Tuesday, August 21, 2012

"మా" రుచులుశీర్షిక చూసి నేను కూడా ఏదో తయారీ విధానం చెప్పబోతున్నాను అని అనుకుంటున్నారా? అలా తొందరపడి నన్ను అపార్థం చేసేసుకుంటే ఎలా? చిన్నప్పుడు ఎవరన్నా నీకు వంట చేయటం వచ్చా అమ్మా? అని అడిగితే ఓహ్! నాకు ఉప్పు, మంచినీళ్ళు, పెరుగు వండటం వచ్చు అని చెప్పేదానిని. చూశారా? చిన్నతనంలోనే ఎన్ని వండటం నేర్చేసుకున్నానో!!! నాకు తెలిసిన వంటలన్నీ చెప్పేస్తే మీరంతా కూడా నేర్చేసుకుని మీకు వచ్చినవి మర్చిపోతారు కనుక ప్రస్తుతానికి నేను చెప్పబోయే వంటకాలు ఎలా ఉంటాయి? ఎక్కడ దొరుకుతాయో మాత్రం పరిచయం చేస్తాను.

కోనసీమ అనగానే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే వంటలు కొన్ని ఉంటాయి. అవే ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, కాకినాడ కోటయ్య కాజా, మామిడి తాండ్ర, గంగరాజు పాలకోవా, పనసపొట్టు కూర, పులసలు (పుస్తెలు అమ్ముకుని అయినా పులస తినమంటారు), ఇలా ఎన్నో ఎన్నెన్నో. అయితే ఇవి కొనసీమకే పరిమితం కాకుండా ప్రస్తుతం ఇంచుమించు అన్నీ చోట్లా దొరుకుతున్నాయని నా అభిప్రాయం. వాటిని రుచి చూడాలనుకున్న వాళ్ళు ఎక్కడయినా కొనుక్కోవచ్చును. ఈ టపాలో అంతగా గుర్తింపు లేకపోయినా కోనసీమలో మాత్రం ప్రాముఖ్యతని సంపాదించుకున్న వాటిల్లో నాకు తెలిసిన కొన్ని
వంటలని మీ ముందుకి తెస్తాను.

పూర్వ కాలం నుండీ కోనసీమ అనగానే గుర్తు వచ్చేవి తరవాణీ కుండలు. నిజమే! వేసవి వచ్చిందంటే చాలు ప్రతీ ఇంట్లోనూ ఈ కుండలు ఉండి తీరాల్సిందే. వార్చిన గంజి నీళ్ళు కుండలో పోసి, మొదటి సారి మాత్రం మజ్జిగ వేసి, నీళ్ళు, ఉప్పు వేసి దబ్బాకు వేసి అన్నం అందులో ఉంచి తరువాతి రోజు దానిని తినేవారు. ఎండ గాడ్పు కొట్టకుండా ఈ తరవాణీ నీళ్ళు తాగితే చాలా చల్లగా ఉంటుంది. 

కాయావకాయ
వేసవి అనగానే అందరూ ఎదురు చూసేది కొత్త ఊరగాయల కోసం. అయితే మా కోనసీమలో మాత్రం ఎక్కువగా ఉండేది కాయావకాయ. కాయలతో కాక పళ్ళతో పెడతారా ఏమిటి? అనుకోకండి. కాయావకాయ అంటే కాయని పూర్తిగా ముక్కలు చేయకుండా ఉన్న పళాన్న పెట్టడం. మాంచి మామిడికాయలు తీసుకుని గుత్తి వంకాయ కూరకి కోసినట్టు మామిడికాయని నాలుగు పక్కల కోసి, జీడి తీసేసి, ఆవపిండి బాగా కుక్కి పెడతారు.  దానిని బాగా ఊరపెట్టి మూడవ రోజున నూనేసి నిలువ ఉంచుతారు. ఆ రోజుల్లో మామిడికాయ మొత్తం ఒక్కరే తినేవారు. తరువాత ఒక కాయ తీస్తే పెద్ద కుటుంబాల్లో అదే అందరికీ సరిపోతోంది. ఎన్నాళ్ళయినా ఆవ ఘాటు తగ్గకుండా భలే రుచిగా ఉంటుందిలెండి.

తరవాణి కుండ అన్నము - ఈ కాయావకాయ మంచి జోడీ.


కొట్టెక్క బుట్టలు
ఇడ్డెన్లు లేదా ఇడ్లీలు అందరూ చేసుకున్నా కోనసీమలో వాటిని ప్రత్యేకంగా చేస్తారు. మామూలు ఇడ్లీలలాగా కాకుండా కొట్టెక్క బుట్టలు లేదా వాసినపోలె రూపాలలో చేస్తారు. ఈ కొట్టెక్క బుట్టలనే పొట్టెక్కలు అని కూడా అంటూ ఉంటారు. పనస ఆకులని బుట్టలుగా చేసి అందులో ఇడ్లీ పిండి వేసి ఆకుతో సహా ఆవిరిలో ఉడికిస్తారు. వీటిని అంబాజీపేట ప్రాంతంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. పోలాల అమావాస్యకి ఇవి ప్రత్యేకంగా చేసి ముత్తయిదువులకి వాయినాలు ఇస్తారు. వేడి వేడిగా తింటే రుచి భలే ఉంటుంది. 
వాసినపోలె
తరువాత వాసినపోలె. వాటిని కొంతమంది ఆవిరి కుడుములు అని కూడా అంటారు. ఇడ్లీ పిండిని గిన్నెకి కట్టిన గుడ్డ లేదా బట్ట మీద వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. బట్ట వాసన పిండికంటి ఒకరకమయిన వాసనతో ఉంటుంది కనుక దాని పేరు వాసినపోలె అనమాట! ఇది ఎక్కువగా విశ్వేశ్వరాయపురం ప్రాంతంలో చేస్తారు.    

