Monday, October 24, 2011

వెలుగు జిలుగులు



కళ్ళలా మిల మిలా మెరిసే కాకరపువ్వొత్తులు
ఆలోచనలలా చక చకా తిరిగే విష్ణు, భూ చక్రాలు
ఆవేశంలా ఉవ్వెత్తున ఎగసే చిచ్చుబుడ్డులు
మనసులా కరిగిపోయే వెన్నముద్దలు
కోపంలా బుస బుసలాడే పాము బిళ్ళలు
కొసరి కొసరి వడ్డించినట్టు కాలే మతాబులు
జడలా అందంగా ఉండే పొడవయిన తాళ్ళు
చిన్న పిల్లల్లా అల్లరి చేసే సిసింద్రీలు
ఛలోక్తుల్లా పేలే టపాసులు
ఆశల్లా అంబరాన్నంటే తారాజువ్వలతో 
ఈ దీపావళి అందరి జీవితాలలోను క్రొత్త
క్రాంతులని నింపాలని ఆశిస్తూ...........
అందరికీ దీపావళి శుభాకాంక్షలు!!!

కుల, మత, ప్రాంతీయ, వయసు భేదాలు లేకుండా అందరూ జరుపుకుని ఆనందించే పండగ దీపావళి. ఈ దీపావళిని మొత్తం అయిదు రోజులు జరుపుకుంటూ ఉంటారు.

మొదటి రోజు - ధన త్రయోదశి - దీనినే ధన తెరస్ అని కూడా అంటూ ఉంటారు. క్షీర సాగర మధనం జరిగినప్పుడు అందులోనుంచి ధన్వంతరి చేతిలో అమృత కలశంతో ఈ రోజునే ఉద్భవించారు. ఈ రోజున ఆవు నేతితో దీపం వెలిగించి శ్రీ సూక్తం చదువుకుంటే కుబేరుడు మన ఇంట్లో కొలువుంటాడుట. అందువలననే ఈ రోజున ఎక్కువగా బంగారం కొంటూ ఉంటారు.

రెండవ రోజు - నరక చతుర్దశి - కృతయుగంలో హిరణ్యాక్షుని సంహరించిన వరాహస్వామికీ, భూదేవికీ అసుర సంధ్యా సమయములో నరకుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఈ నరకుడు ప్రాద్యోషపురానికి రాజు. అతను బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు. నరకాసురుని ఆగడాలు మితిమీరడంతో సత్యభామ అతనిని వధిస్తుంది. అలా ఈ రోజున ఆయన మరణించిన రోజు. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలపైన నువ్వుల నూనె పెట్టుకుని, చక్కగా బాణసంచా కాల్చి (అసలు ప్రొద్దున్నే లేవడం బద్ధకమయినా పోటా పోటీగా కాల్చే బాణసంచా కోసం అన్నా లేచేదానిని) అప్పుడు తల మీద ఉత్తరేణి ఆకులు పెట్టుకుని తలంటు పోసుకుంటారు.  క్రొత్త అల్లుళ్ళ చేత మినుము కొరికించడం ఆనవాయితీ. ఈ రోజున చాలా మంది మినప ఆకులతో కూర వండుకుంటారు. అనేష సేముషీ మూష మాష మానస్య మానతే అన్నారు కదా!

మూడవ రోజు - దీపావళి అమావాస్య - ఇది ముఖ్యమయిన పండుగ. ఈ రోజు ఈ పండుగ చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేమిటంటే:
  • రావణాసురునితో యుద్ధం జరిపి విజయరాముడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేసిన రోజు అమావాస్య కావడం వలన చీకటి నిండి ఉండగా అయోధ్య ప్రజలు సీతారాములకి స్వాగతం పలుకుతూ దీపాలని వెలిగించారని ఆ రోజు నించి ప్రతీ సంవత్సరం ఆ రోజున దీపావళి జరుపుకుంటున్నారని చెప్తారు. 
  • నరకాసురుడు మరణించాడు కదా! ఆనందములో ఈ రోజున దీపావళి జరుపుకుంటారు. 
  • ఇది ముఖ్యమయినది. క్షీర సాగర మధనములో లక్ష్మీ దేవి ఈ రోజునే ఉద్భవించింది. అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి అందుకనే ఈ రోజు సాయంత్రం హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. దీని వెనుక ఒక కథ ఉంది. అదేమిటంటే: పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి మిక్కిలి సంతోషించి, ఒక మహిమాన్వితమైన పూల హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో త్రొక్కడం జరుగుతుంది. అది చూసిన దుర్వాసుడు కోపంతో దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. అలా ఇంద్రుని భక్తికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహం వలన తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
  • మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు పదమూడేళ్ళు వనవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని ఈ రోజునే తిరిగి వస్తారు. దానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. 
  • గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని మన రైతన్నలు దీపావళి పండుగను చేసుకుంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు కృతజ్ఞతగా దీపాలు వెలిగించి ఇష్టదైవానికి ప్రత్యేక పూజలు చేస్తారు.
  • విక్రమార్కునికి పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగింది. 

తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!!
ముఖ్యముగా ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీ దేవి; నదులు, బావులు, చెఱువులు మొదలయిన నీటి వనరులలో గంగా దేవి ఉంటారుట. కనుక ఈ రోజున సూర్యుడు ఉదయించే సమయములో (ప్రత్యూష లేదా అరుణోదయ కాలం)  మఱ్ఱి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల పట్టలను నీటిలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి. పిదప నువ్వుల నూనెతో దీపములు పెట్టాలి. ప్రధాన ఇంటి ద్వారం, ధాన్యపు కొట్టు, బావి, వంట ఇల్లు, రావి చెట్టు ఈ అయిదు ప్రదేశాలలో తప్పకుండా దీపాలను వెలిగించాలి. ఇలా చేయుడం వలన దారిద్ర్యం తొలగి, గంగానదీ స్నాన ఫలం వలన నరక భయం ఉండదని పురాణాలు చెపుతున్నాయి. స్త్రీలు అభ్యంగన స్నానానంతరం క్రొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి,  గుమ్మాలను పసుపు, కుంకుమ మామిడాకుల తోరణాలతో అలంకరించి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్యభోజ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్ధం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఈ రోజు బట్టతో చేసిన వత్తులను వేస్తారు కనుక వాటిని సిద్ధం చేసే పనులలో మునిగి తేలుతారు. అలానే అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారని మన శాస్త్రం చెపుతోంది.  

దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...

అంటూ సంధ్యాసమయమున చిన్న పిల్లలంతా గోగుకాడకి మూడు చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడం మన సాంప్రదాయాలలో ఒకటి. ఈ రోజున యముడు దక్షిణ దిశగా ఉంటాడు కనుక పిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఇలా దివిటీలు కొట్టడం అనేది మన పితృదేవతలకు దారి చూపుతుందని ఒక భావన. ఈ తతంగమంతా అయిన తరువాత కాళ్ళు, చేతులు, కళ్ళు  కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తినడం మన ఆచారం. ఇదంతా అయిన తరువాత పాతవి, నూలువి బట్టలు వేసుకుని మనమెంతో ఆశగా ఎదురుచూసే బాణసంచాని కాల్చుకోవచ్చు. ఈ బాణ సంచా కాల్చగా వచ్చే పొగలో ఎన్నో పురుగుల్ని, సుక్ష్మ జీవులని చంపే గుణం ఉంది. పైగా మన పాపాలన్నీ ఈ మంటలలో దహించుకుని పోతాయి అని ఒక నమ్మకం. రాత్రికి స్త్రీలు చేటలు, తప్పెటలు వాయిస్తూ సంబరంగా జేష్ఠాదేవిని (అలక్ష్మి, పెద్దమ్మారు, దారిద్ర్యాదేవిని) ఇండ్లనుండి తరిమి కొడతారు.

