు
    గ్యాస్ అంటే గ్యాసూ కాదు
    రెంటినీ కలిపిన సోడానే ఇది సోడానే ఇది. 


౨. గోలీ అంటే సులువు కాదులే
     అది నీవు కొట్టలేవులే
     గోలీ అంటే గట్టిగుంటది
     అందరూ కొట్టలేనిది
     చూడ్డానికి చిన్నగుంటది
     కొట్టావా నొప్పి పుడతదీ
    నో నో నో అలా చెప్పకు
    మనసుంటే మార్గముంటది

    సై అంటే కొట్టి చూపుతా
    గోలీ సోడానే కొట్టి తెచ్చెద

    నా బలముని రుజువు చేసెద. 

దాహం తీర్చుకోడానికి, కడుపుబ్బరం తగ్గించుకోడానికీ తాగే ఈ సోడాలతో ఫైట్లు కూడా చేయచ్చు. స్నేహితులకి ఎవరికయినా కొంచెం మందమయిన కళ్ళద్దాలు ఉంటే సోడాబుడ్డీ అని ఆటపట్టించచ్చు. అందులోని గోలీని కొట్టడం భలే సరదాగా ఉంటుంది కదూ! నేను పట్టు వదలని రసజ్ఞ లాగా (అబ్బాయిలని అయితే విక్రమార్కుడు అనాలి, అమ్మాయిలని అయితే రసజ్ఞ అనే అనాలి)  వేలితో గోలీ కొడదామని ప్రయత్నం చేస్తున్నా! అన్నట్టు గోలీ సోడా స్త్రీ లింగమా? పుంలింగమా? అనే సందేహం కలిగింది ఒక సారి నాకు. ఎవరిని అడిగినా చెప్పలేదు! ఇహ వీళ్ళని అడిగి ప్రయోజనం లేదని నేనే కనిపెట్టేసాను. సోడా పుంలింగం. ఎందుకంటారా? అబ్బాయిలకి ఉన్నట్టే దీనికి కూడా ఆడమ్స్ ఆపిల్ ఉంటుంది కదా గొంతుకలో అందుకు! అంటే దీని గొంతుకలో గోలీ ఉంటుంది కదా! ఈ విషయం మా మాష్టారు గారికి, మా అమ్మకి చెప్పినా నాకు బిరుదులేమీ ఇవ్వకపోగా కనీసం అభినందన సభ కూడా ఏర్పాటు చేయలేదు! సోడాలాగానే నా కళాత్మక దృష్టికి కూడా ఆదరణ తగ్గిపోయిందిలే అని బాధపడి ఊరుకున్నాను.

పీయే కృతే వర్ధతయేవ నిత్యం సోడా రసం సర్వ రస ప్రధానం అన్నారు! (ఎవరో కాదు నేనే!). దీనిని  తాగినకొద్దీ  రసాస్వాదన పెరుగుతూనే ఉంటుంది అని దీని అర్ధం. ఆ అర్ధం రాకపోయినా అదే అని పెట్టేసుకోండి మీరు. ఇప్పటికయినా సోడాకీ, నా కళాత్మక దృష్టికీ ఆదరణ లభిస్తుందని కోరుకుంటున్నాను.

పదండి బయటకు పదండి కొట్టుకు
పోదాం సోడా తాగడానికి !!!!!!!

31 comments:

Anonymous said...

ఇప్పుడు నిమ్మషోడా తాగాలని ఉంది..ఆ ఊరించిన పాపం మీదే

nestam

ఆత్రేయ said...

బాగుంది మీ సోడా
చిన్నప్పుడు సరదాగా " సోడ (సొంత డబ్బా) కొట్టకురా " అనేవాళ్ళం.
అలాగే ఇప్పుడు కూడా బాగుంది మీ సోడా సోడ.

Anonymous said...

పోనిద్దురు రసఙ్ఞగారూ అసలీ పెద్దాళ్ళు ఎప్పుడు సరిగ్గా చెప్పారు కనుక...చిన్నప్పుడు అడిగితే నువ్వింకా చిన్నపిల్లాడివి అంటారు అదే ఇప్పుడడిగితే వెధవా ఇన్నేళ్ళోచ్చాయి ఆమాత్రం తెలియదా అంటారు....మీ బ్లాగు ముఖంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా...ఉఫ్...! అబ్బ ఎక్కువ వాగేసినట్టున్నా ఒక సోడా తాగొస్తా....

