Wednesday, September 14, 2011

స్నానం చేశారా?


ఏవండోయ్! కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? అని ఎవరయినా అడిగితే వీళ్ళు ఎంత మార్యాద చేస్తున్నారో! అనిపిస్తుంది మరి ఎవరయినా స్నానం చేశారా? అని అడిగితే ఏమనిపిస్తుంది? అదేం ప్రశ్న తిక్క ప్రశ్న అని అనుకుంటాం. లేకపోతే వెక్కి వెక్కి ఏడిచి వేడి నీళ్ళతో మొఖం కడుక్కునే వాడిలా ఆ అడగడమేమిటి అనిపిస్తుంది. సరే నాకు ముందు ఈ విషయం చెప్పండి! మీలో ఎంత మంది స్నానం యొక్క అనుభూతిని పొందారు? స్నానానికి కూడా అనుభూతా అని అడగకండి. అసలు స్నానాన్ని ఆస్వాదిస్తూ చేస్తే ఉంటుంది మజా ....... మాటల్లో చెప్పలేం బాబు! పొద్దున్నే బద్ధకంగా ఉండే మనకి అలా స్నానం చేస్తూ ఉంటే అప్పుడే విచ్చుకుంటున్న పువ్వులా, మకరందాన్ని తీసుకుంటున్న తేనెటీగలా, తెల్లవారు ఝామున సూర్యుని నులివెచ్చని కిరణాలలో కరిగే మంచులా, సుతారంగా మేనిని తాకి గిలిగింతలు పెట్టే పిల్లగాలిలా, పసి పాపల బోసి నవ్వులా ఇలా రకరకాలుగా అనిపిస్తుంది కదూ! ఏంటి మీకెప్పుడూ అనిపించలేదా? అయితే ఈ సారి స్నానం చేశాక హడావిడిగా తువ్వాలుతో తుడిచేసుకుని పరుగెత్తేయకండి. స్నానాంతరం శరీరం మీదనించి నీటిబిందువులు గురుత్వాకర్షణకి లోనయి కిందకి కారుతూ ఉంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. ప్రతీ ఒక్కరు అనుభవ పూర్వకంగా తెలుసుకోవలసినదే. ప్రాణం అలా లేచి వస్తుంది క్రొత్త హుషారుతో. జలకాలాటలలో అని పాడుకుంటూ స్నానం చేయడమంటే ఎంత మందికి ఇష్టం ఉండదు చెప్పండి.

స్నానం చేస్తే శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తే తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తే బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తే మసాజ్లా ఉంటుంది. ఆవిరి స్నానం చేస్తే నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. గులాబీ రేకుల స్నానం చేస్తే చర్మానికి లాలన దొరుకుతుంది. అరోమ స్నానం చేస్తే ఒక క్రొత్త లోకంలో విహరిస్తున్నట్టుంది. ఇలా పలు విధాలుగా అనిపిస్తుంది. అసలు స్నానం అంటే ఏమిటి? ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చేలాభాలేమిటి అంటే ఇది పూర్తిగా చదవవలసినదే. 

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. వాటిల్లో నేను నేర్చుకున్నవీ, చదివి, విని తెలుసుకున్నవీ అన్నిటినీ క్రూడీకరించి ఇక్కడ రాస్తున్నాను. 

స్నానాల రకాలు:

పంచ స్నానాని విప్రాణాం కీర్తితాని మహర్షిభిః |
ఆగ్నేయం వారుణం బ్రహ్మ్యం వాయవ్యం దివ్యమేవచ || 
అన్నట్టుగా స్నానాలని అయిదు విధములుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చును.

స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు మూడు విధములు. అవి

నిత్య స్నానం : ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.

నైమిత్తిక స్నానం : ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం. గ్రహణం సమయములో, కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్న తరువాత, చెడ్డకలలు కన్న తరువాత, సంసారసుఖం అనుభవించిన తరువాత, ఎముకను పట్టుకొన్నపుడు, స్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం. ప్రసవించిన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికమన్నమాట.

కామ్య స్నానం : ఒక కోరికతో చేసేది కామ్య స్నానం. తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.

