Tuesday, November 01, 2011

నీ విలువ తెలిసెన్!


భువినుండు నట్టి గోక్షీరధారలన్, మధుర ఫలంబులన్ కోరన్
దివినుండు అమరులు సేవించునట్టి అతి మధుర సుధాధారలన్ కోరన్
నా మనంబు కోరునది ఏమని ఆలోచించగా ......

తెలిసెన్  దాగున్న నీ గొప్పలన్నియును   
భూలోక స్వర్గమే ఈ పుణ్యభూమి

తల్లీ! ఓ భారతమాతా!
నీ హృదయ ఔదార్య వాత్సల్యముల యొక్క
మాధుర్యతను కనుగొంటిని కదా!
పావనీ!
నీ పద కమల సేవ చేయు భాగ్యమే భాగ్యమ్ము కాదా!
నాకు దొరికియున్న శ్రీకరుని కరుణా కటాక్ష వీక్షణాల
వలన నా జన్మ చరితార్ధమయ్యెన్ తల్లీ!
ఈ జన్మకింకేమీ సరిలేదు ఓ కల్పవల్లీ!
కోరనంటిని కదమ్మ ఇంకేమియు నిన్ను నా తల్లి భారతీ!

మాతృగర్భంబు నుండి మొదలు తనువు చాలించు వరకు
బ్రహ్మజ్ఞానము కలుగునట్టి బ్రాహ్మణ జన్మనెత్తినన్
జ్ఞాన హీనమైనట్టి నీచ జన్మనెత్తినన్
కలుగదు నాకు ఇసుమంత చింత
నీవు తల్లివైతే చాలు అదే నాకు ఉత్తమ జన్మ!

సిరిసంపదలు, మేడలు, మిద్దెలు, సుఖమనే మాటలు
తలువన్, కోరను గాక కోరన్ 
నరసంచారమే లేక శిధిలమైనట్టి పూరి పాకైనన్
చాలు ఈ పుడమి మీద
అందు నిశ నాలుగు ఝాముల మిణుగురులున్నన్
చాలు వెలుగు కొఱకు
ఈ భరత భూమిపై ఉండుటే భాగ్యమమ్మా!
అదియే నాకు సౌఖ్యమమ్మా!

అడుగంటి, ధవళవర్ణంబు వీడి
మాడినట్టి అన్నమైనన్ చాలు
సుడిగాలికి రేగినట్టి దుమ్ము
నిదురించు వేళ నాకు దుప్పటి కాగా
కాలమునందు వచ్చెడి ఎండ వానలకు
చలించను గాక చలించను 
తుదకు ఈ విధమున ప్రాణములే పోయినన్
విచారముండదు నాకు వినవె తల్లీ!

నా మదినందు కొలువున్న శ్రీహరిని కొలిచి
 వరములు కోరను గాక కోరన్
ఐహిక సుఖాల వాంఛల జోలికి వెళ్ళన్
ఆత్మస్తుతి, పరనిందలన్ చేయన్
విద్వాంసులు నను కీర్తించాలని కోరన్

ఈ వసుధ ఉన్నంతవరకు నేను 
ఎన్ని జన్మలెత్తినను
భరత భూమినందు పుట్టుటే
కోటి వరాలు నాకు!
జై భరత భూమి!
   
 

26 comments:

ఎందుకో ? ఏమో ! said...

High light
ఐహిక సుఖాల వాంఛల జోలికి వెళ్ళన్
ఆత్మస్తుతి, పరనిందలన్ చేయన్
Top most high light
బ్రహ్మజ్ఞానము కలుగునట్టి బ్రాహ్మణ జన్మనెత్తినన్
జ్ఞాన హీనమైనట్టి నీచ జన్మనెత్తినన్
కలుగదు నాకు ఇసుమంత చింత
నీవు తల్లివైతే చాలు అదే నాకు ఉత్తమ జన్మ!

wow!

Anonymous said...

Rasagna garu,
Motham grandhikam lo rasaru ga..[:P]
konchem konchem ardam ayyindi lendi

thelugu loki anuvadiste, baguntundi kadaaa

సుభ/subha said...

నీ పాద పద్మముల చెంత
నా జీవిత కుసుమాన్ని
నీకు సమర్పించెద తల్లీ
నను బ్రోవుము
నా ఈ జన్మము నీవిచ్చినదే నని
కలనైనను మరువను తల్లీ
నను బ్రోవుము
ఈ భరత ఖండంబునన్
నేనొక సమిధనవుదును తల్లీ
నను బ్రోవుము
రసగుల్లా మీ కవిత చదివి నాక్కూడా ఇలా కృతజ్ఞత చెప్పుకోవాలనిపించింది మన భరత మాతకి.. ఎందుకో అలా వచ్చేసింది. ఎంత చక్కగా వ్రాసారో. చాలా బాగా వ్రాసారు..

