Monday, October 17, 2011

గాజుల సవ్వడి


ఏంటండీ ఈ చిత్రం చూడగానే మీ పాత రోజుల్లోకి వెళ్ళారా? పిల్లలిలా వేసుకుని మురిసిపోవడం ప్రతీ ఇంట్లోనూ కనిపించేదే కదా! చిన్నతనంలో ఆడ, మగ తేడా లేకుండా అందరూ గాజులు (ద్రిష్టికి నల్లని గాజులు) వేసుకున్నా అవి మాత్రం ఆడవారినే వలచాయి. ఉయ్యాల తొట్టిలో పడుకోపెట్టే ముందు వేసే తెల్లరాళ్ళ నల్లని గాజులు, కొంచెం ఎదిగాక వేసే నల్లని మట్టి గాజులు, ఆ తరువాత రకరకాల గాజులెన్ని వచ్చినా పెళ్ళికీ, సీమంతానికీ మళ్ళీ మట్టి గాజులదే పైచేయి. అసలు గాజులు అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఉంటారా? ఈ గాజులు వేసుకోవడం అనేది ఎలా మొదలయింది అన్న విషయం తెలియాలంటే ఈ కథ చదవాలి.

అనగనగనగనగా (ఇలా అన్న వెంటనే మీరు ఫ్యాను వేసుకోవాలి! వేసుకున్నారా? హా ఇప్పుడు చదవండి వాటి రెక్కలని చూస్తూ) కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు, అభిప్రాయాలని వెలిబుచ్చే అర్హత లేని రోజుల్లో జరిగిన ఒక యదార్ధ గాధ. మగువలకి ఊహలు, ఆలోచనలు మగవారికన్నా ఎక్కువ కానీ వాళ్ళు బయటకి చెప్పకూడదు కనుక వాటిని మనసులో దాచుకోలేక ఒక్కో కోరికకి ఒక్కో గాజు వేసుకునేవారు. అలా వాళ్ళ చేతుల నిండుగా గాజులు ఉండేవి అంటే అన్ని కోరికలని చంపుకుని, అభిప్రాయాలని వేలిబుచ్చలేక బ్రతికేవారనమాట! వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే గాజుల చప్పుడుని బట్టి తెలుసుకునేవారు! ఆ గాజుల గల గల విన్నప్పుడల్లా వాళ్ళ భర్తలకి అర్ధమయ్యి ఇన్ని కోరికలుండి పాపం ఏమీ చెప్పకుండా చేసేసామే అని జాలి కలిగి వారి మీద ప్రేమ మరింత పెరిగేది! అప్పుడప్పుడు వాళ్ళ కోరికలని వీళ్ళే తెలుసుకుని మరీ తీర్చేవారు. ఇప్పుడు ఆడవాళ్ళకి భావ వ్యక్తీకరణ, మాట్లాడే హక్కు ఉన్నాయి కనుక ఇప్పటి వాళ్ళ చేతులకి ఇదివరకు ఉండే అన్ని గాజులు లేవనమాట! భర్త చనిపోయాక భార్యకి కోరికలు ఉండకూడదు అనే ధోరణిలో ఉండటం వలన భర్త మరణానంతరం వాళ్ళ గాజులని తీయించేసేవారు. కానీ దానికీ దీనికీ సంబంధం లేదు కనుకనే ఇప్పటి తరం వాళ్ళు భర్త చనిపోయాక కూడా గాజులు వేసుకుంటున్నారు.
(గమనిక: ఇదంతా నిజమనుకునేరు! లేదండీ అంతా నా కల్పన సరదాకి చేసిన ఒక ప్రయత్నం) క్రీ. పూ. 2300 - 1000 సంవత్సరాల నాటి సింధూ నాగరికత కాలం నాటి మొహంజొదారో స్త్రీ బొమ్మకి చేతి నిండా గాజులు కప్పేసి ఉంటాయి. అది చూసి ఇలా నేను చేసిన ప్రయత్నం మాత్రమే.  


అసలు ఈ గాజులు వేసుకోవడం అనేది కేవలం మన భారత దేశానికే పరిమితమనుకున్నాను కానీ ప్రపంచంలో ఉన్న ప్రతీ మగువకీ ఇవి ప్రీతికరమయినవని తరవాత తెలిసింది. ఒక పరిపూర్ణ మహిళ తన జీవితంలో వివిధ దశలలో వేసుకునే గాజులను ప్రకృతిలోని అందమైన రంగులతో పోల్చుతూ సరోజినీ నాయుడు గారు Bangle sellers అనే రచనలో చెప్పి హైందవ సంస్కృతిని చక్కగా వర్ణించారు. ఆడపిల్ల అందాన్ని వర్ణించేటప్పుడు తామర తూడల్లాంటి చేతులకు ముత్యాల గాజులు, బంగారు కడియాలు అంటూ చెబుతారు. అవును మరి వయ్యారాలొలికే నెలతకు సొగసైన చేతులు, వాటికి సౌందర్యాన్ని ఇనుమడింపజేసే గాజులు అవసరమే కదా!

