Wednesday, July 20, 2011

నా పేరు ..........


రసజ్ఞులయిన పాఠకులకి నమస్కారం. ప్రతీ మనిషికి తన పేరంటే ఇష్టం (ఇష్టం లేకపోయినా ఇష్టపడక తప్పదు).
అలానే నాకు కూడా నా పేరంటే చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు నా పేరుని ఎవరూ సరిగ్గా పలకడం లేదు, నోరు తిరగని పేరుని ఎందుకని పెట్టావని అమ్మతో పోట్లాడేదానిని అటువంటిది తరువాత నా పేరుకి ఉన్న అర్ధాన్ని అర్ధం చేసుకున్నాక ఇంత మంచి పేరు పెట్టినందుకు మా అమ్మకి నా మనసులోనే కృతజ్ఞతలను తెలియచేసుకున్నాను. పేరు నా మనసులో ఒక విశిష్టమయిన స్థానాన్ని పొందింది. ఎంతమందిలో ఉన్నా మన పేరు వినిపించేసరికి మన అనుమతి లేకుండానే మన తల గిర్రున తిరుగుతుంది. నాకు ఎందుకనో నా పేరుకి సంబంధించిన కొన్ని విషయాలతో కూడిన పద్యాలని  ఇక్కడ టపా ద్వారా అందరితో పంచుకోవాలనిపించింది

రసం జ్ఞానాతీతి రసజ్ఞ అన్నారు. రసం అంటే సారభూతమయినది , నవరసాలు, కళలు అని కూడా అనుకోవచ్చును. జ్ఞానాతీతి అంటే తెలిసినది అని అర్ధం. ఇక పదానికి అర్ధాన్ని వాడుక భాషలో తీసుకుంటే, మనకి రసాన్ని తెలియచేసేది ఏమిటి? మనం తినే దాని రసం వలెనే మనకి రుచి తెలుస్తుందిట. అలా తీసుకుంటే మనకి రుచిని తెలియచేసేది ఏమిటి? నాలుక కనుక మామూలు పరిభాషలో నాలుక అనే అర్ధాన్ని ప్రతిబింబిస్తున్నా ఒక రసాన్ని లేదా కళలని ఆస్వాదించేది, అనుభూతిని మనకి ఇచ్చేది అని రసజ్ఞ అనే పేరు తెలియచేస్తోంది.

తెలుగు వ్యాకరణ పరముగా చూస్తే, రసజ్ఞ (l U l) అనే పదం గణాన్ని సూచిస్తుంది. కావున దీనిని చంపకమాల ( ), శార్దూలము ( ), మత్తకోకిల ( ), తరలము ( ), పంచ చామరము ( ), వసంత తిలకము ( ), లయగ్రాహి ( ), కవిరాజ విరాజితము ( ), సుగంధి ( ), వనమయూరము ( ), ఇంద్రవంశము ( ), వనమంజరి ( ), మంజుభాషిణి ( ), మొదలయిన పద్య పాదములలో ఉపయోగించవచ్చును.


కళానిధిః కావ్యకళా రసజ్ఞా రససేవధిః 
పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా

అసలు పేరు ముఖ్యంగా లలితా సహస్ర నామ స్తోత్రం నించి వచ్చినది. అమ్మవారి గొప్పతనాన్ని స్తుతిస్తూ చెప్పిన పద్యంలో అర్ధాల్ని గమనిస్తే కళలకి నిధివయినటువంటి నీవు కావ్యమును రచించే కళలోరసములని సేవించుటలో రసజ్ఞురాలివి అని చెప్పబడింది

. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక  చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతు లెవ్వరుమెచ్చ రెచ్చటం
బదునుగ మంచికూర నలపాకము చేసినదైన నందు నిం
పొడవెడు నుప్పులేక రుచి పుట్ట( నేర్చునటయ్య భాస్కరా!
పద్యం మారన వెంకన్న గారు పదిహేడవ శతాబ్దంలో రచించిన భాస్కర శతకంలోనిది. విధముగానయితే నలభీములే వంట చేసినా ఉప్పు లేకపోతే రుచి రాదో అదే విధముగా ఎంతటి విద్యావంతుడయినా తను నేర్చుకున్న విద్యలోని సారం (రసజ్ఞ) లేకపోతే గుణవంతులెవ్వరూ మెచ్చుకోరు అని దీని భావం