ఎందుకో ? ఏమో ! said...

పల్కినది సుభ యట, పల్కిన్చినది రసజ్ఞ యట
ఇవి చూచువారి జన్మ ధన్యం కాక ఏమౌను మరి?
Nice
అంత చక్కని relationship ఎప్పుడు అలా అందరి మధ్యన ఉంటె "ఎందుకో ? ఏమో!" అనుకోకుండా ....
దేశం 'సుభ' ప్రదంగా 'రసజ్ఞ' భరితంగా ఉంటుంది

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా బాగుంది.చక్కగా వ్రాసి " స్వర్గాదపి గరీయసి" ని గుర్తుచేశారు.. చెవిటి వాని చెవిలో..శంఖం ఊదిన చందానా..దేశ భక్తి పొంగి ప్రవహించే తరుణం రావాలంటే.. మన జాతికి..పరుల వలన ఆపద కల్గినప్పుడు మాత్రమే ఐక్యతా సూత్రం గుర్తుకు వస్తుంది తప్ప నిత్యం ప్రాతఃస్మరామి..భారత జననీ..అని ఎవరు పూజించే వారు ఎవరు..? కవులు కూడా.. ప్రాంతాల విద్వేషాలకి బలి అవుతుంటే.. మనం రాష్ట్ర అవతరణ దినం గుర్తుకు తెచ్చుకోవడానికి బాధ పడుతూ.. భారత జననీ..అంటూ ..ప్రణమిల్లుతున్నాం మనం భారతీయులం గనుక అన్నట్టు.

రసజ్ఞ said...

@ ఎందుకో ఏమో? గారూ
మీకు అంతగా నచ్చినందుకు ధన్యవాదాలు! మీ రెండో వ్యాఖ్య అద్భుతంగా ఉంది చక్కగా వ్రాసేసారే! నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది!

@ అజ్ఞాత గారూ
ఏదో అలా ప్రయత్నించానండీ! అర్ధమయ్యిందన్నారు కనుక ఫరవాలేదు! తెలుగులో ఉన్నదానిని ఇంకా తెలుగులోకేం అనువదించను చెప్పండి!

ఎందుకో ? ఏమో ! said...

నాదేమి లేదమ్మా !

భారత దేశం లో పుట్టిన పుణ్య వశాత్తు

ee blog భారతావనిలో ఇద్దరు సహోదరిమణులు దొరికారు వారు ఒకరిని చూసి మరొకరు inspire అవుతుంటే
సహోదరుడిగా నా అహం చూపించు కున్నాను అంతే....

సావాసా దోషం comment అలా వచ్చేసింది (సరదాకి..)

రసజ్ఞ said...

@ సుభా
అబ్బో! చూసారా మీకు కూడా భరత భూమిని తలుచుకోగానే అలా తన్నుకొచ్చింది కవిత! అదే మన పుణ్య భూమి గొప్పదనం! చాలా బాగుంది మీరు వ్రాసినది! మీ కవితని చూసి ఎందుకో ఏమో? గారికి ఇంకొక కవిత తన్నుకొచ్చింది! చూసారా ఈ chain reaction బాగుంది కదూ! ధన్యవాదాలు!

@ వనజ వనమాలీ గారూ,
మీ స్పందనకి, మీకు నచ్చినందుకు కృతజ్ఞతలు! చక్కగా చెప్పారు ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే బాధాకరంగానే ఉంది! ఏదేమయినా ఈ భారతభూమి మీద మనం ఉండటమే ఎన్నో జన్మల సుకృతం! దానిని ఆనందించకుండా, ఆస్వాదించకుండా నాశనం చేస్తున్నారు!

రసజ్ఞ said...

@ ఎందుకో ఏమో? గారూ
హహహ సహవాస దోషమా? సహవాస ఫలమా? నేను అదే వ్రాస్తున్నా సుభ గారి వ్యాఖ్యకి సమాధానం మిమ్మల్ని చూసి ఎందుకో ఏమో గారు కూడా వ్రాసేసారు అని ఇంతలో ఇదిగో మీరు రానే వచ్చారు! అంటే నేనేదో మీలో భావుకత పొంగిపోర్లిన్దనుకున్నాను! అహం కోసం వ్రాశారా? (lol)

ఎందుకో ? ఏమో ! said...