ఆచారం: పూజ చేసినా, తాంబూలం ఇచ్చినా, నిశ్చయతాంబూలాలకూ ముతైదువులకు గాజులు ఇవ్వడం మన ఆచారం. గాజులు శుభానికి సంకేతాలు. బొట్టు, పూవులు, గాజులు ఐదోతనానికి గుర్తని మహిళలు భావిస్తారు. వాటిని దానం చేస్తే తమ మాంగల్యం పచ్చగా నిలిచి ఉంటుందని నమ్ముతారు. వివాహాది శుభ కార్యాలలో పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభించగానే ఇంట్లోని ఆడవాళ్ళందరికీ గాజులు వేయిస్తారు. గాజుల చెన్నయ్య ఇంటి వాకిట్లోకి అమ్మాయిలకు గాజులు తొడగడానికి వచ్చిన రోజయితే పండుగ వాతావరణమే! ఈ నిండైన గాజుల చేతులతో పెళ్లి పనుల్లో దిగితే పెళ్లిపందిరంతా కళకళలాడేది. సన్నని మట్టి గాజులను వేస్తే స్త్రీ సంతోషంగా వుంటుంది అనే నమ్మకం నేటికీ చెదరలేదు. ఈ కారణంగా పెళ్ళికూతురుకి సన్నని గాజులను వేస్తారు.

ఆ తరువాత సందర్భం శ్రీమంతం. నెలలు నిండిన స్ర్ర్తీకి సుఖ ప్రసవం కావాలని కోరుతూ చేతుల నిండుగా రంగు రంగుల గాజులు వేస్తారు పేరంటాళ్లు. ఓ చేతికి 21 జతల గాజులు, ఇంకో చేతికి 22 జతల గాజులు తొడుగుతారు. అంతే కాక ఆమెకు కొక్కేలతో ఉండే సన్నని వెండిగాజునిస్తారు. ప్రసవ సమయంలో ఈ కొక్కేల్ని విడదీస్తారు. హైందవ సంప్రదాయసిద్ధంగా పెళ్లికూతురికి పచ్చని, ఎర్రని గాజులు, బాలింతలకు ఆకుపచ్చని గాజులు వేయిస్తారు. ఈ వేడుక కన్నుల పండుగగా ఉంటుంది. ఆ పేరంటానికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా గాజులు వేయిస్తారు! లేకపోతే మనం ఊరుకుంటామా? వేడి వేడి జిలేబీ చుట్టల్లాగా నిగ నిగలాడుతూ మెరిసిపోయే మట్టి (చెక్కుడు) గాజులని చూస్తే ఎవరికి వేయించుకోవాలనిపించదు చెప్పండి?

శాస్త్రీయం: ఈ గాజులు స్త్రీల అలంకరణలో ప్రథమ స్థానాన్ని పొందినా, వీటి వాడకం వలన ఉపయోగాలు కూడా ఉన్నాయి. చేతులకు గాజులు వేసుకోవడం వలన చేతి నరాలపై ఒత్తిడి కలిగి రక్త ప్రసరణ మెరుగౌతుందని ఒక శాస్ర్తీయ అంచనా. అదే కాక గాజుల శబ్దం మనిషి మెదడును ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుందనేది మరో అభిప్రాయం. తద్వారా మెదడు ప్రశాంతంగా ఉంటూ మానసికానందం పొందుతారుట అందుకేనేమో గర్భిణీ స్త్రీలకు ఎటువంటి మానసిక ఒత్తిడులూ కలుగకుండా అన్ని గాజులను వేస్తారు!

రాయబారం: మీరు చదివినది నిజమే గాజులు రాయబారం కూడా నడుపుతాయి. జానపద గేయాల్లో గాజులు బాంధవ్యాలను చేరదీసే మాధ్యమికంగా ఉండేవి. పెళ్ళి జరిగి అత్తవారింటిలో ఉన్న స్త్రీ గాజులమ్మేవాడితో తన పుట్టింటి వార్తలు మోసుకొని రమ్మని చెప్పేది. అప్పట్లో మరి ఉత్తరాలు, దూరవాణులు కూడా లేవు కదా! 