స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు. అవి 

ముఖ్య స్నానం : ఇది నీటిని ఉపయోగించి చేసేది (ఏంటండీ అలా చూస్తున్నారు? స్నానం నీటితో కాక ఇంక దేనితో చేస్తారు అనా? అయ్యో అక్కడకి వస్తాను కాని శాంతంగా ముందు ఇది చదవండి). ఇది మళ్ళీ రెండు రకాలు 
 • మంత్రం లేదా బ్రాహ్మ్యం : వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం". మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.

  "ఓం ఆపోహిష్టామ యోభువః
  తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
  యోవశ్శివతమోరసః
  తస్య భాజయతేహనః
  ఉశతీరివ మాతరః 
  తస్మారంగా మామవో
  యస్యక్షయాయ చ తనః
  ఆపో జన యధాచనః

  అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్ళని మంత్రించి పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవస్య, ఆత్మానం సంప్రోక్ష్య అని మంత్రించిన నీళ్ళని చల్లాకనే పూజా విధానాలు మొదలుపెడతాం.
 • వారుణం :  ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "electro-magnetic activity” అంటారు. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశ్యం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది. పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.
అముఖ్యం లేదా గౌణ స్నానం : నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు (మీరు చదివినది నిజమే! నీరు లేకుండా కూడా స్నానం చేయచ్చు). ఇది అయిదు రకాలు 
 • ఆగ్నేయస్నానం : హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. అదెక్కడి స్నానం అనుకుంటున్నారా? చెప్తాను వినండి కాదు రాస్తాను చదవండి. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.

"శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||" 

పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను అని  ఈ శ్లోక భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తాం.
 • భౌమస్నానం : పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం". దీనినే mud bath  అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చేట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే  క్రొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది.
 • వాయవ్యస్నానం : ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే! అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.
 • దివ్యస్నానం : లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా! అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది. అవకాశం వస్తే వదలకండి.
 • మానసిక స్నానం : అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది. పైపై స్నానాలు కాకిస్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది.

ఖస్థితం పుండరీకాక్షం చింతయేత్ పురుషోత్తమం| అనంతాదిత్యసంకాశం వాసుదేవం చతుర్భుజం||
శంఖచక్ర గదా పద్మధారిణం వనమాలినం| ధ్వజ వప్ర అంకుశైర్లక్ష్య పాదపద్మం సునిర్మలం||
త్వత్పాదోదజాం గంగాం నిపతంతీం స్వమూర్ధని| చింతయేత్ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం స్వకాంతమం||
తయా సంక్షాళయే త్సర్వమంతర్దేహగతం మలం| తత్ క్షణాత్ విరజా మర్త్యో జాయతే స్ఫటికోపమ:||
ఇదం మానసికం స్నానం ప్రోక్తం హరిహరాదిభి:| సార్దత్రికోటి తీర్ధేషు స్నానాత్కోటి గుణాధికం||
యోనిత్యమాచరేద్దేవం సవియెనారాయణ స్మృత:| కాలమృత్యు మతిక్రమ్య జీవత్యేవ నసంశయ:||

అంటే పరమాకాశంలో ఉండే పురుషోత్తముడయిన వాసుదేవుడిని, నాలుగు భుజములు కలవాడిని, శంఖ చక్ర గద పద్మము వనమాలలను  ధరించినవానిని, ధ్వజాదులనే మంగళకరమైన గుర్తులున్నవానిని ధ్యానించాలి. వాని పాద పద్మముల నుండి పుట్టిన గంగను తన శిరస్సుపై పడి బ్రహ్మరంధ్రం వెంబడి హృదయంలో ప్రవేశించే దానిగా భావించాలి. ఆ గంగచేత తన పాపలు పోతున్నట్లుగా చింతించాలి. అప్పుడు స్ఫటికం మాదిరిగా మలినాలు లేకుండా నిర్మలంగా ఉండి మృత్యువును దాటగలరు. ఇలా హరిహరులను తలుచుకుంటూ చేసే మానసిక స్నానం కోటి పుణ్య నదులలో చేసిన స్నానం కన్నా గొప్పది అని దీని భావము.