రసజ్ఞ said...

@నేస్తం గారు
నేను రాసిన విప్లవ కవిత వలన మీకన్నా తాగాలనిపించింది. మిమ్మల్ని ఊరించిన పాపం నాదే అయినా అది అమ్మేవాళ్ళకి బేరం చూపించిన పుణ్యం నాదేగా చెల్లయిపోయిన్దోచ్చ్!

రసజ్ఞ said...

@ఆత్రేయ గారు
నా బ్లాగుకి స్వాగతం! మెచ్చుకున్నారో లేక సోడ (సొంత డబ్బా) ఎక్కువ కొట్టానన్నారో అర్ధం కాలేదు కాని బాగుందన్నారు కనుక నెనర్లు.

రసజ్ఞ said...

@అచంగ గారు
ఏ మాటకి ఆ మాటే చెప్పాలి మీరొక్కరే అర్ధం చేసుకున్నారు!
మీరొక్కరే తాగి రావడం కాదు అదే చేత్తో మాకు కూడా కాస్త తీసుకుని రండి. అన్నట్టు మీ ఇంగ్లాండ్లో మన సోడాలు దొరుకుతాయా?

Anonymous said...

అసలా గోలీసోడా ఇండియాలోనే కనిపించటం మానేసిందని వినికిడి...!!? ఇక్కడ కేవలం మందులో పుచ్చుకోవటానికి మాత్రమే ఏదో సోడాలాగా కనిపించే పదార్ధం దొరుకుతుంది (నేను తాగనండోయ్...సోడా (ఇక్కడ) మందూనూ). తేవటానికేమి భాగ్యం తప్పకుండా.. కాకపోతే నేను ఇండియా వచ్చేదాగా ఉగ్గబట్టుకుని ఉగ్గబట్టుకుని నన్ను తిట్టుకోకూడదు మరి..!

రసజ్ఞ said...

@అచంగ గారు
అందుకే మరి అక్కడ రాసానా వివరంగా మా ఊరిలో అన్నీ దొరుకుతాయని? తెస్తానన్నారు అదే చాలు. మర్చిపోకుండా ఎప్పుడు తెచ్చినా సరే!

ఆత్రేయ said...

పొగిడానమ్మా.
చిన్నప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తుంటే అన్న సొడ సోడా అన్నమాట గుర్తుకు చేసుకున్నా అంతే. అదీ తప్పేనా హా ...!!

రసజ్ఞ said...

@ఆత్రేయ గారు
ఎంత మాట! మీరు గుర్తుచేసుకున్నది మాతో పంచుకున్నదుకు ధన్యవాదాలు!

జ్యోతిర్మయి said...

సోడాని భలే గుర్తు చేశారు...

రసజ్ఞ said...

నెనర్లు జ్యోతిర్మయి గారు!

శ్రీ said...

సోడా పుట్టు పూర్వోత్తరాలు బాగున్నాయి. ఎండాకాలంలో నిమ్మకాయ సోడా సూపరు, మా కాలాస్త్రిలో ఈమధ్య కొత్త షాపు వచ్చింది. పన్నీర్ సోడ, మసాలా సోడా, నిమ్మకాయ సోడా..ఇలా ఒక పది వెరైటీలకు పైగా ఉన్నాయి.

చిన్నపుడు మా ఫ్రెండు నిమ్మకాయలు తెస్తే నేను మసాలా తీసుకుని షాపుకి వెళ్ళేవాళ్ళం. అక్కడ మాకు సోడా రేటు తీసుకుని నిమ్మకాయ సోడా చేసి ఇచ్చే వాళ్ళు.

కొత్త పాళీ said...

You are good!! That's all I can say

రసజ్ఞ said...

@శ్రీ గారు
ధన్యావాదాలు మీ జ్ఞాపకాలని మాతో పంచుకున్నందుకు. నేనెప్పుడూ ఈ మసాలా సోడా తాగలేదు. మీ కాలాస్త్రి వచ్చినప్పుడు ప్రయత్నిస్తాను.