లాభాలు: (ఆడవారికి మాత్రమే! మగవారు పొరపాటున కూడా చదువరాదు!) మట్టి గాజులంటే మగువలకి ఎంత ఇష్టమయినప్పటికీ ఆధునికతకి తగ్గట్టుగా వంకర టింకర గాజుల వలన చాలా ఉపయోగాలున్నాయి. అవేమిటంటారా? చెప్తాను మరి మీరు ఇహ రోజూ అవే వేసుకుంటానంటే నాది పూచీ కాదు! ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా! పొరపాటున ఏదయినా తగిలి మన మట్టి గాజులు చిట్లాయనుకోండి మనకే దెబ్బ తగులుతుంది. అదే వంకర టింకర ప్లాస్టిక్ గాజులనుకోండి మనకి దెబ్బ ఉండదు. పైపెచ్చు ఇవి ఒక పక్క కోసుగా ఉండటం వలన ఎవరయినా మనతో వేషాలు వేశారనుకోండి వాళ్ళకి గాజుతో ఒక్క గీటు పెట్టేసి మనం ఎంచక్కగా తప్పించేసుకోవచ్చు. అలానే ఈ మధ్య వచ్చే బండ గాజులతో ఒక్క గుద్దు గట్టిగా గుద్ది కూడా మనం తప్పించుకోవచ్చు. మువ్వల గాజులు, రాళ్ళ గాజులతో ఒక్కసారి గీరామంటే అంతే అవతలి వాళ్ళ పని. ఏమంటారు? 

గృహాలంకరణ: దీనిలోనూ గాజులు ప్రధాన పాత్రను పోషిస్తాయి. మట్టి గాజులను కొవ్వొత్తిపై నెమ్మదిగా వేడి చేస్తే అవి మెల్లగా కరిగి కావాల్సిన ఆకారానికి వంగుతాయి. వాటితో పూవులు, మొగ్గలు, లతలు, ఏనుగులు, కొంగలు, కుందేళ్లు ఒకటేమిటి నచ్చిన ఆకారాన్ని తయారు చేసుకోవచ్చు. మా ఇంట్లో మైనం కరిగించి కణం (సెల్) ఆకారంలో పోసి దాని మీద ఈ రంగు రంగుల మట్టి గాజులను వంచి chloroplast, mitochondria, golgi complex మొదలయినవి తయారు చేసి వృక్ష కణాలు, జంతు కణాలు తయారు చేసేదానిని. అలానే గాజులో గాజును వేసి రక రకాల సైజుల్లో, పెద్ద రంగు రంగుల దండలా తయారుచేసి గుమ్మాలకు తోరణంలాగా కట్టేవాళ్ళం. గాజులను అతికించి రకరకాల బొమ్మలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మీ సృజనాత్మకతకి పదునుపెట్టి ఎన్నో కళా కాంతులను తయారు చేయవచ్చు.

వ్యాపారం: లాడ్ బజార్ లేదా చూడీ బజార్ అనేది హైదరాబాద్‌లో పేరుమోసిన గాజుల మార్కెట్. చారిత్రాత్మక చార్మినార్ నుంచి చీలివచ్చే నాలుగు ప్రధాన రహదారుల్లో ఓ రహదారి ప్రాంతంలో ఇది నెలకొనిఉంది. కిలోమీటరు పొడవునా వ్యాపించి ఉండే ఈ మార్కెట్‌ను మహిళలు నిత్యం సందర్శిస్తూ రకరకాల గాజులను కొనుగోలు చేస్తూ ఉంటారు. విదేశీయులు కూడా ఈ గాజుల పట్ల మక్కువ చూపుతున్నారంటేనే తెలుసుకోవచ్చు ఈ గాజులు ఎంత ప్రసిద్ధి చెందాయో!

DNA గాజులు
ఏ మాటకామాటే చెప్పాలి! మా రాజమహేంద్రవరంలో నల్లమందు సందు దగ్గర గొడుగు వేసుకుని ఒక తాత కుర్చుని మంచి మంచి గాజులు అమ్ముతాడు. రండమ్మా రండి డింగిరి డిక్లీ గాజులు అన్న పిలుపుకి వెళ్ళిన నేను ఇహ మట్టి గాజులంటూ కొనడమంటే అది తాత దగ్గరే అని నిశ్చయించేసుకున్నాను. నాకెంతో ఇష్టమయిన మట్టితో చేసిన DNA గాజులు (వీటికి ఆ నామకరణం చేసింది నేనే! చూడండి కావాలంటే ఈ గాజులో లోపల DNA double helix లాగా లేదూ!) అక్కడే కొనే దానిని. ఇవే కాక ఎన్ని రకాల మట్టి గాజులో అసలు తాత దగ్గర దొరికినన్ని రకాలు ఇంకెక్కడా దొరికేవి కాదు అదీ తక్కువ ధరకి. అలా అయిదేళ్ళ క్రితం కొన్న గాజులు కూడా ఇంకా నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నా గాజులు చూసి మా కాలేజీ అమ్మాయిలందరూ ఆ తాత దగ్గరే కొనడం. 