ఇడా భాగీరథీ గంగా, పింగళా యమునా స్మృతా| తయోర్మధ్యగతా నాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతీ||
జ్ఞానహ్రదే ధ్యానజలే రాగద్వేష మలపహే| య:స్నాతి మానసే తీర్ధే సయాతి పరమాం గతిం||
అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి:| ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం||
నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అవ్యయ:| సచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా||
బ్రహ్మైవాహం నసంసారీ, ముక్తోహమితి భావయేత్| ఆశక్నువన్ భాపయితుం వాక్యమేతత్ సమభసేత్||
ఏవం య: ప్రత్యహం స్మృత్వా, మానసం స్నానమాచరేత్| సదేహాంతే పరబ్రహ్మపదం యాతి నసంశయ:||

ఎడమ ముక్కులోనున్న ఇడానాడిని భాగీరథిగా, కుడి ముక్కులో నున్న పింగళనాడిని యమునగా, వాటి మధ్యలో నున్న సుషుమ్నును సరస్వతిగా భావించాలి. రాగద్వేషాలనే మాలిన్యాన్ని పోగొట్టే జ్ఞానమనే సరస్సులో స్నానం చేసినట్లు భావించి నేనే అచ్యుతుడను, గోవిందుడను, హరిని, ఆనందరూపుణ్ణి, చావు పుట్టుకలు లేని పరమాత్మ స్వరూపాన్ని నేనే అని భావిస్తూ మనస్సులోనే స్నానం చేస్తున్నట్లుగా భావించి తరించాలి అని దీని భావము.

ఇహ మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం. ఇది కనీసం నెలకి రెండు సార్లయినా అందరూ చేయాలి! మరి దాని వలన ప్రయోజనాలేమిటో  చూద్దాం -

1. వేడినీటి స్నానం చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది.

2. సౌనా పేరుతో నేడు చేయబడే స్టీం బాత్ లు చర్మకణాలను పూర్తిగా శుభ్రపరచి, చర్మ రంధ్రాలు స్వేచ్ఛగా గాలి పొందేలా చేస్తాయి.

3. శరీర వెనుక భాగ చర్మం, పిరుదులు, భుజాలు, మొదలైనవి గట్టిగా వుంటాయి. వేడినీరు తగిలితే ఆ భాగాల లోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి. ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది.

4. వేడి నీటి తలంటు స్నానం చర్మానికి నూనెను ఇచ్చి మెత్తబడేట్ల చేస్తుంది. నూనెతో మర్దన, పసుపు శనగపిండిలతో కూడిన పేస్టు రోగాలను తెచ్చే క్రిములను నశింపజేస్తుంది. చర్మం దురదలు, మంట తగ్గుతాయి. అపుడపుడూ అభ్యంగన స్నానం చేస్తే, మైండ్ చక్కటి రిలాక్సేషన్ పొంది చురుకుగా వుంటుంది. వేడినీటిలో సువాసన ద్రవ్యాలు వేస్తే అవి చర్మానికి సహజ కాంతి నిచ్చి చెడు వాసనలను పోగొడతాయి.
 

ఇవే కాక నేతితో స్నానం చేయుట వలన ఆయుర్దాయం పెరుగుతుంది; పెరుగు, ఆవుపేడతో స్నానం చేయుట వలన లక్ష్మీ వర్ధనము; దర్భలతో చేయుట వలన సర్వ పాపాలు తొలగుతాయి; సర్వ గంధాలతోటి స్నానం చేస్తే సౌభాగ్యము, ఆరోగ్యము అభివృద్ది చెందుతాయి; ఆమలక స్నానము అంటే ఉసిరికాయని వేసి చేసిన స్నానం వలన దారిద్ర్యాలు తొలగుతాయి; నువ్వులు మరియు తెల్ల ఆవాలతో చేసిన స్నానం అమంగళనివారకము; నువ్వులతో కాని తెల్ల ఆవాలతో కాని ప్రియంగువుతో కాని స్నానం చేస్తే సౌభాగ్య వర్ధనము; మోదుగ, మారేడాకులు, రెల్లు, తామర, కలువ, కడిమి పువ్వులతో స్నానం చేస్తే లక్ష్మీ వర్ధనమే కాక శుభప్రదం; నవరత్నాలతో స్నానము చేస్తే యుద్ధ విజయం; బంగారము వేసిన నీటితో స్నానం చేస్తే ఆయుష్షు, మేధా శక్తి పెరుగుతాయి అని రక రకాల స్నానముల వలన కలిగే ఫలితాలను గురించి శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణములో చెప్పబడింది.  