సీ. జయ దురుత్తరణ సంసరణాబ్జదళ నీర,
             జయ జయ గాయక సార్వభౌమ,
    జయ శౌరె గాథా రసజ్ఞ పుణ్య రసజ్ఞ,
             జయ జయ తత్త్వసంచయ పవిత్ర,
    జయ జనార్వాచీన జని సంగ వంచక,
              జయ జయ దేశిక చరణ శరణ,
    జయ యుక్తవాక్ప్రతిష్టా తృణీకృతదేహ,
              జయ జయ భగవదాజ్ఞాకృతిస్థ  
తే. జయ సకలజంతు సమచిత్త జయ దయార్ద్ర,
                 
జయ ముకుందాన్య దేవతా శాస్త్ర బధిర,
       
జయ చతుర్ద్వయ భక్తి లక్షణ చితాంగ,
                 
జయ మురారి ప్రపన్నాంఘ్రి జల జమ ద్రుప.
ఇది శ్రీ కృష్ణదేవరాయులు గారు రచించిన పంచమహాకావ్యాలలో ఒకటయిన ఆముక్త మాల్యద లోని సప్తమాశ్వాసము లోనిది. శ్రీ కృష్ణుని వర్ణిస్తూ ఆయన  సూరత్వములో, పరాక్రమములో, యుద్ధ పటిమలలో, పుణ్యములలో, మోక్షం పొందుటలో అన్నీ తెలిసినవాడు, ఆస్వాదించేవాడు అని చెప్పడం జరిగింది.


తజ్ఞ! జితప్రతిజ్ఞ! యుచిత ప్రమధానుగతజ్ఞ! నమ్రదై
వజ్ఞ! కళా విధిజ్ఞ! బలవచ్చివభక్తి మనోజ్ఞ! ధూతశా
స్త్రజ్ఞ! సువాద పూరిత రసజ్ఞ! తృణీకృత పంచయజ్ఞ!
ర్వజ్ఞ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా  
పద్యం పాల్కురికి సోమన గారు రచించిన వృషాధిప శతకం లోనిది.
 
నిరుపహతి స్థలంబు రమణీప్రి ధూతిక తెచ్చి యిచ్చు
ప్పురవిడె మాత్మ కింపయిన భోజన మాయల మంచ మెప్పు
తప్పరయు రసజ్ఞ లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికిన గాక యూరక గృతుల్ రచియింపుమటన్న శక్యమే!’’
ఇది పెద్దనార్యుల పద్యం.  

స్థైర్యము లేని చిత్తమవధానమెరుంగని సత్కవిత్వ మౌ
దార్యము లేని హస్తము యదార్థతలేని రసజ్ఞ మంచి మా
ధుర్యము లేని గానము మృదుత్వము లేని వచః ప్రసంగ మై
శ్వర్యము లేని భోగము నసారములియ్యివి దంతిభూవరా!
ఇది తిరుపతి వేంకట కవుల పద్యం.

ఆలాపించిన సత్కవీశ్వరుల దివ్యాశీర్వచశ్శక్తిచే
నాలాభించిరి భారతీయులు స్వరాజ్య స్వర్ణ దండంబులే
డాలాలంబు కవి ప్రపంచమున కమ్మా వాజ్ఞ్మయోద్యానమున్
బాలింపగల  దాతలం గని రసజ్ఞత్వంబు చాటింపుమీ
ఇది గుఱ్ఱం జాషువా గారి ఆంధ్ర మాత లోనిది.

వెలవాక్రుచ్చగారాని భావముల నన్వేషించుచున్ సత్కవీం
ద్రులయూహల్ విహగంబులై తిరుగుచుండెన్  బ్రోన్నతాకాశమం
డలమస్తంబున  నాకళించితె  ప్రయాణ శ్రాంతి నమ్మంచుకొం
డలకున్ డిగ్గెడి నీ విశేషము రసజ్ఞజ్ఞేయ మూహింపగన్         
ఇది గుఱ్ఱం జాషువా గారి గబ్బిలం లోనిది.  