@కొత్త పాళీ గారు
వావ్ ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్! నెనర్లు

nanda said...

గోలీ అంటే సులువు కాదులే
అది నీవు కొట్టలేవులే
గోలీ అంటే గట్టిగుంటది
అందరూ కొట్టలేనిది
చూడ్డానికి చిన్నగుంటది
కొట్టావా నొప్పి పుడతదీ
నో నో నో అలా చెప్పకు
మనసుంటే మార్గముంటది
సై అంటే కొట్టి చూపుతా
గోలీ సోడానే కొట్టి తెచ్చెద
నా బలముని రుజువు చేసెద.
///////////////////////పీయే కృతే వర్ధతయేవ నిత్యం సోడా రసం సర్వ రస ప్రధానం అన్నారు! (ఎవరో కాదు నేనే!). దీనిని తాగినకొద్దీ రసాస్వాదన పెరుగుతూనే ఉంటుంది అని దీని అర్ధం. ఆ అర్ధం రాకపోయినా అదే అని పెట్టేసుకోండి మీరు. ఇప్పటికయినా సోడాకీ, నా కళాత్మక దృష్టికీ ఆదరణ లభిస్తుందని కోరుకుంటున్నాను.


hahahhahahahhahahahahhahahahahahahahhahahahahhahahahahhahahahahahahahahahahahahahahahahahahahhahah

రసజ్ఞ said...

@Nanda gaaru
:)

mohan.talari@yahoo.com said...

సోడా అంటే గుర్తొచ్చిందోయ్...ఆ మధ్య బెంగుళూరు వెళ్ళినప్పుడు సోడా కనపడితే వెళ్ళిపోయి...నిమ్మసోడా చెయ్యమని చెప్పా...తాగేసి as usual గా చిల్లర కోసం వెతుక్కుంటున్నా...ఈ లోపు పక్కనున్న ఫ్రెండ్ 50 రూపాయల నోటు తీసి వాడి చేతిలో పెట్టి నడువు అన్నాడు...చిల్లర తీసుకోరా అంటుంటే..ఒక్కోటి 25 అన్నాడు..నాకు గూబ మీద గొళీ సోడా పగిలినట్టయ్యింది.....నువ్వు అమెరికా వెళ్ళిపోయాక ఈ మధ్య soda hub అని మొదలు పెట్టారు...చాలా flavors అమ్ముతున్నారు...of course చాలా worst గా ఉంటున్నయనుకో...

నా దృష్టిలో సూపర్ soda అంటే నిమ్మ సోడానే...రోడ్డు మీద నేల,బండ ఆట ఆడుకుంటుండగా అలా బండి తోసుకుని దాని మీద గోనె పట్టా కప్పుకుని వచ్చేవాడు మా soda శీను గాడు..ఆల్రెడీ ఒక 50,60 మంది తాగిన ఒక గ్లాస్ తీసి(అది వాడు పొరపాటున కూడా కడగడన్నది మా రాజవరమెరిగిన సత్యం..ఇప్పుడంటే వెధవ చదువులు చదివి శుభ్రమెక్కువ అయ్యింది గాని అప్పుడేం తెలుసు)దాంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి, ఒక soda తీసి, వాడి అతి పరిశుభ్రమైన ఉంగరపు వేలితో దాన్ని కీచుమనిపించి...కలుపుతుంటే గ్లాస్లో బుసబుసలు చూసి దాహం రెట్టింపయ్యేది....అంత కష్టపడి చేస్తే వాడికి అప్పుడు నేనిచ్చింది రూపాయి న్నర....అందుకే మరి 25 రుపాయలంటే కళ్ళమ్మెట soda నీళ్ళు కారాయి....బాగా రాశావ్...keep it up....

panipuri123 said...

బాగుంది మీ సోడ (సొంత డబ్బా) అనుభవాలు :-)

Anonymous said...

చాకిలేటు ఇచ్చి కూర్చోపెట్టి శంఖాల గురించి అద్భుతంగా చెప్పారు. వద్దు ప్లీజ్ అంటూనే మంచి టపాలు మూడు ఇచ్చారు. సిగరెట్టిచ్చి కూర్చోపెట్టి తలంటు పోసేసారు. మరి ఇప్పుడేమో ఏకంగా సోడా కొట్టారు. ఏమి రాబోతోందో తెలుసుకోవచ్చా?