చివరి మాట: ముందు మాట తెలుసు కానీ ఈ చివరి మాట ఏంటి అంటారా? అదే మరి! రావు గోపాలరావు గారేమి చెప్పారు? మనిసన్నాక కూసింత కలాపోసనుండాల! ఊరికనే తిని తొంగుంటే మనిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటాది? అందుకే ఈ చివరి మాట!

గాజులు లేని మగువ
చంద్రుడు లేని కలువ
సూర్యుడు లేని వేకువ
విలువ పొందునుటయ్య ఈశ్వరా!

అంటే అర్ధం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనే అనుకుంటున్నాను. పుస్తకాలు తిరగేయకండి ఇది ఈశ్వర శతకం అనుకునేరు నేనే ఏదో పైత్యం ప్రకోపించి ఈ పద్యాన్ని వ్రాసి మీ ముందుకి తెచ్చాను. ఏదేమయినా ప్రపంచం ఎంత అభివృద్ది చెందుతున్నా మన గాజులకి ఆదరణ లభిస్తూనే ఉంది!

37 comments:

వనజ వనమాలి said...

Super.. excellent. malli vasthaanu.. COmmentlo.. ippudu konchem Busy..

జ్యోతిర్మయి said...

రసజ్ఞ గారూ అసలు మీ themes భలే ఉంటాయండీ..గాజుల గురించి రాసి మమ్మల్ని రమణీయ ప్రపంచంలోకి లాక్కెళ్ళారు. థాంక్ యు

భారతి said...

రసజ్ఞ గారు.......... గాజుల కధనం, వర్ణన చాలా బాగుందండి.

రసజ్ఞ said...

@వనజ వనమాలి గారు,
ముందుగా మీకు ధన్యవాదాలండీ! ఓహ్ తప్పకుండా మీ కోసం మా బ్లాగు వ్యాఖ్యల కిటికీ (window) తెరిచే ఉంచుతాను! త్వరలో వస్తారని ఎదురుచూస్తూ.....

@జ్యోతిర్మయి గారు,
అంత నచ్చిందా అండీ చాలా చాలా థాంక్స్ మీకు కూడా! మీ వ్యాఖ్యలు కూడా అంతే అందంగా, మనసుకి ఆహ్లాదకరంగా ఉంటాయి!

రసజ్ఞ said...

@భారతి గారు
ధన్యవాదాలండీ!

Anonymous said...

మీ టపా బాగుంది. మగవారు చదవరాదన్న దగ్గరనుంచీ చదవలేదు కేవలం ఫోటోస్ చూసా :) బాగున్నాయి. నాకు గుర్తున్న మరో గాజు ఉపయోగం ఏంటంటే.. వినాయకుడు మూషికాసుర సమ్హారానికి వినాయకుడు తన దంతం ఆయుధం చేసి ప్రయోగిస్తే మూషికుడి భార్య తన భక్తులారు కాబట్టి ఆమె మాంగళయాన్ని రక్షించడానికి అమ్మవారు ఆవిడ గాజుని ప్రయోగించి వారించారు. కాబట్టి గాజు ఆయుధం కూడా. ఆ డీ ఎన్ ఏ గాజు తమేదేనేమో లా ఉంది. "శాస్త్రీ"యంగా ఆర్ ఎన్ ఏ , ప్రోటీన్ గాజులూ త్వరలో చూస్తామని ఆశిస్తున్నాం :D ఇహ పోతే చిన్నప్పుడు ఆడా మగా గాజులు వేసుకోడం అన్నారు ఇందులో మేం ఏకీభవించట్లేదు. ఆ నల్లగా మెరిసే తెల్ల రాళ్ళవి చాలా మటుకూ పూసల్లా ఉండి ఓ దారంతో అల్లినట్టుంటుంది సో ఫక్తు గాజేమీ కాదు. ఇంక మురుగులంటారా మురుగులు జాగులకి రూపాంతరమేమో కానీ గాజులు కాదు. కాబట్టి అబ్బాయిలకి గాజులాపాదించొద్దు ఐదో తనం మీకే ముద్దు మాకు గాజులు లేకనే ఉండే హుందాతనం చాలు :) :) :)