బలుసాకు
బలుసు లేని తద్దినం, బులుసు లేని యజ్ఞం ఉండదని నానుడి. మిగతా ప్రాంతాల వాళ్ళు అక్కడక్కడా చేసుకున్నా కోనసీమలో ప్రతీ ఇంట్లో తద్దినానికి ఉండి తీరేది బలుసాకు. పితృ దేవతలకి అదంటే చాలా ఇష్టమట. అందుకనే తద్దినాలకి బలుసాకు పచ్చడి తప్పనిసరిగా ఉండి తీరాలి, ఒకవేళ పచ్చడి చేయలేకపోతే కనీసం చారులో అన్నా శాస్త్రానికి ఒకాకు వేస్తారు.
బొంగు(లో) చికెన్
బొంగు(లో) చికెన్ అనేది రంపచోడవరం ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడ వెదురు బొంగులలో దీనిని చేస్తారు కనుక ఆ పేరు వచ్చింది.  ఉప్పు, పసుపు, కారం, మసాలాలు బాగా దట్టించిన పచ్చి కోడి మాంసాన్ని పచ్చటి వెదురు బొంగులలో పెట్టి ఆకులతో అంచులు కట్టేసి నిప్పుల మీద కాలుస్తారు. బొంగులలో ఉడికిన కోడి మాంసం రుచిని ఎంత వర్ణించినా తక్కువే అని జనాల అభిప్రాయం. 

గరాజు
ఇహ, నాకెంతో ఇష్టమయిన దాని గురించి చెప్పబోతున్నాను. అదే గరాజు. రాజులకే రాజు రారాజయితే రారాజులకే రాజు మా గరాజు. సాధారణంగా తీపి తింటే నాలిక మీద ఆ తీపి అలానే ఉంటుంది అంటారు కానీ గరాజులకి మాత్రం వెఱ్ఱి తీపి ఉండదు. వాటిని తయారు చేసే ఏకైక చోటు నగరం. ఆ చుట్టుప్రక్కల ఊళ్ళల్లో కూడా దొరకవు. కేవలం నగరంలో మాత్రమే దొరికే అసలు సిసలయిన కోనసీమ స్వీటు గరాజు. వీటిని చూస్తే నాకు వెంటనే గుర్తుకొచ్చేది పిచ్చుక గూడు.  గూడు కట్టడానికి పిచ్చుకలు గడ్డిని తెచ్చి ఒక గోడలాగా ఎలా తయారు చేస్తాయో వీటిని కూడా అలానే బియ్యపు పిండితో చేసే ఖారప్పూస లాంటి దానితో చేస్తారు. అందుకే నాలాంటి వాళ్ళు చాలా మంది వీటిని పిచ్చుక గూళ్ళు అని ముద్దుగా పిలుచుకుంటారు. కావాలంటే మీరే చూసి చెప్పండి అలా ఉన్నాయో లేదో!! (నాకు గరాజు చిత్రం కావాలి అనగానే నగరం వెళ్ళి వీటిని కొని మరీ ఈ చిత్రాన్ని పంపిన నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు)
 
మొక్క గుడ్లు
మా కోనసీమంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికేవి మొక్క గుడ్లు. మొక్కలకి గుడ్లు ఉండటం ఏమిటి అనుకుంటున్నారా??? అదే అండీ కొబ్బరి పువ్వునే (కొబ్బరి కాయ లోపల వచ్చే పువ్వు) అలా పిలుచుకుంటారు. మా రాజమండ్రీలో కూడా దేవీ చౌక్ శివాలయం దగ్గర అమ్ముతూ ఉంటారు. పల్లెటూర్లల్లో అయితే చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్ని కావాలంటే అన్ని. మా చుట్టాల ఇళ్ళకి వెళితే తోటల్లోంచి బస్తాలతో తెచ్చి ఉంచుతారు మా అందరికోసం. వాటిని తింటే మాత్రం ఒక పువ్వుతో ఎవ్వరూ ఆపలేరు. 
 
నేనెంతో అభిమానించే ఒక బ్లాగరు ఈ మధ్యన నాకు "గోదావరి కథలు" అనే పుస్తకం పంపారు. అవి చదువుతున్న కొద్దీ ఇంటి మీద, ఊరి మీద బెంగ ఎక్కువయిపోతోంది. అదే సమయములో దొంతరలోంచి ఎన్నో జ్ఞాపకాలు బయటకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉండే ఎవరికయినా గుర్తొచ్చేది అమ్మ చేతి వంట. అంతే ఇహ వెంటనే కోనసీమ రుచులన్నిటికీ నా
అక్షరాల తాలింపు వేసేసి ఇలా మీ ముందుకి కొన్ని తెచ్చాను. ప్రస్తుతానికి వీటిల్లో ఏవి ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తినాలనుంది చెప్పండి? మీరు రుచి చూసే పూచీ నాది. 

