Monday, June 06, 2011

వన్నె చిన్నెల కాశ్మీరం

ఎంత రమణీయత! దృశ్య కావ్యమంటే ఇదేనేమో!! హత్తెరి! ఏమిటే  చిలకమ్మా ఆ కిలకిలలు? హొయ్ హొయ్ ఎందుకే ఆ కేరింతలు? కాశ్మీరు చిలకమ్మవనా? చాలింక ఆపు నీ లడాయి. నీకన్నా అందమయినదేలే ఈ కాశ్మీరం. నీవు కూడా అందులో ఒకదానివేలే అది మరువకు. ఈ కాశ్మీరు అందాలని వర్ణించడం అంటే ఆ ప్రవరుడి పాండిత్యాన్ని శంకించడమేగా!
సౌర శక్తి విద్యుత్ దీపాలు కలిగిన మొట్టమొదటి గ్రామం లడక్ మన కాశ్మీరం లోనిదే! ఇది తెలుసా? తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా? నిక్కమయిన మంచి నీలమొక్కటి చాలు అన్నారు మన వేమన గారు. అటువంటి నీలాలు దొరుకు నేల మన ఈ కాశ్మీరం. అంతకుమించి తరగని నల్ల బంగారం అవేనే బొగ్గు గనులు, కరగని వెండి సింగారం అబ్బ అవేనే మంచు కొండలు ఇవి కూడా అందమయిన మన కాశ్మీరం లోనివే. అమర్నాథ్, కిస్టఫర్, వైష్ణవి మాత మొదలయిన పుణ్యక్షేత్రాలు; అనంతనాగ్, కార్గిల్, పహల్గాం, శ్రీనగర్ వంటి విహార స్థలాల మేలు కలయికలే మన ఈ కాశ్మీరం. స్విట్జెర్లాండ్ అఫ్ ఇండియా అని పేరున్న మన కాశ్మీరానికి ఇవన్నీ కీర్తిపతాకాలేలే!
ఓ చిలకమ్మా? నిన్నేనే వింటున్నావా? నా మనసంత లోతయిన కాశ్మీర్ లోయలు, నా సొగసంత ఎత్తయిన గాడ్విన్- ఆస్టిన్ శిఖరాలు, నా ఒంపు సొంపులకి ధీటుగా పొడవయిన పూలార్ సరస్సు ఉన్నాయిగా! అయినా ఎన్ని అందాలు ఉంటే ఎమిలే? ఎన్ని అందాలు ఉన్నవో అన్ని అరాచకాలూ జరుగుతున్నాయి. ఉన్మత్త  ఛాందస వాదుల ఆగడాలకు వేదికై అల్లాడుతున్నది నా కాశ్మీరం.
అసలు కుంకుమ పువ్వుకి ఆ ఎఱ్ఱదనం ఎలా వచ్చిందంటే ఎందఱో అమరవీరుల నెత్తుటితో తడిసిన నేల పంటే కుంకుమ పువ్వు. చెంతనే ఉన్న భూలోక కైలాసమయిన హిమశైల వాసుని త్రినేత్ర జ్వాలలే ముష్కర మూకలను మసి చేస్తున్నాయా? ఢమ  ఢమ ఢమరు ధ్వనులే ఫెళ ఫెళ వినిస్ఫోట ప్రకంపనాలుగా నిత్యం రణరంగంగా ఆరని రావణ కాష్టమై రగులుతోంది నా కాశ్మీరం. పరమశివుడు శాంతించి భోళా శంకరుడై కాశ్మీరుకి పూర్వ వైభవాన్ని ప్రసాదించాలని ప్రార్ధించుదామా? ఎల్లలెరుగని వసుధైక  కుటుంబంగా ఏనాడు మారునో కదా? ఆనాడే ఆమని రాకుండానే ఈ అవని పులకించును కదా? అంత వరకు ముష్కరుల కబంధ హస్తాలలో చిక్కుకున్న ఈ కాశ్మీరం బంగారు పంజరంలో చిలుకే. నీకులా కాదులే!!!!!!! 


26 comments:

hariprasadcc said...

చాల బాగుంది....

Anonymous said...

మొదలయిందనమాట రసజ్ఞ ప్రస్థానం...చేయించావు మరో మారు కాశ్మీర దర్శనం..కాశ్మీర్లో మొదలైన నీ సాహితీ ప్రయాణం కన్యాకుమారి వరకు నిర్విరామంగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...

welcome to the blog world my dear.......

Anand said...

Good work . Keep it up !

Nivas said...

Excelent .. Soo sensitive post Good Work ..

murali said...

entha andamga varninchav kashmir good very good nee bhavarthaniki joharulu

nanda said...

ఈ కాశ్మీరు అందాలని వర్ణించడం అంటే ఆ ప్రవరుడి పాండిత్యాన్ని శంకించడమేగా! good line

రసజ్ఞ said...

andariki peru peruna dhanyavaadamulu

Sandilya said...

కాశ్మీర్ అందాలని అంత్యంత అందంగా వర్ణించిన మీకు అభినందనల కంటే కూడా ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే.. నాకు అత్యంత ఇష్టమైన ప్రాంతం అది. అటువంటి అందమైన ప్రదేశాన్ని అభివర్ణించటానికి పూనుకున్న మీకు ధన్యవాదాలు. ఆ ప్రదేశాన్ని, దాని అందాలనీ ఆడపిల్ల హొయలతో పోల్చి చూపిన మీదే భావ చతురత అంటే. భూతల స్వర్గంలో కొంచెంసేపు నన్నలా విహరింపజేశారు. ఇంత అందమైన ప్రాంతం గురించి ఇంత తక్కువగా రాసి కొంచెం నిరాశ పరిచారు.. ఇంకొంచెం వర్ణించి ఉంటే బావుండేది. ఇలాంటి మరెన్నో అద్భుత వర్ణనలని మీ నుండి వినాలని నా ఆశ.