నాలుగవ రోజు - బలి పాడ్యమి - అదితి గర్భాన వామన రూపములో జన్మించిన శ్రీమహావిష్ణువు మహాదాత, విశేషమయిన బలపరాక్రమాలు కల బలిచక్రవర్తిని మూడడుగుల స్థలాన్ని అడుగుతాడు. బలిచక్రవర్తి దానికి ఒప్పుకోగా మొదటి అడుగుతో భూమిని, రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించగా మూడవ అడుగుతో బలి చక్రవర్తిని పాతాళానికి అణచి వేస్తాడు. దేవతలను బందీలుగా ఉంచడం వలన ఈ విధంగా చేశాడే తప్ప బలి చక్రవర్తి దాన గుణానికి సంతోషించిన ఆ శ్రీహరి అతనికి జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తాడు. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి జ్ఞాన దీపాన్ని వెలిగించేందుకు సంవత్సరానికి ఒకసారి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చే వరాన్ని ప్రసాదిస్తాడు. అందువలననే మనం ఈ రోజున ఈ పండగని జరుపుకుంటాము. మలయాళీలు ఇదే పండగని ఓణం అనే పేరుతో జరుపుకుంటారు. ఈ రోజునే గోపూజ చేయడం కూడా ఒక ఆచారం.

అయిదవ రోజు - భగిని హస్త భోజనం - దీని గురించి కొంచెం వివరంగా ఆ రోజు టపాలో వ్రాస్తాను.

సరే ఇన్ని తెలుసుకున్నాం కదా మరి దీపం యొక్క విశిష్టత కూడా తెలిస్తే సంపూర్ణమవుతుంది. ఏమంటారు?
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపం యొక్క జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికీ, ఆనందానికీ, సజ్జనత్వానికీ, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మనకి ఒక రోజులో సంధికాలాలు రెండు. ఒకటి సూర్యోదయానికి ముందు రెండవది సూర్యాస్తమయం తరువాత. వీటినే మనం ఘటికాలు అంటాము. ఇది మొత్తం నలభై ఎనిమిది నిమిషాల కాలం. ఈ కాలములో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉండటం వలన రజ - తమో గుణాలు అధికంగా ఉంటాయి. ఈ శక్తుల నుండి రక్షణ పొందడానికి మనం దేవుని ముందు కూడా ఈ సమయాలలో దీపం పెట్టి పూజ చేస్తూ ఉంటాము. ఈ శక్తులు ఈ సమయంలో అధికంగా ఉండటం వలనే ఏమో అసలుసంధ్యవేళల్లో తధాస్తు దేవతలు ఉంటారు కనుక చెడు మాటలు అనకూడదు అని అంటూ ఉంటారు. మనోనిశ్చలానికీ, సుఖశాంతులకీ అనువయిన కాలం కనుక దీపావళీ, కార్తీక మాసం మొదలయిన వాటిల్లో దీపానికి అంత విలువ, ప్రాశస్త్యం కూడాను. 

అవండీ నాకు తెలిసిన దీపావళి ముచ్చట్లు కొన్ని మీతో పంచుకున్నా! మరి నాకు తీపే తినిపిస్తారో లేక టపాసులే కాలుస్తారో! టపాసులు కాల్చేటప్పుడు మాత్రం జాగ్రత్త సుమీ!

27 comments:

Disp Name said...

బాగుందండీ,

మీకు దిబ్బు దిబ్బు దీపావళీల
ముచ్చటైన శుభాకాంక్షలు !

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మీకూ దీపావళి శుభాకాంక్షలు.
చాలా విశదంగా రాశారు.
అనేష సేముషీ మూష మాష మానస్య మానతే- దీనికి అర్థమూ చెప్పచ్చుగా!
కవిత అదిరగొట్టేశారు. బాగుంది. అభినందనలు.

కృష్ణప్రియ said...

ఎన్ని విషయాలు చెప్పారో. ధన్యవాదాలు.

ఎందుకో ? ఏమో ! said...

దీపంతో దీపాన్ని వెలిగించడమే దీపావళి
(తమసోమ జ్యోతిర్గమయా )


తెలియని నేను,
తెలిపిన నీకు
thanks చెప్పాలనుకున్న
తెలుసుకునే తెలివిలేకున్న
తెలిపెడి నీకు
తెలిసెడి దేదో
తెలుసుకునే నాకు
మధ్యన ఏమి లంకె (లింక్) లేదు.
తెలేవే తెలివికి తెలుపును
తెలివే తెలివికి తెలియును
తెలిపెడి వాడు
తెలిసెడి వాడు
తెలివకన్న వేరుగా లేరు
నీ తెలివికి వెలిగిన వెలుగు తో
నా తెలివిని వెలిగించావు
దీపమే దీపమును వెలిగించగలదు
మరొకరికి బుద్ధి కి సాయం చేసిన లోటేన్నడు ఉండదు
పొండునదున్డునో లేదో తెలియదు కానీ
తెలిపిన నీకు పోయేడది లేదు
పంచిన పెరిగే నీ తెలివికి
నీచే పెంపొందిన నాతెలివికి
నిజమగ భేదం లేదు ఏనాడు
ఎట్లు చూచినా అట్లే కానపుడు నట్టుల
నీకు నాకును బెధమేమి సుమీ నీ నా అన్న భావము తప్ప
తెలివే వెలుగు వెలుగే తెలివి
తెలివి కన్నా వేరు వెలుగు లేదు
తెలివికి తెలియని తెలివిని మీరిన దానిన తెలుపమన్న (తెలియమన్న)కాని
తెలివికి లోటు లేదు