48 comments:

Anonymous said...

kobbaripuvvu tappitae eadee tinalaedanDee!!

sunita.

జ్యోతిర్మయి said...

అమ్మాయ్ రసజ్ఞా ఊరెప్పుడెళుతున్నావో చెప్పు. నేను కూడా వచ్చేస్తా. నువ్వు చెప్పిన వాటిలో కాజాలు, పూతరేకులు తప్ప ఏవీ తినలేదు. నీ తాలింపు ఘుమ ఘుమలకు నోరూరి పోతోంది.

Sravya Vattikuti said...

హ హ నాకు తినాలని ఉంది . ఇప్పుడు చూస్తా ఎలా రుచి చూపిస్తారో :P
btw ఏదో మీరు రాసిన వాటిలో ఒకటి కూడా తెలియడం లేదు , ఆ పోట్టిక్కలు మాత్రం బ్లాగుల్లో నే చూసాను . నేనొక బాడ్ ఈటర్ ని కాబట్టి పెద్ద గా ఏమి తినాలి అనిపించటం లేదు కాదు , ఆ గుత్తి మామిడి కాయ పచ్చడి మాత్రం interesting గా ఉంది :-))

NageswaraRao V Gokavarapu said...

అందరూ నూడిల్స్, పిజ్జా అంటూ పరిగెడుతుంటే మీరు మన రుచులని గుర్తు చేయటమేకాక అందరికీ పరిచయం చేసినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు .. ఎప్పటిలాగే మీ టపా టపాసులు పేలుస్తుందని ఆశిస్తూ.. మీ తదుపరి టపా కోసం ఎదురుచుస్తూ.. ఇప్పటికి సెలవు..

oddula ravisekhar said...

పూతరేకులు,కాజాలు తిన్నాము కానీ మిగతా వాటి గురించి ఎప్పుడూ వినలేదండి.మీరు చెప్పిన తరువాత ఓ సారి అటు ఏలూరు వచ్చి అటునుండి అటు ఆ వంటలున్న ప్రాంత మంతా తిరగాలనుంది. ఏలూరు లో B.ED చదివేటప్పుడు రాజమండ్రి,కాకినాడ వెళ్ళాము కానీ ఇంత ఇదిగా ఎవ్వరు చెప్పలేదండి.

Padmarpita said...

ఒక్కదాని పేరు కూడా వినలేదు మీ మీదొట్టు...:-)
తినడం గురించి ఏం ఆలోచించను విడిచిపెట్టు...:-)

Anonymous said...

"బలుసు లేని తద్దినం, బులుసు లేని యజ్ఞం" balusaaku goorchi cheppaaru mari bulusu matter EnTi

SNKR said...

కృష్ణవేణి, నీలవేణిలా "తరవాణి"!... పేరు బాగుంది. దాదాపు ఇలాంటిదే మా వైపు గేదెలు చాలా ఇష్టంగా తాగే వారుణవాహిని ఇదే అనుకుంటా. ఇందులో గానుగ చెక్క కూడా వేస్తారు చలువ చేస్తుంది, పాలు ఎక్కువగా ఇస్తాయి. దీన్ని మనుషులు కూడా సేవిస్తారని తెలిసి అదోలా సంతోషమేసింది.:( జీవసామ్యవాదం అంటే ఇదేనేమో, లోకో భిన్న రుచిః

"బొంగులో చికెన్" - రవితేజ సినిమాలో డైలాగులా వుంది. చికెన్‌కు ఇలా శవదహనకాండ కార్యక్రమం జరిపి, బలుసాకు తద్దినం పెడితే చికెన్ పిత్రుదేవతలు సంతోషిస్తారన్నమాట! బాగుంది. :D

శ్రీ said...

రసజ్ఞ గారూ!
మన కోన సీమ వంటలు బాగా పరిచయం చేసారు..
కొట్టెక్క బుట్టలు..శ్రీకాకుళం జిల్లాలో కూడా చేస్తారు...పనస ఆకుల వాసనతో భలే ఉంటాయండి...:-)
మామిడి కాయతో సహా పెట్టే ఊరగాయని మెంతి కాయ అంటారనుకుంటా...
కాకపొతే..వెదురు బొంగులో చేసిన చికెన్ వినాయకుడు సినిమాలో చూపించినట్లున్నాడు...:-)
(తినను కాబట్టి రుచి తెలియదు)
మరో మంచి పోస్ట్ మీ నుంచి...
@శ్రీ

Meraj Fathima said...

ఒక్కటి కూడా తినలేదు.
నేను పద్మగారి బాటలోనే ఉన్నాను.

the tree said...

మీ జ్ఞాపకాలతో నోరురించడమేనా, ఎప్పుడన్నా పిలిచి వడ్డించే కార్యక్రమమం ఏమన్నావుందా, వుంటే తొందరగా చెప్పండి, మీ ఊరికి వచ్చేస్తాం, ఎదురు చూస్తున్న నోళ్లతో మీ..........

Anonymous said...

గరాజు తప్ప మిగతా పేర్లన్నీ విన్నాను.