Urs
Anonymously :)

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు,
మీ వ్యాఖ్య అదుర్స్! మగవారు చదువరాదు అన్నది కేవలం ఆ ఒక్క లాభాలు మాత్రమే! మిగతాది చదవచ్చు!
హా అవునండోయ్ నాకు ఈ విషయం తట్టనే లేదు సుమీ! గుర్తు చేసినందుకు ధన్యవాదాలు!
ఏమో రావచ్చేమో మీ కోరిక మేరకు! అప్పుడు ఎంచక్కగా ఒకవేళ నాలాంటి విద్యార్ధినులు పరీక్షల సమయంలో వాటి నిర్మాణాలు మర్చిపోయినా గాజులని చూసుకుని వేసేసుకోవచ్చు ఏమంటారు?
తెల్ల రాళ్ళవి కాదండీ చిన్నవి నల్లవి మట్టి గాజులు వేస్తారు కదా అవి! మగవారు హుందాగా బోసి చేతితోనే ఉండాలి (వాచీలు, బ్రాసులేట్లు పెట్టుకోవచ్చులెండి), ఆడవారికి గాజులే అందం!

Anonymous said...

మీ పద్యం అదిరింది!మీరు చెప్పినట్టు ఆ ఈశ్వర శతకం కూడా రాస్తే చదివి ఆనందిస్తాం!

చాతకం said...

ఆ, మా కడియాలు, కంకణాలు, గండ పెండేరాలతో పొలిస్తే, ఆ పుటుక్కున విరిగే మట్టి గాజులేపాటి? హ ;)
ఈమధ్య వాచీ గాజుల పోకడ ఎక్కువయింది, వాటి గురించి మరచినట్లున్నారు?
ఇంతకీ ఆ పద్యం అర్థం కాలేదు. విలువ వున్నట్లా, లేనట్లా? ఆ ఈశ్వరుడు ఎం పాపం చేసాడో? ;)

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
నాకు అంత లేదులెండి ఏదో అప్పుడప్పుడు అలా పైత్యం ఎక్కువయినప్పుడు ఇలా రాస్తాను అంతే! ధన్యవాదాలు మీ స్పందనకి!

@చాతకం గారు
ధన్యవాదాలు మీ వ్యాఖ్యకి!అదిగో అక్కడే మరి మీరు గాజులో కాలేసింది! మగవాళ్ళకి ఆ కడియాలు, కంకణాలు, గండపిడేరాలే ఏ మూలకీ రావడం లేదు! అంత ధృడంగా ఉన్న వాటినే భద్రంగా చుసుకోలేకపోతున్నారు! కాని మగువలు మృదు స్వభావులు కనుక అంత పుటుక్కున విరిగే గాజులని కూడా భద్రంగా కాపాడుకుంటున్నారు!
నా దృష్టిలో వాచీ గాజులు, బ్రాసులేట్లు ఒకటే! అందుకనే వాటి ప్రస్తావన ప్రత్యేకంగా తీసుకుని రాలేదు. మంచి పాయింటే అది కూడా!
ఈ పెద్దాల్లున్నారే! పిల్లలు ఏమి చెప్పినా అర్ధం చేసుకోరు! ఆ పద్య భావం ఏమిటంటే, గాజులు లేని ఆడవాళ్ళకీ, చంద్రుడు లేని కలువలకీ, సూర్యుడు లేని వేకువకీ విలువ ఉంటుందా ఈశ్వరా అని ఏదో నా గోడుని ఆయనకి మొరపెట్టుకున్నా! అన్నిటికీ ఆయనే కదండీ కర్త, కర్మ, క్రియ అందుకని ఆయనని అడిగా అనమాట! ఏమిటో నా కపి హృదయాన్ని అస్సలు అర్ధం చేసుకోరు!

Anonymous said...

రసఙ్ఞ గారూ,
బాగుందండీ మీ గాజుల టపా. నా వరకూ గాజులంటే మట్టి గాజులే. వాటి అందం మరి ఏ గాజుల్లోనూ నాకు కనబడదు. అందులోనూ చిలుకపచ్చ రంగు గాజులంటే మరీ మక్కువ. ఇంకో విషయం...ఇప్పుడండే అన్నాచెల్లెళ్ళనగానే రాఖీ గుర్తు తెచ్చుకుంటున్నారు కానీ జనాలు ఆడదానికి గాజులు ఇచ్చిన ఏ పరాయి మగవాడినైనా అన్నయ్యగానే భావించాలంటుంది మన సంస్కృతి. రాణివాసాల్లోకి అనుమతి ఉన్న అతికొద్ది మగవారిలో గాజులమ్మేవాడొకడు!

రసజ్ఞ said...

@అరుణ్ గారు
వావ్! మీకు కూడా మట్టి గాజుల్లోనే అందం కనిపిస్తుందా అయితే మీకు సేం పించ్(ఒక సారి మీరే గిల్లుకోండి)!
మీరు చెప్పింది నిజమే! మనకి ఈ రాఖీ సంప్రదాయం లేదు. మంచి విషయాలు పంచుకున్నారు కృతజ్ఞతలు!

subha said...

గాజుల సవ్వడి తో మనసుని తట్టడం అంటే ఇదేనేమో రసజ్ఞ గారూ ! నాకు ఒక హిందీ పాట గుర్తొచింది ఈ టపా చదవగానే.. చుడీ నహీ యె మెరా దిల్ హై దేఖొ దేఖొ టూటేనా అని మంచి పాట అది. గాజే కాని వీటితో మంచి సింగారం వస్తుంది,పూల కన్నా నాజూకుగా వుంటాయి, ముత్యం కాదు, పగడం కాదు, వజ్రం కాదు దీని వెల ప్రేమ మాత్రమే అని తన ప్రియురాలికి ఇచ్చే ఆ కానుకని మళ్ళీ ఇక్కడ మీ మాటల ద్వారా వినడం చాలా హాయిగా ఉంది. అలాగే మీరు చెప్పిన కథ కూడా బాగుంది. తరచి చూస్తే నిజమేమో అన్నంతగా. బేంగిల్ సెల్లర్స్ నాకెంతో నచ్చే పొయెం. అన్నీ చాలా చక్కగా ఉదహరించారు. ఎన్నో కొత్త విషయాలు కూడా తెలిసాయ్. ధన్యవాదాలు...

రసజ్ఞ said...

@Subha గారూ
హబ్బ ఎంత చక్కగా రాసారండీ ఆ హిందీ పాట మీరు ఇక్కడ పెట్టాక మొదటి సారి విన్నాను! ధన్యవాదాలండీ మంచి పాటని పరిచయం చేసినందుకు మరియు నా అల్లిక (కథ) మీకు నచ్చినందుకు!

nanda said...

బాగా రాసారు. మీ హాస్య చతురత మీరు ఎంచుకున్న ఎలాంటి అంశాన్నిన రక్తి కట్టిస్తుంది . మీరు మరిన్ని వైవిధ్యమైన టపాలు రాస్తారని ఆశిస్తూ ................

రసజ్ఞ said...

నెనర్లు నంద గారు! మీ ఆశని నేను నెరవేర్చాలని కోరుకుంటూ ...........

Sobha said...

wow super.....mindblowing......innallu naku mee blog yenduku kanapadaledu.????????/
miss ayyanu.chala bagaraasarandi....meeru raasindhi oka pointe.kaani naa korikalu theeraalante full painunchi kindavaraku nindipothundhi
but this idea is good...mana lifelo apply cheyachu.chaalaa laabhaalu untayi

రసజ్ఞ said...

@శోభ గారు
మీకు బోలెడు థాంకులు! అవును మీరు ఇన్నాళ్ళు ఎందుకు చూడలేదబ్బా? సరేలెండి ఇప్పుడు ఒక సారి మా బ్లాగింటికి వచ్చారు కదా! ఇక అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి! నిజ జీవితంలో ఆచరణలో పెట్టి చెలరేగిపోండి మరి!

kalyan said...

ఆహా ఆహా ఆహాహా ఎంత బాగా చేపారండి గాజుల గురించి... గాజుల గద్యములో ఆ పద్యము చాల చక్కగా ఇమిడిపోయింది... గాజుల గలగలలు సాస్త్రీయంగాను మానసికంగాను ఎంతో ప్రభావితం చేస్తాయి.. కాని నవీన పోకడలో వీటి ఉనికి అంతరించాకున్నా వివిధ రూపాలు దాలుస్తోంది .. ప్రస్తుతపు మార్పుల గురించి సరదాగా నా బ్లాగ్ లో ప్రస్తావించాను http://nalomata.blogspot.com/2010/08/blog-post_09.html .. ఒక అంశము మేము చదువకూదదని చెప్పారు అయినా చదివేసాను :) .. ఆత్మ రక్షణకు కూడా ఉపయోగ పడుతుందని బాగా చెప్పారు... ఇహ పోతే అ రాయబారాల సంగతి ఇపుడే కొత్తగా వింటున్నాను... అవను గాజులతో ఏవో చేసాను అని చెప్పారు కాస్త మాకు చూపెటండి చూడాలని ఉంది.. నేను ప్రయత్నం చేస్తాను.. మీ DNA గాజులు బగుని :) మంచి పేరే పెట్టారు .. మీది చదివిన తరువాత నాకు ఒచ్చిన తవికను :) పంచుకుంటున్నాను.. నేను అనుకున్న దృశ్యాన్ని గాజుల ప్రాముక్యతని చేపడానికి ఓ ప్రయత్నము..