గాత్రము లెండు  టాయె ,మరి గానగ రాదొక నీటి చుక్కయున్,
నేత్రము మండుటాయె మరి , నేరుగ జూడగ ఎండలాయె, వై
చిత్రమదేమిటో, వరుస చిత్రము లన్నియు తేలిపోయె ,నీ
చైత్రపు శోభలం గన నసహ్యము గాదె రసజ్ఞ కోటికిన్!!!
ఇది మంద పీతాంబర్ గారి కలము నుండి  జాలువారిన పద్యము.

."ప్రజ్ఞునకు వచ్చును, రసజ్ఞమగు పద్యమది - ఆజ్ఞ పలుకంగనె! మఱజ్ఞునకు రాదే 
యజ్ఞములచే"ననుట, అజ్ఞతగుఁ! బ్రహ్మభవ - రాజ్ఞియగు భారతికి విజ్ఞపము చేయన్ 
ప్రజ్ఞుడవు నీవయి, మనోజ్ఞమగు పద్యమన-నుజ్ఞముగ వచ్చును! కృతజ్ఞతతొ విద్యా 
రాజ్ఞికి సుపద్యఁపు ప్రతిజ్ఞఁగొని సాధనను యజ్ఞమును బూని కవితజ్ఞుడవు గావోయ్ 
ఇది లయగ్రాహి అనే పద్య లక్షణములో శ్రీ రాకేశ్వరరావు గారు రచించిన పద్యం. 

లోక రసజ్ఞ శేఖరుల లోచన యుగ్మము పాలి విందుగా 
శ్రీ కవితా సుధా రస విశేషము లెన్నియొ చిల్కుచుండెనో - 
శ్రీకరుడాసి.నా.రె.’కు నశీతి సుజన్మదినాభినందనల్ ! 
జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్  డా. సి. నారాయణ రెడ్డి గారి అశీతి జన్మదినోత్సవ సందర్భముగా శుభాకాంక్షలతో డా. ఆచార్య ఫణీంద్ర గారు రచించిన పద్యం.

భావావేశము పొంగిపొర్లి నదియై పారంగ, పద్యంబులే
వేవేలై ఎగసెన్ మదీయ హృది నువ్వెత్తున్ తరంగాలుగాన్ -
నా వాక్కందున తోయమయ్యె రుచిగా నానా రసాల్ పంచగాన్ -
రావే ఆంధ్ర రసజ్ఞ! తేల, రస ధారా స్నాన పానంబులన్!
డా. ఆచార్య ఫణీంద్ర గారి మరొక పద్యం.

తపవ్రత తీరథ నీరస లాగే ఏనీ ఆగళ సాచే,
యజ్ఞయాగ స్వాధ్యాయ నియమమాం రసజ్ఞ కోణ రాచే ?
ఆసన ప్రాణాయామ ధారణా గౌణ బనీ సౌ జాయే.
జే సుఖ థాయ మాతృగుణ గాయే.
శ్రీ యోగేశ్వరజీ రచించిన మహాకావ్య 'గాంధీగౌరవ' సుఖలోని పద్యము.

గూట గల రామ చిల్కొక కోటి తడవ
పేరు బిలిచె గోవింద హరీ రసజ్ఞ
మీటగను హృద్విపంచిని మూట ముదము
లీయ మధుర మోహానన రా యజింతు

ఆశిష్ కుమార్ గారు కర్ణాటక సంగీతంలోని కొన్ని మేళకర్త రాగాల మీద రాసిన చిన్న కవిత
జ్వలించే మనో ధారాలో జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో సుమించే రసజ్ఞ మాధురి
ధ్వనించే యుద్ధభేరిలో
స్వరించే కదనకుతూహలం
బ్రహ్మించే ఇంద్రియాలలో
స్ఫురించే భావనప్రియం
జ్వలించే మనో ధారాలో జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో సుమించే రసజ్ఞ మాధురి
గ్రీష్మించే సూర్య జ్వాలలో
చిందించే జలర్నవమ్
హిమించే కైలశాగిరులలో
నర్తించే నాటభైరవి
జ్వలించే మనో ధారాలో జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో సుమించే రసజ్ఞ మాధురి
పఠించే వేదాంగాలలో
కనిపించు సారమే పావని
వినిపించే వీణ మీటలో
జనించు నాదమే కీరవాణి
జ్వలించే మనో ధారాలో జనించె కవన జలఝారి
తపించే కనుల లోయలో సుమించే రసజ్ఞ మాధురి