గతేడాది అంబాజిపేట వెళ్ళినప్పుడు పొట్టక్కలు తిన్నాను.
ఆత్రేయపురం నుండి పూతరేకులు తెచ్చుకున్నాను.

Krishna said...

పూతరేకులు కాజాలు తిన్న...తరవాణి పేరు విన్న..మిగతావి తెలిదు...తినే అవకాశం ఒస్తే తినాలి...కృష్ణ

Anonymous said...

నా పిచ్చికగూళ్ళ బాకీ ఎప్పుడు తీరుస్తారు?

రసజ్ఞ said...

@ సునీత గారూ
అయ్యో! మరి మిగతావెప్పుడు రుచి చూస్తారు???? త్వరగా చూసి చెప్పండి మరి :) ధన్యవాదాలండీ!

@ జ్యోతిర్మయి గారూ
మీరొస్తాను అంటే అంతకన్నానా? కలిసే వెళ్దాం. అన్నిటి రసాల (రుచుల) సారాన్ని జిహ్వకు పరిచయం చేద్దురు. ధన్యవాదాలండీ!

@ శ్రావ్య గారూ
తినాలనుంది అన్నారు కానీ ఏమీ తినాలనుందో చెప్పనే లేదు :( సర్లెండి కాయావకాయ interesting గా ఉంది అన్నారుగా మీరు ఇండియా వెళ్ళాక చెప్పండి పార్సెల్ చేస్తా/చేయిస్తా. మిగతావి మా వైపు వచ్చినప్పుడు రుచి చూద్దురు :) ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ నాగేశ్వరరావు గారూ
కొన్నేళ్ళకి వీటి పేర్లు కూడా తెలియకుండా పోతాయేమో!!! మీ అభినందనలకు, మీరు పంపిన చిత్రానికి కృతజ్ఞతలు! :):) మీరు మరీనండీ అప్పుడే ఇంకో టపానా? నాకు తీరిక ఉన్నప్పుడు వ్రాస్తానండీ! ధన్యవాదాలు!

@ రవి శేఖర్ గారూ
మరింకే వచ్చేయండి నేనే గైడ్ చేస్తాను. ఎన్నో ప్రదేశాలు చూస్తూ, వీటి రుచిని ఆస్వాదిస్తూ కోనసీమలో హాయిగా గడిపేయచ్చు. ధన్యవాదాలండీ!

@ పద్మార్పిత గారూ
"తినడం గురించి ఏం ఆలోచించను విడిచిపెట్టు" అన్నారు, ఆలోచించకుండా తింటాను అనా లేక ఆలోచించే ఉద్దేశ్యమే లేదు నన్నొదిలెయ్ అనా ;) (ఏదో సరదాకేలెండి) ధన్యవాదాలు!

@ అజ్ఞాత గారూ
బులుసు వారు యజ్ఞ యాగాది మంత్రాలలో దిట్టలు. వారు మంత్రాలు చదవాలి కనుక వారు లేని యజ్ఞం ఉండదు అని అంటారు. ధన్యవాదాలు!

రసజ్ఞ said...

@ SNKR గారూ
:):):) తరవాణీ అంటే చద్దన్నం కాకపోతే నేను చెప్పిన నీళ్ళల్లో వేస్తారు. అన్నమూ తింటారు, నీళ్ళూ త్రాగుతారు. "వారుణవాహిని" ఎప్పుడూ వినలేదండీ! నిజంగానే ఉందా? లేక ఊరికనే అంటున్నారా? హహహ! వామ్మో! మీకు భలే ఐడియాలు వస్తాయండీ:):) ధన్యవాదాలు!

@ శ్రీ గారూ
ఓహ్! అవునా శ్రీకాకుళంలో చేస్తారని తెలియదు. అంబాజీపేటలో బండ్ల మీద కూడా అమ్ముతారు.
కాదండీ! మెంతికాయ వేరు, అది మెంతిపిండితో చేస్తారు. దానికి మామిడికాయ ముక్కలనే (బద్దలనే) వాడతారు. ఈ కాయావకాయలో ఆవపిండి కూరతారు. గాలికి తగిలితే ఆవ ఘాటు పోతుందని అలా కాయలో బంధించి ఉంచుతారు రుచి కోసం. వినాయకుడు సినిమా కాదండీ విలేజ్ లో వినాయకుడు :) ఇంకా చాలా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇవనమాట! మిగతావి మరెప్పుడైనా :) ధన్యవాదాలండీ!

@ ఫాతిమా గారూ
:) మరెప్పుడు రుచి చూస్తారు???? త్వరగా చూసెయ్యండి :) ధన్యవాదాలు!

@ భాస్కర్ గారూ
వడ్డిస్తాం వడ్డిస్తాం ఎందుకు వడ్డించం? కాకపోతే మీరా (ఎవరా అమ్మాయి అనకండి :) మీరు+ఆ అని ఇక్కడ అర్థం) "సుమ శతకం" పూర్తి చేసేలోపు సుమగారిని తీసుకుని వస్తేనే రానిచ్చేది, వడ్డించేదీను ;)
హహహ! తప్పకుండాను ఆల్వేస్ వెల్కం.

రసజ్ఞ said...

