Saturday, August 20, 2011

వద్దు ప్లీజ్...


నువ్వు నీలం రంగు చీరతో ఎదురయితే వయసుని సైతం పక్కన పెట్టి నిన్నందుకోవాలనిపిస్తుంది
నువ్వు దోబూచులాడుతున్న కొద్దీ నీ ఉఛ్ఛ్వాస నిశ్వాసల తాకిడికి మరింత దగ్గరవ్వాలనిపిస్తుంది
నా అడుగులు నీ నుండి దూరంగా వెళ్ళినా కానీ నీ వద్దకే వచ్చి నిన్ను కవ్వించాలనిపిస్తుంది
నిండు పున్నమి నాడు నీ కౌగిలిలో మైమరచి నా ఒంటి తాపాన్ని తీర్చుకోవాలనిపిస్తుంది

నీ మేని సంపదని కొంచెం మమ్మల్ని కొల్లగొట్టనీ
నీ చెంగు చాటున మా కళాత్మకతకి పదును పెట్టనీ
ఉవ్వెత్తున ఎగసిపడుతూ అందాలని దాచిన నీ చీరతో మమ్మల్ని ముంచకు
నీ ఒడిలో ఎన్నో ఆటలాడి సంతోషించే మాతో నువ్వు ఆటలాడకు

ఓ సముద్రమా!
మా ఆనందానికి నీ అనుభూతుల దుప్పటిని ఆప్యాయంగా కప్పు
కానీ దానినే మా మృత్యు కంబళిని చేయవద్దు
సునామీ పేరుతో మా జీవితాలలో విచారాన్ని నింపకు ప్లీజ్ 


15 comments:

nanda said...

wahwaa............wahwaaa................

రసజ్ఞ said...

@nanda gaaru
thanq........thanq.......

Anonymous said...

ఎంతో బాగుంది మీ వర్ణన. నువ్వు దోబూచులాడుతున్న కొద్దీ నీ ఉఛ్ఛ్వాస నిశ్వాసల తాకిడికి మరింత దగ్గరవ్వాలనిపిస్తుంది ఈ లైన్ బాగా నచ్చింది. మృత్యు కంబళి పద ప్రయోగం బాగుంది. బాగా రాసారు.

రసజ్ఞ said...

@అజ్ఞాత గారు
ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni said...

baagundhi..rasajnaa..

రసజ్ఞ said...

నెనర్లు వనజ వనమాలి గారు

Anonymous said...

Bagundi Rasagna garu,

meeru rendu sangathalanu ikkada chepparu..
okati manaku em kavali samudram nundi ani... inkokati emi vaddu ani...
Nijanga Samudrame ee post choosi unte.... Siggutho thala vanchukunedi emo kadaaa...

Ala jarigithe bagunnu... Nene Samudram aithe ani kotha post nene rasevadini :) atleast try chese vadini....

keep going
wish u all the best :)

రసజ్ఞ said...

అజ్ఞాత గారు
ధన్యవాదములు. అయితే ఇంకెందుకాలస్యం మొదలు పెట్టండి మరి రాయడం!!!

నందు said...

wowha kya bhath hai.....

రసజ్ఞ said...

bahuth shukriyaa nanduji

జ్యోతిర్మయి said...

చాలా బావుంది రసజ్ఞ గారూ...

రసజ్ఞ said...

చాలా థాంక్స్ జ్యోతిర్మయి గారు

Kalyan said...

ప్రకృతి పట్ల మానవుని ఉనికి పట్ల మీ సానుబూతి దానికి మీరు చేసే ప్రయత్నం ఎంతో ప్రసంసానీయం ... మీ పద జాలం కన్నా మీరు రాసిన కారణమే ఎప్పటికి గోప్ప.. నాకు తెలిసినంత వరకు @univers law of attraction @ అంటారు .. అంటే మనము ఏది కోరుకుంటామో బాగా అది జేరుగుతుంది.. మీ ఆలోచనల వల్ల కచితంగా అ సముద్రుడు కొంచమైన కరునించవచు .
జాలర్ల ప్రాణాలను కాపాడడానికి మీరు ఓ గోప్ప నావ కావలసిన అవసరం లేదు..
ఓ దుర్బేధ్యమైన తీరపు అడ్డు గోడలు కావాల్సిన అవసరం లేదు...
మంచి కోరే మనుసు వుంటే చాలు...
అది మీకు ఉంది కాబటి ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేయాలని మనవి...

all the best

రసజ్ఞ said...

@kalyan gaaru
మీ ఈ స్పందన నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ధన్యవాదాలండీ!

Kalyan said...

alage rasagnya gaaru na kruthgnyathalu