Monday, September 05, 2011

శ్రీ గురుభ్యోం నమః


"గురుబ్రహ్మ గురు విష్ణుః
గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః"        
అంటూ గురువులని త్రిమూర్తుల స్వరూపంగా భావించి ఆరాధించడం మన హిందూ సాంప్రదాయం. మనకి ఎంతో విజ్ఞానాన్ని అందిస్తూ బ్రహ్మవుతారు, జ్ఞాన సంపదని కాపాడుకుంటూ, పెంపొందించుకునేలా చేస్తూ విష్ణువవుతారు, అజ్ఞానం, అహంకారాలను నాశనం చేస్తూ శివుడు అవుతారు.  మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాత మనం గురువుని స్మరిస్తాం.

అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం
యేన తస్మై శ్రీ గురవే నమః

విద్యను నేర్పేవాడు గురువు అని అందరికీ తెలిసిన విషయమే అయినా సంస్కృత అర్ధాన్ని తీసుకుంటే, గు అనగా చీకటి లేదా అంధకారం మరియు రు అనగా వెలుతురు లేదా ప్రకాశం. ఈ రకముగా చూసుకుంటే గురువు మనలోని అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు. విద్య లేని వాడు వింత పశువు అని కూడా ఉంది కనుక ఆ రకముగా చూసుకుంటే మనలని మనిషిగా తీర్చిదిద్దేవాడు అని కూడా చెప్పుకోవచ్చును.

రకములు  
గురువులు ప్రధానముగా ఏడు రకములు అని మన శాస్త్రాలలో చెప్పబడింది. అది ఎవరనగా:
  • సూచక గురువు - చదువు చెప్పేవాడు
  • వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
  • బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు
  • నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాలు నేర్పేవాడు
  • విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
  • కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
  • పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు.

ఎవరు గురువు?

విద్యను నేర్పిన ప్రతీ ఒక్కళ్ళూ గురువులు కాలేరు. గురువు అనిపించుకోవడానికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవేమిటంటే:

శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్
శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్
ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః
నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.


అంటే శాంతమూర్తి, ఇంద్రియ నిగ్రహం కలవాడు, జ్ఞాన సంపదలో ధనవంతుడు, వినయవంతుడు, మంచి వేషధారణగలవాడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్రతంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు మాత్రమే గురువు అనిపించుకుంటాడు అని ఈ పద్యం యొక్క భావం.

పూర్వకాలంలో గురుకులానికి వెళ్ళి విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాతనే ఇంటికి తిరిగి వచ్చేవారు. అప్పటిలో గురుపత్ని భోజనంలో ఆముదం వేస్తోందో నెయ్యి వేస్తోందో కూడా గమనించనంత విద్యా పిపాసతో ఉండేవారుట. ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసినవే అయినా ఈ రోజు ఒక్క సారి మళ్ళీ గుర్తుచేసుకున్నాం.

నా దృష్టిలో సకల ప్రాణులకీ మొదటి గురువు కన్న తల్లి. మనకి ఊహ తెలిసినప్పటినుండీ తల్లి దగ్గరే చాలా విషయాలు నేర్చుకుంటాం. నా విషయంలో నాకు ఇద్దరు తొలి గురువులు అమ్మ, అమ్మమ్మ. అమ్మ చదువుకి సంబంధించిన విషయాలు, బయట ప్రపంచాన్ని పరిచయం చేస్తే అమ్మమ్మ ఆధ్యాత్మికతకి, సంస్కృతికి, సాంప్రదాయాలకి, ఆచార వ్యవహారాలకి, కట్టుబాట్లకీ, జీవన విధానాలకీ సంబంధించి ఎన్నో విషయాలు చాలా ఓపికగా చెప్పేది. అసలు ఉమ్మడి కుటుంబాలలో లేదా కనీసం పెద్ద వాళ్ళ నీడలో పెరిగిన పిల్లలకి ప్రేమాభిమానాలు, లోకజ్ఞానం ఎక్కువ అని నా అభిప్రాయం. తల్లిదండ్రులు ఉద్యోగాల హడావిడిలో ఉంటే పిల్లలకి తోడు నీడగా పెద్దవాళ్ళు ఉండటం ఎంతో ఉపయోగకరం. ఆ రకముగా నా తొలి గురువులు ఒక మనిషిగా ఎలా ఉండాలో నేర్పారు.