@ బోనగిరి గారూ
వావ్! అయితే మీరు గరాజోక్కటే మిస్ అయ్యారనమాట :) ఇవి కేవలం నగరంలో మాత్రమే దొరుకుతాయండీ ఇంకెక్కడా దొరకవు. ధన్యవాదాలండీ!

@ కృష్ణ గారూ
తరవాణీ కుండలు ఇప్పుడు తగ్గిపోయాయిలెండి. వేసవి కాలంలో మాత్రమే ఉండేవి. మిగతావి తప్పకుండా ప్రయత్నించండి రుచి చూసాక వదలరు. ధన్యవాదాలు!

@ అజ్ఞాత గారూ
తప్పకుండా ఈ సారి మనం కలిసినప్పుడు :) ధన్యవాదాలు!

thanooj said...

ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, కాకినాడ కోటయ్య కాజా, మామిడి తాండ్ర, గంగరాజు పాలకోవా, పనసపొట్టు కూర, పులసలు (పుస్తెలు అమ్ముకుని అయినా పులస తినమంటారు)

slash(noru ooripothundi ani cheppadaaniki symbolic sound,nene kanipetta:d)vamsi maatram nijamga noru oorinchela rasesaaru godaavari kathallo.ihapothe:d nenu cheyyi eththanu meeru thinalani unda adigaru kada eppudo meeray cheppandi.meeru kooda jnaapakalau avi antunnaru chinnaga godavari meeda oka katha rayakoodadhoo...

Anonymous said...

ఈసారి రాజమండ్రీ వచ్చినప్పుడు, ఈ రుచులన్నీ( ఆ చేపలేవో తప్పించి !) చూపించాలి...

శశి కళ said...

అబ్బ...అబ్బ..నోరు ఊరిపోతున్నాయి రసజ్ఞ.అన్నీ
తినాలని అనిపిస్తుంది.ఇప్పుడే వచ్చేస్తా రాజమండ్రికి ..
శివ రంజని కూడా అక్కడే ఉందనుకుంటాను.
అయినా ఇలా నోరు ఊరించటం పాపం.ఎన్ని కొత్త
వంటకాలు భలే వ్రాసావు.మనసు పరిగెత్తుతూ
ఉంది వాటి వెనుక...

madhavarao.pabbaraju said...

శ్రీ రసజ్న గారికి,నమస్కారములు.

``ఎంతమందికి తినాలనుంది చెప్పండి? మీరు రుచి చూసే పూచీ నాది. '' -- దయచేసి మీ యింటి చిరునామా చెబుతారా?

మీ స్నేహశీలి,
మాధవరావు.

రసజ్ఞ said...

@ తనూజ్ గారూ
:):) ఇది మీరు కనిపెట్టిన పదమా? నేనింకా మణిపూరీ నేర్చుకుని ఏదో ప్రయోగించారనుకున్నా ;) తప్పకుండాను, ఏమి కావాలో చెప్పలేదు అంటే అన్నీ కావాలనే అనుకుంటూ.. మీరెప్పుడంటే అప్పుడే ఎప్పుడయినా వచ్చేయండి. అన్నిటినీ రుచి చూసేద్దురు:) నేను కథలు వ్రాయటమా? ఇంకా అంత ఎదగలేదండీ! మీ అభిమానానికి ధన్యవాదాలు!

@ హరేఫల గారూ
తప్పకుండాను, మొన్న వెళ్ళినప్పుడు మీరేమీ రుచి చూడలేదా? అయ్యో! నేనుంటే తప్పకుండా చూపించేదానిని. మీరేం తింటారో నాకు తెలుసుగా అవే రుచి చూపిస్తాను. ధన్యవాదాలండీ!

@ శశికళ గారూ
వచ్చేస్తా వచ్చేస్తా అనటం కాదు, వచ్చేసి అప్పుడు నేనోచ్చేసా అని చెప్పాలి :) శివ రంజని గారు ఎవరండీ? నాకు గుర్తు రావటం లేదు :( నోరు ఊరించటం పాపమే అయినా ఇవన్నీ నేను వ్రాయకపోతే అవన్నీ మీరు ఎక్కడ రుచి చూడకుండా ఉండిపోతారో అని ఈ పాపానికి ఒడి గట్టక తప్పలేదు :) ధన్యవాదాలండీ!

@ మాధవరావు గారూ
నమస్కారమండీ! హహహ భలేవారే! పెద్దవారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతానా? రాజమండ్రీలో మీరెక్కడున్నారో చెప్తే నేనే వచ్చి తీసుకెళతాను. ధన్యవాదాలండీ!

Prasad (ప్రసాద్ భళ్ళమూడి) said...

Panasaku Buttalu Srikakulam Vizianagaram, Visakhapatnam districts Vinayaka Chavithi rojuna chesi Devuniki kajji kayalu, undralla to kalipi naivedyam ga pedataru. ippadiki kooda ma chelli valla intlo chestalu. vizag lo ithe panasakulu oka roju mundu ammutaru kooda. i have last eaten 12 yeas back. we have done it when we were in Pune. akkada panasa aakulu ma society lo dorikevi. now not available in mumbai / hyderabad.

సిరిసిరిమువ్వ said...

మంచు రుచుల గురించి చెప్పారు.