by

http://endukoemo.blogspot.com/2011/10/blog-post_24.html

సుభ/subha said...

ఏ స్వీటు తింటారు? ఏది పెట్టినా తింటానంటే నేను మీ నోట్లో రసగుల్లా పెట్టేస్తున్నా.. తినేయండి.. బాగుందా? నేనేదో చేసినట్టు బాగుందా అని ఆడగడం ఒకటి.. సరే గాని చిచ్చు బుడ్డులాగా చక్కని చిక్కని వెలుగులతో మీ టపా భలే వెలిగింది.. అందుకే మీకు కాకర పువ్వొత్తు మిలమిలల అభినందనలు. మంచి విషయాలను తెలియజేసినందుకు టపాసుల ధన్యావాదాలూను. కవిత చాలా బాగుందండీ. మీక్కూడా దీపావళి "సుభా" కాంక్షలు... వేవేల వెలుగులతో నిత్యం ఇలానే మీరు దిన దిన ప్రవర్ధమానమవ్వాలని ఆశిస్తున్నా...

జ్యోతిర్మయి said...

మీ బ్లాగు ఇవాళ దీపాల వెలుగులతో శోభాయమానంగా ఉంది. మీ కవిత బావుంది. చాలా విషయాలు చెప్పారు. ధన్యవాదములు.

Anonymous said...

రసఙ్ఞ గారూ
"ఈ నరకుడు ప్రాద్యోషపురానికి రాజు. అతను బ్రహ్మదేవుని నుంచి పొందిన వరగర్వంతో దేవతలను, మహర్షులను నానా ఇబ్బందులు పెడుతుంటాడు"
దేవుళ్ళ నుండి వరాలు పొందటము వేరు, వరగర్వము పొందటము వేరూనూ! తపస్సు వల్ల దేవతల ద్వారా వరాలనూ, ఆయా వరాల వల్ల లభించే శక్తులద్వారా కలిగేది వరగర్వమూ అని పెద్దల (నాదే!) ఉవాచ.

మిగిలిన టపా ఎప్పటిలానే అద్భుతం. దీపావళి శుభాకాంక్షలు. ఈసారికి మేము టపాకాయలు కాల్చేది లేదు చూసి సంబరపడ్డమే!

రసజ్ఞ said...

@జిలేబి గారు
అయ్ అయ్ నాకు స్వీట్ తినిపించమంటే స్వీట్ లాంటి జిలేబీ గారే వచ్చారా ముందు! థాంక్స్ అండి!

@మందాకిని గారూ
మీకు కూడా నచ్చిందా నా కపిత ధన్యవాదాలు! అది ఒక ఛలోక్తి కింద ఒకసారి శ్రీనాధుడు గారు చెప్పారని చదివానండి ఎప్పుడో! ఆయన బావగారు ఏమి తిన్నావు అని అడిగితే ఈయన సకల ఉష్ణం ఏదయితే ఉందో దానినీ, మనలోని మలినాలనీ హరిమ్పచేసేది ఏదయితే ఉందో ఆ మినుముని నేను తిన్నాను అని ఇలా చెప్పారుట ఇంతకీ ఆయన తిన్నది మినుము గారెలు. అది దాని కథ.

రసజ్ఞ said...

@కృష్ణ ప్రియ గారూ
చిరకాల దర్శనం! చదివినందుకు మీకు కూడా!

@ఎందుకో ఏమో గారు
మీ బ్లాగు చూశానండి నేను వ్రాసిన టపా మీలో ఒక కవిని నిద్రలేపిందంటే ఇంకేం కావాలి? మీ కవిత బాగుంది! ధన్యవాదాలు ఇక్కడ పంచుకున్నందుకు!