నన్ను బడిలో వేశాక ఎంతో మంది ఉపాధ్యాయులు వచ్చేవారు విద్యాబోధనకి కాని వాళ్ళెవరూ నాకు దాని రుచిని చూపించలేకపోయారు. క్లాసుకెళ్ళామా, పాఠం చెప్పామా, వచ్చామా అని వాళ్ళ బాధ్యతని వారు సక్రమంగా నిర్వహించినా నాలో చదువుకునే జిజ్ఞాసని పెంచలేదు. మార్కుల కోసం చదవడం, మంచి రాంకులు తెచ్చుకోవడం తప్ప చదువులో ఉన్న మాధుర్యం, ఆ సారం నాకు నా పదవ తరగతి దాకా తెలియదు. అప్పుడు వచ్చారు ప్రవీణ్ మాష్టారు. వచ్చిన మొదటి రోజే ఈ పుస్తకాలన్నీ పక్కన పాడేయండి ఇది క్లాసురూం కాదు నేనిప్పుడు ఒక చిన్న కధ చెప్పడానికి వచ్చా అంటూ పాఠం అంతా చక్కగా పిట్ట కధలా చెప్పేవారు. నాకెంతో నచ్చేసేది. అదే కాకుండా ఎలా చదివితే ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలం, బొమ్మలు ఎలా వేస్తే అందంగా సులభముగా వేయచ్చో చెప్పేవారు. ఇంటర్లో కూడా ఆయనే మాకు జంతు శాస్త్రాన్ని (Zoology) బోధించేవారు. అలా ఆయన నాకు చదువు మీద ఆసక్తిని కలిగించారు. 

తరువాత నా జీవితాన్ని ప్రభావితం చేసింది మాత్రం మా దిల్బర్ హుస్సేన్ మాష్టారు. చదువు మీద ఆసక్తి, చదవాలన్న తపన ఉండేవి తప్ప డిగ్రీకి వచ్చేసరికి మనస్ఫూర్తిగా చెప్పాలంటే నాకు ఏ ఒక్క విషయం మీదా కూడా సంపూర్ణ అవగాహన లేదు. ఆయన మాకు biochemistry చెప్పేవారు. అసలు డిగ్రీకి వచ్చినా చూడకుండా గ్లూకోస్ నిర్మాణం వేయడం కూడా రాని నాతో నిద్రలో లేపినా కూడా కొన్ని కష్టతరమయిన pathways అన్నీ వేసేలా చేసేసారు అంటే ఆయన బోధనా శైలి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమయమెంతయ్యిందో కూడా చూడకుండా సందేహం కలిగిన వెంటనే ఆయనకి దూరవాణి చేస్తే నిద్రలోనించి లేచి (అర్ధరాత్రి దాటేది) మరీ నా సందేహాలని నివృత్తి చేసి పడుకునే ఆయన ఓపికకి జోహార్లు. ఆయన చెప్పే ప్రతీ క్లాసు చాలా శ్రద్ధగా విని ప్రపంచంలో ఇప్పటిదాకా ఆ పాఠానికి సంబంధించి ఏమేమి పరిశోధించారో అదంతా సేకరించి నోట్స్ తయారుచేసుకుని ఆయనకి చూపించి దిద్దించుకునేదానిని. ఆ రోజునించి నాకు జ్ఞాన దాహం బయలుదేరింది. ఆ మూడేళ్ళు ఎలా గడిచాయో తెలియదు. గురుకులంలో చదివే అంత శ్రద్ధతో నేను నా జీవితంలో చదివిన రోజులు అంటే డిగ్రీనే. నా జిజ్ఞాసకి తోడుగా మా మాష్టారు కూడా నాకు ప్రతీ టాపిక్ మీద కొన్ని వేల రకాలుగా ప్రశ్నలని తయారుచేసి ఇస్తే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేది. నేను ఒక్క కోచింగ్ కూడా లేకుండా ఆంధ్ర విశ్వ విద్యాలయంలో biochemistry  లో రాంక్ తెచ్చుకున్నా, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో integrated PhD వ్రాత పరీక్షలో నూటికి నూరు శాతం తెచ్చుకున్నా, CSIR UGC NET రాసిన మొదటిసారే విజయం సాధించినా అంతా అయన పెట్టిన భిక్షే. నాకు నా పేరుకి ముందు Dr అని చూసుకోవాలని తప్ప ఎప్పటికి చేయాలి అన్న అవగాహన లేని రోజులలో ఆయన ఒక మాట అన్నారు. పాతికేళ్ళకి డాక్టరేటు చేస్తే అది చాలా పెద్ద విషయం, నా విద్యార్థులలో అలా ఒక్కళ్ళు చేసినా నేను గర్వపడతాను అని. నాకు ఇంత చేసిన ఆయనకి ఇదే నేనిచ్చుకునే గురుదక్షిణ. ఆయన కోసం అదే దారిలో ప్రయత్నిస్తున్నా ఇంకొక రెండు సంవత్సరాలలో నేను అనుకున్నది సాధించి ఆయన పాదాల చెంత నా డాక్టరేటు పట్టాని ఉంచాలని, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని నా కోరిక.