అందరికీ కన్నులొకటే.. వాటిలో ప్రతిఫలించే భావాలు మాత్రం అనేకం. కన్నుల భాష ని పింగళి శశిధర్ గారు రాసిన వచన కవితలో చదవండి.
కన్నులు వుండు
నందరకు
కాని -
కమనీయ మనోజ్ఞ మాలికల్
కలువలు పూయు
కన్ను లవి యెన్ని ?
ఎన్నిటి నందు - సు
స్నేహ రసార్ద్రతలున్నవి ?
వెన్నెల లెన్ని కాయు ?
వలపు విచిత్ర
భాషణ లెన్ని యెఱుంగు ?
ఇన్నిట నొక్కటైన - నెఱి
నేర్వని కన్నులు
కన్నులౌనె ?
రమ్య రసజ్ఞ గుణ
శేఖరు లార
నిక్కము మీరె తెల్పరే!  

Esthetics అనే అతి అందమైన రసజ్ఞాన శాస్త్రానికి  Latin origin "తను'' అని తన ప్రేయసిని వర్ణిస్తూ ఆధునికతకి తగ్గట్టు వాడుకున్న  మహేశ్వర రెడ్డి గారి కవితా మలయాలలో నా పేరుని చూసి ఆనందంతో నాకు బహు ముచ్చటేసింది. ఆ కాలం నించి ఈ కాలం దాకా ఎప్పటికీ ever green అయిన పేరు, కవుల పద్యాలలో, వచన కవితలలో, సభా కార్యక్రమాలలో మారు మ్రోగే ఈ పేరు నిజముగా ఒక రసజ్ఞానుభూతే.


 

26 comments:

భాస్కర రామిరెడ్డి said...

చాలా చాలా నచ్చిందండి మీ ఈ టపా. పద్యాలకు అర్థాలు కూడా కొంచెము వివరిస్తే బాగుండేదేమో.

రసజ్ఞ said...

@భాస్కర రామి రెడ్డి గారు
ధన్యవాదములండి. కొన్నిటికి రాసాను కానీ అన్నిటికీ రాయాలంటే అది చాలా పెద్దదయ్యి జనాలకి ఆసక్తి తగ్గుతుందేమో అని రాయలేదు.

ak said...

నవరస సమ్మొహన శక్తి స్వరూపిని,రమ్యమైన మాటలతో, అంతకి మించిన జ్ఞాన సంపదతో ఎంతొ మందిని నీ రసామ్రుత విజ్ఞాన బోదనికి, పాఠకులుగా మార్చుకోని.... రసజ్ఞ నామనికి సంపూర్న సార్ధకత తెచ్చావు.

రసజ్ఞ said...

@Anil గారు
ధన్యవాదములండి.

nanda said...

kashtamina padyaalu tappa migilina dantha chadivanu..........i am jealous for having such beautyful name .......nd very much dissapointed for not making first comment

రసజ్ఞ said...

@nanda garu
mee asooyaki dhanyavaadamulu. All comments are equally important to me so thanks again.

hariprasadcc said...

Nee peru........... kekala vundi ra....
kani mari BC kalamnaati telugu vaadithey koncham kastanga vundi artham cheskodaniki...... :(

రసజ్ఞ said...

@Hari
thank you nv slowga vidagotti chaduvu easyga ardhamayipothundi. aa kaalam ninchi ee kaalam daka anni raasaanu kada!!

Unknown said...

post startinglo idi cherchu...MEERU RASAGNYULAITE EE TAPAA CHADAVANDI..LEKAPOTE ANTAA RASAABHAASAGA UNTUNDI" ani....super ra rasagnaa....champesav...

రసజ్ఞ said...

@Mohan
థాంక్స్ మోహన్. నీ ఆలోచన బాగుంది.చదివిన తరువాత వాళ్ళకే తెలుస్తుంది కదా? రసాభాసగా ఉందో లేక రసభరితంగా ఉందో వాళ్ళే చేపుతారులే అని రాయలేదు.

మహేశ్వర రెడ్డి said...

చాల..చాలా.. బాగుందండి, పద్యాలలో మీ పేరు ..!!!!
చాల బాగా collect చేసారు..
నా పేరు మీ పోస్ట్ లో చూసి ఆశ్చర్య పోయాను( కొంచెం గర్వం గా కూడా ఫీల్ అయ్యాను)..!!
అంత పెద్ద పెద్ద పద్యాల వరుస క్రమంలో నా చిన్ని phrase ని రాసినందుకు..
కొన్ని పద్యాలు అర్థం చేస్కున్నానండీ.
but కొన్ని అసలు అర్థమవ్వలేదు..
ఎనీ హౌ..
very nice ..