ఇప్పుడు ఎవరయినా మీ దగ్గరకి వచ్చి స్నానం చేశారా అని అడిగితే ఏం చెప్తారు? జంధ్యాల గారి చిత్రాలలో సుత్తి వీరభద్రరావు లాగా ఏం స్నానం? నీళ్ళ స్నానమా? బూడిద స్నానమా? మట్టి స్నానమా? తొట్టి స్నానమా? గాలి స్నానమా? ఎండ స్నానమా? వాన స్నానమా? మనసు స్నానమా? పూల స్నానమా? పూల రేకుల స్నానమా? అని అడగచ్చు పొరపాటున అవతలి వ్యక్తి నీళ్ళ స్నానం మహాప్రభో అని అంటే మళ్ళీ వేడి నీటి స్నానమా? చన్నీటి స్నానమా? పన్నీటి స్నానమా? కన్నీటి స్నానమా? మంచి నీటి స్నానమా? ఉప్పునీటి స్నానమా? బావి నీటి స్నానమా? గోతి నీటి స్నానమా? బోరింగు పంపు నీటి స్నానమా? కుళాయి నీటి స్నానమా? అంటూ అడిగిన వాళ్ళకి తలంటు పోసేయచ్చు. అది సంగతి ఇహ మీరు చెలరేగిపోతారని నాకు తెలుసుగా! 

38 comments:

dp - Scorpion King said...

am loving it..! good one..!

రసజ్ఞ said...

@dp-Scorpion King gaaru
thanq so much!

బుద్దా మురళి said...

మొదటి మూడు లైన్లు చక్కని వ్యంగ్య రచనకు తెర తీసినట్టుగా ఉన్నాయి . బాగా నవ్వుకున్నాను. ఆ తరువాత స్నానం గురించి బాగా చెప్పారు .కానీ మొదటి మూడు లైన్లు చదివితే మీరు వ్యంగ్యం బాగా రాయగలరని తెలిసిపోతుంది రాయవచ్చు కదా

nanda said...

ayya babooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooi..............naa lanati baddakasthulu chadavaalsina post kaadu...............superb

రసజ్ఞ said...

@బుద్దా మురళి గారు
ముందుగా నా బ్లాగుకి స్వాగతం. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. తప్పకుండా రాస్తానండీ!

రసజ్ఞ said...

@Nanda gaaru
antae chadivinattaa? chadavanattaa?

nanda said...

baddakam chadavataaniki kaadandi snaanam cheyadaaniki

Anonymous said...

@ రసఙ్ఞగారు:
ఇదన్యాయం.. మాకు ఇక్కడ (ఇంగ్లాండ్) నీళ్ళు పట్టుకుంటే కరుస్తాయి. అంత చల్లగా ఉంటాయి. పోనీ వాన పడినా బయటకెళ్ళలేము మళ్ళీ అదే సమస్య చలికి గడ్డ కట్టుకుపోయి చావాలి. సాధారణంగా ఉష్ణోగ్రత 13-15 మించదు. అందుకని స్నానం అనే 'పాపిష్టి పనిని' వీలైనంత వాయిదాలేసుకునే మాకు ఇలాంటి టపాలు రాసి ఊరించటం అన్యాయం.

రసజ్ఞ said...

@నంద గారు
హహహ ! బాగుంది!

@అచంగ గారు
అందుకే మీ లాంటి వాళ్ళ కోసమే ప్రత్యామ్నాయం కూడా చెప్పాను కదా! మానసిక స్నానం చేసి చెలరేగిపోండి!

చాతకం said...

బాగుందండి, తెలియని చాలా విశేషాలు వ్రాసారు. మన పూజల్లో చాలా సార్లు "స్నానానంతరం ఆచమనం సమర్పయామి" అని వస్తుంది, అంటే మరి మనం గూడా స్నానం చేసిన తరువాత నీళ్ళు తాగాలని చేప్పినట్లన్నమాట?
డాక్టర్లు కూడా హై బీపీ వున్నవాళ్ళకి ఇలా స్నానం తరవాత నీళ్ళుతాగటం మంచిదని చెబుతారు. [గూగులాయ నమః]

రసజ్ఞ said...