పిల్లలు వృద్ధిలోకి వస్తే ప్రతీ తల్లిదండ్రులూ ఆనందించడం సహజం. కానీ ఏ స్వార్ధం లేకుండా, రక్తసంబంధం లేకుండా మన మంచిని, అభివృద్ధిని కోరుకునే వారు కేవలం మన గురువులే. అటువంటి గురువులందరికీ పాదాభివందనం.

అసలు విద్యాబోధన చేసే వాళ్ళు మాత్రమే కాదు. ఈ సృష్టిలో ప్రతీదీ మనకి గురువే.
ఉన్నది ఉన్నట్టు చెప్పాలని అద్దాన్ని చూసి నేర్చుకో,
ఎంత తొక్కితే అంత పైకి లేవాలని బంతిని చూసి నేర్చుకో అని ఒక పాటలో అంటారు చంద్రబోసు.
ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. మనకి గురువు అయ్యే అర్హత లేనిది అంటూ ఏదీ లేదు. అయితే ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు లేదా ఎలా ఉండకూడదో నేర్చుకోవచ్చు.

మనమెలాంటి పరిస్థితులలో ఉన్నా పదిమందికి సహాయ పడాలని దీపాన్ని చూసి నేర్చుకోవచ్చు.
కావలసినదాన్ని మాత్రమే తీసుకుని అనవసరమయిన దాన్ని వదిలేయాలని అయస్కాంతాన్ని చూసి నేర్చుకోవచ్చు.
ఎప్పుడూ చిరునవ్వుతో వికసిస్తూ ఆ దరహాస పరిమళాలని అందరికీ పంచాలని పువ్వుని చూసి నేర్చుకోవచ్చు.
ఎప్పుడూ హుషారుగా ఉండాలని అమీబాని చూసి నేర్చుకోవచ్చు. 

మా భౌ(బహు)తిక శాస్త్రం చెప్పే మాష్టారు ఒకటి అనేవారు 
be OPTIC in heart,
be DYNAMIC in thought, 
be STATIC in mind, 
be ELECTRIC in character; 
then you will be MAGNETIC everywhere అని.
ఇలా అందరినీ ఒకసారి పేరుపేరునా గుర్తుచేసుకుంటూ, నాకు పాఠాలు చెప్పినా, చెప్పకపోయినా, మాష్టారయిన ప్రతీ ఒక్కళ్ళకీ, సృష్టిలో ఉన్న ప్రతీ ప్రాణికీ, నా స్నేహితులకీ, బంధువులకీ, నా  టపా చదివిన పాఠకులకి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
 

21 comments:

Anonymous said...

வணக்கம்,

நீங்கள் ஏன் ஆங்கிலத்தில் எழுதுவது கிடையாது. என்னை போன்றவர்களும் அறிந்துகொள்வோம் அல்லவா !!!

:)

రసజ్ఞ said...

@ Anonymous

ஏன் நீங்கள் ஆங்கிலத்தில் கருத்து இல்லை?

నందు said...

రసఙ్ఞ గారూ మీకూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాభినందనలు !

రసజ్ఞ said...

ధన్యవాదాలు నందు గారు!

నందు said...

chala bhaga chepparandi...

Kamal said...