కొట్టెక్క బుట్టలు...బ్లాగుల్లోకి వచ్చాకే ఆ పేరు విన్నాను.

ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, కాకినాడ కోటయ్య కాజా, మామిడి తాండ్ర, గంగరాజు పాలకోవా, పనసపొట్టు కూర..ఇవి రుచి చూసాను. ఎందుకో మరి పనస పొట్టు కూర నాకంత రుచించలేదు.

పులసలు..రుచి చూడలేదు కానీ గోదారోళ్ల నోటెమ్మట చాలా సార్లు వీటి గురించి విన్నా.:)

తరవాళీ కుండలు..కాయావకాయ..మా వైపు కూడా ఉంటాయి...రుచి అయితే చూడలేదు.

వాసినపోలె (ఆవిరి కుడుము).ఎండాకాలంలో దాదాపు ప్రతిరోజూ మధ్యాహ్నం పూట మా ఇంట్లో టిఫిన్ అదే ఉండేది. దీనికి సంబారు కారం+నెయ్యి మంచి కాంబినేషన్.

ఇక బలుసాకు పచ్చడి..బ్రతికుంటే బలుసాకు తినొచ్చు అన్న సామెత విన్నా కానీ దాన్ని ఎప్పుడూ చూడలేదు.

గరాజు..ఈ మాట మాత్రం ఇప్పుడే కొత్తగా మీ దగ్గర వింటున్నాను.

కొబ్బరి పువ్వు నాకూ ఇష్టమే..కొబ్బరి కాయ కొట్టినప్పుడల్లా అది ఉంటే బాగుండు అనుకుంటా.

వీటన్నిటిలో ఎప్పటికయినా రుచి చూడాలనుకుంటుంది మాత్రం..కొట్టెక్క బుట్టల్ని.

హనుమంత రావు said...

రసజ్ఞ గారు, గోదావరిజిల్లాల రుచులు బాగా చెప్పారు.. బుర్రగుంజు, తాటి పండు కూడా చెప్పేయండి.. అవి మనవే కదా.. మా అల్లుడిగారి స్వంతఊరు మామిడికుదురు.. నగరం ప్రక్కనే. గరాజు రుచి చూపాడు.. మా అమ్మాయి సూడిదలకు గరాజు, పూతరేకులు కూడా కలిపాము. పొట్టింక బుట్టలకి, ఎండు మిరపకాయలతో చేసిన కొబ్బరి పచ్చడి (కొంచెం పల్చగా) అండ్ నెయ్యి మంచి కాంబినేషన్.. కాయ ఆవకాయ... మీరు చెప్పినట్టు ఆవకాయే కాకుండా కాయ మెంతికాయ, కాయ తూర్పావకాయ మా అమ్మ పెట్టేది.. పులిహోరావకాయకూడా (అఫ్ కోర్స్ ముక్కలతో పెట్తారుకదా) చాలా మంచి ఊరుగాయలు. ముఖ్యంగా సమ్మర్ వెళ్ళాక వర్షం పడుతుంటే అరటాకులో వేడి వేడి అన్నంలో పులిహారావకాయ ప్లస్ పప్పునూనె, వెన్నతో నంజుకు తింటే... అలాగే తరవాణీ అన్నంలో ఎర్రావకాయ ప్లస్ పప్పునూనె. అస్సలు కాయావకయలు , తరవాణి అన్నాలు ఇప్పుడు చరిత్రపాఠాలు, మ్యూజియం వస్తువులు.. ఇలా కబుర్లు చెప్పుకు ఆనందించడమే మిగిలింది.. ఇంతకీ మీరు రాజమండ్రీలో ఉంటారా... అభ్యంతరం లేకపోతే ఫోన్ నెం తెలియజేయండి.. నా మెయిల్ vhrdinavahi@gmail.com

gks raja said...

అబ్బ! కోనసీమ రుచులు గురించి చెప్పి నోరూరించారు. ఇందులో అన్నీ తెలిసినవే. జన్మతః మాంసాహారినే అయినా, ఆ రెండు -- 'పులస చేప, బొంగులో చికెన్' నాకు నచ్చలేదు ఎందుకనో! అసలు తెలియనిది నగరం లో మాత్రమే దొరికే 'గరాజు'. ఈ సారి రుచి చూడాల్సిందే.'తరవాణి' కూడా నేను ఒక్కసారే రుచి చూశాను. ఎందుకో అదంటే నాకు సదభిప్రాయం లేదు. ఏమైనా రసజ్నా! ప్రతిసారి విభిన్న రుచులు చూపే మీరు ఈ సారి రుచుల్నే అభిరుచిగా ఎన్నుకోవడం, మా జిహ్వ చాపల్యానికి చాలా 'అగ్ని' పరీక్షే! అవును ఇప్పుడు ఒక్కో అయిటము అగ్గిపైకి ఎక్కించాల్సిందే.
ధన్యవాదాలు. 'నువ్వులు' ఎందుకు చేతితో అందుకో కూడదో ఒక వ్యాసం వ్రాస్తే బావుంటుందేమో-- మీ తీరికను బట్టే.
రాజా. gksraja.blogspot.com

raf raafsun said...