@చాతకం గారు
ముందుగా మీకు ధన్యవాదాలండీ! నిజమే స్నానానంతరం ఆచమనం గురించి ఉంది. దాని గురించి రాస్తే అదొక్క విషయమే ఒక పెద్ద టపా అవుతుందని ఇక్కడ దాని ప్రస్తావన తీసుకుని రాలేదండీ. మంచి విషయాన్ని మా ముందుకి తీసుకుని వచ్చారు!

Anonymous said...

రసజ్ఞ garu
meeru cheppina vishaylu eroju tv lo chusanandi
bhakti tv lo
Rams...

రసజ్ఞ said...

@Rams gaaru
wow avunaa! chalaa aanandamgaa undandi! meeru adrushtavanthulu tv chusthunnaaru nenu chusi rendellavuthondi! thank you so much for your comment!

Anonymous said...

Rams

nijamga meeru tv chusi twi year avutunda
why enduku ,tv leda or tv pi kopama

రసజ్ఞ said...

@Rams gaaru
ayo nijjamgaa nijjam andi 2yrs ayyindi chusi
enduakntae ikkada tv ledu. chaduvukunae pillala daggara tv undadugaa!!!!

శ్రీ said...

బాగా గుర్తు చేసారు. నేను స్నానం చేసి వస్తా. మా ఫ్రెండొకడు శనివారం మాత్రమే చేసేవాడు, అతనికి మీ బ్లాగు వినిపిస్తా.

కొత్త పాళీ said...

కడిగి పారేశారండీ బాబు

రసజ్ఞ said...

@శ్రీ గారు
ఇంకెందుకాలస్యం చేసి రండి మరి! చేశాక అప్పుడు ఫ్రెష్ గా వినిపిద్దురుగాని మీ స్నేహితునికి!


@కొత్తపాళీ గారు
ధన్యవాదాలండీ!

thrill said...

rasagna garu aa sree frnd ni nene andi , meeru inni snanalu gurinchi chepparu, ippatiki maa baamma bratiki unte mee burra baddalayyedi... musaldi chachi narakaniki vellindi kabatti saripoindi ( tappakunda narakanike velluntundi :P) ," paachi pantiki balamu , matti vontiki balamu " ani cheppedi maa baamma so baamma mata bangaru baata ani pragadam ga namme nenu sanivaram matram meeru cheppina oka shananm chesthanu but meelist lo naa migata rojula snanam lekapovadam kadu sochaneeyyam . naa weekdays (sunday to friday) snanam " edarilo bidari snanam " ... gurinchikuda meeru telusukovali . ee snanam lo manaki peddaga srama undadu , just battalu marchukunetappudu .. vollantaa market lo dorike edo oka deo spray ni polam lo purugula mandu pichikari chesinatlu half minit cheste , ika snanam aipoinatle :P .ika notlo oka happy dent white leda edo oka talaki masina company bobligum veskoni bayatapadite " brush while u walk "(walk while u talk ani idea cell ph ad laga ) pallu tome karyakramam kuda aipoddi ...so ila meeru naa " bidari snanam " gurinchi telusukoleka povadam nenu teevramga nirasistunnanu .. sakala janula sammeku pilupunistunnanu .... itlu PORATALA RAMULU uraf thrill ( veediki aratam ekkuva poratam takkuva :p)

రసజ్ఞ said...

@ PORATALA RAMULU (aaraatam ekkuva, poraatam thakkuva) uraf thrill gaaru
hahahahahah matti vontiki balamanae kadandee ee bhouma snaanaanni pettindi? mari ee paachi pannu gurinchi nakau teliyadu mee laanti mahaanubhaavulakae teliyaali. ajnaanamtho chinna prasna edaarilo deospraylu dorkuthaayaa? inkonchem vivaramgaa teliyachesthe mee ee edaarilo bidaari snaanam gurinchi kuda janaalu telusukogalarani naa manavi!

thrill said...