సహవాస దోషమైన నేమి?
సాంగత్య ఫలమైన నేమి?
సదర భావం పోగిపోర్లు తున్నది
అది చాలు ఈ నాటికది చాలు
ఈ పూట కాదే పది వేలు...
నాకు మిక్కిలి సంతోషం గా ఉన్నది ....!!

జ్యోతిర్మయి said...

ప్రతిసారి ఓ కొత్త అనుభూతి మీ బ్లాగుకు వస్తే. దేని గురించి వ్రాసినా ఎంత చక్కగా వ్రాస్తారు రసజ్ఞా. మీ దేశభక్తికి ముచ్చటేస్తోంది.

భాస్కర రామిరెడ్డి said...

చాలా బాగుందండి. ఐనా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కాబట్టి ఈరోజుకు "ఆంధ్రప్రదేశ్" ని ప్రతిక్షేపించి చదువుకుంటాను :))

Kalyan said...

@రసజ్ఞ గారు మాటల్లో చెప్పలేకున్నా అది ఎంత మధురానుబూతో ... మీకు సలాం ..
అ చిత్రము కూడా స్వేచ స్వాతంత్ర్యం తో ఉన్న పడతి రూపం అద్బుతం.. భావిష్యతుకై( వారి బిడ్డల కోసం ) ఎదురుచూస్తూ.. పూల పరిమళాల ( అల్లుకున్న వాత్సల్యం ) నడుమ ... అ లేత తీగను ( సున్నితమైన ప్రేమ ) ఆధారం చేసుకొని ... గడిచిన జ్ఞ్యాపకాలను నేమురవేసుకుంటూ నవ్వుతూ ఉనట్టు వుంది..

మీది చదివిన తరువాత ఎందుకో నాకు ఇది రాయాలనిపించింది దేశం కోసం ఇంతగా ఎందరో మహానుభావులు ( సైనికులు కావచ్చు , సామాన్యులు కావచ్చు , నిసహ్హాయులు కావచ్చు ) తపిస్త్హున్నారు వారి సేవలను అవసరాలను గుర్తించమంటూ తల్లికి ఓ చిన్న విన్నపాన్ని ఇద్దాము అని తోచింది . తల్లికి తెలియనివి ఉండవు అయినా నాదొక విన్నపము ఓ బిడ్డగా.

కనవే తల్లి నీ బిడ్డల ఆత్రమున్
వినవే తల్లి వారి భక్తి ప్రబతులన్
ఋతువులెన్నో చూసినావు
ప్రేమ ఋతువులన్గనవోయమ్మ

బిన్దువులైన మభ్లు కురియ కురియ
ఎన్నడైనా ఇలా పులకరించినావా
వారి నిస్వర్ధపు జల్లులలో తడసి నీవు పునీతమౌతున్నావు కదా
వెలుగు నీడలు చలి గాలులు నీపై వాలుతున్నా
ఇంతటి లేత స్పర్శను
ఎన్నడైనా స్మురించినావా
వారి చిట్టి పాదాలు తన్నులకు నీవు పరవసిస్తున్నావు కదా

ఏ తల్లి కన్న బిడ్డలో ఈ తల్లికి తపిస్తున్నారే
తెలుసుకో వారికి జాతి వైరము లేదు
తెలుసుకో వారికి మత బేధము లేదు
తెలుసుకో వారికి నీ నేలె ఒక స్వర్గ సీమ
తెలుసుకో వారికీ నీవే ఒక వేదము
ఎన్ని ఆగడాలు చేసినా
చేరదీయవమ్మ చేర్చుకొని హత్తుకోవమ్మ
ఎన్ని జన్మలు గడిచిన
నీ గర్భమున కాస్త స్థలమునీయమ్మ...

రాజ్యలక్ష్మి.N said...

"భువినుండు నట్టి గోక్షీరధారలన్, మధుర ఫలంబులన్ కోరన్
దివినుండు అమరులు సేవించునట్టి అతి మధుర సుధాధారలన్ కోరన్
నా మనంబు కోరునది ఏమని ఆలోచించగా ......
తెలిసెన్ దాగున్న నీ గొప్పలన్నియున్
భూలోక స్వర్గమే ఈ పుణ్యభూమి"


చాలా బాగుంది రసజ్ఞ గారు మీ కవిత..
సామాన్యంగా అందరికీ దేశభక్తి గుర్తొచ్చేది కొన్ని సందర్భాల్లోనే..
మీ కవిత వలన ఇప్పుడు మన భారతమాతని గుర్తుచేసుకున్నాం అందరం..

సుభ/subha said...

అవును రసగుల్లా.. మీరన్నట్టు నిజంగానే chain reaction. పల్కినది సుభ యట, పల్కిన్చినది రసజ్ఞ యట.. బాగున్నాయ్ మాష్టారి పలుకులు. కల్యాణ్ మాష్టారు గారు కూడా చక్కగా వ్రాసేసారు. మొత్తానికి చక్కటి బంగారు గొలుసే తయారయ్యింది మన భరత మాతకి.

రసజ్ఞ said...

@ జ్యోతిర్మయి గారూ
చాలా చాలా థాంక్స్ అండి!

@ భాస్కర రామి రెడ్డి గారూ
ఎలా అయినా చదువుకోండి భావాన్ని ఆస్వాదించితే చాలు! ధన్యవాదాలు మీకు నచ్చినందుకు!

రసజ్ఞ said...

@ ఎందుకో ఏమో? గారూ
బాగుంది!

@ కళ్యాణ్ గారూ
మీ మధురానుభూతికి కారణమయినందుకు చాలా సంతోషంగా ఉంది! చూశారా మీ కలం నుండి కూడా ఇంకొక కవిత జాలువారింది! అద్భుతం! ఎంత చక్కగా, ముచ్చటగా ఉందో నిజంగానే కన్న తల్లితో బిడ్డ మాట్లాడినట్టు! ఏ తల్లి కన్న బిడ్డలో ఈ తల్లికి తపిస్తున్నారే ఇది మాత్రం హత్తుకుంది. నాది కూడా మాటల్లో చెప్పలేని అనుభూతి మీ కవిత చదివాక! ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు కళ్యాణ్ గారూ!

రసజ్ఞ said...

@ రాజి గారూ
ధన్యవాదాలు!సామాన్యంగా అందరికీ దేశభక్తి గుర్తొచ్చేది కొన్ని సందర్భాల్లోనే.. అని మీరన్నది నిజమే కాని కన్నతల్లిని,మాతృభాషని, జన్మ భూమిని ఎన్నటికీ మరువలేము కదండీ!

@ సుభా
నిజమే కదూ!అందరూ చక్కగా వ్రాసేశారు! ఇప్పుడు నా బ్లాగు నిజంగానే నవరసభరితంగా, చూడ ముచ్చటగా, కన్నుల పండుగగా ఉంది! అందరికీ ధన్యవాదాలు!

Kalyan said...

@రసజ్ఞ santhosham :) aha chaala chakkaga vundhi motham choosthunte

Anonymous said...

నేను చాలా లేటు. చాలా బాగుంది.

రసజ్ఞ said...

కదా కళ్యాణ్ గారూ!

@శర్మ గారూ
ఆలస్యంగా వచ్చినా చదివి అభిప్రాయాన్ని తెలియచేసారు అది చాలు నాకు! ధన్యవాదాలు!

కొత్త పాళీ said...

చాలా బావుంది అనడం అల్పోక్తి అవుతుంది. చాలా చాలా బావుంది .. కానీ .. మీరేమనుకోనంటే ఒక్క మాట - అన్ని చోట్ల ఆ నకారపు పొల్లులు (దీన్నే దృతం అంటారు వ్యాకరణంలో) నప్పలేదని నా భావన.

రసజ్ఞ said...

@ కొత్తపాళీ గారూ
ధన్యవాదాలు మీకు నచ్చినందుకు! ఇందులో అనుకోవడానికి ఏముందండీ? మీ అభిప్రాయాలని ఎప్పుడయినా సూటిగా చెప్పవచ్చు. మీ సలహా మేరకు కొన్ని చోట్ల వాటిని తొలగించాను!

Unknown said...

మిత్రమా......
నీ అక్షరముల పూ బాకులు దింపి నా హృదయము చిధ్రము చేసినావు...
మనసు ఊరకుండనంది,
అందుకో ఇవే నీ ప్రియమిత్రుని అభినందనలు....

రసజ్ఞ said...

@ మోహన్
అందుకున్నానులే! చాలా రోజులయింది కదూ! ఆగు నీకు మెయిల్ చేస్తాను వివరంగా!

Anonymous said...

What a stuff of un-ambiguity and preserveness of precious
familiarity concerning unpredicted emotions.

Also visit my homepage dating sites [bestdatingsitesnow.com]