ఏమ్మా ! అయిపోయిందా నీ రుచుల ఇష్టా గోష్టి ??? చదువుకో అని పంపితే...నేనోచ్చేస్తా..నీనోచ్చేస్తా ...అని ఒకటే గోల పెడుతున్నవే ..!!! చదువు అయినాక గాని రాకు.....వచ్చావా....నీకు కొత్త రుచి చూపిస్తాను...

అన్నయ్య !!!!( జాగర్త)

రసజ్ఞ said...

@ ప్రసాద్ గారూ
విజయనగరం వైపు కూడా చేస్తారని విన్నాను. ఏదో ప్రత్యేక రోజు (భగిని హస్త భోజనం అప్పుడనుకుంటా) వీటితో పాటూ కొబ్బరి పరమాన్నం తప్పక తింటారుట కదా! అయితే ఇలా వీటి కోసం ఆకులు అమ్ముతారని తెలియదు. అంబాజీపేటలో రోజూ చేసి అమ్ముతారు. మరి అటువైపు కూడా ఇలా రోజూ చేస్తారో లేక మీరు చెప్పినట్టు కేవలం వినాయక చవితికే చేస్తారో తెలియదు. వేడి చల్లారిపోతే రుచి నచ్చదు నాకు :) ధన్యవాదాలండీ!

@ సిరిసిరిమువ్వ గారూ
ఇంతకీ మీదే ఊరు? చెప్పనే లేదు! కొట్టెక్క బుట్టలు ఈ సారి మా ఊరు రండి రుచి చూద్దురు! ఎంతో ఓపికగా అంతా చదవటమే కాక ఒక్కోదాని గురించీ, వాటి మీద మీ అభిప్రాయాలు చెప్పినందుకు ధన్యవాదాలు!

@ హనుమంత రావు గారూ
బుర్రగుంజు, తాటి పండు అన్ని చోట్లా దొరుకుతాయి కదండీ అందుకని ప్రస్తుతానికి ప్రక్కన పెట్టాను. మామిడి కుదురు నాకు బాగా తెలుసండీ! మీరు రుచులని బాగా ఆస్వాదించారని తెలుస్తోంది! చాలా సంతోషంగా ఉందండీ! మాది రాజమండ్రీనే అయినా ప్రస్తుతం అక్కడ ఉండటం లేదండీ! మీ స్పందనకి ధన్యవాదాలు!

@ రాజా గారూ
నగరం గరాజులు కోనసీమలో కూడా చాలా మందికి తెలియవండీ! మీరు రండి అప్పుడు రుచి చూపిస్తా! హహ భలే వ్రాశారండీ!
నువ్వుల గురించా? తప్పకుండా వీలు చూసుకుని వ్రాస్తానండీ! ధన్యవాదాలు!

@ అన్నయ్యా
నీకు కొత్త రుచి చూపిస్తాను...అన్నావు, అంటే నీ కొత్త (అభి)రుచి అయిన వదినని చూపిస్తావా? నువ్వు జాగర్త అంటే నాకు భయం వేస్తోంది! ఆగు భయం తగ్గాక వచ్చి కామెంటతా ;)

వెంకట రాజారావు . లక్కాకుల said...

నవ రసఙ్ఞ భరిత మవని నాంధ్రుల రుచుల్
అందున 'రసన'కు పసందు గూర్చు
' కోన సీమ 'రుచులు కూరి వడ్డించెను
మా 'రసఙ్ఞ' దెంత మంచి మనసు !
----- సుజన-సృజన

Anonymous said...

రసజ్ఞ గారూ
నోరూరిపోతోంది. మీ నుండీ ఇటువంటి మామూలు వంటల టపా ఏమిటా అనుకున్నాను, ఇందులో కూడా వినని వంటలే పెట్టారుగా త్వరగా పిలిచి వడ్డించండి మరి

hariprasadcc said...

Good one..

Ganesh said...

Mee rachana thone ma kadupu nimpe saru kadandi Rasagna garu :)

రసజ్ఞ said...

@ వెంకట రాజారావు గారూ
నా మంచి మనసును అర్థం చేసుకున్నారు, వడ్డించెను అంటే అన్ని రుచులనీ మీ రసన ఆస్వాదించిందనే భావిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

@ అజ్ఞాత గారూ
హహ! భలేవారే తప్పకుండాను కాకపోతే మీ పేరు చెప్పండి మరి :)

@ హరి
థాంక్యూ

@ గణేశ్ గారూ
అలా అని తిండి మానేయకండే :):) ధన్యవాదాలండీ!

virajaajulu said...

రసజ్ఞ గారు ఈ రోజే మీ బ్లాగు చూసాను మీ అభిమానిని
అయిపోయాను .ఏమి వంటలండి?నోరూరిపోతోంది .వాటిలో
కొబ్బరిపువ్వు ఒక్కటే తిన్నాను .కొన్ని పేర్లు విన్నాను కానీ
రుచి చూడలేదు .ఈ రోజు నాకు తెలియని వంటలు తెలుసుకున్నాను .థాంక్స్ అండి

సంతు (santu) said...

రసజ్ఞ గారు, నేను ఈ పోస్ట్ ఎందుకు చదివాన అని బాధపడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడే మీ కోనసీమ కి వొచ్చి అన్ని రుచులను అస్వాదిన్చాలనిపిస్తోంది....
చాలా బాగుంది మీ పోస్ట్, కాయవకాయ, కొట్టెక్క బుట్టలు, గరాజు... అన్నీ ఎప్పుడెప్పుడు అరగించాలా అని థింకింగ్..