RASAGNA garu , edarilo neellu tappa migilina anni vastuvulu bagane dorukutai (for ex: middle east /dubai ) , so ee rakamaina snanam dubai lanti edari desallo baaga popular ,. mee manasulo : oree sannasivedhava nuvvu undedi dubai lo kadukada ani pusukkuna oka alochana ravochu aa edari snananni india lo nalanti bidarulu acharistunnaru kabatti deeni peru 'edarilo bidari' snanam. ika paachi pallu vishayaniki vaste , manishiki gharvam atane PASTE and BRUSH kanipettadani. okka manishi tappa ,srushtilo kotanukotla jevarasulu unnai ..(ex..pululu , simhalu ,enugulu etc)avanni...pallu tomuyunnaya .. mari vaati pallu manishi pallakanna 100 retlu gettiga unnai kada , eepuga perugutunnai kada :D.... meeru peddavaru intakante meeku nenu cheppe antati vadini kadu :). nannu ardham cheskuntarani talusthanu ...
inte sangatulu andharini adiginatlu telupavalenu peddavariki naa namaskaralu , chinnavariki naa aseessulu .

itlu
BAKARA BALASATTHI uraf THRILL
veedu balasatthi veedu chesedataa atthi)

రసజ్ఞ said...

@BAKARA BALASATTHI uraf THRILL (veedu balasatthi veedu chesedataa atthi) gaaru

hahaha ila selavichchaaraa swamy!

వనజ వనమాలి said...

రసజ్ఞ.. మీ ప్రతి పోస్ట్ చాలా బాగుంటుంది .పైపైన చదివేసి బాగుందని చెప్పేస్తే ఒక పనైపోతుంది బాబూ అనుకోకుండా తీరిక చిక్కించుకుని మీ బ్లాగ్ చదువుతాను.విషయాన్ని వంటబట్టించుకునే ప్రయత్నం చేస్తాను అన్నమాట. బాగుంది అని ఒక చిన్న మాటలో చెప్పలేను. మీ లాటి యువతకి ఇన్ని ఎక్స్ట్రా -ఆర్దినరి స్కిల్స్ ఉండటం చాలా సంతోషం. మీకు శుభాభినందనలు. ఇంకా..మంచి పొస్ట్ లు వ్రాసి అలరించాలని ఆశిస్తూ.. బ్లాగ్ రూపురేఖలు మార్చి చదువరులకు శ్రమ తగ్గించినందుకు ధన్యవాదములు.

Anonymous said...

Rasagna garu, bhale chepparu andi snanam gurinchi, aa vivarana superb. Mee ee blog hadivina varu, surely at the immeditae next bath special snanm chesi untaru :p. Ala rasaru meeru :p
Mee blog chala bagundi andi
Keep go , all d best :)Rasagna garu, bhale chepparu andi snanam gurinchi, aa vivarana superb. Mee ee blog chadivina varu, surely at the immeditae next bath special snanm chesi untaru :p. Ala rasaru meeru :p
Mee blog chala bagundi andi
Keep go , all d best :)

రసజ్ఞ said...

@వనజ వనమాలి గారు
చాలా ధన్యవాదాలండీ మీరలా అంటుంటే నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. బ్లాగు రూపు రేఖల విషయంలో మాత్రం నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి. మిగతా వాళ్లకి ఇబ్బంది కలగకుండా మీరు ముందుగా ఆలోచించి నాకు చెప్పారు.

@Anonymous gaaru
thanks a lot andi!

కృష్ణప్రియ said...

చాలా బాగుంది. Very informative!!

రసజ్ఞ said...

కృష్ణ ప్రియ గారు
బోలెడు థాంకులు మీకు!

thrill said...

rasagna garu , idi anyayam krishna priya gariki matram enduku "boledu" thankulu ...
kotta snanam gurinchi teliya jesina naku matram oka chinna nitturpu ( edchav lera edava sannasii annatlu ) idi darunam andi ,idi nenu teevram ga "khandistunna" ...

itlu
KATTHI RAMDAS uraf THRILL
(statement ni khandinchadaniki kuda katthi kavalanukune sannasi veedu)
)

రసజ్ఞ said...

@KATTHI RAMDAS uraf THRILL (statement ni khandinchadaniki kuda katthi kavalanukune sannasi) గారూ
ఎంతమాట? నేను నిట్టూర్పు ఎక్కడిచ్చానండీ? మీరేదో అలా పాచోపదేశం చేస్తుంటే మైమరచి (నిజం చెప్పాలంటే మైండ్ బ్లాకు, రెడ్డు, బ్లూ, వైట్ అన్నీ అయ్యి) మాటలు రాక మూగబోయా. ఇప్పుడు చెప్తున్నానుగా! మీకు ఒక టన్ను థాంకులు, ఒక బస్తాడు నెనర్లు, ఒక గంగాళం ధన్యవాదాలు, ఒక డేగిసా కృతజ్ఞతలు, ఒక కేజీ మంగిడీలు. ఇన్ని సరుకులు ఒకే సారి దొరికాయని పచారీ కొట్టుకి వెళ్ళడం మానేస్తారేమో! జాగ్రత్త సుమీ!

thrill said...

