Sunday, January 22, 2012

మాయలోకంఓసి పువ్వా ఎందుకే పరిమళించేవు
వాడిపోయేవా తావి పరితపించేను
ఓసి నవ్వా ఎందుకే పరిహసించేవు
వీడిపోయేవా జీవి పలవరించేను

పువ్వు నవ్వులు ఆగిపోయినా
నవ్వు పువ్వులు రాలిపోయినా
జీవితం మోడు అవ్వదా ఆ వనం బీడు అవ్వదా

కలలలోకంలో ఉన్నావంటే కలత తీరక కలవరిస్తావు
గాలిమేడలే కట్టావంటే గాలిపటమై తిరిగిరావు నువ్వు
ఓ గమ్యమన్నదే లేకపోతే అగమ్యమవ్వదా ఆ పయనం
మాయలోకంలే ఇది మోసగించేదే విధి

ఆదమఱపుగా ఉన్నావంటే కసి కాలం కాటుకి బలి అవుతావు
ఏమీ చెయ్యక ఉన్నావంటే నువ్వెందుకూ కొరగాక పోదువు

అర్థమన్నదే లేకపోతే వ్యర్థమవ్వదా ఆ జీవితం
మాయలోకంలే ఇది మోసగించేదే విధి

23 comments:

Anonymous said...

ఎందుకీ ఆవేదన......

వనజ వనమాలి said...

అప్పుడే ఇంత వేదాంతం ఎందుకు !? ఆడి పాడే చిన్నారి.. ఆనందా ల లోగిలిలో.. తువ్వాయి మాదిరి.. గంతులు వేయాలి.
సారములేల్ల గ్రహించితివి. ఇక విచారములకి చోటెక్కడ?

మధురవాణి said...

హుమ్మ్.. నిజమే కదా.. బాగా చెప్పారు..

Anonymous said...

రసజ్ఞ గారూ,

"కాడు" అనే పదానికి అతడు,శ్మశానము,నాశనము, అడవి అనే అర్థాలున్నాయి. (బ్రౌన్ నిఘంటువు)

ఇక్కడ #కాలం కాటికి# అని వాడారు. బహుశా అది "కాలం కాటుకు" అయి ఉండాలి లేదూ ఆ పద ప్రయోగం అర్థం వివరించగలరు.

అర్థం, వ్యర్థం, మఱపు అనేవి సరైన అక్షరక్రమాలు (బ్రౌన్ నిఘంటువు).

శోభ said...

చాలా బాగా చెప్పారు రసజ్ఞగారూ..

జ్యోతిర్మయి said...

ఈ టపా ఈ బ్లాగుకు అస్సలు సూట్ అవలా...

kalyan said...

@రసజ్ఞ గారు చాల బాధగా అనిపించింది చదివిన వెంటనే...
వాడిపోయే పువ్వును బ్రతికించగల శక్తీ ఉండకపోవచ్చు
అ వాలిన పువ్వును మోయగల బలము లేకపోవచ్చు
కాని అ పువ్వుతో స్నేహం చేసిన ప్రతి మనసు వాడిపోతుంది తనతోపాటే రాలిపోతుంది..

"చిన్ని ఆశ" said...

మాయలోకంలే ఇది మోసగించేదే విధి...
సత్య వచనం పలికారు.
విధిని నమ్మితే ఎప్పుడూ మోసమే, బహుశా దాని పనే అదనుకుంటాము, నమ్మించి మోసం చేసి మాయమవటం...
కవితలు బాగా రాస్తున్నారు...

రసజ్ఞ said...

@ తాతగారూ
ఆవేదన కాదు ఒక ప్రయత్నం మాత్రమే! ధన్యవాదాలు!

@ వనజ వనమాలి గారూ
మీ ఈ వ్యాఖ్య చదువుతుంటే అమ్మ చెప్పినట్టు అనిపించింది! ఏదో ఒక ప్రయత్నం చేసాను అంతే అది నా స్వీయానుభవం కానే కాదు! నెనర్లు మీ ఆత్మీయ స్పందనకి!

@ మధురవాణి గారూ
నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు!

@ అరుణ్ గారూ
ఇక్కడ కాటు అని వ్రాద్దామనే కాని అచ్చు తప్పులు. ఈ మఱపు దగ్గర మాత్రం ర పెట్టాలా లేక ఱ పెట్టాలా అని సందేహం కలిగింది :P మొత్తానికి మీరు సరిదిద్దారు. కృతజ్ఞతలు!