గాజుల వాకిలి తెరవంగానే
రమణుల రాకలు మొదలాయే
రాసులు కాసులు ఉండంగ కూడా
చేతికి గాజులే మురిపెములాయే
బావను సక్కంగా ఉంచడానికి
గేట్టినైన ఈ మట్టి గాజులు
అమ్మానాన్నల ప్రేమను చూపే
గల గల గల పట్టీల గాజులు
ఇంటిల్లి పాది అందాలు చూపే
మెరిసిపోయే ముత్యాల గాజులు
గాజులోయమ్మ నవ్వేటి గాజులు
అందాల చేతికి అనువైన గాజులు
గాజులోయమ్మ చిలిపి నేస్తాలు
మెత్తాని చేతికి చేమంతి గాజులు.... ఇలా ఎంతైనా చెప్పొచ్చు

తెలుగు పాటలు said...

గాజుల గురించి చాలాబాగా చెప్పారు, గాజులు వేసుకోవటానికి ఇష్టం లేని అమ్మాయిలు ఈ పోస్ట్ చూసి మారుతారు అని ఆశిస్తున్నా...

రసజ్ఞ said...

@Kalyan గారు
చాలా చాలా ఆనందాన్నిచ్చే వ్యాఖ్యలు వ్రాయడంలో మీరు దిట్ట అండి! అవను గాజులతో ఏవో చేసాను అని చెప్పారు కాస్త మాకు చూపెటండి చూడాలని ఉంది.. నేను ప్రయత్నం చేస్తాను అన్నారు సంతోషం నాకు కూడా చూపించాలనే ఉందండీ కానీ అవన్నీ మా ఇంట్లో ఉండిపోయాయి. నేనేమో ఇక్కడ ఉండిపోయాను కనుక ఇంటికి వెళ్ళాక తప్పక మీకు చూపిస్తానని ఈ బ్లాగు ముఖంగా మాటిస్తున్నా. మీ తవిక చక్కగా ఉందండీ కవిత కన్నా బాగా! దీనినే మీ బ్లాగులో చూసి ఆనందంతో కూడిన ఆశ్చర్యం వేసింది! చాలా చాలా ధన్యవాదాలండీ!

@తెలుగు పాటలు గారూ
ముందుగా మీకు నెనర్లండీ! నిజంగానే మీరన్నట్టు జరిగితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఉండరు!

తెలుగు పాటలు said...

నెనర్లండీ!అర్ధం ఏమిటి ?

రసజ్ఞ said...

@తెలుగు పాటలు గారూ
నెనర్లండీ అంటే thank you so much అని!

Anonymous said...

రసఙ్ఞ గారూ, తెలుగు పాటలు గారూ,

'నెనరు'అంటే ప్రేమ (సంస్కృతం), కృతఙ్ఞత (సంస్కృతం) అని అర్థాలు (బ్రౌన్ నిఘంటువు).

తెలుగులో 'ప్రేమ' అనే పదానికి సమానార్థకం 'పాశం'.

ఈ 'నెనరు' అనే పదం తమిళ 'నన్ఱి'కి దగ్గరగా ఉంటుంది లేదా దాన్నుండి పుట్టి ఉండాలి.

తెలుగు పాటలు said...

అవునా నేను ఎప్పుడు వినలేదు చదవలేదు

రసజ్ఞ said...

@అరుణ్ గారు
ఈ పదానికి కృతజ్ఞ పూర్వక అర్ధం తెలుసు కాని ఈ ప్రేమ పూర్వక అర్ధం తెలియదు నాకు! అంటే ప్రేమ పుర్వకమయిన కృతజ్ఞత అనుకోవచ్చంటారా? ఎప్పటికప్పుడు మీ జ్ఞానాన్ని ఇక్కడ పంచుతూ ఎన్నో విషయాలు చెప్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు! ధన్యవాదాలు!

Anonymous said...

రసఙ్ఞ గారూ,
ఏదో నలుగురివద్దా నేను నేర్చుకున్నది మరో నలుగురికి చేర్చుతున్నాను అదీ కాస్త చనువు తీసుకున్నా ఇబ్బంది లేదనుకున్నవారి బ్లాగుల (మాధ్యమం) ద్వారా.