రసజ్ఞ said...

@మహేశ్వర రెడ్డి గారు
చాలా ధన్యవాదములండి. మీ phrase చిన్నదయినా నాకు ముఖ్యమయినదే పైగా అది కూడా నా collections లో ఒకటి. అంత అందంగా వాడారు మరి ఇక్కడ ఉపయోగించకుండా ఎలా ఉంటా చెప్పండి????

Sricharan said...

maa peru ki kooda rasthe sathoshistam.
Sricharan

రసజ్ఞ said...

నేను రాసేదేముంది వేటూరి గారేప్పుడో రాసారు కదా!!!
శ్రీమన్మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజా మీ
శ్రీచరణాం భోజములకు ప్రేమతో నమస్కరించి
మిము వరించి మీ గురించి
ఎన్నో కలలు కన్న కన్నె బంగారు అని

Sricharan said...

abbaaaaaaaa, naavalla kaadu inka.

Super asalu.neeku gift sanction

రసజ్ఞ said...

@Sunny
thanq thanq ee saaranna isthaanannaav!!!!

కృష్ణప్రియ said...

భలే గా కలెక్ట్ చేసుకుని చాలా చక్కగా రాశారు. అభినందనలు.

రసజ్ఞ said...

@కృష్ణప్రియ గారు
మీ అభినందనలకి ధన్యురాలిని!

Anonymous said...

ఎంతో అందమయిన పేరు దానికి తగ్గట్టు చక్కని సేకరణ. ముచ్చటగా ఉందండీ!

రసజ్ఞ said...

కృతజ్ఞతలండీ!

'''నేస్తం... said...

Innallu mee blog sarigga chudaledu nenu..
Mee peru, mee raathalu adbhutham...


aame rasgnya raa bujji,
evaraina clicks kosam rastharu, comments kosam raastharu
eeme entiraa muchhataga raasthondi..

edo padyaniki parikini kattinatlu,
bloggers ki bhasha nerpinchinatlu,
chalaa mucchataga rasthondi..

[Athadu movie dialogue styllo cheppalani prayathnichaa..
mimmalni agouravaparichanu anukokandi..]

రసజ్ఞ said...

@ కమల్ గారూ
ఓపికగా కూర్చుని నా పాత టపాలన్నీ చదివినందుకు చాలా థాంక్స్! అలానే నా పేరు, నా రాతలు నచ్చినందుకు ఇంకొక థాంక్స్!
మీరు అతడు స్టైల్ అని చెప్పకపోయినా నేను అలానే చదువుకున్నా అండీ! అగౌరవం అని ఎన్నటికీ అనుకోను! మీ మెచ్చుకోలుకి మరొక్కసారి ధన్యవాదాలు!

Unknown said...

సార్ధక నామధేయులు రసజ్ఞ గారూ!
ఎన్నో కళలు పుణికిపుచ్చుకుని కళలను ఆశ్వాదిస్తూ, శోధిస్తూ, నేర్చుకుంటూ, బోధిస్తూ మీ పేరుని సైతం విశ్లేషిస్తూ రాసిన ఈ వ్యాసం బ్లాగు లోకంలోనూ మీ పేరుని Ever green గా నిలుపుతుంది.

రసజ్ఞ said...

@ చిన్ని ఆశ గారూ
హహహ! థాంక్యూ

Anonymous said...

రసజ్ఞాదేవిగారు,
మిమ్మల్ని ఎవరో పొగుడుతున్నారు, చూశారా, స్మరణబ్లాగులో భారతిగారు. మిమ్మల్ని పొగిడినా మాటాడరు, తెగిడినా మాటాడారు, ద్వంద్వాతీతులా? కొద్దిగా తిట్టనయినా తిట్టండి, మీ నోటి ముత్యాలేరుకుంటాం. :)

Anonymous said...

I do not even know the way I finished up right here, but I believed this post was once great.

I don't realize who you might be but definitely you are going to a well-known blogger in case
you are not already. Cheers!

Also visit my web site - dating online; bestdatingsitesnow.com,