Rasagnya garu many thanks for all your comments.
Thanu nijjam ga naakosam kadu andi andke ala raasanu.. Eeroju naa mail box antha mee comments tho nidipoyindi.. naa manasu chala anandam tho nidipoindi mee comments chusi.. Cinema patalu raasentha cinema naku ledu lendi...

Thanks alot for visiting my blog and for your comments.

Mee blog lo chala information undi.

శశి కళ said...

యెంత చక్కగా చెప్పారు.నిజంగా మీరు మాగ్నెట్.
ఏమిటి తమిళ్ కూడా వ్రాస్తారా?యెన్ని బాష లు వచ్చండి మీకు.

Anonymous said...

ఎన్నాంగే ఇదు తెలుఁగు బ్లాగా తమిళ్ బ్లాగా! ఉంగళుక్కు తమిళుం తెరియుమా ఎన్న కొడుమై ఇదు? అప్పురం నీంగ తమిళిలుం బ్లాగై ఏళుదివెయ్యింగ!

రసజ్ఞ said...

@నందు గారు
ధన్యవాదములండి.

@కమల్ గారు
మంచి బ్లాగ్ చదివిన ఆనందం నాది కూడా! నెనర్లు నా బ్లాగుకి విచ్చేసినందుకు మరియు నా టపా చదివినందుకు.

రసజ్ఞ said...

@శశి కళ గారు
అబ్భ ఎంత పెద్ద పొగడ్త అది! కృతజ్ఞతలు. నాకు ఏవో కొన్ని భాషలు బానే వచ్చులెండి.

రసజ్ఞ said...

@అచంగ గారు
నాన్ ఎళుదవిరుంబుం తాబాళై తెలుగువిల్ ఎళుదువేన్. ఆనాల్ పిన్నూరై ఎల్లా మొళియిలుం ఎళుదలాం (ఎనుక్కు తెరింద మొళిగళ్ మట్టుం). ఇదిల్ ఎన్న ఆచ్చర్యం? నాన్ తమిళిల్ ఎళిదకూడాదా? ఇని వరుం కాలంగలిల్ తమిళిలుం ఎళిదువేన్. అప్పొళుదు ఉంగళుక్కు నాన్ తెరియ పడుత్తువేన్. నండ్రి తంగళ్ అరివురైక్కు.

Anonymous said...

అంటే అసలు విషయం ఏమంటే నాకు తమిళ్ మాట్లాడటమే వచ్చు రాయటం రాదు. అందుకని కుళ్ళన్నమాట!! :)

రసజ్ఞ said...

@అచంగ గారు
హహహ నా మీద కుళ్లెందుకండీ! పోనిలెండి ఇకనించి తమిళ్ని తెలుగులో కాని ఆంగ్లంలో కాని రాసేస్తాను. సరేనా!

Anonymous said...

ஒற்றுமையில் வேற்றுமை

రసజ్ఞ said...

@Anonymous
hahahah romba nandri!

Uma Pochampalli said...

రసజ్ఞ?సారసజ్ఞ?సరసజ్ఞ?

రసజ్ఞ said...

ఉమ గారూ,
సారసం, సరసం, విరసం, నీరసం, పా(ద)రసం అన్నీ కలిసిన రసజ్ఞ అండి.

కృష్ణప్రియ said...

ఏంటి మీరసలు? ఇప్పుడే పాత టపాలు అన్నీ చూస్తున్నా..

రసజ్ఞ said...

కృష్ణ ప్రియ గారు
ఎప్పుడూ చూసినా ఫరవాలేదు! తీరిక చేసుకుని చూసి చదివి అన్నిటి మీద మీ అభిప్రాయాలు తెలియచేశారు. చాలా ఆనందంగా ఉందండీ!

శిశిర said...

అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః

చాలా బాగా రాశారు. మీ రచనలన్నీ మంచి విషయ పరిజ్ఞానంతో చాలా బాగున్నాయి.

రసజ్ఞ said...

@ శిశిర గారూ
చాలా చాలా ధన్యవాదాలండీ! నాకు తెలిసినవీ, నేను నేర్చుకున్నవీ, నా ఆలోచనలకి రూపాలయిన రాతలు అన్నీ ఇక్కడ పంచుకుంటున్నాను. వాటిని ఆదరిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది!