Thursday, November 17, 2011

పాట ప్రయత్నం


సాకీ:
అమ్మంటే అనురాగపు పెన్నిధి
అమ్మంటే మమకారపు సన్నిధి

పల్లవి:
యుగయుగాలుగా జగమునేలేది అమ్మ
తరతరాలుగా తరగని ప్రేమ గని అమ్మ
అమ్మ దీవిస్తే లోకాన ఎదురే లేదుగా

చరణం ౧:
దైవానికి మారుగా భూ వెలసిన దేవత
పుణ్యానికి ఫలితంగా జన్మనిచ్చిన దాత
త్యాగానికి మారుగా తన రక్తాన్నే పంచును
సహనానికి రూపంగా మన తప్పుల్ని కాచును
తప్పటడుగు వేశావంటూ మనల్ని తప్పు పట్టదు
అమ్మ ఒడి స్వర్గము అమ్మ పాలు అమృతము
అమ్మ పలుకు వేదము అమ్మ పాట ప్రణవ నాదము
లాలించి పాలించేది అమ్మ ప్రేమ ఒకటే!!

చరణం ౨:
దేవుళ్ళకు జన్మనిచ్చి దేవతగా మారెను
పాపులను పరి మార్చేటి కాళికా దేవి
వెన్నెలకు మారుగా అమ్మ ప్రేమ చల్లన
అమ్మ మనసు నిజంగా మల్లె కన్నా తెల్లన
తప్పులు సరి చేసి రెప్పవలె మనులను కాచును
అమ్మలోనే సృష్టంతా కదులును అమ్మతోనే సృష్టంతా మొదలవును
  ఆవు పాలు స్వచ్ఛము అమ్మ ప్రేమ సత్యము
లాలించి పాలించేది అమ్మ ప్రేమ ఒకటే!
 

16 comments:

Anonymous said...

Rasagna garu,

Amma gurinchi bagaa chepparu,,,,

But entha cheppina... inka chaaala untundi cheppataniki ......

"లాలించి పాలించేది అమ్మ ప్రేమ ఒకటే!!"

idi Satyam..... i like it andi

Amma prema Swatchmaina, nijamaina prema... inkedi raledu daniki poti
poti padithe navvula palu thappa ledu inkokati

Eppatikaina amma prema nu gurthunchukunna vare nijamaina manushulu

eno ila vachesindi..... na modati kavitha andi..
meeku mata ichina prakaram .. idigo ippudu rasesa anukokunda..
konchem vetakaarangane undi anukondi ;)

but konchem adjust avvali mari :P

Anonymous said...

రసజ్ఞ గారు మీకోసమే వెతుకుతున్నా ..మీ మెయిల్ ఐడి ఇవ్వగలరా !
ఇక్కడ ఇవ్వడం కుదరకపోతే బ్లాగర్లలో ఎవరిదగ్గర దొరుకుతుందో చెప్పండి .

జ్యోతిర్మయి said...

అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే..మంచి ప్రయత్నం రసజ్ఞా.
"అమ్మ పలుకు వేదము అమ్మ పాట ప్రణవ నాదము
లాలించి పాలించేది అమ్మ ప్రేమ ఒకటే!!" నాకిది బాగా నచ్చింది.

ఆ.సౌమ్య said...

అమ్మ పాలు స్వచ్ఛము అమ్మ ప్రేమ నిత్య సత్యము

చాలా బావుంది!

రాజ్యలక్ష్మి.N said...

"యుగయుగాలుగా జగమునేలేది అమ్మ
తరతరాలుగా తరగని ప్రేమ గని అమ్మ
అమ్మ దీవిస్తే లోకాన ఎదురే లేదుగా"

అమ్మ గురించి మీ పాట ప్రయత్నం
చాలా బాగుంది రసజ్ఞ గారు..

రసజ్ఞ said...

@ అజ్ఞాత గారూ
ధన్యవాదాలు మీ మొదటి కవితతో(?????) కూడిన వ్యాఖ్యకి!

@ లలిత గారూ
నా కోసం వెతుకుతున్నారా? మ్మ్ మంచి ఇరకాటంలో పడేసారండీ! మీ మెయిల్ ఐడి ఇవ్వండి నేనే మీకు పంపిస్తాను! మీ వ్యాఖ్యని తరువాత తీసేస్తానులెండి! లేదా రసజ్ఞ™ !!!!!!! అని ఆర్కుట్లో వెతకండి కనిపిస్తాను! ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ జ్యోతిర్మయి గారూ, @ రాజి గారూ
నా ప్రయత్నం నచ్చినందుకు ధన్యవాదాలు!

@ ఆ. సౌమ్య గారూ
మీకు నచ్చినందుకు సంతోషం! నెనర్లు!

తెలుగు పాటలు said...

రసజ్ఞ గారు పాట బాగుంది, దన్యవాదములు రసజ్ఞ గారు..... కనులు తెరిసిన మొదటిసారి చూసే రూపం అమ్మ,పెదవి పలికే తోలి పదము అమ్మ,బాదకలిగిన పలికే పదం అమ్మ,సంతోషం వచ్చిన పలికే పదం అమ్మ.. అమ్మ ఇంత తియనైన పదము ఇంకోటి లేదు...

సుభ/subha said...

రసగుల్లా..పాట చాలా చాలా బాగుంది. ప్రయత్నంలా లేదు ఇది.
అమ్మ పాలే కాదు మురిపాలు,మమతలు అన్నీ స్వఛ్ఛమే. ఆ ప్రేమలో కల్మషమే ఎరుగం.కనిపించని ఆ దైవం కన్నా కనిపించే ఈ దైవం నిత్య సత్యము.లాలించి పాలించేది అమ్మ ప్రేమ ఒక్కటే..చక్కని భావం.

రసజ్ఞ said...

@ తెలుగు పాటలు గారూ
మంచి పాటలతో పాటు మాటల కవితలు కూడా బాగున్నాయి! అమ్మ గురించి చక్కని వ్యాఖ్యానం చేశారు!

@ సుభా
కదా! అమ్మ అనే పదమే స్వచ్ఛతకి మారు పేరు కదా! కాలమెంత మారినా ఎన్ని విషయాలలో మార్పులు వచ్చినా ప్రపంచమంతా అమ్మ ప్రేమ మాత్రం అలానే ఉంది కదూ! అది అయినా మారకుండా ఎప్పటికీ ఇలానే ఉంటే బాగుంటుంది! ధన్యవాదాలు మీ స్పందనకి!

Anonymous said...

Rasagna garu,

welcome andi [:)]

inthaki na kavitha ela undoo cheppane ledu...

Kalyan said...

@రసజ్ఞ

అమ్మ లేని జగత్తులో ఆరంభమే ఉండదు
ప్రేమకు మారు పేరు పెన్నిధి తన అసలు పేరు
బిడ్డలుంటేనే తను అమ్మ కాదు నిస్వార్ధపు ప్రేమ చూపే ప్రతి మనసు అమ్మనే
ఆదరణ చూపించే ప్రతి ఒడి అమ్మ ఒడినే....

అమ్మ కు రూపం లేదు కాని అమ్మ ప్రేమకు మీరు అక్షర రూపం ఇచ్చారు . ఎంతో బాగుంది . మిమల్ని మాకు అందించిన మీ అమ్మ గారికి నా కృతజ్ఞ్యతలు మరియు నా ధన్యవాదాలు. తన ఆశీర్వచనాలు అందరికి ఉండాలని కోరుకుంటున్నాను.

రసజ్ఞ said...

@ అజ్ఞాత గారూ
:):)

@ dp-scorpion king గారూ
వెళ్ళాలనిపిస్తే వెళ్ళి వచ్చేయడమే! ఇంకెందుకాలస్యం! పదండి ముందు పదండి అమ్మ వద్దకు!

@ కళ్యాణ్ గారూ
మళ్ళీ you made my day అండి! వ్యాఖ్యలతో మాయాజాలం చేయటంలో మీరు దిట్ట. అమ్మకి అందించాను మీ ధన్యవాదాలనీ, కృతజ్ఞతలని. మీరు కోరుకున్న ఆశీర్వాదాలు మీకు ఇచ్చింది!

Kalyan said...

@రసజ్ఞ gaaru a amma ane padhame natho mayaajaalam cheyinchindhi anthe

chaala chalaa santhosham ammagaari asirvachanaalaku :)

మధురవాణి said...

అమ్మో.. మీరు కేవలం పద్యాలే బాగా రాస్తారనుకున్నాను.. పాట కూడా సూపర్ గా రాసారండీ.. చాలా బాగుంది! :)

రసజ్ఞ said...

@ మధురవాణి గారూ
నెనర్లు! రెండూ నా సరదా ప్రయత్నాలే! నచ్చినందుకు ఆనందంగా ఉంది!