RASAGNA garu ,

meeru bala medhavandii....

deeniki sambhandhinchina sakshadharalu ....

#1.intachinna vayasulo ilanti rasagna bharitha maina blogulu andistunnaru.
(intachinna vayasu ani nenu anagane meeru avakkayarani nenu anukovadam ledulendi , ee bakara gadu naa ' shoda ' tagi untadu andulo 13 years back 6th i.e 13 + 6 + 4 + 2(ladies default hide) = 25 ani caluculate chesuntadu ani meeru ardham cheskununtarani nenu ardham cheskunna lendi :P)

#2.aa akasa ramanna ( adea aa anonymous rams) tv lo chusanu ee snanam gurinchi ani cheppagane t.v chusi 2 years aindandi ani nokki vokkanincharu .. ( antee ... idi nenu ee t.v programme ETC lu chusi vrasindi kadu ani indirect ga bhalechepparu )

#3.oka new commer hero(mimmalne) ni amitabachan lanti hero (krishna priya garu) pogidite boledu thankulu .. ade oka prekshakudu(inkevaru aa bakara nene) pogidite nitturpulu :P ... adi naku arhdam ayyesariki ...mee kallaku kanipinchani rainbow ni ( ade black red etc all colours) kanipinchinatluga nannu namminchi ,malli elections ki rajakeyanayakulu iche vagdhanallaa.. oke sari anni padhakalu naapai guppinci meeru chusinatluga cheppukune aa rainbow ni tirigi naake chupinchi ...enta nice ga tappinchukunnarandii ...ahaaa....!!!.

#4.intala visigistunna nannu direct ga tidite bagodani naa antaratma titlane naameeda prayoginchi (mee startings)..ivanni nee bhramalu kadura mummatiki nijame ani naku teliya jepputuu malli chivarilo daniki andam ga oka "GARU" tagilinchi ...tittakane enta andam ga tidutunnarandi .. wah ..wah..!.
..
so ivichalava meeru bala medhavi anedaniki adharalu :P.
hmmmmmm... sare nenu alasipoya ,,, ika velli shoda tagosthanandi... annattu mee shoda chala bagundi chivarilo karpura harathi ,prasadalu kuda teeskunnam .

ika selavu
itlu
BI'CHARI' uraf THRILL
(veedoka, pa'chari' tho panileni bramhma'chari'

kalyan said...

adbhutham o penuboothamai adhi idhi leka anintini kabalisthunte a devudu manchi kosamani a penuboothaani mee alochana marchesaadandi... chepalante naaku maatalu chaalatledhu.. mee sandhesaalu sandhehaalu chaala ruchikaranga vunaayi.. na bashalo chepaalante meeroka micro controller lanti vaaru...

రసజ్ఞ said...

@kalyaan గారు
ఇది నాకు చాలా పెద్ద పొగడ్త అండీ! చాలా చాలా ఆనందంగా ఉంది. మీకు నెనర్లు!

kalyan said...

good morning... pogadtha kadandoi vunadhe mari.. kruthagnyudni..

murali krishna said...

one of the best blog i have ever read....
thank u so much for the valuable information

రసజ్ఞ said...

@ మురళీ కృష్ణ గారూ
ఈ బ్లాగుని మెచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు!

SUNNY WORLD said...

chala super ga undandi ....... chala rojula nundi telusukovali anukuntundaga me blog tho telusukunnanu chala thanks andi

SUNNY WORLD said...

chala super ga undandi ....... chala rojula nundi telusukovali anukuntundaga me blog tho telusukunnanu chala thanks andi

Anonymous said...

Wow, awesome blog layout! How long have you been blogging for?

you made running a blog look easy. The overall glance of your web site is fantastic, as neatly as the content!


My web-site - dating online (bestdatingsitesnow.com)