రసజ్ఞ said...

@మోహన్
ఏమిటి? నిమ్మ సోడా పాతికా? బాగుందయ్యా! దీనిని బట్టి నీకు అర్ధమయ్యిన నీతి ఏమిటి? నాకు అర్ధమయినది ఏమిటంటే.. మన సోడాని మన ఊరిలోనే తాగాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ తాగకూడదు. థాంక్స్ మోహన్.

@పానిపురి గారు
హహహ ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
నేనిప్పటివరకూ గమనించనేలేదు సుమీ! ఏమో అండి తరువాత టపా గురించి ఇంక ఏమీ అనుకోలేదు!

Anonymous said...

Rasagna garu,
Soda gurinchi intha selavicharu, meeku dhanyavadamulu :)
Goli sodalu poyi, ikkada soda hub lu vachayandi. Kani, goli goli ye kada, hub soda antha kick undadu lendi...
Soda lo geneder vethiki danini visleshincharu, wah wah wa , kya bath hai :)... Mee alochanalu gurrala pi swary chesthunnay anukunta andi, prathi dani gurinchi intha baga alochinchi rasaru(all posts)
Very good
Andariki anandanni panche meeru eppudu anandanga undalani korukuntu
Mee sreyobhilashi
Keep smile always :)vicharu, meeku dhanyavadamulu :)
Goli sodalu poyi, ikkada soda hub lu vachayandi. Kani, goli goli ye kada, hub soda antha kick undadu lendi...
Soda lo geneder vethiki danini visleshincharu, wah wah wa , kya bath hai :)... Mee alochanalu gurrala pi swary chesthunnay anukunta andi, prathi dani gurinchi intha baga alochinchi rasaru(all posts)
Very good
Andariki anandanni panche meeru eppudu anandanga undalani korukuntu
Mee sreyobhilashi
Keep smile always :)

రసజ్ఞ said...

@Anonymous gaaru
meeku boledu thankulu

కృష్ణప్రియ said...

:-) ఈ శనివారం నిమ్మకాయ సోడా తాగినప్పుడు మీ టపా గుర్తొచ్చింది. నా బ్లాగ్ లో ఫోటో లు అప్ లోడ్ చేద్దామని బద్ధకిస్తున్నా..

రసజ్ఞ said...

కృష్ణ ప్రియ గారు
వావ్! మరి గుర్తొచ్చినప్పుడు అలా మీరే తాగేస్తే ఎలా చెప్పండి? మాకు కూడా పంపాలి ఈ సారి నించి సరేనా! మంచి మంచి ఫోటోలు పెట్టండి మరి. మేము కూడా చూస్తాం.

కొత్త పాళీ said...

అన్నట్టు మొదటి కామెంటు రాసినప్పుడు చెప్పడం మరిచాను. అమెరికాలో కోకు, పెప్సీ ఇత్యాది ద్రవాలన్నిటికీ కలిపి సార్వత్రిక నామధేయం సోడా. వచ్చిన మొదట్లో బయట లంచి కొనుక్కున్నప్పుడు దాంతో పాటు సోడా కావాలా అంటే నాకు అర్ధమయ్యేది కాదు. దీన్నే మళ్ళీ మిషిగన్‌లో పాప్ అంటారు.

రసజ్ఞ said...

@కొత్తపాళీ గారు
అవునండోయ్ మంచి విషయం గుర్తు చేశారు! పాప్ అంటారన్న విషయం తెలియదు నాకు. ఒక క్రొత్త విషయం చెప్పినందుకు ధన్యవాదములు.

Kamal said...

పట్టు వదలని రసజ్ఞ లాగా


keko kekaa

రసజ్ఞ said...

@ కమల్ గారూ
హహహ! మొత్తానికి ఒప్పుకున్నారు విక్రమార్కుడు (అబ్బాయిలలో), నేను (అమ్మాయిలలో) పట్టు వదలమని ;) ధన్యవాదాలు!

Anonymous said...

Hey there! Would you mind if I share your blog with my zynga group?
There's a lot of folks that I think would really appreciate your content.
Please let me know. Cheers

Here is my blog: dating sites, http://bestdatingsitesnow.com,