పోతే 'నెనరు' అనే పదాన్ని ఇక్కడ 'ప్రేమ' అనే అర్థమే ముందుగా వచ్చేది. మన సాంప్రదాయం ప్రకారం మనం ప్రతీ చిన్నపనికీ ధన్యవాదాలు, క్షమాపణలు లాంటివి చెప్పటం అనేది లేదు. కనుక 'Thank you' అనే ఆంగ్ల పదానికి సరైన పదమేదీ తెలుగులో లేదు. మనకు సహాయం చేసినవారిపై మనకు సానుకూల భావన కలుగుతుంది కనుక సంస్కృత/ఆంగ్ల ప్రభావం మనపైన పడేకొద్దీ ధన్యవాదాలు అనేపదము సంస్కృతము నుండి వచ్చి చేరింది (ఇది నా అనుకోలు). ఆధునిక వ్యవహారము ప్రకారం మీరన్న 'ప్రేమపూర్వక కృతఙ్ఞత' నాకు సబబుగానే ఉంది. మరింత సమాచారము కోసము బ్రౌన్ నిఘంటువును చూడొచ్చు. (http://dsal.uchicago.edu/dictionaries/brown/)

రసజ్ఞ said...

@అరుణ్ గారు
నేర్చుకున్నది పంచుకుంటేనే కదండీ పెరిగేది! తప్పకుండా నిరభ్యంతరంగా ఎప్పుడయినా చనువు తీసుకుని చెప్పాలనుకున్నది నిస్సంకోచంగా చెప్పచ్చు మీరు!

ఇహ విషయానికొస్తే ఆలోచించి చూస్తే మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది!

kalyan said...

@రసజ్న్య గారు బోలెడు బోలెడు నెనర్లు :) ... మొదట మీ బ్లాగ్ లో చదివిన వెంటనే నాకు వచ్చింది ఇక్కడే పోస్ట్ చేసాను తరువాత నా బ్లాగ్ లో పోస్ట్ చేస్కున్నాను .. ఓ చిన్ని చిట్కా మీరు పోస్ట్ చేసిన సమయము చూస్తే తెలిసిపోతుంది ... తరువాత నా బ్లాగ్ లోకి మొట్ట మొదట అడుగుపెట్టారు దానికి నా కృతజ్ఞ్యతలు చాల సంతోషం ... :)

రసజ్ఞ said...

@Kalyan గారూ
అయితే మీ కవిత నా బ్లాగ్లోనే ఊపిరి పోసుకుందనమాట! ఇంకా చాలా సంతోషంగా ఉందండీ!

kalyan said...

@రసజ్ఞ ellapudu meeru ilane santhoshamga arogyangaa vundalani korukuntunaanu ...

Durga said...

Very nice photos

Anonymous said...

Rasagna garu,

Bagundi andi

రసజ్ఞ said...

ధన్యవాదాలు కళ్యాణ్ గారు!

థాంక్స్ దుర్గా! వీటిల్లో చాలా మటుకు అన్నీ కుంచెతో వేసినవే!

కృతజ్ఞతలు అజ్ఞాత గారు!

Srinivas Blogworld said...

రసఙ్ఞ గారూ,

నేను వేరే ఎవరిదో బ్లాగు చదువుతూ అందులో మీ వ్యాఖ్య చూసి మీ బ్లాగుకు వచ్చాను. ఇవ్వాళే మీ ఒక్కొక్క బ్లాగు మొదటినుంచి చదవటం మొదలుపెట్టాను. బాగున్నాయండి మీ బ్లాగులు & మీ పేరు (దానిగురించి వ్రాసిన టపాతో సహా)!!

/* కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆడవాళ్ళకి మాట్లాడే హక్కు, అభిప్రాయాలని వెలిబుచ్చే అర్హత లేని రోజుల్లో

ఆడవాళ్ళకి హక్కులు లేవేమో కానీ అర్హతలు ఎప్పుడూ ఉన్నాయి కదండీ! సామాజికంగా అర్హత లేని అనా మీ ఉద్దేశం?

లేక తెలుగు మర్చిపోయి నాకే సరిగా అర్థం కాలేదా?

--శ్రేనివాస్

రసజ్ఞ said...

@ శ్రీనివాస్ గారూ
ముందుగా మీకు నా పేరు, ఈ బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు!
హహహ! భలే వారే! సామాజికంగా లేదనే నా ఉద్దేశ్యం!

Anonymous said...

I read this paragraph fully regarding the difference of newest and previous technologies, it's awesome article.my web blog - dating sites - bestdatingsitesnow.com -