రసజ్ఞ said...

@ శోభ గారూ
మీరు నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు!

@ జ్యోతిర్మయి గారూ
ఎందుకండీ? నేనింకా భీభత్స, భయానక రసాలు కూడా ట్రై చేద్దామని అనుకుంటుంటేనూ! ధన్యవాదాలు!

@ కళ్యాణ్ గారూ
హయ్యో ఎందుకండీ అంత బాధ? పువ్వు కాలం కొంచెమే అయినా ఉన్నంత కాలం అందరినీ మచ్చిక చేసుకుంటుంది! ధన్యవాదాలు మీ స్పందనకి!

@ చిన్ని ఆశ గారూ
మీ చిట్టి మాటలలో బాగా చెప్పారు! ధన్యవాదాలండీ!

తెలుగు పాటలు said...

అయ్యబాబోయి వేదాంతం చెప్పేశారు.. కవిత బాగుంది

రాజ్ కుమార్ said...

చాలా బాగా రాసారండీ..లైక్..లైక్..

anrd said...

రసజ్ఞ గారూ కవిత చాలా బాగుంది. కానీ.. ఇంతటి గంభీరమైన కవిత్వం మీ బ్లాగులో చూసి ఆశ్చర్యమనిపించింది. అంతేనండి..

Lasya Ramakrishna said...

చాలా బాగా రాసారండీ రసజ్ఞ గారూ

రసజ్ఞ said...

@ తెలుగు పాటలు గారూ
హహహ ఏమండీ? నేను చెప్పకూడదా? మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

@ రాజ్ కుమార్ గారూ
కేవ్వ్వ్వవ్వ్వ్ మీకు నచ్చి లైక్ కొట్టిన ఆనందం అనమాట! ధన్యవాదాలండీ!

@ anrd గారూ
అయ్యయ్యో! ఎందుకండీ పాతవన్నీ తీసేశారు! నేను సరదాగానే తీసుకున్నాను! ప్రయోగాలు చేసి చేసి దీనితో కూడా చేసానండీ! మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు!

@ లాస్య గారూ
థాంక్స్ అండీ!

కెక్యూబ్ వర్మ said...

సందేశంతో కూడిన భావ గీతం బాగుందండీ...

ఇమకి (ఇవటూరి మధు కిరణ్) said...

nice one Rasgna garu

శాండిల్య said...

రాసిన విధానం... చెప్పిన విషయం బావుంది.
కానీ ఉన్నట్టుండి ఎందుకింత వైరాగ్యం. అన్ని రసాలు పలకాలని మీరనుకుంటూ ఉండచ్చు. కానీ అన్నీ అయ్యాక కదా వైరాగ్యం వచ్చేది. ఇంకా ఏమీ చూడకముందే / చెప్పకముందే మీరు వైరాగ్యంలోకి దూకేశారు. దాంతో కొంచెం ఆశ్చర్యం అనిపించింది. అంతే.

చాతకం said...

పుష్ప విలాపం అంటే పువ్వుల మీద పడి ఏడవటం కాదనుకుంటా? ;)

రసజ్ఞ said...

@ కేక్యూబ్ వర్మ గారూ

మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!


@ ఇమకి (ఇవటూరి మధు కిరణ్) గారూ

చాలా థాంక్స్ అండి!


@ శాండిల్య గారూ

ముందుగా మీకు నచ్చినందుకు నెనర్లు! మీకు కూడా ఆశ్చర్యమా? ఏమి లేదండీ ఏమీ కాలేదు! కష్టతరమయిన వైరాగ్యాన్ని ముందు పండించేద్దామని ఇలా వ్రాసేశాను. నిన్ననే ఒక మిత్రులు అడిగారు రౌద్ర రసాన్ని చూపమని చించాలి ఇంకా! ఏమవుతుందో!


@ చాతకం గారూ

:):):) హయ్యో! నేనలా అనలేదండీ! మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!

sandeep said...

ఏమిటి లోకం పలుగాకుల లోకం......
"ఫటాఫట్" "ధనాధన్"!

రసజ్ఞ said...

@ సందీప్ గారూ
ఫటాఫట్ తేల్చేశారుగా! ధన్యవాదాలు!

Anonymous said...

Neat blog! Is your theme custom made or
did you download it from somewhere? A theme like yours with a few simple adjustements would really make my blog
stand out. Please let me know where you got your design. Bless you

My web-site :: dating sites (bestdatingsitesnow.com)