రసజ్ఞ said...

@Subha గారూ
పంచదార చిలకలు, చనిమిడి తప్ప ఏ స్వీట్ అయినా తింటాను. అదీ మీరు పెడతానంటే ముందే తింటాను. పైగా మీరు పెట్టిన ఈ రసగుల్లా చాలా బాగుందండీ! మీకొక సీక్రెట్ చెప్పనా! ఎవ్వరూ చదవకూడదు సుభాషిని గారు తప్ప. నాకున్న ముద్దు పేర్లలో అదొకటి కనుక ఇలా కానిచ్చేద్దాం ఈ సారికి! మీ వ్యాఖ్యకి చాలా చాలా థాంక్స్! మీ అందరి ఆదరణ, ఆశీస్సులతో చేరగలనని నమ్ముతూ....

@జ్యోతిర్మయి గారు
చాలా చాలా ధన్యవాదాలు మీకు కూడా! నిన్న ఈ టపాని పెట్టిన తరువాత ఇంకా జ్యోతి గారు రాలేదేంటబ్బా ఈ సారి? పాపం పనిలో ఉన్నారేమోలే అనుకున్నాను! అంతలా అలవాటయిపోయారండీ!

రసజ్ఞ said...

@అరుణ్ గారూ
పెద్దల మాట చద్ది మూట అన్నారు! కనుక మీరు చెప్పినది నేనలా అనుసరించేయటమే! ఇక్కడ వరగర్వం అన్న పదానికి వరము వలన కలిగిన గర్వం అనే! మీరు కూడా జ్యోతిగారిలానే అండీ! బ్రిటన్ నించి చూసేది మీరొక్కరే కనుక ఇక్కడ స్పందించకపోయినా మీరు చుసారన్న విషయం నాకు అర్ధమయిపోతుంది!
నేను కూడా ఉన్నానండి ఇక్కడ మీతో తోడు నేను కూడా కాల్చేది ఏమి లేదు మరీ మూడ్ వస్తే అగ్గిపుల్లలు వెలిగించేస్తా! మీరు కూడా అలా చేసి తృప్తి పడిపోండి!

సుభ/subha said...

రసజ్ఞా చూసారా ఎలా కనిపెట్టేసానో ? నేను పెట్టిన స్వీట్ నచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇక నుంచీ నేను కూడా అదే పేరుతో కంటిన్యూ ఐపోతా.. మీరు తిట్టినా సరే, ఏమనుకున్నా సరే, ఆఖరికి కొట్టినా సరే..

Anonymous said...

ఓహ్...అలా కనిపెట్టేస్తున్నారా! అయితే నా ఐపికి త్వరగా మిర్రర్ ప్రాగ్జీకి మార్చేయాలి!

Anonymous said...

Rasagna garu,

meeku Deepawali Shubhakankshaalu :)
Post chaala bagundi andi :)

ఎందుకో ? ఏమో ! said...

ఓ అగ్గిపుల్లతో ఒక దీపం, ఒక చిన్న హారతి కర్పూరం బిళ్ళ, ఓ రెండు అగరు వత్తి కడ్డీలు ........ ఇది నా దీపావళి

రసజ్ఞ said...

@సుభాషిణి గారూ
అయ్యయ్యో ఎంత మాట? కొట్టడం, తిట్టడం లాంటివేమీ చేయను! మీరు ఎంచక్కగా పిలుచుకోవచ్చు నాకెలాంటి అభ్యంతరాలూ లేవు! పైగా మీరంతా ప్రేమగా పిలుస్తానంటే వద్దంటానా?

@అరుణ్ గారు
హా ఇది నేనొప్పుకోను అంతా తొండి!

రసజ్ఞ said...

థాంక్స్ అజ్ఞాత గారు!

@ఎందుకో ఏమో? గారు
ఆధ్యాత్మికతతో జరుపుకోబోతున్నారనమాట! అంత కన్నా ఇంకేమి చేయగలం? భక్తి రసంతో అలా ముందుకెళ్ళండి!

Unknown said...

నర రస(జ్ఞ) భరితంగా చిందిన మీ దీపావళి వెలుగులు చాలా బాగున్నాయండీ!
మీకు మా దీపావళి శుభాకాంక్షలు!!!