రసజ్ఞ said...

@ విరజాజులు గారూ
తొలిచూపులోనే.... ;) చాలా థాంక్స్ అండీ! అయ్యో! మరెందుకాలస్యం మా ఊరొస్తే మిగతావి కూడా రుచి చూసేయచ్చు, మీ వంటల బ్లాగులో పెట్టేసుకోవచ్చు, ఏమంటారు? ధన్యవాదాలండీ!

@ సంతు గారూ
భలేవారే! ఎందుకు చదివానా అని బాధపడటం కన్నా ఎప్పుడు కోనసీమ వెళ్ళాలా అని ఆలోచించి ఉండుంటే ఈ పాటికి రుచి చూసేసి ఉండేవారు :) థింకింగ్ తో టైం వేస్ట్ చేయకుండా తినేస్తే సరి :) ధన్యవాదాలండీ!

రహ్మానుద్దీన్ షేక్ said...

రసజ్ఞ గారూ, నాకేమివ్వబోతున్నారు?

రసజ్ఞ said...

@ రహ్మాన్ గారూ
మీకేది తినాలనుందో చెప్పండి, తప్పకుండా ఇస్తాను. మీరేదీ చెప్పకపోతే అన్నీ ఇస్తాను మరి :) ధన్యవాదాలండీ!

Priya said...

ఏవిటండీ ఇది..? ఊసులు చెప్పినంత అలవోకగా కవితలు నేనూ రాస్తానని మీరంటే, పరిచయం చేసుకుందామని వచ్చాను. ఈ వేళ బ్రేక్ ఫాస్ట్ కూడా చేయలేదు. అలాంటి నాకు ఇలా నోరూరించే వర్ణనతో ఫోటోలతో సహా పోస్ట్ కనిపించేసరికి ఇంకా ఆకలి పెరిగిపోయింది :(. మీ వల్లే ఇదంతా.. :P

రసజ్ఞ said...

@ ప్రియ గారూ
హయ్యో రామ! ఆ మాటన్నది నేను కాదండీ, తనూజ్ గారు అన్నారు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నేను అలవోకగా కవితలు వ్రాయడమేమిటి?
హహ పోనిలెండి, కాస్తెక్కువ, కడుపునిండా తినచ్చు. లేదా వీటిల్లో ఏది కావాలంటే అది తీసుకోండి, రుచి కూడా చూసినట్టుంటుంది. ధన్యవాదాలండీ!

Priya said...

రసజ్ఞ గారూ నన్ను మన్నించేద్దురూ ప్లీజ్? ఆయన ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మీ బ్లాగ్ లింక్ కనబడింది "blogs i follow" అని అంత పెద్ద అక్షరాలతో రాసినా చూసుకోలేదు. మీ కామెంట్ చదివాక ఇప్పుడు చదివాను.
అన్నట్లు మీ ఆర్టికల్స్ కొన్ని చదివాను. భలే రాసారండీ :). చెప్పడం మర్చిపోయాను. మీ పోస్ట్లో ఉన్నవి ఎలాగు రుచి చూడలేనని రోజు తినేదే కాస్త ఎక్కువ తినేసాను :)

రాధిక(నాని ) said...

మీ కోనసీమ రుచులు గ్రేటండి.చాలా చాలా బాగున్నాయండి అన్నీను నూరూరిస్తూ...నాకు కాజ,పూతరేకు,కొబ్బరిపువ్వు తెలుసండి .మిగిలినవి తెలీదు.మీ బ్లాగ్ చాలా బాగుందండి.

రసజ్ఞ said...

@ ప్రియ గారూ
అయ్యో! భలేవారే! మన్నించడాల దాకా ఎందుకండీ? ఈ వంకనయినా నా బ్లాగు చూశారు కదా! సంతోషం! నా ఆర్టికల్స్ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!
:):) మంచిపని చేశారు , లేదా అహ నా పెళ్ళంట స్టైల్ ఉండనే ఉందిగా ;)

@ రాధిక (నాని) గారూ
నా బ్లాగు, మా రుచులూ నచ్చినందుకు ధన్యవాదాలండీ! మిగతావి కూడా వీలు చూసుకుని రుచి చూసేద్దురూ!!!

BHALLAM SRI KRISHNA VENKATESWARA ANIL RAJU said...

మీకింత నాలెడ్జ్ ఎక్కడినుంచి వచిన్దండి...మీకు వేలయితే నా గురువు స్థానం లో ఉండి దిశానిర్దేశం చేయండి ....

Anonymous said...

I used to be suggested this web site through my cousin. I'm now not sure whether or not this put up
is written by means of him as no one else recognize such unique approximately my problem.
You're incredible! Thank you!

Feel free to surf to my blog post; dating online (bestdatingsitesnow.com)

Anonymous said...

Heya i'm for the first time here. I came across this board and I find It really
useful & it helped me out much. I hope to give something back and help others like
you aided me.

my homepage ... dating online (bestdatingsitesnow.com)

Anonymous said...

It's great that you are getting thoughts from this piece of writing as well as from our discussion made here.


my web site CurtRThreat