రసజ్ఞ said...

@శాండిల్య గారు
నా ఈ టపాతో మీకు కాసేపయినా మానసికోల్లాసం కలిగిందంటే అదే పది వేలు అంతకన్నా ఇంకేమి కావాలి చెప్పండి నాకు. ఇహపోతే కొంచెమే రాసానంటారా? మొదటి టపా కదా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుందని అలా రాసాను. మీలాగా చదివి ఆస్వాదించే వాళ్ళు ఉంటే తప్పక మరికొన్ని రాస్తాను.

Anonymous said...

ప్రవరుని వర్ణన నేనయితే చదవలేదు కానీ మీ వర్ణన అదిరిందండీ రసజ్ఞ గారు

రసజ్ఞ said...

aayana varnana mundu naadentha? anyways thanks for ur comment

Anonymous said...

గత కొన్ని రోజులుగా మీ బ్లాగు చదువుతున్నాను మొదటి టపానే ఇంత బాగుంది అదీ కూడా చాలా ప్రొబ్లెంస్ ఉన్న ఇస్స్యూ ను బాగా చెప్పారు. శివునితో కలపడం బాగుంది.

రసజ్ఞ said...

@ అజ్ఞాత గారూ
గత కొద్ది రోజులనించి చదువుతున్నా, ఈ మధ్య వ్రాసినవే కాక పాతవన్నీ తీసి ముఖ్యంగా నా మొదటి టపా చదివినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు! ఎన్ని ఉన్నా మొదటి దాని విలువ దానిదే కదండీ! అందుకే నాకు ఇది ఎప్పటికీ అపురూపమే!

శిశిర said...

ఒక్క మాటలో మీ బ్లాగు గురించి చెప్పాలంటే అద్భుతం. చాలా చక్కగా రాస్తున్నారు. మీకు తెలిసిన అద్భుతమైన సమాచారాన్ని అందంగా, చదివింజేసేలా రాస్తున్నారు. మీ టపాలన్నీ చూశాను. దేనికదే వైవిధ్యంగా మంచి విషయంతో రాస్తున్నారు. మీ knowledge అబ్బురపరుస్తూంది. bookmark చేసుకోవలసిన బ్లాగ్ మీది. రాస్తూ ఉండండి. అభినందనలు. మీ బ్లాగు చదవడం వల్ల ఈరోజు చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ధన్యవాదాలు.

రసజ్ఞ said...

@ శిశిర గారూ
You made my day అండి. ఏమి చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. ఒక రసాస్వాదన కలుగుతోంది మీ ఈ స్పందనతో. ఎంతో ఓపికగా అన్ని టపాలనీ చదివి నా బ్లాగు గురించి మీరు చెప్పిన ఈ వాక్యాలు నన్ను ఆనంద పారవశ్యంలో ముంచెత్తాయి. మీ అందరి ఆదరణ, అభిమానాలతో తప్పక రాస్తూ ఉంటాను. కృతజ్ఞతలు!

sarma said...

g...o...o..d

రసజ్ఞ said...

@ sarma గారూ
మీకు నచ్చి నన్ను మెచ్చినందుకు సంతసం!

రాజేష్ మారం... said...

Excellent, specially Last Paragraph .. .

రసజ్ఞ said...

@ రాజేష్ గారూ
ఈ టపా నా మొదటి అడుగు కనుక నాకు ఇది అపురూపం. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

Lasya Ramakrishna said...

Awesome...

రసజ్ఞ said...

@ లాస్య గారూ
వావ్! ఇంత ఓపికగా కూర్చుని నా మొదటి టపా చదివారా? ఎంత మంచోరండీ మీరు! ధన్యవాదాలు!

రహ్మానుద్దీన్ షేక్ said...

:)

రసజ్ఞ said...

@ రెహ్మాను గారూ
నా మొదటి టపాతో సహా అన్నీ ఓపికగా చదివారా? చాలా థాంక్స్ అండీ!

చిన్ని ఆశ said...

రసజ్ఞ గారూ,
మొట్ట మొదటి టపా మీ చాలా టపాలు చదివాక ఇప్పుడే చదివాం.
స్వేచ్ఛగ ఎగిరే చిలుకతో మీ మాటలూ...అందమైన కాశ్మీరం లో నీవూ ఒకదానివే అంటూ...చివరికి నీకు లా కాదులే అంటూ పజరంలో బంధీ అంటూ పోల్చటం ఎంతో బాగుంది.
అందాలనెపుడూ పంజరంలో పెట్టకూదదు, స్వేచ్ఛగా ఎగిరిన నాడే అవి అందం.
చెప్పిన వైనం చాలా బాగుంది.

రసజ్ఞ said...

@ చిన్ని ఆశ గారూ
ఎప్పుడయితే ఏమి? అసలంటూ మొదటి టపా చదివారు. అదే చాలు! మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ!

Anonymous said...

Remarkable! Its truly amazing piece of writing, I have got much clear idea on the
topic of from this paragraph.

Also visit my web site dating sites (http://bestdatingsitesnow.com/)