Kalyan said...

@రసజ్ఞ టపాలో టపా టపా టపాకాయలు... ఏంటబ్బా ఇంత భలంగా పెలుతునాయే అని చూస్తున్న .. శబ్దం మాత్రం అన్ని చోట్ల మారుమ్రోగుతోంది... తీర చూస్తే అర్థమైంది అది రసజ్ఞ గారి టపాకాయలు అని... మొతానికి దీపావళి ప్రాముక్యత గురించి ఎంతో చక్కగా చెప్పారు... నేను మాత్రం అంత చదవలేదు మీరు రాసిన కవితల చిచ్చుబుడ్డిని, శ్లోకాల తాళ్ళను అల కాలుస్తూ ఆస్వాదించాను... ఎందుకంటే అంత చదువుతూ కూర్చుంటే ఆలస్యమౌతుంది పుణ్యం త్వరగా రావాలి కదా అందుకు :) ... చాలా చాలా బాగుంది మీ రచన మరియు దాన్ని చెప్పిన శైలి..

వెలుగు పూలు విరబూసే అరుదైన తోట
బంధాలను బద్రపరిచే మంచి ఘడియ
ఆనందాలను గుర్తుచేసే గొప్ప వేదిక
అందరికి కనుల పండుగ
బేధాలు లేని దీపావళి పండుగ...

మీకు న ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు :)

Anonymous said...

/దిబ్బు దిబ్బు /
చాలా బాగా వివరించారు. కొన్ని విషయాలు తెలిశాయి.
'దిబ్బు దిబ్బూ అంటే అర్థం ఏమిటి? ఇదే భాష? 'డబ్బు డబ్బు' ఇలా అపభ్రంశం చెందిందా? లేదా 'దొబ్బు దొబ్బూ (తోయడం/నెట్టడం) అని అర్థమా, వివరించగలరు.

sarma said...

నేను చాలా ఆలశ్యంగా చూసేను.చాలా చాలా బాగుంది.

రాకుమార said...

మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
సిరికి లోకాన పూజలు జరుగు వేళ
చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

sarma said...

లక్ష్మి దేవి కోసం చంద్రుడు దీపంలా వచ్చాడా. వూహ బాగుంది.

రసజ్ఞ said...

@చిన్ని ఆశ గారూ
ఈ పండగకి మా ఇంటికి చిట్టి,పండు వచ్చారే! రండి రండి అందరం కలిసి టపాసులు కాల్చుకుందాం! మీ స్పందనకి ధన్యవాదాలు!

@కళ్యాణ్ గారూ
హహహ ధన్యవాదాలండీ! బాగుందండీ మీ దీపావళి కవిత మళ్ళీ ఇక్కడ ఊపిరి పోసారనమాట!

రసజ్ఞ said...

@SNKR గారూ
మీ స్పందనకి నెనర్లు! పూర్వకాలంలో ఉప్పు, గంధకం, పేడ పూత, జిల్లేడు ఆకులు, మొదలయినవి కలిపి తిప్పుడు పొట్లాలు చేసేవారు. వాటిల్ని వెలిగించి ఊరంతా తిప్పి అప్పుడు ఇంటికి వచ్చి కాళ్ళు, చేతులు కడుక్కుని అప్పుడు తీపి తినేవారు. ఇప్పుడు ఊరంతా తిరగలేక ఇంటి ముందు మాత్రమే తిప్పుతున్నారు ఈ దివిటీని. అలా తిప్పు తిప్పు కాస్తా దిబ్బు దిబ్బుగా రూపాంతరం చెందింది. అదన్నమాట సంగతి!

రసజ్ఞ said...

@శర్మ గారూ
ఎప్పుడు చూస్తే ఏముందిలెండి? చూసి ఇక్కడ స్పందించారు అదే పదివేలు! ధన్యవాదాలు! మీకు నచ్చినందుకు చాలా సంతోషం!

@ రాకుమార గారూ
ఎంత మాట? తప్పకుండా.... పైగా ఇంత గొప్ప ఊహాత్మకమయిన పద్యాన్ని ఇక్కడ పెడతానంటే కాదంటానా? అద్భుతంగా ఉంది మీ పద్యం.
ధన్యవాదాలు!

Kalyan said...

@rasagnya gaaru avnu maalli ikade vochesindhi na kavitha :)